ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్
ప్రఖ్యాత తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) తో అనే దీర్గకాలిక వ్యాధితో బాధపడుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాసతీసుకున్నారు.
దీంతో అసలేంటి ఐపీఎఫ్? ఇది అంత ప్రమాదకరమా? చికిత్స లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం.
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?
సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులు లేదా అల్వియోలీ ( ఊపిరితిత్తులలోని చిన్న, సున్నితమైన గాలి సంచులు)గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ పొందడానికి అవి సహాయపడతాయి. వీటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధే ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్.
అమెరికా నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్‌స్టిట్యూట్ (NIH) ప్రకారం, ఇది తీవ్రమైన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది అవయవంలోని గాలి సంచులు లేదా అల్వియోలీ చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు, ఊపిరితిత్తుల కణజాలం మందంగా మారిపోతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
ఈ లక్షణాలు ఇవి మరింత ముదిరి ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లి, రక్తంలోకి, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. అల్వియోలీ గోడలు మందంగా మారి మచ్చలు రావడాన్నే ఫైబ్రోసిస్ అంటారు. అలాగే ఇడియోపతిక్ అంటే ఈ పరిస్థితికి కారణమేమిటో గుర్తించలేకపోవడం. ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం.
కారణాలు
ధూమపానం అలవాటున్న వారికి, ఫ్యామిలీలో అంతకుముందు ఈ వ్యాధి వచ్చిన చరిత్ర ఉన్నా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . సాధారణంగా 60- 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధికనిపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి
లక్షణాలు
ఊపిరి ఆడకపోవడం: మొదట్లో అలసిపోయినపుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవు తుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఏపనీ చేయంకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.విపరీతమైన పొడిదగ్గు
కీళ్ళు ,కండరాలలో నొప్పి
అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం .కారణం లేకుండానే బరువు తగ్గడం
నైల్ క్లబ్బింగ్ అంటే చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు వెడల్పుగా, స్పాంజిలాగా ఉబ్బినట్లుగా అవ్వడంరక్తంలో చాలా తక్కువ ఆక్సిజన్ వల్ల సైనోసిస్, నీలిరంగు చర్మం , నోటి చుట్టూ, చర్మంపైనా, కళ్ల చుట్టూ బూడిద రంగు లేదా తెల్లటిమచ్చలు
ఈ లక్షణాలు కొందరిలో చాలా త్వరగా వ్యాపిస్తాయి. మరికొందరిలో చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. దీర్ఘం కాలం పాటు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
చికిత్స లేదు
ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌కు ప్రస్తుతానికి ఖచ్చితమైన చికిత్స లేదు. అయితే కొన్ని మందులు, ఇతర చికిత్సలు ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడవచ్చు. ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు.
నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే అని గమనించగలరు. వ్యాధి ఏదైనా, నిపుణుల పర్యవేక్షణలో, సంబంధిత వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చికిత్సతీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment