బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భైరవం. ఈ చిత్రంలో ఆదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఓ వెన్నెల అంటూ సాంగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
తాజాగా విడుదలైన సాంగ్ ఓ వెన్నెల సాంగ్‌కు తిరుపతి జావన లిరిక్స్ అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, యామిని ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తోన్న ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదితి శంకర్‌తో పాటు దివ్యా పిళ్లై, ఆనంది కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
Happy to launch this soothing melody #OoVennela from #Bhairavam
▶️ https://t.co/BvAn6n84rt
Happy Birthday @BSaiSreenivas, wish you all the luck and success this year.
All the best @AditiShankarofl, @KKRadhamohan Garu , @DirVijayK, @sricharanpakala & Team pic.twitter.com/eZ9lNclFkK— Nani (@NameisNani) January 3, 2025
Comments
Please login to add a commentAdd a comment