గాగాతో రాగాలు | Bappi Lahiri on teaming up with Lady Gaga | Sakshi
Sakshi News home page

గాగాతో రాగాలు

Published Thu, Oct 24 2019 12:25 AM | Last Updated on Thu, Oct 24 2019 12:25 AM

Bappi Lahiri on teaming up with Lady Gaga - Sakshi

బప్పీ లహరి, లేడీ గాగా

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు బప్పీ లహరి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్లలో సుమారు 600 సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సుమారు 9000 పాటలను స్వరపరిచారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ పాప్‌స్టార్‌ లేడీ గాగాతో కలసి ఓ ఆల్బమ్‌ కోసం వర్క్‌ చేశారు బప్పీ లహరి. ఇందులోని రెండు పాటలను లేడీ గాగాతో కలసి ఆలపించారట బప్పీ లహరి. గాగా తన స్టయిల్లో ఇంగ్లీష్‌లో పాడితే, బప్పీ హిందీలో పాడారట. ఈ ఏడాది చివర్లో ఈ పాటలు విడుదల కానున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ పాటలను రికార్డ్‌ చేయడానికి లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్నారు బప్పీలహరి. లేడీ గాగాతోనే కాకుండా ఇంటర్నేషనల్‌ సింగర్‌ ఆకాన్‌తో కూడా బప్పీ వర్క్‌ చేయనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement