Bappa Lahiri Announces Wife Taneesha Second Pregnancy Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Bappa Lahiri: తండ్రి కాబోతున్న స్టార్‌ సింగర్ కుమారుడు.. సోషల్ మీడియాలో వైరల్

Published Wed, Dec 28 2022 7:50 PM | Last Updated on Wed, Dec 28 2022 8:08 PM

Bappa Lahiri announces wife Taneesha second pregnancy Goes Viral - Sakshi

లెజెండరీ సింగర్, దివంగత బప్పి లాహిరి కుమారుడు బప్పా లాహిరి మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. తాను రెండో సారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ  క్రిస్మస్ వేళ మేం నలుగురం కాబోతున్నాం అంటూ తన భార్య తనీషాతో కలిసి దిగిన ఇన్‌స‍్టాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.  ఈ జంటకు ఇప్పటికే క్రిష్ అనే కుమారుడు ఉన్నారు. 

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంటకు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. బప్పా లాహిరి,  తనీషా మార్చి 18, 2012 న పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే వీరు ఒకరికొకరు పరిచయం ఉండగా.. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. 2017లో వీరికి ఓ కుమారుడు జన్మించారు. 

బప్పి లాహిరి మరణం: బప్పి లాహిరి ఫిబ్రవరి 15న తుది శ్వాస విడిచారు. అతనికి కుమారుడు బప్పా లాహిరి,  కుమార్తె రెమా లాహిరి సంతానం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement