సీక్రెట్ గా సమీరారెడ్డి వివాహం! | Sameera Reddy's secret wedding with Akshai Varde today | Sakshi
Sakshi News home page

సీక్రెట్ గా సమీరారెడ్డి వివాహం!

Published Tue, Jan 21 2014 4:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

సీక్రెట్ గా సమీరారెడ్డి వివాహం!

సీక్రెట్ గా సమీరారెడ్డి వివాహం!

దక్షిణాదితోపాటు బాలీవుడ్ సినీ ప్రేక్షకులను తన అభినయంతో ఆలరించిన సమీరా రెడ్డి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది. తన వివాహారాన్ని మీడియాకు తెలియకుండా చాలా సీక్రెట్ జాగ్రత్త పడింది. ముంబైలోని బాంద్రాలో ఈ సాయంత్రం (జనవరి 21) వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహమాడనున్నారు. మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దే తో సమీరా డేటింగ్ చేస్తోంది. సమీరా, అక్షయ్ ల నిశ్చితార్ధం డిసెంబర్ లో జరిగింది. 
 
వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది.   ఈ వీరిద్దరరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది. 
 
ప్రైవేట్ వ్యవహారంగా జరిగే ఈ వివాహ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, బంధువులు హాజరుకానున్నారు. ఈవివాహం కార్యక్రమాన్ని అధికారిక ప్రకటించకపోవడంతో వివరాలను సేకరించడానికి సమీరా అందుబాటులోకి రాలేదు. అయితే సమీరా వివాహ వార్తను తల్లి నక్షత్రరెడ్డి ధృవీకరించారు. కాని పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.  సమీరా, అక్షయ్ పెళ్లి దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లూలా డిజైన్ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement