Disease
-
లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!
దీర్ఘకాలికమైన, సంక్లిష్టమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఒకటి ఉంది దాని పేరే లూపస్. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,రక్త నాళాలు సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత సాధారణమైన రకాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్(SLE) అని పిలుస్తారు. చర్మంపై దద్దుర్లు, కండరాలు బలహీనత, కీళ్ల వాపు ఇలా శరీరంలోని ఏదో ఒక సమస్యకు గురి చేస్తుంది. అసలు లూపస్ లక్షణాలు ఏంటి? ఎవర్ని ఎక్కుగా బాధించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.ఎవరికి లూపస్ వచ్చే అవకాశం ఎక్కువ?ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో ఒకరు ల్యూపస్ వ్యాధితో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 3.2 మంది ల్యూపస్ బారిన పడ్డారని అంచనా. ఎవరికైనా లూపస్ రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఈ వ్యాధి ఉన్న 10 మంది పెద్దలలో 9 మంది మహిళలు ఉన్నారు. ఇది శ్వేతజాతి మహిళలకంటే ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్, ఆసియన్ , స్థానిక అమెరికన్ సంతతికి చెందిన మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చర్మసంబంధమైన లూపస్: చర్మంపై దద్దుర్లు లేదా పుండ్లు వస్తాయి. సాధారణంగా బాగా ఎండధాటికి గురైనపుడు వస్తుంది. అయితే కొన్ని మందులకు రియాక్షన్ వల్ల కూడా ఇది రావచ్చు. సంబంధిత ఔషధం ఆపివేసిన తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి.నియోనాటల్ లూపస్ : ఇది శిశువు తన తల్లి నుండి ఆటోఆంటిబాడీలను పొందినప్పుడు సంభవిస్తుంది (ఆటో యాంటిబాడీలు అనేవి రోగనిరోధక ప్రోటీన్లు, ఇవి పొరపాటున ఒక వ్యక్తి సొంత కణజాలాలను లేదా అవయవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తాయి). చర్మం, కాలేయం లూపస్ వ్యాధికి సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే నయమయ్యే అవకాశాలున్నాయి. ల్యూపస్ - లక్షణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకటి ల్యూపస్. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు ఇది దాడి చేస్తుంది.మన ముందే చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సందర్బంలో ఏ అవయవాన్నైనా ల్యూపస్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా చర్మం, జుట్టు, కీళ్లు, కండరాలు, ఎముకలు దీనివల్ల ప్రభావితమవుతాయి. అందుకే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవడం, కీళ్లలో వాపులు, ఎముకల నొప్పులు, కండరాల పటుత్వం తగ్గిపోతుంది. ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు. లూపస్ ఉన్నవారిలో దాదాపు 50–90శాతం మందిలో తీవ్రమైన అలసట ఉంటుంది. ముఖంమీద బటర్ ఫ్లై ఆకారంలో ర్యాషెస్, నోట్లో పుండ్లు రావచ్చు. జుట్టు ఊడిపోతుంది. ఛాతీలో చొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాచి. నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమైతే ఆటో ఇమ్యూన్ కణాలు మెదడు పొరలపై దాడిచేస్తాయి. దీంతో వాపు లేదా ఇన్ ఫ్లమేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ల్యూపస్ వ్యాధి సోకిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలొస్తాయి. అప్పటికే గర్భవతులుగా ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కిడ్నీలు ప్రభావితమైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.నిర్ధారణ ఎలా?క్లినికల్ పరీక్షలు, రక్త పరీక్షలతో సహా పూర్తి వైద్య చరిత్ర ,శారీరక పరీక్షను నిర్వహించాలి.. రోగ నిర్ధారణ చేయడానికి వైద్యుడు చర్మం మరియు మూత్రపిండాల బయాప్సీలు (యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే పరీక్ష ద్వారా లూపస్ వ్యాధిని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలు, ఏ అవయవానికి సోకింది అనేదానిపై ఆధారణపడి బయాప్సీ, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్దారిస్తారు. చికిత్స ఏంటి?నిజం చెప్పాలంటే ల్యూపస్ వ్యాధికి శాశ్వత చికిత్స అంటూ ఏమీ లేదు. ఉపశమన చికిత్స మాత్రమే. సోకిన అవయవం,లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స ఉంటుంది ఏయే అవయవాలపై వ్యాధి ప్రభావం ఉందనే దాన్ని బట్టి రుమటాలజిస్ట్ , నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండ వ్యాధి), హెమటాలజిస్ట్ (రక్త రుగ్మతలు), చర్మవ్యాధి నిపుణుడు (చర్మ వ్యాధులు), న్యూరాలజిస్ట్ (నాడీ వ్యవస్థ), కార్డియాలజిస్ట్ (గుండె, రక్తనాళ సమస్యలు) ఎండోక్రినాలజిస్ట్ (గ్రంధులు మరియు హార్మోన్లు)ను సంప్రదించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. దీంతో పాటు, సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం,సరియైన నిద్ర చాలా అసవరం. -
Cervical Cancer: అమ్మకడుపులో రాచపుండు
మనిషి పుట్టుకకు ప్రధాన అవయవమైన గర్భాశయమే పుండుగా మారుతోంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా లోలోపలే ఇబ్బంది పెడుతోంది. అనంతరం క్యాన్సర్‌గా మారి అమ్మనే కబలిస్తోంది. ప్రాథమిక దశలో దీనిని గుర్తిస్తే ప్రాణాలతో బయట పడవచ్చు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత గుర్తిస్తే మాత్రం ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధిపై అవగాహన లేక చాలా మంది మహిళలు తమలోపల క్యాన్సర్ ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జనవరి మాసాన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను వైద్యపరిభాషలో సెర్వికల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యుల వద్దకు ప్రతిరోజూ 120 నుంచి 150 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. కర్నూలులో ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 20 నుంచి 30 మందికి కీమోథెరపీ, 40 మందికి రేడియోథెరపీ చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో నిత్యం 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెర్వికల్ క్యాన్సర్) బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉంటుందని వైద్యుల అంచనా. పేదరోగులకు అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ)లో ఉచితంగా వైద్యం అందుతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధానంగా హ్యూ మన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. ఇదే గాక తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడ ం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు. ఈ క్యాన్సర్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా వస్తోంది. నివారణ చర్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 ఏళ్ల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70 శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్ లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు జనవరి మాసాన్ని సర్వికల్ క్యాన్సర్ అవగాహన మాసంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి. వ్యాధి లక్షణాలు ⇒ రుతుక్రమంలో సమస్యలు.. యోని నుంచి రక్తస్రావం ⇒ లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ⇒పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ⇒ యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ⇒ మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి వివాహమైన మహిళలు ఏటా గర్భాశయ ముఖద్వారంలో పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ మేరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీనికి తోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80 శాతం వరకు ఈ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. సాధారణంగా మహిళలకు హెచ్‌పీవీ వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. – డాక్టర్ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలుప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజీ విభాగానికి గైనిక్ సమస్యలతో వచ్చే ప్రతి వంద మంది మహిళల్లో ఇద్దరు, ముగ్గురికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంటోంది. ఓపీకి వచ్చే వారికి పాప్‌స్మియర్ పరీక్షను చేస్తున్నాం. ఇందులో అసాధారణంగా కనిపించే వారికి కాల్పోస్కోపి టెస్ట్ ద్వారా బయాప్సీ తీసి పంపిస్తున్నాం. అందులో క్యాన్సర్‌గా నిర్ధారణ అయితే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా లక్షణాలు ఉన్నా లేకపోయినా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి వారికి చికిత్స ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. – డాక్టర్ పి.స్నేహ, అసిస్టెంట్ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
జాకీర్ హుస్సేన్ ఉసురు తీసిన ప్రాణాంతక వ్యాధి, ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రఖ్యాత తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) తో అనే దీర్గకాలిక వ్యాధితో బాధపడుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాసతీసుకున్నారు.దీంతో అసలేంటి ఐపీఎఫ్? ఇది అంత ప్రమాదకరమా? చికిత్స లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులు లేదా అల్వియోలీ ( ఊపిరితిత్తులలోని చిన్న, సున్నితమైన గాలి సంచులు)గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ పొందడానికి అవి సహాయపడతాయి. వీటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధే ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్.అమెరికా నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NIH) ప్రకారం, ఇది తీవ్రమైన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది అవయవంలోని గాలి సంచులు లేదా అల్వియోలీ చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు, ఊపిరితిత్తుల కణజాలం మందంగా మారిపోతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఇవి మరింత ముదిరి ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లి, రక్తంలోకి, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. అల్వియోలీ గోడలు మందంగా మారి మచ్చలు రావడాన్నే ఫైబ్రోసిస్ అంటారు. అలాగే ఇడియోపతిక్ అంటే ఈ పరిస్థితికి కారణమేమిటో గుర్తించలేకపోవడం. ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం.కారణాలుధూమపానం అలవాటున్న వారికి, ఫ్యామిలీలో అంతకుముందు ఈ వ్యాధి వచ్చిన చరిత్ర ఉన్నా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . సాధారణంగా 60- 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధికనిపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయిలక్షణాలుఊపిరి ఆడకపోవడం: మొదట్లో అలసిపోయినపుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవు తుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఏపనీ చేయంకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.విపరీతమైన పొడిదగ్గుకీళ్ళు ,కండరాలలో నొప్పిఅలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం .కారణం లేకుండానే బరువు తగ్గడంనైల్ క్లబ్బింగ్ అంటే చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు వెడల్పుగా, స్పాంజిలాగా ఉబ్బినట్లుగా అవ్వడం రక్తంలో చాలా తక్కువ ఆక్సిజన్ వల్ల సైనోసిస్, నీలిరంగు చర్మం , నోటి చుట్టూ, చర్మంపైనా, కళ్ల చుట్టూ బూడిద రంగు లేదా తెల్లటిమచ్చలుఈ లక్షణాలు కొందరిలో చాలా త్వరగా వ్యాపిస్తాయి. మరికొందరిలో చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. దీర్ఘం కాలం పాటు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చికిత్స లేదుఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌కు ప్రస్తుతానికి ఖచ్చితమైన చికిత్స లేదు. అయితే కొన్ని మందులు, ఇతర చికిత్సలు ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడవచ్చు. ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే అని గమనించగలరు. వ్యాధి ఏదైనా, నిపుణుల పర్యవేక్షణలో, సంబంధిత వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చికిత్సతీసుకోవాల్సి ఉంటుంది. -
హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా
జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్చేశారు. అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. -
దడదడలాడించే వ్యాధి..! సరైన చికిత్స సైతం..
రోడ్డును తొలిచే దగ్గరో లేదా కొత్తగా ఇల్లు కట్టే చోట రాతిని బద్దలు చేయడానికి వాడే మెకానికల్ గడ్డపలుగు / గునపం లాంటివి వాడినప్పుడు అది దడదడలాడుతూ చేతులను వణికిస్తుంటుంది. ఆన్ చేసిన ట్రాక్టర్ స్టీరింగుపై చేతులు ఆన్చినా అదీ చేతుల్ని దడదడలాడిపోయేలా చేస్తుంది. ఇలాంటి పరికరాలు చాలాకాలం వాడుతూ ఉండే వృత్తుల్లో ఉన్నవాళ్లలో కొందరికి వచ్చే జబ్బు పేరే ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’. కేవలం అలాంటి గడ్డపలుగు మాత్రమే కాదు... పవర్ డ్రిల్స్, జాక్ హ్యామర్స్, పెద్ద పెద్ద చెట్లను నరికేసే చైన్ సాల వంటి వాటిని వాడేవారిలోనూ ఇది రావడం సహజం. ఈ జబ్బుకు ‘హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (హావ్స్) అనీ, డెడ్ ఫింగర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ‘రేనాడ్స్ డిసీజ్’ అనే రక్తనాళాలలనూ, నరాలను దెబ్బతీసే ఒక కండిషన్ తాలూకు తర్వాతి రూపం (సెకండరీ ఫార్మ్) అని కూడా భావిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల్లో ‘వైట్ ఫింగర్ డిసీజ్’కు తోడ్పడే జన్యువును సైతం ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’ ప్రధానంగా వేళ్లలోని రక్తనాళాలు, నరాలు, కండరాలూ, కీళ్లతో పాటు చేతులు, మణికట్టు వంటి వాటిపై తన దుష్ప్రభావం చూపుతుంది. మొదట్లో వేళ్ల చివర్లు తిమ్మిరిగా అనిపిస్తాయి. అటు తర్వాత అవి తెల్లగా పాలియినట్లుగా అవుతాయి. జబ్బు తీవ్రత బాగా పెరిగినప్పుడు వేళ్లు వేళ్లన్నీ తెల్లగా మారిపోతాయి. అందుకే ఈ జబ్బుకు ‘వైట్ ఫింగ్ డిసీజ్’ అని పేరు. అయితే... అలా తెల్లగా మారిన కొద్దిసేపటి తర్వాత రక్తం వేళ్ల చివరికి వేగంగా ప్రవహించడం వల్ల అవి ఎర్రగా కూడా మారవచ్చు. ఒకసారి వచ్చిందంటే... ఆ తర్వాత అత్యంత త్వరలోనే తాము చేసే పనిని మానేయాల్సిన (రిటైర్ అవ్వాల్సిన) పరిస్థితి ఉంటుంది. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడుతున్నప్పటికీ... దీనికి సరైన చికిత్స అంటూ నిర్దిష్టంగా ఏదీ లేదు. అందుకే తీవ్రంగా / విపరీతంగా కంపిస్తూ పనిచేసే ఉకపరణాలతో పనిచేసేవారు తమ పని గంటలను తగ్గించుకుంటూ రావడమే ఓ మంచి నివారణ చర్య. (చదవండి: యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..? వేటిలో ఉంటాయంటే..!) -
పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.లెప్టోస్పిరోసిస్ అంటే ..?లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది. లక్షణాలు..ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి. వ్యాధి తీవ్రత..దీన్ని యాంటీ బయాటిక్స్‌తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. నిర్థారించడం కష్టమైతే..ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.ఎందువల్ల అంటే..కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్‌లలో లూజ్కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసి, సీల్ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తొలిసారిగా..1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.(చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు
గుండె జబ్బు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారినీ చుట్టుముడుతోంది. ఇటీవలికాలంలో యువతలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఒక వైద్య అధ్యయనంలోని వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైనవన్నీ హృదయ ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుంటాయి. అయితే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.మద్యం, ధూమపానానికి దూరంగుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం అనేది ధమనుల పనితీరును దెబ్బతీసుస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును గణనీయంగా పెంచుతుంది.అలసటపై నిర్లక్ష్యం వద్దుగుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనవి తీవ్రమైన గుండె సమస్యలకు సూచన కావచ్చు. ఇటువంటి సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతంగా అలసిపోయినట్లు అనిపించడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.నిద్రలేమిని విస్మరించొద్దునిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజూ రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. చక్కని నిద్ర పలు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.ఒత్తిడిని జయించండి అధిక ఒత్తిడి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.వ్యాయామం తప్పనిసరిఫిట్నెస్పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాయామం చేసే అలవాటు శరీర బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. -
గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!
రక్తంలో పలు రకాల గ్రూప్‌లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయి. దాన్ని అనుసరించే ఎవరికైన రక్తదానం చేయడం వంటివి చేస్తాం . అయితే బ్లడ్ గ్రూప్‌ని బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా చూద్దామా..!గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..ఈ రోజుల్లో చాలా మందికి గుండెజబ్బుల బారినపడుతున్నారు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయట. మిగతా బ్లడ్ గ్రూప్‌లు ఏ, బీ, ఏబీ వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు.పెప్టిక్ అల్సర్..ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది.కేన్సర్కేన్సర్ ఎక్కువగా ఏ,బీ, ఏమీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద కేన్సర్లు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంటుందట.ఒత్తిడిసాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.వెయిన్స్ త్రాంబోఎంబోలిజంకొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్ త్రాంబోఎంబోలిజం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధుమేహ వ్యాధి..ప్రస్తుతం చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం మాత్రమే. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుని వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
మగపిల్లలనే కబళించే భయంకర వ్యాధి..! బారిన పడితే అంతే ..!
కేవలం మగపిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి ఇది. వచ్చిందో అంతే సంగతులు. సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు. కుటుంబంలో ఒక్కరూ బారిన పడ్డారంటే..ఆ తల్లి కడుపున పుట్టిన వారందరికీ కూడా వచ్చేస్తుంది. ఇంతకీ ఈ వ్యాధి పేరేంటంటే..?ఈ వ్యాధి పేరు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ). దీన్ని ‘పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మగ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు ఏళ్ల వయస్సు నుంచి మొదలై ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే వంశపారంపర్య నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు లోనవుతారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల తెలంగాణలోనే ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడటం అందరీలోనూ తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఒకేసారి తోబుట్టువులకీ వచ్చే అవకాశం..ఈ అన్నదమ్ములిద్దరూ నాలుగేళ్లపాటు చాలా సాధారణంగా ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగా చక్కగా ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవారు. సడెన్‌గా పెద్దవాడు శారీరకంగా బలహీనంగా కనిపించడం ప్రారంభించాడు. దీంతో వైద్యులను సంప్రదించగా ..అసలు విషయం విని షాకయ్యారు. వెంటనే తమ్ముడుకు కూడా ఇవే టెస్టులు చేయగా.. ఇద్దరూ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిబారిన పడ్డట్లు పేరెంట్స్‌కు తెలిపారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన తోబుట్టువులందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం 99% ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే దీనికి చికిత్స అందుబాటులో లేదని, కొంతకాలం ఇలాగే జీవించి చనిపోతారని వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడిన పిల్లలు యుక్తవయస్సు దాటి బతకడం కష్టమేనని అన్నారు.తీరని కడుపుకోత..అలాంటి ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యం. మన టాలీవుడ్ సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఈ వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. తనను ఒక పేరెంట్ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయం చేయమని కోరడంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నానని చెప్పారు. అంతేగాదు గర్భం దాల్చిన 3వ నెలలో దాదాపు రూ. 3000 రూపాయలకే ప్రతి స్త్రీ ప్రీ-నేటల్ టెస్ట్ చేయించుకోవాలని శ్రీనివాస్ సూచిస్తున్నారు. పిండానికి డీఎండీ ఉన్నట్లు గుర్తించినట్లయితే తక్షణమే గర్భం తీయించుకోవడం లేదా అబార్షన్ చేయించడం వంటివి చేయొచ్చని అన్నారు. లేదంటే వారిని బతికించుకోలేక కళ్ల ముంగిటే చనిపోతున్న బిడ్డలను చూసి తట్టుకోవడం ప్రతి తల్లిదండ్రులకు కష్టమేనని అన్నారు. అలాగే ఇలా గర్భం దాల్చిన సమయంలోనే ఆ టెస్ట్‌లు చేయించుకుంటే.. ఏ తల్లిదండ్రులకు కడుపు కోత అనుభవించాలన్సి పరిస్థితి ఎదురవ్వదని చెబుతున్నారు శ్రీనివాస్ అవసరాల.(చదవండి: International Chocolate Day: చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!) -
భారత్‌లో అనుమానిత మంకీపాక్స్ కేసు.. కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్‌ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగనిర్ధారణ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది. -
నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?
హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..గ్రేవ్స్ వ్యాధి అంటే..?థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.లక్షణాలు:అలసట, బలహీనతవేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనవణుకువిపరీతమైన ఆకలి, బరువు తగ్గడంఆందోళన, చిరాకు, మానసిక కల్లోలంతరచుగా ప్రేగు కదలికలుఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపుఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది. ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి. (చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!) -
అనుష్కకు వింత వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అనుష్క శెట్టి. 2005లో ‘సూపర్’ చిత్రంలో టాలీవుడ్‌కి పరిచమైన ఈ మలయాళ భామ..తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేస్తూ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక అరుంధతి చిత్రం ఆమె సినీ జీవితాన్నే మార్చేసింది. (చదవండి: రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్)ఆ తర్వాత వరుసగా ఫీమేల్ ఓరియెంటెండ్ మూవీస్ చేసి హిట్టుకొట్టింది.బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ భామ చేసిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మరో లేడి ఓరియెంటెండ్ మూవీ చేస్తోంది. (చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)ఇదిలా ఉంటే అనుష్క ఆరోగ్యంపై ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమె నవ్వడం ప్రారంభిస్తే..చాలా సేపటివరకు ఆపలేదట. ఎవరైనా జోక్ చేస్తే పగలబడి నవ్వేస్తుందట. చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుందట. దాని వల్ల షూటింగ్ సమయంలో చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనుష్కనే చెప్పింది. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారు అని తెలిపింది అనుష్క. అయితే ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యానికేమి ఇబ్బంది లేదని తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రముఖ లేడీ సింగర్‌కి అరుదైన వ్యాధి.. ఫలితంగా చెవుడు!
ప్రముఖ లేడీ సింగర్ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని వల్ల ఆమెకు చెవుడు వచ్చింది. అసలేం జరిగిందో.. ఈ వ్యాధి వచ్చిన విషయాన్ని ఎలా కనుగొందో వివరంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ పెట్టి వివరించింది. 1990ల టైంలో బాలీవుడ్లో టాప్ సింగర్స్‌లో ఒకరైన అల్కా యాగ్నిక్.. ఇప్పుడు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతోంది. అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే దీని బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!)'నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కటే చెబుతున్నా. పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను' అని అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చింది.90ల్లో హిందీలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అల్కా యాగ్నిక్.. పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించింది. ఇప్పటివరకు 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు ఈమె పాడటం విశేషం. అలానే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్‌ని ఆల్కా పాటలు సాధించడం విశేషం.(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?) View this post on Instagram A post shared by Alka Yagnik (@therealalkayagnik) -
‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి... లక్షణాలు, కారణాలు తెలుసా?
మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం. ఏడీహెచ్‌డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.లక్షణాలు ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్) టైమ్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం. మూడ్ స్వింగ్స్ క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఉద్రేకపడతారు.అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.ఏడీహెచ్‌డీ కారణాలుస్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్‌డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది. -
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
హీరోయిన్లు పైకి అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటారు. సమంత కొన్నాళ్ల ముందు మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు మెల్లమెల్లగా బయటపడుతోంది. తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని రివీల్ చేసింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.'హార్ట్ ఎటాక్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ.. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు అయితే రాలేదు. మరోవైపు బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయి.. 'ద కేరళ స్టోరీ', 'బస్తర్' లాంటి మూవీస్‌తో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)'కేరళ స్టోరీ మువీలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత 'బస్తర్' చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తిన్నాను. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలని నాతో పాటు షూటింగ్‌కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని''కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు చోట్ చేసుకోవడంతో పాటు ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం) -
జ్వరం ఒక వ్యాధి కాదు!
మనం జ్వరాన్ని ఓ వ్యాధిగా చూస్తాం. కాబట్టే జ్వరం రాగానే దాన్ని తగ్గించే మాత్రలు వేసుకోవాలని పోరపడుతూ ఉంటాం. నిజానికి జ్వరం అనేది వ్యాధి కాదు...అది వ్యాధిలో కనిపించే ఓ లక్షణం మాత్రమే! కాబట్టి అలా కనిపించే లక్షణానికి చికిత్స చేయటం మాని అందుకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా వైద్యుల్ని ఆశ్రయించాల్సిందే! జ్వరం తగ్గుతూ పెరుగుతున్నా, విడవకుండా రెండు రోజుల కు మించి వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకుని జ్వరాన్ని కలిగించిన వ్యాధి గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా తాత్సారం చేస్తే జ్వర కారక వ్యాధి క్రిములు అంతర్గత అవయవాల మీద దాడిచేసి ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగించవచ్చురక్తశుద్ధికి...👉టేబుల్ స్పూన్ నెయ్యి లో పది మిరియాలు వేసి చిన్న మంట మీద వేయించి తర్వాత వడపోసి, మిరియాలు తీసివేయాలి. వీటిని ఆహారంలో మొదటి ముద్దలో కలిపి తినాలి, 40 రోజులపాటు ఇలా చేస్తుంటే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మవ్యాధులు అన్నీ హరించి వేస్తాయి పాస్టిక్ వాటర్ బాటిల్ లో, నీళ్లు తాగడం ఆపి కేవలం రాగి ΄ాత్రలో నీళ్లు మాత్రమే తాగండి ∙మీకు వచ్చే అన్ని రోగాలు, కొద్ది రోజులలో మటుమాయమవుతాయి. -
'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా
తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్‌పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024 -
ప్రియుడు ఫోన్ ఎత్తలేదని.. ఈ కొత్త జబ్బు గురించి తెలుసా?
ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్ బ్రెయిన్’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. లవ్ బ్రెయిన్(Love Brain).. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్‌లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకరోజు వందకిపైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు. ఎవరికి సోకుతుందంటే..ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్‌లో ఉన్నవాళ్లు ఈ లవ్బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్ డిజార్డర్ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కారణాలు.. లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!. -
సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!
వేసవి అనంగానే దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతారు. ఈ కాలంలో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ కూల్‌డ్రింక్‌లు వంటిపై ఆధారపడుతుంటారు. అయితే కూల్‌డ్రింక్‌లు తాగొద్దని సూచించడంతో అందరూ..కొబ్బరి బొండాలు, చెరుకు రసాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో చెరుకు రసానికి మించిన పానీయం లేదని చెప్పొచ్చు. ఇది తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. పైగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అందరికీ ఇది మంచిదేనా? కాదా సవివరంగా తెలుసుకుందామా!. నోరూరించే తియ్యటి చెరుకు రసాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి చెరుకురసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! ఎన్ని లాభలంటే.. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది. చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్ ఫైబర్‌ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. వీళ్లు అస్సలు తాగొద్దు.. అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్ని చోట్ల చెరకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు. అలాగే ఒక్కోసారి ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!) -
కేరళలో పెరుగుతున్న గవదబిళ్లల కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
కేరళలో గవద బిళ్లల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 190 కేసులు నమోదయ్యాయి. దీంతో నేషనల్సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. గత నెలలో దాదాపు 2,500 కేసులు దాక నమోదయ్యినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాల రాష్ట్రాల పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గవద బిళ్లలు ఎందుకొస్తాయి? నివారణ ఏంటీ? తెలుసుకుందామా!. ఈ గవద బిళ్లలు ముఖ్యంగా పిల్లలు, యువకులను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రుబులవైరస్ కుటుంబానికి చెందిన పారామిక్సోవైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్‌కి మానవులు మాత్రమే అతిధేయులు. ఇది బాధితుడి నోటి నుంచి వచ్చే నీటి తుంపరల ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడు నోటి తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా చెవులు చుట్టూ ఉన్న రెండు ప్రాంతాల్లో బాధకరమైన వాపుతో కూడిన జ్వరం వస్తుంది. లక్షణాలు.. గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి. ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపుకు గురవుతాయి దీనివల్ల ఏమీ తినలేరు తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇలా ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ గవదబిళ్లలు తేలికపాటివి, దానంతట అవే వెళ్లిపోతాయి. ఒక్కోసారి యువకులలో ఎన్సెఫాలిటిస్, చెవుడు లేదా ఆర్కిటిస్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నివారణ.. డీ హైడ్రేట్ అవ్వకుండా ద్రవాల రూపంలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఆహారం మెత్తగా తీసుకోవాలి. తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం. వాపును తగ్గించడానికి స్క్రోటల్ సపోర్ట్, ఐస్ ప్యాక్‌లను ఉపయోగించాలి అలాగే వృషణాల వాపుతో కూడిన సందర్భాల్లో వాపును తగ్గించడానికి పరోటిడ్ గ్రంధులపై కోల్డ్ కంప్రెస్లను ఉపయోగించడం వంటివి చేయాలి. నొప్పి, వాపును తగ్గేందుకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే స్టెరాయిడ్స్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గవదబిళ్ళకు చికిత్స.. ప్రస్తుతం, గవదబిళ్ళకు నిర్దిష్ట చికిత్స లేదు. చాలా చికిత్సా ఎంపికలు ద్రవాలు ఎక్కువగా తాగడం, కోల్డ్ కంప్రెస్ చేయడం, సులభంగా జీర్ణమయ్యే మెత్తని ఆహారాలు తీసుకోవడం. ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక దీని బారిన గర్భిణీ స్త్రీలు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. (చదవండి: ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు..ఆ ఇద్దరు మహిళలు!) -
కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!
కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్‌తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
చలికాలంలో సీఓపీడీని అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది
గుంటూరు మెడికల్: మోహన్ ప్రతిరోజూ సిగిరెట్లు కాలుస్తాడు. మూడు నెలలుగా దగ్గు వస్తున్నా పట్టించుకోకుండా వదిలివేశాడు. స్మోకింగ్ మానేయాలని వైద్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. చలికాలం ప్రారంభం కావడంతో ఇటీవల ఓ రాత్రివేళలో శ్వాసతీసుకోవటం ఇబ్బందిగా ఉండి నిద్రకూడ పట్టకపోవటంతో అర్థరాత్రి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు శ్వాసకోస నాళాలకు సోకే సీఓపీడీ వ్యాధి సోకినట్లు చెప్పి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఎందరో ఈ వ్యాధి సోకినా తెలియక ప్రాణాపాయ స్థితివరకు ఇళ్ల వద్ద ఉంటూ చివరి సమయంలో పరుగులు తీస్తున్నారు. 2019లో 3.23 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా సీఓపీడీతో మృతిచెందారు. మనదేశంలో ప్రతిఏడాది 2,300 మంది చనిపోతున్నారు. సీఓపీడీ అంటే... క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్( సీఓపీడీ). ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి ఇది. వ్యాధి సోకినవారికి గాలి గొట్టాలు ఇన్ఫెక్షన్కు గురై కొన్ని సార్లు మూసుకుపోయి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఆయాసం, దగ్గు, కళ్లెపడటం, ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, గుండెదడ, కాళ్లు వాయటం, పిల్లికూతలు, బరువు తగ్గటం, కొద్దిగా జలుబు చేయగానే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎక్సరే, స్పైరో మెట్రో లేదా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది... ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ వస్తుంది. పొగతాగేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగకపోయినా పొగతాగేవారి పక్కన ఉండి పొగ పీల్చటం వల్ల కూడా వ్యాధి వస్తుంది. గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, కట్టెల పొయ్యి, పిడకల పొయ్యి వినియోగించేవారికి, బొగ్గు గనుల్లో, సిమెంట్ ఫ్యాక్టరీల్లో, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారికి, ధుమ్ము, ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో, పరిశ్రమల్లో పనిచేసేవారికి వ్యాధి సోకుతుంది. ఉబ్బసం( ఆస్తమా), అలర్జీ ఉన్నవారు జబ్బు నయం అయ్యేందుకు వైద్యం చేయించుకోకపోతే సీఓపీడీ రావచ్చు. జిల్లాలో వ్యాధి బాధితులు... జిల్లాలో 50 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) ఉన్నారు. ప్రతిరోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఇరువురు లేదా, ముగ్గురు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల హాస్పటల్లో ప్రతిరోజూ పది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. -
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?
వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే.. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి. లక్షణాలు.. సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చికిత్స.. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు. (చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?) -
నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాససమస్య. అనేక రకాల ఇన్ఫెక్షన్లు నిమోనియాకు దారితీస్తాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చే నిమోనియా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... నివారణ ఇలా... కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం అనే ఓవర్ క్రౌడింగ్ పరిస్థితికి దూరంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగవాతావరణానికి ఎక్స్పొజ్ కాకుండా చూసుకోవాలి. అలాగే పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ అలవాటుకూ దూరంగా ఉండాలి. మద్యం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు... మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లూ నివారితమవుతాయి. చిన్నపిల్లలకు, పెద్దవయసు వారికి నిమోనియాను నివారించే వ్యాక్సిన్ ఇవ్వడం మంచిది. -
ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం!
మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్‌లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 ఏళ్ల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవీ క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు. చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ ఎయిడ్స్ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్ఐవీ సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడ ప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో వారి కథ విషాదాంతమవు తుంది. ఎయిడ్స్ జబ్బుకి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే... హెచ్ఐవీ వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన కారణాలు. ఈ పరిస్థి తులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశా లలో హెచ్ఐవీ ప్రబలంగా వ్యాపించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్‌తో బాధపడు తున్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాల లోపువారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. 17 లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్ఐవీ సంక్రమించిన వారున్నారు. వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే ఏడాది దేశంలో దాదా పుగా 60 వేలమంది ఎయిడ్స్‌తో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారని అంచనా. సహారా ఎడారికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో హెచ్ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 40 శాతం మంది వరకూ హెచ్ఐవీ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆ యా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్ఐవీ / ఎయిడ్స్ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్ డ్రగ్)ను మొదట హెచ్ఐవీ చికి త్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్గా పిలుస్తున్న అజిడోథైమిడిన్ మందును క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్ ఔషధం హెచ్ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల అజిడోథైమిడిన్ని హెచ్ఐవీ పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్ఐవీ చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు. హెచ్ఐవీ చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమి సోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్ర మణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్పోజర్ ప్రొఫై లాక్సిస్’ అంటారు. ఇది హెచ్ఐవీకే పరిమిత మైన కొత్త నిరోధక విధానం. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ–ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్ఐవీ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్ జబ్బుకి దారి తీసే హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొన్నందు వల్లనే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవీ బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులు, ఎయిడ్స్ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు– ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించ డానికి ముందుండాలని ‘యూఎన్ ఎయిడ్స్’ పిలుపునిచ్చింది. డాక్టర్ యనమదల మురళీకృష్ణ వ్యాసకర్త సాంక్రమిక వ్యాధుల నిపుణులు మొబైల్: 94406 77734 (నేడు ప్రపంచ ఎయిడ్స్ డే) -
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్‌తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్‌లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్‌లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్‌లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
భారత్‌లో.. ఈ నాలుగు అరుదైన వ్యాధులకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు భారీగా తగ్గనుంది
భారత్ ఔషదాల తయారీలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ సంస్థల సహాయంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాదిలోనే నాలుగు అరుదైన వ్యాధులకు మందులను తయారు చేశారు. తద్వారా ఆ అరుదైన వ్యాధ్యులను నయం చేయించుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపూ 100 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు టైరోసినిమియా టైప్ 1 చికిత్సకు ఏడాదికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.2.2 కోట్ల నుండి రూ.6.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు రూ. 2.5 లక్షలకు చేరింది. ఒకవేళ ఈ అనారోగ్య సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే 10 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తారు. మూడు ఇతర అరుదైన వ్యాధుల్లో..గౌచర్స్ వ్యాధి. ఈ అనారోగ్య సమస్య తలెత్తితే రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే ప్లీహము పరిమాణం పెరిగేలా చేస్తుంది. దీంతో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విల్సన్స్ వ్యాధి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాగి తగ్గుతుంది. మెదడు పని తీరును ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్.. దీని వల్ల బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఖర్చులు కోట్ల నుంచి లక్షల్లోకి ఇప్పుడీ ప్రమాదకరమైన ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్‌తో గౌచర్స్ వ్యాధికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ. 1.8-3.6 కోట్ల నుండి రూ. 3.6 లక్షలకు, విల్సన్స్ వ్యాధికి వినియోగించే ట్రియంటైన్ క్యాప్సూల్స్‌తో సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుండి రూ. 2.2 లక్షలకు, డ్రావెట్‌కు కన్నబిడియోల్ (Cannabidiol) అనే సిరప్ ఖరీదు రూ. 7లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు అయ్యే సిరప్ రూ.1లక్షల నుంచి 5 లక్షల లోపు వరకు లభ్యమవుతుంది. 10 కోట్ల మందికిపైగా అరుదైన వ్యాధులు మన దేశంలో.. అంచనా ప్రకారం.. 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవి కాగా.. చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. జన్ ఔషద కేంద్రాల్లో మెడిసన్ ఏడాది క్రితం బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలైన జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లు 13 రకాల అరుదైన వ్యాధుల నివారణకై మెడిసిన్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి సంబంధించిన మందులు త్వరలో అందజేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్‌కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి గురైన బాధితులు కండరాల కదలికను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసలో ఉండే ఈ కణాల్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన బాధితులు ఏ పని చేసుకోలేరు. దీన్ని నయం చేసేందుకు వినియోగించే ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఖర్చును తగ్గించే పనిలో ఉన్నాయి భారత ప్రభుత్వం, ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి. -
ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ ధూమపానంతో క్యాన్సర్ తో పాటూ ఎన్నో ఆరోగ్య సమస్యలు లింక్ అయ్యి ఉన్నాయో తెలుసా. ఒకరకరంగా చెప్పాలంటే సిగరెట్ కాల్చడం లేదు మన ఆరోగ్యానన్ని మనమే చేజేతులారా తగలెట్టుసుకుంటున్నాం అన్నాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో ఆయన మాటల్లో చూద్దామా! ఊపిరితిత్తుల వ్యాధులు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (COPD), బ్రోన్కైటిస్ తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం. 1. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల కణజాలంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2. క్షయ: ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ధూమపానం చేసేవారిలో క్షయ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3.-COPD అనేది ఊపిరితిత్తుల యొక్క పరిమిత గాలి ప్రవాహం వల్ల వచ్చే ఒక సమూహం. ఇందులో బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా ఉన్నాయి. ధూమపానం COPDకి ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో COPD వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3. బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తుల శ్వాస గొట్టాల వాపు. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ COPD యొక్క ఒక రకం. ధూమపానం తీవ్రమైన మరియు దీర్ఘకాలిక బ్రోన్కైటిస్‌కు ప్రధాన కారణం. గుండె జబ్బులు ధూమపానం గుండెపోటు, స్ట్రోక్ తోపాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 1.-గుండెపోటు: ఇది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని 3 రెట్లు పెంచుతుంది. 2. స్ట్రోక్ ఇది మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం స్ట్రోక్ ప్రమాదాన్ని 2 రెట్లు పెంచుతుంది. 3. ధూమపానం కొరోనరీ ఆర్టరీ వ్యాధి గుండె వైఫల్యం, గుండె సంబంధిత క్యాన్సర్ వంటి ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇతర క్యాన్సర్లు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మూత్రపిండ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాస్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 1. మూత్రపిండాల క్యాన్సర్ ఇది మూత్రపిండాలలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం మూత్రపిండ క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 2. నోటి క్యాన్సర్ నోటిలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 3. గొంతు క్యాన్సర్: గొంతు క్యాన్సర్ అనేది గొంతులో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 4. గ్యాస్ట్రిక్ క్యాన్సర్: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది జీర్ణశయాంతరంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. 5. 5. 5. ప్యాంక్రియాస్ క్యాన్సర్: ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్‌లో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. ధూమపానం దంతాల ఆరోగ్యానికి హానికరం ధూమపానం దంతాల క్షయం, పళ్ళ మధ్య రంధ్రాలు, దంతాల పసుపు వంటి దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోటిలో ఆమ్లాల స్థాయిలను పెంచుతుంది అలాగే దంతాల క్షయానికి దారితీస్తుంది. దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది, ఇది పళ్ళ మధ్య రంధ్రాలకు దారితీస్తుంది. దంతాలపై పసుపు మచ్చలను ఏర్పరుస్తుంది. నోటిలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది నోటి పుండ్లకు దారితీస్తుంది. దంతాలను బలహీనపరుస్తుంది, ఇది దంతాల నష్టానికి దారితీస్తుంది. ఇలా క్యాన్సర్ మాత్రమె కాకుండా ధూమపానం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీయగలదు.అందుకని వీలైనంత తొందరగా మానేయటం ఉత్తమం. -ఆయుర్వేద వైద్యులు, నవీన్ నడిమింటి (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
క్రయోథెరపీ!
హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు కూడా. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆమె పలు రకాల వైద్య చికిత్సా పద్ధతులు అనుసరిస్తున్నారు. వైద్య చికిత్సలో భాగంగా తాజాగా క్రయోథెరపీ చేయించుకుంటున్నారామె. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సమంత. క్రయోథెరపీలో భాగంగా గడ్డ కట్టేంత చల్లని నీటి టబ్‌లో మెడ భాగం వరకూ మునిగి ఉన్నారు సమంత. ‘‘క్రయోథెరపీ వల్ల వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరగడంతో పాటు రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ థెరపీ శరీరానికి సరికొత్త శక్తిని ఇవ్వడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. రాజ్ –డీకే ద్వయం తెరకెక్కించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్‌ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మెదడుపై డెంగీ దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు. వెయ్యి మందిలో ఒక్కరిలోనే... డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్‌తో బ్రెయిన్లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు. వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్‌గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్‌సెఫలైటిస్‌తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్‌ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరచుకునేలా..
మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!. బ్రిటన్‌కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్‌గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్‌గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్‌లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు. ఈ వ్యాధికి గల కారణం.. ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ ఈ హంటింగ్టిన్స్ ప్రోటీన్‌ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది. (చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!) -
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్‌ఆర్‌తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్‌గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్‌ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్‌లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్‌లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్‌గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్‌గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్‌గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ -
అలా జరిగితే.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లా?
ఇటీవల కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యే మూత్రపిండాల వ్యాధి. ఇది ఒక్కటి పాడవ్వతే మొత్తం జీవన గమనమే మారిపోతుంది. దీని విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలిస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. దీన్ని గమనించినట్లయితే సత్వరమే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని అంటున్నారు. ఏవిధమైన సంకేతాలిస్తుంది. ఆ తదుపరి కిడ్నీలు మెరుగుపడేలా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది తదితర విషయాలు ఆయన మాటట్లోనే చూద్దాం. రక్తంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని ప్రొటీనురియా అంటారు. ఈ స్థితిలో ప్రోటీన్, గణనీయమైన మొత్తంలో మూత్రం ద్వారా బయటకు పోవడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ నష్టం మూత్రపిండ దెబ్బతింటున్నాయని చెప్పేందుకు తొలి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రోగులు చూసే మొదటి లక్షణం ప్రోటీన్యూరియా. ప్రోటీన్యూరియా కారణాలు: డీహైడ్రేషన్ మీ శరీరం శరీరం నుంచి చాలా ద్రవాన్ని కోల్పోయినప్పుడు, అది నిర్జలీకరణానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రోటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు వంటి పోషకాలను మూత్రపిండాలకు అందించడానికి నీరు సహాయపడుతుంది, కానీ తగినంత నీరు లేకుండా, ఇది రక్తం యొక్క సంక్లిష్ట పనితీరును కలిగి ఉంటుంది. క్రమంగా, మూత్రపిండాలు సరిగ్గా ప్రోటీన్లను తిరిగి పొందలేవు. బదులుగా ప్రోటీన్ మూత్రంలో చేరుతుంది . అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ప్రోటీన్ నష్టానికి ప్రధాన కారణం, ఎందుకంటే పెరిగిన రక్తపోటు కారణంగా మూత్రపిండాలపై పొర ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఫలితంగా అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్లిపోవడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ మెల్లిటస్: మధుమేహం మూత్రపిండ కణం పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రం ద్వారా విపరీతమైన ప్రోటీన్ బయటకు వస్తుంది. నెఫ్రోపతీ ఐజీఐ నెఫ్రోపతిలో, ఇమ్యునోగ్లోబులిన్ శరీరంలో పేరుకుపోతుంది, మూత్రపిండాల కణజాలంలో వాపును కలిగిస్తుంది. ఇది కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. పాలిసిస్టిక్ వ్యాధులు పాలిసిస్టిక్ వ్యాధిలో, మూత్రపిండము ఉపరితలంపై తిత్తుల సర్వర్ పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఇది మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో తిత్తులు ఏర్పడటం వల్ల ప్రొటీనురియా ఏర్పడుతుంది. లక్షణాలు: బలహీనంగా మారడం ప్రొటీన్లను కోల్పోవడం రోగులను రోజురోజుకు బలహీనపరుస్తుంది. రోగులకు, వారిని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి ప్రోటీన్ కీలకం. నురుగు మూత్రం నురుగు లేదా ముదురు రంగు మూత్రం మూత్రపిండ వైఫల్యం కారణంగా పెద్ద మొత్తంలో ప్రోటీన్ బయటకు వస్తుందని చూపిస్తుంది. మీ మూత్రంలోని ప్రోటీన్ గాలితో చర్య జరిపి నురుగును సృష్టిస్తుంది. మూత్రవిసర్జనలో ఫ్రీక్వెన్సీ ప్రతి 24 గంటలకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అదికూడా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం (ఒకసారి కంటే ఎక్కువ) లేదా తరచుగా మూత్రవిసర్జన. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వికారం వాంతులు అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వాంతులు మరియు వికారం ఏర్పడవచ్చు. ఆకలి లేకపోవడం: శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల రోగులు ఆకలి లేకపోవడం అనుభూతి చెందుతారు. కళ్ల చుట్టూ ఉబ్బడం: కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా ఉదయాన్నే కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తారు. వ్యర్థ పదార్థాల సేకరణ ఈ ప్రాంతాల్లో మంటను కలిగించవచ్చు. నివారణ: ప్రోటీన్ రహిత ఆహారం కిడ్నీ రోగికి ప్రొటీనురియా ఉంటే వారి ఆహారంలో 15 నుంచి 20% ప్రోటీన్ ఉండాలి. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న రోగులు ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచించారు. మూత్రపిండ రోగులకు సిఫార్సు చేయబడిన ఏకైక ప్రోటీన్ మూంగ్ కి దాల్. ఒక కప్పు పండు ఆహారంలో ఒక కప్పు పండు (ఏదైనా) కిడ్నీకి తగినంత మొత్తం. మీ సీరం బైకార్బోనేట్ స్థాయి సగటు ఉంటే, మీరు ఏదైనా పండు తీసుకోవచ్చు. కాకపోతే, వైద్యులు తమ రోగులకు ప్రతి ఆమ్ల పండును నివారించాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించండి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు వారి అధిక రక్తపోటును ఎలాగైనా నియంత్రించాలి. ఎందుకంటే పైన చెప్పాన సాధారణ కారణాలు మీ మూత్రపిండాలను దెబ్బతీస్తే, చెప్పిన వాటిని మెరుగుపరచడం ద్వారా మీ మూత్రపిండాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయుర్వేద కిడ్నీ చికిత్సలో మొదట కారణానికి చికిత్స చేస్తారు, ఆపై వ్యాధిని దశలవారీగా నయం చేస్తారు. మధుమేహాన్ని నియంత్రించండి మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, అధిక చక్కెర స్థాయి మూత్రపిండాలకు హాని కలిగించే మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ యోగ రెగ్యులర్ యోగా శ్వాస వ్యాయామాలు మీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అధిక రక్తపోటు కణాల పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల బలహీనమైన కణాలు ఖచ్చితంగా పని చేయలేవు. బరువు తగ్గడం మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విడుదల కారణంగా, రోగి బలహీనంగా మారి బరువు తగ్గుతారు. తగినంత నీరు త్రాగాలి ప్రతి వైద్యుడికి, రోగి ఎంత నీరు త్రాగాలి అని లెక్కించడం అసాధ్యం. రోగికి రోగికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నీరు అవసరమా అని తనిఖీ చేయడానికి దేవుడు మనకు నాలుక, నోటిని సెన్సార్‌గా ఇచ్చాడు. కాబట్టి మీ నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడు, ఒక సిప్ నీరు తీసుకోండి ఒకేసారి చాలా నీరు తాగొద్దు. యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సినజాగ్రత్తలు: 1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్, పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించాలి. ---నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!) -
అనారోగ్యం అంటే ఏంటీ..? ప్రకృతి వైద్యం ఏం చెబుతోంది?
ప్రతి రోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించ లేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులు త్యాగం చేయక తప్పదు. మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివాటి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్ర మిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని ‘ప్రకృతి వైద్యం’ ద్వారా నయం చేసుకోవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, శరీర కష్టం చేసే వారు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. రోజువారీ పనులనునడక, సైకిల్ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామం ఏదైనా ఒక్కటే నియమం, ‘శక్తికి మించి వ్యాయామం చేయకూడదు’. మిట్ట మధ్యాహ్నం ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది. నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్ చేయడం మంచిది. ఒబేసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు వ్యాయామం చాలా అవసరం. అలాగే మనం ఇంట్లో కూర్చుని యోగ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. యోగాసనాలు శరీరానికి, మెదడుకీ ఎంతగానో మేలు చేస్తాయి. ప్రకృతివైద్య సిద్ధాంతంలో, అనారోగ్యం అనేది ఆరోగ్యానికి భంగం కలిగించే ప్రక్రియగా, సహజ వ్యవస్థల సందర్భంలో ఆ తర్వాత కోలుకునే ప్రక్రియగా పరిగణించబడుతుంది. పేలవమైన పోషణ, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అనేకమైన విషయాలు ఆరోగ్యానికి ఎక్కువగా భంగం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వైద్యుల లక్ష్యం. – డా‘‘ ఎం. అఖిల మిత్ర, గౌతమ బుద్ధ అభివృద్ధి సమాఖ్య -
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్‌ఫాక్స్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్‌తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్‌బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్‌తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి
-
భయపెడుతున్న కండ్లకలక, వేలల్లో కేసులు నమోదు!
బనశంకరి(బెంగళూరు): కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన హావేరి జిల్లా ప్రస్తుతం మద్రాస్ ఐ కండ్లకలక కేసుల్లోనూ మొదటిస్థానంలో నిలిచింది. 9901 మంది కండ్లకలక బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,506 కండ్లకలక కేసులు వెలుగు చూడగా బీదర్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మూడో స్థానంలో శివమొగ్గ ఉంది. కండ్లకలక బాధితులు హావేరి జిల్లా ఆసుపత్రిలో వేలాదిమంది చికిత్స తీసుకుంటున్నారు.కాగా ఇటీవల రైతుల ఆత్మహత్యల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. రెండునెలల్లో 18 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదవండి: రూపాయికే ఇడ్లీ..ఆహా ఏమి రుచి -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
ఐబీడీపై ఏఐజీ అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు. తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు. -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్‌గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్‌గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్‌తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్‌ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్‌లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
మీకు తెలుసా! వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి
రోగాలను నిర్థారించడంలో తలెత్తిన లోపాల కారణంగా ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ విషయాన్ని యూఎస్‌కి చెందిన ఓ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది లక్షల మంది దాక చనిపోతున్నట్లు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం ..ప్రతి ఏడాది వ్యాధులను సరిగా గుర్తించడంలో వైఫల్యం కారణంగా ఏటా మూడు లక్షల మరణాలు, నాలుగు లక్షల మందికి అంగవైకల్యం, మరికొందరూ ఇతర శారీరక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన అధ్యయనంలో పేర్కొంది. శాస్త్రవేత్తలు 15 రకాల వ్యాధులను గుర్తించడంలో వైద్యులు విపలమవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రోగ నిర్థారణ లోపాల్లో చాలా వరకు ఆస్పత్రుల్లో సరైన విధంగా వనరులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అని తెలిపింది. ఇక వైద్యులు ఊపితిత్తుల క్యాన్సర్, సెప్సిన్, న్యుమోనియా, సిరలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, తదితర వ్యాధులను తప్పుగా నిర్థారిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధులు సాధారణ వ్యాధుల లక్షణాలను చూపించడంతో తరుచుగా వైద్యులు ఆయా వ్యాధులను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ వెల్లడించారు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
వైరస్‌లను గుర్తించే స్మార్ట్ వాచ్
‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. ‘కోవిడ్’ తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్ల జాడ గుర్తించగలిగే ‘విక్లోన్’ అనే ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. టైమ్ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్’ వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని ‘విక్లోన్’ పేరుతో రూపొందించింది. -
వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు!
చినుకు రాలే కాలమిది. వానలతో నేల తడిసే సమయమిది. దాంతో బొరియల్లోని ఎలుకలు బయటకు వస్తాయి. ఆహారం కోసం.. మెతుకుల్ని వెతుక్కుంటూ కిచెన్‌లో ప్రవేశిస్తాయి. వర్షాలు ఎక్కువగా ఉండి, కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఎలుక కనిపించిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే. వాటి నుంచి వ్యాప్తిచెందే లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియాతో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దగా ప్రమాదం లేకపోయినా... కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకం అయ్యే ప్రమాదమూ ఉంది. మనం వర్షాకాలం ముంగిట్లో ఉన్న ప్రస్తుత సమయంలో ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. లెప్టోస్పైరా ఇంటెరొగాన్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆరోగ్య సమస్య కాబట్టి దీనికి ‘లెప్టోస్పైరోసిస్’ అని పేరు. ఇది ఎక్కువగా ఎలుకలు, కొన్ని పెంపుడు జంతువులైన కుక్కలూ, ఫామ్‌లలో పెంచే జంతువులతోనూ వ్యాపిస్తుంది. దీన్ని ‘వీల్స్/ వెయిల్స్ డిసీజ్’ అని కూడా అంటారు. వ్యాప్తి ఇలా.. ఎలుకలు, ఇతర రోడెంట్స్ల (ఎలుక జాతికి చెందిన జీవుల) మూత్రవిసర్జనతో పొలాల్లోని నీరు కలుషితమవుతుంది. ఆ నీరూ, మట్టీ కలిసిన బురదలో పనిచేసేవారి ఒంటిపై గాయాలుంటే.. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా. మనిషి దేహంలోకి ప్రవేశించి లెప్టోస్పైరోసిస్‌ను కలుగజేస్తుంది. అందుకే చేలలో పనిచేసే రైతులు, పశువుల డాక్టర్లు (వెటర్నేరియన్స్), అండర్‌గ్రౌండ్ సీవరేజ్ వర్కర్లు వంటి వాళ్లలో ఇది ఎక్కువ. కలుషితమైన చెరువులు, వాగులు, సరస్సుల్లో ఈదేవారిలోనూ కనిపిస్తుంది. నివారణ: ఆహారాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో (ఎలుకల వంటివి చేరలేని చోట్ల) సురక్షితంగా ఉంచాలి. రోడ్లపై మలమూత్రాలతో కలుషితమైన నీళ్లు (సీవరేజ్) ప్రవహించే చోట్ల నడవకపోవడం (కాళ్లకు పగుళ్లు, ఇతర గాయాలు ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది); వీలైనంతవరకు జంతుమూత్రాలతో కలుషితమైన బురదనీటిలో, బురదనేలల్లో తిరగకుండా ఉండటం; పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. చికిత్స: పెన్సిలిన్, డాక్సిసైక్లిన్ వంటి మామూలు యాంటిబయాటిక్స్‌తో చికిత్స అందించడం ద్వారా దీన్ని తేలిగ్గానే నయం చేయవచ్చు. కాకపోతే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మెదడువాపు కలిగించే మెనింజైటిస్, లంగ్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె కండరాలు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా అరుదు. లక్షణాలు: బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించిన రెండువారాల్లో లక్షణాలు బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. తీవ్రమైన తలనొప్పి (కొన్నిసార్లు కొద్దిగా జ్వరంతో) ఛాతీ నొప్పి, కండరాల నొప్పి కొందరిలో కామెర్లు (కళ్లు, చర్మం పచ్చబడటం) వాంతులు, విరేచనాలు కొందరిలో చర్మంపై ర్యాష్‌తో. నిర్ధారణ: రక్తపరీక్షల్లో బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్ష కూడా అవసరం పడవచ్చు. అయితే లక్షణాలు,ఆయా సీజన్లలో ఇది వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జబ్బును అనుమానించి చికిత్స అందిస్తారు. డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ ఫిజీషియన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ (నిర్థారణ: బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..) -
కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..!
తిరువనంతపురం: కేరళలో మరో అరుదైన బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి వెలుగులోకి వచ్చింది. తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఓ 15 ఏళ్ల వ్యక్తి శరీరంలో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు.. షాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు. చికిత్సను ప్రారంభించామని తెలిపారు. రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. కలుషిత నీటితో స్నానం చేయకూడదని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు. 2017లో ఇదే ప్రాంతంలో ఇలాంటి బ్యాక్టీరియా కేసు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైరానా పెడుతున్న హెచ్ఐవీ -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్‌డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్‌లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందంటే..!
తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి అద్భతమైన ప్రత్యామ్నాయం. నిజానికి మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. కాని దీన్ని తయారుచేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఈ తాటిబెల్లం దేవుడు ఇచ్చిన ప్రకృతి ప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీన్ని తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఇందులో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల తోపాటు అనేక విటమిన్లు దీనిలో ఉంటాయి. ఆహారం జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో ఆహారం తీసుకున్న తర్వాత తాటిబెల్లం ముక్క తింటారు. పేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఆస్తమాని తగ్గించేందుకు దోహదపడుతుంది. అంతేగాదు ఎముకలకు బలాన్ని ఇచ్చి కాల్షియం, పోటాషియం, భాస్వరం తదితరాలు ఉంటాయి. దీన్ని తరుచుగా తీసుకోవడం వల్ల నీరసం రాదు, పైగా శరీర పుష్టి, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఎలాంటి వ్యాధులకు చెక్ పెడుతుందంటే.. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోస, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులులో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికం ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహయపడుతుంది. శరీరంలోని హానికర టాక్సిన్ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉదయాన్నే దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. ఇది కొవ్వుని కరిగించి అధికి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని వేడిని తొలగిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. చివరగా ఇది ఎక్కువగా గుంటూరు జిల్లా నిజామా పట్నం మండలం కాలిలో దొరుకుతుంది అలాగే గోదావరి జిల్లా నిడదవోలు,తాడేపల్లిగూడెం,చాగల్లు,కొవ్వూరు,పెదవేగి దేవరపల్లి, గోపాలపురం, భీమవరం, వీరవాసరం, తణుకులో ఎక్కువగా దొరుకుతుంది. దీంతో చేసుకునే సింపుల్ స్నాక్ ఐటెం తాటి బెల్లం నువ్వుల లడ్డు: కావాల్సిన పదార్థాలు: తాటి బెల్లం 2 కప్పులు నువ్వులు 2 కప్పులు తయారీ విధానం: తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. వచ్చిన నువ్వులు, తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ నుంచి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే తాటి బెల్లం ఉండలు తయారవుతాయి. (చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!) -
డాన్సింగ్ పానీపూరి.. ఎగబడితింటున్న జనం.. ఇదేం పనంటూ నెటిజన్స్ ఫైర్!
కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత అందరికి తెలసిందే. రుచి, శుచితో కూడిన ఆహారానికి దేశంలో యమ డిమాండ్ ఉంది. అందుకే ఫుడ్ బిజినెస్‌లోకి ప్రజలు అడుగుపెడుతున్నారు. ఈ వ్యాపారంలో పిల్లలు నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిరుతిండి టేస్ట్ ఉంటే చాలు ప్రజలు అక్కడవాలిపోతారు. అందుకే వీధి వ్యాపారులు కేవలం రుచితో మాత్రమే కాకుండా అనేక వైవిధ్యాలతో ముందుకు వస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రుచితో పాటు కాస్త భిన్నంగా పానీపూరి అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక వీధి వ్యాపారీ సందడిగా ఉండే ట్రిపోలియా బజార్లో తోపుడు బండి మీద పానీపూరి అమ్ముతున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్‌తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, వీధి వ్యాపారి తన ఒట్టి చేతులతో పానీ పూరీని కలపడం, పూరీలను నింపడం డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. అతను తన ముక్కును గీసుకున్న తర్వాత పానీ పూరి నీటిలో తన చేతులను ఉంచడం కూడా అందులో కనిపిస్తుంది. అనంతరం అదే చేతితో వినియోగదారులకు గోల్గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ, రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) చదవండి: Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. అందరిముందే హగ్‌లతో రెచ్చిపోయిన జంట -
ఓవైపు ఎండల మంటలు.. మరోవైపు మసూచి.. ఒక్క ఊళ్లోనే 100 మందికి
పాట్నా: వడగాల్పులు ఉత్తరాదిని వణికిస్తుండగా.. ప్రస్తుతం మరో సమస్య వచ్చి పడింది. తీవ్రమైన ఎండలతో ఉత్తరప్రదేశ్, బిహార్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న వడదెబ్బ బాధితులకు తోడు స్మాల్ ఫాక్స్(మసూచి) బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ హెచ్చవుతోంది. బిహార్‌లో ఓ గ్రామంలో దాదాపుగా సగం జనాభాకు ఈ వ్యాధి సోకడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సాపౌల్ జిల్లాలోని త్రివేణిగంజ్ గ్రామంలో 100 మందికి స్మాల్ ఫాక్స్ సోకింది. కేవలం 35 కుటుంబాల నుంచే ఇంత మంది బాధితులు ఉండటం గమనార్హం. అయితే.. గత మూడు నెలల నుంచి వ్యాధి ప్రబలుతున్నప్పటికీ ఇప్పటి వరకు వైద్య అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. వ్యాధి వ్యాపించిన తొలినాళ్లలోనే ఫిర్యాదు చేసినప్పటికీ తమ విన్నపాలను పెడచెవిన పెట్టారని చెబుతున్నారు. తమకు తెలిసిన వైద్యాన్ని చేస్తున్నట్లు చెప్పారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెలుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా మంగళవారం ఆ గ్రామాన్ని వైద్య అధికారులు పరిశీలించారు. రోగులను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమకు విషయం తెలియగానే ఆ గ్రామాన్ని సందర్శించామని జిల్లా వైద్య అధికారి మిహిర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున స్మాల్ ఫాక్స్ సోకడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వేసవి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: Video: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. 5 కి.మీ మేర ట్రాఫిక్ -
అనారోగ్యం తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి: అనారోగ్యం తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివీ.. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మ దంపతుల కుమా రుడు వినోద్‌కుమార్(25) మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. గత కొన్ని నెలలుగా సోరియాసిస్ వ్యాధి బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్‌కుమార్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గడ్డమల్లయ్యగూడలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందివచ్చిన కొడుకు ఆసరా అయ్యే సమయానికే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
AP: కవాసకీ వ్యాధి బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! జీవితాంతం..
ఎన్నో జబ్బులు గురించి ఇంతవరకు విన్నాం. అవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి. పైగా అవి ఏదో విటమిన్లోపం లేదా జన్యు సమస్యల కారణంగా వచ్చిన జబ్బులు. ఇంకాస్త ముందుకెళ్లితే మన పనితీరు కారణంగా వచ్చే విచిత్రమైన వ్యాధులు గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునే ఈ వ్యాధి అత్యంత అరుదైనది, విని ఉండే ఆస్కారమే లేదు కూడా. ఎందుకంటే అది మనిషి జీవితంలో రొటిన్‌గా చేసే సాధారణ పనిని చేయలేకపోవడం. చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే అరుదైన వ్యాధి బారిన పడింది 30 ఏళ్ల మహిళ. ఈ వ్యాధి పగవాడికి కూడా వద్దంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల మహిళ మూత్ర విసర్జన చేయలేకపోడం అనే వింత సమస్యతో బాధపడుతుంది. ఆ మహిళ పేరు ఎల్లే ఆడమ్స్. ఆమె అక్టోబర్ 2022లో తాను టాయిలెట్‌కి వెళ్లలేకపోతున్నట్లు తొలిసారిగా గుర్తించింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆమె ఆరోజంతా టాయిలెట్‌కి వెళ్లలేకపోయింది. మనిషి నిత్య జీవితంలో సర్వసాధరణంగా చేసే పనిని చేయలేకపోతున్నానంటూ భోరున విలపించింది. దీంతో ఆమె వైద్యలును సంప్రదించగా..వారు అత్యవసర క్యాథెటర్‌ను అందించారు. అంటే ఒక ఒక గొట్టాన్ని మూత్రాశయంలోకి పంపి యూరిన్‌ని తీయడం. దీంతో ఆమె మూత్రశయం నుంచి లీటర్ యూరిన్ తీశారు వైద్యులు. ఇది సాధారణంగా రోగికి శస్త్ర చికిత్సలు చేసేటప్పుడే ఉపయోగిస్తారు. అయితే ఎల్లేకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే యూరిన్‌ని ఇలా తీయాల్సి వస్తోంది. ఆ గొట్టాన్ని తీసేసి బాత్రూంకి వెళ్లి ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. చివరికి ఎన్ని మందులు వాడిని ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. దీని గురించి యూరాలజీ సెంటర్ల చుట్టు తిరుగుతూనే ఉంది. సరిగ్గా 14 నెలలు తర్వాత వైద్యులు నిర్వహించిన పలు టెస్ట్‌ల ద్వారా ఎల్లే ఫౌలర్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇక జీవితాంతం మూత్ర విసర్జన చేయడానికి క్యాథెటర్ అవసరం అని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవని తెలిపారు. ఫౌలర్స్ అనేది యూరిన్‌ని పాస్ చేయలేని సమస్య. ఇది ఎక్కువగా యువతులలోనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల తాను ఎంతగా ఇబ్బందిపడుతోందో కన్నీరుమున్నీగు చెబుతోంది ఎల్లే. (చదవండి: మోదీ ఇంటి పేరుపై నాడు ఖుష్బు చేసిన ట్వీట్ దుమారం!) -
కలకలం రేపుతున్న కొత్త వ్యాధి.. నీటితో జాగ్రత్త.. సోకితే బతకడం కష్టమే!
ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఆ వైరస్ దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. అయితే అక్కడక్కడ వెలుగుచూస్తున్న కొత్త వైరస్లు, ఇన్ఫెక్షన్లు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఫ్లోరిడాలో ఓ వ్యక్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని షార్లెట్ కౌంటీలో ఒక వ్యక్తి తన ముక్కును పంపు నీటితో కడుక్కోవడంతో వైరస్ సోకి మరణించినట్లుగా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. అరుదైన వ్యాధి.. సోకితే కష్టమే! బ్రెయిన్ తినే అమీబా అయిన నేగ్లేరియా ఫౌలెరీ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ధృవీకరించింది. ఇది నీటి ద్వారా మనుషులకు సోకుతుందని, ఈ క్రమంలో ప్రజలు వైరస్ బారినపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సీడీసీ ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా (ఏకకణ జీవి). ఇదొక అరుదైన ఇన్ఫెక్షన్. కలుషితమైన నీరు ద్వారా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. ఈ అమీబా సోకితే మెదడుని తినేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ (అమీబా) ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. అక్కడ అది జీవి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది, ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే హానికరమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీని సంక్రమణ ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలు తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మానసిక సమతుల్యత దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే కోమాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 154 మందిలో బయటపడింది కేవలం నలుగురు ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97 శాతం మంది మరణించారని, 1962-2021 మధ్య కాలంలో యూఎస్‌లో 154 మందిలో కేవలం నలుగురు రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. షార్లెట్ కౌంటీ నివాసితులందరూ నీటిని ఉపయోగించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని మరిగించి ఆ తర్వాత ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు. చదవండి: టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్! -
అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ
వెండితెరపై తమ అందం, గ్లామర్‌తో ఆకట్టుకుంటునే భామలు వ్యక్తిగతంగా పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత, మమత మోహన్ దాస్, శృతి హాసన్‌తో సహా పలువురు నటీనటులు ఉన్నారు. ఇటీవల మయెసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్ ప్రస్తుతం కోలుకుంది.మయోసైటిస్‌తో బాధపడుతున్నానని సమంత వెల్లడించడంతో పలువురు నటీనటులు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమ వ్యాధిని బయటపెట్టారు. చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే.. తాజాగా స్వీటీ అనుష్క కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె తాను బాధపడుతున్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. తనకు నవ్వే జబ్బు ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద సమస్య కానప్పటికి తాను నవ్వడం స్టార్ట్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానని చెప్పింది. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ ‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. నవ్వుని అసలు కంట్రోల్ చేసుకోలేను. ఇక సెట్లో నేను నవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ ఆపేసుకోవాల్సిందే. దాదాపు 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. ఈ గ్యాప్‌లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు’ అని అంటూ తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనుష్క మైత్రి మూవీ ప్రొడక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
కరీంనగర్ జిల్లా: నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురి మృతి
-
అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్లో కుటుంబం బలి
సాక్షి, కరీంనగర్: అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం బలైంది. ఒకే వ్యాధితో ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన గంగాధర మండల కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు..గంగాధరకు చెందిన లక్ష్మీపతి కుమారుడు శ్రీకాంత్‌కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు. నవంబర్ నెలలో మొదట శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు విరేచనాలు, వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తనయుడి మరణం నుంచి కోలుకోకముందే శ్రీకాంత్ కూతురు అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్9న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. ఇటీవల ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. భార్య, పిల్లల మృతితో అనారోగ్యానికి గురైన శ్రీకాంత్ కూడా శనివారం ఉదయం ఇంట్లో రక్తం కక్కుకొని మరణించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతుల రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కుటుంబానికి బలితీసుకున్న వ్యాధి ఏంటనేది మిస్టరీగా మారింది. జన్యుపర లోపాలా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట హైదరాబాద్‌లో చికిత్స పొందిన చిన్నారులు, తల్లి విషయంలో డాక్టర్లు వీరికి సోకిన వ్యాధిని నిర్ధారించలేకపోయారని మృతుల బంధువులు చెప్తున్నారు. మరోవైపు అంతుచిక్కని వ్యాధిపై గంగాధర స్థానికల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. -
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
వేప చెట్లకు ముప్పు..
సాక్షి, హైదరాబాద్: కొమ్మల ముడత లేదా డైబ్యాక్ అని పిలిచే విధ్వంసకర వ్యాధితో ప్రస్తుతం వేపచెట్లకు ముప్పున్నదని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్ పాథాలజిస్ట్ డా.జగదీశ్ తెలిపారు. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుందని, ఐతే దీని వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేంత బలంగా మన రాష్ట్రంలోని చెట్లున్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఆగస్టు–డిసెంబర్ల మధ్య ఎక్కువగా కనిపిస్తుందని, వర్షాకాలం మొదలయ్యాక లక్షణాలు కనిపిస్తాయని, వర్షాకాలం చివర్లో శీతాకాలంలో ఇది క్రమంగా తీవ్రమవుతుందని వివరించారు. విత్తన శుద్ధితో తగ్గుముఖం వేప విత్తనాలు విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి ఈ సంక్రమణను తగ్గిస్తుందని తెలియజేశారు. మొలక, నారు దశలో కార్బండాజిమ్ 2.5 గ్రాముల లీటరు నీరు లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు కచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, వ్యాధులకు నిరోధకతను కల్పిస్తాయని తెలిపారు. వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని బాగా తట్టుకోగలుగుతుందని, తరచుగా ఫంగస్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదని స్పష్టం చేశారు. దీనిపై తమ ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీలో అధ్యయనాలు నిర్వహించామని, వ్యాధికారక కారణాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లుగా ఇది వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. వేప డైబ్యాక్, ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 9705893415 నంబర్లో సంప్రదించవచ్చునని జగదీశ్ తెలియజేశారు. -
సమంత లాగే నాకు కూడా మయోసైటిస్ ఉంది : హీరోయిన్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి కదల్లోని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్‌తో పాటు వైరస్, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్ వస్తుంది. ప్రస్తుతం సమంత దీనికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కూడా మయోసైటిస్ వ్యాధితో పోరాడినట్లు హీరోయిన్ పియా బాజ్‌పేయ్ తెలిపింది. సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా గతంలో మయోసైటిస్ బారిన పడ్డాను. చికిత్స లేని వ్యాధి బారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నాకు మయోసైటిస్ వచ్చిందని విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నా. సమంతకు మయోసైటిస్ ఉందని తెలియగానే బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చింది. కాగా పియా బాజ్‌పేయి జీవా హీరోగా నటించిన 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
సమంత 'మయోసైటిస్' వ్యాధిపై నాగ చైతన్య స్పందిస్తాడా?
సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్ సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ , ఎన్టీఆర్, నాని, సుశాంత్, కృతిసనన్, రాశికన్నా, హన్సిక, జెనీలియా, నందినిరెడ్డి, వంశీపైడిపల్లి సహా పలువురు ప్రముఖులు స్పందించారు.ఆమెకు ధైర్యం చెబుతూ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. మరోవైపు సమంత అనారోగ్యంపై నాగచైతన్య స్పందిస్తాడా? లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్‌లా అయినా చై సామ్ గురించి పోస్ట్ చేస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2018లో పెళ్లి చేసుకున్న చై-సామ్‌లు గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా? -
'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా?
సమంత 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. సామ్ పోస్ట్ చూసి సినీతారలు సహా ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు అభిమానులు. 'గెట్ వెల్ సూన్ సామ్' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా మయోసైటిస్ అనే వ్యాధి కారణంగానే సమంత ముఖం మారిపోయిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్ బయట కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అప్పటికే రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇటీవలె ఓ యాడ్‌లో కనిపించిన సమంత ముఖం ఉబ్బిపోయి తేడాగా కనిపించింది. దీంతో సర్జరీ చేయించుకుందనే వార్తలొచ్చాయి. కానీ తాజాగా తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడున్నట్లు స్వయంగా సమంత పేర్కొనడంతో ఆ వ్యాధి కారణంగానే సమంత ముఖం అలా మరిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా సామ్ త్వరగా కోలుకావాలంటూ ఆమె ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. చదవండి: సమంత 'మయోసైటిస్' వ్యాధిపై అఖిల్ అక్కినేని కామెంట్స్ వైరల్ -
విజృంభిస్తున్న ‘లంపీస్కిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. 32 జిల్లాల్లో లక్షణాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్‌లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. వాతావరణ సానుకూలతతో ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం హెచ్చరికలు.. దేశంలో లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించింది. లంపీస్కిన్ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. లంపీస్కిన్ లక్షణాలివే.. ►పశువులకు తీవ్రమైన జ్వరం ►కంటి నుంచి నీరు కారడం ►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►చర్మమంతా పొలుసులుగా మారడం ►పశువు మేత తినదు... పాలివ్వదు వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు పశువుల్లో లంపీస్కిన్ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది. – డాక్టర్ ఎస్. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రోగం గురించి చెప్పేవారే లేరు పశువులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు. – బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్ వ్యాక్సిన్ ఇచ్చారు.. లంపీస్కిన్ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. – కరుణాకర్‌రావు, మెట్పల్లి, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా రెండు ఎడ్లకు సోకింది మా రెండు ఎడ్లకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. – రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
భారత్‌లో టమాటో ఫ్లూ కలకలం...హెచ్చరించిన లాన్సెట్ నివేదిక
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీతో పోరాడుతూ... ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు. సుమారు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని తెలిపింది. ఇది పేగు వైరస్ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్‌గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్‌లోని మరే ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. (చదవండి: Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం) -
బాధపడుతూ వదిలేసినా.. బతికేందుకు దారి చూపాడు
ఈ ఫొటోలో దీనంగా కనిపిస్తున్న కుక్కను చూశారుగా. దీని పేరు బేబీ గర్ల్. మంటలు ఆర్పేందుకు ఏర్పాటు చేసిన ఓ ఫైర్ హైడ్రంట్‌కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగుంది. జంతువుల బాగోగులను చూసుకునే ఓ చారిటీ వాళ్లు వచ్చి ఆ కుక్కను, ఆ బ్యాగును చూశారు. కుక్కను ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారని అనుకుంటూ ఆ బ్యాగును తెరిచి చూశారు. దాన్నిండా ఆ కుక్క ఆడుకునే వస్తువులు, దానికి ఇష్టమైన వస్తువులతో పాటు ఆ కుక్కును పెంచుకునే యజమాని ఓ లేఖను కూడా గుర్తించారు. దాన్ని చదివి చలించిపోయారు. యజమాని చెప్పింది నిజమా కాదా అని తెలుసుకునేందుకు వెంటనే కుక్కను మెడికల్ టెస్టుకు పంపారు. దానికి కెనైన్ డయాబెటిస్ (డయాబెటిస్ మిల్లిటస్) వ్యాధి ఉందని గుర్తించారు. ఆ వ్యాధి చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్‌ను, మరిన్ని రకాల మందులూ కొనాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన తిండిని పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ప్రతి నెలా రూ. వేలల్లోనే ఖర్చవుతుంది. కుక్కను పెంచుకుంటున్న యజమానే కొన్ని వైద్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన వ్యాధి చికిత్సకే డబ్బులు సరిపోక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడు కుక్కు చికిత్సకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని బాధపడ్డాడు. మరో అవకాశం లేక.. లోలోపల బాధపడుతున్నా ఎవరో ఒకరు ఆదుకోకుండా ఉంటారా జనాలు తిరిగే వీధిలో దాన్ని వదిలేశాడు. కానీ ఉండలేకపోయాడు. కుక్కను చారిటీ వాళ్లు తీసుకెళ్లారని తెలుసుకొని పరుగును వాళ్లను కలుసుకున్నాడు. ఆయన తిరిగి రావడం చూసి చారిటీ వాళ్లు సంతోషించారు. ‘కుక్కకు ఇష్టమైన వస్తువులను ప్యాక్ చేసి, ప్రమాదవశాత్తు కార్ల కింద పడకుండా, అందరికంట పడేలా ఓ పక్కన కట్టేసి, ఎందుకు వదిలేశారో లేఖను రాసిన తీరును చూసి కుక్కంటే మీకెంతిష్టమో మాకు అర్థమైంది’ అన్నారు. ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదని, బేబీ గర్ల్‌కు మంచి భవిష్యత్తు ఉందని భరోసానిచ్చారు. ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న గ్రీన్ బే ప్రాంతంలో జరిగింది. -
Tomato Flu: చిన్నారుల్లో అంతుచిక్కని ‘టమాటో ఫ్లూ’ కలకలం
మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. టమాటో ఫ్లూ అంటే.. ఇది అరుదైన డిసీజ్. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్‌తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది. లక్షణాలు.. టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్‌గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్‌కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. సరిహద్దులో నిఘా.. ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు. అలాగే వలయార్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
జుట్టును ఎంత దువ్వినా మాట వినదు.. ఈ వ్యాధికి చికిత్స ఉందా?
ఫొటో చూడండి. పిల్లాడి జుట్టు గమ్మత్తుగా ఉంది కదా. ఏ హెయిర్ స్టైలిస్టో కానీ భలే పనిమంతుడు.. బాగా సెట్ చేశాడు అనుకుంటున్నారు కదా. కానీ ఇది మనుషులు సెట్ చేస్తే వచ్చేది కాదు. వెంట్రుకలకు వచ్చే వ్యాధి వల్ల జుట్టు ఇలా తయారైంది. దీన్ని అన్ కోంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (యూహెచ్ఎస్) అంటారు. జన్యుప రమైన సమస్యలతో ఇలాంటి సమస్య వస్తుంటుంది. ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా 3–12 ఏళ్ల చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ల జుట్టును ఎంత దువ్వినా చెప్పిన మాట వినదు. పొలుసులుగా నిటారుగా నిలబడి ఉంటుంది. మెల్లమెల్లగా రాలిపోతుంటుంది. ఇలాంటి వాళ్ల జుట్టులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. మామూలు మనుషుల వెంట్రుకల మొనలు స్థూపాకారంలో ఉంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ల వెంట్రుకలు త్రిభుజాకారంలో మారిపోతాయి. చదవండి👉ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా.. అందుకే దువ్వెనతో కూడా దువ్వలేనంతగా వింతగా, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. జన్యుపరమైన మార్పు వల్ల కొందరిలో చర్మం, పళ్లు, గోర్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏం లేదు. అయితే కొందరు పిల్లల్లో బయోటిన్ వాడటం వల్ల కొంత మార్పు కనిపిస్తోందని.. మరికొందరిలో వయసు పెరుగుతున్నాకొద్దీ సమస్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మలేరియా లేని ప్రపంచం కోసం...
చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్ 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. దీనిని ‘ప్లాస్మోడియం’ జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్ అనే ఐదు రకాల పరాన్నజీవుల వలన మానవులకు మలేరియా సోకుతోంది. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి ఒకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ద్ధరించారు. ఇందుకుగానూ ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ‘అనాఫిలస్’ జాతికి చెందిన ఆడ దోమల వలన మలేరియా వ్యాధికారక క్రిమి వ్యాప్తి చెందుతుంది. మలేరియా వ్యాధి తీవ్రతను అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో ‘‘ఆఫ్రికా మలేరియా డే’’ ఆచరించింది. అదే స్ఫూర్తితో 2008 నుండి ఏప్రిల్ 25ను ‘వరల్డ్ మలేరియా డే’గా ఆచరిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల 10 లక్షల మంది మలేరియా వ్యాధి బారినపడగా, 6 లక్షల 27 వేల మంది చనిపోయారు. ఇక మనదేశం విషయానికివస్తే 2021లో అధికారికంగా 1,58,326 మలేరియా కేసులు గుర్తించగా, 80 మరణాలు సంభవించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స, నియంత్రణల్లో కనుగొన్న నూతన ఆవిష్కరణల ఫలితంగా గత 10 సంవత్సరాల్లో మలేరియా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలు, దీర్ఘకాలం వినియోగించ గలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాల వలన ఇది సాధ్యమైంది. దీన్ని సాధించడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు చేసిన కృషి ఎనలేనిది. 2030 నాటికి భారత దేశం నుండి మలేరియా వ్యాధిని పూర్తిగా తొలగించడానికి పథక రచన చేశారు. – తలతోటి రత్న జోసఫ్ రిటైర్డ్ ఏడీ; ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ -
జాతీయ మహమ్మారి ‘బ్రూసెల్లోసిస్’: పశువులతో పాటు మనుషులకూ ప్రమాదమే
సాక్షి, పాలకొల్లు అర్బన్: బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా. దీనిని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. బ్రూసెల్లా సూక్ష్మజీవులు పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. జాతీయ ప్రాజెక్టుగా వ్యాధి నివారణ... ఈ వ్యాధి పశువులకు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ ఇటీవలే కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి నివారణను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దశల వారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటి ఎనిమిది నెలల లోపు ఉన్న పెయ్య దూడలన్నింటికీ ఈ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఏడాదిలో మూడు సార్లు ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు చొప్పున పశువులకు అందించాలని కార్యాచరణ రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ ఒకసారి పశువులకు చేస్తే జీవిత కాలంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 29,159 పశువులకు ఈ వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పశువులకు వేసేటప్పుడు రక్షణ పరికరాలు వినియోగించాలి. లేనిపక్షంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ వ్యాక్సిన్ చుక్కలు మనిషి శరీరంపై పడితే బోద మాదిరిగా వాపులు వస్తాయని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకొల్లు మండలం గోరింటాడలో ఆవుదూడకి బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం జరిగినప్పుడు పిండం ద్వారా గర్భకోశ స్రవాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. గర్భస్రావం జరిగిన పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రవాలు బయటకు వచ్చి నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా చూడి ఆఖరి దశలో సంభవించడం వ్యాధి ప్రధాన లక్షణం. చూడి మోపగానే సూక్ష్మజీవుల మాయను గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాటిలెడెన్సు కుళ్లిపోవడం వల్ల పిండం మరణించి గర్భస్రావం అవుతుంది. గర్భస్రావాలు ఈ విధంగా రెండు, మూడు ఈతల్లో సంభవిస్తాయి. మనుషులకు వ్యాప్తి ఇలా.. బ్రూసెల్లోసిస్ సూక్ష్మజీవులు మనిషి కంటి పొరల ద్వారా లేదా ఈ వ్యాధి సోకిన పశువుల పాలు, వెన్న, మాంసం ఆహారంగా భుజించడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకితే వృషణాలు వాపు చెందుతాయి. వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి జరగదు. పురుషులకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు అబార్షన్ జరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు అవగాహన పెంచుకోవాలి బ్రూసెల్లోసిస్ వ్యాధి చాలా కాలం నుంచి పశువులకు సోకుతోంది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మొదటి దశలో కొన్ని పశువులను గుర్తించి వ్యాక్సిన్ అందించాం. ఈ వ్యాధిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వ్యాక్సిన్ వేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.మురళీకృష్ణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి, భీమవరం -
అరుదైన కుషింగ్స్ వ్యాధి: భారీ పొట్ట, ఇతర లక్షణాలు తెలుసా?
-
క్యాన్సర్‌పై యుద్ధం..మాస్ స్క్రీనింగ్ దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంపై దృష్టిపెట్టింది. దేశంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు సంభవిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్)గా నియమించింది. ఆయన ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్‌కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి (ఓరల్) క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్), రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామంలో సచివాలయం యూనిట్‌గా మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సాయంతో ముగ్గురు గైనకాలజీ, ముగ్గురు అంకాలజీ వైద్యులు గత శనివారం స్క్రీనింగ్ నిర్వహించారు. గ్రామంలో 2,400 మంది జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు 640 మందికి ఉన్నారు. వీరందరికీ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ వలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 240 మంది మహిళలు స్క్రీనింగ్‌కు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న 70 మందికి వైద్యులు ఎంఎంయూలోనే మామోగ్రామ్ పరీక్ష చేశారు. అదేవిధంగా 117 మందికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన పాప్‌స్మియర్ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్‌లన్నింటీని గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ కేర్ విభాగానికి తరలించారు. ఇక్కడి నిపుణుల పరిశీలన అనంతరం బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించనున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చిన 27 మంది పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు చేయగా ఇద్దరికి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ నేతృత్వంలోని కోర్ కమిటీ ప్రణాళిక సిద్ధంచేసింది. మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు మూడు విధానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. సచివాలయం యూనిట్‌గా స్క్రీనింగ్ నిర్వహణ సచివాలయం యూనిట్‌గా మాస్ స్క్రీనింగ్ నిర్వహణ చేపట్టబోతున్నాం. అనంతరం గుర్తించిన క్యాన్సర్ రోగులను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ద్వారా దగ్గరలోని నెట్వర్క్ ఆసుపత్రికి తరలిస్తాం. ఆసుపత్రిలో వీరికి ప్రభుత్వమే ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తుంది. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు వాకబు చేస్తారు. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్‌బనేగా శిఖర్వతి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
ఆమెకు ‘కొరియా’ వ్యాధి.. ప్రపంచం మొత్తంలో వెయ్యి మందికి మాత్రమే
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఆమె వయస్సు 32. కానీ చూడటానికి 50 ఏళ్లు పైబడిన మహిళగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడింది. కాళ్లు చేతులు తన ప్రమేయం లేకుండానే నిత్యం కదులుతూ ఉంటాయి. అన్నం తినేందుకు నోట్లో ముద్ద పెడితే.. తన ప్రమేయం లేకుండానే నాలుక ఆ ముద్దను బయటకు తోసేస్తుంది. ఇలాంటి వింతైన, అరుదైన పరిస్థితిని ఆస్పరికి చెందిన వీరేషమ్మ అనుభవిస్తోంది. వైద్యం చేయించాలని కుటుంబసభ్యులు కనిపించిన వైద్యులందరి వద్దకు తిరిగారు. మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం పట్టిందేమోనని భూతవైద్యులనూ ఆశ్రయించారు. ఇలా ఆ కుటుంబం దాదాపు మూడు లక్షల రూపాయలను ఖర్చు చేసింది. చివరకు కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్ డాక్టర్ హేమంత్‌కుమార్ ఆదోని క్యాంపునకు వెళ్లినప్పుడు కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఆమెకు గల పరిస్థితిని అర్థం చేసుకుని వైద్య పరీక్షల కోసం హోల్ ఎక్సీమ్ సీక్వెన్సింగ్ జెనటిక్ టెస్ట్‌ను అహ్మదాబాద్‌కు పంపించారు. నెలరోజుల స్టడీ అనంతరం వైద్యపరీక్షల నివేదిక రెండురోజుల క్రితం డాక్టర్‌కు అందింది. ఆమెకు కొరియా అకాంటో సైటోసిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్ 13ఎ అనే జీన్ మ్యూటేషన్ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్ చెప్పారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సీజనల్ వ్యాధులు.. కిచెన్ ఫార్మసీతో చెక్ పెట్టండి
ఈ సీజన్ పిల్లలకు పరీక్ష కాలమనే చెప్పాలి. స్కూలు పరీక్షల కంటే ముందు వాతావరణం సీజనల్ టెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు, దగ్గు, వాటి తీవ్రత పెరిగితే ఒళ్లు వెచ్చబడడం తరచూ పలకరించే సమస్యలే. ఏది ఒమిక్రాన్ జలుబో తెలియని ఆందోళన కాలం. అందుకే కిచెన్ ఫార్మసీని సిద్ధంగా ఉంచుకోవాలి. ►జలుబు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. చిన్నారులకు ఆ ఆవిరిని పట్టిస్తే జలుబుతోపాటు దగ్గు తీవ్రత కూడా తగ్గుతుంది. ►పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు రోజుకు రెండుసార్లు తాగించాలి. ►జలుబుతోపాటు గొంతునొప్పి ఉంటే... గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు కలిపి, ఆ నీటితో గార్గిలింగ్ చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు – మూడు సార్లు చేయవచ్చు. ►పదేళ్లు నిండిన పిల్లలకు ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి 10–15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ►ఆరోగ్య సమస్య వచ్చిందంటే పిల్లలకు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేకపోతారు. ఈ కారణంగా నీరసం దరి చేరకుండా ఉండాలంటే... రోజులో రెండు– మూడు సార్లు తేనె చప్పరించాలి. ►జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు గాలిపీలుస్తుంటే ఊపిరితిత్తుల నుంచి గుర్...మనే శబ్దం వస్తుంది. అప్పుడు ఛాతీ మీద ఆవనూనె, వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. అలాగే దేహంలో నీటిశాతాన్ని తగ్గనివ్వకుండా ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి.