లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి... | No sense in today's lyrics: Bappi Lahiri | Sakshi
Sakshi News home page

లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి...

Published Mon, Mar 2 2015 8:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి...

లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి...

ప్రస్తుతం వస్తున్న పాటలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయని బాలీవుడ్ ప్రముఖ సంగీత గాయకుడు బప్పీ లహరి అన్నారు. ఈ పాటలు వినడానికి చిరాకుగా ఉందని, ఇది తీవ్రంగా నిరాశపెట్టే అంశమని ఆయన వ్యాఖ్యానించారు. 'హంటర్' చిత్రానికి.. హంటర్ 303 అనే పాటపాడిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నేటి లిరిక్స్లలో చిత్రవిచిత్రమైన పదాలను పొందుపరుస్తున్నారని, ఇది ఏవగింపు కలిగించే అంశమని చెప్పారు.

 

'ఒక్కసారి పాత పాటల గురించి ఆలోచించండి ఎంత మధురంగా ఉంటాయో. వాటిని జనాలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. సంగీతానికి నేడు స్వర్ణయుగం ఉన్నప్పటికీ నేటి పాటలకు మాత్రం భావాలతో పనిలేకుండా పోయింది. లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి.. కానీ, వీటిని నేటి యువతరం ఇష్టపడుతున్నారు' అని ఆయన అన్నారు. 42 సంవత్సరాల నుంచి తాను సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతున్నానని, తనకు పాత పాటలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ వాటి వన్నే తగ్గలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement