Sameera Reddy
-
ప్రియుడితో సినిమాకు.. కాబోయే అత్త కూడా వెంటే వచ్చేది: హీరోయిన్
నరసింహుడు, అశోక్, జై చిరంజీవ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ సమీరా రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. సినిమాలకు, షికార్లకు వెళ్లినప్పుడు ప్రియుడి తల్లి కూడా తన వెంటే వచ్చేదట!అమ్మను తీసుకెళ్తాం..దీని గురించి సమీరా ఇంకా మాట్లాడుతూ.. అక్షయ్‌తో డేట్‌కు వెళ్లినప్పుడు అతడి తల్లిని కూడా తీసుకొచ్చేవాడు. మా అమ్మ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తను ఎక్కడికి వెళ్లాలన్నా మేమే తీసుకెళ్తాం. మేము ఎక్కడికి వెళ్లినా తననూ వెంటపట్టుకుని వెళ్తాం. అందుకనే మనం సినిమాకు వెళ్లినప్పుడు తనను కూడా తీసుకొస్తున్నా అన్నాడు. అది విని నాకు ఆశ్చర్యమేసింది. రాత్రి బస చేసేందుకు గ్రీన్ సిగ్నల్ఎప్పుడైనా తన ఇంట్లో రాత్రి నిద్ర చేసేందుకు కూడా అడ్డు చెప్పేది కాదు. పెళ్లికి ముందు అక్షయ్‌తో ఉండనిచ్చేది. తను చాలా సపోర్ట్‌గా నిలిచింది అని చెప్పుకొచ్చింది. కాగా సమీరా, అక్షయ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. అక్షయ్ కంటే సమీరా రెండేళ్లు పెద్దది కావడం గమనార్హం. ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు జన్మించారు. దశాబ్దకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా నామ్ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.చదవండి: తెలుగులో రిలీజ్ కాబోతున్న మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ! -
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
పిల్లల్లేకుండా, సోలోగా హాలిడే ట్రిప్, తొలి అనుభవం : నటి ఫోటోలు వైరల్
సాధారణంగా మహిళలు పెళ్లి , పిల్లలు తరువాత చాలా బాధ్యతల్లో మునిగిపోతారు. పిల్లల పెంపకంలో సెలబ్రిటీలైనా, సినీ తారలైనా అమ్మలకు ఈ బాధ్యత తప్పదు. ఈ క్రమంలో తమ ఉద్యోగాల్ని, తన అభిరుచుల్ని ఆంక్షాల్ని కూడా పక్కన పెట్టి మరీ పిల్లల పెంపకంలో మునిగి పోతారు. వాళ్లు కాస్త పెద్దవాళ్లయిన తరువాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం, మరికొంతమంది స్నేహితులతో హాలిడే ట్రిప్‌లు, తమ కలలకు పదును పెట్టడం లాంటివి చేస్తారు. సినీ నటి సమీరా రెడ్డి పిల్లలు, గిల్లలు ఇలాంటి బాదర బందీ ఏ మాత్రం లేకుండా మరింత గ్రాండ్‌గా సోలో ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "మీరు పిల్లలు లేకుండా సోలో హాలిడే ఎంజాయ్ చేశారా? నా మొదటి అనుభవం’’ అంటూ గ్రీస్‌లో గడిపిన మెమరబుల్ ఫోటోలను షేర్ చేసింది. దీంటో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
బిగ్‌బాస్ షోలోకి టాలీవుడ్ బ్యూటీ.. ఈసారి పక్కాగా..!
మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ షో ప్రారంభం కానుంది. తెలుగులో, తమిళంలో బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలు కానుండగా హిందీలో 18వ సీజన్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మూడు సీజన్ల కోసం కంటెస్టెంట్ల వేట మొదలుపెట్టారు. ఈపాటికే కొందర్ని ఫైనల్ చేయగా మరికొందరు పారితోషికం దగ్గర బేరాలాడుతున్నారు.బ్యూటీకి ఆహ్వానం..ఇదిలా ఉంటే హీరోయిన్ సమీరా రెడ్డి సైతం రియాలిటీ షోలో భాగం కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆమె షో మేకర్స్ నుంచి ఆహ్వానం అందింది. కానీ పలు కారణాల వల్ల ఆ ఆఫర్‌ను వదులుకుంది. అయితే ఈసారి మాత్రం సమీరా రావడం పక్కా అంటున్నారు.తెలుగులో..కాగా హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ అక్టోబర్ 5న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను బట్టి ఈ తేదీలో మార్పుచేర్పులు ఉండవచ్చు. సమీరా విషయానికి వస్తే ఈమె తెలుగులో నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించింది. 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. -
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ సమీరా రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. అయితే ప్రస్తుతం సమీరా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది. అయితే నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. కొందరు ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహాలిచ్చాలంటూ వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.సమీరా మాట్లాడుతూ..'నా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న రోజుల్లో నాపై ఒత్తిడి చాలా ఉండేది. చాలామంది బూబ్ జాబ్ సర్జరీ(బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. సర్జరీ చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. ఎందుకంటే నా విషయంలో సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను' అని చెప్పింది. -
Sameera Reddy Birthday: పింక్ సూట్ లో ముద్దొచ్చే ఫోజులతో అదరగొట్టిందిగా
-
సమీరా ఆ సమస్యతోనే బాధపడింది..అదేదో జన్మహక్కు అన్నట్లు..
తెలుగు తమిళ, బాలీవుడ్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డి సైతం ఆ సమస్యతో బాధపడిందట. జనాలంతా అదేదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తూ ఆ సమస్య గురించి తెగ మాట్లాడతారని మండిపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ఆ సమస్యను ధైర్యంగా ఫేస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలో చూద్దాం! ఇంతకీ సమీరా ఏ సమస్యతో బాధపడిందంట?..అధిక బరువు. ఆమె ప్రసవానంతరం బయటకి రావడానికే ఇబ్బంది పడిందట. అనుకోకుండా ఓ రోజు తన బాబుతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లితే అక్కడ సెక్యూరిటీ గార్డు ఆమె ఆధార్ కార్డుని తనిఖీ చేస్తూ చేసిన కామెంట్‌ని తానస్సలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏంటి మేడం మరీ ఇంత లావయ్యి పోయారు అంటూ జాలిగా చూసిన చూపు గుర్తొస్తే ఒళ్ల మండిపోతుందంటూ వాపోయింది. మహిళ శరీరాల గురించి కొందరూ అదెదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తారు. ఇది ప్రకృతిసహజంగా జరిగే మార్పులు కొన్ని ఉంటాయని అర్థం చేసుకోరు, తెలుసుకోరు అని తిట్టిపోసింది. ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటివి మరి ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇలాంటప్పుడూ మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వాటన్నింటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. జన్మనిచ్చే తల్లుల పట్ల గౌరవం లేకపోయిన పర్లేదు కానీ సహజంగా స్త్రీ తల్లి అయ్యాక వచ్చే శరీర మార్పులను ఎగతాళి చేయొద్దని చెబుతోంది. అదేసమయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరూ తల్లి అయ్యాక కూడా స్లిమ్‌గా ఉండొచ్చు కానీ అలా అందరికీ సాధ్యం కాదని, అందరీ శరీర నిర్మాణాలు ఒకే రీతిలో ఉండవని గుర్తించాలని చెప్పింది. సమీరా 2014లో అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ జంటకు 2015లో కొడుకు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. ఇక ఇలాంటి సమస్యలు సమీరా లాంటి సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఫేస్ చేసేదే. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టాలంటే.. మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా బయటపడొచ్చు. ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు.. సాధారణంగా ప్రసవించిన మహిళలు సాధారణంగా లావుగా కనిపిస్తారు. తగ్గడం కూడా అంత ఈజీగా ఉండదు. ఓ పక్క పిల్లలను చూసుకోవడంతో బిజీగా ఉండటంతో శరీరంపై దృష్టిపెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు ఒళ్లు తగ్గించుకోవాలంటే వాము నీళ్లే చక్కటి పరిష్కారం. గర్భధారణ సమయంలో కూడా వీటిని తాగొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యల్ని అధిగమిస్తుంది. అతిసారం, మలబద్దకాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు కొవ్వుని కరిగించడంలో సాయం చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్ లో వామ్ము నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే నాజూకైన అందం మీ సొంతం అవుతుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక కప్పు పాలల్లో పావు టీస్పూన్ జాజికాయ పొడి కలిపి మరిగించి, గోరు వెచ్చగా తాగాలి. ఇలా చేస్తే చాలా సులభంగా ప్రసవానంతరం వచ్చిన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
శరీరాకృతిపై కామెంట్.. భయంతో బయటకు రాలేదు: సమీరారెడ్డి
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన చాలామంది నటీమణులు పెళ్లి తర్వాత సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో నటి సమీరా రెడ్డి ఒకరు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. (చదవండి: టాప్ హీరోయిన్.. 18 ఏళ్లకే గదిలో శవమై.. మెడపై ఉరితాడు గుర్తులు!) గర్భం దాల్చిన సమయంలో కాస్త బరువు పెరిగారు. ఆ సమయంలో ఎవరికైనా ఈ మార్పులు సహజం. కానీ తనపై మాత్రం దారుణంగా విమర్శలు చేశారని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా బాడీ షేమింగ్ చేశారని బాధపడ్డారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వివాహం తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చారు. ‘2014లో అక్షయ్‌తో నాకు పెళ్లి జరిగింది. చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నాం. అయితే కొంతమంది మాత్రం నేను ప్రేగ్నెంట్ అయ్యాయనని, అందుకే ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారని పుకార్లు సృష్టించారు. అలా ఎందుకు పుట్టించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇక నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. 2015లో బాబు పుట్టాక నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయి. బరువు పెరిగాను. దీంతో చుట్టు పక్కల వాళ్లు నా శరీరాకృతిపై కామెంట్ చేశారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘ఇది మీరేనా?, ఇలా మారిపోయారేంటి?’అని అన్నారు. వారి మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. మీడియాకు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. అభిమానులతో కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిని ప్రమోట్ చేయాలని ఇండస్ట్రీలోని స్నేహితులను కోరితే..ఒక్కరు కూడా సాయం చేయలేదు. చాలా బాధపడ్డాను’ అని సమీరారెడ్డి చెప్పుకొచ్చారు. -
నా మొహానికి డెస్క్ జాబే కరెక్ట్.. ఏడ్చేసిన హీరోయిన్
సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం గుర్తు రాకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ ఆ తర్వాత పెద్దగా తెరపై కనిపించలేదు. కానీ టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది సమీర. తెలుగులో చిరంజీవి సరసన జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. 1998లో తెలుగు సినిమా ఆడిషన్స్‌కు హాజరైన విషయాన్ని వెల్లడించింది. టాలీవుడ్ హీరో ఆడిషన్స్‌లో సరైన ఫర్మామెన్స్ చేయకపోవడంతో ఏడ్చుకుంటూ ఇంటికెళ్లానని చెప్పుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సమీరా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' అప్పుడు 1998. నేను మహేశ్ బాబు సినిమా ఆడిషన్‌కు వెళ్లా. ఆరోజు చాలా భయమేసింది. దాంతో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయా. ఇంటికి తిరిగి వెళ్తూ ఏడ్చేశా. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చేశా. నేను రెండేళ్లు పని చేసిన వాచ్ కంపెనీలోనే ఉండాలని డిసైడ్ అయిపోయా. నా ముఖానికి డెస్క్ జాబే కరెక్ట్ అనుకున్నా. కానీ ఆ తర్వాత నేను మళ్లీ ధైర్యం తెచ్చుకుని బాలీవుడ్లో అహిస్తా కీజియో బాటియన్ మ్యూజిక్ వీడియో చేశా. ' అంటూ ఆడిషన్స్ ఫోటోలు పంచుకుంది. ఇది చూసిన సమీరా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే మీరు చాలా అందంగా ఉన్నారంటూ మరికొందరు పొగుడుతున్నారు. కాగా.. సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది సమీరా రెడ్డి. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
చాలా మంది అలా చేసేవారు.. కానీ నేను మాత్రం: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్
సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం లేకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది భామ. అంతకుముందే బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది సమీర. ఆ తర్వాత చిరంజీవి సరసన జై చిరంజీవ, ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమీర పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది సమీరా రెడ్డి. అప్పట్లో చిత్ర పరిశ్రమలో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గ్లామర్ కోసం శస్త్రచికిత్సలు చేసుకునేవారని తెలిపింది. కానీ నేను మాత్రం అలాంటి వాటికి జోలికి వెళ్లలేదని అన్నారు. నేను ఇండస్ట్రీలో ప్రవేశించాక దాదాపు 10 ఏళ్ల క్రితం ముక్కుతో పాటు చెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారని పేర్కొంది. తనను కూడా చేయించుకోవాలని సలహా ఇచ్చారని.. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఇదంతా వారి వ్యక్తిగత నిర్ణయమని.. వారికి ఇష్టంతోనే చేసేవారని వెల్లడించింది. సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది భామ. -
నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: సమీరారెడ్డి
ఆస్కార్ అవార్డు 2022 ఈవెంట్ చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన భార్య అనారోగ్యం గురించి కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పై మాట్లాడుతూ హాస్యం చేసినందుకు హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అతడి చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘనపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీనిపై స్పందిస్తూ ఆ పరిస్థితుల్లో తాను కూడా అలాగే చేసేదాన్ని అంటూ స్మిత్‌కు మద్దతుగా నిలిచింది. ఇక తాజాగా నటి సమీరా రెడ్డి కూడా స్పందించింది. స్మిత్ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ తను కూడా గతంలో అలోపేసియా వ్యాధితో బాధపడినట్టు సీక్రెట్ రీవిల్ చేసింది. అంతేకాదు ఈ వ్యాధి అంటే ఏంటో కూడా సమీరా వివరించింది. ‘ప్రతి ఒక్కరు జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపుడుతుంటారు. ఇటీవల ఆస్కార్ వివాదం నన్ను దీనిపై మాట్లాడేలా చేసింది. ఇంతకి అలోపేసియా అంటే ఏమిటో తెలుసా? ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని వల్ల మీ జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్‌లుగా ఊడిపోతుంది. 2016లో నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను. ఒక రోజు నా తల వెనక భాగంలో 2 ఇంచుల మేర నా జుట్టు ఉడిపోయి ఉండటం నా భర్త అక్షయ్ గమనించాడు. ఒక నెలలోనే రెండు మూడు చోట్ల నా జుట్టు ఊడిపోయి కనిపించింది. చదవండి: ఆగిపోయిన ప్రభాస్ సలార్ షూటింగ్!.. కారణం అదేనా? ఇది అంటూ వ్యాధి కాదు, ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. కానీ చూట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగదీస్తుంది. ఈ అలోపేసియా ఏరియాటా ఎందుకు వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ.. ఇది మాత్రం పెద్ద వ్యాధి కాదు’ అంటూ సమీరా రాసుకొచ్చింది. అలాగే తను ఈ సమస్య నుంచి బయటపడ్డానని, ప్రస్తుతం తన తలలో ఎలాంటి ప్యాచ్‌లు లేవని ఆమె తెలిపింది. కాగా సమీరా రెడ్డి జై చిరంజీవా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అశోకా వంటి చిత్రాల్లో తన నటన, డాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సమీరారెడ్డి.. అంతే తక్కువ సయమంలో ఇండస్ట్రీకి దూరమైంది. అక్షయ్ అనే వ్యాపావేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది సమీరారెడ్డి. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
బొద్దుగా ఉందని ట్రోలింగ్! పదకొండు కిలోలు తగ్గిన నటి!
ఆ సమీరా.. ఈ సమీరాయేనా? అనేంతగా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాక సమీరా రెడ్డి బాగా లావయ్యారు. మరీ ఇంత బొద్దుగానా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా. అప్పుడు సమీరా ‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం’’ అంటూ తల్లయ్యాక బరువు పెరిగి, బాధపడే అమ్మాయిలను ఉద్దేశించి, నాలుగు మంచి మాటలు కూడా చెప్పారు. అలాంటి సమీరా బరువు తగ్గే పని మీద పడ్డారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం. ఏడాదిలో దాదాపు పది కిలోలు తగ్గారామె. ‘‘గత ఏడాది ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాను. అప్పుడు 92 కిలోలు బరువు ఉండేదాన్ని. ఇప్పుడు 81కి చేరుకున్నాను’’ అన్నారు సమీర. అంటే.. బరువులో పదకొండు పోయే పోచ్ అన్నమాట. ఇక బరువు తగ్గడం వల్ల ఎలా ఉంది? ఎలా తగ్గాలో సమీర చెప్పారు. ► బరువు తగ్గాక నా ఎనర్జీ లెవల్స్ బాగా పెరిగాయి. అలాగే ఏకాగ్రత పెరిగింది. ఇంతకుముందు కంటే చురుకుగా ఉంటున్నాను. నేను బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చాలా ఉపయోగపడింది. అంటే.. అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం వంటిది. ► క్రమం తప్పకుండా చేసిన వ్యాయామాలు నేను తగ్గడానికి బాగా ఉపయోగపడ్డాయి. ► ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటానికి మానసికంగా చాలా కృషి చేశాను. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉంటాయో అప్పుడు మన శరీరం తేలికగా ఉంటుంది. ► బరువు తగ్గాలనుకుంటే ఏదైనా ఒక ఆటను ఎంచుకోవాలి. ఆటలు ఆడితే ఫిట్నెస్కి ఫిట్నెస్.. ఫన్‌కి ఫన్ దొరుకుతాయి. ∙మన జీవిత భాగస్వామి మన బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, ప్రతి వారం మన ఫిట్నెస్ ప్రోగ్రెస్‌ని చెక్ చేస్తూ ఉంటే.. మనకు ఆశాజనకంగా ఉంటుంది. ► అమాంతంగా బరువు తగ్గడం ప్రమాదం. ఇన్ని నెలల్లో ఇన్ని కిలోలు తగ్గితే మంచిది అని తెలుసుకుని, మన టార్గెట్ అన్ని నెలలపై పెట్టాలి. ► చివరిగా చెప్పేదేంటంటే... మీపై మీరు నమ్మకాన్ని కోల్పో వద్దు. అనవసరంగా ఒత్తిడికి గురి కావొద్దు. -
40లో ప్రెగ్నెన్సీ..సుమారు 105కేజీల బరువు పెరిగాను : నటి
ప్రెగ్నెన్సీ టైంలో హర్మోన్స్ ఇంబ్యాలెన్స్‌తో మహిళల్లో అనేక శరీర మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ఆందోళన చెందడం, బరువు పెరగడం చాలామంది మహిళల్లో సహజంగా జరిగేవే. కానీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి వాళ్లకు సంబంధించిన ప్రతీ అంశం సెన్సేషన్ అయిపోతుంది. వాళ్లు బరువు పెరిగినా, తగ్గినా ప్రేక్షకుల నుంచి సరిగ్గా రిసీవింగ్ ఉండదు. మరీ ఆంటీలా కనిపిస్తున్నావంటూ చెడామడా ట్రోల్స్ చేసేస్తుంటారు. నటి సమీరా రెడ్డి సైతం ఇలాంటి అబ్యూసివ్ మెసేజెస్, ట్రోల్స్ ఎదుర్కొన్నారు. తాజాగా తాను గర్భవతిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న శరీరమార్పులు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై నటి సమీరా రెడ్డి స్పందించారు. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) 'బిడ్డకు జన్మనివ్వడం అన్నది చాలా గొప్పవిషయం. ఆ మధుర క్షణాలన్నింటిని ఆస్వాదించండి. శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం సహజమే. బరువు పెరగడంతో ఒత్తిడికి లోనవుతుంటారు చాలామంది. నా విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అవడంతో భయపడ్డాను. హన్ష్ పుట్టిన తర్వాత నేను దాదాపు 105కేజీల బరువు పెరిగాను. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోల్ చేసేవాళ్లు. బాడీ షేమింగ్ చేసేవాళ్లు. దీంతో తెలీకుండానే ఒకింత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కానీ నేను ఇలా ఎందుకు బాధపడుతున్నానా అనిపించింది. మెల్లిమెల్లిగా దాన్నుంచి బయటపడ్డాను. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) ఇక రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. హన్ష్ డెలీవరీ టైంలో మిస్ చేసుకున్న చిన్నిచిన్ని ఆనందాలను కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. నైరా పుట్టడానికి ఒకరోజు ముందు ఆ షూట్ చేశాం. అలా బిగ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉండటం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చెప్పలేదు. ఇక నైరా పొట్టలో ఉన్నప్పుడు 8వ నెలలో బేబీ బంప్‌తో అండర్ వాటర్ షూట్ చేశాం. అది చూసి చాలా మంది ఆడవాళ్లు..మీరు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు.. మీలాగే ఉండాలనుకుంటున్నా' అంటూ నాకు మెసేజ్ చేసేవాళ్లు అని తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి వివరించింది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
కరోనా బారిన నటి సమీరా, పిల్లలిద్దరికీ అస్వస్థత
బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇంట్లో క్వారంటైన్లో ఉన్నాను. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూరా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధృడంగా ఉండాలి' అని రాసుకొచ్చింది. తన పిల్లలు కూడా కోవిడ్ లక్షణాలతో అస్వస్థతకు లోనయ్యారని, ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది. కొడుకుకు పరీక్షలు నిర్వహించగా అతడికి కూడా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. సెకండ్ వేవ్‌ను నిర్లక్ష్యం చేయకుండా కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తన పిల్లలు హన్స్, నైరాతో కలిసి సందడి చేసే సమీరా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు సడన్‌గా ఆమె కోవిడ్ బారిన పడటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సమీరా రెడ్డి, వ్యాపారవేత్త అక్షయ్ వార్డేను 2014లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడమే మానేసింది. ఇక ఈమె చివరిసారిగా 2012లో రానా దగ్గుబాటి హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) చదవండి: పెళ్లికి ముందు అజయ్ దేవ్‌గణ్ ఓ ప్లే బాయ్! వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి సంబంధం లేదు గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా.. ఆ ఫోటోతో అలా.. -
‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’
‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ఆ బరువుని అసహ్యించుకోవడం మంచిది కాదు. అలానే ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం. మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని మనం అంగీకరించాలి’’ అని ఆ మధ్య ఓ పాపకి జన్మనిచ్చిన సందర్భంలో అన్నారు సమీరా రెడ్డి. తాజాగా పెళ్లి గురించి ఓ విషయం పంచుకున్నారు. సమీరా మాట్లాడుతూ – ‘‘నా పెళ్లికి ముందు వరకూ ‘ఏంటీ ఇంకా పెళ్లవ్వలేదా’ అనే ప్రశ్న పదే పదే నాకు ఎదురయ్యేది. ‘35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లవ్వకపోవడం ఏంటి’ అనేవారు. అది వినగానే నాలో తెలియని ఒత్తిడి పెరిగేది. అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న. పెళ్లయ్యాక ‘పిల్లలెప్పుడు’? అనే ప్రశ్న. అమ్మాయికి ఓ తోడు ఉండాలని సమాజం అంటుంది. పెళ్లి, పిల్లలు ఉంటేనే ఆ అమ్మాయి జీవితం పరిపూర్ణం అవుతుందని అంటారు. ఇంకో విషయం ఏంటంటే.. మొదటి బిడ్డ పుట్టాక.. ఇంకో బిడ్డను ప్లాన్ చేస్తున్నారా? లేక ఒక్కరే చాలా? అని ఓ ప్రశ్న. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేక చాలామంది అమ్మాయిలు భయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వాళ్లకేం కావాలో ఆ నిర్ణయాలే తీసుకుంటారు. భయంతో కాదు... ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు’’ అన్నారు. 2014లో అక్షయ్ వార్దేని పెళ్లాడారు సమీరా. అప్పుడు ఆమెకు 36ఏళ్లు. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అక్షయ్ అర్థం చేసుకునే భర్త అని పలు సందర్భాల్లో సమీరా పేర్కొన్నారు. చదవండి: 24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్ తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ గురి -
మూడు సినిమాల నుంచి తప్పించారు
‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర. ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు. క్యాస్టింగ్ కౌ^Œ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి. -
అసంపూర్ణం కూడా సంపూర్ణమే!
బాడీషేమింగ్ చేసేవాళ్లను ఉద్దేశించి ‘షేమ్ షేమ్’ అంటున్నారు సమీరా రెడ్డి. ‘‘మనం ఎలా ఉంటే అలా స్వీకరించడాన్ని నేర్చుకుందాం. మనల్ని మనం ఇష్టపడదాం. పోల్చుకోవడం మానేద్దాం. పోల్చి చూడటం ఆపేద్దాం’’ అని కూడా అన్నారు సమీరా. బాడీషేమింగ్ గురించి ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారామె. ఇటీవలే తల్లి అయిన ఒక అమ్మాయి పంపిన మెసేజ్ చూసి ఈ విషయం మీద ఈ వీడియో చేసినట్టు తెలిపారు సమీరా. వీడియో సారాంశం ఈ విధంగా... ‘‘సమీరా.. ఈ మధ్యనే తల్లయిన నేను బరువు పెరిగాను. నా శరీరం నాకే నచ్చడం లేదు. అసహ్యంగా ఉన్నాను అనిపిస్తోంది’ అనే మెసేజ్ నాకు వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. మన దగ్గర ఏం లేదో (జీరో సైజ్ అయినా ఇంకేదైనా..) దాని గురించే పదే పదే ఆలోచించి బాధపడటం మానేద్దాం. మన దగ్గర ఉన్నదానితో సంతోషపడటం నేర్చుకుందాం. చిన్నప్పటి నుంచి నన్ను మా అక్కయ్యలతోనో ఎవరో ఒకరితోనో పోలుస్తూనే ఉన్నారు. తను అలా ఉంది.. నువ్వు ఇలా ఉన్నావు అని. ఇక నేను పని చేసిన ఇండస్ట్రీ చేసే పనే అది.. పోల్చి చూడటం. దాంతో నేను చూడటానికి బావుండాలని చేయని ప్రయత్నం లేదు. మేకప్, లెన్స్, ప్యాడ్స్.. ఇలా అన్నీ వాడాను. ఇలాంటివి చేసినా సంతోషంగా ఉన్నానా? అంటే అస్సలు లేదు. మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. చాలా ఏళ్లుగా ఇలాంటి షేమింగ్స్తో విసుగెత్తిపోయాను. పట్టించుకోవడం మానేశాను. మనం సంతోషంగా ఉన్నామా? లేదా అనే విషయం మీదే దృష్టి పెట్టాను. మీరు కూడా అదే పాటించండి. లావుగా ఉన్నారా? ఏం ఫర్వాలేదు.. మెల్లిగా తగ్గుతారు. కంగారుపడకండి.. కుంగిపోకండి. అనవసరమైన విమర్శలతో వేరే వాళ్లు కుంగిపోయేలా చేయకండి. సంతోషంగా ఉండటంపైనే ఫోకస్‌గా ఉండండి. అసంపూర్ణాన్ని కూడా ఆస్వాదిద్దాం. అసంపూర్ణం కూడా సంపూర్ణం అనుకుందాం. అప్పుడు చాలా బాగుంటుంది!’’ అని ఆ వీడియోలో సమీరా రెడ్డి చెప్పిన మాటలు చాలా అర్థవంతంగా, ధైర్యం నింపేలా ఉన్నాయి. సమీరా రెడ్డి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. తల్లయినప్పటి నుంచి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి విషయాలు చర్చిస్తూ, అవగాహన తీసుకొస్తూ, అభద్రతాభావంతో బాధపడేవాళ్లకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. -
అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్ ఛాలెంజ్
-
అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్ ఛాలెంజ్
నరసింహుడు సినిమాతో టాలీవుడ్‌కు పరియయమైన సమీరారెడ్డి.. ఆ తర్వాత జై చిరంజీవ, ఆశోక్ వంటి చిత్రాల్లో నటించారు. తనకు సంబంధించిన విషయాలను నిత్య సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం ఎదుర్కొన్న శరీరాకృతి సమస్యలు, మహిళలు స్వతంత్రంగా, గౌరవంగా జీవించాలంటూ, అనేక అంశాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మరోసారి సమీరా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ‘ఫ్లిప్ ద స్విచ్’ ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది. ఇది హాలీవుడ్లో మొదలైంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోఫెజ్ స్వీకరించారు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సమీరా దీన్ని మొదటగా స్వీకరించారు. "ఫ్లిప్ ది స్విచ్".. ఈ ఛాలెంజ్‌లో ఓ వ్యక్తి కెమెరాను పట్టుకుని అద్దం ముందు నిలబడాలి, మరొకరు ఏదైనా పాటకు నృత్యం చేస్తారు. అయితే పాట మధ్యలో వెంటనే ఇద్దరు తారుమారు అవుతారు. కెమెరా పట్టుకున్న వ్యక్తి మళ్లీ డ్యాన్స్ చేసిన వాళ్ల దుస్తులు వేసుకొని నృత్యం చేస్తారు. ముందు డ్యాన్స్ చేసిన వ్యక్తి ఈ సారి వీడియో తీస్తారు. ఇవన్నీ కనురెప్ప మూసే సమయంలో జరిగినట్లు కనిపిస్తుంది. ఇక సమీరా క్వావో పాటను ఎంచుకొని, తన అత్తగారు మంజ్రీ వర్దేతో కలిసి ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంజ్రీ వార్దె గురించి సమీరా రెడ్డి చెపుతూ.. ‘‘అత్తగారు మీ శక్తిని దొంగిలించినప్పుడు.. ఆమె ఒక అద్భుతం. గ్యాంగ్‌స్టర్. ఆమె నాలాగే క్రేజీగా ఉన్నందుకు ధన్యవాదాలు.. మీరు కూడా దీన్ని తప్పకుండా ప్రయత్నించండి. అలాగే నన్ను ట్యాగ్ చేయండి’’ అంటూ ఇతరులకు సలహా ఇచ్చారు. కాగా సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లో కొడుకు, 2019లో పాప పుట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. -
దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!
తన గారాల పట్టి నైరాకు పాలు పడుతూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు నటి సమీరారెడ్డి. రెండోసారి గర్భం దాల్చిన నాటి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆమె. గర్భిణిగా ఉన్నపుడు, ప్రసవం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, శరీరాకృతి గురించి ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మహిళల్లో స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం ప్రపంచ తల్లిపాల వారోత్సవం(ఆగష్టు 1-7)సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ, అటువంటి సమయంలో భర్తలు... ఏవిధంగా అండగా ఉండాలో సూచిస్తూ సమీరా పెట్టిన పోస్టు నెటిజన్లను హత్తుకుంటోంది. ‘అమ్మ’ పై ప్రేమ, గౌరవం చూపండి! ‘ కొత్తగా తండ్రులైనవారు, ప్రియమైన నా వాళ్లందరూ ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించండి! ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మీకో విషయం చెప్పదలచుకున్నాను. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మీ అండ అవసరం. గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత మహిళల్లో ఒక రకమైన ఒత్తిడి, భయం నెలకొంటాయి. వారు ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. ఇవన్నీ పరోక్షంగా వారి ఆరోగ్యంపై.. ముఖ్యంగా చనుబాలపై ప్రభావం చూపుతాయి. బిడ్డతో వ్యవహరించే తీరులో మార్పునకు కారణమవుతాయి. కాబట్టి పాల ఉత్పత్తి తగ్గిపోయి శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇటువంటి సమయాల్లో మీ సహకారం ఆమెకు అవసరం. మీ ప్రేమతో ఆ ఒత్తిడిని, భయాలను దూరం చేయండి. ఇక ఇంకో విషయం బిడ్డకు చనుబాలు పట్టే తల్లులను హేళనగా చూస్తూ వాళ్లను సిగ్గుతో బిగుసుకుపోయేలా చేయకండి. తల్లులూ మీరూ వినండి. పాలు పడటం లేదని ఆందోళన చెందకండి. పాలు పట్టే తీరును బట్టి కూడా వాటి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఈ విషయంలో అస్సలు ఒత్తిడికి లోనవ్వను. ప్రతీ అమ్మపై ప్రేమ, గౌరవం చూపాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అంటూ సమీరా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అంతేగాక తన బిడ్డను హత్తుకొని ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram New dads & loved ones listen up! Its World Breast feeding week and this post is for you to know that you can be the biggest support and encouragement to a new mom! A mother may be depressed, lacking in confidence, worried, or stressed and it affects breastfeeding. These factors do not directly affect her milk production, but can interfere with the way in which she responds to her baby. This can result in the baby taking less milk, and failing to stimulate milk production. So be there for her . ❤️ Understanding the pressure on her physically and emotionally is the best thing you can do. Nothing like feeling loved at such an overwhelming time. 🙌🏻 . I would also like to give a shoutout to moms who have struggled with low milk production . This could happen due to a pathological reason including endocrine problems or a host of other factors .A few mothers have a physiological low breast-milk production, for no apparent reason, and production does not increase when the breastfeeding technique and pattern improve. There is no reason to shame them or make them feel any pressure in not being able to BF. we need to support all mothers and show love and respect 🍼. . #worldbreastfeedingweek2019 . @WABA_global @who @unicefindia A post shared by Sameera Reddy (@reddysameera) on Aug 2, 2019 at 12:46am PDT ఇక మరో నటి నేహా దుఫియా కూడా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తన బిడ్డ మెహర్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ఓ సందేశాత్మక వీడియో రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో సిగ్గుపడకుండా అనువైన రీతిలో బిడ్డకు పాలు పట్టడం నేరమేమీ కాదని నేహ వీడియోలో చెప్పుకొచ్చారు. -
కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!
గర్భం ధరించినప్పటి నుంచి ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకూ సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టి వార్తల్లో నిలిచారు నటి సమీరా రెడ్డి. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో మాతృత్వంపై తన ఆలోచనలను పంచుకున్నారు. శరీరాకృతి ఎలా ఉన్నా దానిని స్వీకరించాలని సమీరా రెడ్డి తన భావాలను వ్యక్తపరచడంతో చాలా మంది భారత మహిళలకు ఆమె ఓ ప్రేరణగా మారారు. ఈ నెల ప్రారంభంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సమీరా, తన కుమార్తెకు 'నైరా' అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంటూ.. 'మా గారాలపట్టి నైరాను వర్డే కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాం' అని పేర్కొన్నారు. 'నైరా' అనేది సరస్వతి దేవి పేరని ఆమె తెలిపారు. అంతేకాకుండా హీబ్రూలో 'మొక్క' అని అర్థం వస్తుందని, అమెరికన్ మూలంలో ‘నైట్ బోర్డర్‘ అనే అర్థం కూడా ఉందని ఆమె తెలిపారు. దీంతో ఈ అరుదైన పేరుకి వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. సమీరా షేర్ చేసిన పోస్ట్‌కు స్పందించిన ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, అనితా డోంగ్రే పేరు చాలా బావుందని ప్రశంసించారు. తన భర్త అక్షయ్ వర్దే, తాను ఓ కుమార్తెను కోరుకున్నామని అనుకున్నట్లే కుమార్తె జన్మించడంతో సంతోషంగా ఉందని గతంలో సమీరా రెడ్డి ఓ పోస్ట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. -
మరోసారి తల్లి అయిన బాలీవుడ్ హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమీరా రెడ్డి ఇంట మరోసారి సందడి నెలకొంది. ఆ కుటుంబంలోకి మరో బుజ్జాయి విచ్చేసింది. అశోక్, జై చిరంజీవి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సమీరా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీ ప్రేమకి, ఆశీర్వాదాలకి ధన్యవాదాలు’ అంటూ ... ఆ చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్డేని వివాహం చేసుకున్న సమీరాకు నాలుగేళ్ల కుమారుడు హన్స్ ఉన్నాడు. మరోవైపు సమీరాకు అభిమానులు, బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. కాగా సమీరా రెడ్డి ఫోటో షూట్లతో హల్చల్ చేశారు. మాతృత్వం స్త్రీకి అపురూపమైనదంటూ.. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా... దాని కోసమే ఇలా ఫోటోలు దిగానని, ఇదే నిజమైన సమీరా అంటూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె మేకప్ లేకుండా సహజంగా కనిపించారు. -
‘మా ఏంజిల్ ఈరోజే ఈ లోకంలోకి వచ్చింది’
నటి సమీరా రెడ్డి ఈ రోజు ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు సమీరా రెడ్డి. కుమార్తె చేయి పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సమీరా. ‘ఈ రోజు ఉదయం మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీరు చూపిన ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సమీరాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి’ అని కామెంట్లు చేశారు. View this post on Instagram Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed A post shared by Sameera Reddy (@reddysameera) on Jul 12, 2019 at 1:00am PDT సమీరా ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత ‘జై చిరంజీవ’, ‘అశోక్’ చిత్రాల్లో నటించారు. 2014లో అక్షయ్ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. 2015లో ఈ దంపతులకు కుమారుడు హాన్స్ జన్మించాడు. -
ఇదే నిజమైన నేను: సమీరా రెడ్డి
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. గతంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సమీర ఫోటోషూట్లతో హల్చల్ చేస్తున్నారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సమీరా. ఈ వీడియోలో సమీరా మేకప్ లేకుండా అల్లరి చేస్తూ కనిపించారు. వీడియోతో పాటు ‘ఇదే నిజమైన నేను..’ అనే కామెంట్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేయడం వెనుక తన ఆలోచనను ఏంటో కూడా చెప్పుకొచ్చారు సమీరా. ‘ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల నాపై వివర్శలు వస్తాయని నాకు తెలుసు, వాటికి నేను బయపడను. కేవలం నేను మేకప్ లేకుండా ఎలా కన్పిస్తున్నానో చూపించడానికే ఈ పోస్టు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. గతంలో మొదటి గర్భధారణ సమయంలో శరీరాకృతికి సంబధించి సమస్యలు ఎదుర్కొన్న సమీరా అప్పటి ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను ఎంతో ధృడంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ తమలోని లోపాలను తెలుసుకొని సరిదిద్దుకోవాలని, నిరంతరం మనల్ని మనం గౌరవించుకోవాలని సూచించారు. సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లోనే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. View this post on Instagram This is the real me! Almost ready to pop! I know I’ll bounce back and im not afraid of being judged 🙌🏼. I wanted to share how I looked without make up & my morning face 😱 and how it’s important for me to celebrate it ! #imperfectlyperfect Thank you @namratasoni you’ve been amazing . . 🎥 the very talented @varadsugaonkar ⚡️. . #video #positivevibes #socialforgood #positivebodyimage #preggo #pregnant #pregnancy #9monthspregnant #almostthere #naturalmakeup #natural #acceptance #positivity #selflove #makeupfree #momtobe #momtobeagain #bump #bumpstyle #maternityshoot #maternityphotography #feelgood #bodypositive #loveyourself A post shared by Sameera Reddy (@reddysameera) on Jul 10, 2019 at 1:10am PDT -
అసంపూర్ణమైన సంపూర్ణం
‘‘సినిమా స్టార్స్‌ని చూసి అలానే ఉండాలనే ఆలోచనను సమాజం ఏర్పరచుకుంది. దీని ద్వారా చాలా మంది అనవసరమైన ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టాలనుకుంటున్నాను’’ అన్నారు సమీరా రెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఈత కొలనులో ఫొటోషూట్ చేయించుకోవడమే. గర్భంతో ఉండి, ఇలా పొట్ట కనిపించేట్లు ఫొటోలు దిగుతారా? అని కొందరు సమీరాను విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు సమీరా సమాధానం ఇచ్చారు. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారామె. రెండోసారి తల్లి కాబోతున్న సమీరా రెడ్డి బాడీ పాజిటివిటీ, మనల్ని మనం ప్రేమించుకోగలగడం, మూస ధోరణి ఆలోచనల గురించి అవగహన కలిగించాలనుకున్నారు. ఈ విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ – ‘‘బాడీ షేమింగ్ ఎదుర్కొన్నవాళ్ల కోసమే అండర్ వాటర్ ఫొటోషూట్ చేసుకున్నాను. ఇంతకు ముందు బికినీ ధరించాలంటే ఎంతో ఆలోచించేదాన్ని. ఎన్నో ఆలోచనలు. కానీ తొమ్మిదో నెల ప్రెగ్నెంట్‌గా ఉంటూనే బికినీలో ఎంత కంఫర్ట్‌బుల్‌గా ఉన్నానో చెప్పలేను. మొదటిసారి గర్భవతిని అయినప్పుడు నా వంతు ట్రాలింగ్ (విమర్శలు) ఎదుర్కొన్నాను. ‘ప్రెగ్నెంట్ అయినప్పుడు సమీర బరువు పెరిగింది. గ్లామర్ తగ్గింది’ అనే కామెంట్స్ విన్నాను. కానీ ఈసారి దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. వాటిని తిప్పికొట్టి కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకున్నాను. మన శరీరాన్ని మనమే అంగీకరించకపోతే ఎలా? అన్ని వయసుల ఆడవాళ్లకు చెప్పేది ఏంటంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకొని, అంగీకరించండి’’ అన్నారు. -
మెరిసిన సమీరా
కొత్త మెరుపుతో సమీరా రెడ్డి మెరిసిపోయారు. ఆ మెరుపు చూసి సమీరా భర్త అక్షయ్ వార్దే మనసు మురిసింది. ఇద్దరి ఆనందానికి సాక్షిగా కుమారుడు హన్స్ మెరిశాడు. ఇప్పుడు సమీరా రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. గురువారం ఆమె శీమంతం జరిగింది. ‘‘మనం నవ్వితే మనతో పాటు ఈ సమస్తం కూడా నవ్వుతుంది. ఆరోగ్యకరమైన నవ్వు, మానసికంగా ఆనందంగా ఉంటే అదే జీవితకాలపు సంతోషం. కాంచిపురం చీర కట్టుకోగానే నాకే నేను స్పెషల్‌గా కనిపిస్తున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోలను షేర్ చేశారు. ‘జై చిరంజీవ, నరసింహుడు, అశోక్’ సినిమాలతో అలరించిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నారు. 2015లో వీరికి కుమారుడు పుట్టారు. ఇప్పుడు రెండో బేబీ రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. -
ఇండస్ట్రీ ధోరణి మారాలి
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీలను కేవలం గ్లామర్ వస్తువుల్లా మాత్రమే చూస్తారు. కానీ దానికి మించి ఇంకా చాలా ఉంటుంది స్త్రీలలో’’ అన్నారు సమీరా రెడ్డి. ఇండస్ట్రీలో స్త్రీలను ట్రీట్ చేసే విధానం, స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం గురించి ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మారాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది స్త్రీల నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే. చాలా సందర్భాల్లో నన్ను అభ్యంతరకరంగా అప్రోచ్ అయ్యారు కూడా. స్త్రీలను కేవలం గ్లామర్ కోసమే అనేట్టుగా చూడటం మానేయాలి. ఇండస్ట్రీలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఒకేలాంటి గౌరవం ఉండదు. ఒకవేళ ఇండస్ట్రీలో ఏదైనా మార్చాలనుకుంటే అది ఇదే అని కోరుకుంటాను. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆ విధంగానే అడుగులేస్తోంది అనుకుంటున్నాను. చాలా చిన్న చిన్న అడుగులు. బేబీ స్టెప్స్లాగా’’ అని పేర్కొన్నారు. ‘అసభ్యకరంగా అప్రోచ్ అయ్యారు’ అని పేర్కొనడం వెనక కారణం క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిందా? లేద సెక్సువల్ హెరాస్మెంటా? అన్నది క్లారిటీగా చెప్పలేదు సమీర. -
‘మహిళల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు’
ఇండస్ట్రీలో మహిళల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఈ ఆలోచన ధోరణి మారాలి అంటున్నారు నటి సమీరా రెడ్డి. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడారు సమీరా రెడ్డి. ‘అవకాశాలను ఎరగా చూపి మహిళల్ని వాడుకోవాలనుకుంటారు. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. మహిళ అంటే కేవలం ఓ గ్లామర్ వస్తువుగా మాత్రమే చూస్తారు. నేను కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అన్నారు సమీరా. అంతేకాక ‘పరిశ్రమలో పురుషులను, స్త్రీలను సమానంగా చూడరు. పారితోషికం విషయంలో మాత్రమే కాదు గౌరవం విషయంలో కూడా ఈ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. మహిళల విషయంలో పరిశ్రమ ఆలోచన పూర్తిగా మారాలి. ఈ మార్పు ఎంత త్వరగా వస్తే అంత మేలు జరుగుతుంది. మీటూ లాంటి ఉద్యమాల వల్ల ఇప్పుడిప్పుడే ఆ మార్పు ప్రారంభమయ్యింది. అయితే ఇంకా బుల్లి బుల్లి అడుగులే పడుతున్నాయి. కాస్త త్వరగా మార్పు వస్తే మంచిద’న్నారు సమీరా. 2014 వరకు సమీరారెడ్డి దక్షిణాది సినిమా పరిశ్రమలో రాణించింది. ఆ తర్వాత పారిశ్రామిక వేత్త అక్షయ్ వార్దేను వివాహం చేసుకోవడంతో యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారు. 2015 నుంచి కేవలం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు. తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అయ్యారు. -
‘బరువు 102 కేజీలు.. జుట్టు రాలిపోయింది’
మాతృత్వం ఆడవారికి గొప్ప వరమంటూ సమాజం ఊదరగొడుతుంది. కానీ ఆ సమయంలో స్త్రీలు అనుభవించే ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. సాధరణ మహిళలతో పోలిస్తే.. హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఇంకాస్త ప్రత్యేకంగా ఉంటాయంటున్నారు హీరోయిన్ సమీరా రెడ్డి. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లైన సమీర.. కొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తొలిసారి గర్భం దాల్చినప్పటి ఫోటోలను.. ప్రస్తుత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమీరా. దాంతో పాటు ఓ లేఖను కూడా షేర్ చేశారు. దానిలో ‘మొదటి ప్రెగ్నేన్సీ తర్వాత నా బరువు 102 కిలోలకు చేరుకుంది. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. అంత అధిక బరువుతో బయటకు రావాలంటే భయమేసింది. ఒకప్పుడు సెక్సీ సామ్ అని పిలిచిన జనాలు ఇప్పుడు నన్ను చూస్తే ఎలా కామెంట్ చేస్తారో అని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉండేది. అందుకే ఇన్నాళ్లు బయట కనిపించలేదు. 2015 మేలో హన్స్‌కు జన్మనిచ్చాను. ఆ తర్వాత డాక్టర్లు నన్ను 4, 5 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమాన్నారు. దాంతో ఇంతలా బరువు పెరిగాను’ అని తెలిపారు సమీరా. ‘మరోవైపు నా జుట్టు కూడా విపరీతంగా రాలిపోవడం ప్రారంభించింది. ఇన్ని సమస్యలతో జనాల్లోకి రావాలంటే భయపడ్డాను. తల్లిని అయ్యనని సంతోషపడాలో లేక సినిమా తారకుండాల్సిన చార్మ్‌ను కోల్పోవాల్సి వచ్చిందే అని బాధపడాలో నాకు అర్థం కాలేదు. దాంతో డిప్రెషన్‌కి గురయ్యాను. థెరపిస్ట్‌లను కలిసాను. కౌన్సిలింగ్‌తో నాలో ధైర్యం పెరిగింది. నేను మళ్లీ నా పూర్వపు ఆకృతిని పొందుతానని నమ్మకం కలిగింది. అయితే బరువు తగ్గడం కోసం నేను ఎటువంటి సర్జరీలు.. కృత్రిమ పద్దతులు అవలంభించలేదు. రెండేళ్ల పాటు కఠినమైన ఎక్సర్సైజ్లు, యోగా చేస్తూ బరువు తగ్గాను’ అని తెలిపారు సమీరా. ‘ప్రస్తుతం నేను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. కానీ ఇప్పుడు బరువు సమస్య గురించి పట్టించుకోవడం లేదు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు. ప్రెగ్నేన్సీ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేయడం కోసమే ఇప్పుడు ఈ పోస్ట్ చేశాను. ఆ సమయంలో హర్మోన్ల మార్పు, శరీరాకృతి మారడం.. మానసిక కల్లోలం వంటి అంశాలు మహిళల్ని చాలా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి బయపడటానికి సమాజం నుంచి ఎలాంటి చేయూత లభించదు. మీరు మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. మనలోనే మార్పు రావాలి. ధైర్యంగా ఉండాలి. అప్పుడే వీటన్నింటిని తట్టుకుని నిలబడగల్గుతాం’ అని తెలిపారు సమీరా. View this post on Instagram I touched 102 Kgs in May 2015, the month Hans was born and I’m not scared to admit it . It took me to the deepest darkest places in my head. My confidence shattered . And I couldn’t lose the weight for a year after because I was too scared to even step out . I disappeared because I didn’t have the strength to be judged by the world after all the years of being glam and fit on screen . But the beautiful part is that you can only hit your lowest low to know you can absolutely climb out of that hole . It’s a fight . A hard one . Took me 2 years more to lose the weight and to step out and face the world again but I wish I had the courage then. I did it naturally with no fad diets , no easy way out. Only with dedicated workout, yoga, pilates and strength training . It’s important for me to post this now because I need women to know the struggle is real . The mood swings , hormonal changes and losing your body shape can mess with your mind. It’s a superficial world and people can be hurtful if you don’t keep up . But the key is to be fearless. Only you can get out of that rut. It’s yours to change. Be brave . You can move mountains if you just will it . ❤️. . Special thanks to the best workout crew who also gave me the physical & emotional strength to get fit again @yogabypramila @adishroff @ivan_ultimatefitness @nyelakapadia & Kaizen Motafram my Pilates guru! love you guys ❤️. . #bollywood #mom #keepingitreal #weightlosstransformation #fattofit #pilates #postpregnancy #yoga #bodytransformation #fitness #fitnessmotivation #weightlossjourney #pregnancy #fitness A post shared by Sameera Reddy (@reddysameera) on Apr 30, 2019 at 12:41am PDT ఈ సందర్భంగా తన ఫిట్నేస్ ట్రైనర్లకు ధన్యవాదాలు తెలిపారు సమీరా. 2014లో అక్షయ్ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు సమీరా. ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. -
ఎప్పుడూ గ్లామరస్‌గా ఉండలేం
‘‘సినిమా స్టార్స్ చాలా స్పెషల్. వారి లైఫ్‌స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటుంటారు. అలా ఉండటానికి మాకు (యాక్టర్స్‌కు) చాలా ప్రెషర్ ఉంటుంది. యాక్టర్‌గా నేను కూడా స్పెషల్‌గా ఉండటానికే ప్రయత్నించాను. కానీ ప్రెగ్నెన్సీ నా ఆలోచనా ధోరణిని మార్చేసింది’’ అంటున్నారు సమీరా రెడ్డి. 2014లో బిజినెస్‌మేన్ అక్షయ్ వార్దేను వివాహం చేసుకుని సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారామె. 2015లో ఓ బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. యాక్టర్ నుంచి మదర్‌గా మారడం, ప్రెగ్నెన్సీ గురించి సమీర మాట్లాడుతూ – ‘‘పెళ్లి అయిన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయ్యాను. డెలివరీ అయ్యాక సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాను. కానీ వ్యతిరేకంగా జరిగింది. గర్భవతిగా కొన్ని నెలలు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. అవార్డ్ ఫంక్షన్స్, గ్లామర్ లైఫ్ స్టైల్‌ని సునాయాసంగా హ్యాండిల్ చేసిన మనం ఈ ప్రెగ్నెన్సీ హ్యాండిల్ చేయలేకపోతున్నామా? అనే ఆలోచనలతో మానసికంగా కుంగిపోయాను. డెలివరీ అయ్యాక 102 కిలోల బరువున్నాను. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. ఆ టైమ్‌లో బయటకు వస్తే ‘సమీరా అలా మారిపోయిందేంటి?’ అనే మాటలకు బాగా డిస్ట్రబ్ అయిపోయాను. థెరపీ ద్వారా నార్మల్ అవ్వగలిగాను. ప్రతీసారి గ్లామరస్‌గా ఉండలేమని తెలుసుకున్నా’’ అన్నారు. -
ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం
‘మీరు బాగుండరు. మీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి. తాప్సీని సూటిగా అడిగాడో నెటిజన్.‘ప్యాంట్ వేసుకోవడం మరచిపోయావా’ రకుల్ ప్రీత్‌సింగ్‌ని కామెంట్ చేశాడో ఆకతాయి.‘గ్లామరస్ రోల్స్‌కి నువ్వు సూట్ కావు’ లావణ్యా త్రిపాఠీని హేళన చేశాడో వ్యక్తి...సోషల్ మీడియాలో సినిమా స్టార్స్‌ని ఉద్దేశించి ఇలా నెగటివ్ పోస్టులు పెట్టడానికి చాలామంది రెడీ అయిపోతుంటారు. వాటికి తారలు దీటైన సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా సమీరా రెడ్డి, రేణూ దేశాయ్, రష్మీ గౌతమ్‌లు తమపై విసిరిన విమర్శలకు‘ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం’ అంటూ ఘాటుగా సమాధానాలు విసిరారు. అవేంటోతెలుసుకుందాం. ఏది పడితే అది అనొచ్చా? ‘‘నేను ఒక రైతు కొడుకుని. రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మీరందరూ (యాక్టర్స్‌ను ఉద్దేశిస్తూ) రైతుల కోసం ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. కొన్ని డబ్బుల కోసం మేకప్ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేస్తున్నారు’’ అంటూ ఓ అసభ్య పదజాలంతో ఒక నెటిజన్ చేసిన కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ పోస్ట్ పై ఆమె ఇలా స్పందించారు. ఈ పోస్ట్ కచ్చితంగా చదువుతారని అనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ‘ఎఫ్’ (నెటిజన్ వాడిన అసభ్య పదజాలం) అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఓ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం... ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. ఏంటి ఇది? అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు. దూషించొచ్చు. వాటిని ఆ సెలబ్రిటీ భరించాలి. ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదా? ప్రతి రోజు మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ, ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా? పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా? అనేది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలను ఎంత వరకు బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాను అన్నది ముఖ్యం. ఏదో ఒక రోజు ఈ ఊరు పేరు బయట పెట్టకుండా ఈ ట్రోల్స్ చేసేవారంతా తప్పు తెలుసుకుని, వారి శక్తి సామర్థ్యాలను ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం కాకుండా ఏదైనా మంచి పనికోసం వాడితే మంచిది. ఆలోచనా ధోరణి మారాలి ఇటీవల సమీరా రెడ్డి రెండోసారి ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలియజేస్తూ తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలామంది ఆమెకు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కొందరు విమర్శించారు ‘‘సమీరా.. బాగా లావైపోయావు. బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ కూడా కరీనా కపూర్ ఇంకా బాగానే ఉంది’’ అన్నది ఆ విమర్శల సారాంశం. అంటే.. మొదటి బిడ్డ పుట్టాక సమీరా బరువు తగ్గకుండా అలానే ఉందన్నది వారి ఉద్దేశం కావొచ్చు. ఈ విషయం గురించి సమీరా స్పందించారు. ‘‘ఒకరికి జన్మనిచ్చిన తర్వాత కూడా కరీనా కపూర్‌లా హాట్‌గా ఉండేవారు ఉన్నారు. జన్మనిచ్చిన తర్వాత శరీరాకృతిని మామూలుగా మార్చుకోవడానికి సమయం తీసుకునే నాలాంటి వారు ఉన్నారు. నువ్వు (కామెంట్ చేసినవారిని ఉద్దేశించి) పుట్టినప్పుడు కూడా మీ అమ్మ హాట్‌గా ఉందా? అని అడగాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఒక అందమైన అనుభూతి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు తగ్గడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. రెండో డెలివరీ తర్వాత నా శరీరాకృతి మారడానికి మరింత టైమ్ పట్టొచ్చు. అంతమాత్రాన విమర్శిండమేనా? చేస్తున్న పని సరైనదేనా? అనిట్రోల్స్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీకు ఏం కావాలి? ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వగల సూపర్ పవర్ నా దగ్గర ఉంది. తొలిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా సిగ్గుగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా ఆలోచనలు నా మైండ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కవర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా చేయడం లేదు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా హాట్‌గానే ఉన్నాను. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. మన ఆలోచనాధోరణి, ఒక విషయాన్ని నెగటివ్‌గా చూసే దృష్టి కోణం మారాలి. ఆ ప్రయత్నాన్ని మానుకో! పీఆర్ మేనేజ్మెంట్ ట్వీటర్ యూజర్‌నేమ్‌తో నటి, యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఒక ఆకతాయి ట్రోల్ చేశాడు. ‘‘మీతో ఓ యాడ్ ప్లాన్ చేశాం. మీ నాన్నగారి నంబర్ మిస్సయ్యాను. ఇస్తారా?’’ అని ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీన్ని రష్మీ గౌతమ్ ట్యాగ్ చేస్తూ– ‘‘నా 12ఏళ్ల వయసులో మా నాన్నగారు మరణించారు. మా నాన్నగారి నంబర్ నీ దగ్గర ఉండదు. పీఆర్ మేనేజ్మెంట్ అనే పేరుతో నన్ను ఫూల్‌ని చేయాలనుకునే నీ ప్రయత్నాన్ని ముందు మానుకో. అమ్మాయిలను ఇబ్బందిపెట్టడానికి ఇదొక కొత్తదారిలా అనిపిస్తోంది. మీలాంటి వారు ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రష్మి తండ్రి నంబర్‌ను అడిగిన ట్వీట్‌ను సదరు నెటిజన్ ఆ తర్వాత డిలీట్ చేశారు. నెటిజన్లు ట్రోల్ చేసినప్పుడు సైలెంట్‌గా ఉండకుండా ఇలా ధైర్యంగా దీటైన బదులు చెప్పారు అంటూ కొందరు నెటిజన్లు అభినందించారు. -
‘అప్పుడు కూడా మీ అమ్మ అందంగానే ఉందా’
అందరూ కరీనా కపూర్‌లా అందంగా ఉండలేరు కదా అంటూ తనను కామెంట్ చేస్తున్న నెటిజన్లపై మండిపడుతున్నారు హీరోయిన్ సమీరా రెడ్డి. తెలుగులో ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సమీరా 2014లో అక్షయ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి ఒక కుమారుడు.. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు సమీరా. ఈ సందర్భంగా తన మొదటి కుమారుడితో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే.. సమీర మునుపటిలా లేరని, చాలా లావైపోయి అందవిహీనంగా కనిపిస్తున్నారంటూ చెత్త కామెంట్లు చేస్తున్నారు ట్రోలర్స్. దాంతో ‘మీకు జన్మనిచ్చిన తర్వాత కూడా మీ అమ్మ హాట్‌గానే ఉందా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పి కామెంట్లు చేసేవారి నోరు మూయించారు సమీరా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కరీనా కపూర్ లాంటి వారు వివాహమై, పిల్లల్ని కన్న తర్వాత కూడా చాలా అందంగా మెరిసిపోతుంటారు. నాలాంటి వారు మాత్రం సన్నబడటానికి కాస్త సమయం తీసుకుంటారు. అందరూ కరీనాలా ఉండాలనిలేదు కదా..? ఆడవాళ్లను బాడీషేమింగ్ (శరీరాకృతి గురించి కామెంట్లు చేయడం) చేయడం సిగ్గుచేటు. నన్ను ట్రోల్ చేస్తున్నవారిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు పుట్టిన తర్వాత కూడా మీ అమ్మ హాట్‌గానే ఉందా? ఇలాంటి కామెంట్లు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి’ అంటూ ఘాటుగా స్పందించారు సమీరా. అంతేకాక ‘ప్రెగ్నెన్సీ అనేది చాలా సహజమైన ప్రక్రియ. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తల్లికాక తప్పదు. అమ్మ అని పిలిపించుకోవడం ఎంతో అందమైన అనుభూతి. నాకు కొడుకు పుట్టాక బరువు తగ్గడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు నేను మళ్లీ తల్లిని కాబోతున్నాను. కాబట్టి లావు తగ్గడానికి మరింత సమయం పట్టొచ్చు. కానీ మన శరీరం ఎలా ఉన్నా దానిని స్వీకరించడం ఎంతో అవసరం. నన్ను కామెంట్ చేస్తున్నవారందరికి ఒకటే చెప్తున్నాను.. మీరు కేవలం నాన్సెన్స్ మాత్రమే చేయగలరు కానీ నాకు చాలా శక్తి ఉంది. నేను ఓ బిడ్డకు జన్మనివ్వగలను’ అంటూ కామెంట్లు చేసేవారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు సమీరా. -
సగం దూరం వచ్చేశాం!
‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ సినిమాలతో తెలుగులో పాపులర్ అయ్యారు బాలీవుడ్ భామ సమీరా రెడ్డి. చివరిగా 2012లో ‘కృష్ణం వందే జగద్గురమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించారామె. 2014లో బిజినెస్‌మ్యాన్ అక్షయ్ వార్దేను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో ఓ బాబుకి జన్మనిచ్చారు సమీరా రెడ్డి. పేరు హన్స్ వార్దే జన్మించారు. ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ, సరదా క్యాప్షన్స్ ఇస్తుంటారు సమీరా. ‘‘దయగల హృదయం, ధైర్యం కలిగించే స్ఫూర్తి, వ్యూహాత్మక మెదడు ఉండాలంటూ నా బేబీకి మేసేజ్ పంపుతున్నాను’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ చేశారు. మరో ఫొటోకు ‘సగం దూరం వచ్చేశాం. కొన్ని రోజుల్లో మనం కలుసుకోబోతున్నాం’ అని పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. -
ఆరు నుంచి ఆరు
హీరో సూర్య, దర్శకుడు హరిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ ఆల్రెడీ ‘ఆరు, వేల్ (తెలుగులో ‘దేవా’) ‘సింగం’ సిరీస్‌లో మూడు సినిమాలు.. ఇప్పటివరకూ మొత్తంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ‘ఆరు’ సినిమాతో కలసిన ఈ కాంబినేషన్ ఆరో సినిమా కోసం చేతులు కలపబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ నిర్మించనుందట. అయితే సూర్య, హరి చేయబోయే చిత్రం ‘సింగం’ సిరీస్ సీక్వెల్ కోసం కాదు. ‘వేల్’ సీక్వెల్ అని చెన్నై టాక్. మరోవైపు సీక్వెల్ కాదు.. ‘వేల్’ సినిమా తరహాలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందనే వార్త వినిపిస్తోంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియా ఆనంద్, సమీరా రెడ్డి యాక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ‘యన్‌జీకే’, కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పుకున్నారు సూర్య. దాంతో పాటుగా హరి చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారని ఊహించవచ్చు. -
ఈమె ఎవరో గుర్తు ఉన్నారా?
న్యూఢిల్లీ : నటి సమీరా రెడ్డి గుర్తు ఉన్నారా? టాలీవుడ్లో ఎన్టీఆర్‌తో అశోక్, బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్‌తో రేస్ సినిమాలు తీసిన ఈమె, చాలా కాలానికి మళ్లీ అభిమానులకు కనిపించింది. అయితే సినిమాల్లో కాదండి.. సోషల్ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలతో. ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె వార్తల్లో కనిపించడం చాలా అరుదుగా మారారు. తాజాగా తన కొడుకు రేపు మూడో ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘నీతో ఇది నా మొదటి రోజు. రేపు నీవు మూడో ఏడాదిలోకి ప్రవేశించబోతున్నావు. నా ప్రపంచంలోకి వచ్చిన నీకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో సమీరా ఈ ఫోటోలను పోస్టు చేశారు. ఈ పోస్టులకు నటి సమితా శెట్టి వావ్ అని కామెంట్ పెట్టారు. అభిమానులు సైతం ఆ క్యూట్ ఫోటోలకు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. 2014లో అక్షయ్ వార్దేను ఆమె పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. తన జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్టు అప్పుడే సమీరా రెడ్డి ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం సమీరా రెడ్డి, సోనాలి బింద్రే బాద్రాలో కలుసుకున్నట్టు తెలిసింది. -
అమ్మ అయిన ఆనందంలో..!
పసిపిల్లల కువా.. కువా.. శబ్దం వింటే ఎవరికైనా సరే ఒళ్లంతా పులకరించిపోతుంది. ఇక, కడుపున పుట్టిన బిడ్డ కువకువలైతే ఇంకా పసందుగా ఉంటాయి. ప్రస్తుతం సమీరారెడ్డి అలాంటి అనుభూతినే ఆస్వాదిస్తున్నారు. ఈ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారామె. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను గత ఏడాది ఆమె పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు సమీర దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు తల్లి కూడా అయ్యారు కాబట్టి, ఇక సినిమాల గురించి ఇప్పట్లో ఆలోచించరనే చెప్పాలి. -
అవును.. తల్లిని కాబోతున్నా!
దక్షిణ, ఉత్తరాది భాషల్లో కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన సమీరారెడ్డి ఈ ఏడాది జనవరిలో అక్షయ్ వార్దేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్ పెద్ద వ్యాపారవేత్త. ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న సమీర వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలకు స్పందిస్తూ.. ‘‘అవును.. నేను తల్లిని కాబోతున్న మాట నిజమే. వచ్చే ఏడాది మే ప్రథమార్ధంలో డెలివరీ డేట్ ఇచ్చారు. మా కుటుంబంలోకి రాబోతున్న బేబీ కోసం నేను, అక్షయ్ ఆశగా ఎదురు చూస్తున్నాం. తల్లి కాబోయే అమ్మాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నా’’ అని సమీర పేర్కొన్నారు. అక్షయ్‌తో తన ప్రేమాయణం మొదలైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘నాకు మోటార్ బైక్స్ అంటే ఇష్టం. అక్షయ్ చేస్తున్నది మోటార్ బైక్స్ వ్యాపారమే. ఒకసారి నేను మోటార్ బైక్ నడపడం చూసి, ఇంప్రెస్ అయ్యాడు. అప్పుడే మా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సినీ రంగానికి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నా కల నేరవేరింది’’ అని సమీర చెప్పారు. -
హడావుడి పెళ్లెందుకంటే..
అంత హడావుడిగా పెళ్లెందుకు చేసుకోవలసి వచ్చిం దంటే అన్న ప్రశ్నకు నటి సమీరారెడ్డి బదులిచ్చారు. తమిళంలో వారణం ఆయిరం, నడునిశి నాయగన వెడి, వేట్టై చిత్రాల్లో నటించిన ఈ బెంగళూరు బ్యూటీ ఇంతకుముందు టాలీవుడ్లో నరసింహ, అశోక్ తదితర చిత్రాల్లో నటించారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల మోటార్‌బైక్ వ్యాపారవేత్త అక్షయ్ వర్దేవ్ను వివాహమాడారు. వీరి వివాహం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిగింది. సినీ ప్రముఖులెవరూ హాజరు కాలేదు. దీనిపై సమీరారెడ్డి వివరణ ఇచ్చారు. నిజానికి తాము ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నామన్నారు. అయితే తన చెల్లెలు మేగ్నా అక్షయ్ విదేశాల నుంచి వచ్చారు. వారిప్పుడు వెళ్లిపోతే ఏప్రిల్‌లో మళ్లీ రాలేమని చెప్పారు. దీంతో వాళ్లు ఉండగానే మేము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వారి కోసమే ఇంత హడావుడిగా ఈ నెల 21నే వివాహం చేసుకున్నట్లు చెప్పారు. తాను సినిమా రంగంలో 11 ఏళ్లు కొనసాగానన్నారు. చాలా రకాల మేకప్‌లు వేసుకున్నానని అందువలనే తన పెళ్లిలో నిరాడంబరంగా ఉండాలని ఎలాంటి మెరుగులు దిద్దుకోకుండా చీర ధరించి పెళ్లి పీట లెక్కానన్నారు. తమ హనీమూన్ మార్చిలో ఉంటుందని తెలిపారు. అదే విధంగా హనీమూన్ స్పాట్‌కు మోటార్ బైక్‌పైనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమీరారెడ్డి చెప్పారు. -
నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి
కథానాయిక సమీరారెడ్డి వివాహం మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో అతి గోప్యంగా జరిగింది. మోటార్ బైక్స్ తయారుచేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అక్షయ్ వర్ధేతో సమీరారెడ్డికి గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. చాలా తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిజానికి ఫిబ్రవరిలో ఈ వేడుక జరగాలి. కానీ ఒక నెల ముందే ఈ పెళ్లి తంతును ముగించడం గమనార్హం! -
సమీరా అక్షయ్ వర్దేలను కలిపిన మోటార్ బైక్
-
సీక్రెట్ గా సమీరారెడ్డి వివాహం!
దక్షిణాదితోపాటు బాలీవుడ్ సినీ ప్రేక్షకులను తన అభినయంతో ఆలరించిన సమీరా రెడ్డి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది. తన వివాహారాన్ని మీడియాకు తెలియకుండా చాలా సీక్రెట్ జాగ్రత్త పడింది. ముంబైలోని బాంద్రాలో ఈ సాయంత్రం (జనవరి 21) వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహమాడనున్నారు. మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దే తో సమీరా డేటింగ్ చేస్తోంది. సమీరా, అక్షయ్ ల నిశ్చితార్ధం డిసెంబర్ లో జరిగింది. వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది. ఈ వీరిద్దరరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది. ప్రైవేట్ వ్యవహారంగా జరిగే ఈ వివాహ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, బంధువులు హాజరుకానున్నారు. ఈవివాహం కార్యక్రమాన్ని అధికారిక ప్రకటించకపోవడంతో వివరాలను సేకరించడానికి సమీరా అందుబాటులోకి రాలేదు. అయితే సమీరా వివాహ వార్తను తల్లి నక్షత్రరెడ్డి ధృవీకరించారు. కాని పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. సమీరా, అక్షయ్ పెళ్లి దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లూలా డిజైన్ చేశారు. -
ముంబైలో 'రెడ్ కార్పెట్' ఈవెంట్
-
బాలయ్యతో సై అంటున్న సమీరా
తెలుగు అమ్మాయి సమీరా రెడ్డికి కూడా చాలాకాలంగా ఛాన్స్‌లు కరువయ్యాయి. దీంతో క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో దగ్గుబాటి రానా సరసన సమీరా అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. ఇపుడు తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా వస్తున్న లేజండ్ సినిమాలో మరోసారి ఐటమ్ సాంగ్‌లో మెరవడానికి రెడీ అవుతుంది. అయితే హీరోయిన్....లేదంటే కనీసం ఐటమ్బాంబ్. ఇదీ నయాట్రెండ్. హీరోయిన్లుగా పరిచయమైన భామలు ఛాన్స్‌లు లేకపోతే స్పెషల్ సాంగ్స్ చేసుకుని టైమ్‌పాస్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయాలంటే పెద్ద గగనంగా ఉండేది. ఇపుడు ట్రెండ్ మారింది. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు సినిమాలో మసాలా ఐటమ్ సాంగ్ తప్పనిసరి. ఇలాంటి ప్రత్యేక గీతం లేని సినిమా ప్రస్తుతం ఉండడం లేదు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్ చేసి మాస్ మసాలాతో అందాల ఆరబోస్తే రిపీటెడ్ ప్రేక్షకులను రప్పించవచ్చేనేది సక్సెస్ మంత్రగా మారింది. అందుకే హీరోయిన్లు అడపాదడపా ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిపోతున్నారు. అప్పట్లో కొంతమంది డైరెక్టర్లు మాత్రమే ఈ స్పెషల్ సాంగ్స్‌ను వాడే వారు. హీరోయిన్లుగా పరిచయం అయ్యి రెండు మూడు సినిమాల తర్వాత ఛాన్స్‌లు తక్కువైతే ఐటమ్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ భామలు. గతంలో కొమరం పులితో హీరోయిన్గా పరిచయమైన నికిషాపటేల్కు పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా కాలం గ్యాప్ వచ్చింది. దీంతో తమిళంలో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయింది. మరో హీరోయిన్ శృతీహాసన్ ఈ పాటకు గాత్రం అందించింది. శ్రియ కూడా ఐటం సాంగ్స్‌లో నర్తించిన విషయం తెలిసిందే.