ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్‍తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
(ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్‌ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?)
పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్‍టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే)
నటుడి భార్య కన్నుమూత
ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్‍ల్యాండ్ వెకేషన్‍లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment