bappi lahiri
-
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ సింగర్ కుమారుడు.. సోషల్ మీడియాలో వైరల్
లెజెండరీ సింగర్, దివంగత బప్పి లాహిరి కుమారుడు బప్పా లాహిరి మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాను రెండో సారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ క్రిస్మస్ వేళ మేం నలుగురం కాబోతున్నాం అంటూ తన భార్య తనీషాతో కలిసి దిగిన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ జంటకు ఇప్పటికే క్రిష్ అనే కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంటకు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. బప్పా లాహిరి, తనీషా మార్చి 18, 2012 న పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే వీరు ఒకరికొకరు పరిచయం ఉండగా.. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. 2017లో వీరికి ఓ కుమారుడు జన్మించారు. బప్పి లాహిరి మరణం: బప్పి లాహిరి ఫిబ్రవరి 15న తుది శ్వాస విడిచారు. అతనికి కుమారుడు బప్పా లాహిరి, కుమార్తె రెమా లాహిరి సంతానం. View this post on Instagram A post shared by Bappa.b.Lahiri (@bappa.b.lahiri) -
బప్పి లహరితో నీకు పోలికేంటి? హీరోయిన్ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
Adah Sharma Trolled By Netizens: హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదా శర్మ చేసిన పనికి నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? నువ్వు ఫేమస్ అవడం కోసం ఏదైనా చేస్తావా? అని దుయ్యబడుతున్నారు. ఇంతకీ అందరూ ఆగ్రహించేలా ఆమె ఏం చేసిందంటే... అదా శర్మ ఫేస్బుక్లో బప్పి లహరి ఫొటో పక్కన తన ఫొటోను జోడించింది. ఇందులో ఒంటి నిండా బంగారు నగలు ధరించి, వేళ్లకు ఉంగరాలు తొడుక్కుని బప్పి లహరి స్టైల్లో ఫొటోకు పోజిచ్చింది. అంతేకాదు, ఎవరి ఫొటో బాగుంది? అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన నెటిజన్లు అంత పెద్ద సింగర్‌తో నీకు పోలికేంటి? అని ప్రశ్నిస్తున్నారు. 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే, నువ్వు కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేవు', 'భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా?, నీ సరదాల కోసం మరీ ఇలా దిగజారుతావా?', 'ఛీ, నీమీద ఉన్న గౌరవమంతా పోయింది' అంటూ అదాను ఏకిపారేస్తున్నారు. కాగా గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి ఫిబ్రవరి 16న మరణించారు. ఈయన అటు బాలీవుడ్లో, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం, కన్నడ పరిశ్రమలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. 'ఆకాశములో ఒక తార', 'రాధా రాధా మదిలోన మన్మథ బాధ', 'భద్రాచలం కొండ', 'వానా వానా వెల్లువాయే', 'చిలుకా క్షేమమా', 'మావా మావా మావా..' వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆయన సంగీతం అందించినవే! -
ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు, హాజరైన సినీ ప్రముఖులు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి అంత్యక్రియలు ముంబైలో ప్రారంభమయ్యాయి. చివరి సారి ఆయనకు నివాళులు అర్పించేందుకు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు అంత్యక్రియలకు తరలి వచ్చారు. ముంబైలో ఓ శ్మశాన వాటికలో బప్పి లహిరి అంత్యక్రియలు జరుగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. ముంబైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
Bappi Lahiri: ఆ కళ్లద్దాలు 1.5 లక్షలు, గోల్డ్ టీ సెట్, ముల్లెట్ హెయిర్ స్టైల్.. ఇంకా
ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచిన బప్పీ లహిరి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. లక్షలాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచారు. కేవలం తన పాటలతోనే కాదు.. ఆహార్యంతోనూ అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిన బప్పీ ఇక సెలవు అంటూ దివికేగారు. ఫ్యాన్సీ కాలర్.. బప్పీ ఎక్కువగా కోట్లు ధరించడానికి ఇష్టపడేవారు. టీ–షర్ట్ పైన జాకెట్ ధరించేవారు. అలాగే తాను ధరించే కోట్ లేదా జాకెట్స్‌ని ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించుకునేవారు. ఫ్యాన్సీ కాలర్స్, ఆర్నమెంట్స్‌తో జాకెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేవి. ముల్లెట్ హెయిర్ స్టయిల్ 1970లలో బాగా పాపులర్ అయిన హెయిర్ స్టైలే ముల్లెట్. కొంత పొడవుగా, పొట్టిగా ఉన్న వెంట్రుకల కలయికే ఈ హెయిర్ స్టైల్ ప్రత్యేకత. ఈ హెయిర్ స్టైల్‌నే బప్పీ చనిపోయేవరకు ఫాలో అయ్యారు. అదృష్ట అద్దాలు పగలేగాక, రాత్రి సమయాల్లో జరిగే ఈవెంట్లకు సైతం కళ్లద్దాలను తప్పనిసరిగా పెట్టుకునేవారు బప్పీ. 51 రకాల సన్ గ్లాసెస్ తన దగ్గర ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రూ.1.5 లక్షల ఖరీదైన లూయిస్ వ్యూటన్ గ్లేర్ కళ్లద్దాలు కూడా బప్సీ కలెక్షన్స్‌లో ఉండడం విశేషం. ఇక 51 సన్ గ్లాసెస్‌లో నాలుగైదు అద్దాలు తనకు అదృష్టం తెచ్చిపెట్టాయని ఓ సందర్భంలో బప్పీ తపేర్కొన్నారు. అలాగే మెడలో ఉన్న గొలుసుల్లో ఒక గొలుసులో వినాయకుడి లాకెట్ కనబడుతుంది. ఎన్ని గొలుసులు మార్చినా బప్పీ ఇది మార్చేవారు కాదు. బయటికొచ్చేటప్పుడు ఆభరణాలు, సన్ గ్లాస్లు, ఆడంబరమైన దుస్తులు ధరించే బప్పీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సింపుల్. మామూలు దుస్తులు ధరించడం ఆయన అలవాటు. అలాగే ఒంటి మీద ఆభరణాలు కూడా ఉంచుకునేవారు కాదు. గోల్డ్ టీ సెట్ బంగారు ఆభరణాలను ఇష్టంగా కొనుక్కున్న బప్పీ ఆ మధ్య ధన్తేరాస్కి వెరైటీ గోల్డ్ టీ–సెట్ కొన్నారు. ధన్తేరాస్కి ఏం కొందామని భార్య అడిగితే, ఒక మంచి గోల్డ్ టీ సెట్ కొని తెమ్మని అన్నారట. భర్త ఊహకు దగ్గరగా ఉన్న గోల్డ్ టీ సెట్ కొని, ఆయనకు బహుమతిగా ఇచ్చారు చిత్రాణి. ఫిష్ లవర్ బెంగాలీ ఫుడ్ అంటే బప్పీకి చాలా ఇష్టం. ముఖ్యంగా చేపలను ఇష్టంగా తినేవారు. వారానికి ఒక్కరోజు మాత్రమే శాకాహారం తీసుకునేవారు. మాంసాన్ని బాగా ఇష్టపడే బప్పీ అనారోగ్య కారణాలతో రెడ్ మీట్ మానేసారు. సాయంత్రం సమయంలో చికెన్ శాండ్విచ్ తినడానికి ఇష్టపడేవారు. సముద్ర చేపలకంటే నదిలో పెరిగే చేపలను బాగా ఇష్టపడేవారు. ఆవనూనెతో వండిన చేపల కూరను ఎక్కువగా తీసుకునేవారు. -కె చదవండి: Bappi Lahiri: మరణానికి రెండు రోజుల ముందు కూడా 'బంగారు' బప్పి.. పోస్ట్ వైరల్ -
Bappi Lahiri: మైఖేల్‌కు అన్నీ ఉన్నాయి.. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే!
Bappi Lahiri- Michael Jackson: 1996లో కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ ముంబై వచ్చారు. ఆ సందర్భంలోనే బప్పీ లహిరిని చూశారాయన. ముఖ్యంగా బప్పీ మెడలో ఉన్న వినాయకుడి లాకెట్‌ని చూసి, ‘‘ఓ మై గాడ్.. అద్భుతం. మీ పేరేంటి’’ అని అడిగారు మైఖేల్. బప్పీ తన పేరు చెప్పారు. ‘‘మీరు కంపోజరా?’’ అడిగారు మైఖేల్. ‘‘అవును.. ‘డిస్కో డ్యాన్సర్’ చేశాను’’ అన్నారు బప్పీ. వెంటనే ఆ సినిమాలోని పాట ‘జిమ్మీ’ని ప్రస్తావించి, ‘‘నాకు మీ ‘జిమ్మీ జిమ్మీ..’ పాట చాలా ఇష్టం’’ అన్నారు మైఖేల్. మామూలుగా కొన్ని సందర్భాల్లో బప్పీ బంగారు గొలుసులను కొందరికి బహుమతిగా ఇస్తుంటారు. అయితే ఆ రోజు మైఖేల్‌కి వినాయకుడి లాకెట్ నచ్చినప్పటికీ ఆయనకు ఇవ్వలేదు. దానికి కారణాన్ని ఓ షోలో స్వయంగా చెప్పారు బప్పీ. ‘‘ఆ లాకెట్ మా ఆవిడ కొనిచ్చింది. నా లక్కీ లాకెట్. ఆయన (మైఖేల్)కు అన్నీ ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే. అది నా అదృష్టం. నేను కోల్‌కతాలో పుట్టాను. కానీ నన్ను మహారాష్ట్ర మట్టి ఆశీర్వదించింది. ఒకవేళ మైఖేల్‌కు నేను గణేశుడి లాకెట్ ఇచ్చి ఉంటే.. ఆ ఆశీర్వాదాలు నన్ను వదిలి వెళ్లిపోయి ఉండేవేమో’’ అని ఆ షోలో బప్పీ అన్నారు. అయితే 2009లో మైఖేల్ చనిపోయినప్పుడు ఆయన మీద ఉన్న ఇష్టంతో ప్రత్యేకంగా ఓ పాట కంపోజ్ చేశారు బప్పీ. – కె చదవండి: Rashmika Mandanna: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే ప్రేమ పెళ్లి చేసుకుంటా: రష్మిక -
Bappi Lahiri: బప్పీలహరి మృతికి కారణం ఇదే! సాధారణమే కానీ..
పాత కొత్త తరం బాలీవుడ్‌కే కాదు.. బప్పీలహరి పాటలు తెలుగునాట కృష్ణ, చిరు, బాలయ్య, మోహన్‌బాబు లాంటి వాళ్లకు బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో కెరీర్ బూస్ట్ ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి మ్యూజిక్ ఐకాన్ అస్తమించడం భారత సినీ పరిశ్రమను, ఆయన పాటల అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే ఆయన హఠాన్మరణం వెనుక.. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) కారణమని వైద్యులు ప్రకటించారు. ఈ సమస్య కారణంగానే ఆయన గుండె ఆగిపోయింది కూడా!. స్లీప్ అప్నియా అనేది బ్రీతింగ్ డిజార్డర్(శ్వాస సంబంధిత వ్యాధి). నిద్రలో ఆగి ఆగి శ్వాస తీసుకోవడం దీని లక్షణం. ఇందులో మూడు రకాలు ఉంటాయి. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నీయా. నిజానికి స్లీప్ ఆప్నియా చాలా సాధారణమైన డిసీజ్ అనుకుంటారు చాలామంది. కానీ, అదే సమయంలో ఇది ప్రాణాంతకమైంది కూడా. నిద్రిస్తున్న సమయంలో అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) బ్లాక్ కు గురి అవుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింపచేసి, గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పనిచేస్తాయి. దీంతో పెద్ద జెర్కింగ్ చప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు. ఈ సమస్య ఉన్న వారు చాలామందే ఉంటారు. పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల దాకా.. ముఖ్యంగా ఓవర్‌వెయిట్ ఉన్నవాళ్లపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. సాధారణంగా.. గాలి నోరు, ముక్కు, ఊపిరితిత్తుల గుండా గాలి ప్రవాహం ఉంటుంది. అది నిద్రలో కూడా. శ్వాసనాళ కండరాలు మూసుకుపోవడం వల్ల ఓఎస్ఏ సమస్య ఏర్పడుతుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో శ్వాస నాళాల ఎగువభాగం అడ్డంకికి గురవుతుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెదడు అదే పనిగా సంకేతాలు అందిస్తుంది. దీంతో ఈ సమస్య ఉన్నవాళ్లు మంచి నిద్ర పోలేరు. ఇది దీర్ఘకాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. లక్షణాలు ► పెద్ద శబ్దంతో గురక ► అలసటలేమితో పడుకున్నప్పుడు ► ఉలిక్కిపడి లేచి ఊపిరి పీల్చుకోవడం, ఉక్కిరి బిక్కిరి కావడం. ►పగటి పూట ఎక్కువసేపు నిద్ర ►నిద్రలో శ్వాసకు ఆటంకం ►రాత్రిళ్లు చెమటలు పోయడం ►పొద్దుపొద్దునే తలనొప్పులు ►నిద్రలో పదేపదే మేల్కొనడం వల్ల మతిమరుపు, నిద్రమబ్బు, మాటిమాటికి ఇరిటేషన్ ►పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ►ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లే ఎక్కువగా దీని బారినపడతారు. ►వయసు మళ్లినవాళ్లు, షుగర్ పేషెంట్ల మీదా ప్రభావం ఉంటుంది. ►శ్వాసనాళాలు ఇరుక్కుగా ఉన్నవాళ్లకు ఈ డిజార్డర్ రావొచ్చు. టాన్సిల్స్ వాపునకు గురి కావడం, అడినాయిడ్స్ వాపు సమస్యలతో నాళాలు మూసుకుపోయేవాళ్లకు కూడా ఈ సమస్య ఎదురు కావొచ్చు. ►హైబీపీ పేషెంట్లు, ఎక్కువగా పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు సైతం స్లీప్ ఆప్నియా బారిన పడే అవకాశాలు ఎక్కువ. స్లీప్ అప్నియా కలిగించే సమస్యలనే అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కలిగిస్తుంది. చికిత్స, జాగ్రత్తలు తీసుకోకుంటే.. ప్రమాదం కూడా. అందుకే పగటి పూట ఎక్కువ నిద్ర పోకపోవడం మంచిది. ఆడవాళ్లలో ఈ సమస్య ఉంటే గనుక వెయిట్‌లెస్ పిల్లలు పుట్టే అవకాశం, ఇతర సమస్యలు ఎదురు కావొచ్చు. అంతేకాదు డ్రై ఐ, గ్లౌకోమా సమస్యలు రావొచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ►బరువు తగ్గించుకోవడం ►సీపీఏపీ (CPAP) కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్.. ఈ పరికరాన్ని వైద్యులు సూచించిస్తుంటారు. దీన్ని తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. ►ఒక పక్కకు తిరిగి పడుకోవడం. బోర్లా పడుకోవడం ఓఎస్ఏను మరింత దారుణంగా చేస్తుంది. ►సర్జరీ.. అదీ అవసరమైతేనే. గమనిక.. పైన ఇచ్చిన సమాచారం.. సాధారణమైనది మాత్రమే. ఇలాంటి డిసీజ్ బారిన పడినప్పుడు, లక్షణాలు కనిపించినప్పుడు, ఓఎస్ఏ పరిస్థితి ఎదురైనప్పుడు.. స్పెషలిస్టులను, ఫ్యామిలీ వైద్యులను సంప్రదించడం ఉత్తమం. స్లీప్ అప్నియా బారినపడితే.. జీవిత కాలం 12-15 ఏళ్లపాటు తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం మంచిది. -
బప్పి లహరి అంత్యక్రియలు వాయిదా.. కారణమిదే
లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి మృతిపై బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్లో జన్మించిన బప్పి లహిరి అన్ని భాషల్లో కలిపి 5వేలకు పైగా పాటలు పాడారు. సంగీతానికి వెస్టర్న్ మ్యూజిక్ మిక్స్ చేసి మైమరపించిన సంగీత దిగ్గజం బప్పి లహరి అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు రేపు(గురువారం)నిర్వహించనున్నారు. చదవండి: మరణానికి ముందు.. బప్పి షేర్ చేసిన చివరి పోస్ట్ ఇదే బప్పి లహరి కుమారుడు బప్పా లహరి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కుమారుడు వచ్చాకే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో రేపు ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? -
మరణానికి ముందు.. బప్పి షేర్ చేసిన చివరి పోస్ట్ ఇదే
Old Is Gold: Bappi Lahiri Last Instagram Post Goes Viral: లెజెండరీ మ్యూజిక్ కంపోజర్, సింగర్ బప్పి లహరి ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డిస్కో, ఫాస్ట్ బీట్ తరహా పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేశారు. బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసి ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచారు. వయసు పెరిగినా తరగని ఉత్సాహంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఇక బప్పి లహరి అనగానే బంగారం నడిచొస్తున్నట్లు ఒక రూపం మన మదిలో ప్రతిబింబిస్తుంది. కిలోల కొద్దీ బంగారు గొలుసులు ధరించి ఫ్యాషన్ ఐకాన్‌లా దర్శనమివ్వడం బప్పి లహరి స్పెషాలిటీ. మరణానికి రెండు రోజుల ముందు కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బప్పి షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. తన త్రోబాక్ ఫోటోను షేర్ చేస్తూ.. దీనికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ బప్పి క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 1952 లో బెంగాల్లో జన్మించిన బప్పి మూడేళ్ల వయసులోనే తబలా వాయించడం మొదలుపెట్టారు. 19 యేళ్ల చిన్న వయసులోనే మొదటి సారిగా బెంగాలీ సినిమా ‘డడు’ కి సంగీత దర్శకత్వం వహించారు. బాలీవుడ్ సహా పలు భాషల్లో ఎన్నో విజయవంతమైన పాటలకు తన గానంతో మెస్మరైజ్ చేసి,తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పిదా. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? View this post on Instagram A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) -
అల్విదా.. బప్పీ దా
-
బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?
Why Bappi Lahiri Used To Wear So Much Gold: అలోకేశ్ లహిరి అలియాస్ బప్పి లహరి.. బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన లెజెండరీ సింగర్. సంగీత ప్రపంచంలో బప్పీలహరి స్టైల్ ప్రత్యేకం. తన గానంతో మెస్మరైజ్ చేసిన బప్పీలహరి పాటలతోనే కాకుండా ప్రత్యేకమైన ఆహార్యంతోనూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. చేతికి గోల్డ్ రింగ్స్, నల్లని కళ్లద్దాలు, మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు.. అసలు ఆయన నడిచొస్తుంటే బంగారమే కదిలొస్తున్నట్లు కనిపించేది. ఇదే ఆయనకు మరింత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. బంగారం లేకుండా అసలు బప్పీలహరిని ఊహించుకోలేం. బప్పిలహరికి బంగారంపై ఎందుకంత ప్రేమ అంటే.. వయసు దాటినా ఎప్పుడూ తరగని ఉత్సాహం, చెరగని చిరునవ్వుతో కనిపించే బప్పీలహరి బంగారం లేకుండా అసలు కనిపించేవారు కాదు. ఆయనకు బంగారం అంటే అంత ఇష్టం మరి. `గోల్డ్ ఈజ్ మై గాడ్` అంటుండేవారాయన. ఆయన మెడలో ఎప్పుడూ బంగారు ఆభరణాలు మెరుస్తూ ఉండేవి. దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఓ హాలీవుడ్ పాప్ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవారు. 'ఓ సాంగ్ రికార్డింగ్ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా నా భార్య ఓ గణపతి లాకెట్ కూడిన బంగారు గొలుసును ఇచ్చింది. నా మెడలోని గణపతి నన్ను ఎప్పుడూ సరక్షితంగా ఉంచుతుంది అని నమ్ముతాను. అంతేకాకుండా నా కెరీర్ ఎదుగుతున్న కొద్దీ నా బంగారం మరింత రెట్టింపయ్యింది' అని పేర్కొన్నారు. -
బప్పి లహరి టాప్ తెలుగు సాంగ్స్ ఇవే.. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబుతో..
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహరి(69) బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బప్పి లహరి తుదిశ్వాస విడిచారు. బప్పి లహరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బప్పి లహరి మరణం బాలీవుడ్‌కే కాదు తెలుగు సినిమాకు కూడా తీరని లోటు. ఆయన సంగీతం అందించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఈయన గళం నుంచి వచ్చిన పాట కుర్రకారును ఊపేశాయి. అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ 'జఖ్మీ' చిత్రం ద్వారా బప్పి పాపులర్ అయ్యారు. ఆపై డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, సాహెబ్, కమాండో, గురు దక్షిణ, ప్రేమ ప్రతిజ్ఞ, గురు, త్యాగి, ది దర్టీ పిక్చర్, రాక్ డ్యాన్సర్, బద్రినాథ్ కీ దుల్హనియా వంటి హిందీ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్‌తోపాటు సౌండ్ ఇండస్ట్రీకి కూడా బప్పి పనిచేశారు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలకు ఆయన అందించిన సినిమాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. మరి తెలుగులో బప్పి నుంచి వచ్చిన మరిచిపోలేని పాటలు ఏంటో ఓ సారి చూద్దాం. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? 1. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ సినిమా ద్వారా బప్పి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇందులోని ‘ఆకాశంలో ఒక తార’ నేటికి అందరికి గుర్తుండే ఉంటుంది. కృష్ణ, జయప్రద కలిసి డ్యాన్స్ చేసిన ఈ పాట ఎవర్గ్రీన్ సూపర్‌హిట్. 2. మెగాస్టార్ చిరంజీవి, బప్పి లహరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘స్టేట్ రౌడీ’. ఇందులోని ‘అరెరే యముడికి నే మొగుడిని రా’.. ‘రాధా రాధా మదిలోనా మన్మథ బాధా’.. పాటలు సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. 3. బప్పి, చిరంజీవి కెరీర్లోనే బప్పి బెస్ట్ సాంగ్స్ అందించారు. ఇందులో గ్యాంగ్ లీడర్ ఒకటి. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్.. భద్రాచలం కొండ.. వానా వానా పాటలు పాపులర్ అయ్యాయి. 4. తరువాత చిరంజీవితో కలిసి రౌడీ అల్లుడు చిత్రం చేశారు. ఇందులోని చిలుకా క్షేమమా, అమలాపురం బుల్లెమ్మో నీకేమి కావాలా పాటలతో పాటు రౌడీ అల్లుడులో మిగిలిన పాటలు కూడా హిట్ అయ్యాయి. 5. డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కూడా బప్పి కలిసి పనిచేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన రౌడీ గారి పెళ్లాం సినిమాలోని బోయవాని వేటుకు అనే పాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6. బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం రౌడీ ఇన్ స్పెక్టర్’ కు బప్పి లహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులోని అరే ఓ సాంబా.. పాట ఇప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ మళ్ళీ వింటూనే ఉంటారు. 7. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘ బ్రహ్మ’ సినిమాలోని జేసుదాస్ పాడిన ‘ముసి ముసి నవ్వులలోన’ పాటతో కనెక్ట్ అవ్వని తెలుగు ప్రేక్షకుడు లేడు. 8. చిరంజీవి, రోజా కలిసి నటించిన బిగ్‌బాస్ చిత్రంలోని మావోయ్ మావా మావవా, నంబర్ 1, 2 పాటలు పాటలు ఫేమస్ అయ్యాయి. 8. తెలుగులో చివరికిగా 2020లో హీరో రవితేజ నటించిన డిస్కోరాజా చిత్రంలో పాట పాడారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి అరుదైన ఫోటోలు
-
డిస్కో కింగ్ బప్పీ దా ..అల్విదా
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం ముంబై లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రముఖ గాయని లతామంగేష్కర్ ఇక లేరన్న వార్తను ఇంకా జీర్ణించుకోలోని సినీ సంగీత అభిమానులు బప్పీదా అస్తమయంతో విషాదంలో మునిగి పోయారు. డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్, గోల్డ్‌మ్యాన్ బప్పీదా మరణం తీరని లోటంటూ పలువురు సంతాపం ప్రకటించారు. బప్పీ లహరి అనగానే ప్రసిద్ధ డిస్కో-ఎలక్ట్రానిక్ సంగీతం, ఒంటినిండా బంగారు ఆభరణాలు, గొలుసులు, కంకణాలు, వెల్వెట్ కార్డిగాన్స్, సన్ గ్లాసెస్‌తో ఒక స్పెషల్ స్టైల్ గుర్తు వస్తుంది. 1952 నవంబరు 27న కోలకతాలో పుట్టారు బప్పీ లహరి, ఆయన అసలు పేరు అలోకేష్ లహరి. 3 సంవత్సరాల వయస్సులో తబలా వాయించడం ప్రారంభించి అటు బాలీవుడ్‌ను, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం,కన్నడ పరిశ్రమలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తన తుది శ్వాసవరకూ మ్యూజిక్ ప్రాణంగా బతికిన లెజెండ్ ఆయన. డిస్కో, ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీ లహరి. డిస్కో డాన్సర్, నమక్ హలాల్, హిమ్మత్ వాలా, షరాబీ, డర్టీ పిక్చర్ లాంటి అనేక మూవీల్లోని పాటలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన బప్పీ దా సింహాసనం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. బప్పీదా అనగానే సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒక తార పాట గుర్తొస్తుంది. అలాగే బాలకృష్ణ రౌడీ ఇన్పెక్టర్, నిప్పురవ్వ, చిరంజీవి గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, స్టేట్ రౌడీ మూవీల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మెహన్ బాబుకు రౌడీగారి పెళ్లాం, పుణ్యభూమి నా దేశం, బ్రహ్మ లాంటి సినిమాలకు ట్యూన్స్ అందించారు బప్పీ. బప్పీ మ్యూజిక్ అయినా, పాటలైనా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. డిస్కో, ఫాస్ట్ బీట్స్, వెస్ట్రన్, క్లాసిక్ మిక్డ్స్ ట్యూన్స్‌తో ఆడియన్స్ మైమరిచిపోయారు. ముఖ్యంగా 70, 80 90వ దశకంలో తన సంగీతంతో సంచలనం సృష్టించారు. చివరగా 2020లో భాగి 3లోను, రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. ఆయన మ్యాజిక్కు ఎలాంటి వారైనా స్టెప్స్ వేయాల్సిందే. ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ డిస్కో సాంగ్స్‌తో యూత్‌ను ఉర్రూత లూగించారు. 1973 లో బాలీవుడ్మూవీ నన్హా షికారి, 1974 తొలి చాన్స్ అందుకున్న బప్పీ లహరి తన కంపోజిషన్‌తో ఆకట్టుకున్నాడు. తరువాత 1975లో జఖ్మీ మూవీ కెరీర్‌కు మలుపు తిరిగింది, క్రమంగా ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1976 చల్తే చల్తే డూపర్ సూపర్ హిట్ అయింది. జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1986లో 33 సినిమాలకు 180కి పైగా పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. కేవలం ర్యాక్, డిస్కో సాంగ్స్ మాత్రమే కాదు ఆశా భోంస్లే ,లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఎన్నో మధురమైన పాటలను కూడా ఆయన స్వరపరిచారు. 1983-1985 కాలంలో జితేంద్ర హీరోగా నటించిన 12 సూపర్-హిట్ సిల్వర్ జూబ్లీ సినిమాలకు కంపోజ్ చేసి రికార్డ్ సృష్టించారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఇక ఆయన స్పెషల్ అప్పిరియన్స్పై వివరణ ఇస్తూ బప్పిదా తొలి చిత్రం జఖ్మీ సక్సెస్ సందర్భంగా తన తల్లి హరే రామ హరే కృష్ణ లాకెట్ ఉన్న బంగారు గొలుసు గిప్ట్ ఇచ్చారనీ, ఇక తరువాత ప్రతీ పాట హిట్ అవుతూ వచ్చి, బంగారంతో అదృష్టం వచ్చిందని చెప్పారు. అంతే కాదు ఈ విషయంలో అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ తనను ప్రభావితం చేశారనీ, తాను కూడా సెలెబ్రిటీగా మారాక బంగారు గొలుసులతో తనకంటూ ఒక స్టైల్‌తో పాపులర్ అయినట్టు ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Bappi Lahiri: 'ఆయన మరణం ఎంతగానో కలచివేస్తుంది.. చాలా దురదృష్టకరం'
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా కోసం అనేక చార్ట్‌బస్టర్ సాంగ్‌లను అందించారు, అవి నా చిత్రాల ప్రజాదరణకు ఎంతో దోహదపడింది. ఆయన సంగీతంలో ప్రతిబింబించే తన ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల చూపించే ఉత్సాహంతో ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు’ అంటూ చిరు రాసుకొచ్చారు. Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv — Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022 ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం: మోహన్ బాబు బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశపు లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన బప్పీలహరి మరణం విచారకరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3సూపర్‌హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం ఉంది. బప్పీలహరి కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ మోహన్‌బాబు ట్వీట్లో పేర్కొన్నారు. Saddened to hear the demise of Shri Bappi Lahiri, one of the Legendary Music Composers of India, had the honor of working with him for 3 super hit movies in which his songs played a crucial role. Had a long association with him. I pray for his family's strength. Om Shanti! pic.twitter.com/09QZRyLh5q — Mohan Babu M (@themohanbabu) February 16, 2022 బప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త నన్నెంగానో కలచివేసింది. 'నేను నటించిన 'రౌడి ఇన్స్పెక్టర్', 'నిప్పురవ్వ' వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. -
తెలుగులో బప్పి లహరి పాడిన చివరి పాట ఇదే..
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. 1952 నవంబర్ 27న బెంగాల్‌కు చెందిన బ్రహ్మాణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు అలొకేష్ లహరి. సినిమాల్లోకి వచ్చాక బప్పి లహరిగా మారిన ఆయన సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ పాటతో ఓ ఊపు ఊపిన ఈ బెంగాలీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తరువాత బాలీవుడ్‌ను తన సంగీతంతో శాసించారు. తెలుగులోనూ ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. 1986లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బప్పి ఆ తరువాత తెలుగులో ఎన్నో బంపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. తండ్రి అపరేష్, తల్లి బన్సూరి ఇద్దరూ మ్యుజీషియన్స్, సింగర్స్ కావడంతో.. ఆటోమేటిక్‌గా బప్పీ లహరి కూడా మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. బప్పీ తెలుగులో 1987లో త్రిమూర్తులు, 1989లో స్టేట్‌రౌడీ, 1991లో గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, 1993లో నిప్పు రవ్వ, 1995లో బిగ్ బాస్, ఖైదీ ఇన్స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం సినిమాలకు మ్యూజిక్ అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు కాంబినేషన్లో వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చివరిగా తెలుగులో ఆయన 2020లో వచ్చిన రవితేజ డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. రమ్ పమ్ పమ్ అంటూ రాక్ స్టైల్లో పాటను పాడారు ఆయన. -
Bappi Lahiri Death: సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత
-
ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత
ముంబై: ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్ 27న బెంగాల్లో జన్మించిన బప్పి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బప్పీ లహరి మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బప్పి లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. మిథున్ చక్రవర్తికి డిస్కో డ్యాన్సర్ పాటతో లైఫ్ ఇచ్చిన బప్పి లహరి.. డిస్కో కింగ్‌గా గుర్తింపు పొందారు. నిత్యం బంగారు ఆభరణాలు ధరించి కనిపించే సంగీత విద్వాంసుడిగా ఆయనకు మరో గుర్తింపు కూడా ఉంది. లహరి తన సినీ ప్రయాణంలో వార్దత్, డిస్కో డాన్సర్, నమక్ హలాల్, డ్యాన్స్ డ్యాన్స్, కమాండో, సాహెబ్, గ్యాంగ్ లీడర్, సైలాబ్, షరాబి వంటి హిట్ సాంగ్స్‌ను అందించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారాడు. ఇక సంగీత దిగ్గజాలు మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, విజయ్ బెనెడిక్ట్, షారన్ ప్రభాకర్, అలీషా చినాయ్, ఉషా ఉతుప్ వంటి తరతరాల గాయకులతో కలిసి చేశాడు. చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు దీప్ సిద్ధూ మృతి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్‌కు బప్పిదా బంధువు. హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో బప్పి లహిరి సంగీతం అందించారు. ఇక తెలుగు ప్రేక్షకులనూ ఆయన సంగీతంలో ఓలలాడించారు. సింహాసనం (1986), తేనే మనసులు (1987), త్రిమూర్తులు, శంఖారావం, సామ్రాట్, కలెక్టర్ విజయ (1988), మన్మధ సామ్రాజ్యం, స్టేట్ రౌడీ (1989), చిన్నా (1990), చిన్న కోడలు, ఇంద్ర భవనం (1991), గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ అల్లుడు, దొంగ పోలీస్ (1992), రక్త తర్పణం, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, నిప్పు రవ్వ (1993), రౌడీ రాజకీయం, పెద్ద యజమాని (1995), ముద్దాయి ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్స్పెక్టర్, పుణ్య భూమి నా దేశం వంటి తెలుగు చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. తెలుగులో చివరగా రవితేజ “డిస్కో రాజా” సినిమాలోని “ఫ్రీక్ అవుట్” పాటలను పాడారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేను బాగానే ఉన్నా..ఆ వార్తలు బాధించాయి: బప్పీ లహరి
Bappi Lahiri Rubbishes Rumours About His Health: ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ బప్పీ లహరి తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. నా ఆరోగ్యం గురించి కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఫేక్ న్యూస్‌లు సర్య్కులేట్ చేయడం బాధగా అనిపిస్తుంది. నా శ్రేయోభిలాషులు, అభిమానుల ఆశీస్సుల వల్ల నేను బాగానే ఉన్నాను. అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. కాగా బప్పీ లహరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల అనంతరం ఆయన కోలుకున్నారు. అయితే కరోనా కారణంగా ఆయన గొంతు పూర్తిగా దెబ్బతిందని పలు వార్తలు నెట్టింట షికార్లు చేశాయి. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని బప్పీ లహరి స్పష్టం చేశారు. దీంతో ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. కాగా 1970-80ల కాలంలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబీ వంటి సినిమాలకు బప్పీ లహరి పాడిన పాటలు అప్పట్లో ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరగా ఆయన బాఘీ3 చిత్రంలో భంకాస్ అనే పాటను పాడారు. View this post on Instagram A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) -
ఆసుపత్రిలో... బప్పీలహరి
బాలీవుడ్ సినీసెలబ్రీటీలు కరోనా బారిన పడటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హిందీ చిత్రసీమకు చెందిన దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఇటీవల కరోనా సోకగా తాజాగా ప్రముఖ సంగీత దర్శకులు బప్పీలహరి కరోనా బారినపడ్డారు. ‘‘కొంతకాలంగా అనారోగ్యంతో బప్పీలహరి బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబయ్‌లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన పదిహేను రోజుల్లో ఆయన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినందిగా బప్పీలహరి కోరుతున్నారు’’’ అని బప్పీలహరి మీడియా ప్రతినిధి పేర్కొన్నారు. -
హాస్పిటల్ పాలైన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహిరికి సైతం కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించినట్లు బప్పీలహిరి కుమార్తె రెమా లాహిరి తెలిపింది. 'కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాన్నకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాం. మీ అందరి ప్రార్థనలతో నాన్న త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తారు' అని పేర్కొంది. కాగా గతనెలలోనే తాను కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రీ- రిజిస్టర్ చేసుకున్నట్లు బప్పీలహిరి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తూ ఈలోపే ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దీంతో బప్పీలహిరి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగా రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి సినిమాలకు మ్యూజిక్ అందించి బప్పీలహరి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో చివరగా భాఘీ3 సినిమాకు ఆయన సంగీతం అందించారు. తెలుగులోనూ స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, సింహాసనం వంటి చిత్రాల్లో ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించారు. చదవండి : ఫన్నీ వీడియో: ఆ నటుడికి కరోనా గురించి ముందే తెలుసు! అమితాబ్ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే -
‘సింహాసనం’కోసం కృష్ణ ఎన్నో సాహసాలు.. ప్రతీది సంచలనమే
జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించిన హీరో కృష్ణ తొలిసారి దర్శకుడై చేసిన మరో సాహసం ‘సింహాసనం’. తెలుగులో తొలి 70 ఎం.ఎం–6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రంగా అది ఆ రోజుల్లో ఓ సంచలనం. అది 1983. ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ వదిలి వెళ్ళిన నంబర్ 1 స్థానం కోసం అగ్ర హీరోల నుంచి యువ తారల దాకా అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్‌లో కృష్ణ సొంత స్టూడియో పద్మాలయా ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోనూ, నిర్మాతగా హిందీలోనూ కృష్ణ బిజీ. అయితే, ఒకపక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే, ఏదైనా సాహసం చేసి, సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో ‘పాతాళ్ భైరవి’ (1985 మే 3) రీమేక్‌తో ఓ జానపద ప్రయోగం తీశారు. హిట్. అంతే, పద్మాలయాకూ, దర్శకుడిగా తనకూ ప్రతిష్ఠాత్మకంగా భారీ సెట్స్‌తో జానపద సినిమా, అదీ ఫస్ట్ టైమ్ 70 ఎం.ఎంలో తీస్తే? ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ‘సింహాసనం’. రెండు రాజ్యాల పోరాటకథగా... జానపదాలు కనుమరుగైపోయిన రోజుల్లో, కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ సాహసం వర్కౌట్ అవ్వాలంటే, హిందీలోనూ తీయాలని తీర్మానించుకున్నారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో జితేంద్ర హీరోగా ‘సింఘాసన్’ పట్టాలెక్కాయి. మంచికీ – చెడుకీ సంఘర్షణగా ఈ చిత్రం తీశారు. సింహాసనం కోసం దశార్ణ రాజ్యానికీ, అవంతీ రాజ్యానికీ మధ్య పోరాటం ఈ చిత్రకథ. చరిత్ర కలగలిపిన జానపదం టైటిల్స్‌లో కథకు క్రెడిట్ కృష్ణదే అయినా, ఆయన ఆస్థాన రచయిత త్రిపురనేని మహారథిదే రచనలో కీలకపాత్ర. కాకతీయ సామ్రాజ్యం – రాణీ రుద్రమదేవి – ఆపత్కాలంలో ఆమెకు సాయపడే గోన గన్నారెడ్డి... ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి (జయప్రద), ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి (కృçష్ణ) పాత్రలు సృష్టించారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర. ఆ స్ఫూర్తితో చందనగంధి పాత్ర (మందాకిని) రాశారు. భారీ రాజదర్బారు... విగ్రహాలు... రెండు రాజ్యాల మధ్య జరిగే ఈ జానపద కథలో సహజత్వం కోసం కళాదర్శకుడు భాస్కరరాజు లక్షల ఖర్చుతో భారీ సెట్లు వేశారు. గమ్మత్తేమిటంటే, ఈ రాజుల కాలం కథలో కీలకమైన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే! ఆయన వేసిన ఆరుబయట రాజ దర్బార్ సెట్టు, భారీ విగ్రహాలు... చాలా కాలం స్టూడియోలో పలకరిస్తుండేవి. రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టే ముందు రామోజీరావుకు సైతం ఆ విగ్రహాల తయారీ గురించి ‘పద్మాలయా’ హనుమంతరావు వివరించారట. కొత్త సింగర్... పాటలు సూపర్‌హిట్ ‘సింహాసనం’లో కృష్ణ చేసిన మరో సాహసం – రాజ్ సీతారామ్ గానం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు ఓ వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారామ్ గొంతు బాగుందనిపించింది. అంతే... కృష్ణ తన ‘సూర్య చంద్ర’ (1985)లో అన్ని పాటలూ అతనితోనే పాడించారు. ‘సింహా సనం’ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి ఆ గొంతుకే ఓటేశారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘వహవ్వా నీ యవ్వనం’, ‘ఇది కలయని నేననుకోనా’– ఇలా ఆత్రేయ, వేటూరి పాటలన్నీ హిట్. రాజ్‌సీతారామ్ పేరు మోతమోగింది. తీసేది 65 ఎం.ఎం! వేసేది 70 ఎం.ఎం!! నిజం చెప్పాలంటే, అప్పట్లో ఈ చిత్రాలేవీ సిసలైన 70 ఎం.ఎం కెమేరాతో తీసినవి కావు. ఆ కెమేరాలు 35 ఎం.ఎం కన్నా రెట్టింపు రిజల్యూషన్ ఉండే పెద్ద కెమేరాలు. అప్పటికి మన దేశంలో ఆ కెమేరాలూ లేవు. అందుకే అందరూ స్కోపులో, 65 ఎం.ఎం నెగటివ్ స్టాక్ మీద సినిమా షూట్ చేసుకొని, దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయించి, 70 ఎం.ఎం ఫిల్ము మీద ప్రింట్ చేసేవారు. షూట్ చేసిన 65 ఎం.ఎం పోగా, మిగతా 5 ఎం.ఎం ఫిల్మేమో ‘సౌండ్ ట్రాక్’ కోసమన్న మాట. మామూలు 35 ఎం.ఎం రీలుపై గీతలా సింగిల్ సౌండ్ ట్రాక్ ఉంటుంది. కానీ, 70 ఎం.ఎం రీలుపై మేగ్నటిక్ కోటింగ్‌లో సౌండ్‌ను ఆరు ట్రాక్‌లుగా, ఆరుసార్లు ముద్రించాల్సి ఉంటుంది. అందుకే, ‘6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ అంటారన్న మాట. అందరిలానే తెలుగు ‘సింహాసనం’ సైతం ఆ టెక్నిక్‌లో 65ఎం.ఎంలో తీసి, 70 ఎం.ఎంకి బ్లోఅప్ చేసినదే! ‘‘ఫేమస్ ‘షోలే’తో సహా మన దేశంలో తీసిన 70 ఎం.ఎంలన్నీ దాదాపు ఇలా తీసినవే. 35 ఎం.ఎంకి ఒక రకంగా, 70 ఎం.ఎంకి మరో రకంగా కెమేరాలో మార్కింగ్ ఉంటుంది. 35 ఎం.ఎంలో బొమ్మ ఎత్తుంటుంది. నలుచదరంగా ఉంటుంది. 70 ఎం.ఎంలోనూ బొమ్మ ఎత్తు అంతే కానీ, వెడల్పు రెట్టింపు ఉంటుంది. 70 ఎం.ఎం సినిమా తీయాలంటే కెమేరాలో గేట్ మారుస్తారు. ఒక్క 70 ఎం.ఎంలోనే సినిమా తీస్తే సులభమే కానీ, మన దగ్గర అన్ని థియేటర్లుండవు కాబట్టి, అత్యధిక చోట్ల 35 ఎం.ఎం ప్రింట్లే ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే, సినిమా తీస్తున్నప్పుడే బొమ్మ కట్ కాకుండా 35 ఎం.ఎం ప్రింట్‌కీ, 70 ఎం.ఎం ప్రింట్‌కీ తగ్గట్టు జాగ్రత్తగా కెమేరా ఫ్రేమింగ్ పెట్టాలి’’ అని ‘సింహాసనం’కి పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు తేజ వివరించారు. స్వామి కెమేరా! నగాయిచ్ ట్రిక్స్ ‘సింహాసనం’ ఛాయాగ్రహణమంతా వి.ఎస్.ఆర్. స్వామి పనితనమే. కాగా, ఆయనకు కెమేరా గురువైన రవికాంత్ నగాయిచ్ ఈ ‘సింహాసనం’కి ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారు. నగాయిచ్ దగ్గర అసిస్టెంట్‌గా తేజ పనిచేశారు. ‘‘‘ఆకాశంలో ఒక తార...’ పాటలో బృందావన్ గార్డెన్స్‌లోనే ఓ ప్యాలెస్ ఉన్నట్టు చూపించడం లాంటివి ట్రిక్షాట్లే. అందుకోసం ప్యాలెస్ మినియేచర్ సెట్ తీసుకెళ్ళాం. అక్కడ షూటింగ్ చేశాక, 6 బస్సుల్లో డ్యాన్సర్లందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ షూట్ సాగించాం’’ అని తేజ చెప్పారు. ఏడెనిమిది రెట్లు ఎక్కువ బడ్జెట్! ఒక షాట్‌ను తెలుగులో తీసి, వెంటనే అదే సెటప్‌లో హిందీ ‘సింఘాసన్’ చిత్రీకరించేవారు. 65 రోజుల్లో రెండు వెర్షన్లూ పూర్తి చేశారు. 40 – 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. తెలుగులో... ఆ ప్రింట్లు ఆరే ఆరు! షూటింగే కాదు... ‘సింహాసనం’ పబ్లిసిటీ, ప్రింట్ల రిలీజు కూడా ఆ రోజుల్లో భారీగా సాగింది. తెలుగు వెర్షన్ సుమారుగా 86 ప్రింట్లతో, 150కి పైగా థియేటర్లలో రిలీజవడం మరో సంచలనం. ఇక హిందీ వెర్షన్‌కు 120 – 130 ప్రింట్లు తీశారు. అప్పట్లో మామూలు 35 ఎం.ఎం ప్రింట్ తీయడానికి రూ. 30 – 40 వేల దాకా అయ్యేది. అదే 70 ఎం.ఎం ప్రింట్ తీయాలంటే, లక్షా అరవై వేలయ్యేది. పైపెచ్చు, దానికి కావాల్సిన పాజిటివ్ ఫిల్ము కోసం మూడు నెలల ముందుగానే చెప్పి, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇక, ల్యాబ్‌లో 70 ఎం.ఎం ప్రింట్ డెవలప్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు రోలర్స్ మార్చాలి. ఆ ప్రింట్లు తీస్తున్నప్పుడు వేరేవి ప్రింట్ చేయలేరు. అందుకే 70 ఎం.ఎం ప్రింట్లకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేవారు. ఆ ప్రింట్‌ను హాలులో వేయాలన్నా మామూలు ప్రొజెక్టర్‌కు ఉండే రోలర్లు, దానికి ఉండే లెన్సులు మార్చాలి. వెనకాల ఉండే ఆర్క్ లైట్‌ను బ్రైట్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఇలా ‘70 ఎం.ఎం – 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ సినిమాలు ప్రదర్శించేందుకు తగిన సాంకేతిక సదుపాయాలున్న హాళ్ళూ తెలుగునాట తక్కువే! గుంటూరు, నెల్లూరు లాంటి చోట్ల ‘సింహాసనం’ 70 ఎం.ఎం ప్రదర్శన కోసం అదనంగా ఖర్చు పెట్టి, హాళ్ళను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల మధ్య ‘సింహాసనం’ చిత్రం రిలీజు కోసం ఆరు 70 ఎం.ఎం. ప్రింట్లు వేశారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని, విజయవాడ (రాజ్), గుంటూరు (మంగా డీలక్స్), విశాఖపట్నం (చిత్రాలయా), నెల్లూరు (అర్చన), కాకినాడ (దేవి), హైదరాబాద్ (దేవి) – ఈ 6 కేంద్రాలలో 70 ఎం.ఎం ప్రింట్లు వేశారు. అందులో 68 రోజులకే సినిమా మారిన ఒక్క నెల్లూరు మినహా మిగతా 5 కేంద్రాలలోనూ, అలాగే రాజమండ్రిలో 35ఎం.ఎం ప్రింట్‌తో (స్వామి టాకీస్‌లో)నూ మొత్తం 6 కేంద్రాలలో ‘సింహాసనం’ డైరెక్ట్ శతదినోత్సవం చేసుకుంది. పోస్టర్ పబ్లిసిటీలో... 24 షీట్ ట్రెండ్! సినిమాలానే ‘సింహాసనం’ పబ్లిసిటీ కూడా భారీగా సాగింది. అప్పట్లో తెలు గులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ, ‘సింహాసనం’ కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేయించారు ‘పద్మాలయా’ హనుమంతరావు. అందరినీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసి టీలో ఓ ట్రెండైంది! అలాగే, సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో ‘సింహాసనం’ రిలీజుకు ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంజ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ప్లైవుడ్ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ది టౌన్! రాజకీయ ప్రత్యర్థి ఎన్టీఆర్‌పై విసుర్లు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృçష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద ‘సింహాస నం’లో కొన్ని విసుర్లు కూడా పెట్టారు. ‘‘థియేటర్లలో ఆ డైలాగ్స్‌కు స్పందన లభించింది. దాంతో ఎన్టీఆర్‌పై జనంలో వ్యతిరేకత మొదలైందనే అంచనాతో మేము ‘నా పిలుపే ప్రభంజనం’, తర్వాత ‘సాహసమే నా ఊపిరి’ తీశాం’’ అని ‘పద్మాలయా’ ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు. సముద్రపుటొడ్డున... అభిమాన జనసముద్రం మధ్యన... 1986 జూలై 12న మద్రాసులో సముద్రపుటొడ్డున వి.జి.పి. గార్డెన్స్‌లో వందలకొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది అభిమానుల మధ్య ‘సింహాసనం’ వందరోజుల వేడుక సాగింది. ఆ తరువాత... ఆ సినిమాలు అరుదే! వాస్తవానికి, ‘సింహాసనం’ కన్నా ముందు తెలుగులో ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’, ‘సింహాసనం’ రిలీజైన తరువాత చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లాంటి చిత్రాలు కూడా 70 ఎం.ఎం.లో తీసే ప్రయత్నాలు జరిగాయి. కారణాలేమైనా, వాటిని చివరకు ఆ టెక్నిక్‌లో తీయలేదు. ‘సింహాసనం’కే ఆ క్రెడిట్ దక్కింది. తెలుగులో వచ్చిన రెండో 70 ఎం.ఎం – ఏయన్నార్, నాగార్జున ‘అగ్నిపుత్రుడు’ (1987). కాలగతిలో డి.టి.ఎస్, డాల్బీ, డిజిటల్ లాంటి టెక్నాలజీలు వచ్చేయడంతో, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అనేదే ప్రధాన ఆకర్షణ అయిన 70 ఎం.ఎం సినిమాలు రావడం మన దగ్గర ఆగిపోయింది. అయితేనేం... తెలుగుతెరపై సాహసం.. సాంకేతిక ప్రయోగం రీత్యా ‘సింహాసనం’ ఇప్పటికీ ఓ సంచలనమే! చిరస్మరణీయమే! బప్పీ లహరి బాణీల మేనియా హిందీలో ‘డిస్కో డ్యాన్సర్’ (1982) బాణీలతో దేశాన్ని ఊపేసిన బప్పీలహరికి తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. పద్మాలయాకు హిందీలో అప్పట్లో ఆయనే పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘ఆకాశంలో...’ బదులు ‘ఆకాసంలో...’ లాంటి అపశబ్దో చ్చారణ జరిగినా, ముప్పావు నిమిషం పైగా సుదీర్ఘమైన బి.జి.ఎంలే వినిపించినా, శ్రావ్యత కన్నా శబ్దం ఎక్కువైనా సరే – జనం బప్పీలహరి సంగీతం మాయలో పడిపోయారు. అప్పట్లో ఆ పాటలు, వాటి బి.జి.ఎంలు మారుమోగని ఊరు లేదు. శ్రీదేవి బదులు మందాకిని! ఈ భారీ సాహసం కోసం భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు. రెండు వెర్షన్లలో హీరోలు వేరైనా, హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్. అప్పటికే రాజ్‌కపూర్ ‘రామ్ తేరీ గంగా మెయిలీ’లో అందాలు ఆరబోసి, జనాన్ని ఆకర్షించిన నీలికళ్ళ సుందరి మందాకినిని కూడా తెలుగుకు తీసుకువచ్చారు. ‘‘ఆ పాత్రను శ్రీదేవితో చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాం. అప్పటికే, కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే, ఫ్రెష్‌గా ఉంటుందని, హిందీలో అప్పుడు సరికొత్త హాట్ మందాకినిని తీసుకున్నాం’’ అని కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు వివరించారు. కృష్ణ, మందాకిని హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డ్! సెవన్టీ ఎం.ఎం ప్రింట్లు ఆడిన అరడజను కేంద్రాలలోని సైడ్ థియేటర్లతో సహా, మిగతా అన్ని కేంద్రాలలో సర్వసాధారణమైన 35 ఎం.ఎం. ప్రింట్లతోనే ‘సింహాసనం’ ప్రదర్శితమైంది. అయితేనేం, సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిలో, ఆదరణలో మార్పు లేదు. అభిమానులేమో రికార్డులపై మోజు వీడలేదు. ఏకంగా 116 రోజులు ప్రదర్శితమైన వైజాగ్ ‘చిత్రాలయా’ లాంటి చోట్ల, సరిగ్గా ఆఖరు రోజుకు ముందు రోజు దాకా హాలు బయట హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. ‘‘మొదటివారమే ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు కలిపి ఏకంగా రూ. 1.51 కోట్ల పైగా వసూలు చేసి, అప్పటికి హయ్యస్ట్ ఓపెనింగ్ గా ‘సింహాసనం’ బాక్సాఫీస్ చరిత్ర’’ సృష్టించింది. మొదటి 70 ఎం.ఎం ‘షోలే’ కాదు! తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’ చిత్రమనే మాట సరే! కానీ, దేశంలోనే ఫస్ట్ సిన్మా ఏమిటి? చాలా మంది ‘షోలే’ అనుకుంటారు. కానీ, ‘షోలే’ కన్నా ముందే వచ్చిన రాజ్‌కపూర్, రాజశ్రీ ‘ఎరౌండ్ ది వరల్డ్’ (1967) మన దేశంలోనే ఫస్ట్ 70ఎం.ఎం చిత్రం. రెండోచిత్రంగా ‘షోలే’ (1975) 70 ఎం.ఎం సిక్స్‌ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో అలరించింది. తర్వాత హిందీలో ‘షాన్’ (’80), అమితాబ్ ‘మహాన్’ (’83) లాంటి సక్సెస్‌లు వచ్చాయి. దక్షిణాదిలో తొలిసారిగా మలయాళంలో ‘పడయోట్ట మ్’ (’82)వచ్చింది. తర్వాత నాలుగేళ్ళకు కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎంగా ‘సింహాసనం’ (’86) అందించారు. ‘సింహాసనం’ చిత్రాన్ని తమిళంలో ‘సిమ్మాసన్’ పేరిట పద్మాలయా వారే అనువదించి, రిలీజ్ చేశారు. కాగా, అదే ఏడాది తమిళంలోనూ ‘తొలి తమిళ 70 ఎం.ఎం’ రజనీకాంత్ హీరోగా ‘మావీరన్’ (1986 నవంబర్ 1) వచ్చింది. ఈ తొలి తమిళ 70 ఎం.ఎం.నూ పద్మాలయా వారే నిర్మించడం విశేషం. సెట్స్‌లో దర్శకుడిగా సూపర్‌స్టార్ కృష్ణ, జితేంద్ర హిందీ ‘సింఘాసన్’ – రెంటాల జయదేవ ∙ -
గాగాతో రాగాలు
బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్‌గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్లలో సుమారు 600 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సుమారు 9000 పాటలను స్వరపరిచారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాప్‌స్టార్ లేడీ గాగాతో కలసి ఓ ఆల్బమ్ కోసం వర్క్ చేశారు బప్పీ లహరి. ఇందులోని రెండు పాటలను లేడీ గాగాతో కలసి ఆలపించారట బప్పీ లహరి. గాగా తన స్టయిల్లో ఇంగ్లీష్‌లో పాడితే, బప్పీ హిందీలో పాడారట. ఈ ఏడాది చివర్లో ఈ పాటలు విడుదల కానున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ పాటలను రికార్డ్ చేయడానికి లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు బప్పీలహరి. లేడీ గాగాతోనే కాకుండా ఇంటర్నేషనల్ సింగర్ ఆకాన్తో కూడా బప్పీ వర్క్ చేయనున్నారని సమాచారం. -
యుగపురుష్
టాలీవుడ్ టు బాలీవుడ్ ఇప్పుడంతా బయోపిక్ (జీవిత కథ) సీజన్ నడుస్తోంది. తెలుగులో మహానటి సావిత్రి, తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ బయోపిక్‌లు తెర కెక్కుతుండగా, ఎన్టీఆర్ బయోపిక్‌లు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. తెలుగు క్రీడాకారులు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, పీవీ సింధులతో పాటు శివసేన అధినేత బాల్ ఠాక్రే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తదితరుల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి బయోపిక్ కూడా చేరింది. ‘యుగపురుష్ అటల్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ‘కాలా సచ్’ ఫేమ్ మయాంక్ పి. శ్రీ వాస్తవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. స్పెక్ట్రమ్ మూవీస్ పతాకంపై రాజీవ్ ధమీజా, అమిత్ జోషి, రంజిత్ శర్మ ఈ సినిమా నిర్మించనున్నారు. వాజపేయి గతంలో రాసిన ఓ కవిత్వం ఆధారంగా సంగీత దర్శకుడు బప్పీ లహరి ‘యుగపురుష్ అటల్’ చిత్రంలోని ఓ పాటకు సంగీతం అందించడం విశేషం. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. -
బంగాళా దుంప బంగారం అవుతుందా?
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్‌లోని పటానలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బంగాళా దుంపలతోని బంగారాన్ని తయారు చేసే యంత్రం గురించి వివరించారంటూ సోషల్ మీడియా గత రెండు రోజులుగా ఆయన్ని హేళన చేస్తోంది. ‘రాహుల్ గాంధీజీ! ఒకపక్క నుంచి బంగాళా దుంపలను పెడితే మరోపక్క నుంచి బంగారం వచ్చే మీ యంత్రం గురించిన ఫార్ములాను తెలియజేయండి. నేను స్టార్టప్ కంపెనీ పెడతానని ఒకరు... అసలు రెండు పక్కల నుంచి కూడా బంగాళా దుంపలను పెడితే ఏం వస్తుందని మరోకరు.. బంగాళా దుంపల ఫ్యాక్టరీలోకి వెళ్లేముందు బప్పీలహరీ అన్న శీర్షికతో మెడలో తరిగిన బంగాళా దుంపల దండవేసుకున్న ఫొటోను, ఆ తర్వాత బంగాళా దుంపల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న బప్పీలహరీ అంటూ.. మెడలో బంగారు గొలుసు వేసుకున్న బప్పీలహరి ఫొటోను ట్వీట్ చేయగా, ఏకంగా ముగి బంగారాన్ని అమ్ముతున్న రాహుల్ గాంధీ.. అంటూ ఆలు గడ్డలుగల తోపుడు బండీతో రాహుల్ (మార్ఫింగ్) ఫొటోను ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడిన సందర్భాన్ని తీసేసి కేవలం కేవలం ‘ఇటు నుంచి ఆలు పెడితే అటు నుంచి బంగారం వచ్చే యంత్రాన్ని ఇస్తాను. ఇటు నుంచి ఆలు పెట్టండి, అటు నుంచి బంగారాన్ని తీసుకోండి. దీనివల్ల ఎంత డబ్బుస్తొందంటే దాన్ని ఏం చేసుకోవాలో కూడా మీకు తెలియదు’ అన్న మాటలను మాత్రమే కత్తిరించి సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్లు వెల్లువెత్తాయి. వాస్తవానికి దేశ ప్ర«ధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఆదివాసీలకు 40వేల కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తానని చెప్పి చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేక పోయారని, వరదల వచ్చిన సందర్భంగా తక్షణ ఆర్థిక సహాయం కింద 500 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, అందులో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఆలు రైతులకు ఎలాంటి హామీ ఇచ్చారంటే ఇటు నుంచి ఆలు పెడితే అటు నుంచి బంగారం వచ్చే యంత్రాన్ని ఇస్తానని, ఇటు నుంచి ఆలు పెట్టండి, అటు నుంచి తీసుకోండి’ అని రాహుల్ వ్యంగ్యంగా విమర్శించారు. ఏ మీడియాలోనైనా సరే వ్యంగ్యమైన, హాస్యమైనా, ఛలోక్తులైనా వాస్తవానికి విరుద్ధంగా ఉండకూడదు, ఓ క్యారెక్టర్‌ను హత్య చేసే విధంగా అసలే ఉండకూడదు. ఇక్కడ సోషల్ మీడియాలో రాహుల్‌పై హేళన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి మరి. అసలు బంగాళా దుంపలతో బంగారం అవుతుందా? ఈ వ్యాఖ్యను చూడగానే ఎవరికైనా అది వ్యంగోక్తి అని అర్థం అవుతుంది కదా! -
హాలీవుడ్ పీతకు గొంతు అరువిస్తున్న టాప్ సింగర్
ఆయన గొంతు భారతదేశానికి సుపరిచితం. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన బప్పీ లాహిరి ఎక్కడ ఏ కార్యక్రమానికి వచ్చినా.. బ్రహ్మాండంగా బంగారు గొలుసులు, రంగురంగుల చొక్కాలు వేసుకుని మరీ వస్తారు. భారతీయ సినిమాల్లో డిస్కో తరహా మ్యూజిక్ అందించిన మొదటి సంగీత దర్శకుడిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి బప్పీ.. తొలిసారిగా హాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. అలాగని ఆయన అక్కడ పాట పాడతారో, సంగీతం అందిస్తారో అనుకుంటే పొరపాటే. హాలీవుడ్లో ఒక పీతకు ఆయన తన గొంతు అరువిస్తున్నారట. అవును.. డిస్నీ సంస్థ నిర్మిస్తున్న యానిమేషన్ సినిమా 'మోనా'లో టమాటోవా అనే ఓ పెద్ద పీత పాత్రకు ఆయన డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మొత్తానికి మన బప్పీ లాహిరి.. హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేస్తున్నారన్న మాట. Bappi Lahiri makes his Hollywood debut... Lends his voice for the character of Tamatoa [a giant crab] in Disney’s animation film #Moana. pic.twitter.com/lYSyfXMQ0t — taran adarsh (@taran_adarsh) 31 October 2016