Shankar Mahadevan
-
సద్గురు ఇషా యోగా సెంటర్లో మహాశివరాత్రి వేడుకలు (ఫోటోలు)
-
మాటలతో చెప్తే వినరు.. అందుకే డ్యాన్స్‌తో..!
నాట్యం అంటే వినోదం.. ఆ వినోదానికి సమాచారం తోడైతే.. అదెలాగో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే! విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎయిర్ ఇండియా వినూత్నంగా తెలిపింది. నాట్యపద్ధతిలో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది . సేఫ్టీ ముద్రాస్ పేరిట ఓ వీడియో రిలీజ్ చేసింది. 👉 భరతనాట్యం ఇందులో మొదటగా భరతనాట్యం చేస్తున్న అమ్మాయి సీటుబెల్ట్ ఎలా పెట్టుకోవాలో చూపించింది. అలాగే ప్రయాణికులు వారి సామాన్లను ఓవర్‌హెడ్ కంపార్ట్మెంట్లో పెట్టమని సూచించింది. 👉ఒడిస్సి నాట్యం సీటు ముందు ఉన్న ట్రే టేబుల్స్ క్లోజ్ చేయమని చెప్తూనే విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు విండోస్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పారు. 👉మోహిని నాట్యం ప్రయాణికులు ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులనులను విమానం బయల్దేరేటప్పుడు, కిందకు దిగేటప్పుడు వాడవద్దని సూచించారు. మొబైల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్‌లో వాడుకోవచ్చన్నారు. సిగరెట్స్‌తో పాటు ఇ సిగరెట్స్ కూడా వాడటానికి వీల్లేదన్నారు. 👉కథక్ నాట్యం ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. అవి ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. దాదాపు మీ వెనకాలే ఓ ఎగ్జిట్ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ మాస్కులు రిలీజవుతాయి. దాన్ని కచ్చితంగా ధరించాలని నొక్కి చెప్పారు. 👉ఘూమర్ నాట్యం అనుకోని కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగితే.. ఎమర్జెన్సీ లైటింగ్ మీరు ఎగ్జిట్ దగ్గరకు వెళ్లేందుకు సహాయపడుతుందని, దాన్ని గుర్తించాలన్నారు. 👉బిహు నాట్యం అనుకోకుండా విమానం నీళ్లలో ల్యాండ్ అయినప్పుడు సీట్ల కింద లేదా సీట్ల మధ్య ఉన్న రక్షణ కవచాన్ని ధరించాలని తెలిపారు. 👉గిద్ధ నాట్యం ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే సేఫ్టీ కార్డును సీటు పాకెట్లో ఉందని, ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని తీసి చదవమని విజ్ఞప్తి చేశారు. ఈ స్పెషల్ వీడియోకు శంకర్ మహదేవన్ సంగీతం అందించగా ప్రసూన్ జోషి గేయ రచయితగా పని చేశారు. దీనికి భారత్బాలా దర్శకత్వం వహించారు. -
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
గ్రామీ అవార్డుల పంట!
సంగీతం ఎల్లలెరుగదు. అది విశ్వభాష. ఏ ప్రాంతానిదో తెలియదు... ఎవరు మాట్లాడే భాషో తెలియదు... కనీసం దాని భావమేమిటో కాస్తయినా అర్థంకాదు. కానీ శ్రుతిలయలు జతకలిసి హృదయాలను స్పృశించినప్పుడు ఆ రాగలహరిలో మునకేయని మనిషంటూ వుండరు. అందుకే ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల ఉత్సవంలో మన సంగీత దిగ్గజాలు జకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, రాకేష్ చౌరాసియా అవార్డుల పంట పండించారు. విఖ్యాత తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ ఏకంగా మూడు పురస్కారాలు అందుకున్నారు. నిరుడు జూన్‌లో శక్తి బ్యాండ్ తరఫున విడుదలైన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు శంకర్ మహదేవన్‌తో కలిసి ఆయనకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ పురస్కారం లభించగా, సొంతంగా రూపొందించిన ‘యాజ్ వి స్పీక్’ ఆల్బమ్‌కు పాష్తో కేటగిరిలో మరో రెండు పురస్కారాలొచ్చాయి. ఇదే ఆల్బమ్‌కు ఫ్లూటు అందించిన రాకేష్ చౌరాసియాకు సైతం రెండు అవార్డులొచ్చాయి. ఎనిమిది గీతాలతో రూపొందించిన ‘దిస్ మూమెంట్’కు శంకర్ మహదేవన్ గాత్రం సమకూర్చగా, జకీర్ తబలా, జాన్ మెక్లాగ్లిన్ గిటార్, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ రాగాలు అందించారు. శక్తి బ్యాండ్ విలక్షణమైనది. దాని స్థాపన వెనకున్న ఉద్దేశాలు ఉన్నతమైనవి. 1973లో మెక్ లాగ్లిన్ నేతృత్వంలో అవతరించిన ఆ బృందం ఖండంతరాల్లోని సంగీత దిగ్గజాలను ఒక దరికి చేర్చి ప్రాచ్య, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తరతరాలుగా ప్రపంచ సంగీత ప్రియులను అబ్బురపరుస్తోంది. ఇప్పుడు గ్రామీ పుర స్కారాల ఉత్సవంలో ఎందరో సంగీత దిగ్గజాల సృజనను దాటుకుని ‘దిస్ మూమెంట్’ విజేతగా నిలిచిందంటే అది సాధారణమైనది కాదు. నిజానికి శక్తి బ్యాండ్ ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి దాదాపు 45 ఏళ్లవుతోంది. అనంతరం నిరుడు ‘దిస్ మూమెంట్’ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. జకీర్ హుస్సేన్ గ్రామీ అందుకోవటం ఇది మొదటిసారి కాదు. 1992, 2009లలో కూడా గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నాడు. అరవై ఆరేళ్ల గ్రామీ పురస్కారాల చరిత్రలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1967లో తొలిసారి ఆ అవార్డు గెలుచుకుని భారత సంగీతానికి ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను 1972, 2001 సంవత్సరాల్లోనూ గ్రామీ అవార్డులు వరించాయి. 2008లో ఏఆర్ రెహమాన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు గ్రామీ అవార్డులు గెలుచుకోగా మన దేశానికి ఒకేసారి ఆరు పురస్కారాలు లభించటం ఇదే తొలిసారి. విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడిగా జకీర్ హుస్సేన్‌కు ఆ విద్య చిన్ననాడే పట్టుబడింది. పట్టుమని పన్నేండళ్ల ప్రాయానికే దేశదేశాల్లోనూ కచేరీలు ఇవ్వగలిగాడు. ఇరవయ్యేళ్ల వయసుకే ఏటా 150 సంగీత కచేరీలు నిర్వహించేంత తీరికలేని విద్వాంసుడు కావటం జకీర్ ప్రత్యేకత. 70వ దశకంలో ప్రపంచాన్ని విస్మయపరిచిన బీటిల్స్ బృందంతో జతకట్టి అందరితో ఔరా అనిపించుకున్నాడు. సంగీతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందటమే కాదు... ప్రిన్స్టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించి ఎందరినో తీర్చిదిద్దిన ఘనత జకీర్ది. తాను ప్రపంచంలో ఉత్తమ తబలా విద్వాంసుణ్ణి కాదని, ఎందరో విద్వాంసుల్లో ఒకడిని మాత్రమేనని చెప్పుకొనే వినమ్రత జకీర్ సొంతం. తనకు తబలా నేర్పాలని ఏడేళ్ల వయసులో తండ్రి అల్లారఖాను అడిగినప్పుడు ‘బేటా ఇందులో నిష్ణాతుణ్ణి కావాలని అత్యాశపడకు. ఒక మంచి విద్యార్థిగా ఎదగాలని కోరుకో. అప్పుడు మెరుగ్గా తయారవు తావు’ అని సలహా ఇచ్చారట. తండ్రికిచ్చిన మాట ప్రకారం రోజూ తెల్లారుజామున మూడు గంట లకు లేచి తబలా వాద్యంలో మెలకువలు నేర్చుకోవటం ఆయన ప్రత్యేకత. తాను పుట్టిపెరిగిన ముంబై నగరంలో అందరూ గాఢనిద్రలో వుండేవేళ ఆయన సంగీత సాధన మొదలయ్యేది. అందుకే మరో అయిదేళ్లకే కచేరీలు చేసే స్థాయికి జకీర్ ఎదిగాడు. ఈ కళలో మరేదో నేర్చుకోవాలన్న నిరంతర తపన, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవటం అనే గుణాలే జకీర్‌ను ఉన్నత శిఖరా లకు చేరుస్తూ వచ్చాయి. తన సంగీతయానంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్వాంసులను కలుసు కునే అవకాశం లభించటం, వారినుంచి ఎన్నో సంగతులు నేర్చుకోవటం తన ఉన్నతికి దోహద పడ్డాయంటారు జకీర్. కొందరు సంగీత విద్వాంసులు అభిప్రాయపడినట్టు ఆయన సృష్టించిన మేళనాలు వాటికవే విప్లవాత్మకమైనవి కాదు. కానీ తన వాద్యంపై ఆయన సాధించిన అసాధారణ మైన పట్టు, సంక్లిష్ట స్వరాల మలుపులకు అనుగుణంగా అలవోకగా తబలాను పలికించటం, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవటం జకీర్ విశిష్టత. ఒక సంగీతకారుడన్నట్టు కళాత్మకమైన సృజనే సంగీత నియమాలను సృష్టిస్తుంది. నిబంధనలు సంగీతాన్నీ, సంగీతకారులనూ సృజించలేవు. జకీర్ అయినా, గుక్కతిప్పుకోకుండా ఎంతటి సంక్లి ష్టమైన స్వరాలనైనా ఏకబిగిన పలికించగల శంకర్ మహదేవన్ అయినా, వేణుగాన విన్యాసంలో పేరుప్రఖ్యాతులు గడించిన రాకేష్ చౌరాసియా అయినా గాల్లోంచి ఊడిపడరు. ఎప్పటికప్పుడు తమను తాము ఉన్నతపరుచుకోవాలన్న తపన, నిరంతర అధ్యయన శీలత వారిని ప్రపంచంలో ఉత్త ములుగా నిలుపుతాయి. ఏ రంగంలో ఎదగదల్చుకున్నవారికైనా దగ్గరదారులంటూ ఉండవు. సంగీత ప్రపంచాన మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన ఈ ముగ్గురూ రాగలకాలంలో ఎందరికో ఆదర్శనీయులవుతారు. -
Grammy Awards 2024: రీసౌండ్ చేసిన శక్తి బ్యాండ్.. 46 ఏళ్లలో తొలిసారి..
అంతర్జాతీయ వేదికపై మనవాళ్లు మరోసారి సత్తా చాటారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల(Grammy Awards 2024)ను శక్తి మహదేవన్, జాకీర్ హుస్సేన్ ఎగరేసుకుపోయారు. వీరి బ్యాండ్‌లో రిలీజైన 'దిస్ మూమెంట్'కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా గ్రామీ పురస్కారం వరించింది. అలాగే పాస్‌తో పాట, ఆజ్ వి స్పీక్ ఆల్బమ్కుగానూ జాకీర్ హుస్సేన్(తబల), రాకేశ్ చౌరాసియా(ఫ్లూటు) మరో రెండు అవార్డులు గెలుచుకున్నారు. సోమవారం నాడు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 69వ గ్రామీ అవార్డు వేడుకలు జరిగాయి. భారతీయ కళాకారులకు మూడు అవార్డులు రావడంతో అభిమానులు, సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గ్రామీ విజేత కాగా జాకీర్ హుస్సేన్ 2009లో గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ ఆల్బమ్కుగానూ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏకంగా మూడు (ఇందులో రెండు రాకేశ్‌తో కలిసి తీసుకున్నవి) పురస్కారాలు అందుకోవడంతో ఆయన్ను అభినందిస్తున్నారు. 'గ్రామీ' అందుకున్న దిస్ మూమెంట్ పాటను శంకర్ మహదేవన్(సింగర్), జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. శక్తి బ్యాండ్ ఏర్పడింది అప్పుడే! కాగా శక్తి బ్యాండ్ 1973లో ఏర్పాటైంది. మొదట్లో దీనికి మహావిష్ణు ఆర్కెస్ట్రా అన్న పేరు ఉండేది. వీరు భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని ప్రధానంగా వాయించేవారు. అప్పట్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యాండ్ ఎన్నో కచేరీలు నిర్వహించింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత అదే 'శక్తి' బ్యాండ్ పేరిట దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులను ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్‌లో శ్రీని డ్రీమ్, బెండింగ్ రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పల్మాస్, చంగై నైనో, సోనో మామ అనే పాటలు ఉన్నాయి. Congrats Best Global Music Album winner - 'This Moment' Shakti. #GRAMMYs 🎶 WATCH NOW https://t.co/OuKk34kvdu pic.twitter.com/N7vXftfaDy — Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 4, 2024 చదవండి: 12th ఫెయిల్ దర్శకుడి భార్యపై కంగనా ఫైర్ -
గ్రామీ అవార్డ్స్: ‘శక్తి’ బ్యాండ్ సత్తా, దిగ్గజాల సెల్ఫీ వైరల్
#AR Rahmancelebrates 'Raining Grammys'ప్రతిష్టాత్మక 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024లో భారత్ సత్తా చాటింది. ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ దిగ్గజ సంగీత విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ , సెల్వగణేష్ వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్‌తో కూడిన సూపర్ గ్రూప్ ‘శక్తి’ బ్యాండ్ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి దక్కడం విశేషం శక్తి బ్యాండ్ ఆవిర్భావం మహావిష్ణు ఆర్కెస్ట్రా రద్దు తరువాత 1973లో ఫ్యూజన్ బ్యాండ్, శక్తి బ్యాండ్ ఏర్పడింది. ఇందులో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(తబ్లా) ప్రముఖ సింగర్ శంకర్ హదేవన్,గిటారిస్ట్ జాన్ మెక్లాఫ్లిన్, వి సెల్వగణేష్ , వయోలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ వంటి ప్రఖ్యాత కళాకారులున్నారు. చాలా ఏళ్ల తరువాత 2020లో దీన్ని సంస్కరించారు. అలాగే మూడేళ్ల తరువాత తొలి ఆల్బమ్ ‘దిస్ మూమెంట్’జూన్ 23, 2023లో రిలీజ్ అయింది. తాజా ఆల్బమ్‌లో శ్రీనిస్ డ్రీమ్, బెండింగ్ ద రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పాల్మాస్‌తో సహా 8 ట్రాక్‌లు ఉన్నాయి. గ్రామీ అవార్డుపై శుభాకాంక్షలు తెలిపిన అస్కార్ విన్నర్ మ్యూజిక్ మాస్ట్రో ఏర్ రెహమాన్ ఇండియాకు గ్రామీ అవార్డుల వర్షం కురుస్తోందంటూ ఇన్‌స్టాలో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. మాజీ గ్రామీ విజేత కూడా అయిన రెహ్మాన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ,వితో కలిసి ఉన్న సెల్ఫీని షేర్ చేశారు. అటు గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సంగీత కుటుంబానికి, ఫ్యాన్స్‌తోపాటు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని అభినందనల్లో ముంచెత్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఘనాపాటీ ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండవ గ్రామీని గెలుచుకున్నారని పేర్కొన్నారు .దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso — Ricky Kej (@rickykej) February 4, 2024 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి బ్యాండ్‌కు చెందిన పాష్టో పాట ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా గౌరవనీయమైన గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. పాష్టోకు చెందిన యాస్ వి స్పీక్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బమ్ అవార్డు కూడా గెలుచుకుంది. అంతేకాదు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని హర్షం
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకీర్ హుస్సేన్(తబలా),శంకర్ మహదేవన్ (సింగర్)లు ఉన్న శక్తి బ్యాండ్‌కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Congratulations @ZakirHtabla, @Rakeshflute, @Shankar_Live, @kanjeeraselva, and @violinganesh on your phenomenal success at the #GRAMMYs! Your exceptional talent and dedication to music have won hearts worldwide. India is proud! These achievements are a testament to the hardwork… — Narendra Modi (@narendramodi) February 5, 2024 దిస్ మూమెంట్ పాటను జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్(సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతకు ముందు.. శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు. -
సరిగమప లిటిల్ చాంప్స్ విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి జెట్షెన్ దోహ్నా నిలిచింది. సిక్కింకు చెందిన ఈ చిన్నారి లిటిల్ చాంప్స్9 విజేతగా ట్రోఫీతో పాటు రూ. 10లక్షల నగదు బహుమతిని అందుకుంది. మూడేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారి తన ముద్దులొలికే గాత్రంతో ఎన్నో పాటలు పాడి ప్రశంసలు అందుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శంకర్ మహాదేవన్ సైతం దోహ్నాని 'మినీ సునిధి చౌహాన్' అంటూ పేరు కూడా పెట్టారు. తాజాగా సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా నిలవడంతో సిక్కీం ముఖ్యమంత్రి, ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ సహా పలువురు దోహ్నాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టైటిల్ విన్నర్‌గా నిలిచిన దోహ్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'టైటిల్ గెలుస్తానని అస్సలు ఊహించలేదు. నిజానికి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. కార్టూన్స్ షోస్‌లో సాంగ్స్ వింటూ సంగీతంపై ఆసక్తి కలిగింది. నాకు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు' అంటూ పేర్కొంది. ఏదో ఒకరోజు సింగర్ సునిధి చౌహాన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. -
అలిపిరికి అల్లంత దూరంలో.. మార్మోగుతున్న మా తిరుపతి సాంగ్
''జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం.. ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం.. మా తిరుపతి'' ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. రావణ్ నిట్టూరు కధానాయకుడిగా కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజైన మా తిరుపతి పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్గా మారిపోయింది. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించగా శంకర్ మహదేవన్, రమ్య బెహార అద్భుతంగా పాడారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్లో ట్రెండింగ్ ఆ సినిమా కోసం మహేశ్ సిక్స్ ప్యాక్? ఫోటోతో లీక్ చేసిన నమ్రత -
Shankar Mahadevan: బ్రీత్లెస్ సింగర్
-
Shankar Mahadevan: భం...భం అఖండ అంటూ ఖంగున మోగే కంఠం ఆయన సొంతం
ఆయన పాట వింటే తనువు పరవసిస్తుంది. మనసు పులకరిస్తుంది. గుండె సంబరపడుతోంది. ఆయనే భారతీయ సంగీత స్వరకర్త శంకర్ మహదేవన్. ఆకాశం అమ్మాయితే లాంటి రొమాంటిక్ పాట అయిన ,మహాప్రాణ గీతం అనే భక్తిరస పాట అయిన , కొడితే కొట్టాలిరా అని మాస్ సాంగ్ అయిన ఆయన గాత్రంతో కొత్త అందం తీసుకొస్తాడు.ఆయన పాడిన బ్రీత్లెస్ ట్రాక్ అప్పడు, ఇప్పడూ సూపర్‌హిట్టే. నేడు ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ జర్నీపై ఓ లుక్కేద్దాం 1967 మార్చి 3న ముంబైలో పుట్టి పెరిగాడు శంకర్ మహదేవన్. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే వీణ వాయించటం ప్రారంభించాడు. మరాఠీ సంగీత స్వరకర్తగా పేరు పొందిన పండిట్ శ్రీనివాస్ ఖలే మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. చదువు పూర్తి అయిన తరువాత కొన్నాళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. అలా కొంతకాలం పని చెసిన తర్వాత సంగీతం రంగంలోకి అడుగుపెట్టాడు. ప్లేబ్యాక్ సింగర్‌గా ఒక తమిళ చిత్రంలో తొలి అవార్డును సాధించాడు. ఎఆర్. రెహమాన్ తో కలసి పాడిన పాట ఆయనకు జాతీయ చలన చిత్ర అవార్డు తెచ్చిపెట్టింది. 1998లో మహదేవన్ నిర్మించి పాడిన బ్రీత్లెస్ ఆల్బమ్ పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆయన వరసగా సినిమాలకి మ్యూజిక్ అందించడం, అలాగే పాటలు పాడటం మొదలెట్టాడు. ఇక తెలుగులో ఆయన పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లో చంద్రుడిలో ఉండే కుందేలు పాట , అత్తారింటికి దారేది లో అమ్మో బాపుగారి బొమ్మో పాట, మొన్నటి అఖండ టైటిల్ సాంగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు వాడు కాకపోయినప్పటికీ.. కఠినమైన పదాలను సైతం చాలా అలవోకగా పాడేయడం ఆయన స్పెషల్. తెలుగులో శంకర్ మహదేవన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఏకైక సినిమా సిద్దార్ధ నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ఇక హిందీలో ఆయన సంగీతం అందించిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుక్కతిప్పుకోకుండా, ఊపిరి బిగబట్టి పాటలు పాడి శ్రోతల్ని మంత్రముగ్థుల్ని చేసే ప్రతిభ అతని సొంతం. అందరుకే సినీ సంగీత ప్రపంచంలో శంకర్ మహదేవన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన ఫ్యాన్స్ ఆనంద పారవశ్యంలో మునిగి తేలతారు. ఇక అవార్డుల విషయానికొస్తే.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. నాగార్జున హీరోగా నటించిన శిరిడి సాయిలోని ఒక్కడే దేవుడు పాటకు గానును నంది అవార్డు వచ్చింది. అలాగే 2019 లో ఆయన సంగీతానికి చేసినా సేవకి గాను పద్మ శ్రీ తో ప్రభుత్వం సత్కరించింది. -
Ardha Shathabdam: ఆకట్టుకుంటున్న ‘మెరిసేలే మెరిసేలే’ సాంగ్
కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం- కృష్ణ ప్రియ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్థ శతాబ్దం’. 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్, రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకి సంబంధించి ‘అరె మెరిసెలే.. మెరిసెలే.. మిలమిల మెరిసెలే’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పాటకి రహ్మన్ సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్ శ్రావ్యంగా ఆలపించారు. నవ్ఫాల్ రాజా ఎఐఎస్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఏ కన్నులు చూడనీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణలో కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందినట్లు ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేశ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ఆసక్తికరంగా ‘అర్ధ శతాబ్దం’ట్రైలర్ -
రెండు గంటల్లో పాట రాసిన కమల్
-
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
పుడమి తల్లికి ప్రణామం
గాత్రాలన్నీ శృతిలో ఉన్నాయి. తొమ్మిది మంది గాయనీగాయకులు! బాంబే జయశ్రీ–టు–శంకర్ మహదేవన్. ఇక స్వరాలు కావాలి. పుడమిపై పరిచేశాడు అమృత్ రామ్‌నాథ్. కర్ణాటక సంగీతంలో కసుగాయి. 21 ఏళ్లుంటాయంతే. పాడతాడు. పాటలకు ఉయ్యాలలు కడతాడు. అతడికొచ్చింది ఆఫర్! వరల్డ్ ఎర్త్డేకి మంచి మ్యూజిక్ వీడియో చెయ్యాలి. అదీ ఆఫర్. ఆర్నెల్ల కిందటే వరల్డ్ ‘ఎర్త్ డే నెట్వర్క్’.. ఇండియాలో వెదకులాట మొదలు పెట్టింది. బాగా పాడేవారి కోసం. బాగా ట్యూన్ కట్టేవాళ్ల కోసం. బాగా లిరిక్స్ రాసేవారి కోసం. ఎర్త్ డే నెట్వర్క్కి భారతీయ రాయబారి బాంబే జయశ్రీ. కర్ణాటక లలిత సంగీత, సినీ గాయని. జయశ్రీనే దగ్గరుండి టీమ్‌ని తయారు చేసుకున్నారు. ఉత్సాహవంతుడైన అమృత్ రామనాథ్కి దర్శకత్వ బాధ్యతల్ని ఇచ్చేశారు! ఆ సంగీత దృశ్యకావ్యమే.. ‘ధర్తీ మా’. పుడమి తల్లికి ప్రణమిల్లడం. ఒకే పాటను ఎనిమిది భాషల్లో.. హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీలలో.. పాడించాలి. ఒకే భావాంశానికి ఈ ఎనిమిది భాషల్లో అక్షరాలను పొదగాలి. వయోలిన్, గిటార్, తబలా, మృదంగం.. ప్రధాన వాద్యాలు. అందరూ తిరుగులేని విధంగా కుదిరారు. లిరిక్స్ వచ్చేశాయి. కొంత పని అయ్యాక మార్చి 25 కి కట్టుబడి నిలిచిపోయింది. లాక్డౌన్! అప్పటికి రికార్డింగ్ అయింది ముగ్గురి గాత్రాలు మాత్రమే. జయశ్రీ, అభిషేక్, శ్వేత. చెన్నైలోని అమృత్ రామ్‌నాథ్ హోమ్ స్టూడియోలో ఉన్నారు వాళ్లు ముగ్గరూ. మిగతావాళ్లు చెన్నై చేరుకోలేకపోయారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కో.. ఎక్కడున్న వాళ్లు అక్కడి నుంచే పాడి పంపిస్తే.. మిగతా ఖాళీలను స్టూడియోలో పూరించుకున్నాడు అమృత్ రామనాథ్. ఆ మాత్రం త్వరగానైనా అయింది.. ప్లానింగ్‌లో అతడు జాగ్రత్తగా ఉండటం వల్లనే. జయశ్రీ మేమ్‌తో తను ఎన్నిమాటలైనా పడతాడు. కానీ జయశ్రీ మేమ్కు మాట రాకూడదు అనుకున్నాడు. ఒరిజినల్ ట్యూన్ ఇదీ అనుకున్నాక ఆ ట్యూన్‌కి తగ్గట్లు హిందీలో తనే పాట భావాన్ని రాయించి మిగతా ఏడు భాషల్లోని గేయ రచయితలకు పంపించాడు. ఎర్త్ డే నెట్వర్క్కి సహ రాయబారి కౌశికి చక్రవర్తి. ఆమె కూడా రామ్‌నాథ్‌కి కీలకమైన దర్శక సహకారం అందించారు. చిత్రా సాయిరామ్ (కన్నడ), చేతనా శ్రీకాంత్ (హిందీ, మరాఠీ) కార్తీక్ దలాల్ (గుజరాతీ), వి.పి.రామ్‌నాథ్ (బెంగాలీ), మథురాంతకి (తమిళ్), షిజిత్ నంబియార్ (మలయాళం), విధూ పుర్కాయస్థ (పంజాబీ).. వీళ్ల నుంచి పాట లిరిక్స్ తెప్పించి, మూలార్థానికి అనువాదాలు సరిపోయిందీ లేనిదీ చెక్ చేయించిందంతా కౌశికీనే. బెంగాలీ లిరిక్స్ రాయడంలో రామ్‌నాథ్‌కి కూడా ఆమె సహాయం చేశారు. యజ్ఞం పూర్తి అయింది. ‘‘భూమాతా నీకు వందనాలు. మా జీవనాధారం నువ్వే. తరాలుగా మా పోషణ నువ్వే. ప్రణామాలు తల్లీ.. నీకు ఆత్మ ప్రణామాలు..’’ అని ‘ధర్తీ మా’.. ఆలపించే ఈ బహుభాషా స్తుతి గీత గుచ్ఛం.. యాదృచ్ఛికంగానే అయినా సరైన సమయంలో వచ్చింది. వరల్డ్ఎర్త్డే సందర్భంగా నేడు విడుదల అవుతున్నా.. ఈ కరోనా కష్ట కాలమూ ఒక సందర్భం అయింది. -
వయోలిన్‌తో ..శంకర్ మహదేవన్ పాట
-
వయోలిన్‌తో ..శంకర్ మహదేవన్ పాట
శంకర్ మహదేవన్..ఈపేరు సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదు. ఆయన పాడిన బ్రీత్లెస్ ట్రాక్ అప్పడు, ఇప్పడూ సూపర్‌హిట్టే. తాజాగా ఈ పాటకు ముంబైకి చెందిన కళాకారిణి శ్వేత ఆనందశివన్ వయోలిన్‌తో చేసిన ప్రదర్శన నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను శంకర్మహదేవన్కు ట్యాగ్ చేయగా, ఇప్పటికే 4 లక్షల వ్యూస్ వచ్చాయి. 13 వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు. 1998లో శంకర్ మహదేవన్ పాడిన ఈ బ్రీత్లెస్ ట్రాక్ ఎంతో పాపులర్ అయ్యింది. దీనికి శ్వేత ఆనందశివన్ కూడా నిర్విరామంగా వయోలిన్ వాయించి నెటిజన్లను ఆకట్టుకుంది. -
దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన శంకర్ మహదేవన్
-
‘సాహో’కు షాక్.. వాళ్లు తప్పుకున్నారు
బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈ చిత్రంతో ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. తన తదుపరి చిత్రాలను కూడా ఆ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. రీసెంట్గా సాహో చిత్రబృందానికి చుక్కెదురైంది. సాహో చిత్రానికి గాను శంకర్, ఇషాన్ నూరని, లాయ్ మెన్డోన్సా త్రయాన్ని సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండగా.. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సంగీత దర్శకులు ప్రకటించడం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరి వీరి నిష్క్రమణకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. యూనిట్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రభాస్, సుజిత్, వంశీ, ప్రమోద్, శ్యామ్‌లకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. మరి వీరి స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి. We wish to inform all our fans that Shankar Ehsaan Loy have opted out of composing the music for #Saaho here’s wishing #Prabhas @Sujeetsign #Vamsi #Pramod #Shyam all the luck for the film :) — Shankar Ehsaan Loy (@ShankarEhsanLoy) May 27, 2019 -
పాట పరవశించింది
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు. నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు. ‘అవును.. ఆలస్యం అయింది. అవార్డు అనేది విలువను గుర్తించేది, గౌరవించేది మాత్రమే కానీ విలువను నిరూపించేది కాదు’ అని ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ. ఆ మధ్య ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే ... ‘నా పేరులోనే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల. సిరి శక్తి సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల. మాట సైతం తన వెన్నెల ప్రసరించమని విన్నవించుకునే విన్నపం సిరివెన్నెల. ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్ పూర్తి చేసిన íసీతారామశాస్త్రి 1984లో సినిమా సాహిత్యం వైపు అడుగులేశారు. మొట్టమొదట రాసింది జననీ జన్మభూమి(1984) సినిమాకే అయినా ఆ తర్వాత రాసిన ‘సిరివెన్నెల’ సినిమా పాటలు ఆయనకు ఇండస్ట్రీలో స్థానం ఇచ్చాయి. చెంబోలు సీతారామశాస్త్రి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మార్చింది ఆ చిత్రం. ‘సిరివెన్నెల’ తర్వాత శాస్త్రి వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయింది. ఆ సినిమాలో రాసిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం. అంత అర్థవంతంగా ఉండబట్టే ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి పరుగుతీసింది. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ సుస్థిరం చేసుకున్నారు. ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా, చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన. ‘సింధూరం’లో అర్ధ శతాబ్దపు అజ్ఞానమే స్వాతం త్య్రం అనుకుందామా? అని ప్రశ్నను సంధిస్తే దానికి సమాధానం నంది అవార్డు అయింది. ‘దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని..’ ప్రేమ పాట రాయడం రాష్ట్ర ప్రభుత్వం నంది కురిపించడం జరిగిపోయింది. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకూ’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే. ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్ సృష్టించారు. ప్రస్తు తం ఉన్న అగ్ర పాటల రచయితలు కూడా సిరివెన్నెలను ‘గురువు’గా భావిస్తారన్న సంగతి తెలిసిందే. కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల. ఇప్పుడాయన పేరులో రెండు ‘పద్మ’లున్నాయి. సతీమణి ‘పద్మ’... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’. పాట ఆనందపడిన వేళ ఇది. పాట పరవశించిపోయిన వేళ ఇది. -
సితారే జమీన్ పర్
-
ఏం పాడాడండీ!
ఏ కోటలోనో పాగా వేయడానికి అతడు పాట పాడలేదు కానీ, తోటలో పని చేసుకుంటూ తను పాడిన పాట సినీ స్టార్ కమల్‌హాసన్, మ్యూజిక్ స్టార్ మహదేవన్‌ల గుండెల్లో పాగా వేసింది! ఇప్పుడతడు మ్యూజిక్‌లో ‘రాకింగ్ స్టార్’. అంటే మట్టిరాళ్లలోని మాణిక్యం! ఎక్కడో కేరళలో రబ్బరు తోటల్లో పనిచేస్తూ కూనిరాగాలు తీసిన ఓ యువకుడి కోసం ప్రఖ్యాత సంగీత దర్శకులు గాలిస్తున్నారంటే అతిశయమే అవుతుంది. అంతేకాదు.. ఆ యువకుడిని లోక నాయకుడు కమల్ హాసన్ తన ఇంటికి పిలుచుకుని అభినందించాడంటే మరో నమ్మశక్యం కాని విషయం అవుతుంది. సంగీతం తెలియదు. అసలు చదువు కూడా అబ్బలేదు. కానీ.. ఆ మలయాళీ యువకుడి అదృష్టం ఒకే ఒక్క పాటతో మారిపోయింది. యూట్యూబ్ లో ట్రెండ్ గా మారిన ఆ మలయాళీ అసలేం చేశాడో చూద్దాం. కేరళలోని ఆళపుళ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన రాకేష్ ఉన్ని రబ్బరు తోటల్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ చిత్రంలోని ‘ఉన్నై కానామేం..’ అంటూ సాగే పాటను హృద్యంగా పాడగా దానిని సెల్ఫోన్లో రికార్డు చేసిన స్నేహితులు యూట్యూబ్ లో ఉంచారు. అనుకోకుండా ఆ పాటను విన్న కమల్ హాసన్ వెంటనే దానిని సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ చేరవేశారు. దీంతో ఆ పాటను విన్న శంకర్ మహదేవన్ దానిని తన ట్విట్టర్ లో పెట్టి ఆ యువకుడిని కలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. సంగీతం తెలిసిన జ్ఞానిలా స్వరబద్దంగా రాకేష్ ఉన్ని ఆలపించిన తీరు తనకంటే చాలా బాగుందని అభినందించారు. దీంతో ఆ యువకుడి వివరాలను తీసుకున్న నటుడు కమల్ హాసన్ మంగళవారం రాకేష్‌ను చెన్నైలోని తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన కమల్ హాసన్ రాకేష్ ఉన్నిను పరిచయం చేశారు. తాను కూనిరాగంగా పాడిన ఓ పాటతో తనకు ఇంతటి పేరు వస్తుందని తాను ఊహించలేదని అంటూ.. కమల్ హాసన్, శంకర్ మహదేవన్‌కు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు శంకర్ మహదేవన్ ను కలుసుకునేందుకు తనకు ఆరాటంగా ఉందన్నారు. – సంజయ్ గుండ్ల, సాక్షి, చెన్నై -
అమ్రిష్కు శంకర్ మహదేవన్ ప్రశంసలు
తమిళ సినిమా: యువ సంగీత దర్శకుడు అమ్రిష్ను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రశంసించారు. నటి జయచిత్ర వారసుడు అమ్రిష్ హీరోగా పరిచయమై అనంతరం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఎంగ్మంగ్చంగ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని అయ్యనార్ వందుటారు ఇంగేపారు అనే పాటను అమ్రిష్ దర్శకత్వంలో ఇటీవల ముంబైలో రికారి్డంగ్ చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాడడం విశేషం. పాట పాడిన అనంతరం శంకర్ మహదేవన్ జయచిత్రకు ఫోన్ చేసి పాట అద్భుతంగా వచ్చింది, మీ అబ్బాయి గొప్ప సంగీత దర్శకుడు అవుతారని ప్రశంసించారని ఆమె తెలిపారు. కాగా మరో పాటను చిత్ర హీరో ప్రభుదేవా రాయగా సంగీత దర్శకుడు అమ్రిష్ ఆలపించడం మరో విశేషం. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శంకర్ మహదేవన్
-
సంగీతం కన్నీరు పెట్టింది
సంగీతం కన్నీరు కార్చింది. మాండలిన్ శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించిన సినీ కళాకారులు, సంగీత కళాకారు లు దుఃఖంతో ఏడవడానికి కూడా గొంతు పె గలక మౌనంగానే రోదించారు. శ్రీనివాసన్ కుటుంబ సభ్యుల్లో మాత్రం శోకం కట్టలుతెంచుకుంది. శనివారం మాండలిన్ శ్రీనివాస్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించా రు. ఆయన్ను కడసారి చూసేందుకు పలువు రు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించా రు. నివాళులర్పించినవారిలో డీఎంకే కోశాధికారి స్టాలిన్, మాజీ మేయర్ సుబ్రమణియన్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్‌దేవా, గాయకులు శంకర్ మహదేవన్, హరి హరన్, డ్రమ్స్ శివమణి, నటి శోభన తదితరులు ఉన్నారు. సంగీత మహాన్: డ్రమ్స్ శివమణి మాట్లాడు తూ మాండలిన్ శ్రీనివాస్ కర్ణాటక సంగీత మహాన్ అని కొనియాడారు. కర్ణాటక సంగీతానికి ఖ్యాతి నార్జించి పెట్టిన లెజెండ్‌ను కోల్పోయామన్నారు. శ్రీనివాస్ తనకు చిన్న నాటినుంచి తెలుసన్నారు. అంతేకాదు ఆయన తన కు గురువుఅని అన్నారు. శ్రీనివాస్‌తో కలసి పలు కచేరీలు చేశానని తెలిపారు. ఈ సందర్భంగా డ్రమ్స్ శివమణి మాండలిన్ పార్థివదేహం వద్ద డ్రమ్స్ వాయిస్తూ కన్నీటి నివాళులర్పించారు. మూలస్తంభాన్ని కోల్పోయాం : దేశంలోని మాండలిన్ వాయిద్య కళాకారుల్లో నాలుగుస్తంభాల్లాంటి కర్ణాటక సంగీతకళాకారుల్లో ఒక స్తంభాన్ని కోల్పోయామని సంగీతదర్శకుడు శ్రీకాంత్‌దేవా అన్నారు. గౌరవం అనేది ఆయననుంచి నేర్చుకోవాలన్నారు. ఆయనతో కల సి ఒక సంగీత కచేరి చేయాలన్న సంకల్పం నెరవేరకుండానే శ్రీనివాస్ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఆత్మకు శాం తి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అన్నారు. నటి శోభన సంతాపం వ్యక్తం చేయలేనంతగా కంటతడి పెట్టారు. గాయకుడు హరిహరన్ బోరున ఏడ్చేశారు. దేవిశ్రీ ప్రసాద్ శ్మశానవాటికకు వెళ్లి మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్ అభిమానులు కర్ణాటక సంగీత చక్రవర్తికి జోహార్‌అంటూ ఘోషిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీనివాస్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో స్థానిక బెసెంట్నగర్లోని శ్మశానవాటికలో జరిగాయి.