Zakir Hussain
-
మన ఢిల్లీ... మన హెరిటేజ్
ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఢిల్లీ గొప్పదనాలు. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించిన నిర్మాణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్... ఆగ్రా రెడ్‌ఫోర్ట్... ఈ రెండింటికీ గుర్తింపు 1983లో వచ్చింది. కుతుబ్ మినార్... హుమయూన్ సమాధి... వీటికి 1993లో ఆ హోదా వచ్చింది. దేశ రాజస దర్పణం రెడ్‌ఫోర్ట్ మాత్రం... ఈ గౌరవాన్ని 2007లో అందుకుంది.ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించి ‘అరే హుజూర్ వాహ్ తాజ్ బోలియే’ అన్న ప్రకటనను మనదేశంలో దాదాపుగా అందరూ చూసి ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో తాజ్‌మహల్ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకుందాం. రెడ్ఫోర్ట్కి తాజ్ మహల్‌కి ఓ దగ్గరి సంబంధం ఉంది. రెండింటి ఆర్కిటెక్ట్ ఒకరే... అతడే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేటంతటి సౌందర్యం తాజ్‌మహల్‌ది. ఉత్తరప్రదేశ్‌లో కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగా పాతికేళ్ల కిందట తాజ్‌మహల్ గోడలు పసుపురంగులోకి మారాయి. ఆ సమయంలో తాజ్‌మహల్‌ని చూసిన వాళ్లు ఫొటోల్లోనే బాగుందనుకున్నారు. ఇప్పుడు అలాంటి అసంతృప్తి ఉండదు. మనదేశానికి అమెరికా అధ్యక్షుడు (తొలి దఫా అధ్యక్షుడుగా ఉన్న సమయం) డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సందర్భంగా తాజ్‌మహల్‌కి మెరుగులు దిద్దారు. ఇప్పుడు పాలరాయి తెల్లగా మెరుస్తోంది. 42 ఎకరాల్లో నిర్మించిన తాజ్‌మహల్ నిర్మాణం రెడ్‌ఫోర్ట్ నిర్మాణం కంటే ఎనిమిదేళ్లు ముందు మొదలైంది. రెడ్‌ఫోర్ట్ పూర్తయిన తర్వాత ఐదేళ్లకు పూర్తయింది. అంటే 1631– 1653 వరకు 22 ఏళ్లు కట్టారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ముందుకు నడిచే కొద్దీ తాజ్ మహల్‌ను తలెత్తి చూడాలి. తాజ్‌మహల్ నుంచి ఆగ్రాఫోర్ట్, షాజహాన్ ప్యాలెస్ చూడవచ్చు. తాజ్‌మహల్ వెనుక వైపు నుంచి బేస్మెంట్ కిందకు చూస్తే యమునా నది గంభీరంగా ప్రవహిస్తుంటుంది.హుమయూన్ సమాధి భార్య ప్రేమకు చిహ్నం హుమయూన్ కా మఖ్బారా... హుమయూన్సమాధి. మనదేశానికి పర్షియా ఉద్యానవనశైలిని మనకు పరిచయం చేసిన కట్టడం ఇది. మనదేశంలో మొఘల్ వాస్తుశైలిలో నిర్మితమైన తొలికట్టడం. తాజ్ మహల్, హుమయూన్స్ టూంబ్ రెండూ సమాధి నిర్మాణాలే. రెండూ ఆర్కిటెక్చర్ పరంగా గొప్ప కట్టడాలే. తాజ్ మహల్‌ని భార్య జ్ఞాపకార్థం భర్త కట్టించాడు. హుమయూన్ టూంబ్‌ను భర్త జ్ఞాపకార్థం భార్య కట్టించింది. ప్రేమ చిహ్నంగా గొప్ప ప్రమోషన్ రాలేదు, కానీ నిర్మాణపరంగా ఇది కూడా గొప్ప కట్టడమే. హుమయూన్ సమాధి ఢిల్లీ శివార్లలో నిజాముద్దీన్‌లో ఉంది. ఈ సమాధి పైన గుమ్మటం ఎత్తు 42.5 మీటర్లు. ఈ సమాధి మొత్తం నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న గట్టు మీద ఉంటుంది. దాని మీద ఆరు మీటర్లకు పైగా ఎత్తున్న భవనాన్ని నిర్మించారు. ప్రధాన కట్టడం నిర్మాణం మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కూడా ప్రత్యేకమైనదే. మొఘల్ ఉద్యానవన శైలి చార్బాగ్ శైలి ఇందులో కూడా కనిపిస్తుంది. ఈ గార్డెన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నీటి పంపులు, వాటర్ఫౌంటెయిన్లతో ఆధునిక సాంకేతికత కనిపిస్తుంది.హుమయూన్ సమాధి నిర్మాణం క్రీ.శ 1562లో మొదలైంది. ఈ సంగతి తెలియగానే వచ్చే సందేహం ఒక్కటే...∙హుమయూన్ మరణించింది క్రీ.శ 1556 జనవరి 20వ తేదీ. మరి సమాధి అప్పుడు కట్టలేదా అనే ప్రశ్న నిజమే. మరణించిన వెంటనే పురానాఖిలాలో ఖననం చేశారు. కొంతకాలానికి శవపేటికను పెకలించి పంజాబ్ లోని సిర్హింద్కు తీసుకెళ్లారు. రాజ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత హుమయూన్ భార్య హమీదాబేగం (అక్బర్ తల్లి) భర్త జ్ఞాపకార్థం గొప్ప నిర్మాణం చేయాలనుకుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న హుమయూన్ సమాధి. ఈ నిర్మాణం పూర్తవడానికి పదేళ్లు పట్టింది. ఢిల్లీకి ట్రైన్లో వెళ్లేటప్పుడు నగరంలోకి ప్రవేశించడానికి ముందే నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది. సమాధి నిర్మాణం ఎత్తైన బేస్మెంట్ మీద ఉండడంతో ట్రైన్‌లోకి కనిపిస్తుంది.సలామ్ .. రెడ్ ఫోర్ట్మొఘలుల సామ్రాజ్య విస్తరణలో రెడ్ఫోర్ట్ది కీలకమైన స్థానం. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇందులో షాజహాన్ నివసించిన ప్యాలెస్, ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మసీదు, ఇతర ప్యాలెస్‌లు ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణాలే. ఇక్కడున్న దివానీ ఖాస్, దివానీ ఆమ్లు ఆగ్రాఫోర్ట్‌లో ఉన్న వాటికంటే భారీ నిర్మాణాలు. ఈ కోట ్రపాంగణం అంతా కలియదిరిగినప్పుడు ఇంత గొప్పగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీనిని డిజైన్ చేశాడు. ఇందులో ఇండియన్ నిర్మాణశైలితోపాటు పర్షియన్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని కట్టడానికి పదేళ్లు పట్టింది. రాజసాన్ని ప్రదర్శించే ఈ కోట 1648– 1857 వరకు మొఘలుల అధీనంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ స్వాధీనంలోకి వెళ్లింది. స్వాతంత్య్ర సాధనతో మన జాతీయపతాకం ఎగిరింది. అప్పటి నుంచి ఏటా పతాకావిష్కరణ సందర్భంగా టీవీలు, పత్రికల్లో దేశ ప్రజలకు దర్శనమిస్తోంది. నిర్వహణ భేష్!రెడ్‌ఫోర్ట్ నిర్వహణ బాధ్యత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తర్వాత కోట ్రపాంగణం టూరిస్ట్ ఫ్రెండ్లీగా మారింది. నిర్మాణాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చటి లాన్లను మెయింటెయిన్ చేయడంతో ఇక్కడ ఎండాకాలంలో కూడా టూరిస్టులు సౌకర్యంగా తిరుగగలుగుతున్నారు. టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా బాగున్నాయిప్పుడు. అనేక కాంప్లెక్స్‌లను మ్యూజియాలుగా మార్చడం మరొక మంచి పరిణామం. రెడ్‌ఫోర్ట్ టూర్‌ను ఆద్యంతం ఆస్వాదించే క్రమంలోనే ముంతాజ్ మ్యూజియం, ఇండియన్ ఆర్ట్ మ్యూజియం వంటి వాటిని కూడా కవర్ చేయవచ్చు. దిగుడుబావి ఉంది!రెడ్‌ఫోర్ట్ ఆవరణలో ఒక స్టెప్‌వెల్ ఉంది. రెడ్ఫోర్ట్ని ఓ పదేళ్ల కిందట చూసిన వాళ్లు దీనిని గమనించి ఉండకపోవచ్చు. ఈ సారి వెళ్లినప్పుడు మర్చిపోకుండా చూడాలి. అయితే ఈ బావిలోకి దిగడానికి ఏ మాత్రం వీల్లేదు. ఢిల్లీ నగరంలోని అగ్రసేన్‌కీ బావోలీ వంటి కొన్ని స్టెప్వెల్స్లోకి ఒకటి– రెండు అంతస్థుల వరకైనా అనుమతిస్తారు. కానీ ఈ రెడ్‌ఫోర్ట్ స్టెప్వెల్ని పూర్తిగా లాక్ చేసి పైన గ్రిల్ అమర్చారు. నేల మీద నుంచి వంగి చూడాల్సిందే.తొలి ఎర్రకోట ఆగ్రా ఫోర్ట్ఈ ఎర్రకోట ఆగ్రాలో ఉంది. ఢిల్లీ ఎర్రకోట కంటే ముందుది. ఈ కోట యమునాతీరాన తాజ్ మహల్‌కు పక్కన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే తాజ్‌మహల్ అందంగా కనిపిస్తుంది. తాజ్ మహల్ నుంచి ఈ కోట ఠీవిగా కనిపిస్తుంది. ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే ఢిల్లీ రెడ్‌ఫోర్ట్ అన్నవన్నీ ఉన్నాయి. వంద ఎకరాల్లో విస్తరించిన కోట ఇది. దివానీ ఆమ్, దివానీ ఖాస్ వంటి పాలన భవనాలతోపాటు ప్యాలెస్‌లున్నాయి. షాజహాన్ అంత్యకాలంలో నివసించిన ప్యాలెస్ షా బుర్జ్ ఇక్కడే ఉంది. ఈ ప్యాలెస్ నుంచి తాజ్‌మహల్ వ్యూ అందంగా ఉంటుంది. షాజహాన్‌ను కొడుకు ఔరంగజేబు ఖైదు చేశాడని తెలిసినప్పుడు సానుభూతి కలుగుతుంది. కానీ ఈ ప్యాలెస్‌ను చూస్తే రాజు జైల్లో ఉన్నా రాజరికపు సౌకర్యాలేమీ తగ్గవనే వాస్తవం తెలిసి వస్తుంది. అక్బర్ కట్టించిన ‘జహంగీర్ మహల్’ ఒక అద్భుతం. మధ్య ఆసియా నుంచి అక్కడ ప్రసిద్ధులైన వాస్తు శిల్పులను పిలిపించి, స్థానికంగా ఉన్న హిందూ వాస్తుశిల్పులలో నిపుణులను ఎంపిక చేసి అందరి సమష్టి కృషితో గొప్ప నిర్మాణం జరగాలని ఆదేశించాడట. ఆ మేరకే వాళ్లు దీనిని డిజైన్ చేశారట. మొఘలుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. కోట లోపల అక్బర్‌కు విజయం అందించిన ఆయుధాగారం ఉంది. రతన్‌సింగ్ హవేలీ, బెంగాల్మహల్, శీష్‌మహల్, షాజహాన్ మహల్, జహంగీర్ బాత్‌టబ్‌లను చూడడం మరువకూడదు. ఈ ఎర్రకోటలోకి పర్యాటకులను అమర్‌సింగ్ గేట్ నుంచి అనుమతిస్తారు. పాలరాతిలో ఇన్లే వర్క్ ఇక్కడి ప్యాలెస్‌లలోనూ కనిపిస్తుంది. టూర్ ఆపరేటర్లు తాజ్‌మహల్ కంటే ఈ కోటకు తీసుకువెళ్తారు. త్వరగా రాకపోతే తాజ్‌మహల్ చూడడానికి సమయం చాలదని తొందరపెడుతుంటారు. దాంతో పర్యాటకులు ప్రశాంతంగా ఆస్వాదించలేకపోతారు.కుతుబ్ మినార్కుతుబ్మినార్ ఐదు అంతస్థుల కట్టడం. ఢిల్లీ శివారులో మెహ్రౌలీలో ఉంది. దీని నిర్మాణం క్రీ.శ 1199 నుంచి 1220 వరకు అనేక దఫాలుగా జరిగింది. అనంగపాల్ తోమార్ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, కుతుబుద్దీన్ ఐబక్ షంషుద్దీన్ ఇల్‌టుట్ మిష్ వరకు అనేక రాజవంశాల చరిత్రలో ఈ మినార్ది కేంద్రస్థానం. హుమయూన్‌కి అక్బర్‌కి మధ్య కాలంలో షేర్షా సూరి కూడా తన వంతుగా కొన్ని మెరుగులు దిద్దాడు. ఈ 62 మీటర్ల ఎత్తున్న ఈ మినార్‌కు 14వ తతాబ్దంలో ఫిరోజ్‌షా తుగ్లక్ పై అంతస్థును నిర్మించాడు. ఈ నిర్మాణం ఇండో ఇస్లామిక్ సమ్మేళనం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులో అరబిక్ భాషలో రాసిన ఖురాన్ సూక్తులు కనిపిస్తాయి. నిర్మాణంలో వలలాంటి అల్లికల నిర్మాణం పర్షియన్ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. తామర రేకులను పోలిన అంచులు హిందూ నిర్మాణాల శైలికి నిదర్శనం. ఇందులో ఉపయోగించిన ఇటుకలను ఆఫ్గనిస్థాన్ నుంచి తెప్పించారు. ఈ ్రపాంతాన్ని ఏలిన పాలకులందరూ ఈ నిర్మాణానికి ఏదో ఒక సొబగులద్ది చరిత్రలో తమ పేరు కూడా ఉండేటట్లు జాగ్రత్తపడ్డారు.ఐరన్ పిల్లర్ ప్రత్యేక ఆకర్షణకుతుబ్మినార్తోపాటు అనేక కట్టడాలున్నాయి. విశాలమైన ్రపాంగణంలో ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పడానికి వీల్లేని నిర్మాణాల అవశేషాలుంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ శిథిలాలకు రూపమిచ్చే ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కుతుబ్‌మినార్ కట్టడం లాల్ కోట్ శిథిలాల మీద మొదలైందని చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడున్న ఐరన్ పిల్లర్ మరో చారిత్రక గొప్పదనం. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. కానీ తుప్పు పట్టదు. మనదేశంలో లోహశాస్త్రం ఎంత శాస్త్రబద్ధంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏయే లోహాలను ఎంతెంత నిష్పత్తిలో వాడారనే విషయంలో రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనలు చేస్తుంటారు.టూర్ ప్యాకేజ్‌లిలా ఉంటాయి!∙ఢిల్లీకి విమానం లేదా రైల్లో వెళ్లిన తర్వాత లోకల్ టూర్ ప్యాకేజ్ తీసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఢిల్లీ డే టూర్ ప్యాకేజ్లుంటాయి.ఏసీ బస్సు లేదా విడిగా కారు మాట్లాడుకోవచ్చు. కారుకు రోజుకు ఏడు లేదా ఎనిమిది వేలుంటుంది. బస్సులో ఒకరికి వెయ్యి రూపాయలకు అటూఇటూగా ఉంటుంది. ∙ఢిల్లీకి వెళ్లడానికి ముందే నగరంలో చూడాల్సిన ప్రదేశాల జాబితాతోపాటు సిటీ టూర్ మ్యాప్‌ను పరిశీలించాలి. ఏయే ప్రదేశాలను ఒక క్లస్టర్‌గా ప్లాన్ చేసుకోవచ్చనే అవగాహన వస్తుంది. అలాగే ఆయా ప్రదేశాలకు సెలవు దినాల వివరాలను కూడా ఆయా వెబ్సైట్ల ద్వారా నిర్ధారించుకోవాలి.∙ఆహారం విషయానికి వస్తే చోలే–బటూరా, బటర్ చికెన్, జిలేబీ, రబ్రీ ఫాలూదాలను తప్పనిసరిగా రుచి చూడాలి. -
ఇదొక అరుదైన వ్యాధి
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ డిసెంబర్ 15న మరణించారు. ఇందుకు కారణమైన వ్యాధి చాలా అరుదైనది. దాని పేరు ‘ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్’ (ఐపీఎఫ్). ఇడియోతిక్ వ్యాధులంటే... కారణం తెలియని వ్యాధులు అని అర్థం. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కారణం తెలియని వ్యాధులు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.మానవ దేహంలో ఊపిరితిత్తులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఊపిరితిత్తులు కొన్ని లక్షల గాలి సంచులు లేదా వాయు గోళాల (అల్వియోలై)తో నిర్మితమై ఉంటాయి. వాయు గోళాలు ఆక్సిజన్/ కార్బన్ డై యాక్సైడ్ పరస్పర మార్పిడి కేంద్రాలు. ఐపీఎఫ్ వ్యాధిలో వాయుగోళాలూ, వాటి చుట్టూ ఉండే కణజాలాలూ మందంగా తయారై బిగుసుగా తయార వుతాయి. మృదువుగా ఉండే కణజాలాలు మందబడటం (స్కారింగ్/ ఫైబ్రోసిస్/ మచ్చలు బారడం) వల్ల అవి వాయు మార్పిడి సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీని మూలంగా శరీరానికి కావల్సినంత ఆక్సిజన్ సరఫరా జరుగదు. ఈ పరిస్థితి క్రమేణా మరింత పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తగ్గుతుంది. అవసరమైన స్థాయిలో శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆక్సిజన్ సరిపడా అందనపుడు శరీరంలో వివిధ అవయవాలు తమ విధులు నిర్వర్తించలేవు. ఈ వ్యాధి లక్షలో 20 మందికి వచ్చే అవకాశం ఉంది. దీనిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాలు కనిపించినప్పటి నుండి వ్యాధిని గుర్తించేందుకు ఒకటి నుండి మూడు సంవత్సరాలు పడుతుంది. టీబీ, ఐపీఎఫ్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల వ్యాధిని నిర్ధారించడం సంక్లిష్టం. ధూమ పానం చేసే వారిలో, గతంలో ధూమ పానం అలవాటు ఉన్నవారిలో, 50 ఏళ్ల వయసు దాటిన వారిలో, గతంలో కుటుంబంలో ఎవరికయినా ఈ వ్యాధి సోకిన వారిలో ఐపీఎఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో; లోహ, కలప ధూళి వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. వైరల్ ఇన్ఫెక్షన్, జీర్ణకోశ వ్యాధుల వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు.శ్వాసలో ఇబ్బంది, పొడి దగ్గు, ఆయాసం, ఆకస్మికంగా బరువు కోల్పోవడం, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, చేతి మరియు కాలి వేళ్ళు గుండ్రంగా మారడం, ఆకలి మందగించడం, ఉమ్మిలో తెమడ, దగ్గినప్పుడు రక్తం పడటం, ఛాతీలో నొప్పి, గురక వంటి లక్షణాలు క్రమేణా పెరిగి శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. రోజు వారీ పనులు కూడా నిర్వర్తించలేని స్థితి వస్తుంది. చివరికి ప్రాణాంతకంగా మారుతుంది. రెండు వారాల కన్నా ఎక్కువగా పై లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.ఊపిరితిత్తుల సీటీ స్కాన్, రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, నడక సామర్థ్య పరీక్ష, బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. వివిధ రకాల ఔషధాలు ప్రయోగాత్మకంగా వాడుతున్నప్పటికీ కచ్చితమైన చికిత్సా విధానం అందుబాటులో లేదు. కృత్రిమంగా ఆక్సిజన్ అందించడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అరుదైన కేసులలో ఊపిరితిత్తుల మార్పిడి చేస్తారు. – డా‘‘ అనుమాండ్ల వేణుగోపాల రెడ్డి ‘ 99481 06198 -
జాకిర్ హుస్సేన్‌కు ఘనంగా అంతిమ వీడ్కోలు
న్యూయార్క్: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ పార్థివ దేహాన్నిఅమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖననం చేశారు. ఫెర్న్‌వుడ్ సిమెట్రీలో గురువారం ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడికి సమీపంలో జరిగిన సంతాప కార్యక్రమంలో శివమణి తదితర కళాకారులు డ్రమ్స్‌తో జాకిర్ హుస్సేన్‌కు సంగీత నివాళులరి్పంచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్(73) సోమవారం శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూయడం తెలిసిందే. ఆయనకు తుది వీడ్కోలు పలికిన వారిలో కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు సంగీత కళాకారులు, సంగీత ప్రేమికులు మొత్తం 300 మంది వరకు హాజరయ్యారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. పద్మ విభూషణ్ గ్రహీత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ పార్థివ దేహంపై భారత జాతీయ పతాకాన్ని కప్పి, భారత ప్రభుత్వం, ప్రజల తరఫున నివాళులర్పించారు. జాకిర్ హుస్సేన్ భార్య ఆంటోనియా మిన్నెకొలా, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన నిజమైన మేధావి జాకిర్ హుస్సేన్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు. పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐఎఎఫ్సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు. -
జాకీర్ హుస్సేన్ ఉసురు తీసిన ప్రాణాంతక వ్యాధి, ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రఖ్యాత తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) తో అనే దీర్గకాలిక వ్యాధితో బాధపడుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాసతీసుకున్నారు.దీంతో అసలేంటి ఐపీఎఫ్? ఇది అంత ప్రమాదకరమా? చికిత్స లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులు లేదా అల్వియోలీ ( ఊపిరితిత్తులలోని చిన్న, సున్నితమైన గాలి సంచులు)గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ పొందడానికి అవి సహాయపడతాయి. వీటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధే ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్.అమెరికా నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NIH) ప్రకారం, ఇది తీవ్రమైన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది అవయవంలోని గాలి సంచులు లేదా అల్వియోలీ చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు, ఊపిరితిత్తుల కణజాలం మందంగా మారిపోతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఇవి మరింత ముదిరి ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లి, రక్తంలోకి, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. అల్వియోలీ గోడలు మందంగా మారి మచ్చలు రావడాన్నే ఫైబ్రోసిస్ అంటారు. అలాగే ఇడియోపతిక్ అంటే ఈ పరిస్థితికి కారణమేమిటో గుర్తించలేకపోవడం. ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం.కారణాలుధూమపానం అలవాటున్న వారికి, ఫ్యామిలీలో అంతకుముందు ఈ వ్యాధి వచ్చిన చరిత్ర ఉన్నా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . సాధారణంగా 60- 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధికనిపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయిలక్షణాలుఊపిరి ఆడకపోవడం: మొదట్లో అలసిపోయినపుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవు తుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఏపనీ చేయంకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.విపరీతమైన పొడిదగ్గుకీళ్ళు ,కండరాలలో నొప్పిఅలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం .కారణం లేకుండానే బరువు తగ్గడంనైల్ క్లబ్బింగ్ అంటే చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు వెడల్పుగా, స్పాంజిలాగా ఉబ్బినట్లుగా అవ్వడం రక్తంలో చాలా తక్కువ ఆక్సిజన్ వల్ల సైనోసిస్, నీలిరంగు చర్మం , నోటి చుట్టూ, చర్మంపైనా, కళ్ల చుట్టూ బూడిద రంగు లేదా తెల్లటిమచ్చలుఈ లక్షణాలు కొందరిలో చాలా త్వరగా వ్యాపిస్తాయి. మరికొందరిలో చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. దీర్ఘం కాలం పాటు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చికిత్స లేదుఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌కు ప్రస్తుతానికి ఖచ్చితమైన చికిత్స లేదు. అయితే కొన్ని మందులు, ఇతర చికిత్సలు ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడవచ్చు. ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే అని గమనించగలరు. వ్యాధి ఏదైనా, నిపుణుల పర్యవేక్షణలో, సంబంధిత వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చికిత్సతీసుకోవాల్సి ఉంటుంది. -
Wah Ustad Wah: జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్
‘‘ఎంతటి కళాకారుడైనా.. ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగానే ఉండాలి’’.. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పే మాట ఇది. మూడేళ్ల వయసుకే తబలాపై చిట్టి చేతులేసి.. ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి.. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు.. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సంగీత ప్రయాణం ముగిసింది. జాకీర్ హుస్సేన్ మరణంతో.. ఆయన జ్ఞాపకాలను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఆయన నేపథ్యం, ఆయన పరిచయాలు, ఆసక్తికర ఘటనలు.. ఇలా ఎన్నింటినో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ తబలా విద్వాంసుడు.. చివరి పోస్టుగా ‘అద్భుతమైన క్షణం’ ఉంచారు. View this post on Instagram A post shared by Zakir Hussain (@zakirhq9)ఈ అక్టోబర్‌లో అమెరికాలో ఉన్న ఆయన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రకృతి వీడియోను స్వయంగా చిత్రీకరించి షేర్ చేశారాయన. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఓ గురువు నేర్పడం కాదు.. ఓ విద్యార్థి నేర్చుకోవడం అనేది ముఖ్యం. గురువును ఆ విద్యార్థి నేర్పే విధంగా ఇన్స్పైర్ చేయాలి. అంటూ ఆయన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే.. నా మొదటి గురువు నా తండ్రే. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. ఓ కళాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు.గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామన్నారు. వారి మాటలు నాలో స్ఫూర్తినింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను.. అని జాకీర్ హుస్సేన్ మాటలు ‘‘వహ్ ఉస్తాద్ వహ్..’’ అని నెటిజన్లతో అనిపిస్తున్నాయి.క్లిక్ చేయండి: ఇక సెలవు మిత్రమా.. చితి వద్ద జాకీర్ హుస్సేన్ కన్నీళ్లు -
తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూత
-
సినిమా కథలా జాకీర్ హస్సేన్ ప్రేమ వివాహం
ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీత స్వరకర్త జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఏడేళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు జాకీర్ హుస్సేన్ వృత్తిపరమైన విజయాల గురించి తెలుసుకానీ, అతని వ్యక్తిగత వివరాలు అంతగా తెలియదు. జాకీర్ హుస్సేన్ ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది.జాకీర్ హుస్సేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్‌గా వ్యవహరించారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియాలు తొలిసారిగా 70వ దశకం చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్‌లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు.జాకీర్ మొదటి చూపులోనే ఆంటోనియాను ఇష్టపడ్డారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ ఆంటోనియా మిన్నెకోలా.. జాకీర్ హుస్సేన్‌ను ప్రేమించే విషయంలో వెనుకాడారు. అయితే జాకీర్ ఆమె కోసం ప్రతిరోజూ తరగతి గది బయట వేచి ఉండేవాడు. జాకీర్, ఆంటోనియాలు ఎనిమిదేళ్లు స్నేహం కొనసాగించిన అనంతర వివాహం చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలంపాటు డేటింగ్ చేశారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల వారికి తెలుసు.ఆ సమయంలో జాకీర్‌కు సరైన ఆదాయం లేకపోవడంతో ఆంటోనియా తండ్రి ఈ వివాహానికి అభ్యంతరం తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగానే జాకీర్, ఆంటోనియాలు 1979లో పెళ్లి చేసుకున్నారు. జాకీర్ ఒక ఇంటర్య్యూలో తాను తన కుటుంబంలోనివారికి భిన్నంగా మతాంతర వివాహంచేసుకున్నానని తెలిపారు. ఆంటోనియాను తాను వివాహం చేసుకుంటానంటే తన తల్లి అందుకు నిరాకరించారని, అయితే తన తండ్రి తమ రహస్య వివాహానికి సహకరించారని జాకీర్ వివరించారు. తరువాతి కాలంలో తన తల్లి ఆంటోనియాను కోడలిగా అంగీకరించారని తెలిపారు.జాకీర్ హుస్సేన్, ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆంటోనియా అమెరికాలో ఉంటూ తమ కుమార్తెలను చూసుకుంటున్నారని గతంలో జాకీర్ తెలిపారు. జాకీర్ కెరియర్ కోసం, ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరియర్ను వదులుకున్నారు. జాకీర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా సదాచార లక్షణాలు నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం
న్యూఢిల్లీ: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజులుగా బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించినట్టు వార్తలొచ్చాయి. జాకీర్ హుస్సేన్ సన్నిహితుడు, ప్రముఖ వేణువాద కళాకారుడు రాకేశ్ చౌరాసియా కూడా తొలుత దాన్ని ధ్రువీకరించారు. కాసేపటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశం సంగీత ధ్రువతారను కోల్పోయింది. సంగీత ప్రపంచానికి ఆయన సేవలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. విపక్ష నేత రాహుల్ గాం«దీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులు సంతాపం తెలిపారు. కానీ జాకీర్ హుస్సేన్ మృతి వార్తలను ఆయన సోదరి ఖుర్షీద్ ఖండించారు. ‘‘నా సోదరుని పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్న మాట నిజమే. కానీ ప్రస్తుతానికి ఆయన ప్రాణాలతోనే ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘జాకీర్ హుస్సేన్ మరణించారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలు మమ్మల్నెంతో బాధిస్తున్నాయి. వాటిని నమ్మొద్దని మీడియాకు, ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కోలుకోవాలని అంతా ప్రారి్థంచాల్సిందిగా కోరుతున్నాం’’ అని పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు మార్చినట్టు ఆయన మేనేజర్ నిర్మలా బచానీ కూడా పేర్కొన్నారు. కాసేపటికే ఐ అండ్ బీ శాఖ కూడా ఎక్స్‌లో చేసిన సంతాప పోస్ట్‌ను తొలగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి: బహుముఖ సంగీత ప్రజ్ఞకు జాకీర్ హుస్సేన్ నిలువెత్తు నిదర్శనం. హిందూస్తానీ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు జాజ్ ఫ్యూజన్లోనూ తిరుగులేని నైపుణ్యం సాధించారు. గ్రేటెస్ట్ తబలా ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్‌లో ఒకరిగా నిలిచారు. సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్ కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. ఆయన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు. 1951 మార్చి 9న ముంబైలో జని్మంచిన ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. తండ్రి బాటలో నడుస్తూ ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్ హుస్సేన్ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. -
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
గ్రామీ అవార్డుల పంట!
సంగీతం ఎల్లలెరుగదు. అది విశ్వభాష. ఏ ప్రాంతానిదో తెలియదు... ఎవరు మాట్లాడే భాషో తెలియదు... కనీసం దాని భావమేమిటో కాస్తయినా అర్థంకాదు. కానీ శ్రుతిలయలు జతకలిసి హృదయాలను స్పృశించినప్పుడు ఆ రాగలహరిలో మునకేయని మనిషంటూ వుండరు. అందుకే ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల ఉత్సవంలో మన సంగీత దిగ్గజాలు జకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, రాకేష్ చౌరాసియా అవార్డుల పంట పండించారు. విఖ్యాత తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ ఏకంగా మూడు పురస్కారాలు అందుకున్నారు. నిరుడు జూన్‌లో శక్తి బ్యాండ్ తరఫున విడుదలైన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు శంకర్ మహదేవన్‌తో కలిసి ఆయనకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ పురస్కారం లభించగా, సొంతంగా రూపొందించిన ‘యాజ్ వి స్పీక్’ ఆల్బమ్‌కు పాష్తో కేటగిరిలో మరో రెండు పురస్కారాలొచ్చాయి. ఇదే ఆల్బమ్‌కు ఫ్లూటు అందించిన రాకేష్ చౌరాసియాకు సైతం రెండు అవార్డులొచ్చాయి. ఎనిమిది గీతాలతో రూపొందించిన ‘దిస్ మూమెంట్’కు శంకర్ మహదేవన్ గాత్రం సమకూర్చగా, జకీర్ తబలా, జాన్ మెక్లాగ్లిన్ గిటార్, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ రాగాలు అందించారు. శక్తి బ్యాండ్ విలక్షణమైనది. దాని స్థాపన వెనకున్న ఉద్దేశాలు ఉన్నతమైనవి. 1973లో మెక్ లాగ్లిన్ నేతృత్వంలో అవతరించిన ఆ బృందం ఖండంతరాల్లోని సంగీత దిగ్గజాలను ఒక దరికి చేర్చి ప్రాచ్య, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తరతరాలుగా ప్రపంచ సంగీత ప్రియులను అబ్బురపరుస్తోంది. ఇప్పుడు గ్రామీ పుర స్కారాల ఉత్సవంలో ఎందరో సంగీత దిగ్గజాల సృజనను దాటుకుని ‘దిస్ మూమెంట్’ విజేతగా నిలిచిందంటే అది సాధారణమైనది కాదు. నిజానికి శక్తి బ్యాండ్ ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి దాదాపు 45 ఏళ్లవుతోంది. అనంతరం నిరుడు ‘దిస్ మూమెంట్’ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. జకీర్ హుస్సేన్ గ్రామీ అందుకోవటం ఇది మొదటిసారి కాదు. 1992, 2009లలో కూడా గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నాడు. అరవై ఆరేళ్ల గ్రామీ పురస్కారాల చరిత్రలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1967లో తొలిసారి ఆ అవార్డు గెలుచుకుని భారత సంగీతానికి ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను 1972, 2001 సంవత్సరాల్లోనూ గ్రామీ అవార్డులు వరించాయి. 2008లో ఏఆర్ రెహమాన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు గ్రామీ అవార్డులు గెలుచుకోగా మన దేశానికి ఒకేసారి ఆరు పురస్కారాలు లభించటం ఇదే తొలిసారి. విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడిగా జకీర్ హుస్సేన్‌కు ఆ విద్య చిన్ననాడే పట్టుబడింది. పట్టుమని పన్నేండళ్ల ప్రాయానికే దేశదేశాల్లోనూ కచేరీలు ఇవ్వగలిగాడు. ఇరవయ్యేళ్ల వయసుకే ఏటా 150 సంగీత కచేరీలు నిర్వహించేంత తీరికలేని విద్వాంసుడు కావటం జకీర్ ప్రత్యేకత. 70వ దశకంలో ప్రపంచాన్ని విస్మయపరిచిన బీటిల్స్ బృందంతో జతకట్టి అందరితో ఔరా అనిపించుకున్నాడు. సంగీతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందటమే కాదు... ప్రిన్స్టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించి ఎందరినో తీర్చిదిద్దిన ఘనత జకీర్ది. తాను ప్రపంచంలో ఉత్తమ తబలా విద్వాంసుణ్ణి కాదని, ఎందరో విద్వాంసుల్లో ఒకడిని మాత్రమేనని చెప్పుకొనే వినమ్రత జకీర్ సొంతం. తనకు తబలా నేర్పాలని ఏడేళ్ల వయసులో తండ్రి అల్లారఖాను అడిగినప్పుడు ‘బేటా ఇందులో నిష్ణాతుణ్ణి కావాలని అత్యాశపడకు. ఒక మంచి విద్యార్థిగా ఎదగాలని కోరుకో. అప్పుడు మెరుగ్గా తయారవు తావు’ అని సలహా ఇచ్చారట. తండ్రికిచ్చిన మాట ప్రకారం రోజూ తెల్లారుజామున మూడు గంట లకు లేచి తబలా వాద్యంలో మెలకువలు నేర్చుకోవటం ఆయన ప్రత్యేకత. తాను పుట్టిపెరిగిన ముంబై నగరంలో అందరూ గాఢనిద్రలో వుండేవేళ ఆయన సంగీత సాధన మొదలయ్యేది. అందుకే మరో అయిదేళ్లకే కచేరీలు చేసే స్థాయికి జకీర్ ఎదిగాడు. ఈ కళలో మరేదో నేర్చుకోవాలన్న నిరంతర తపన, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవటం అనే గుణాలే జకీర్‌ను ఉన్నత శిఖరా లకు చేరుస్తూ వచ్చాయి. తన సంగీతయానంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్వాంసులను కలుసు కునే అవకాశం లభించటం, వారినుంచి ఎన్నో సంగతులు నేర్చుకోవటం తన ఉన్నతికి దోహద పడ్డాయంటారు జకీర్. కొందరు సంగీత విద్వాంసులు అభిప్రాయపడినట్టు ఆయన సృష్టించిన మేళనాలు వాటికవే విప్లవాత్మకమైనవి కాదు. కానీ తన వాద్యంపై ఆయన సాధించిన అసాధారణ మైన పట్టు, సంక్లిష్ట స్వరాల మలుపులకు అనుగుణంగా అలవోకగా తబలాను పలికించటం, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవటం జకీర్ విశిష్టత. ఒక సంగీతకారుడన్నట్టు కళాత్మకమైన సృజనే సంగీత నియమాలను సృష్టిస్తుంది. నిబంధనలు సంగీతాన్నీ, సంగీతకారులనూ సృజించలేవు. జకీర్ అయినా, గుక్కతిప్పుకోకుండా ఎంతటి సంక్లి ష్టమైన స్వరాలనైనా ఏకబిగిన పలికించగల శంకర్ మహదేవన్ అయినా, వేణుగాన విన్యాసంలో పేరుప్రఖ్యాతులు గడించిన రాకేష్ చౌరాసియా అయినా గాల్లోంచి ఊడిపడరు. ఎప్పటికప్పుడు తమను తాము ఉన్నతపరుచుకోవాలన్న తపన, నిరంతర అధ్యయన శీలత వారిని ప్రపంచంలో ఉత్త ములుగా నిలుపుతాయి. ఏ రంగంలో ఎదగదల్చుకున్నవారికైనా దగ్గరదారులంటూ ఉండవు. సంగీత ప్రపంచాన మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన ఈ ముగ్గురూ రాగలకాలంలో ఎందరికో ఆదర్శనీయులవుతారు. -
Grammy Awards 2024: రీసౌండ్ చేసిన శక్తి బ్యాండ్.. 46 ఏళ్లలో తొలిసారి..
అంతర్జాతీయ వేదికపై మనవాళ్లు మరోసారి సత్తా చాటారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల(Grammy Awards 2024)ను శక్తి మహదేవన్, జాకీర్ హుస్సేన్ ఎగరేసుకుపోయారు. వీరి బ్యాండ్‌లో రిలీజైన 'దిస్ మూమెంట్'కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా గ్రామీ పురస్కారం వరించింది. అలాగే పాస్‌తో పాట, ఆజ్ వి స్పీక్ ఆల్బమ్కుగానూ జాకీర్ హుస్సేన్(తబల), రాకేశ్ చౌరాసియా(ఫ్లూటు) మరో రెండు అవార్డులు గెలుచుకున్నారు. సోమవారం నాడు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 69వ గ్రామీ అవార్డు వేడుకలు జరిగాయి. భారతీయ కళాకారులకు మూడు అవార్డులు రావడంతో అభిమానులు, సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గ్రామీ విజేత కాగా జాకీర్ హుస్సేన్ 2009లో గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ ఆల్బమ్కుగానూ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏకంగా మూడు (ఇందులో రెండు రాకేశ్‌తో కలిసి తీసుకున్నవి) పురస్కారాలు అందుకోవడంతో ఆయన్ను అభినందిస్తున్నారు. 'గ్రామీ' అందుకున్న దిస్ మూమెంట్ పాటను శంకర్ మహదేవన్(సింగర్), జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. శక్తి బ్యాండ్ ఏర్పడింది అప్పుడే! కాగా శక్తి బ్యాండ్ 1973లో ఏర్పాటైంది. మొదట్లో దీనికి మహావిష్ణు ఆర్కెస్ట్రా అన్న పేరు ఉండేది. వీరు భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని ప్రధానంగా వాయించేవారు. అప్పట్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యాండ్ ఎన్నో కచేరీలు నిర్వహించింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత అదే 'శక్తి' బ్యాండ్ పేరిట దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులను ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్‌లో శ్రీని డ్రీమ్, బెండింగ్ రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పల్మాస్, చంగై నైనో, సోనో మామ అనే పాటలు ఉన్నాయి. Congrats Best Global Music Album winner - 'This Moment' Shakti. #GRAMMYs 🎶 WATCH NOW https://t.co/OuKk34kvdu pic.twitter.com/N7vXftfaDy — Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 4, 2024 చదవండి: 12th ఫెయిల్ దర్శకుడి భార్యపై కంగనా ఫైర్ -
గ్రామీ అవార్డ్స్: ‘శక్తి’ బ్యాండ్ సత్తా, దిగ్గజాల సెల్ఫీ వైరల్
#AR Rahmancelebrates 'Raining Grammys'ప్రతిష్టాత్మక 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024లో భారత్ సత్తా చాటింది. ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ దిగ్గజ సంగీత విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ , సెల్వగణేష్ వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్‌తో కూడిన సూపర్ గ్రూప్ ‘శక్తి’ బ్యాండ్ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి దక్కడం విశేషం శక్తి బ్యాండ్ ఆవిర్భావం మహావిష్ణు ఆర్కెస్ట్రా రద్దు తరువాత 1973లో ఫ్యూజన్ బ్యాండ్, శక్తి బ్యాండ్ ఏర్పడింది. ఇందులో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(తబ్లా) ప్రముఖ సింగర్ శంకర్ హదేవన్,గిటారిస్ట్ జాన్ మెక్లాఫ్లిన్, వి సెల్వగణేష్ , వయోలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ వంటి ప్రఖ్యాత కళాకారులున్నారు. చాలా ఏళ్ల తరువాత 2020లో దీన్ని సంస్కరించారు. అలాగే మూడేళ్ల తరువాత తొలి ఆల్బమ్ ‘దిస్ మూమెంట్’జూన్ 23, 2023లో రిలీజ్ అయింది. తాజా ఆల్బమ్‌లో శ్రీనిస్ డ్రీమ్, బెండింగ్ ద రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పాల్మాస్‌తో సహా 8 ట్రాక్‌లు ఉన్నాయి. గ్రామీ అవార్డుపై శుభాకాంక్షలు తెలిపిన అస్కార్ విన్నర్ మ్యూజిక్ మాస్ట్రో ఏర్ రెహమాన్ ఇండియాకు గ్రామీ అవార్డుల వర్షం కురుస్తోందంటూ ఇన్‌స్టాలో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. మాజీ గ్రామీ విజేత కూడా అయిన రెహ్మాన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ,వితో కలిసి ఉన్న సెల్ఫీని షేర్ చేశారు. అటు గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సంగీత కుటుంబానికి, ఫ్యాన్స్‌తోపాటు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని అభినందనల్లో ముంచెత్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఘనాపాటీ ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండవ గ్రామీని గెలుచుకున్నారని పేర్కొన్నారు .దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso — Ricky Kej (@rickykej) February 4, 2024 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి బ్యాండ్‌కు చెందిన పాష్టో పాట ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా గౌరవనీయమైన గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. పాష్టోకు చెందిన యాస్ వి స్పీక్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బమ్ అవార్డు కూడా గెలుచుకుంది. అంతేకాదు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని హర్షం
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకీర్ హుస్సేన్(తబలా),శంకర్ మహదేవన్ (సింగర్)లు ఉన్న శక్తి బ్యాండ్‌కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Congratulations @ZakirHtabla, @Rakeshflute, @Shankar_Live, @kanjeeraselva, and @violinganesh on your phenomenal success at the #GRAMMYs! Your exceptional talent and dedication to music have won hearts worldwide. India is proud! These achievements are a testament to the hardwork… — Narendra Modi (@narendramodi) February 5, 2024 దిస్ మూమెంట్ పాటను జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్(సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతకు ముందు.. శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రాణమిత్రుడి పాడె మోసిన ఉస్తాద్ జకీర్ హుస్సేన్
ముంబై: భారత సంగీత విద్వాంసుడు.. సంతూర్ వాయిద్యాకారుడు పండిట్ శివకుమార్ శర్మ మరణం సంగీత ప్రపంచంలో తీరని విషాదం నింపింది. 84 ఏళ్ల సంతూర్ దిగ్గజం మే 10వ తేదీన గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆ మరుసటి రోజే ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే అంత్యక్రియల్లో ఓ ప్రముఖుడి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయనెవరో కాదు.. తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్(71). శివకుమార్ శర్మ, జకీర్ హుస్సేన్‌లు సంయుక్తంగా ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. వయసులో తేడాలున్నా.. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడి అంత్యక్రియలు జకీర్ హుస్సేన్ హజరయ్యారు. అంతేకాదు.. శివకుమార్ పాడె మోసిన జకీర్ హుస్సేన్.. అంత్యక్రియల సమయంలోనూ ఒంటరిగా కాసేపు చితి వద్దే ఉండిపోవడం కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ అంత్యక్రియలు ప్రముఖులెవరూ హాజరుకాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా తమ నివాళులు అర్పించారు. చదవండి: ‘సంతూర్' శివకుమార్ శర్మ కన్నుమూత.. నేపథ్యం ఏంటంటే.. -
నాలుగు రోజుల్లోనే మారిన కోచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్వాన్న పనితీరుకు మరో నిదర్శనం! దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హెచ్‌సీఏ శనివారం 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే గత మంగళవారమే జట్టు కోచ్‌గా రంజీ మాజీ ప్లేయర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేసిన హెచ్‌సీఏ ఇంతలోనే అతడిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌ను కొత్త కోచ్‌గా ప్రకటించింది. టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్‌లకు అనిరుధ్ హాజరయ్యాడు కూడా. కానీ హెచ్‌సీఏ పెద్దల ప్రాధాన్యాలు మారిపోయాయి. అనిరుధ్ కోచ్‌గా పనికి రాడంటూ అతడిని పక్కన పెట్టేశారు. జట్టు ఎంపికలో తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడమే కోచ్‌గా అనిరుధ్ చేసిన తప్పని తెలుస్తోంది! గత సీజన్లో కూడా అండర్–19 కోచ్‌గా వ్యవహరించిన అనిరుధ్‌ను సీజన్ మధ్యలోనే తప్పించింది. మరోవైపు కెప్టెన్‌గా మళ్లీ తన్మయ్ అగర్వాల్‌నే హెచ్‌సీఏ నియమించింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో అతని సారథ్యంలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు చిత్తుగా ఓడినా ‘తమవాడు’ కాబట్టి మరోసారి కెప్టెన్సీని అప్పగించింది. జట్టు వివరాలు: తన్మయ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిరథ్ రెడ్డి, హిమాలయ్, సందీప్, రాహుల్ బుద్ధి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సుమంత్, మిలింద్, టి.రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్, యుధ్వీర్ సింగ్, తనయ్ త్యాగరాజన్, మికిల్ జైస్వాల్, హితేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్, ప్రతీక్ రెడ్డి, రక్షణ్, కార్తికేయ, ఎంఎస్ఆర్ చరణ్. -
కత్తెర పురుగుకు కళ్లెం
మొక్కజొన్నను ఖరీఫ్‌లో ఆశించిన ఫామ్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు) తెలుగు రాష్ట్రాల్లో జొన్నకూ పాకింది. మొక్కజొన్నను అమితంగా ఇష్టపడే ఈ లద్దెపురుగు ఆ పంట అందుబాటులో లేనప్పుడు ఇతరత్రా 80 రకాల పంటలకు పాకే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. చాలా ఏళ్లుగా అమెరికా, ఆఫ్రికాలలో పంటలను ఆరగిస్తున్న ఈ పురుగు మన దేశంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చాలా రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇది మొక్కజొన్న పంటను ఆశించింది. మొక్కజొన్న నుంచి కొన్ని చోట్ల జొన్నకు, ఇతర రాష్ట్రాల్లో చెరకుకు కూడా పాకినట్లు చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులతో ప్రయోజనం లేదని, కషాయాలు, మట్టి ద్రావణం, రాక్ డస్ట్ వంటి రసాయనికేతర పద్ధతుల ద్వారానే సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని, రైతులు భయపడ వద్దని ఏపీలో పర్యటిస్తున్న ఎఫ్.ఎ.ఓ.కి చెందిన సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ, రైతు సాధికార సంస్థలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కత్తెర పురుగు వల్ల దిగుబడి నష్టాన్ని నిలువరించడవచ్చంటున్నారు. అంతరపంటలు, కంచె పంటగా నేపియర్ గడ్డి మొక్కజొన్న, జొన్న పొలాల్లో ఖచ్చితంగా అంతరపంటలు వేయటం మేలన్నారు. రబీలో మొక్కజొన్న వేస్తున్న రైతులు 2 సాళ్లు మొక్కజొన్న, 1 సాలు మినుము/పెసర అంతరపంటలుగా వేసుకోవాలి. కంచె పంటగా నేపియర్ గడ్డిని 4 వరుసలు వేసుకోవాలని డాక్టర్ జాకీర్ హుస్సేన్ సూచించారు. అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్.. ఈ పురుగు సోకిన మొక్కజొన్న మొక్కల మొవ్వుల్లో అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్ వేయడం, నీమాస్త్రం, వేపగింజల కషాయం (మార్కెట్లో అమ్మే వేపనూనె అంత బాగా పనిచేయటం లేదు) పిచికారీ ద్వారా ప్రకృతి వ్యవసాయదారులు కత్తెర పురుగు వ్యాప్తిని ఖరీఫ్‌లో సమర్థవంతంగా అరికట్టి, దిగుబడి నష్టాన్ని నివారించుకోగలిగారన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు పురుగు సోకగానే దున్నేశారని డా. జాకీర్ హుస్సేన్ తెలిపారు. కత్తెర పురుగు లేత ఆకులను తినేస్తుందని, కండెలను ఏమీ చేయదని అంటూ ఇది కనిపించగానే రైతులు తోటలను తొలగించాల్సిన పని లేదన్నారు. గుడ్డు దశలో ఉన్నప్పుడు గుడ్లను ఆకులపై గుర్తించి, నలిపేసి నిర్మూలించుకోవడం మంచిదన్నారు. విష ముష్టి (నక్స్ వామిక) కాయలను ముక్కలు కోసి 5 రోజులు మురగబెట్టి.. 10 లీటర్ల నీటికి చిన్న గ్లాసుడు చొప్పున ఇది చల్లాలని ఆయన తెలిపారు. పంచదార పొలంలో చల్లితే చీమలు వచ్చి ఈ పురుగులను తినేస్తాయి. 16 లీటర్ల స్రేయర్ ట్యాంకు నీటిలో 20 గ్రాముల పంచదార కలిపి పంటపై పిచికారీ చేస్తే.. ఈ తీపికి వచ్చే చీమలు పురుగులను తినేస్తాయని డా. జాకీర్ హుస్సేన్(88268 97278) అన్నారు. ఇప్పట్లో నిర్మూలించలేం: ఎఫ్.ఎ.ఓ. ‘కత్తెర పురుగు చాలా ఏళ్ల నుంచే అమెరికా, ఆఫ్రికా సహా 60 దేశాల్లో ఉంది. భారత్‌లో అనేక దక్షిణాది, ఉత్తరాది రాష్టాలకు ఈ ఏడాది పాకింది. మొక్కజొన్న, జొన్న, చెరకుకు కూడా సోకింది. ఒకేసారి తుడిచిపెట్టడలేం. చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కానీ, జీవన పురుగుమందులు, ఎర్రమట్టి ద్రావణం, బయో పెస్టిసైడ్స్ తదితరాలతో అదుపు చేసుకోవచ్చు. రసాయనిక పురుగుమందులు చల్లితే సమస్య తీరదు. ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతుల ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించగలుగుతున్నట్లు రైతుల పొలాల్లో జరిపిన అధ్యయనంలో గుర్తించాం..’ అని ఎఫ్.ఎ.ఓ. సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ(70427 22338) వివరించారు. డా. జాకీర్ హుస్సేన్, అన్నే సోఫీ -
మనిషి గుణ రాగం అంధాధున్
ఏదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు.. మన ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది... అంధాధున్ సినిమా ఫిలాసఫీ ఇదే! ఎవరి కోసం ఎవరూ ఉండరు. ఎవరి స్వార్థం వాళ్లదే. మనుషుల్లోని ఈ కోణానికే 24 క్రాఫ్ట్స్‌ను అద్ది తెరమీద ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘బదలాపూర్’ (ఆయన తీసినదే) సినిమా బిగినింగ్లాగే ‘అంధాధున్’ బిగినింగ్ కూడా మిస్ కాకూడదు. ఈ బిగిని తగిన వ్యవధి వరకూ లాగాడు కాని సినిమా ప్రారంభంలో వేసిన టైటిల్స్‌లో ‘‘లైఫ్.. డిపెండ్స్ ఆన్ ఇట్స్ లివర్’’ ముక్కకే సాగదీస్తే కానీ కనెక్టివిటీ దొరకలేదు. అయినా ఉత్కంఠ తగ్గదు. అంత టైట్‌గా ఉంది స్క్రీన్‌ప్లే. కథ.. సంగీత కళాకారులకు జ్ఞానేంద్రియ లోపం శాపం కాదు.. ఏకాగ్రతను కుదిర్చే వరం! అందుకే బెథోవెన్ సంగీతబ్రహ్మ అయ్యాడు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తన ప్రయాణాన్నీ మొదలుపెడ్తాడు ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా). అయితే గుడ్డివాడిగా! అతను పియానో వాద్యకారుడు. అద్భుతమైన ట్యూన్‌తో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొని .. తర్వాత లండన్ వెళ్లిపోయి స్వరప్రయోగాలతో కాలక్షేపం చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ ఆశను నెరవేర్చుకునే దిశలో అనూహ్య మలుపుల్లో చిక్కుకుంటాడు. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త ఆపదలను ఎదర్కొంటుంటాడు. అన్నిటినీ జయించుకుంటూ అనుకున్నది సాధిస్తాడా? గుడ్డివాడిగానే మిగిలిపోయి అంధాధున్ (గుడ్డి రాగం) పాడుకుంటాడా? ఎండ్ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే! ఈలోపు కొన్ని సీన్స్ గురించి తెలుసుకుందాం. కథా ప్రదేశం.. పుణె. మధ్య తరగతివాళ్లుండే ప్రభాత్ నగర్లో ఉంటుంటాడు హీరో. సంగీతం మీద కాన్సంట్రేషన్ కుదరడానికి గుడ్డితనాన్ని టూల్‌గా వాడుకుంటాడు. ఒకరోజు యాక్సిండెటల్గా.. లిటరల్లీ యాక్సిడెంటల్‌గానే కలుస్తుంది సోఫీ (రాధికా ఆప్టే). ఆమె ఓ క్లబ్ ఓనర్ కూతురు. ఆ యాక్సిడెంట్లోనే ఆకాశ్ పియానో ప్లేయర్ అని తెలుస్తుంది. తమ క్లబ్‌కి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. ఆ క్లబ్లో పియానో వాయించే ఉద్యోగం ఇస్తాడు ఆమె తండ్రి. ఆ రోజు సాయంకాలం సోఫీ .. ఆకాశ్‌ను ఇంటి దగ్గర దింపేసి వెళ్తుంటే.. నల్ల కళ్లజోడు తీసి సోఫీని చూస్తాడు ఆకాశ్. ఆ విషయాన్ని ఆ ఇంటి కింద ఉన్న ఓ పిల్లాడు గ్రహిస్తాడు. సహజంగా ఆ పిల్లాడు ఆకాశ్‌ను ఏడిపిస్తుంటాడు గుడ్డివాడని. సంగీతం.. సాగనంపడం అలా సోఫీ వాళ్ల క్లబ్లో ఆకాశ్ పాత పాటలకు ఫిదా అవుతాడు రియల్టర్‌గా మారిన మాజీ హీరో ప్రమోద్ సిన్హా (ఆనంద్ ధవన్). తెల్లవారి వాళ్ల మ్యారేజ్ డే సందర్భంగా ఇంటికొచ్చి పియానో వినిపించాల్సిందిగా కోరుతాడు. తన భార్యకు ఇష్టమైన రాజేశ్ ఖన్నా పాటలు వినిపించాలని అడుగుతాడు. సరేనని తెల్లవారి ప్రమోద్ సిన్హా చెప్పిన సమయానికి వాళ్లింటికి వెళతాడు ఆకాశ్. కాని ఆయన లేడని చెప్తుంది ఆయన భార్య సిమీ సిన్హా (టబు). గుమ్మంలోనే చాలా సేపు మాట్లాడుతుంటుంటే.. ఎదురింటి ఫ్లాట్ ఆవిడ తలుపు తెరిచి చూస్తుంది. ఇబ్బందిగా ఫీలయ్యి ఆకాశ్‌ను లోపలికి రమ్ముంటుంది సిమీ. ఇంట్లోకొచ్చిన ఆకాశ్‌కు హాల్లో ఉన్న పియానో చూపిస్తుంది సిమీ. కచేరీ మొదలుపెడ్తాడు ఆకాశ్. పియానో మెట్ల మీద వేళ్లను పరిగెత్తిస్తుంటే రక్తం, లిక్కర్ కలిసిన మడుగు.. ఓ మనిషి కాళ్లూ అతని కంటబడ్తాయ్. ఆ ఇంటి యజమాని ప్రమోద్సిన్హా హత్య జరిగిందని తెలుస్తుంది. అయినా గుడ్డిగా ఏమీ ఎరగనట్టు ఆ ఇంట్లోంచి సెలవు తీసుకొని సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు ఆకాశ్. తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ ఇన్స్పెక్టర్ సిమీ సిన్హా బాయ్‌ఫ్రెండే అని తేలుతుంది. గతుక్కుమంటాడు. ఆ ఇన్స్పెక్టరూ సిమీ వాళ్లింట్లో ఆకాశ్‌ను చూస్తాడు. అతను గుడ్డివాడు కాదేమోనని అనుమానపడ్తాడు. ఆ విషయం సిమీకి చెప్పి వాకబు చేయమంటాడు. ఈలోపు పోలీస్ ఎంక్వయిరీలో ప్రమోద్ సిన్హా హత్య వెనక సిమీ సిన్హా హస్తం ఉందనే డౌట్‌ను పోలీసుల ముందు క్రియేట్ చేస్తుంది ఎదురింటి ఆవిడ. ఈ విషయం సిమీకి తెలిసి ఆ ముసలావిడను బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తుంది. యాదృచ్చికంగా దీనికీ సాక్షిగా నిలుస్తాడు ఆకాశ్. ఈ సంఘటనతో ఆకాశ్ కంటి చూపు మీద సిమీకీ సందేహం వస్తుంది. నివృత్తి చేసుకోవడానికి ఆకాశ్ వాళ్లింటికి వెళ్తుంది. గుడ్డివాడు కాదని రుజువవుతుంది. స్వీట్‌తో విషప్రయోగం చేసి ఆకాశ్ చూపు నిజంగానే పోయేలా చేస్తుంది. ఈలోపు సోఫీ ఆకాశ్ వాళ్లింటికి వస్తుంది. ఆకాశ్ అంధుడు కాదు అని అందరికన్నా ముందు అనుమాన పడ్డ ఆకాశ్ ఇంటి దగ్గరి కుర్రాడు.. ఆకాశ్ వీడియో తీస్తాడు అతనికి చూపు ఉంది అని నిరూపించడానికి. సోఫీ వచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తాడు. ఆకాశ్ తనను మోసం చేశాడనే కోపం, ఉక్రోషంతో గదికి వెళ్తుంది. అక్కడ సిమీ కనపడుతుంది. అవాక్కవుతుంది సోఫీ. ఆకాశ్ పడుకొని ఉంటాడు. ఆ గది వాతావరణం, సిమీ ప్రవర్తనను బట్టి వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకొని ‘‘ఆకాశ్‌కి ఇన్ఫామ్ చేయండి .. మా నాన్న పియానో అమ్మేశాడు. క్లబ్లో అతనికిక ఉద్యోగం లేదని’’ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సోఫీ. ఇక్కడ ఆ పాత్ర పాజ్ తీసుకుంటుంది. తర్వాత... ఆకాశ్‌కి చూపు పోయినంత మాత్రాన నోరుంది కాబట్టి తమ నేరాన్ని బయటకు చెప్పే ప్రమాదం ఉందని భయపడ్డ ఇన్స్పెక్టర్ ఆకాశ్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు. తప్పించుకుని ఓ డాక్టర్ చేతిలో పడ్తాడు ఆకాశ్. ఆ డాక్టర్.. ఆర్గాన్స్ అమ్ముకునే వ్యాపారి. అంధుడిగా ఆకాశ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనిని డ్రాప్ అండ్ పికప్ చేసే ఆటోవాలా, ల్యాటరీ టిక్కెట్లు అమ్ముకునే మహిళ.. ఈ ఇద్దరి బ్రోకర్ల సహాయంతో ఆకాశ్ కిడ్నీలను అమ్మేయాలని చూస్తాడు డాక్టర్. తెలుసుకున్న ఆకాశ్.. సిమీ విషయం చెప్పి ఆమెను కిడ్నాప్ చేస్తే కోటి రూపాయలు సంపాదించొచ్చని ఆశ చూపించి ఆపదలోంచి తప్పించుకోవాలనుకుంటాడు. కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తారు వాళ్లందరూ కలిసి. పోలీస్ భార్యకు ఫోన్ చేసి ప్రమోద్ సిన్హాను హత్య చేసింది మీ భర్తే అని చెప్తారు. సాక్ష్యాలూ ఉన్నాయని, కోటి రూపాయలు ఇవ్వకపోతే మీడియాకు లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. భర్తతో కోటి రూపాయలు పంపిస్తానని ఒప్పుకుంటుంది. ఆకాశ్‌ను కూడా తప్పిస్తే ఆ కోటి రూపాయాలు తామే కొట్టేయొచ్చని పథకం పన్ని ఆకాశ్‌నూ బంధిస్తారు ఆటోవాలా, లాటరీ టిక్కెట్ల మహిళ. కాని పోలీస్ చేతిలో మోసపోయి ఆటోవాలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. ఇక్కడ మళ్లీ సిమీ.. ఆకాశ్‌ను మోసం చేయాలనుకుంటుంది. ఆర్గాన్స్ అమ్మే ప్రాసెస్‌లో సేకరించిన బ్లడ్ శాంపుల్స్‌లో సిమీది రేర్ బ్లడ్ గ్రూప్ అని, ఆ గ్రూప్‌తో ఉన్న ఓ దుబాయ్ షేక్ కూతురికి సిమీ లివర్ ఇస్తే కోటి ఏంటి ఆరు కోట్లు సంపాదించొచ్చనే ఆలోచనలో పడ్తాడు డాక్టర్. ఆకాశ్తోనూ చెప్పి.. లివర్ అమ్మేయగా వచ్చిన డబ్బులోంచి కోటి ఇస్తానని, ఆమె కార్నియాతో కళ్లూ తెచ్చుకోవచ్చని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సిమీకి మత్తు మందు ఇచ్చి కారు డిక్కీలో పడేసి, ఆకాశ్‌ను తీసుకొని ముంబై ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతాడు డాక్టర్. ఆకాశ్ వద్దని వారిస్తున్నా వినడు. సిమీకి మళ్లీ మత్తు ఇవ్వడానికి దార్లో కారు ఆపి డిక్కీ దగ్గరకు వెళ్తాడు. కట్‌చేస్తే.. కారు మళ్లీ స్టార్ట్ అవుతుంది. ‘‘సిమీ లివర్ అమ్మడం పాపం. జరిగినవేవీ ఎక్కడా చెప్పను. సిమీని, నన్ను వదిలేయండి’’ అని చెప్తుంటాడు ఆకాశ్. ఆ మాటలన్నీ వింటూ మౌనంగా ఏడుస్తూ.. హఠాత్తుగా కారులోంచి ఆకాశ్‌ను దిగిపొమ్మని ఆజ్ఞాపిస్తుంది ఓ స్వరం. ఖంగు తింటాడు ఆకాశ్. డాక్టర్ ఏమయ్యాడు అని అడుగుతాడు సిమీని. ముందు నువ్వు వెళ్లిపో అంటుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న సిమీ. దిగిపోతాడు. సిమీ వెళ్లిపోతుంది. కాస్త ముందుకెళ్లాక నోరుంది కదా.. నమ్మడానికి లేదు అని అనుకొని మళ్లీ వెనక్కు తిప్పుతుంది కారును.. ఆకాశ్‌ను ఢీ కొట్టడానికి. ఇంతలోకే ఆ రోడ్డు పక్కనున్న పంటపొలాల్లో ముంగీస బెడద ఎక్కువవడంతో దాన్ని చంపడానికి గురిపెడ్తాడు చేను కాపలాదారుడు.. అది తప్పించుకుని రోడ్డుకి ఆవలవైపు పరిగెడ్తుంది.. కాపలాదారుడి తుపాకి గురి తప్పి సిమీ కారుకు తగులుతుంది. టైర్ బరస్ట్ అయి, పల్టీ కొట్టి సిమీ పడిపోతుంది.. కారు పేలిపోతుంది. రెండేళ్ల తర్వాత.. యూరప్‌లోని ఓ దేశంలోని ఓ క్లబ్లో ఆకాశ్ పియానో వాయిస్తూ ఉంటాడు. ఆ రాగాలు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అటుగా వెళ్తున్న సోఫీకి .. ఆమె మళ్లీ అప్పియర్ అయ్యేది ఇక్కడే. బయట నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న ఆకాశ్ ఫోటో, అతని పేరు ఉన్న పోస్టర్ చూసి కించిత్ ఆశ్చర్యంతో లోపలికి వెళ్తుంది. పాట అయిపోయాక అందరూ వచ్చి అతని చేతిని స్పృశిస్తూ అభినందనలు చెప్తుంటారు. అతనూ దానికి స్పందిస్తూ వాళ్ల చేతిని తడుముతూ కృతజ్ఞతలు చెప్తుంటారు. సోఫీ కూడా వచ్చి షేక్‌హ్యాండ్ ఇస్తుంది.. ఏమీ మాట్లాడకుండా. ఆ స్పర్శను గుర్తించి ‘‘సోఫీ’’ అంటాడు ఆకాశ్. ‘‘కంగ్రాట్స్.. ఇక్కడి వాళ్లనూ ఫూల్స్‌ని చేస్తున్నావన్నమాట’’ అంటుంది. ‘‘అదో పెద్ద కథ.. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?’’ అని అడుగుతాడు. సరేనని కాఫీ షాప్‌కు వెళ్తారు. జరిగిందంతా చెప్తాడు. నిట్టూర్చి.. ‘‘ఎంతమంది జీవితాలతోనో ఆడుకుంది సిమీ? డాక్టర్ అన్నట్టు ఆమె కార్నియా తీసుకోవాల్సింది నువ్వు’’ అంటుంది సోఫీ. ‘‘అలా తీసుకుని ఉంటే అపరాధ భావంతో సంగీతానికి దూరమయ్యేవాడిని. బై దవే.. రేపు నా కన్సర్ట్ ఉంది.. వస్తావా?’’ అడుగుతాడు. ‘‘రేపు వెళ్లిపోతున్నా. అయినా ట్రై చేస్తా’’ అంటుంది. సరేనని సెలవు తీసుకుంటుండగా.. లోపలి నుంచి వెయిట్రెస్ ముంగీస తలను చెక్కిన చేతికర్రను తెచ్చి ‘‘ఇది మీదే కదా.. ’’ అంటూ ఆకాశ్ చేతికి అందిస్తుంది. ముంగీస బొమ్మ చెవులను తడుముతూ ‘‘అవును నాదే.. థ్యాంక్స్’’ అంటూ ఆ కర్ర సహాయంతో క్లబ్ బయటకు వస్తాడు. వెళ్తూ వెళ్తూ దారిలో కాళ్లకు అడ్డంగా ఉన్న ఖాళీ కోక్ టిన్నును కర్రతో బలంగా కొడ్తాడు. అదెళ్లి ఆ చివరన పడుతుంది. అక్కడున్న వాళ్లంతా ఆ అంధుడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ది ఎండ్.. అనుకోని ట్విస్ట్‌లు.. కథలో కనిపించే ప్రతి పాత్రకూ ఔచిత్యమైన కంటిన్యూటీ.. ప్రేక్షకుల కళ్లు తిప్పుకోనివ్వదు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకో నేరం.. దాని నుంచి బయటపడడానికి ఇంకో నేరానికి పాల్పడం.. ఒక పరిస్థితిని ఎవరి స్వార్థానికి వాళ్లు ఉపయోగించుకోవడం.. అవతలి వాడి కష్టాన్ని తమకు లాభంగా మలచుకోవడం.. మనుషుల సామాన్య స్వభావం. అదే అసలు నైజం. ఇదే ఈ సినిమా పల్స్! అంధాధున్ సారాంశం. – శరాది -
ధోని, జాకీర్ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్, ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ పేర్లను ఈ ఏడాది పద్మ అవార్డులకు ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా నిరాకరణకు గురైన సుమారు 18 వేలకు పైగా సిఫార్సులు, దరఖాస్తుల వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో...రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయకుడు సోను నిగమ్, నటి శ్రీదేవి, ప్రముఖ పాత్రికేయుడు అర్ణబ్ గోస్వామి, ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ తదితరులున్నారు. -
నెట్లో దుమ్ము రేపుతున్న సచిన్ వీడియో
-
సేవాదళ్‌లోకి మహిళా శక్తి
సాక్షి, చెన్నై : వైఎస్ఆర్ సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు. మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేపట్ట దలచిన దీక్షకు చెన్నై నుంచి అభిమానులు తరలిరావాలని ఈసందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సేవాదళ్ బలోపేతం లక్ష్యంగా ఉపాధ్యక్షుడు జకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి మేడగం శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను ఏకం చేయడం, సేవాదళ్‌లోకి ఆహ్వానించే పనిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తాజా, మహిళా లోకం కదిలింది. సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు. ఆ దళ్ సంయుక్త కార్యదర్శి ఆబోతుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైకోర్టు మహిళా న్యాయవాది కమలాపురం లక్ష్మీ శ్రీదేవి రెడ్డి నేతృత్వంలో పదిహేను మంది మహిళలు ఆదివారం సేవాదళ్‌లోకి చేరారు. మరో ముప్పై మంది డబ్బింగ్ ఆర్టిస్టులతో పాటుగా పలువు రు సేవాదళ్‌లోకి వచ్చారు. అలాగే, సేవాదళ్ సేవలకు ఆకర్షితులైన ప్రముఖ కాస్మోటాలజిస్టు డాక్టర్ లత మా మలూరు తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. మహిళా లోకం : ఆళ్వార్ తిరునగర్ ఎంఎల్పీ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం సాయంత్రం సేవాదళ్ కార్యక్రమం జరిగింది. జకీర్ హుస్సేన్, మేడ గం శ్రీనివాస రెడ్డి, సైకం రామకృష్ణారెడ్డిల సమక్షంలో మహిళలతో పాటుగా మరో ముప్పైమంది సేవాదళ్‌లోకి చేరా రు. న్యాయవాది లక్ష్మీశ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మీదున్న అభిమానంతో జగనన్నను సీఎం చేయాలన్న కాంక్షతో తాను సైతం సేవల్ని అందించేందుకు ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు. సేవాదళ్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. వైఎస్‌ఆర్‌సేవాదళ్ వేదికగా తెలుగు వారికి న్యాయ పరంగా సేవల్ని అందించేందుకు ముందుకు సాగుతున్నాని పేర్కొన్నారు. డాక్టర్ లత మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి కుటుంబం మీద చిన్నప్పటి నుంచి తనకు అభిమానంగా పే ర్కొన్నారు. ఇక్కడి సేవాదళ్ కార్యక్రమాల్ని పేస్ బుక్ ద్వారా తెలుసుకుని, తాను సైతం ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన వంతు సేవల్ని సేవాదళ్‌కు అందిస్తామన్నారు. మేడగం శ్రీనివాసరెడ్డి, సైకం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జూన్ మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా జరగనున్న అధ్యక్షులు జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు ఇక్కడి నుంచి అభిమానులు బయలు దేరనున్నామన్నారు. ఆ దీక్షకు మద్దతుగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. సేవాదళ్ తరపున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలో న్యాయ పరంగా సేవల కల్పన, వైద్య పరంగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. సేవాదళ్ సంయుక్త కార్యదర్శులు ఆబోతుల శ్రీకాంత్, సిరిపురం నరేంద్ర, దర్శకుడు రోశిరాజు, డబ్బింగ్ ఆర్టిస్టులు రవీంద్రనాథరెడ్డి, లక్ష్మి చిత్ర, డీవీ శ్రీనివాస్, ఏకరాజ్, ప్రసాద్ రాజు, మహిళ నాయకులు రమణి, ఎంకే లక్ష్మి, వి శైలజ, ఎస్ శ్రావణి, పాస్టర్ దేవసహాయం, ఐజాక్ ప్రేమ్‌కుమార్, సేవాదళ్ సభ్యులు కోటిరెడ్డి, సురవరపు కృష్ణారెడ్డి, సవిత వర్సిటీ విద్యార్థి నాయకుడు నరేంద్రనాథ్‌రెడ్డి, వలసరవాక్కం నాయకుడు మల్లేష్, పెద్ద ఎత్తున్న వైఎస్సార్ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
యువకుని దారుణ హత్య
గిద్దలూరు రూరల్ : కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మడత బ్లేడుతో గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లె రోడ్డులో ఉన్న ఫారమ్ సమీపంలో మంగళవారం వేకువజామున జరిగింది. ఆ వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన టంకం జాకీర్‌హుస్సేన్ (25) టాటా ఏస్ లగేజీ ఆటోకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎక్కువగా నంద్యాల, మహానంది ప్రాంతాల నుంచి అరటిలోడులు వేసుకుని గిద్దలూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలో గిద్దలూరు మండలం నరవ గ్రామంలో బియ్యం లోడు ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గోపవరం గ్రామంలోని ఇంటి నుంచి బయలుదేరిన జాకీర్‌హుస్సేన్.. మంగళవారం ఉదయం స్థానిక కేఎస్ పల్లె రోడ్డులోని ఫారమ్ సమీపంలో శవమై కనిపించాడు. అతని ఆటో అక్కడే రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంది. ఆ వాహనానికి కొంతదూరంలో ఉన్న రైల్వే పట్టాలు, రోడ్డుకు మధ్య చిల్లచెట్లలో శవమై పడిఉన్నాడు. అతని గొంతుపై బ్లేడుతో కోసినట్లు గాయమై ఉంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న వారి ద్వారా సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ శ్రీహరిరావు, సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై ఎం.రాజేష్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాకీర్‌ను ఆటోలో నుంచి హంతకులు బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లి అదే ఆటోలో ఉన్న అరటి గెలలు కోసేందుకు ఉపయోగించే మడత బ్లేడ్లతో గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్లలో ఎరుపు రంగు బ్లేడు ఒకటి హత్య జరిగిన స్థలంలోనే పడి ఉండగా, పసుపురంగు బ్లేడు రక్తపు మరకలతో ఆటోలోనే ఉంది. మరో బ్లేడు విరిగి ఆటో టైర్లవద్ద పడి ఉంది. ఆటోలో మరో వ్యక్తికి సంబంధించిన చెప్పులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు జాకీర్‌కు ఏప్రిల్ నెలలో వివాహం కుదిరినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు పోలీసులు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సుర్తాల్ యహా(
తబలా మాంత్రికుడు జాకీర్ హుస్సేన్ వాద్యవిన్యాసంలో.. గళమాంత్రికుడు హరిహరన్ కురిపించిన గానామృతంలో.. సిటీ సంగీత ప్రియులు ఓలలాడారు. ఘజల్స్ గడపగా పేరొందిన దక్కనీ సీమలో విరబూసిన హరిహరన్ ఘజల్స్ వేవేల వహ్వాలు అందుకున్నాయి. హరిహరన్, జాకీర్‌హుస్సేన్‌లు రూపొందించిన ‘హాజిర్-2’ ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా మాదాపూర్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం వీరిరువురూ ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ‘కుచ్ దూర్ హమారే సాత్..’ ‘దిల్ సే హర్ గుజ్రీ బాత్..’ ‘జియా జియా నా జియా..’ అంటూ హరిహరన్ ఆలపించిన ఘజల్స్‌కు ప్రేక్షకులు తన్మయులయ్యారు. రెండు దశాబ్దాల కిందట ఈ జంట నుంచి ‘హాజిర్’ అల్బమ్ వెలువడింది. ‘హాజిర్ -2’ పేరిట మరోసారి కలవటం ఆనందంగా ఉందన్నారు హరిహరన్. హైదరాబాద్‌లో వీరిద్దరూ కలసి కాన్సర్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
జుగల్బందీ
ఒకరిది గానామృతం. మరొకరిది తబలా విన్యాసం. శాస్త్రీయ గీతమైనా, సినీ పాటయినా ప్రతి మదినీ శ్రావ్యంగా స్పృశించే హరిహరన్... వెస్ట్రన్ స్టైలైనా, క్లాసికల్ టచ్ అయినా గంగాప్రవాహంలా తబలను శృతిచేసే ఉస్తాద్ జాకీర్‌హుస్సేన్... అలసిన మనసులపై పన్నీటి జల్లులు కురిపించే మహత్తర సంగీత ఝరి నగరవాసులను మైమరిపించేందుకు సిద్ధమైంది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత కలసి చేసిన ‘హాజిర్ 2’ ఆల్బమ్‌లోని పాటలను వినిపించి మురిపించేందుకు ఉద్దండులిద్దరూ వస్తున్నారు. మాదాపూర్ సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 24న జరిగే ఈ కార్యక్రమం వివరాలకు 95429 76567 నంబర్లో సంప్రదించవచ్చు. -
కూలిన శ్లాబ్
హెచ్‌సీయూలో ఘటన త్రుటిలో తప్పిన ప్రమాదం నాలుగేళ్లలో రెండో ఘటన సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.13.80 కోట్లతో నిర్మిస్తున్న జాకీర్ హుస్సేన్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ శ్లాబ్ బుధ వారం కుప్ప కూలింది. నాలుగేళ్ల క్రితం లైఫ్ సైన్స్ భవనం కూలిన ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తక్కువ సామర్థ్యం గల ఇనుపరాడ్లు ఉపయోగించడం, శ్లాబ్ భీంను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. మధ్యాహ్నం సమయంలో భవన నిర్మాణం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2014 జనవరి నుంచి సీపీడ బ్ల్యూ పర్యవేక్షణలో బెంగుళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఈ ఈ భవన నిర్మాణ పనులు చేస్తోంది. ఏప్రిల్ 2015 కల్లా పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ భవనంలో లెక్చర్ హాల్ కాంప్లెక్స్‌తో పాటు అకడమిక్ సపోర్ట్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూంలు, సెమినార్ హాల్ వంటి 15 హాళ్లు నిర్మిస్తున్నారు. ఘటన స్థలాన్ని హెచ్‌సీయూ రిజిస్టార్ రామబ్రహ్మం, సీపీడబ్ల్యూ అధికారులు, మాదాపూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఖురేషీ, విద్యార్థి, ఉద్యోగ సంఘ నాయకులు పరిశీలించారు. ఉన్నత స్థాయి విచారణ కోరతాం... శ్లాబ్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోరతాం. ఇన్చార్జి యూఈ ఏసీ నారాయణ హయాంలో చేపట్టిన అన్ని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలి. నాసిరకంగా చేపట్టిన ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక కూలి ఉంటే భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగి ఉండేది. - బండి డానియల్, యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాసిరకంగా నిర్మిస్తున్నారు... యూనివర్సిటీ భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. విద్యార్థుల భవిష్యత్‌ను కాల రాసేలా నాసిరకంగా భవనాలు నిర్మిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. - వెంకటేష్ చౌహాన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు, హెచ్‌సీయూ -
రేపు వైఎస్సార్ వర్ధంతి
సాక్షి, చెన్నై : వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఘన నివాళులు అర్పించడానికి తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఉత్తర చెన్నై పరిధిలోని కొరుక్కుపేటలో ఉన్న కామరాజర్ నగర్లో సంతాప సభ, అన్నదానం చేయనున్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా ఇక్కడి తెలుగు వారికి ప్రత్యేక అభిమానం. ఆ కుటుంబానికి తాము సైతం అండగా ఉన్నామని ఇక్కడి అభిమాన లోకం చాటుకుంటోంది. అలాగే, ప్రతి ఏటా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలుగు వారు అత్యధికంగా ఉండే కొరుక్కుపేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణరుుంచారు. ఈ విషయమై తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జాకీర్ హుస్సేన్, శరవణన్ ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి భౌతికంగా అం దర్నీ వీడి ఐదేళ్లు అవుతున్నా, ఆయన జ్ఞాపకాలు ప్రతి హృదయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయూయన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రజల కోసం ప్రభుత్వంతో చేస్తున్న పోరాటతీరు వైఎస్‌ను గుర్తుకు తెస్తున్నదన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమలాంటి వారెం దరో ఇక్కడ అండగా ఎల్లప్పుడూ ఉన్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి వర్ధంతిని తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే కొరుక్కుపేటలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందుకుగాను తమకు వైఎస్సార్ అభిమానులు మణివణ్ణన్, ఆవడి భాస్కరన్, బాలాజీ, స్టాన్లీ జగన్, రత్నం, సురేష్, డేవిడ్, చంద్ర శేఖర్, మహేష్, నెల్సన్ బాబు, ఆనంద్ బాబు, మదు, కొండయ్యలు సంపూర్ణ సహకారం అందించారని వివరించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని సంతాప సభ నిర్వహించి, అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆరంభమయ్యే ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెరంబూరు, అంబత్తూరుతోపాటుగా ఉత్తర చెన్నై పరిధిల్లో పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్కు నివాళులర్పించే విధంగా, వర్ధంతికి తరలిరావాలని పిలుపునిస్తూ పెద్దఎత్తున పోస్టర్లు అంటించడం విశేషం. -
పోలీస్ కస్టడీకి జాకీర్ హుస్సేన్
చెన్నై రైల్వే స్టేషన్లో పేలుళ్ల వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీస్ యంత్రాంగం దూసుకుపోతోంది. పేలుళ్లకు రెండురోజుల ముందు పట్టుపడిన తీవ్రవాది జాకీర్ హుస్సేన్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, 9 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై నగరంలో తీవ్రవాదుల కదలికలున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇటీవల భారీ ఎత్తున తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా గత నెల 29న మన్నాడీ అనే ప్రాంతంలో జాకీర్‌హుస్సేన్ పట్టుబడ్డాడు. ఇతని నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను 30న అరెస్ట్ చేశారు. వీరందరినీ అరెస్ట్ చేసిన మరుసటి రోజే అంటే ఈనెల 1న సెంట్రల్లో జంటపేలుళ్లు సంభవించాయి. అరెస్టులకు ప్రతీకారంగానే పేలుళ్లు జరిపి ఉంటారని తొలుత భావించినా పట్టుపడిన వారి లక్ష్యాలు వేరని పోలీసులు గుర్తించారు. శ్రీలంకలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ గూడచారి హోదాలో జాకీర్ హుస్సేన్ చెన్నైలో అడుగుపెట్టినట్లు, ఈ సమయంలో తిరుచ్చి, బెంగళూరులలో పర్యటించినట్లు కనుగొన్నారు. చెన్నైలోని అమెరికా దౌత్యకార్యాలయం, బెంగళూరులోని ఇజ్రారుుల్ దౌత్యకార్యాలయం పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లు తెలుసుకున్నారు. ఈ విధ్వంసాలను అమలుచేసేందుకు మాల్దీవుల నుంచి వచ్చే ఇద్దరి వ్యక్తులకు నివాస, వసతి సౌకర్యాలను సమకూర్చే బాధ్యతలను జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పనిలో ఉండగానే అతను పోలీసులకు పట్టుబడ్డాడు. ముఖానికి ముసుగు ధరింపజేసి భారీ బందోబస్తు మధ్య పోలీసులు చెన్నై ఎగ్మూరు కోర్టుకు జాకీర్‌హుస్సేన్‌ను తీసుకువచ్చారు. జాకీర్ హుస్సేన్ కార్యకలాపాలపై విచారణ జరిపేందుకు పదిరోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా క్యూ బ్రాంచ్పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే 9 రోజులకు న్యాయమూర్తి అనుమతించారు. దీంతో వెంటనే అదే స్థితిలో కోర్టు బైటకు తీసుకువచ్చిన జాకీర్‌హుస్సేన్‌ను విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న పేలుళ్లకు కుట్ర బెంగళూరులోనే జరిగినట్లు తెలుస్తున్నందున ఆ కోణంలో రెండోదశ విచారణను సోమవారం ప్రారంభించారు. చెన్నై-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నారు. బాంబులు అమర్చిన అనంతరం సెల్ఫోన్లో ముష్కరులు చర్చించుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న 358 కిలోమీటర్ల దూరం వరకు జరిగిన అన్ని సంభాషణల టేపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్లో పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులే కారణమని దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. అయితే వీరితో అల్ఉమ్మా తీవ్రవాదులు కూడా చేతులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేసే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. అందుకే అలాగే వేలూరు జైలులో శిక్ష ను అనుభిస్తున్న ఆల్ ఉమ్మా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీస్ ఫక్రుద్దీన్, బిలాల్మాలిక్లను విచారిస్తున్నారు. -
‘దీనానాథ్’ అవార్డు ప్రదానం
ముంబై: మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులను సామాజిక కార్యకర్త అన్నాహజారే, సంగీత విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, సీనియర్ నటుడు రిషి కపూర్ తదితరులకు గురువారం రాత్రి ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి, ప్రముఖ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి యేటా ఏప్రిల్ 24వ తేదీన ‘స్మృతి దిన్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా, సంగీతం, నటన, సాహిత్యం, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు దీనానాథ్ అవార్డును అందజేసి సత్కరిస్తున్నట్లు వివరించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష పారితోషికం, మెమెంటో అందజేశామన్నారు. సినిమా రంగానికి గాను సీనియర్ నటుడు రిషికపూర్‌కు, సంగీత రంగంలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త అన్నాహజారే, శివాజీ సతమ్, పండిట్ పండరీనాథ్ కొల్హా పురీ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. కాగా రిషికపూర్ రెండేళ్ల వయసులో తన చేతుల్లో ఆడుకున్నాడని, ఇప్పుడు ఒక సీనియర్ నటుడిగా తన తండ్రి పేరిట అవార్డును అందుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఉస్తాద్ జాకీర్ హస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అతడు తనను కన్నకూతురిగా చూసుకునేవారని, ఒకే రోజు ఆయన సంగీత సారథ్యంలో ఆరు పాటలు రికార్డు చేశామని లత వివరించారు. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన రాలేగాంసిద్ధి మీదుగా ప్రయాణించినప్పుడు హృదయ్నాథ్ మంగేష్కర్ తనను కలిసినప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఇటీవల కాలంలో రూ.కోటికిపైగా పారితోషికం కలిగిన అవార్డులను ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారని అయితే తాను తిరస్కరించానని చెప్పారు. అయితే లతా మంగేష్కర్ తనను ఈ అవార్డు కోసం సంప్రదించిన వెంటనే ఆనందంగా అంగీకరించానని వివరించారు. -
వాక్ తాజ్! వాహ్ జాకీర్ హుస్సేన్!!
-
చెన్నైకి జగన్
సాక్షి, చెన్నై: వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చెన్నైకు త్వరలో రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ తమిళనాడు విభా గం నాయకులు జాకీర్ హుస్సేన్, శరవణన్, శరత్ ఏర్పాట్లు చేస్తున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ కుటుంబం అంటే తమిళనాడులోని తెలుగు వారికి, తమిళ అభిమానులకు ఎనలేని గౌరవం. ప్రతి ఏటా వైఎస్సార్ జయంతి, వర్ధంతిని ఇక్కడి అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ మహానేత తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఇక్కడి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం విడిపోతున్న తెలుగు రాష్ట్రాన్ని కాపాడేందుకు, జగన్ సాగిస్తున్న పోరాటానికి ఇక్కడి వారు తమ సైతం అని మద్దతును తెలియజేస్తూ వస్తున్నారు. ఏక పక్షంగా కాంగ్రెస్ సాగిస్తున్న విభజనను అడ్డుకోవడం లక్ష్యంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని జగన్ కలుస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని భగ్నం చేయడానికి జాతీయ స్థాయిలోని పార్టీల మద్దతుల్ని కూడగట్లే పనిలో జగన్ ఉన్నారు. ఆ దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలుసుకునేందుకు ఆయన నిర్ణయించారు. చెన్నైకు వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతించడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడి నేతలు సిద్ధమయ్యారు. ఆయన పర్యటన తేదీని ప్రకటించాల్సి ఉండటంతో ఎప్పుడెప్పుడు తమ నేత చెన్నైకు వస్తారా అన్న ఎదురు చూపుల్లో అభిమానులు ఉన్నారు. భారీ సన్నాహాలు: వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నాయకులు జాకీర్ హుస్సేన్, శరవణన్, శరత్ నేతృత్వంలో భారీ స్వాగతానికి సన్నాహాలు జరుగుతోన్నాయి. చెన్నై విమానాశ్రయంలో జగన్‌కు ఆహ్వానం పలికి, ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. సమాచారం కోసం జాకీర్ హుస్సేన్(9841042141), శరవణన్(9841327406), శరత్ (9380044450) నెంబర్లను సంప్రదించ వచ్చు. సాక్షితో జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, తమ నేత చెన్నైకు వస్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్, జగన్ మోహన్‌రెడ్డి చిత్రాలతో, సరికొత్త నినాదాలతో రూపొందించిన 2014 క్యాలెండర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ కుదరని పక్షంలో హైదరాబాద్ కార్యాలయంలో ఆవిష్కరింప చేసుకుంటామన్నారు.