pregnency
-
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. కుండలి భాగ్య సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.రుహి చతుర్వేది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్లో నటించారు. View this post on Instagram A post shared by Ruhi Chaturvedi (@ruhiiiiiiiiii) -
దివాళీ పార్టీలో మెరిసిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీపై క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం కుటుంబంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ భర్తతో కలిసి దిపావళీ పార్టీలో తళుక్కున మెరిసింది. ముంబయిలో జరిగిన దివాళీ బాష్‌లో అనార్కలీ సూట్ ధరించి కనిపించింది. ఇద్దరు కలిసి తమ పెట్ డాగ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గెస్ దిస్ అంటూ సోనాక్షి క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ సోనాక్షి సిన్హాను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి బేబీ బంప్‌తో ఉందంటూ ఇన్‌స్టాలో రిప్లై ఇస్తున్నారు. తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోనాక్షి నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.(ఇది చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)కాగా.. ఈ ఏడాది జూన్ 23న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగింది. మరోవైపు సోనాక్షి ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
ప్రేమ పేరుతో ట్రాప్.. గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమన్నందుకు..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి (19)ని గర్భవతిని చేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను పూడ్చిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీకి చెందిన సోనీ (19) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంజూ అకా సలీమ్ అనే ఓ యువకుడితో పరిచయం అయ్యాడు. వారి మధ్య స్నేహం పెరిగింది. అయితే కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే.. పెళ్లి చేసుకోవాడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అబార్షన్ చేయించుకోవాలన్నాడు.#LoveJihad: In a tragic incident in Nangloi, Delhi, a 19-year-old pregnant woman named Soni was allegedly murdered by her boyfriend, Mohammad Salim, also known as Sanju, with the assistance of two accomplices.Soni, seven months pregnant, had been pressing Salim for marriage,… pic.twitter.com/M0cqJDDfCq— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 26, 2024దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం అతడిని కలిసేందుకు యువతి వెళ్లగా.. సలీమ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హర్యానాలోని రోహ్తక్కు తీసుకెళ్లి హత్య చేశాడు. ప్రస్తుతం సోని ఏడు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. ఇక.. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుతులు సలీమ్, అతడి స్నేహితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.చదవండి: ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్ -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!
ప్రముఖ నటి శ్రద్ధా ఆర్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2021లో నావీ అధికారి రాహుల్ నాగల్‌ను ఈ బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. తొలిసారి గర్భం ధరించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇది తెలుసుకున్న బాలీవుడ్ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఢిల్లీకి చెందిన శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ నిశ్శబ్ద్ చిత్రంలో నటించింది. తెలుగులో 2007లో కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన గొడవ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. బాలీవుడ్లో చివరిసారిగా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అంతేకాకుండా హిందీలో పలు సీరియల్స్‌తో శ్రద్ధా ఆర్య గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) -
దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. అందుకోసం లండన్ వెళ్తున్నారా?
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఇప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ఈ కపుల్ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది. కాగా.. దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్‌లో రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించనుంది. -
హీరో భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన నటి!
సెలబ్రిటీలపై రూమర్స్ రావడమనేది సహజం. వారిపై ఏదో ఒక రూమర్ రావడం.. దానికి మళ్లీ క్లారిటీ ఇవ్వడం ఇలా సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ హీరో భార్య, నటి పాత్రలేఖపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. 2021లో రాజ్ కుమార్ రావును పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.పాత్రలేఖ మాట్లాడుతూ..' నా కడుపులో ఉబ్బినట్లుగా కనిపించినప్పుడల్లా గర్భవతిని అయిపోతానా? నేను కూడా ఒక అమ్మాయినే కదా? నా జీవితంలో సంతోషంగా లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా లైఫ్ కోరుకున్న విధంగా ఉండాలనుకున్నా. అయితే మొదటి నుంచి నాపై వస్తున్న రూమర్లను నేను పట్టించుకోను. అందుకే కామెంట్స్ కూడా చదవటం మానేశా. కేవలం ఫోటోలు మాత్రమే చూస్తున్నా. నేను ఎలాంటి దుస్తులు ధరించినా మీరు ఇలానే ఊహించుకుంటారా?' అని ఘాటుగానే ప్రశ్నించింది.తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు అవాస్తమని పాత్రలేఖ కొట్టిపారేసింది. కాగా.. రాజ్ కుమార్ రావు ఇటీవలే స్త్రీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 15 ఏళ్ల డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పాత్రలేఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్'లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
కత్రినా కైఫ్‌కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్‌న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఇటీవలే ప్రియుడితో పెళ్లి.. ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి ఏమందంటే?
ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితి రావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్లు నటించారు. ప్రస్తుతం సోనాక్షి కాకుడ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కూడా నటించారు. ఈ చిత్రం జూలై 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్కు రానుంది.ఇదిలా ఉండగా.. గతనెల 23న సోనాక్షి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి పెళ్లికి సినీతారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటీవల ఈ జంట హనీమూన్ కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా తన రాబోయే మూవీ కుకుడ ప్రమోషన్లలో సోనాక్షి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటరాక్షన్‌లో జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత ఆమె జీవితం గురించి ప్రశ్నించారు. నా లైఫ్ పెళ్లికి ముందు సంతోషంగానే ఉందని తెలిపారు. పెళ్లి తర్వాత మరింత ఆనందంగా ఉన్నానని సోనాక్షి వెల్లడించారు.గతంలో మీరిద్దరు కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ సమయంలో మీరు గర్భంతో ఉన్నారని ఊహనాగాలొచ్చాయి కదా? దీనిపై మీరేమంటారు? అంటూ సోనాక్షిని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడుతూ..' ఇప్పుడు మేము ఆస్పత్రి వెళ్లలేము.. ఎందుకంటే మీరు వెంటనే గర్భవతి అని డిసైడ్ చేసేస్తారు' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. -
భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన స్టార్ హీరో!
బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కత్రినా కైఫ్ గర్భం దాల్చిందంటూ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో కత్రినా వదులుగా ఉన్న అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. తన రాబోయే చిత్రం బాడ్ న్యూజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన క్లారిటీ ఇచ్చారు.విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఏదైనా శుభవార్త ఉంటే మీతోనే మొదట చెబుతా. ప్రస్తుతం మీరు మా బ్యాడ్ న్యూజ్ సినిమాను ఎంజాయ్ చేయండి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపై మాట్లాడుకుందాం' అని అన్నారు. కాగా.. ఈ జంట త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు టాక్ నడిచింది. ఒక నెల క్రితం లండన్‌లో భర్త విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ వేకేషన్‌కు వెళ్లగా అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. విక్కీ, కత్రినా రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో యానిమల్ బ్యూటీ ట్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత విక్కీ ఛావాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రణబీర్ కపూర్, అలియా భట్‌లతో కలిసి లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనున్నారు.Vicky Kaushal finally reacts to reports of Katrina Kaif's pregnancy during the trailer launch event of Bad Newz#VickyKaushal #KatrinaKaif #Vikkat #BadNewz pic.twitter.com/aFQOXoq8bQ— Ria Sharma (@RiaSharma1125) June 28, 2024 -
బిగ్‌బాస్ బ్యూటీ ప్రేమ పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన భామ!
బాలీవుడ్ జంట ప్రిన్స్ నరులా- యువికా చౌదరి త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. బిగ్‌బాస్ -9 సీజన్లో పరిచయమైన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే ప్రిన్స్.. ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమకు ముగ్దురాలైన యువిక వెంటనే ఓకే చెప్పింది. అనంతరం ఈ ప్రేమజంట 2018 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.తాజాగా యువికా చౌదరి గర్భం ధరించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'మా జీవితాల్లోకి త్వరలోనే బేబీ రాబోతోంది' అంటూ ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చారు. తన భార్య నుంచి అందుకునే ఉత్తమ బహుమతి ఇదే అంటూ ఆమెకు ప్రిన్స్ నరులా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. 2019లో నాచ్ బలియే అనే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని గెలిచారు. ప్రిన్స్ నరౌలా రియాలిటీ షోలలో తన టాలెంట్ చూపించేవాడు. 2015లో వచ్చిన రోడీస్- 2 సీజన్లో విజేతగా నిలిచాడు. మరోవైపు అతను స్ప్లిట్స్ విల్లా 8వ సీజన్ ట్రోఫీ గెలుచుకున్నాడు. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్ టైటిల్ అందుకున్నాడు. నటి యువికా చౌదరి.. ఓం శాంతి ఓం, నాటీ @40, వీరే కీ వెడ్డింగ్, ఎస్పీ చౌహాన్, ద పవర్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by PRINCE YUVIKA NARULA ❤️❤️❤️ (@princenarula) -
మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కబీర్ సింగ్, జెర్సీ, పద్మావత్, బ్లడీ డాడీ లాంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన దేవా చిత్రంతో ప్రేక్షకుల ముంందుకు రానున్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండగానే.. తన ప్రియురాలు మిరా రాజ్‌పుత్‌ను 2015లో షాహిద్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన భార్య మీరా రాజ్‌పుత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు గర్భస్రావం అయినంత పనైందని.. ఏ నిమిషంలోనైనా బిడ్డను కోల్పోవచ్చని చెప్పారని వెల్లడించింది. అయితే వైద్యులు తనకు వెంటనే సోనోగ్రఫీ చికిత్స అందించారని ఆమె పేర్కొంది.దీంతో మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని.. లేకపోతే గర్భస్రావం జరిగి ఉండేదని తెలిపింది. ఈ విషయంలో తన భర్త షాహిద్ కపూర్ పూర్తిగా సహకరించాడని వివరించింది. తమ ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడని మీరా తన భర్తపై ప్రశంసలు కురిపించింది. కాగా.. షాహిద్ కపూర్‌తో వివాహమైన ఏడాది తర్వాత 2016లో మిషా అనే కూతురు జన్మించింది. ఈ జంట 2018లో తమ రెండో బిడ్డ జైన్‌ను స్వాగతించారు. -
అలాంటి డ్రెస్‌లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో లండన్ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడిన ముద్దగుమ్మ గతంలోనే ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలా పాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈనెల 11 వ తేదీన బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత బిడ్డ పుట్టిన విషయాన్ని వెల్లడించింది. కాగా.. మైనా చిత్రం ద్వారా కోలీవుడ్‌లో పాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో అభిమానులను మెప్పించింది. View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి ద్రష్టి ధామి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది.కాగా.. ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను వివాహం చేసుకున్నారు. కెరీర్ విషయానికొస్తే డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియేలో కూడా ఆమె పాల్గొన్నారు. ధామి 2007లో టీవీ సీరియల్ దిల్ మిల్ గయేతో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2010లో గుర్మీత్ చౌదరి సరసన గీత్ - హుయ్ సబ్సే పరాయి సీరియల్లోనూ కనిపించింది. ఆమెకు మధుబాల, ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ సీరియల్‌తనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె వివియన్ దేనాకు జంటగా నటించింది. అంతే కాకుండా ఇటీవలే ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ది ఎంపైర్, దురంగ అనే వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ప్రస్తుతం పెళ్లయిన దాదాపు తొమ్మిదేళ్లకు ద్రష్టి ధామి తల్లి కాబోతోంది. View this post on Instagram A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti) -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అంటూ అసభ్యంగా రాశారు: హీరోయిన్ ఆవేదన
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి మంజిమా మోహన్. తమిళ సినిమాల్లో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. సాహసమే శ్వాసగా సాగిపో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ ముద్దుగుమ్మ. అయితే ప్రముఖ నటుడు గౌతమ్ కార్తీక్‌ను 2022లో ఆమె వివాహం చేసుకుంది. కానీ అప్పట్లో వీరి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. గౌతమ్ తండ్రి వీరి పెళ్లితో సంతోషంగా లేరని.. పెళ్లికి ముందే మంజిమ గర్భవతి అని కొందరు అసభ్యకరమైన వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మంజిమ వాటిపై స్పందించింది. అవన్నీ ఒట్టి రూమర్స్ అని కొట్టిపారేసింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.మంజిమ మోహన్ మాట్లాడుతూ.. 'నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలే వచ్చాయి. పెళ్లి కాకముందే నేను గర్భవతినని రాశారు. దీంతో మా మామయ్య అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇలాంటి రూమర్స్ మా కుటుంబ సభ్యులను బాధపెట్టాయన్నది నిజం. పెళ్లికి ముందు కూడా ఇలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. కానీ అవేవీ నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. కానీ పెళ్లయిన తర్వాత నాలో భయం మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చదివి ఎందుకు బాధగా ఉన్నావని గౌతమ్ అడిగేవాడు. నాపై వస్తున్న కామెంట్స్ చూసి గౌతమ్‌కి నేను సరైన జోడీ కాదనే ఫీలింగ్ కలిగేది. కానీ గౌతమ్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఏదైనా బాధలో ఉంటే చెప్పాలని నన్ను అడిగేవాడు.' అని తెలిపింది.కాగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన కలియూంజల్ సినిమా ద్వారా మంజిమా మోహన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మధురనోంబరకాట్టులో తన నటనకు గాను ఆమె కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటిగా అవార్డును గెలుచుకుంది. ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ విపిన్ మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలో ప్రవేశించింది. ముత్తయ్య డైరెక్ట్ చేసిన దేవరట్టం సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్న్నారు. చివరిగా 2023లో బూ చిత్రంలో నటించిన మంజిమ ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. -
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్‌ను సేఫ్‌గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్‌కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్‌కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్‌కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్‌తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్‌లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్‌ని ఆపరేషన్‌తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్‌లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్‌ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్‌కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఓ ట్విస్ట్!
బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది. అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది. ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
యంగ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్ వైరల్!
కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
స్టార్ హీరోయిన్‌కు ట్విన్స్.. వైరలవుతున్న పోస్ట్!
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ అమలాపాల్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అమలాపాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాపను తన చేతుల్లో ఎత్తుకుని కనిపిచింది. అంతే కాకుండా 'టూ హ్యాపీ కిడ్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే తల్లి కాబోతున్న అమలాపాల్‌ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న హింట్ ఇచ్చిందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అమలాపాల్ తాజా పోస్ట్ బట్టి చూస్తే త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. గతేడాది జూన్ నుంచే డేటింగ్లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. కాగా.. టాలీవుడ్లో అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్‌లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. అఫీషియల్‌గా ప్రకటించిన దంపతులు!
బాలీవుడ్ స్టార్ మోస్ట్ క్రేజ్ ఉన్న కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్. ఈ జంటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాదిలో వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట టాక్ వినిపించింది. ఇటీవల బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొణె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత దీపికా వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా అందరూ ఊహించినట్లుగానే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బాలీవుడ్ జంట. దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ దంపతులు తమ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
లైగర్ హీరోయిన్ సోదరికి ప్రెగ్నెన్సీ.. వీడియో వైరల్!
లైగర్ భామ అనన్య పాండే గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉంది. కాగా.. గతేడాది అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 2023లో తన ప్రియుడు ఐవోర్ మెక్ క్రేను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. తాజాగా అలన్నా పాండే గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనన్య తల్లి భావన పాండే సైతం శుభాకాంక్షలు తెలిపింది. అలన్నా, ఐవర్ వివాహం అనన్య పాండే తండ్రి చుంకీ పాండే సోదరుడు చిక్కి పాండే కుమార్తె అయిన అలన్నా.. తన ప్రియుడు ఐవోర్ మెక్క్రేని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో సహా పలువురు బీ టౌన్ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కాగా.. ఐవోర్ ఒక అమెరికన్ దర్శకుడు, ఫోటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. కాగా.. గతంలో వీరిద్దరు మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Alanna Panday (@alannapanday) -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
నువ్విలా చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ యామీ గౌతమ్. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ సినిమాల్లో కనిపించింది. గతేడాది బాలీవుడ్ చిత్రాలతో అలరించిన భామ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంలో నటిస్తోంది. అయితే యూరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా అభిమానులకు యామీ గౌతమ్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తన భర్తతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవాళ జరిగిన ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆమె భర్త ఆదిత్య ధార్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. యామీ ప్రస్తుతం నటించిన ఆర్టికల్ 370 మూవీ ప్రమోషన్లలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ఆమె ఆమె భర్త ఆదిత్య ధర్ నిర్మించారు. కాగా.. 2019లో 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' సెట్స్‌లో కలిసిన ఈ జంట రెండేళ్లపాటు డేటింగ్ తర్వాత జూన్ 4, 2021న పెళ్లి చేసుకున్నారు. Yami Gautam, Aditya Dhar expecting their first child#pregnancy#Article370Teaser#entertainment#EntertainmentNews#YamiGautam #AdityaDhar pic.twitter.com/CzpmIRn4F0 — NIYA NIVRITI (@NiyaNivriti) February 8, 2024 -
నా భర్త ప్రెగ్నెన్సీతో ఉన్నారు: టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ అమలాపాల్. నవంబర్‌లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా.. ఇటీవలే తాను ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫోటోలు షేర్ చేస్తూ కాస్తా ఫన్నీగా కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ. అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పురుషుడి పొట్ట దాదాపు అతని భార్య గర్భంతో సమానంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి అపోహలను తొలగించే సరైన సమయం ఇదే. ఇప్పుడు కేవలం నేను మాత్రమే గర్భవతి కాదు. మేమిద్దరం. సారీ మై హస్బెండ్' అంటూ ఫన్నీ ఫోటోలను పంచుకుంది. కాగా.. తమిళంలో మైన చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. తమిళం, తెలుగులోనూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాజ ఈ జంట మనస్పర్థలు కారణంగా 2017లో విడిపోయారు. కాగా.. గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తితో డేటింగ్ విషయం బయటకొచ్చింది. అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రియుడు పెద్ద పార్టీని ఏర్పాటు చేసి లవ్ ప్రపోజ్ చేశాడు. అమలాపాల్ యాక్సెప్ట్ చేయడంతో ప్రియుడు ఆమె చేతికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా: పోకిరి భామ
పోకిరి భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం బిడ్డతో మాతృత్వం ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్‌కు సపోర్ట్‌గా ఉన్నారని వివరించింది. ఇలియానా మాట్లాడుతూ.. 'ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా. కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నా. నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను. ఇది నిజంగా తెలివి తక్కువ పని నాకు తెలుసు, కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పా' అని అన్నారు. తన భాగస్వామిని గురించి మాట్లాడుతూ.. 'బిడ్డ పుట్టిన తర్వాత మేము కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాం. నేను ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నా. మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కీ. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి.. ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు." అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే పర్సనల్ విషయాల్లో ప్రైవసీ మెయింటెన్ చేస్తున్న ఇలియానా.. తన పార్ట్నర్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కాగా.. ఇలియానా చివరిసారిగా ది బిగ్ బుల్లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి కనిపించింది. ప్రస్తుతం ఆమె రణదీప్ హుడా సరసన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో నటించనున్నట్లు తెలుస్తోంది. -
కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్ హీరోయిన్!
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు చెబుతున్నారు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్.. నిన్న గాక మొన్న ప్రపోజ్. అంతలోనే పెళ్లి) గతేడాది జూన్ నుంచే డేటింగ్లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలందరితో నటించింది. అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. కాగా.. హీరోయిన్ అమలాపాల్ తన ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్!
న్యూ ఇయర్ వేళ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది శాండల్‌వుడ్ భామ. తోతాపురి- 2, రంగనాయకి, దిల్మార్ చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా గర్భం ధరించినట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాదిలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఫోటోలను పంచుకుంది. అదితి తన ఇన్‌స్టాలో రాస్తూ..' బంధుత్వాలలో గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుండి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం అమ్మ. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. నేను 2024లో అమ్మను కాబోతున్నా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. కాగా..నటి అదితి ప్రభుదేవాకు, వ్యాపారవేత్త యషాస్‌తో నవంబర్ 2022లో వివాహం జరిగింది. ప్రస్తుతం అదితి నటించిన 'అలెక్సా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్) అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్‌లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) -
ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!
ప్రస్తుతం పోకిరీ భామ ఇలియానా పేరు నెట్టింట మార్మోగిపోతోంది. గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన భామ.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా బిడ్డ పేరును సైతం రివీల్ చేసింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలైంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అతన్ని పెళ్లి చేసుకుందా? అని ఆరా తీస్తున్నారు. ఇంతకుముందే తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న భామ.. అతని పేరు, ఎవరనేది ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన బిడ్డకు కోయా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. దీన్ని పెట్టిన పేరును పరిశీలిస్తే ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తోంది. అతనితో దాదాపు ఏడాది పాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే 13 న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని సమాచారం. ఇలియానా గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడానికి ఒక నెల ముందు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇలియానా భర్త మైఖేల్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గర్భం ధరించాక పలుసార్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో భర్త ఫోటోలను సైతం రివీల్ చేసింది. (ఇది చదవండి: చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
తల్లిదండ్రులు కాబోతున్న బిగ్ బాస్ జంట.. పెళ్లయిన ఐదేళ్లకు!
బిగ్ బాస్ జంట రోషెల్ రావ్, కీత్ సిక్వేరా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈ జంట మొదటి బిడ్డను స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోషెల్ రావు బేబీబంప్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్) రోచెల్ రావు ఇన్‌స్టాలో రాస్తూ..' "రెండు చిన్న చేతులు, రెండు చిన్న పాదాలు, మా బిడ్డను కలుసుకోవడానికి ఇక వేచి ఉండలేము! ఈ అద్భుతమైన బహుమతికి, మీ అంతులేని ప్రేమ, మద్దతు కోసం మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరీ ఆశీర్వాదం కావాలి. కీత్ అండ్ రోషెల్ + వన్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వార్త తెలిసిన వెంటనే భారతీ సింగ్, సుగంధ మిశ్రా, కిష్వెర్ మర్చంట్, అర్చన పురాణ్ సింగ్, సనా మక్బుల్ వంటి పలువురు ప్రముఖులు ఈ జంటను అభినందించారు. కీత్, రోషెల్ ప్రేమకథ కాగా.. కీత్, రోషెల్ ముంబైలోని ఒక చర్చిలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారు స్నేహితులుగా కొనసాగారు. అనంతరం కొన్ని నెలలపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత మాల్దీవులలో వివాహం చేసుకున్నారు. కీత్, రోషెల్ బిగ్ బాస్- 9లో కంటెస్టెంట్స్‌గా కనిపించారు. ఆ తర్వాత వారు నాచ్ బలియే సీజన్-9లోనూ పాల్గొన్నారు. కాగా.. కీత్ అంతకుముందే మాజీ నటి సంయుక్త సింగ్‌ను 2005లో వివాహం చేసుకోగా.. విభేదాల కారణంగా 2011లో విడిపోయారు. రోచెల్ ది కపిల్ శర్మ షోలో కనిపించినందుకు బాగా ఫేమ్ తెచ్చుకుంది. కీత్ దేఖో మగర్ ప్యార్ సే, దియా ఔర్ బాతీ హమ్, డోలీ అర్మానో కీ, దిల్ హి తో హై లాంటి టీవీ షోలలో కనిపించింది. (ఇది చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ భోళాశంకర్..!) View this post on Instagram A post shared by Keith Sequeira (@keithsequeira) -
నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్ ఫోటో వైరల్!
పోకిరీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు సరసన 'పోకిరి' సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా చేస్తోంది. అయితే పెళ్లి కాకుండానే అందరికీ షాకిచ్చింది భామ. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఊహించని విధంగా ఏకంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) అయితే ఆమె ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తొమ్మిది నెల గర్భంతో ఉన్న ఇలియానా లేటెస్ట్ బేబీ బంప్ పిక్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇలియానా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మై లిటిల్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా నటించిన ఇలియానాకు.. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్‌కు మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రెగ్నెన్సీ ప్రకటించి సినిమాలకు విరామం తీసుకుంది. బాలీవుడ్‌లోనూ 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్లు అందుకుంది. అయితే ‘రుస్తుం’,‘బాద్షాహో’ ‘రైడ్’, ‘ముబారకన్’ వంటి కథ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినా... ఇలియానాకు బీటౌన్‌లో సరైన బ్రేక్ లభించలేదు. చివరగా ఇలియానా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో నటించింది. (ఇది చదవండి: మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!
బాలీవుడ్ బుల్లితెర నటి పూజా జోషి అరోరా యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ధర్తి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, యే రిష్టే హై ప్యార్ కే అనే హిందీ సీరియల్స్‌లో కూడా నటించింది. తాజాగా రెండోసారి గర్భం ధరించినట్లు ప్రకటించింది భామ. ఈ విషయాన్ని సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన బిడ్డ, భర్తతో ఉన్న ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!) బుల్లితెర నటి పూజా జోషి.. 2015లో మనీష్ అరోరాను వివాహాం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు 2017లో ఈ జంటకు ఓ పాప జన్మించింది. దాదాపు ఐదేళ్లకు మరోసారి ప్రెగ్నెన్సీ ధరించింది పూజా. అయితే పెళ్లి తర్వాత నటనకు విరామం ప్రకటించిన పూజా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తన ఫోటోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. యే రిష్తా క్యా కెహ్లతా హైలో పూజ వర్ష మహేశ్వరి అనే పాత్రను పోషించింది. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by 𝙋𝙤𝙤𝙟𝙖 𝙅𝙤𝙨𝙝𝙞 𝘼𝙧𝙤𝙧𝙖 (@poojajoshiarorareal) -
ప్రెగ్నెన్సీతో పోకిరీ భామ.. బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన ముద్దుగుమ్మ!
పోకిరీ భామ ఇలియానా గురించి టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేదు. దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పోకిరీ మూవీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ముద్దుగుమ్మకు అవకాశాలు అంతేస్థాయిలో వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!) తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఇలియానా.. తన భాయ్‌ఫ్రెండ్‌ను ఫోటోను పంచుకుంది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సోషల్ మీడియా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున ఊహాగానాలకు తెరపడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్‌ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రెగ్నెన్సీకీ బాలీవుడ్లో వెబ్ సిరీస్‌ల్లో నటించింది. (ఇది చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్) -
ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను.. వీడియో షేర్ చేసిన ఉపాసన
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో ఉపాసన- రామ్ చరణ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డకు క్లీంకార అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే ఉపాసన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్‌ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్) ఉపాసన ట్వీట్లో రాస్తూ..'అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదములు పవిత్రా రాజారామ్.' అంటూ పోస్ట్ చేసింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 -
యూరిన్ కాదు.. ఇక లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం వైద్యులను సంప్రదించడం కాకుండా.. మహిళల కోసం హోంటెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఉమ్మితోనే అమ్మ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. అందుకోసం ఓ కిట్ యూకేలో లాంఛ్ కాగా.. అతిత్వరలో అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వైద్య-సాంకేతిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. లాలాజలంతో గర్భనిర్ధారణ కిట్ అందుబాటులోకి వచ్చింది. జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే బయోటెక్ స్టార్టప్ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ ఉత్పత్తికి ‘సాలిస్టిక్’గా నామకరణం చేశారు. ఏడాది ప్రయత్నాల తర్వాత తాజాగా యూకేలో దీనిని లాంఛ్ చేశారు. యూకేతో పాటు ఐర్లాండ్‌లోనూ వీటి అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికాలోనూ అమ్మకాల కోసం ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది ఈ కంపెనీ. ఇంతకాలం యూరిన్ బేస్డ్ హోంటెస్ట్ కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక నుంచి ఈ సెలైవాతో ప్రెగెన్సీ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా టెస్టింగ్ కిట్స్ సాంకేతికతను ఉపయోగించే ఈ సెలైవా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు తయారు చేయడం గమనార్హం. వీటిని ఎప్పుడైనా..ఎక్కడైనా ఉపయోగించొచ్చు. థెర్మామీటర్ను ఉంచుకున్నట్లే.. కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచితే అది లాలాజలాన్ని సేకరిస్తుంది. ఆపై ఫలితం కోసం ఐదు నుంచి పది నిమిషాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూడు నిమిషాల్లోనూ చూపించే అవకాశం ఉంది. స్టిక్ తొలుత లాలాజలాన్ని సేకరించి.. దానికి ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదిలీ చేస్తుంది, అక్కడ జీవరసాయన ప్రతిచర్య జరిగి ఫలితం వెలువడుతుంది. పిండం అభివృద్ధి చెందడానికి గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో ఉపయోగపడే ప్రత్యేకమైన హార్మోన్(గర్భధారణ కోసం) అయిన hCGని గుర్తించే సాంకేతికతపై ఈ పరీక్ష ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: సాధు జంతువు అనుకోకండి.. చిర్రెత్తితే మాత్రం.. -
పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. ఆ తర్వాత సాంప్రదాయబద్దంగా కూడా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే తాజాగా స్వర భాస్కర్‌ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్) బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) నాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. కొంతమంది నెటిజన్స్ చేసిన కామెంట్స్‌తో స్వర భాస్కర్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. అయితే వీటిపై స్వర భాస్కర్ ఇంతవరకు స్పందించలేదు. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..'పెళ్లయిన నాలుగున్నర్ర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే కొందరు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కూడా నిలిచారు. కాగా.. నవంబర్ 2021లో స్వరా ఒక బిడ్డను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) స్వరా భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లు స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. स्वरा भास्कर ने विवाह के 4.5 महीने बाद ही बालक को जन्म देकर समय से पहले काम पूर्ण करने वाले गडकरी जी को दिखाया आईना !! — Raju Das Hanumangadhi Ayodhya (@rajudasji99) May 31, 2023 -
ఇంతవరకు చేయలేదా?.. ఆశ్చర్యంగా ఉందే.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి కాగా.. మరికొద్ది రోజుల్లో ఉపాసన-రామ్ చరణ్ జంట తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నారు. (ఇది చదవండి: ప్రెగ్నెన్సీ గురించి ఊహించని విషయం చెప్పిన ఉపాసన!) పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) అయితే తాజాగా ఉపాసన తన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. తన ప్రెగ్నెన్సీలో ట్రైమిస్టర్ సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. అంతే కాకుండా ఫోటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. నా ఫోన్లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌కు మహేశ్ బాబు సతీమణి కామెంట్ రిప్లై కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. గతేడాది ఏ థర్స్డే అనే చిత్రంలోనూ నటించింది. అయితే తాజాగా ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు) అయితే బాలీవుడ్ నటుడైన అంగద్ బేడీని మే 2018లో నేహా ధూపియా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొద్ది నెలలకే ఓ బిడ్డకు కూడా జన్మినిచ్చారు. దీంతో తమపై చాలా సార్లు ట్రోల్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదని తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెళ్లికి ముందే తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వెల్లడించింది. (ఇది చదవండి: నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!) 72 గంటల్లోనే పెళ్లి: నేహా గర్భం ధరించిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో పెళ్లికి కేవలం 72 గంటల సమయమే ఇచ్చారని నేహా తెలిపింది. దీంతో ముంబయిలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే ప్రెగ్నెన్నీ విషయం బయటకు చెప్పేందుకు తాము చాలా ఉద్వేగానికి లోనయ్యామని వివరించింది. కాగా.. 2018లో ఒక్కటైన ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ బుల్లితెర నటి దిశా పర్మార్ గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు బాలీవుడ్ నటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2012లో నటనలో ఎంట్రీ ఇచ్చిన దిశా ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో పంఖురి గుప్తా పాత్ర పోషించినందుకు ఫేమ్ తెచ్చుకుంది. బడే అచ్ఛే లాగ్తే హై- 2లో ప్రియా సూద్ పాత్రలో మెప్పించింది. (ఇది చదవండి: త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్) కాగా.. బిగ్‌బాస్ సీజన్-14లో పాల్గొన్న రాహుల్.. దిశా పర్మార్‌కు ఆమె పుట్టిన రోజు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై 16, 2021లో సింగర్ రాహుల్ వైద్యతో దిశా పర్మార్ పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. దిశా 2019లో రాహుల్ వైద్య సాంగ్ యాద్ తేరి మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. (ఇది చదవండి: హీరోయిన్ను ముప్పుతిప్పలు పెట్టిన అమ్మాయిలు, వీడియో వైరల్) View this post on Instagram A post shared by Disha Parmar Vaidya (@dishaparmar) -
మిహికా ఇన్‌స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!
రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మిహికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఏమీ చేయకుండా ఉండటంలో కూడా ఓ స్వీట్నెస్ ఉంటుంది అంటూ క్యాప్షన్ జోడించింది. మిహికా ప్రెగ్నెంటా? ఈ వీడియోలో ఆమె బీచ్‌లో నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిహికా గర్భవతిలా కనిపిస్తోంది, అందుకే వదులైన డ్రెస్ వేసుకుంది కాబోలు అంటూ ఏకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు మిహికాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వచ్చాయి. కానీ అవి వట్టి పుకారుగానే మిగిలిపోయాయి. గతంలో మిహికా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెన్సీ గాసిప్స్ గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని.. తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చింది మిహికా. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
టాలీవుడ్ యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
నా భాగస్వామి తల్లి కాబోతుంది: స్టార్ మహిళా క్రికెటర్
స్టార్ మహిళా క్రికెటర్, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ సారా టేలర్.. సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. 2019లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సారా.. తాను తల్లిని కాబోతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 22) ప్రకటించింది. స్వలింగ సంపర్కురాలైన సారా.. చాలా కాలంగా డయానా అనే మహిళతో సహజీవనం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన సారా తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sarah Taylor (@sjtaylor30) తమ జీవన ప్రయాణం సాఫీగా సాగలేదు. తల్లి కావాలన్నది తన భాగస్వామి కల. ఈ విషయంలో డయానా ఎక్కడా రాజీ పడలేదు. నాకు తెలుసు డయానా మంచి తల్లి అవుతుంది. ఇందులో భాగమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 19 వారాలు గడవాలి. జీవితం చాలా కొత్తగా ఉండబోతుంది. డయానా పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ రాసుకొచ్చింది. డయానా ఈ విషయాన్ని బహిర్గతం చేసాక సహచరులు, మిత్రులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Being a mother has always been my partner's dream. The journey hasn't been an easy one but Diana has never given up. I know she will be the best mum and I'm so happy to be a part of it x19 weeks to go and life will be very different ! 🤍🌈 pic.twitter.com/9bvwK1Yf1e— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023 ఇదిలా ఉంటే, ఒత్తిడి సంబంధిత సమస్యల కారణంగా సారా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. కెరీర్లో 10 టెస్ట్‌లు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా.. 300 టెస్ట్ పరుగులు, 4056 వన్డే పరుగులు, 2177 టీ20 పరుగులు సాధించింది. వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేసిన ఆమె.. టీ20ల్లో 16 అర్ధశతకాలు బాదింది. వికెట్‌కీపర్‌గా టెస్ట్‌ల్లో 18 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు.. వన్డేల్లో 87 క్యాచ్‌లు, 51 స్టంపౌట్లు.. టీ20ల్లో 23 క్యాచ్‌లు, 51 స్టంపౌట్లు చేసిన 33 ఏళ్ల సారా.. 2017లో ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021లో టీమ్ అబుదాబీ (టీ10 లీగ్) అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎంపికైన తొలి మహిళా కోచ్‌గా చరిత్ర సృష్టించింది. -
తల్లి కాబోతున్న 'సాహో' నటి.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి, యే జవానీ హై దివానీ ఫేమ్ ఎవెలిన్ శర్మ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. తాను రెండోసారి తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ వార్త విన్న పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎవెలిన్ శర్మ మే 2021లో బాయ్‌ఫ్రెండ్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఫ్రెండ్ అయిన మరో నటి ఫంక్షన్లో తొలిసారి కలుసుకున్నారు. గతంలో నవంబర్ 12, 2021న ఈ జంటకు కుమార్తె జన్మించింది. పాపకు అవ రానియా భిండి అని పేరు పెట్టారు. బాలీవుడ్ కెరీర్: ఎవెలిన్ శర్మ 2012లో 'ఫ్రం సిడ్నీ విత్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'నౌతంకీ సాలా', 'వైజేహెచ్డీ', 'యారియాన్', 'మెయిన్ తేరా హీరో', 'కుచ్ కుచ్ లోచా హై', 'హిందీ మీడియం' వంటి చిత్రాలలో నటించింది. 2019లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన 'సాహో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Evelyn Sharma (@evelyn_sharma) -
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ సింగర్ కుమారుడు.. సోషల్ మీడియాలో వైరల్
లెజెండరీ సింగర్, దివంగత బప్పి లాహిరి కుమారుడు బప్పా లాహిరి మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాను రెండో సారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ క్రిస్మస్ వేళ మేం నలుగురం కాబోతున్నాం అంటూ తన భార్య తనీషాతో కలిసి దిగిన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ జంటకు ఇప్పటికే క్రిష్ అనే కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంటకు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. బప్పా లాహిరి, తనీషా మార్చి 18, 2012 న పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే వీరు ఒకరికొకరు పరిచయం ఉండగా.. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. 2017లో వీరికి ఓ కుమారుడు జన్మించారు. బప్పి లాహిరి మరణం: బప్పి లాహిరి ఫిబ్రవరి 15న తుది శ్వాస విడిచారు. అతనికి కుమారుడు బప్పా లాహిరి, కుమార్తె రెమా లాహిరి సంతానం. View this post on Instagram A post shared by Bappa.b.Lahiri (@bappa.b.lahiri) -
Alia Bhatt: రణ్‌బీర్ జోక్ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు
హీరోయిన్ ఆలియా భట్‌కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్‌బీర్ మాటలే. ఇక ప్రచారంలో ఉన్న వార్త గురించి ఆలియా స్పందిస్తూ ‘ట్విన్సా.. అలాంటిదేం లేదు.. ఒక్కరే’ అంటూ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్–ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకు తాను తల్లి కాబోతున్నానని ప్రకటించి, సంతోషాన్ని పంచుకున్నారు ఆలియా. కాగా ఇటీవల ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌బీర్‌కి యాంకర్ ఓ సరదా టాస్క్ పెట్టారు. ఒక అబద్ధం, రెండు నిజాలు చెప్పాలని కోరారు. దీనికి రణ్‌బీర్ స్పందించి ‘ట్విన్స్ పుట్టబోతున్నారు’ అంటూ సమాధానం ఇచ్చి, అది నిజమా? అబద్ధమా? అనేది మీరే చెప్పుకోండి అన్నారు. ఆయన మాటలతో ఆలియాకి ట్విన్స్ పుట్టబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై తాజాగా ఆలియా స్పందిస్తూ– ‘‘నాకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ రణ్‌బీర్ జోక్ చేశాడు. ఆ మాటల్లో నిజం లేదు. సరదాగా జోక్ చేస్తే జనం ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. నాకు ఒక్కరే పుట్టబోతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు వద్దు. అయినా అమ్మాయిలకు పెళ్లయితే ఒక టాపిక్, తల్లి కాబోతోందంటే ఒక టాపిక్.. ఇలా ఏదైనా టాపిక్కే. పెళ్లి, తల్లవడం అనేది వ్యక్తిగత విషయాలు. ఇవి వృత్తిపరంగా ఎలాంటి ప్రభావం చూపవు’’ అని స్పష్టం చేశారు. కాగా ఆలియా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్స్’ ఆగస్టు 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: సమీప బంధువు లైంగిక దాడితో గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక గర్భస్థ పిండాన్ని, 48 గంటల్లో తొలగించాలని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. బాలిక జీవించే హక్కు దృష్ట్యా పిండాన్ని తొలగించాలని ఆదేశించే అధికారం తమకుందని తేల్చిచెప్పింది. సీనియర్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికల్ పద్ధతి లేదా శస్త్రచికిత్స ద్వారా ఈ పిండాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్ష చేసేందుకు వీలుగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను భద్రపర్చాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. బాలికపై లైంగిక దాడికి సంబంధించి నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను డీఎన్ఏ, ఇతర పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని, ఈ కేసు తుది విచారణ కోసం డీఎన్ఏ, ఇతర పరీక్షల రిపోర్టులను భద్రపర్చాలని దర్యాప్తు అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులు సహకరించి న్యాయబద్ధంగా అందాల్సిన పరిహారాన్ని ఇప్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. ‘లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చింది. బాలిక సమ్మతి లేకుండా వచ్చిన ఈ గర్భాన్ని కొనసాగించాలా, తొలగించుకోవాలా అన్న స్వేచ్ఛ సదరు బాలికకు ఉంది. 25 వారాల గర్భంతో ఉంది కాబట్టి గర్భాన్ని తొలగించలేమనడం సరికాదు. గర్భం తొలగించకపోతే భవిష్యత్తులో అనేక తీవ్రమైన మానసిక, శారీరక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు ఇది విఘాతం’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.100కే వెయ్యి చైల్డ్ పోర్న్ వీడియోలతో.. కాగా హైదరాబాద్‌కు చెందిన బాలికపై సమీప బంధువు బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చూపించగా, 25 వారాల గర్భంతో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. 24 వారాల గర్భం దాటితే గర్భస్థ పిండాన్ని తొలగించడానికి చట్టప్రకారం హైకోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. -
భర్త సిగరెట్ అలవాటు ప్రభావం భార్య గర్భధారణపై ఉంటుందా..?
Husband Smoking Habit Affect Wife Pregnancy: భర్త సిగరెట్ తాగితే ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావాల కారణంగా దాని దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిన విషయమే. అయితే అతడు ఇంటి బయట సిగరెట్ తాగి వచ్చినా ఆ అలవాటు దంపతులిద్దరితో పాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుంది. అతడి సిగరెట్ అలవాటు వల్ల సంతాన సాఫల్య అవకాశాలూ తగ్గుతాయి. అతడు తాగే సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ దుష్ప్రభావాలూ పెరుగుతాయి. భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్నర్కు గర్భధారణ కూడా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ కారణంగా భార్యలోని హార్మోన్ సైకిళ్లలో పాలు పంచుకునే జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. దాంతో ఆమెలోని అండాల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదు. మహిళకు సంతాన సాఫల్య చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చి... ఆమె భర్తకు సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు... ఐవీఎఫ్ లాంటి ప్రక్రియలో ఆమె ఓవరీ స్టిమ్యూలేషన్కు మరిన్ని మందులు అవసరమవుతాయి. అందుకే సాధారణ దంపతులతో పోలిస్తే భర్తకు ఈ దురలవాటు ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. గర్భస్రావాలు అయ్యే అవకాశాలూ పెరుగుతాయి. గర్భధారణ జరిగాక కూడా నెలలు నిండకముందే బిడ్డపుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే చిన్నారుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక పొగతాగే పురుషుల విషయానికే నేరుగా వస్తే... తమ అలవాటు కారణంగా వాళ్ల వీర్యంలో శుక్రకణాల సంఖ్య, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటును వదులుకోవడమే మేలు. అంతేకాదు... కేవలం సంతానం విషయంలోనే కాకుండా వారి ఆరోగ్యంతో పాటు, భవిష్యత్తులో వారి పిల్లల ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది. చదవండి: Overhydration: నీరు ఎక్కువ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు మరి! -
వ్యాక్సిన్‌తో గర్భధారణపై ప్రభావం.. నిజమేంటంటే!
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నందువల్ల గర్భధారణ అవకాశాలపై ప్రభావం పడదని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ కారణంగా గర్భధారణ అవకాశాలు తగ్గుతాయనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కొందరు మహిళలకు వ్యాక్సిన్ ఇచ్చి, మరికొందరికి ఉత్తుత్తి వ్యాక్సిన్ ఇచ్చి.. అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ ఓ అధ్యయనం చేసింది. రెండు గ్రూపుల్లోనూ గర్భం దాల్చిన వారి సంఖ్య సమానంగా ఉందని తెలిపింది. వ్యాక్సిన్ తర్వాత తమ రుతుక్రమంలో స్వల్ప తేడాలు వచ్చాయని చెప్పిన మహిళల కేసులనూ అధ్యయనం చేస్తున్నారు. అయితే గర్భధారణకు వ్యాక్సిన్లతో ముప్పుందనడానికి ఆధారాలు లేవని యేల్ వర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిల్ ప్రొఫెసర్, గైనకాలజిస్టు మేరీ జేన్ మిన్కిన్ వెల్లడించారు. గర్భం కోసం ప్రయత్నిస్తున్నా, సంతాన సాఫల్య చికిత్సలు తీసుకుంటున్నా.. వెంటనే టీకా తీసుకోవాలని ఎమోరీ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ డెనిస్ జమైసన్ తెలిపారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీఎస్) గర్భిణులు వ్యాక్సిన్ తీసుకోవాలని ఇదివరకే సిఫారసు చేసింది. సాధారణ మహిళలతో పోల్చినపుడు కోవిడ్ సోకిన గర్భిణులు తీవ్రంగా జబ్బుపడే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. -
నేను ప్రెగ్నెంట్ కాదు: బిగ్‌బాస్ ఫేం
నవంబర్ 4న కర్వా చౌత్ వేడుకల సందర్భంగా బయటకు వచ్చిన బిగ్‌బాస్ ఫేం ప్రిన్స్ నరులా, యువికా చౌదరి ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. యువికా కారు నుంచి దిగి వస్తుండగా భర్త ప్రిన్స్ ఆమెను చేయి పట్టుకొని ప్రేమగా తీసుకొచ్చాడు.ఈ వీడియోలో యువికా పింక్ కలర్ దుప్పట కలిగిన అనార్కలి దుస్తులను ధరించారు. ఈ డ్రెస్ ఆమెకు కాస్తా వదులుగా ఉండటం, కారు నుంచి దిగగానే దుప్పటతో కవర్ చేయడంతో యువికా ప్రస్తుతం గర్భవతి అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో తాజాగా నటి స్పందించారు. తను గర్భవతినని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇటీవల ఆమె కరోనా బారినపడి కోలుకున్నట్లు పేర్కొన్నారు. డెంగ్యూ జ్వరం రావడం వల్ల ఆసుపత్రికి వెళ్లగా తనకు కోవిడ్ సోకినట్లు తేలిందన్నారు. అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పుడు వార్తలను సృష్టించవద్దని కోరారు. చదవండి: టాక్ షో హోస్ట్‌గా సమంత! తన డ్రెస్సింగ్‌పై మాట్లాడుతూ.. ‘నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ నాకు డిజైన్ కలిగిన దుపట్టా ఇష్టం. అందుకే దాన్ని ధరించాను. కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటాం. అది జరగాల్సిన సమయంలో తప్పక జరుగుతంది’ అని పేర్కొన్నారు. కాగా యువికా చౌదరి, ప్రిన్స్ నరులా 2015లో వచ్చిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 9 లో తొలిసారిగా కలుసుకున్నారు. అక్కడ ఏర్పడిన వారి పరిచయం ప్రేమకు దారితీసింది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక నిశ్చితార్థం చేసుకొని 2018లో వివాహం చేసుకున్నారు. ఈ రెండేళ్లలో తన జీవితం ఆనందంగా, సంతోషంగా గడిచిపోయిందని యువికా ఓ పోస్టు రూపంలో పేర్కొన్నారు. కాగా యువికా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించారు. చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి View this post on Instagram #princenarula #yuvikachaudhary for #karvachauth ❤ #paptalk A post shared by Viral Bhayani (@viralbhayani) on Nov 4, 2020 at 4:00am PST -
తల్లి కాబోతున్న నటి అనిత
నటి అనిత హసానందాని తన అభిమానులకు తీపికబురు వినిపించారు. తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోహిత్ రెడ్డితో పరిచయం, ప్రేమ, అతడు ప్రపోజ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు గర్భం దాల్చడం వంటి అన్ని విషయాలను చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా! ) అనిత పారిశ్రామికవేత్త రోహిత్ రెడ్డిని ప్రేమించారు. 2013లో ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ చిన్న కుటుంబంలోకి విచ్చేయనున్న కొత్త అతిథి కోసం వీరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ జంట "నాచ్ బలియే 9" సీజన్లో పాల్గొని సందడి చేసింది. అనిత విషయానికి వస్తే తెలుగులో ఉదయకిరణ్ 'నువ్వు నేను', అల్లరి నరేష్ 'తొట్టిగ్యాంగ్'తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు. తన ప్రతిభను టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు. బుల్లితెరపై నాగిని సీరియల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. (చదవండి: పాలిటిక్స్‌పై విజయ్ సంచలన వ్యాఖ్యలు) -
సంతానం లేదని దంపతుల ఆత్మహత్య
బాసర:పెళ్లయి మూడేళ్లవుతున్నా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర మండలం టాక్లీలో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మేశెట్టి రంజితను మహారాష్ట్రకు చెందిన సంతోష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. సంతోష్ ఇల్లరికం వచ్చాడు. అప్పటినుంచి దంపతులిద్దరూ టాక్లీలోనే ఉంటున్నారు. అయితే వారితోపాటు పెళ్లయిన వారికి పిల్లలు కలగడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. పిల్లల కోసం నిజామాబాద్, బాసరలోని వైద్యులను సంప్రదించారు. పిల్లలు లేకుంటే సమాజంలో చిన్నచూపు చూస్తారన్న భావనతో కొద్దిరోజులుగా భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ.. బుధవారం రాత్రి బాసరలోని గోదావరిలో ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం మృతదేహాలు నీటిలో తేలగా.. జాలర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దంపతులిద్దరినీ సంతోష్ (26), రంజిత (22)గా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
గర్భం ఇప్పుడే వద్దు!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి పుట్టుకనే అడ్డుకుంటోందా? అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్న నవ దంపతుల ఆశలపై భయం ఆవరిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సర్వేల ఫలితాలు అదే స్పష్టం చేస్తున్నాయి. కరోనా కోరలు ఎంత పెద్దవో ఎన్ని రకాలుగా సమాజాన్ని చుట్టేస్తున్నాయో వెల్లడిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: జర్నల్ ఆఫ్ సైకో సోమాటిక్ రీసెర్చ్ గైనకాలజీ రిపోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేలు వెల్లడిస్తున్న ప్రకారం కరోనాకు కాస్త అటూ ఇటూగా పెళ్లి పీటలు ఎక్కిన దంపతులు, అంతకు ముందే పెళ్లయినా సరిగ్గా ఈ టైమ్‌లో పిల్లలను కందామని ప్లాన్ చేసుకున్నవారు, పిల్లలు పుట్టకపోవడమే సమస్యతో ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు.. ఇలా ఒకరనేమిటి? ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ప్రస్తుత సంక్షోభ సమయంలో పిల్లలు కనడాన్ని దంపతులు వాయిదా వేసుకుంటున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. నగరంలోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు వైద్యులు, గైనకాలజిస్ట్లు అంటున్నారు. ఈ సమయంలో పిల్లలు వద్దనుకోవడానికి కరోనా కారణంగా గర్భం దాల్చాక ఆరోగ్యం ఎలా ఉంటుందోననే ఆందోళనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గర్భంతో ఉండగా కరోనా సోకితే ఎలా అనే భయంతో 73శాతం మంది పిల్లలు వద్దనుకుంటున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. దీనికి తోడు ప్రస్తుతం ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కూడా ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నట్లు 88శాతం మంది చెప్పారట. మరోవైపు ఇలా వాయిదా కారణంగా గర్భం ధరించాల్సిన వయసులో ధరించకపోవడం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యలు ఉత్పన్నమవుతాయనే భయాలూ వెన్నాడుతున్నప్పటికీ.. వాయిదాకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. వీలైతే వాయిదా వేయడమే మేలు.. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఓకే గానీ.., ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునేవారు మాత్రం కొంతకాలం వెయిట్ చేయమనే చెబుతున్నాం. గర్భిణిగా ఉన్నప్పుడు ఊపిరి తిత్తులు, గుండె.. ఇలా ప్రతి అవయవం మార్పునకు లోనవుతుంది. ఒక్కోసారి కొందరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంటుంది. ఇలాంటప్పుడు కరోనా ఎఫెక్ట్ అయితే కష్టం. ప్రస్తుతం కరోనాకు మెడిసిన్ కూడా లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ వాయిదా వేసుకోవడమే మంచిదనే ఎక్కువ మంది భావిస్తున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌ని హోల్డ్‌లో పెట్టాయి. వాయిదా వేసుకుంటే వయసురీత్యా వచ్చే మార్పులు ఉంటాయి కదా అనుకోవచ్చు. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉంటుంది. వయసు పైబడిన వారిలో ప్రెగ్నెన్సీ వస్తే బీపీలు, షుగర్ సమస్యలు ఎదుర్కోవడం తప్పదు. కానీ, అవన్నీ వేరు. ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు చాలా కీలకం. ఈ సమయంలో కోవిడ్ ఎఫెక్ట్ అయితే చికిత్స చేయడం కష్టం. సరైన ఫలితాలు కూడా రాకపోవచ్చు. అలాగని ఆల్రెడీ ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా తల్లి నుంచి బిడ్డకు ఏ విధంగా సోకుతుందనేది నిర్ధారించే స్టడీస్ ఏమీ లేవు. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, ముషీరాబాద్ -
వివాహిత ఆత్మహత్య
జన్నారం(ఖానాపూర్): సంతానం కలగడం లేదని మనస్థాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జన్నారం మండలం చింతగూడలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం చింతగూడకు చెందిన సీపతి సిందూజ (22)కు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో మూడేళ్లక్రితం వివాహమైంది. పిల్లలులేరని తరచూ బాధపడుతున్న మహిళ ఈనెల 5న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి సేపూరి కమలాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హద్దులు దాటిన ప్రేమ.. పెళ్లి కాకుండానే
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : తొందరపాటు నిర్ణయాలతో ఆ ప్రేమికులు పెళ్లి చేసుకోకనే ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి యువతి గర్భం దాల్చింది. పెద్దలకు చెప్పకుండా, అనుమానం రాకుండా చూసుకున్న యువతికి ఏడవ నెలలోనే పురిటినొప్పులు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకముందే తానే కారణమంటూ ఓ యువకుడు పోలీసులను కలిసి ఒప్పుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. ఉరవకొండ పట్టణానికి చెందిన యువతి, యువకుడి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అలా శారీరకంగానూ కలుస్తుండటంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఇంట్లో ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టింది. రోజురోజుకూ ఆమె శరీరంలో మార్పులు వస్తున్నా తల్లిదండ్రులూ గమనించలేకపోయారు. ఏడు నెలల గర్భంతో ఉన్న యువతికి నొప్పులు రావడంతో తల్లి అనుమానం వచ్చి గట్టిగా మందలించింది. అప్పుడు తాపీగా అసలు విషయం చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఆ యువతి మగబిడ్డను ప్రసవించింది. విషయం తెలియగానే యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యువతిని ప్రేమించింది తానేనని ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బాధిత యువతి నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదు. (కూతురు క్యారెక్టర్‌ను అనుమానించి..) ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు తలుపుల: ప్రేమ పేరుతో కొందరు యువకులు బాలికల వెంటపడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. పెద్దలకు తెలిసినా మందలించినా వినకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తలుపుల మండలం కొత్తపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు సమీప గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అలా రోజూ పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో కలుసుకునేవారు. రెండు రోజుల కిందట మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత శనివారం రాత్రి గ్రామ సమీపంలోని వదిలేసి వెళ్లిపోయాడు. బాలికను మోసం చేసి తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్‌కుమార్‌రెడ్డిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ మధు ఆదివారం తెలిపారు. (ఆ తప్పటడుగే యువతి ప్రాణం తీసింది) యువకుడిపై పోక్సో కేసు అనంతపురం న్యూసిటీ: తొమ్మిదో తరగతి అమ్మాయిని వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురంలోని సాయినగర్ 5వ క్రాస్‌లో ఉంటున్న ఎ.హుస్సేన్ జీసస్నగర్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వారం రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు. బాలిక ఎక్కడికి వెళ్లినా ప్రేమించాలంటూ వెంటబడుతున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుస్సేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ ఎం.శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ప్రేమ విఫలమై మహిళా వలంటీర్ ఆత్మహత్య గుత్తి: ప్రేమ విఫలమై మహిళా వలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి 1వ బ్లాక్ వార్డు వలంటీర్ రమా భార్గవి (23), ఇదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ ఇమామ్ హుసేన్(మసి) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇమామ్ హుసేన్‌కు పది రోజుల కిందట మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రమాభార్గవి మదనపడుతుండేది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో తాను జీవించడం వ్యర్థమని భావించి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటి తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి రమాభార్గవిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమా భార్గవి మృతికి వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు. -
అబార్షన్లు ఆగట్లేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అబార్షన్లు ఏడాదికేడాదికి పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో తెలంగాణలో 27,559 మంది మహిళలకు అబార్షన్లు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. ఈ అబార్షన్లలో కొన్నింటిని బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు గైనకాలజిస్టుల సలహా మేరకు చేస్తారు. కానీ మరికొన్ని అబార్షన్లు మాత్రం ఆడబిడ్డను వదిలించుకోవడానికి జరుగుతున్నవిగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2016–17 నుంచి 2019–20 (డిసెంబర్ నాటికి) దేశవ్యాప్తంగా 45.24 లక్షల అబార్షన్లు జరిగాయి. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువగా కనిపిస్తున్నా, ఏటేటా ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. పాత అబార్షన్ల చట్టం ప్రకారం 20 వారాల వరకు జరిగే అబార్షన్లకు మాత్రమే చట్టబద్ధత కల్పించింది. దీనివల్ల నిజమైన కారణాలు ఉన్నప్పటికీ అబార్షన్లు చేసే అవకాశం లేక కొంత మంది అశాస్త్రీయ పద్ధతులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన కేంద్రం అబార్షన్ల గడువును 24 వారాలకు పొడిగించింది. వారి చేతిలోనే 46.6%.. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం దేశంలో 46.6 శాతం అబార్షన్లు వైద్యులు కానివారు చేస్తున్నారు. వాస్తవంగా గైనకాలజిస్ట్ మాత్రమే ఈ అబార్షన్లను చేయాలి. అది కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. కానీ నర్సులు, మంత్రసానులు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు, కుటుంబ సభ్యులు లేదా వ్యక్తిగతంగా కొందరు అనైతికంగా అబార్షన్లు చేస్తున్నారు. 27.4 శాతం అబార్షన్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అనైతిక అబార్షన్లు నేరం.. అనైతికంగా ఎవరుపడితే వారు అబార్షన్లు చేయడం నేరం. కేవలం గైనకాలజిస్ట్లు మాత్రమే తల్లి, బిడ్డల ఆరోగ్య విషయాలు పరిశీలించి, సమస్య వస్తేనే 20 వారాల గడువులోగా అబార్షన్ చేయాలి. డాక్టర్ కానివారు ఎవరైనా అబార్షన్ చేయకూడదు. చాలామంది ప్రైవేటు ప్రాక్టీషనర్లు ఆడబిడ్డ ఉందని గుర్తించి, తల్లిదండ్రుల విన్నపం మేరకు అబార్షన్లు చేస్తున్నారు. ఇది అనైతికం. ఆడబిడ్డ కడుపులో ఉన్న విషయాన్ని స్కానింగ్ ద్వారా తెలుసుకొని కొందరు తీవ్రమైన తప్పుకు ఒడిగడుతున్నారు. మేము అలాంటి వాటిపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. –డాక్టర్ కృష్ణవేణి, గైనకాలజిస్ట్, హైదరాబాద్ వివిధ సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అబార్షన్ల సంఖ్య -
ఆదెమ్మ.. అమృత హస్తమేనమ్మా
సాక్షి,కర్ణాటక, బళ్లారి : ఆరోగ్య సేవలు విస్తారంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాన్పుల విషయంలో ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి వెళ్లి అక్కడే ప్రసవించడం సర్వసాధారణమైంది. ఆస్పత్రిలో నూటికి 90 మంది సిజేరియన్ ఆపరేషన్ చేసే ప్రసవం చేస్తున్నారు. అదేమని అడిగిన బాధితులకు బిడ్డ అడ్డం తిరిగిందని లేదా మరేదో సమస్య ఉందని ప్రతి వైద్యులు ఇస్తున్న సమాధానం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల సహాయం లేకుండా మన పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్న సూలగిత్తి పద్ధతిని నేటికీ పల్లెల్లోనే కాదు నగరంలో కూడా కొనసాగిస్తూ ఎందరో గర్భిణులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సుఖమయంగా ప్రసవం చేస్తున్న ఓ సూలగిత్తి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. బళ్లారితో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్నూలు జిల్లా హాలహర్వి ప్రజలు తమ బిడ్డల కాన్పుల కోసం హెచ్.ఆదెమ్మపైనే ఆధారపడ్డారు. అత్యంత సులభంగా కాన్పులు చేయడంలో నేర్పరితనం ఆమె సొంతం. అందుకే ఈమె చేతి గుణంపై ప్రజలకు అపారమైన నమ్మకం. అందుకే ఆదెమ్మ ఎక్కడున్నా మరీ వెతుక్కొని వెళతారు. పూర్వం నుంచి ఎంతో ఆదరణ పూర్వం నుంచి ఇప్పటికీ మారు మూల పల్లెల్లో ఎద్దుల బండిలో ఈమెను ఆధారంగా తీసుకొచ్చే వారు. ప్రస్తుతం కొందరు కారులో ఆమెను తీసుకెళ్తుంటారు. 80 ఏళ్ల ఆదెమ్మ ఇప్పటికీ చెరగని, తరగని ఉత్సాహంతో కాన్పులు చేయడానికి శ్రమిస్తారు. ఇప్పటి వరకు 5 వేలకు పైగా ప్రసవాలు చేసిన ఘనత ఆమెది. కొన్ని కుటుంబాలు మూడు తరాలుగా ఈమె హస్తగుణాన్ని నమ్మారంటే ఈ మహాతల్లికి ఉన్న నైపుణ్యం అర్థమవుతోంది. బళ్లారి తాలూకా హంద్యాళ గ్రామానికి చెందిన ఆదెమ్మకు మాతృమూర్తి పార్వతమ్మే గురువు. పెళ్లి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లోని హాలహర్వికి వెళ్లిన ఆదెమ్మ అక్కడ ఎన్నో కాన్పులు చేశారు. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయా పని లభించిందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈమె సేవ ఎంతటి ఘనత సాధించిందో అర్థమవుతోంది. అనంతరం ఆ పనికి స్వస్తి చెప్పి కుటుంబంతో స్థిరపడ్డారు. కాన్పు ఎప్పుడవుతుందో చెప్పగల దిట్ట నాడి ఇలా పట్టుకొని కాన్పు ఎప్పుడు అవుతుందో చెప్పడంలో ఈమెకు ఉన్న అనుభవం అపారం. కాన్పు కష్టకరమవుతుందని ఈమె అనుకుంటే తక్షణమే ఆస్పత్రికి తరలిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లేక ముఖ్యమైన పనిలో ఉన్నా కూడా కాన్పులు చేయడానికి మాత్రం సదా సిద్ధమంటూరు ఆదెమ్మ. పూర్వం మహిళలు చాలా గట్టితనంతో ఉండేవారు. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా సునాయాసంగా ప్రసవాలు జరిగేవి అప్పట్లో. ఇప్పటి మహిళలకు పురిటి నొప్పులను తట్టుకునే ఓర్పు, నేర్పు వారికి లేవని, తన వల్ల ఇప్పటి వరకు ఏ తల్లీబిడ్డ ప్రాణానికి ముప్పు కలగలేదని విశ్వాసంగా చెబుతారు. 2011లో అప్పటి జిల్లా ఇన్చార్జ్, పర్యాటక శాఖా మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి ఈమె సేవలను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం విశేషం. అయినా ఇంతటి ఉత్తమ సమాజ సేవలను అందిస్తున్నా ఈమెకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇతర సౌకర్యాలు కానీ అందకపోవడం విచారకరం. -
జీవన శైలి వల్ల కూడా సంతాన లేమి
భారతదేశంలో సంతానం లేని వారి శాతం వేగంగా పెరుగుతోంది. జీవన శైలిలో వచ్చిన మార్పులతో పాటు అనేక కారణాలతో దేశంలో సుమారు 15 శాతం దంపతులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారిలో ఒక శాతం మంది మాత్రమే ఐ.వి.ఎఫ్., ఇతర అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ‘‘సంతానలేమి సమస్య ఎక్కువైందని, ఇందుకు పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ భారతదేశం వంటి విస్తారమైన దేశంలో కేవలం ఒక శాతం దంపతులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉండడం విచారకరం’’ అని ఇందిరా ఐ.వి.ఎఫ్. గ్రూప్ చైర్మన్ డా. అజయ్ ముర్దియా అంటున్నారు. ఇందిరా ఐవీఎఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నూతనంగా రెండు ఆస్పత్రులను ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలు లేని దంపతులకోసం సెప్టెంబర్ 10 వరకు ఉచిత అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
పిండ గండాలు దాటేద్దాం
గర్భధారణ, ప్రసవాలకు సంబంధించి ఆబ్స్టెట్రిక్స్; స్త్రీ వ్యాధులకు సంబంధించి గైనకాలజీ విభాగాలు వైద్యశాస్త్రంలో అందరికీ తెలుసు. గర్భిణులకు, గర్భస్థ శిశువులకు సంబంధించి రాబోయే ఎలాంటి ముప్పులనైనా గర్భస్థ స్థాయిలోనే పరిశోధించి, వైద్యం అందించగల అత్యాధునిక వైద్య విభాగంగా ‘‘మెటర్నల్ ఫీటల్ మెడిసిన్’’ ఇటీవల బాగా అభివృద్ధి చెందుతోంది.దీనికి సంబంధించిన ‘ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్’ అనే సంస్థ లండన్‌లో కైపోస్ నికొలాయిడ్స్ అధ్యక్షతన పరిశోధనలు జరుపుతోంది. క్రోమోజోముల నిర్మాణాత్మక అసాధారణతల స్క్రీనింగ్ తదితర ఆధునిక ఫీటల్ సర్జరీలను వీరు ప్రవేశపెట్టారు.ఇదే విభాగంలో ‘ఎన్యుప్లోయిడీస్’ అంటే క్రోమోజోముల సంఖ్యలో మార్పులు తెలుసుకోవడం కోసం చేసే స్క్రీనింగ్ పరీక్షలతోపాటు అధునాతన పరిశోధనల్లో ఎలాంటి విశ్లేషణ చేయాలనే అంశంపై ఈ వ్యాస రచయిత్రి / డాక్టర్ ప్రప్రథమంగా భారతదేశంలో చేసిన పరిశోధనలను ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్, లండన్ అంగీకరించింది. గర్భిణులు ముఖ్యంగా చేయించుకోవలసిన టెస్ట్‌లు మౌలికమైన స్కానింగ్‌ల గురించిన అవగాహన కోసం ఈ వ్యాసం. ♦ గర్భిణులకు చేయాల్సిన ముఖ్య పరీక్షలేమిటి? గర్భం ధరించిన 6 నుంచి 8 వారాల మధ్య మొట్టమొదట పిండపరిమాణం, గుండె కొట్టుకోవడం, గర్భం వయస్సు వంటివి నిర్ధారణ చేయడానికి మొదటి స్కాన్ నిర్వహిస్తారు. తరవాత చెయ్యవలసినవి ఎన్.టి స్కాన్, ఎనోమలి స్కాన్, పెరుగుదల స్కాన్. ♦ ఎన్.టి స్కాన్ అంటే ఏమిటి? గర్భస్థ శిశువులో ఎదుగుదలతో పాటు క్రోమోజోముల అసాధారణత వల్ల వచ్చే ప్రమాదమేదైనా ఉందేమో పరిశీలించడానికి చేసే ప్రత్యేక స్కాన్ ఈ ఎన్.టి. స్కాన్. ఇది గర్భస్థ శిశువు వయస్సు 11 నుంచి 13.6 వారాల సమయంలో లేదా శిశువు 45 నుంచి 84 మిల్లి మీటర్ల పొడవు ఉండే సమయంలో నిర్వహిస్తారు. ‘ఎన్యుప్లోయిడీస్’ అంటే క్రోమోజోముల సంఖ్యలోని మార్పులు, అవయవలోపాలు ప్రాథమికంగా పరిశీలించడానికి అందరు గర్భిణులు చేయించుకోవలసిన స్కానింగ్ ఇది. ♦ ఎన్యూప్లాయిడ్ అంటే ఏమిటి? గర్భస్థ శిశువులో క్రోమోజోముల సంఖ్య ఉండాల్సిన దాని కన్నా అసాధారణంగా ఉండడమే ఎన్యూప్లాయిడ్. శిశువుకు తల్లిదండ్రుల లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయి. తల్లినుంచి 23, తండ్రినుంచి 23, క్రోమోజోముల చొప్పున మొత్తం 46 క్రోమోజోములు బిడ్డకు జన్యుపరంగా బదిలీ అవుతాయి. ఈ విధంగా మానవకణంలో 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. సాధారణంగా బిడ్డ పెరుగుదల బాగానే ఉంటుంది. కానీ తక్కువ సందర్భాలలో చెప్పకోదగ్గ సమస్యలు ఉంటాయి. ఇవి నిర్మాణాత్మక లోపాలు గానీ, జన్యువులు, క్రోమోజోములలోని అసాధారణత వల్ల కానీ కావచ్చు. అవయవ లోపాలు స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోములు, జన్యుపరమైన సమస్యలు మామూలు స్కానింగ్ ద్వారా మాత్రమే తెలియవు. ఎనోప్లాయిడీస్ లోని ఎక్కువ, తక్కువ ప్రమాద సూచికలు స్క్రీనింగ్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. అలా తెలిసేవానిలో ఒకటి ‘డౌన్స్ సిండ్రోవ్‌ు’. ♦ డౌన్స్ సిండ్రోవ్‌ు అంటే ఏమిటి? డౌన్స్ సిండ్రోమ్‌నే ట్రైసోమి 21 అని అంటారు. ఇది క్రోమోజోముల అసాధారణతకు సంబంధించినది. దీనిలో 21వ నెంబరు క్రోమోజోవ్ుపైన ఒక అదనపు క్రోమోజోవ్‌ు ఉంటుంది. దీని వల్ల పిల్లలు ఏ విషయాన్నీ నేర్చుకోలేని మానసిక బలహీనతకు తీవ్రంగా గురవుతారు. ఈ డౌన్స్ సిండ్రోవ్‌ు వ్యాధికి చికిత్సలేదు. ఈ డౌన్స్ సిండ్రోవ్ుతో బిడ్డ పుట్టే ముప్పు తల్లి వయస్సు పెరిగే కొద్ది ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు: 20 సంవత్సరాల వయస్సు స్త్రీలో ఈ అవకాశం 1140 మందిలో ఒకరికి, 30 ఏళ్ళ స్త్రీలలో 720 మందిలో ఒకరికి, 40 ఏళ్ళ వారిలో 65 మందిలో ఒకరికి ఈ ముప్పు ఉంటుంది. ∙డౌన్స్ సిండ్రోవ్‌ు ముందుగానే తెలుసుకోవటానికి స్క్రీనింగ్ పరీక్షలు, రోగ నిర్ధారణ పరిక్షలు ఏమిటి? గర్భస్థ శిశువులో డౌన్స్ సిండ్రోవ్‌ు, ఇతర క్రోమోజోముల సమస్యలు తెలుసుకునేందుకు, గర్భ ప్రారంభ దశలోనే రెండు రకాల పరీక్షలు చేయవచ్చు. అవి తల్లి రక్తపరీక్ష, స్కానింగ్. అందరు గర్భిణులకు ఏదైనా అధికముప్పు (రిస్క్) తెలుసుకోవటానికి చేసేది స్క్రీనింగ్ పరిక్ష. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అధిక ముప్పు కనబడితే తదుపరి ఆమ్నియో సెంటసిన్, కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ♦ కంబైండ్ పరీక్ష లేదా మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటే ఏమిటి? కంబైండ్ పరీక్ష అనే స్క్రీనింగ్ పరీక్ష క్రోమోజోవ్ుల అసాధారణత ఉంటే చాల వరకు నిర్ధారిస్తుంది. ఎన్.టి పరీక్ష చేసే రోజే గర్భవతి రక్తనమూనాలు తీసుకొని అందరు గర్భిణులలోను వుండే పిఎపిపి/ఎ, బేటా.హెచ్.సి.జీ అనే రెండు పదార్ధాల పరిశీలన చేయాలి. వీటిలో అసాధారణ స్థాయి కనిపిస్తే బిడ్డలో క్రోమోజోముల సమస్య, ముప్పు వున్నట్టు గుర్తించవచ్చు. ఈ రెండు పరీక్షల ఫలితాలను తల్లి వయస్సుతో సహా కంప్యూటర్‌కు అందజేస్తారు. దాని విశ్లేషణలో బిడ్డకు డౌన్స్ సిండ్రోవ్‌ు, ఇతర అసాధారణ ముప్పులైన ట్రైజోమీ 18,13 వంటివి వుంటే తెలుస్తాయి. ఈ టెస్ట్‌ల ఫలితాలు తదుపరి ఎటువంటి పరీక్షలు చెయ్యాలో నిర్ణయించటానికి ఉపయోగపడతాయి. గర్భస్థ దశ ప్రారంభంలో చేసే ఈ కంబైండ్ పరీక్ష వలన కడుపులోని బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేకుండా క్రోమోజోముల సమస్య, వాటి వలన ముప్పు గుర్తించవచ్చు. ♦ ఒకవేళ పరీక్షలో హైరిస్క్ ఉన్నట్టు తెలిస్తే ఏం చేయాలి? స్క్రీనింగ్ టెస్ట్‌లో హైరిస్క్ ఉన్నట్లు తెలిస్తే అది క్రోమోజోముల సమస్య బిడ్డకు ఉందని తెలియ చేసే సూచన మాత్రమే. బిడ్డ మామూలు గానే ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. ♦ దీనిని ఎలా నిర్ధారణ చేయగలం? ఆమ్నియోసెంటసిస్, కోరియోనిక్ విల్లస్శాంప్లింగ్ అనే రెండు పరీక్షల ద్వారా బిడ్డ డి.ఎన్.ఎ. ని క్రోమోజోముల సమస్య కోసం పరీక్షించి నిర్ధారించ వచ్చు. ♦ ఆమ్నియోసెంటసిస్ అంటే ఏమిటి? బిడ్డ చుట్టూ ద్రవంగా వుండే ఉమ్మనీరులో (ఆమ్నియోటిక్ ప్లూయిడ్) డి.ఎన్.ఎ. వుంటుంది. అల్ట్రా సౌండ్ ద్వారా గమనిస్తూ కడుపు పైనుంచి గర్భంలోకి సూదిని ప్రవేశపెట్టి తద్వారా కొద్దిపాటి ఉమ్మనీరు, సిరెంజ్ద్వారా తీసుకుంటారు. దానిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతారు. ఈ పరీక్ష గర్భధారణ తరువాత 15 నుంచి 24 వారాల మధ్య చేయవచ్చు. ఈ పరీక్ష కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. పరగడుపుతో ఉండనక్కరలేదు. రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. పరీక్ష అయ్యాక కొన్ని గంటలు పరిశీలనలో ఉంచి ఇంటికి పంపివేస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్, గర్భస్రావాలకు అవకాశం ఉండచ్చు ఇదివరకు గర్భస్రావ అవకాశం ఒకశాతం ఉండేది, కాని ఇప్పుడు అది కూడా 0.1% కి తగ్గిపోయింది. (అంటే ప్రతి వందమందిలో ఒకరి నుంచి ప్రతి 1000 మందిలో ఒకరికి తగ్గిపోయింది). ♦ కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ (సి.వి.ఎస్.) అంటే ఏమిటి? కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్‌లో పరీక్ష కోసం మాయ (ప్లాసెంటా) నుంచి చిన్న శాంపిల్‌ని తీసుకుంటారు. గర్భధారణ అనంతరం 11 నుండి 14 వారాల మధ్య ఇది చేయవచ్చు. ఆమ్నియోసెంటసిస్లో లానే కొంచెం పెద్దసూది వాడుతూ అల్ట్రాసౌండ్ సహాయంతో గర్భంలోని మాయ (ప్లాసెంటా) నుంచి చిన్న శాంపిల్ తీసుకొని దానిని పరీక్షకోసం లేబ్‌కు పంపుతారు. గర్భస్ధ దశ ప్రారంభంలోనే ఈ పరీక్ష చేయగలగడం ఇందులోని ఒక ఉపయోగం. కానీ ఆమ్నియోసెంటసిస్తో పోలిస్తే ఇది కొంచెం కష్టం. దానితోపాటు గర్భస్రావ ప్రమాదం కేవలం 0.2% ఉంటుంది. ♦ ఒకవేళ ఈ కంబైండ్ పరీక్షలు చేయించక పోతే ఎలా? ఒకవేళ ఎన్.టి స్కాన్ కానీ, కంబైండ్ పరీక్ష కానీ చేయించకుంటే వాటి తదుపరి స్థాయిలో ‘క్వాడ్రుపుల్’ పరీక్ష చేయించవచ్చు. ఇది సాధారణంగా 16 నుంచి 22 వారాల వయస్సులో అంటే బిడ్డ తల కొలత (బై పెరైటల్ డయామీటర్) స్కానింగ్‌లో 30 నుంచి 52 మి.మీ వున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత చేస్తారు. ♦ ‘ట్రిపుల్ మార్కర్’ పరీక్ష అంటే ఏమిటి? కంబైండ్ పరీక్ష, క్వాడ్రుపుల్ పరీక్షలతో పోలిస్తే ఈ ట్రిపుల్ మార్కర్ పరీక్షలో నిర్ధారణ రేటు సరిగా లేనందున దీనిని ప్రస్తుతం చేయడం లేదు. ఈ రెండు పరీక్షలతో పోలిస్తే పాత పరీక్షలలో తప్పుడు పాజిటివ్ ఫలితాలు కూడా ఎక్కువ. ♦ ‘ఫాల్స్ పాజిటివ్’ అంటే ఏమిటి? బిడ్డలో ఎలాంటి క్రోమోజోముల సమస్య లేకుండా అంతా సవ్యంగా ఉన్నప్పుడు పరీక్షలలో లోపాలు ఉన్నట్లు ఫలితాలు వస్తే దానిని ‘‘ఫాల్స్ పాజిటివ్’’ అని అంటారు. సాధారణంగా అన్ని స్క్రీనింగ్ టెస్ట్‌లలోను తప్పుడు పాజిటివ్ ఫలితాలు అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అవి 5% లోపే ఉండాలి. కాని ప్రస్తుతం ఈ రచయిత్రి / డాక్టర్ చేసిన పరిశోధనలలో తప్పుడు పాజిటివ్ ఫలితాల రేటు చాలా ఎక్కువగా వున్నట్టు, చాలా మందికి అధిక ముప్పు ఉన్న రిపోర్ట్లు వచ్చినట్లు నమోదయ్యింది. కానీ ఆమ్నియోసెంటసిస్, కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ పరీక్షల తర్వాత అంతా సవ్యంగానే ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు ఈ పరిశోధనలో స్క్రీనింగ్ పరీక్షలలో 101 మంది గర్భిణులకు అధిక రిస్క్ ఉన్నట్టు వస్తే నిర్ధారణ కోసం చేసిన ఆమ్నియో సెంటసిస్లో అన్ని రిపోర్ట్లు ఎలాంటి సమస్య లేనట్టు వచ్చింది. వీటిలో సరిగ్గా చేస్తే 85% మంది తల్లులు ఆమ్నియో సెంటసిస్కు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ♦ దీనిని ఏవిధంగా సరిచేయగలం? 6 నుంచి 8 వారాల మధ్య ప్రాధమికంగా, తొలి గర్భిణి (ఎర్లీప్రెగ్నెన్సీ) స్కానింగ్ చేయించాలి. ఎన్.టి స్కాన్ పరీక్ష చిత్రాల వివరాలను సోనోగ్రాఫర్ లేబ్‌కు సమర్పించినప్పుడే లేబ్లో వాటిని పరీక్షించి ముప్పు అవకాశాలను లెక్కకట్టాలి. లేబరేటరీలలో ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అత్యుత్తమ ప్రమాణాలను పాటించాలి. లేబరేటరీలలో ‘ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్’ ఆమోదించిన సాఫ్ట్వేర్లనే వాడాలి. తప్పులు ఎక్కువగా వస్తున్న ‘ట్రిపుల్ మార్కర్’ పరీక్షలు వంటివి చేయకూడదు. స్కానింగ్ పరీక్షల కోసం ఇతర వైద్య అవసరాల కోసం గానీ గర్భిణులు, కొందరు ఆధార్ కార్డులో వున్నట్టు అధిక వయస్సు ఇవ్వడం వలన తప్పుడు రిపోర్ట్లు రావచ్చు. ♦ ‘‘ఎన్ ఐ ఫి టి’’ అంటే ఏమిటి? ఎన్ ఐ పిటి అంటే నాన్ఇన్వేజివ్ ప్రీనేటల్ పరీక్ష. ఇందులో ఆమ్నియోసెంటసిన్, కొరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ వంటి వాటి వల్ల ముప్పు లేకుండా కేవలం తల్లినుండి రక్తం మాత్రం తీసి పరీక్షించటం జరుగుతుంది. ఇది 9 వారాల గర్భం నుంచి తక్కువ ముప్పు (రిస్క్) గల స్త్రీలలో చేసి చక్కని నిర్ధారణ రేటుతో ఫలితం ఇవ్వవచ్చు. కంబైండ్ పరీక్ష, క్యాడ్రుపుల్ టెస్ట్‌లతో పోలిస్తే నిర్ధారణ ఖచ్చితత్వం 99.6%. అయితే ఇది చాలా ఖరీదైన పరీక్ష. అందుచేత ముప్పు ఎక్కువ ఉండే వయస్సు గల 35 ఏళ్ళ పైబడినవారికి చేస్తారు. అలాగే స్క్రీనింగ్ పరీక్షలో హైరిస్క్ కాకుండా లోరిస్క్ కాకుండా, మధ్యస్థమైన రిస్క్ రావచ్చు. వీళ్ళు కూడా ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవాలంటే అప్పుడు ఎన్.ఐ.పి.టి. చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో అధిక ముప్పు వున్నట్లు తెలిస్తే అధిక నిర్ధారణ కోసం మళ్ళీ, ఆమ్నియో సెంటసిస్ లేదా సిబీఎస్ చేయించుకుంటారు. ♦ ఎన్.ఐ.పి.టి.లో ఫలితం లేకపోవడం అంటే అర్థం ఏమిటి? ఈ పరీక్షలో ఒక్కొక్కసారి ఫలితం లేదనే రిపోర్ట్ రావటం దీనిలోని ఒక ఇబ్బంది. తల్లి మరీ అధిక బరువు ఉన్నా, బిడ్డలో అసాధారణ డిఎన్ఎ పద్ధతి వున్నా ఎన్.ఐ.పి.టి. ఫలితం రాకపోవచ్చు. దీని తరువాత ఆమ్నియోసెంటసిస్ లేదా సీబీఎస్ కి వెళ్లాల్సివుంటుంది. ♦ ఎన్.ఐ.పి.టిలో ‘నో రిజల్ట్ ’ తరువాత నిర్ధారణ పరీక్షలకు ముందు టి.ఐ.ఎఫ్.ఎఫ్.ఎ. / ఎనోమలీ స్కాన్లకోసం వేచి ఉండాలా? అవసరం లేదు. సిబీఎస్, ఆమ్నియాసింటసిస్ పరీక్షలకు వెళ్ళవచ్చు. ఎందుకంటే స్కాన్ కేవలం నిర్మాణాత్మక తప్పులను మాత్రమే చూపిస్తుంది తప్ప జన్యుపరమైన అసాధారణతలను గమనించలేదు. ♦ ఎనామలీ/ టి.ఐ.ఎఫ్.ఎఫ్.ఎ. స్కాన్ అంటే ఏమిటి? ఎన్.టి. తరువాతది ఎనామలీ స్కాన్. ఎనామలీ/ టి.ఐ.ఎఫ్.ఎఫ్.ఎ. స్కాన్ చాలామందికి తెలుసు. ఇది 18 నుండి 20 వారాల మధ్యలో చేస్తారు. ఈ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను అల్ట్రా సౌండ్‌లో చూసిన ఎన్యూఫ్లాయిడ్ మార్కర్స్‌తో సరిపోల్చి చూస్తారు. ♦ ఉదాహరణకు చాలామంది స్త్రీల స్కానింగ్‌లో శిశువులో కనుగొన్నదేమిటంటే గుండెలో ‘ఎకోజనిక్ ఇన్ట్రా కార్డియాక్ ఫోకస్’ డౌన్స్ సిండ్రోవ్ుకు ఒక చిన్న సూచికగా చూస్తారు. అప్పుడు స్క్రీనింగ్ పరీక్షలలో డౌన్స్ సిండ్రోవ్ుకు తక్కువ ముప్పు ఉన్నప్పుడు మిగతా పరీక్షల అవసరం వుండదు. ♦ అదేవిధంగా ‘కోరాయిడ్ ప్లక్సెస్ సిస్ట్గానీ’, ‘సింగిల్ అంబ్లికల్ ఆర్టరీ’ గానీ అల్టాస్రౌండ్లో కనిపిస్తే ట్రై సోమీ 18 కి అదొక గుర్తు. స్క్రీనింగ్ పరీక్షలలో ట్రైసోమీ 18కి తక్కువ ముప్పు సూచిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. బిడ్డ మెడ వెనుక వాపు ఎక్కువగా కనిపిస్తే డౌన్స్ సిండ్రోవ్ుకి ఒక సూచన. బిడ్డ క్రోమోజోవ్ులు సవ్యంగానే ఉన్నాయని నిర్ధారించుకోవటానికి ఆమ్నియోసెంటసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అవయవ లోపాలు ఏవైనా అల్ట్రాసౌండ్‌లో కనిపిస్తే, జన్యుపరమైన అసాధారణతలు ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి ఆమ్నియోసెంటసిస్ చేయించాలి. ఒక వేళ జన్యుపరమైన అసాధారణతలు కనుగొంటే భవిష్యత్తులో గర్భధారణకు అవసరమైన సలహాలను ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. జన్యుపరమైన అసాధారణతలు ఏవీ లేకుండా తరువాత సరిచేయటానికి వీలైన నిర్మాణాత్మక లోపాలు ఉన్నా గర్భాన్ని కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చు. ♦ ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ లిప్) వున్నట్లు ముందే స్కానింగ్‌లో తెలిసినా బిడ్డ పుట్టిన తరువాత ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చు. ఏది ఏమైనా జన్యుపరమైన లోపాలు లేవని నిర్ధారణ చేసుకోడానికి ఆమ్నియోసెంటసిస్ చేయించుకోవటం మంచిది. ♦ ఎనామలీ స్కాన్ తర్వాతి స్కాన్ ఏమిటి? 24 వారాలకు శిశువు గుండెను పరిశీలించటం మంచిది. కొన్నిసార్లు గుండె లోపాలు ఆలస్యంగా రావడం వల్ల వాటిని మొదట్లోనే కనిపెట్టడం కష్టం అవుతుంది. ♦ ఎదుగుదల, డాఫ్లర్ స్టడీ అంటే ఏమిటి? అన్నీ సవ్యంగా ఉంటే 32 వారాలకు ఎదుగుదల, డాఫ్లర్ స్కాన్ చేయాలి. దీనివల్ల శిశువు ఎదుగుదల, రక్త సరఫరా విషయాలు గమనించవచ్చు. ♦ ఐయుజిఆర్ అంటే ఏమిటి? ‘ఇంట్రా యుటెరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్’ అంటే బిడ్డ కావల్సిన సైజ్‌కి చేరకపోవటం. ఈ బిడ్డలను డాఫ్లర్ స్టడీ ద్వారా గమనిస్తూ ఉండాలి. ♦ ఐయుజిఆర్లో ప్రస్తుత పరిశోధనలు... ప్రపంచవ్యాప్తంగా ఐయుజిఆర్ను అధ్యయనం చేస్తూ ప్రతి రోజు కొత్త విషయాలు కనుగొంటున్నారు. ఐ.యు.జి.ఆర్. సంఘటనలు భారతదేశంలో చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడే పరిశోధనలు జరిగితే వాటిని మనకనుగుణంగా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. దీనివల్ల మన దేశ సొంత విధానాలు (ప్రోటోకాల్స్) రూపొందించుకొని తదనుగుణంగా ఇక్కడి గర్భిణులకు సరిపడేట్టు వైద్యం చేసుకోవచ్చు. దాంతో ఈ వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. శిశుమరణాల రేటు తగ్గించే వీలు ఉంటుంది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 1000 జననాలకు 34 శిశు మరణాలు ఉన్నట్లు నమోదయ్యింది. ఇతర దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అందువల్ల ఐ.యు.జి.ఆర్. మీద పరిశోధన చెయ్యవలసిన అవసరం ఉంది.-డాక్టర్ సౌఖ్య కర్రి,ఎంబిబిఎస్, ఎంఎస్ (ఆబ్స్టెట్రిక్స్ అండ్గైనకాలజీ),ఫెలోషిప్ ఇన్ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ద టీమ్ హాస్పిటల్, కాకినాడ -
నటనకు బ్రేక్.. గర్భం విషయంపై స్పందిస్తారా..?
సినిమా: సంచలనాలకు చిరునామా సమంత. పాకెట్ మనీ కోసం చిన్నచిన్న వేడుకల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ నటిగా మారింది ఈ బ్యూటీ. బానాకాత్తాడి చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసినా, తెలుగులో నటించిన ఏ మాయచేసావే చిత్రంతో విజయాన్ని అందుకుంది. తరువాత తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ హిట్ చిత్రాల నాయకిగా రాణిస్తున్నారు. తమిళంలో విజయ్, సూర్య, విశాల్, ధనుష్, విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్లతోనూ నటించారు. ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈ బ్యూటీ నటించిన ఓ బేబీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సినిమా విషయాలను పక్కన పెడితే సమంత తెలుగులో తొలి హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సమంత గర్భం దాల్చినట్లు, దీంతో నటనకు సుమారు ఒకటిన్న ఏడాది బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమంత కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నటిస్తున్న 96 చిత్రం తరువాత మరో చిత్రాన్ని అంగీకరించలేదన్నది వాస్తవమే. అయితే ఈ విషయమై నటి సమంత ఇంకా స్పందించలేదు. కానీ మంచి విజయాలతో సాగుతున్న పరిస్థితుల్లో నటజీవితానికి సమంత విరామం ఇస్తుందని భావంచలేం. అదీగాక ఇప్పుడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇకపై ఆ తరహా వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలనుకుంటున్నట్లు ఈ భామ ఇటీవలే తెలిపారు. అలాంటిది పిల్లలను కనాలనే ఆలోచనను సమంత ఇంత త్వరగా తీసుకుంటారని ఊహించలేం కూడా. మరో విషయం ఏమిటంటే తన నటించిన ఓ బేబీ చిత్ర విజయంతో తన పారితోషికాన్ని పేంచేసిందనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. ఇలా తన నట జీవితం ఉజ్వలంగా సాగుతున్న తరుణంలో బ్రేక్ తీసుకోవాలని ఏ నటి కోరుకోదు. అలాంటిది నటి సమంత గురించి ఇలాంటి ప్రచారం జరగడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. వదంతులను ఎంజాయ్ చేసే సమంత తన గర్భం దాల్చాననే ఈ విషయంపై వెంటనే స్పందిస్తారా అనేది వేచి చూడాలి. -
వరుసగా గర్భస్రావాలు.. సంతానభాగ్యం ఉందా?
ఎంతోకాలంగాచెవి నొప్పి...తగ్గుతుందా? మా పాప వయసు తొమ్మిదేళ్లు. తనకు గత మూడేళ్లుగా తీవ్రంగా చెవినొప్పి వస్తోంది. చెవిలో చీము, వాపు కూడా కనపడుతున్నాయి. ఈ ఏడాది ఈ సమస్య ప్రతిరోజూ వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స చెప్పండి. – ఎమ్. రాఘవులు, కోదాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్నపిల్లలు దీని బారినపడతారు. కారణాలు: ∙కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు: ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ: ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స: దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్మూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి.-డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ఇంటర్నేషనల్,హైదరాబాద్ వరుసగాగర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా? నా వయసు 34 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా?– సుమశ్రీ, నిజామాబాద్ గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కారణాలు కనుగొని, వాటికి తగిన చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.-డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఎమ్. రామ్మోహన్రావు, సిద్దిపేట మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే ఫలితం ఉంటుంది.-డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’
‘ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు.. తీరా పెళ్లాయ్యాక పిల్లల గురించి ప్రశ్నిస్తారు. మా మానాన మమ్మల్ని బతకనివ్వరా’ అంటూ మండిపడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఈ నటి చివరగా కనిపించిన చిత్రం జీరో. షారుక్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అనుష్క మరే సినిమాకు సైన్ చేయలేదు. దాంతో అనుష్క గర్భవతి అయ్యింది.. అందుకే సినిమాలకు దూరంగా ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై అనుష్క తీవ్రంగా మండిపడ్డారు. ‘సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు తెలుసుకోవాలని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ అవి వారిని ఎంత ఇబ్బందికి గురి చేస్తాయో ఆలోచించరు. ఓ నటికి వివాహం అయ్యిందంటే.. తరువాతి ప్రశ్న పిల్లలు. ఇలాంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే.. మరిన్ని పుకార్లు సృష్టిస్తారు.. నిజంగా ఇలా చేయడం అవసరమా.. అరే మా జీవితాల్లోకి తొంగి చూడటం మానేయండి. మా మాననా మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి
చెన్నై,పెరంబూరూ: తాను నిండు గర్భిణినన్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది నటి శ్రుతీ హరిహరన్. కన్నడ చిత్ర సీమలో ప్రముఖ నటిగా రాణించిన ఈ అమ్మడు తమిళంలోనూ నిలా, రారా రాజశేఖర, నెరింగివా ముత్తమిడాదే, నిపుణన్ వంటి చిత్రాల్లో నటించింది. అంత కంటే ఎక్కువగా నటుడు అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఆరోపించి వార్తల్లోకెక్కింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో పెద్ద కలకలమే రేపింది. అయితే ఆమె వివాహిత అనే విషయం చాలా మందికి తెలియదు. అర్జున్ లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు చేసిన ఫిర్యాదులో తనకు పెళ్లైందన్న విషయాన్ని బయటపెట్టింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు, రచయితను గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతకు ముందు నాలుగేళ్లుగా వారిద్దరూ పేమలో ఉన్నారు. అయితే తన కెరీర్ దృష్ట్యా శ్రుతీ హరిహరన్ తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది. అలాంటిది ఇప్పుడామె నిండు గర్భిణి. తాను గర్భంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్ చేసి ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. వాటికి ‘నా జీవితం ఇప్పుడు నీ (కడుపులో బిడ్డ) గుండె చప్పుళ్లతో నెలకొంది. ఇదే నా జీవిత కొత్త పయనం. ప్రపంచమనే సర్కస్‌లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. అందుకోసం ఎక్కువ కాలం ఎదురు చూడలేను’ అంటూ ట్యాగ్‌లైన్ యాడ్ చేసింది. అవికాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
పెళ్లయి ఏడేళ్లు గడిచినా..
మియాపూర్: సంతానం కలగడం లేదని ఓ మహిళ మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారంచోటు చేసుకుంది. ఎస్ఐ రఘురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపజిల్లా, దేవగూడి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీదేవి, ఓబుల్‌రెడ్డి దంపతుల కుమార్తె అమూల్య(29)కు ప్రొద్దుటూర్ పట్టణానికి చెందిన రామలింగేశ్వర్రావు 2012లో వివాహం జరిగింది. అమూల్య స్కూల్లో క్లర్క్‌గా పని చేస్తుండగా, రామలింగేశ్వర్ రావు బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా వీరు మియాపూర్‌లోని గోపాల్‌రావునగర్‌లో నివాసముంటున్నారు. పెళ్లయి ఏడేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపానికి లోనైన అమూల్య ఈ నెల 11న రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన ఆమె భర్త రామలింగేశ్వర్రావు అపస్మారక స్థితిలో ఉన్న అమూల్యను కిందకు దింపి కూకట్‌పల్లిలోని అనుపమ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘బరువు 102 కేజీలు.. జుట్టు రాలిపోయింది’
మాతృత్వం ఆడవారికి గొప్ప వరమంటూ సమాజం ఊదరగొడుతుంది. కానీ ఆ సమయంలో స్త్రీలు అనుభవించే ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. సాధరణ మహిళలతో పోలిస్తే.. హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఇంకాస్త ప్రత్యేకంగా ఉంటాయంటున్నారు హీరోయిన్ సమీరా రెడ్డి. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లైన సమీర.. కొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తొలిసారి గర్భం దాల్చినప్పటి ఫోటోలను.. ప్రస్తుత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమీరా. దాంతో పాటు ఓ లేఖను కూడా షేర్ చేశారు. దానిలో ‘మొదటి ప్రెగ్నేన్సీ తర్వాత నా బరువు 102 కిలోలకు చేరుకుంది. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. అంత అధిక బరువుతో బయటకు రావాలంటే భయమేసింది. ఒకప్పుడు సెక్సీ సామ్ అని పిలిచిన జనాలు ఇప్పుడు నన్ను చూస్తే ఎలా కామెంట్ చేస్తారో అని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉండేది. అందుకే ఇన్నాళ్లు బయట కనిపించలేదు. 2015 మేలో హన్స్‌కు జన్మనిచ్చాను. ఆ తర్వాత డాక్టర్లు నన్ను 4, 5 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమాన్నారు. దాంతో ఇంతలా బరువు పెరిగాను’ అని తెలిపారు సమీరా. ‘మరోవైపు నా జుట్టు కూడా విపరీతంగా రాలిపోవడం ప్రారంభించింది. ఇన్ని సమస్యలతో జనాల్లోకి రావాలంటే భయపడ్డాను. తల్లిని అయ్యనని సంతోషపడాలో లేక సినిమా తారకుండాల్సిన చార్మ్‌ను కోల్పోవాల్సి వచ్చిందే అని బాధపడాలో నాకు అర్థం కాలేదు. దాంతో డిప్రెషన్‌కి గురయ్యాను. థెరపిస్ట్‌లను కలిసాను. కౌన్సిలింగ్‌తో నాలో ధైర్యం పెరిగింది. నేను మళ్లీ నా పూర్వపు ఆకృతిని పొందుతానని నమ్మకం కలిగింది. అయితే బరువు తగ్గడం కోసం నేను ఎటువంటి సర్జరీలు.. కృత్రిమ పద్దతులు అవలంభించలేదు. రెండేళ్ల పాటు కఠినమైన ఎక్సర్సైజ్లు, యోగా చేస్తూ బరువు తగ్గాను’ అని తెలిపారు సమీరా. ‘ప్రస్తుతం నేను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. కానీ ఇప్పుడు బరువు సమస్య గురించి పట్టించుకోవడం లేదు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు. ప్రెగ్నేన్సీ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేయడం కోసమే ఇప్పుడు ఈ పోస్ట్ చేశాను. ఆ సమయంలో హర్మోన్ల మార్పు, శరీరాకృతి మారడం.. మానసిక కల్లోలం వంటి అంశాలు మహిళల్ని చాలా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి బయపడటానికి సమాజం నుంచి ఎలాంటి చేయూత లభించదు. మీరు మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. మనలోనే మార్పు రావాలి. ధైర్యంగా ఉండాలి. అప్పుడే వీటన్నింటిని తట్టుకుని నిలబడగల్గుతాం’ అని తెలిపారు సమీరా. View this post on Instagram I touched 102 Kgs in May 2015, the month Hans was born and I’m not scared to admit it . It took me to the deepest darkest places in my head. My confidence shattered . And I couldn’t lose the weight for a year after because I was too scared to even step out . I disappeared because I didn’t have the strength to be judged by the world after all the years of being glam and fit on screen . But the beautiful part is that you can only hit your lowest low to know you can absolutely climb out of that hole . It’s a fight . A hard one . Took me 2 years more to lose the weight and to step out and face the world again but I wish I had the courage then. I did it naturally with no fad diets , no easy way out. Only with dedicated workout, yoga, pilates and strength training . It’s important for me to post this now because I need women to know the struggle is real . The mood swings , hormonal changes and losing your body shape can mess with your mind. It’s a superficial world and people can be hurtful if you don’t keep up . But the key is to be fearless. Only you can get out of that rut. It’s yours to change. Be brave . You can move mountains if you just will it . ❤️. . Special thanks to the best workout crew who also gave me the physical & emotional strength to get fit again @yogabypramila @adishroff @ivan_ultimatefitness @nyelakapadia & Kaizen Motafram my Pilates guru! love you guys ❤️. . #bollywood #mom #keepingitreal #weightlosstransformation #fattofit #pilates #postpregnancy #yoga #bodytransformation #fitness #fitnessmotivation #weightlossjourney #pregnancy #fitness A post shared by Sameera Reddy (@reddysameera) on Apr 30, 2019 at 12:41am PDT ఈ సందర్భంగా తన ఫిట్నేస్ ట్రైనర్లకు ధన్యవాదాలు తెలిపారు సమీరా. 2014లో అక్షయ్ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు సమీరా. ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. -
పదో తరగతి బాలికకు గర్భం..
గుంటూరు: తన చెల్లెలి దగ్గరికొచ్చే పదో తరగతి బాలికకు (15)కు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో దుర్మార్గుడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక సమీపంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లి పుస్తకాలు తెచ్చుకునేది. అదే అవకాశంగా భావించిన స్నేహితురాలి సోదరుడు గుంజి నరేంద్ర (23) బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లైంగిక దాడి చేశాడు. ఇది నిందితుడి కుటుంబ సభ్యులకు తెలియగా.. తమ కుమారుడితో పెళ్లి జరిపిస్తామని, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను నమ్మించారు. దీన్ని అలుసుగా తీసుకున్న యువకుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి అయింది. రోజు రోజుకూ తమ కుమార్తెలో మార్పులు వస్తుండటాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి చేతులు దులుపుకొన్నారు. అయితే తమ కూతురిపై లైంగికదాడికి ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత బాలిక, కుటుంబ సభ్యులతో కలసి సోమవారం గుంటూరు పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులందరిని జైలుకు పంపితేనే మరొకరికి తనలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉంటుందని బాధిత బాలిక కన్నీటి పర్యంతమైంది. కాగా, నిందితుడు గుంజి నరేంద్ర ఐటీఐ పూర్తి చేసి తాపీ పనులకు వెళ్తాడని తెలిసింది. -
దానికి నిర్ణీత వయసు ఉంటుందా?
మా అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఈమధ్య రజస్వల అయింది. చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని బంధువులు ఒకరు చెప్పారు. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజస్వల కావడానికి నిర్ణీత వయసు అంటూ ఉంటుందా? – జీఎన్, ఖమ్మం సాధారణంగా రజస్వల 12 సంవత్సరాల నుంచి 15–16 సంవత్సరాల లోపల అవుతారు. ఈమధ్య కాలంలో తినే ఆహారంలో మార్పులు, జంక్‌ఫుడ్, అధికబరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక మార్పులు...ఇలా ఎన్నో కారణాల వల్ల కొందరు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. మీ అమ్మాయి 13 సంవత్సరాలకు అయింది. తను కరెక్ట్ వయసుకే అయింది. దీనివల్ల ఇబ్బంది ఏమిలేదు. అంతకంటే ముందే అంటే 10–11 సంవత్సరాలకే అయిన వాళ్ళలో కొందరిలో ముందునుంచే ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవ్వడం వల్ల, ఎముకల పెరుగుదల తొందరగా ఆగిపోయి, ఎప్పుడు ఎత్తు పెరగకుండా ఆగిపోతారు. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, కొందరిలో తర్వాత కాలంలో పిల్లలు పుట్టకపోవడం, అధికబరువు వంటి ఇతర కారణాలు జత కలసినప్పుడు వారికి రక్తపోటు, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి వీరు క్రమంగా వ్యాయామాలు చేస్తూ బరువు పెరగకుండా ఉండటం, అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, రక్తపరీక్షలు, స్కానింగ్ చెయ్యించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు లేదా ముందుగా తెలుసుకుని చికిత్స తీసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్. నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. ‘పొజిషనల్ థెరపీ’ వల్ల గర్భిణులకు చక్కగా నిద్ర పడుతుందని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేగలరు. – పి.నీరజ, పొద్దుటూరు గర్భిణి సమయంలో బిడ్డ పెరిగేకొద్ది బరువు నడుము మీద పడడం, పడుకున్నప్పుడు అటూ ఇటూ తిరగడానికి ఇబ్బంది, అసౌకర్యంతో నిద్ర సరిగా పట్టదు. (పెరిగే బిడ్డ బరువు, సాగే గర్భాశయం ఒత్తిడి వెన్నుపూస మీద ఉంటుంది. గర్భవతి వెల్లకిలా పడుకున్నప్పుడు దానివల్ల వెన్నుపూసకు లోపలివైపు గర్భశయానికి మధ్యలో ఉండే ఇన్ఫీరియర్ వీనకేవా (ఐవీసీ) ఆర్టెరీ అనే రక్తనాళం పై పడి తల్లికి, బిడ్డకి రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల, అలాగే వెల్లకిలా పడుకున్నప్పుడు, తల్లికి ముక్కు నుంచి శ్వాస సరిగా అందకపోవడం వల్ల, తల్లికి సరిగా నిద్రపట్టకపోవటం అలాగే బిడ్డకు సరిగ్గా ఆక్సిజన్ అందక బరువు పెరగక పోవడం, కొందరిలో కడుపులో చనిపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి తల్లి ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల రక్తనాళాలపైన ఒత్తిడి తగ్గి, రక్తసరఫరా ఇద్దరికీ సరిగా ఉంటుంది. తల్లి నిద్రపోవడం ఎంత మంచిదో అలాగే సరైన పొజిషన్లో పడుకోవడం కూడా తల్లికి బిడ్డకి చాలామంచిది. అందుకోసం పొజిషనల్ థెరపీని వాడడం మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇందులో నడుంకి ఒక బెల్టులాంటిది కట్టుకొని, దానికి వెనకాల వైపులో తక్కువ బరువు ఉన్న చిన్న బాల్స్‌ని ఉంచడం వల్ల, తల్లి నిద్రలో తెలియకుండ వెల్లకిలా పడుకోడానికి తిరిగినా, బాల్స్ వల్ల కలిగే అసౌకర్యం వల్ల, ఒకవైపుకే (ఎడం వైపు) తిరిగి పడుకోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లికి నిద్ర సరిగా పడుతుంది, అలాగే బిడ్డకి కూడా రక్తప్రసరణ సరిగా ఉంటుంది. మా అమ్మాయి స్వభావరీత్యా చాలా కూల్ అయితే ఈ మధ్య కాస్త ఇబ్బందిగా ప్రవర్తిస్తుంది. అకారణంగా కోపం తెచ్చుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతుంది. ఒక స్నేహితురాలిని సలహా అడిగితే ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ అంటూ ఏదో చెప్పింది. దీని నివారణ చర్యలు ఉంటే తెలియజేయగలరు. – డీఎన్, భువనగిరి కొంతమందిలో హార్మోన్లలో మార్పుల వల్ల పీరియడ్స్ మొదలయ్యే 15 రోజులు ముందు నుంచి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్, శరీరం ఉబ్బడం, అలసట, రొమ్ములు బరువుగా నొప్పిగా ఉండడంలాంటి లక్షణాలు ఉండవచ్చు. దీనినే ‘ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్’ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మెడిటేషన్, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కొద్దిగా ఉపశమనం దొరకుతుంది. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవటం, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవటం మంచిది. అలాగే విటమిన్ బి6, ఇ, కాల్షియం, మెగ్నీషియంతో కూడిన విటమిన్ టాబ్లెట్స్ వాడవచ్చు. ప్రిమ్రోజ్ ఆయిల్ క్యాపుల్స్ వాడి చూడవచ్చు. మరీ టెన్షన్, చిరాకు లక్షాణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీడిప్రెషన్ మందులు వాడొచ్చు. హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? చాలా రిస్క్ అని మా బంధువులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.ప్రీతి పిడుగురాళ్ల గుండెజబ్బులు ఉన్నవాళ్లలో, గుండె పనితీరులో తేడా ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత రక్తం పల్చబడుతుంది. గుండె ఎక్కువ రక్తం సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు కొట్టుకోవలసి ఉంటుంది. గుండె మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, బలహీనంగా ఉన్న గుండె పైన ఒత్తిడి పెరగడం వల్ల, ఆయాసం పెరగడం, ఊపిరి ఆడకపోవడం, హర్ట్ ఫెయిల్ అవ్వడం, రక్తం గూడుకట్టడం వంటి ప్రాణాపాయస్థితి కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అబార్షన్లు. శిశువు బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరి గుండె జుబ్బును బట్టి, దాని తీవ్రతను బట్టి గర్భం దాల్చిన తర్వాత సమస్యల తీవ్రత ఉంటుంది. గుండెజబ్బు ఉన్న వాళ్లు గర్భం దాల్చకముందే, డాక్టర్‌ను సంప్రదించి వారి గుండె పనితీరు ఎలా ఉంది, గర్భం దాల్చవచ్చా లేదా గర్భం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ తెలుసుకొని ప్రయత్నం చేయడం మంచిది. ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు గర్భం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
బాలికను గర్భవతిని చేసి యువకుడి పరార్
పామిడి: బాలికను ప్రేమపేరుతో నమ్మించి, వాంఛతీర్చుకుని, గర్భం దాల్చిన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయిన యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామగిరి ఎగువతండాకు చెందిన బాలిక కుటుంబం గత ఏడాది బంజారాల ఆరాధ్య దైవం సేవాఘడ్‌కు వెళ్లింది. అప్పుడు అక్కడకు వచ్చిన వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి చిన్నతండాకు చెందిన అశోక్‌నాయక్‌తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న యువకుడు అమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా కలిశాడు. ఇటీవల ఆరోగ్యం బాగలేదని అమ్మాయిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా గర్భవతి అని బయటపడింది. ఈ విషయం తెలియగానే అశోక్‌నాయక్ కనిపించకుండా పోయాడు. బాధితురాలి అన్న పామిడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అశోక్నాయక్పై పోక్సో చట్టం కింద 5–జే, 5–1 సెక్షన్లు, 420, 376 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. -
అమ్మకు ‘కాన్పు’ కష్టం!
కొత్తగూడెం రూరల్, గుండాల: అమ్మకు ‘కాన్పు’ కష్టం వచ్చింది.. ఆస్పత్రి బెడ్‌పై సురక్షితంగా బిడ్డకు జన్మనివ్వాల్సిన అమ్మ.. ఆటోలో, ఎడ్ల బండిపై ప్రసవిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక చోట.. రహదారి సౌకర్యం సరిగా లేక 108 అంబులెన్సు వెళ్లక మరో చోట.. ప్రమాదకర పరిస్థితుల్లో కాన్పు జరగాల్సిన దుస్థితి ఏర్పడింది. శుక్రవారం ఈ రెండు ఘటనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. వైద్య సిబ్బంది పట్టించుకోక.. కొత్తగూడెంలోని మేదరబస్తీకి చెందిన పూజ నిండు గర్భిణి. భర్త కూలీ పనులకు వెళ్లగా.. ఉదయం 10.30 సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆటోలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవిత అనే మహిళ మృతిచెందిందంటూ ఆమె బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఎవరినీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఈ సమయంలో ఆటోలో వచ్చిన పూజకు నొప్పులు తీవ్రమై నడవలేని పరిస్థితిలో ఉంది. ఆమెను స్ట్రెచర్‌పై ఆస్పత్రిలోకి తీసుకెళ్లాలని బంధువులు వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆటోలోనే పూజ ప్రసవించింది. చివరికి కొందరు వ్యక్తులు కలసి పూజను చేతులపై మోసుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. వాగులు దాటి రాలేక.. కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎలగలగడ్డకు చెందిన ఇర్ప సుగుణ నిండు గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు పురుటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు గుండాల 108కు సమాచారం అందించారు. అయితే మార్గంలో రెండు వాగులు ఉన్నందున అంబులెన్సు అక్కడివరకు రాలేదని, ఎడ్ల బండిపై కొంత దూరం తీసుకురావాలని వారు సూచించారు. దీంతో బంధువులు సుగుణను ఎడ్ల బండిపై తరలిస్తుండగా.. సాయనపల్లి సమీపంలోని జమ్మిచెరువు ప్రాంతంలో బిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికే అక్కడికి చేరుకున్న 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
కిడ్నీలో రాళ్లని వెళ్తే.. బిడ్డను చేతిలో పెట్టారు!
-
జార్జియా ఆస్పత్రిలో మిరాకిల్
జార్జియా: జార్జియాలో అద్భుతం చోటుచేసుకుంది. మూత్ర పిండాల సమస్యను చూపించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లిన మహిళ పండంటి బిడ్డను ప్రసవించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే అసలు ఆమె గర్భవతి అనే విషయం, అది కూడా నెలలు పూర్తయ్యాయనే సంగతి ఆ మహిళకు అస్సలు తెలియదంట. అంతేకాదు.. తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా పరీక్షించిన వైద్యులు గర్భందాల్చి ఎన్నాళ్లయిందని ప్రశ్నించగా తాను గర్భవతి ఏంటని కోపంతో లాగిపెట్టి కొట్టిందట. ఎట్టకేలకు ఆమెకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయగా నిజంగానే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాలోని లోకస్ట్ గ్రోవ్కు చెందిన స్టెపనీ జాగర్స్ అనే మహిళ అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లి. ఆమె భర్త మైఖెల్ జాగర్స్ ఓ టీవీ చానెల్లో పనిచేస్తాడు. వారికి ఇప్పటికే జాకబ్(16), డిలాన్(11) అనే కుమారులతోపాటు శాడీ అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. వాస్తవానికి ఆమె గర్భం రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందట. పీరియడ్స్ కూడా సక్రమంగానే వస్తుండటంతో తాను అసలు గర్భం దాల్చినట్లు గుర్తించలేకపోయింది. ఆ క్రమంలోనే తనకు కడుపులో, వెన్నులో నొప్పి రావడంతో కిడ్నీ నొప్పి అయ్యి ఉంటుందని తనకు తానే నిర్ధారించుకొని ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం తెలిసిందే. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, తొమ్మిది నెలల తన బిడ్డ ఆరోగ్యమంతంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి తీసుకోలేకపోయానని ఆమె దిగులుపడుతోందట. ఆమె భర్త మైఖెల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మొన్నటి వరకు ఐదుగురం ఉండేవారిమని ఇప్పుడు ఆరుగురం అయ్యామని, సాధారణంగా తమకు బిడ్డపుడుతున్నాడనే ఫీలింగ్ తొమ్మిది నెలలుగా ఉంటే మాకు ఆ ఫీలింగ్ కేవలం అరగంట మాత్రమే దొరికిందని చెప్పాడు. వైద్యులు మాత్రం ఇలా జరగడం అత్యంత అరుదు అని అంటున్నారు. -
యువతికి ‘ప్రత్యేక’ శస్త్రచికిత్స
హైదరాబాద్: ఓ యువతికి వైద్యులు పత్రేకమైన శస్త్రచికిత్స నిర్వహించి సక్సెస్ అయ్యారు. పునరుత్పత్తి అవయవాలతోపాటు జననాంగం(వెజీనా)లేని ఓ యువతికి ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ డి. పద్మావతి న్యూ వెజీనా రీ కన్స్ట్రక్షన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి సదరు యువతికి వైవాహిక జీవితాన్ని ప్రసాదించారు. కృష్ణానగర్‌లోని శీతల్ నర్సింగ్‌హోమ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పటాన్చెరు ప్రాంతానికి చెందిన కౌసల్య(26) అనే యువతికి చిన్నతనం నుంచే కేవలం మూత్ర ప్రసరణ రంద్రం మాత్రమే కలిగి వెజినా ఎజెనిసిస్తో భాదపడుతోందని చెప్పారు. దీంతో ఆమెకు ఉన్న జన్యుసంబంధ వ్యాధిని గుర్తించి చికిత్స కోసం ఏర్పట్లు చేసామని ఆమె తెలిపారు. ఆమెలోని పునరుత్పత్తి కెనాల్ అసంపూర్ణంగా ఉండటం గుర్తించి వెంటనే ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి. రామారావు సహకారంతో కృత్రిమ వెజినాను సృష్టించామని తెలిపారు. ఆపరేషన్ విజయవంవతంగా జరిగిందని, ఆమె ఆరోగ్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చునని, అయితే సంతానయోగం లేదని ఆమె తెలిపారు. -
రాడ్లు, కర్రలతో వైద్యుడిపై దాడి
మాల్దా: అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గ్రామస్థులు వైద్యుడిని చితక్కొట్టారు. ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని మాల్దాలో చోటుచేసుకుంది. జయదీప్ మజుందార్ అనే వైద్యుడు మాల్దాలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో బ్లాక్ మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనవద్దకు ఓ మహిళ పురిటి నొప్పులతో రాగా ఆమెను మానిక్ చౌక్ అనే రూరల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా మజుందార్ చెప్పారు. దీంతో ఆయన సూచనమేరకు వారు మానిక్ చౌక్ ఆస్పత్రికి ఆస్పత్రిలో వెళుతుండగా మార్గం మధ్యంలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే ఆ పసిపాప ప్రాణాలు విడిచింది. దీంతో తీవ్ర కోపానికి లోనైన సదరు కుటుంబీకులు కొందరు గ్రామస్తులు కలిసి రాడ్లు కర్రలతో చితక్కొట్టారు. -
కరస్పాండెంట్ అకృత్యం: ఏడో తరగతి విద్యార్థినికి గర్భం
దర్శి (ప్రకాశం): ఓ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు! ఫలితంగా 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అనారోగ్యంగా ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ అఘాయిత్యం వెలుగు చూసింది. ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. వివరాలు.. దర్శిలోని తూర్పు చవటపాలెం రోడ్డులో నివసించే 14 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. మామయ్య సంరక్షణలో ఉన్న ఆమె స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బుధవారం బంధువులు ఒంగోలులోని రిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆరు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె బంధువులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు ఇస్తానని ప్రిన్సిపాల్ జాయ్ తనను లొంగదీసుకున్నట్టు బాధితురాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ విద్యార్థిని గతేడాది అదే స్కూల్లో 3వ తరగతి చదివింది. అయితే, నేరుగా 7వ తరగతిలో చేర్పించి బాగా చదివిస్తానని కూడా ప్రన్సిపాల్ ఆశ చూపినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ జాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, బాలికతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వ్యాసెక్టమీ సర్జరీ చేయించుకున్నానని, తన వల్ల గర్భం వచ్చే అవకాశమే లేదని ప్రిన్సిపాల్ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబందించి పోలీసులు అధికారికంగా మీడియాకు ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.