
సాధారణంగా మహిళలు పెళ్లి , పిల్లలు తరువాత చాలా బాధ్యతల్లో మునిగిపోతారు. పిల్లల పెంపకంలో సెలబ్రిటీలైనా, సినీ తారలైనా అమ్మలకు ఈ బాధ్యత తప్పదు. ఈ క్రమంలో తమ ఉద్యోగాల్ని, తన అభిరుచుల్ని ఆంక్షాల్ని కూడా పక్కన పెట్టి మరీ పిల్లల పెంపకంలో మునిగి పోతారు. వాళ్లు కాస్త పెద్దవాళ్లయిన తరువాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం, మరికొంతమంది స్నేహితులతో హాలిడే ట్రిప్‌లు, తమ కలలకు పదును పెట్టడం లాంటివి చేస్తారు.
సినీ నటి సమీరా రెడ్డి పిల్లలు, గిల్లలు ఇలాంటి బాదర బందీ ఏ మాత్రం లేకుండా మరింత గ్రాండ్‌గా సోలో ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "మీరు పిల్లలు లేకుండా సోలో హాలిడే ఎంజాయ్ చేశారా? నా మొదటి అనుభవం’’ అంటూ గ్రీస్‌లో గడిపిన మెమరబుల్ ఫోటోలను షేర్ చేసింది. దీంటో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment