మాతృత్వం ఆడవారికి గొప్ప వరమంటూ సమాజం ఊదరగొడుతుంది. కానీ ఆ సమయంలో స్త్రీలు అనుభవించే ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. సాధరణ మహిళలతో పోలిస్తే.. హీరోయిన్‌లు ఎదుర్కొనే ఇబ్బందులు ఇంకాస్త ప్రత్యేకంగా ఉంటాయంటున్నారు హీరోయిన్ సమీరా రెడ్డి. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లైన సమీర.. కొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తొలిసారి గర్భం దాల్చినప్పటి ఫోటోలను.. ప్రస్తుత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమీరా. దాంతో పాటు ఓ లేఖను కూడా షేర్ చేశారు.
దానిలో ‘మొదటి ప్రెగ్నేన్సీ తర్వాత నా బరువు 102 కిలోలకు చేరుకుంది. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. అంత అధిక బరువుతో బయటకు రావాలంటే భయమేసింది. ఒకప్పుడు సెక్సీ సామ్ అని పిలిచిన జనాలు ఇప్పుడు నన్ను చూస్తే ఎలా కామెంట్ చేస్తారో అని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉండేది. అందుకే ఇన్నాళ్లు బయట కనిపించలేదు. 2015 మేలో హన్స్‌కు జన్మనిచ్చాను. ఆ తర్వాత డాక్టర్లు నన్ను 4, 5 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమాన్నారు. దాంతో ఇంతలా బరువు పెరిగాను’ అని తెలిపారు సమీరా.
‘మరోవైపు నా జుట్టు కూడా విపరీతంగా రాలిపోవడం ప్రారంభించింది. ఇన్ని సమస్యలతో జనాల్లోకి రావాలంటే భయపడ్డాను. తల్లిని అయ్యనని సంతోషపడాలో లేక సినిమా తారకుండాల్సిన చార్మ్‌ను కోల్పోవాల్సి వచ్చిందే అని బాధపడాలో నాకు అర్థం కాలేదు. దాంతో డిప్రెషన్‌కి గురయ్యాను. థెరపిస్ట్‌లను కలిసాను. కౌన్సిలింగ్‌తో నాలో ధైర్యం పెరిగింది. నేను మళ్లీ నా పూర్వపు ఆకృతిని పొందుతానని నమ్మకం కలిగింది. అయితే బరువు తగ్గడం కోసం నేను ఎటువంటి సర్జరీలు.. కృత్రిమ పద్దతులు అవలంభించలేదు. రెండేళ్ల పాటు కఠినమైన ఎక్సర్‌సైజ్‌లు, యోగా చేస్తూ బరువు తగ్గాను’ అని తెలిపారు సమీరా.
‘ప్రస్తుతం నేను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. కానీ ఇప్పుడు బరువు సమస్య గురించి పట్టించుకోవడం లేదు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు. ప్రెగ్నేన్సీ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేయడం కోసమే ఇప్పుడు ఈ పోస్ట్ చేశాను. ఆ సమయంలో హర్మోన్ల మార్పు, శరీరాకృతి మారడం.. మానసిక కల్లోలం వంటి అంశాలు మహిళల్ని చాలా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి బయపడటానికి సమాజం నుంచి ఎలాంటి చేయూత లభించదు. మీరు మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. మనలోనే మార్పు రావాలి. ధైర్యంగా ఉండాలి. అప్పుడే వీటన్నింటిని తట్టుకుని నిలబడగల్గుతాం’ అని తెలిపారు సమీరా.
ఈ సందర్భంగా తన ఫిట్‌నేస్ ట్రైనర్లకు ధన్యవాదాలు తెలిపారు సమీరా. 2014లో అక్షయ్ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు సమీరా. ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment