#AR Rahmancelebrates 'Raining Grammys'ప్రతిష్టాత్మక 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024లో భారత్ సత్తా చాటింది. ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ దిగ్గజ సంగీత విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ , సెల్వగణేష్ వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్‌తో కూడిన సూపర్ గ్రూప్ ‘శక్తి’ బ్యాండ్ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి దక్కడం విశేషం
శక్తి బ్యాండ్ ఆవిర్భావం
మహావిష్ణు ఆర్కెస్ట్రా రద్దు తరువాత 1973లో ఫ్యూజన్ బ్యాండ్, శక్తి బ్యాండ్ ఏర్పడింది. ఇందులో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(తబ్లా) ప్రముఖ సింగర్ శంకర్ హదేవన్,గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వి సెల్వగణేష్ , వయోలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ వంటి ప్రఖ్యాత కళాకారులున్నారు. చాలా ఏళ్ల తరువాత 2020లో దీన్ని సంస్కరించారు. అలాగే మూడేళ్ల తరువాత తొలి ఆల్బమ్ ‘దిస్ మూమెంట్’జూన్ 23, 2023లో రిలీజ్ అయింది. తాజా ఆల్బమ్‌లో శ్రీనిస్ డ్రీమ్, బెండింగ్ ద రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పాల్మాస్‌తో సహా 8 ట్రాక్‌లు ఉన్నాయి.
గ్రామీ అవార్డుపై శుభాకాంక్షలు తెలిపిన అస్కార్ విన్నర్ మ్యూజిక్ మాస్ట్రో ఏర్ రెహమాన్ ఇండియాకు గ్రామీ అవార్డుల వర్షం కురుస్తోందంటూ ఇన్‌స్టాలో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. మాజీ గ్రామీ విజేత కూడా అయిన రెహ్మాన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ,వితో కలిసి ఉన్న సెల్ఫీని షేర్ చేశారు. అటు గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సంగీత కుటుంబానికి, ఫ్యాన్స్‌తోపాటు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని అభినందనల్లో ముంచెత్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఘనాపాటీ ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండవ గ్రామీని గెలుచుకున్నారని పేర్కొన్నారు .దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso
— Ricky Kej (@rickykej) February 4, 2024
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి బ్యాండ్‌కు చెందిన పాష్టో పాట ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా గౌరవనీయమైన గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. పాష్టోకు చెందిన యాస్ వి స్పీక్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బమ్ అవార్డు కూడా గెలుచుకుంది. అంతేకాదు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment