సంగీతం కన్నీరు పెట్టింది
సంగీతం కన్నీరు కార్చింది. మాండలిన్ శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించిన సినీ కళాకారులు, సంగీత కళాకారు లు దుఃఖంతో ఏడవడానికి కూడా గొంతు పె గలక మౌనంగానే రోదించారు. శ్రీనివాసన్ కుటుంబ సభ్యుల్లో మాత్రం శోకం కట్టలుతెంచుకుంది. శనివారం మాండలిన్ శ్రీనివాస్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించా రు. ఆయన్ను కడసారి చూసేందుకు పలువు రు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించా రు. నివాళులర్పించినవారిలో డీఎంకే కోశాధికారి స్టాలిన్, మాజీ మేయర్ సుబ్రమణియన్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్‌దేవా, గాయకులు శంకర్ మహదేవన్, హరి హరన్, డ్రమ్స్ శివమణి, నటి శోభన తదితరులు ఉన్నారు.
సంగీత మహాన్: డ్రమ్స్ శివమణి మాట్లాడు తూ మాండలిన్ శ్రీనివాస్ కర్ణాటక సంగీత మహాన్ అని కొనియాడారు. కర్ణాటక సంగీతానికి ఖ్యాతి నార్జించి పెట్టిన లెజెండ్‌ను కోల్పోయామన్నారు. శ్రీనివాస్ తనకు చిన్న నాటినుంచి తెలుసన్నారు. అంతేకాదు ఆయన తన కు గురువుఅని అన్నారు. శ్రీనివాస్‌తో కలసి పలు కచేరీలు చేశానని తెలిపారు. ఈ సందర్భంగా డ్రమ్స్ శివమణి మాండలిన్ పార్థివదేహం వద్ద డ్రమ్స్ వాయిస్తూ కన్నీటి నివాళులర్పించారు.
మూలస్తంభాన్ని కోల్పోయాం :
దేశంలోని మాండలిన్ వాయిద్య కళాకారుల్లో నాలుగుస్తంభాల్లాంటి కర్ణాటక సంగీతకళాకారుల్లో ఒక స్తంభాన్ని కోల్పోయామని సంగీతదర్శకుడు శ్రీకాంత్‌దేవా అన్నారు. గౌరవం అనేది ఆయననుంచి నేర్చుకోవాలన్నారు. ఆయనతో కల సి ఒక సంగీత కచేరి చేయాలన్న సంకల్పం నెరవేరకుండానే శ్రీనివాస్ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఆత్మకు శాం తి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అన్నారు. నటి శోభన సంతాపం వ్యక్తం చేయలేనంతగా కంటతడి పెట్టారు. గాయకుడు హరిహరన్ బోరున ఏడ్చేశారు. దేవిశ్రీ ప్రసాద్ శ్మశానవాటికకు వెళ్లి మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్ అభిమానులు కర్ణాటక సంగీత చక్రవర్తికి జోహార్‌అంటూ ఘోషిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీనివాస్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో స్థానిక బెసెంట్‌నగర్‌లోని శ్మశానవాటికలో జరిగాయి.