Singer Bappi Lahiri Last Post Before 2 Days Of His Death Goes Viral - Sakshi
Sakshi News home page

Bappi Lahiri: మరణానికి రెండు రోజుల ముందు కూడా 'బంగారు' బప్పి.. పోస్ట్‌ వైరల్‌

Published Wed, Feb 16 2022 1:43 PM | Last Updated on Wed, Feb 16 2022 4:21 PM

Old Is Gold: Bappi Lahiri Last Instagram Post Goes Viral - Sakshi

Old Is Gold: Bappi Lahiri Last Instagram Post Goes Viral: లెజెండరీ మ్యూజిక్‌ కంపోజర్‌, సింగర్‌ బప్పి లహరి ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డిస్కో, ఫాస్ట్‌ బీట్‌ తరహా పాటలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆయన ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల​కు పనిచేశారు.  బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసి ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలిచారు.

వయసు పెరిగినా తరగని ఉత్సాహంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఇక బప్పి లహరి అనగానే బంగారం నడిచొస్తున్నట్లు ఒక రూపం మన మదిలో ప్రతిబింబిస్తుంది. కిలోల కొద్దీ బంగారు గొలుసులు ధరించి ఫ్యాషన్‌ ఐకాన్‌లా దర్శనమివ్వడం బప్పి లహరి స్పెషాలిటీ. మరణానికి రెండు రోజుల ముందు కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బప్పి షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తన త్రోబాక్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. దీనికి ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ బప్పి క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 1952 లో బెంగాల్‌లో జన్మించిన బప్పి మూడేళ్ల వయసులోనే తబలా వాయించడం మొదలుపెట్టారు. 19 యేళ్ల చిన్న వయసులోనే మొదటి సారిగా బెంగాలీ సినిమా ‘డడు’ కి సంగీత దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ సహా పలు భాషల్లో ఎన్నో విజయవంతమైన పాటలకు తన గానంతో మెస్మరైజ్ చేసి,తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పిదా. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement