చెన్నైకి జగన్ | CBI court permits ys jagan mohan reddy to visit Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైకి జగన్

Published Tue, Nov 26 2013 2:30 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

CBI court permits ys jagan mohan reddy to visit Chennai

సాక్షి, చెన్నై: వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చెన్నైకు త్వరలో రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ తమిళనాడు విభా గం నాయకులు జాకీర్ హుస్సేన్, శరవణన్, శరత్ ఏర్పాట్లు చేస్తున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ కుటుంబం అంటే తమిళనాడులోని తెలుగు వారికి, తమిళ అభిమానులకు ఎనలేని గౌరవం. ప్రతి ఏటా వైఎస్సార్ జయంతి, వర్ధంతిని ఇక్కడి అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ మహానేత తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఇక్కడి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం విడిపోతున్న తెలుగు రాష్ట్రాన్ని కాపాడేందుకు, జగన్ సాగిస్తున్న పోరాటానికి ఇక్కడి వారు తమ సైతం అని  మద్దతును తెలియజేస్తూ వస్తున్నారు.
 
  ఏక పక్షంగా కాంగ్రెస్ సాగిస్తున్న విభజనను అడ్డుకోవడం లక్ష్యంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని జగన్ కలుస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని భగ్నం చేయడానికి జాతీయ స్థాయిలోని పార్టీల మద్దతుల్ని కూడగట్లే పనిలో జగన్ ఉన్నారు. ఆ దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలుసుకునేందుకు ఆయన నిర్ణయించారు. చెన్నైకు వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతించడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడి నేతలు సిద్ధమయ్యారు. ఆయన పర్యటన తేదీని ప్రకటించాల్సి ఉండటంతో ఎప్పుడెప్పుడు తమ నేత చెన్నైకు వస్తారా అన్న ఎదురు చూపుల్లో అభిమానులు ఉన్నారు. 
 
 భారీ సన్నాహాలు: వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నాయకులు జాకీర్ హుస్సేన్, శరవణన్, శరత్ నేతృత్వంలో భారీ స్వాగతానికి సన్నాహాలు జరుగుతోన్నాయి. చెన్నై విమానాశ్రయంలో జగన్‌కు ఆహ్వానం పలికి, ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. సమాచారం కోసం జాకీర్ హుస్సేన్(9841042141), శరవణన్(9841327406), శరత్ (9380044450) నెంబర్లను సంప్రదించ వచ్చు. సాక్షితో జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, తమ నేత చెన్నైకు వస్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్, జగన్ మోహన్‌రెడ్డి చిత్రాలతో, సరికొత్త నినాదాలతో రూపొందించిన 2014 క్యాలెండర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ కుదరని పక్షంలో హైదరాబాద్ కార్యాలయంలో ఆవిష్కరింప చేసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement