Lata Mangeshkar Last Rites Performed With Full State Honours - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar Last Rites: ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్‌ అం‍త్యక్రియలు..

Published Sun, Feb 6 2022 5:58 PM | Last Updated on Mon, Feb 7 2022 3:45 PM

Lata Mangeshkar Last Rites Performed At Shivaji Park - Sakshi

Lata Mangeshkar funeral live updates:

ముగిసిన అంత్యక్రియలు

కన్నీటి వీడ్కోలతో లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లతాజీ భౌతికకాయానికి మోదీ నివాళులు అర్పించారు. 

సచిన్‌ టెండ్కూర్‌ ఆయన సతీమణి లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

లెజెండరీ సింగర్‌, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ మరణం యావత్‌ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివచ్చారు.

అంతకుముందు ముంబైలోని లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్‌కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement