holiday trip
-
ఆధ్యాత్మిక పర్యాటకం.. ఆనందమయం
ప్రపంచం ఆధ్యాత్మికతను స్మరిస్తోంది. మానసిక చింతన, ప్రశాంత జీవనం కోసం వెతుకుతోంది. హాలిడే ట్రిప్పుల్లోని సంతోషాన్ని ఆధ్యాత్మిక పరవశ పర్యటనలుగా మారుస్తోంది. ఈ క్రమంలోనే 2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378.22 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 2,260.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ‘ట్రావెల్ టూరిజం వరల్డ్’ నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనుంది. –సాక్షి, అమరావతి విశ్వాసమే నడిపిస్తోంది..ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వ్యక్తిగత సంపద పెరిగేకొద్దీ, ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పండుగలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత సాయంతో ముందుగా వర్చువల్ టూర్లు చేసిన తర్వాత పర్యటనలను ఖరారు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, భారతదేశం, ఇటలీ వంటి దేశాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని లోతైన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనుభవాలను కోరుకునే సందర్శకుల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆధ్యాత్మిక అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చే ప్రత్యేక పర్యటనలను అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలకు అవకాశాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆనందం..ఆధ్యాత్మిక పర్యటనలు శారీరక–మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజంగా మారుతోంది. ధ్యానం, యోగాపై దృష్టి సారించే విహార యాత్రలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తున్నాయి. యూఎస్, కెనడా వంటి దేశాల్లో స్థానిక ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (క్యాథలిక్ చర్చి)కు తాకిడి పెరుగుతోంది. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు యూరోపియన్ నాగరికతను అన్వేíÙంచడానికి మైలురాళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా–పసిఫిక్‌లో అయితే భారతదేశంలో దేవాలయాలు, పీఠాలు, చర్చిలు, మసీదులను దర్శించుకునే వారు పెరుగుతున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, చైనా–జపాన్ దేశాల్లో బౌద్ధారామాలు వంటి పవిత్ర స్థలాలను లక్షలాది మంది సందర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యం–ఆఫ్రికాలో అయితే సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, జెరూసలేం తీర్థయాత్రలు ఎక్కువ ఉంటాయి. -
పిల్లల్లేకుండా, సోలోగా హాలిడే ట్రిప్, తొలి అనుభవం : నటి ఫోటోలు వైరల్
సాధారణంగా మహిళలు పెళ్లి , పిల్లలు తరువాత చాలా బాధ్యతల్లో మునిగిపోతారు. పిల్లల పెంపకంలో సెలబ్రిటీలైనా, సినీ తారలైనా అమ్మలకు ఈ బాధ్యత తప్పదు. ఈ క్రమంలో తమ ఉద్యోగాల్ని, తన అభిరుచుల్ని ఆంక్షాల్ని కూడా పక్కన పెట్టి మరీ పిల్లల పెంపకంలో మునిగి పోతారు. వాళ్లు కాస్త పెద్దవాళ్లయిన తరువాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం, మరికొంతమంది స్నేహితులతో హాలిడే ట్రిప్‌లు, తమ కలలకు పదును పెట్టడం లాంటివి చేస్తారు. సినీ నటి సమీరా రెడ్డి పిల్లలు, గిల్లలు ఇలాంటి బాదర బందీ ఏ మాత్రం లేకుండా మరింత గ్రాండ్‌గా సోలో ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "మీరు పిల్లలు లేకుండా సోలో హాలిడే ఎంజాయ్ చేశారా? నా మొదటి అనుభవం’’ అంటూ గ్రీస్‌లో గడిపిన మెమరబుల్ ఫోటోలను షేర్ చేసింది. దీంటో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
త్వరలోనే మళ్లీ కలుస్తా.. మెగాస్టార్ పోస్ట్ వైరల్!
భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా కోసమే మెగాస్టార్ తీవ్రమైన కసరత్తులు చేశారు. జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది. అయితే ఇవాళ వాలెంటైన్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అంతే కాకుండా తన భార్య సురేఖతో కలిసి హాలిడే ట్రిప్‌కు యూఎస్ఏ వెళ్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ త్వరలోనే విశ్వంభర షూట్లో కలుస్తానంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చిరు దంపతులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !! pic.twitter.com/zAAZVHjjFG — Chiranjeevi Konidela (@KChiruTweets) February 14, 2024 -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
విదేశాలకు ప్రభాస్.. సర్జరీ కోసమేనా!
ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన సలార్ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. మరోవైపు ప్రాజెక్ట్ కే(కల్కీ 2898 ఏడీ) షూటింగ్ పనులు చకచకగా జరుగుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా సెట్‌పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్లో కూడా ప్రభాస్ పాల్గొన్నాడు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేశాడు. ఈ మధ్యే ఓ భారీ ఫైట్ సీన్ షూటింగ్లో పాల్గొన్నారట. (చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..) లాంగ్ ట్రిప్ సలార్ వాయిదా పడడంతో ప్రభాస్ విదేశీ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. సలార్ వాయిదా విషయం ఈ రోజు అధికారికంగా ప్రకటించారు కానీ చిత్ర యూనిట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. ఈ విషయం ప్రభాస్‌కు కూడా తెలుసు. అందుకే ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాల షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లాడట. అందుకే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాడట. దాదాపు 15 రోజుల తర్వాత తిగిరి హైదరాబాద్‌కు వస్తాడట. ఈ లోపు ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాల్లో హీరో అవసరం లేని సన్నివేశాల షూటింగ్స్ జరుపుకుంటారట. ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి రాగానే ఆయనకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌ని ప్లాన్ చేస్తారట. సర్జరీ కోసమే! ప్రభాస్ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలుసు కానీ..ఏ దేశం వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు అనేది మాత్రం ఎవరూ రివీల్ చేయడం లేదు. కానీ సర్జరీ కోసమే ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో ప్రభాస్‌కు మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటివరకు తగ్గలేదు. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని టాక్. సర్జరీ అనంతరం విదేశాల్లోనే రెండు వారాల పాటు ఉండి విశ్రాంతి తీసుకుంటారట. ఆ తర్వాత భారత్‌కి తిగిరి వచ్చి షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో పాల్గొంటారట. -
మాల్దీవులకు హాయ్
వరుస షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన హీరో రజనీకాంత్ హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లారు. చెన్నై నుంచి మాల్దీవుల రాజధాని మాలె వరకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో రజనీ ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫ్లవర్ బొకేతో నవ్వుతూ కనిపించిన రజనీ కాంత్, మరో ఫొటోలో బ్యాగ్ పట్టుకుని, కళ్ల జోడు పెట్టుకుని స్టైలిష్‌గా ఉన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాలో తన ΄ాత్ర (మొయిద్దీన్ భాయ్) షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఇప్పుడు కొంచెం విరామం దొరకడంతో రిఫ్రెష్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లారు రజనీకాంత్. కాగా ఆయన నటించిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. -
ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. అయితే వెస్టిండీస్‌తో జూలైలో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే విండీస్ టూర్లో అతను చేసే ప్రదర్శన ఆధారంగా రోహిత్ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది. కానీ రోహిత్ శర్మ మాత్రం అభిమానుల ట్రోల్స్, మీమ్స్ పట్టించుకోకుండా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. గత ఐదు నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడిన రోహిత్.. విండీస్‌తో సిరీస్ ప్రారంభమయ్యేలోపూ వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా భార్య రితికా.. కూతురు సమైరాతో కలిసి దిగిన ఫోటోను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అయితే ఫోటో మాత్రమే షేర్ చేసిన రోహిత్ ఎలాంటి క్యాప్షన్ జత చేయలేదు. ఇక రోహిత్ షేర్చేసిన ఫోటోపై శిఖర్ ధావన్ సహా రిషబ్ పంత్ స్పందించారు. ఎంజాయ్ మూడ్‌లో రోహిత్ భయ్యా అంటూ కామెంట్ చేశారు. పంత్ గర్ల్‌ఫ్రెండ్ ఇషా నేగి, యజ్వేంద్ర చహల్.. అతని భార్య ధనశ్రీ వర్మ సహా మరికొందరు రోహిత్ షేర్ చేసిన ఫోటోకు లైకులు, హార్ట్ ఎమోజీలు పెట్టారు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) చదవండి: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసిన సూపర్‌స్టార్!
ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, జర్మనీకి హాలిడే ట్రిప్‌కు వెళ్లొచ్చారు మహేశ్‌బాబు. తాజాగా మరో హాలిడే ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నట్లున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, సితారలతో కలిసి మహేశ్‌బాబు శుక్రవారం విదేశాలకు పయనమయ్యారు. హ్యాపీగా.. జాలీగా యూరప్ వెళ్లారని తెలిసింది. కాగా ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేశ్‌బాబు మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెలాఖర్లో ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడటంతో మహేశ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: ఖాళీలున్నాయా బాస్ అంటున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వడం వైరల్‌గా మారింది. సిడ్నీకి చెందిన మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. మొత్తం ఉద్యోగులందరినీ చాలా ఖరీదైన ట్రిప్‌కు తీసుకెళ్లింది. అందులోనూ ఉద్యోగులలో ఒకరి 24వ పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించింది. దీంతో కంపెనీ ఎండీ కాట్యా వకులెంకో, "వరల్డ్స్ బెస్ట్ బాస్" అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు సూప్ ఏజెన్సీ మూడో పుట్టినరోజును జరుపుకుంటోంది. తొందర్లోనే మరో యూరప్‌కు ట్రిప్‌ను ప్లాన్ చేస్తోందట కంపెనీ. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) ఈ సంవత్సరం మేలో జరిగిన ఈ ట్రిప్పై నెటిజన్లులు కామెంట్ల వర్షం కురిపించారు. "లక్కీ ఉద్యోగులు...మనకు అదంతా కలే " అని ఒక యూజర్ వాపోయాడు. నాకు అలాంటి అద్భుతమైన ఏజెన్సీ, యజమానిని దొరికితేనా.. నా నా సామి రంగ అన్నట్టుగా మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఏమైనా వేకెన్సీలున్నాయా బాస్ అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం విశేషంగా నిలిచింది. ఇండొనేసియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాలికి తన ఉద్యోగులందర్నీ హాలీడే ట్రిప్‌నకు పంపించింది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సూప్ ఏజెన్సీ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 2 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చింది. అంతేకాదు విలాసవంతమైన హాలీడే ట్రిప్‌నకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. దీంతో ఉద్యోగులందరూ ఎగిరి గంతేసి మరీ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీలతో బాలికి చెక్కేశారు. జాగింగ్లు, డ్రింక్స్‌తో అంటూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జూన్ 9న కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బాలిలో ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సూప్ ఏజెన్సీ సిడ్నీలో ఇండిపెండెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇన్వెంటివ్, డేటా ఆధారిత ప్రచారాలకు అత్యుత్తమ ఫలితాలను సాధించిన కంపెనీగా పాపులర్ అయింది. కోవిడ్-19 సంక్షోభం సమయంలో ఉత్పాదకత ఎక్కువగానే ఉందని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుమి హో తెలిపారు. ఇది ఖచ్చితంగా జీవితంలో మరచిపోలేని అనుభవం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) -
భార్యతో విదేశాలకు చిరంజీవి టూర్.. నెల తర్వాత ఇంటికి..
చిరంజీవి బ్యాక్ టు హోమ్. గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. వెకేషన్లో ఫుల్‌గా రిలాక్స్ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారు. ‘గాడ్ ఫాదర్’లోని ఓ సాంగ్ సీక్వెన్స్, ‘బోళా శంకర్’ షూట్, ‘వాల్తేరు వీరయ్య’ ఫారిన్ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొంటారట. ఇక ఈ రెండు సినిమాలే కాక.. చిరంజీవి హీరోగా ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత ఆ సినిమా నా కంటే వెంకటేశ్ చేస్తేనే బాగుండేది : చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్
వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్ తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్ అమ్మ అండ్ డాడీ, ఐలవ్ యూ సో మచ్’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య’ అని ఉపాసన కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ మేకింగ్ లో భోళాశంకర్, మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ , బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి
Marathi Actress Ishwari Deshpande Dies In A Car Accident: ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లిన నటి ఈశ్వరి దేశ్ పాండే కారు ప్రమాదంలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరాఠీ నటి ఈశ్వరి ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలీడే ట్రిప్‌కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. చదవండి : Shilpa Shetty: జైలు నుంచి వచ్చిన భర్త.. శిల్పా ప్రయాణం ఎటువైపు? కారు సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంలో ఈశ్వరి(25)తో పాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పటి నుంచి నటిగా రాణించాలని కలలు కన్న ఈశ్వరి దేశ్ పాండే హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక శుభమ్‌తో ఈశ్వరికి చాన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరి స్నేహం ఇటీవలె ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి నిశ్చితార్థానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ట్రిప్‌కి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడం బంధువులను, స్నేహితులను షాక్‌కి గురిచేస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా' -
బ్లాక్ బికినీలో కాజల్ అగర్వాల్: స్టన్నింగ్ ఫోటోస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్బంగా స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్బికినీలో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి...స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరకుండా హాలీడే ఎలా పూర్తవతుందంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానుల లైక్‌ల సందడి జోరుగా సాగుతోంది. కాగా వివాహం అయిన తరువాత తొలిసారిగా హర్యాలీ తీజ్ వేడుకను జరుపుకుంది. దీనికి సంబంధించి అందమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఆరువావారాలు, రోజులు 16 గంటలు పనిచేసి అలసిపోయానని, భర్తతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లాలని ఉందంటూ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
భర్త కోసం బ్రేక్ తీసుకుంటానంటోన్న కాజల్!
Kajal Aggarwal: మూడు సినిమాలు.. ఆరు లొకేషన్స్ అన్నట్లు ఫుల్ బిజీగా సాగుతోంది కాజల్ అగర్వాల్ కెరీర్. గత ఏడాది వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ ఆ తర్వాత పెద్దగా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కేటాయించకుండానే ‘ఆచార్య’ సెట్స్‌లో జాయినైపోయారు. ఆ తర్వాత భర్త గౌతమ్‌తో కలిసి కాజల్ ఓ స్మాల్ వెకేషన్‌కు వెళ్లారు. అంతే.. మళ్లీ సినిమాలు, ప్రమోషన్స్‌తో బిజీ బిజీ. దీంతో పర్సనల్ లైఫ్‌కు కాస్త దూరవుతున్నట్లుగా ఫీల్ అవుతున్నారట. ‘గౌతమ్ కోసం ఓ చిన్న బ్రేక్ తీసుకోవాలని ఉంది’ అని పేర్కొన్నారు కాజల్. ఇప్పుడు ఆ బ్రేక్‌కి కాస్త టైమ్ దొరికిందట. ‘హే సినామిక, కరుంగాపియమ్,ఘోస్టీ’ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేశారు కాజల్. అలాగే ఆమె చేస్తున్న తాజా హిందీ చిత్రం ‘ఉమ’ కోల్‌కతా షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ ‘ఆచార్య’, నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనే ముందు హాలిడే బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. -
చిన్న బ్రేక్ తీసుకున్న అల్లుఅర్జున్
రెండు మూడు నెలలుగా ‘పుష్ప’ చిత్రీకరణలో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు అల్లు అర్జున్. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ పూర్తి చేయడానికే ఈ బిజీ. మారేడుమిల్లి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో హైదరాబాద్ షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఈలోపు అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఫ్యామిలీతో కలసి ఓ హాలిడే ప్లాన్ చేసుకున్నారు. వారం పాటు భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేయనున్నారాయన. ఈ హాలిడే పూర్తయ్యాక మళ్లీ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీ అవుతారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. -
ఇంత పెద్ద బ్రేక్ రాలేదు
‘‘అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అనుకొని బాధపడటం కంటే మన దగ్గరున్న వాటితో సంతృప్తిపడటం గొప్ప ఫిలాసఫీ. నేనదే చేస్తుంటాను. ఈ ఏడాది అందరికీ కష్టంగానే గడిచింది’’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది ఎలా సాగిందో చెబుతూ– ‘‘లాక్డౌన్ వల్ల మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం దొరికింది. మనల్ని మనం సమీక్షించుకొని మనకున్న వాటిని మరింత అభినందించాలని తెలుసుకున్నాను. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల మా అమ్మానాన్నతో ఎక్కువ రోజులు కలసి ఉండటం కుదర్లేదు. కెరీర్లో ఇంత పెద్ద బ్రేక్ ఎప్పుడూ రాలేదు. మేం విహారయాత్రకు వెళ్లి పదేళ్లు పైనే అయింది. ఈ బ్రేక్‌లో మాల్దీవులు వెళ్లాం. ఇది నా బెస్ట్ హాలిడే’’ అన్నారు. -
ఉన్నది ఒక్కటే జీవితం.. ఆస్వాదించాలి
‘సీరియల్ కిల్లర్’ అని విన్నాం కానీ ‘సీరియల్ చిల్లర్’ అని వినలేదే అనుకుంటున్నారా? అమలా పాల్ తనని తాను ఇలా అనుకుంటున్నారు. ‘ఉన్నది ఒక్కటే జీవితం. ఆస్వాదించాలి’ అంటుంటారు అమలా పాల్. అందుకే పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయిపోవడానికి అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్‌లు ప్లాన్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. కొన్నిసార్లు స్నేహితులతో కలసి ‘చిల్’ అవ్వడానికి ట్రిప్‌లు వెళుతుంటారు. ఇప్పుడు గోవాలో ఉన్నారు అమలా పాల్. ఫుల్‌గా రిలాక్స్ అవుతున్నారు. స్నేహితులతో కలసి చిల్ అవుతున్నారు. గోవాలో చిల్ అవుతున్న ఫొటోలను షేర్ చేసి, ‘మా హౌస్‌లో నేనే సీరియల్ చిల్లర్ని’ అని క్యాప్షన్ చేశారు. ఇలా వీలు కుదిరినప్పుడల్లా చిల్ అవ్వడానికి ఎక్కడో చోటకు వెళుతుంటారు కాబట్టే తనని తాను ‘సీరియల్ చిల్లర్’ అని ఉంటారామె. -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
జెట్ సెట్ గో
బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలసి మహేశ్‌బాబు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసేస్తారు. లాక్డౌన్ వల్ల షూటింగ్స్ నుంచి లాంగ్ బ్రేక్ వచ్చినా ప్రయాణాలు చేయలేకపోయారు. జర్నీలు కూడా రద్దయ్యాయి కదా. ఇప్పుడు ప్రయాణాలకు కూడా అనుమతి ఉండటంతో కుటుంబంతో కలసి మహేశ్ విదేశీ ట్రిప్ ప్లాన్ చేశారు. ‘‘కొత్త విధానానికి అలవాటుపడుతున్నాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుని, ఫ్లయిట్ జర్నీకి రెడీ అయ్యాం. జీవితం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. జెట్ సెట్ గో’’ అంటూ కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు మహేశ్‌బాబు. ఎక్కడికి వెళుతున్నదీ బయటపెట్టలేదు కానీ, ఇది పది రోజుల ట్రిప్ అని తెలిసింది. -
చిన్న బ్రేక్
ఒక సినిమా చేసేటప్పుడు వర్క్ మూడ్‌లో ఉండే మహేశ్‌బాబు అది పూర్తి కాగానే హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ మూడ్‌లోనే ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఆ వెంటనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశారు మహేశ్. దాంతో రిలీఫ్ అయిపోయారు. ఫ్యామిలీతో చిన్న హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారని సమాచారం. జస్ట్ వారం రోజులు ఫ్యామిలీతో రిలాక్స్ అయి, ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోతారు. మహేశ్‌బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక జరగనుంది. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
మాల్దీవుల్లో మజా
హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు కాజల్ అగర్వాల్. ఖాళీ లేని కాల్షీట్లు. షూటింగ్స్ కోసం జర్నీల నుంచి చిన్న హాలిడే తీసుకున్నారామె. ఈ లీవ్‌లో మాల్దీవుల్లో ఫ్యామిలీతో కలసి చిన్న వెకేషన్‌కు వెళ్లారు. సరదాగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ‘‘ఈ హాలిడే కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ప్రశాంతంగా గడపడానికి మాల్దీవులకు మించిన హాలిడే స్పాట్ ఏముంటుంది?’’ అని హాలిడేయింగ్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పంచుకున్నారు కాజల్ అగర్వాల్. -
స్మాల్ హాలిడే
షూటింగ్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు నాగచైతన్య, సమంత. హాలిడేను ఎంజాయ్ చేయడానికి సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్స్‌తో నాగచైతన్య బిజీగా ఉన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు సమంత. ఈ మధ్యలో దొరికిన చిన్న బ్రేక్‌ను హాలిడేగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో హాలిడేయింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు సమంత. -
ఫుల్ చార్జ్‌తో తిరిగొస్తా
మహేశ్‌బాబు ఈ దసరా పండక్కి కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ‘‘దసరాబ్రేక్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. ఫుల్ చార్జ్‌తో తిరిగి వస్తా’’ అన్నారు మహేశ్. శనివారం మహేశ్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారని సమాచారం.. పండగ సమయాల్లో మహేశ్ విహార యాత్రలకు వెళ్లడం ఇది మొదటిసారేం కాదు. ఎలాగూ పిల్లలు గౌతమ్, సితారలకు స్కూల్ సెలవులు ఇచ్చేశారు. వాళ్ల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారట. విదేశాల్లో ఫ్యామిలీతో సెలవుల పండగ చేసుకుని తిరిగొచ్చిన తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు మహేశ్. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో దాదాపు 70 శాతం సినిమా పూర్తయిందని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఓషన్ బేబీ
తీరిక లేని షెడ్యూల్స్‌తో బిజీగా ఉండే త్రిష సినిమాలను కాస్త పక్కన పెట్టి చిన్న బ్రేక్ తీసుకున్నారు. మాల్దీవుల్లోని సముద్ర తీరాలకు వాలిపోయి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తన ఆనందానికి గుర్తులుగా తీసుకున్న ఫొటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘మాల్దీవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నా. మేకప్ లేకుండానే నా ఫొటోలను షేర్ చేసున్నాను. ఓషన్ బేబీలా ఉండటం నాకు ఇష్టం’’ అని త్రిష అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. -
హాలిడే మోడ్
నిన్నమొన్నటి వరకు ఫుల్ వర్క్ మోడ్‌లో ఉన్న వరుణ్ తేజ్ హాలిడే మూడ్‌కు షిఫ్ట్ అయ్యారు. వెకేషన్ కోసం ఆమ్స్టర్డామ్ వెళ్లారు. ఈ హాలిడే మూడ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాల్మీకి’. ఇందులో డబ్స్మాష్ ఫేమ్ మృణాలిని రవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షెడ్యూల్లో కొన్ని నైట్ సీన్లను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో రెస్ట్ తీసుకోవడానికి నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కి వెళ్లారు వరుణ్. ఈ హాలీడే ట్రిప్ అయిపోగానే తిరిగి ‘వాల్మీకి’ సెట్లో జాయిన్ అవుతారు. ఈ సినిమా తమిళ హిట్ ‘జిగర్తండా’కు రీమేక్ అని టాక్. ఈ సినిమా కాకుండా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నారు. -
సీఎం విలాసవంతమైన విశ్రాంతి..రోజుకు..
సాక్షి బెంగళూరు : రాష్ట్రంలో భీకర కరువు నెలకొంది. రాష్ట్ర ప్రజానీకం తాగునీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టని సీఎం కుమారస్వామి మాత్రం సరదాగా గడిపేందుకు రిసార్ట్‌కు తరలి వెళుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శనివారం నుంచి రెండు రోజుల పాటు కుమారస్వామి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో మడికేరికి కొంచెం దూరంలో ఇబ్బని రాయల్ రిసార్ట్‌కు చేరుకున్నారు. ఈ రిసార్ట్‌లో కేవలం ఒక రోజుకి రూమ్ అద్దె రూ. 40 వేలు. ఇందులో కుమారస్వామి మొత్తం నాలుగు గదులు బుక్ చేసుకున్నారు. దీంతో రెండు రోజుల విశ్రాంతి కోసం దాదాపు రూ. 2 లక్షల మేర ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలాసవంతమైన విశ్రాంతి.. సీఎం కుమారస్వామి బస చేసే ఈ రిసార్ట్‌లో రూమ్‌లోపలే ప్రైవేట్ బార్, ప్రత్యేక స్విమ్మింగ్‌పూల్, ప్రత్యేక బాల్కనీ, మసాజ్ టబ్, ఓపెన్ షవర్, బోటింగ్ వంటి సకల సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోంటే సీఎం మాత్రం టెంపుల్ రన్, రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కుమారుడి గెలుపు, కుర్చీ కాపాడుకోవడమే సీఎంకు ముఖ్యమని రైతులు గోడు పట్టడం లేదని వాపోతున్నారు. -
దుబాయ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌తో...
‘గడుపుతున్న క్షణాలను ఆనందంగా జీవిస్తేనే అవి గడిచాక అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి’ అంటున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం మహేశ్ తన కుటుంబంతో కలసి దుబాయ్‌లో హాలిడే చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడం కోసం ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్‌తో పాటు దుబాయ్ వెళ్లారు. కుటుంబంతో కలసి గడుపుతున్న ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు నమ్రత. ‘‘నా బెస్ట్ బడ్డీతో (బెస్ట్ ఫ్రెండ్) మంచి టైమ్ స్పెండ్ చేస్తున్నాను’’ క్యాప్షన్ చేస్తూ తనయుడు గౌతమ్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు మహేశ్. కుమారుడిని బెస్ట్ బడ్డీ అని సంబోధించడం చూస్తుంటే వీళ్లిద్దరూ తండ్రీ కొడుకల్లా కంటే ఫ్రెండ్స్ లా ఉంటారని ఊహించవచ్చు. -
విదేశాల్లో వేడుకలు!
గత ఐదేళ్లతో పోలిస్తే సినిమాల విషయంలో రజనీకాంత్ ఈ ఏడాది స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ‘కాలా, 2.ఓ’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేవడమే కాకుండా ‘పేట్టా’ అనే మరో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఈ ఏడాదిని బిజీ బిజీగా గడిపారు రజనీకాంత్. అందుకే ఇప్పుడు ఆయన హాలీడేను ప్లాన్ చేసుకున్నట్లు కోలీవుడ్ టాక్. ఫ్యామిలీతో కలిసి రజనీ న్యూయార్క్ వెళ్లారన్నది తాజా సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను రజనీ కుటుంబం అక్కడే జరుపుకుంటుందట. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘పేట్టా’ ప్రమోషన్ కోసం జనవరి మొదటివారంలో రజనీ ఇండియాకి తిరిగొస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. తెలుగులో ‘పేట’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాళవిక మోహనన్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. రజనీకాంత్ నెక్ట్స్ మూవీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
ఇట్స్ హాలీడే టైమ్
జీవితాన్ని ఆస్వాదించడం ఓ కళ. ఆ కళ కొందరికి తెలియదు. త్రిషకు మాత్రం బాగా తెలుసు. అలుపూ సొలుపూ లేకుండా షూటింగ్స్ చేసేయడం, డైరీలో కాస్త ఖాళీ దొరికితే హాలీడే ప్లాన్ చేసుకోవడం.. ఫుల్లుగా ఎంజాయ్ చేయడం. ఇది త్రిష మంత్ర. ప్రతి సంవత్సరం లాంగ్ ట్రిప్, షార్ట్ ట్రిప్.. ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. వీలు కుదిరితే రెండు ట్రిప్స్ వెళతారు. ముఖ్యంగా ఇయర్ ఎండింగ్లో ఎక్కువగా వెళుతుంటారు. ఇప్పుడు త్రిష హాలీడే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడికెళ్లారో తెలుసా? అమెరికాలోని కోస్టా రికాలో వాలిపోయారు. డిసెంబర్లో అక్కడి వాతావరణం చాలా బాగుంటుందట. పచ్చని ప్రదేశాలు, డైట్ పట్టించుకోకుండా లాగించేసేలా రుచికరంగా వడ్డించే రెస్టారెంట్లు... ఇలా రిలాక్స్ అవ్వడానికి బోల్డంత స్కోప్ ఉన్న ప్లేస్ కూడా. అందుకే త్రిష ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఇదిగో ఇక్కడ ఫొటోలో త్రిష ఎంత కూల్‌గా కనిపిస్తున్నారో చూశారా! కోస్టా రికాలో దిగిన ఫొటో ఇది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. త్రిష నటించిన తమిళ చిత్రం ‘96’ ఇటీవల విడుదలై, సూపర్ డూపర్ హిట్టయింది. ఆ ఆనందంలో ఉన్న త్రిషకు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘పేట్టా’లో నటించే అవకాశం దక్కింది. దాంతో డబుల్ హ్యాపీ. ఇంకా తమిళంలో మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. కెరీర్ ఆరంభించి పదిహేనేళ్లయినప్పటికీ త్రిష కెరీర్ స్టడీగా ఉండటం విశేషం. -
అక్కినేని హలిడే టూర్
ఫుల్‌గా పని చెయ్. ఆ తర్వాత తప్పకుండా హాలీడే చెయ్. ఇదే మా మంత్రం అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగచైతన్య, సమంతల ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రిలీజ్ కావడం, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్‌కి గ్యాప్ దొరకడంతో సేద తీరడానికి హాలీడే వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ‘దేవదాస్’ రిలీజ్ చూసుకొని అమలతో కలసి నాగార్జున కూడా వాళ్లతో జాయిన్ అయ్యారు. ఇలా కుటుంబమంతా సరదాగా హాలీడే మూడ్‌లోకి వెళ్లారు. ‘‘సక్సెస్ కూడా యాడ్ అయినప్పుడు హాలీడే ఇంకా అద్భుతంగా మారుతుంది’’ అని నాగార్జున ఈ ఫొటోను షేర్ చేశారు. -
అందరికీ ధన్యవాదాలు
ప్రస్తుతం అక్కినేని కుటుంబం హాలీడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత విదేశాలు వెళ్లారు. ఇద్దరు మాత్రమే కాదు.. వీళ్ల వెంట అఖిల్ కూడా స్పెయిన్ తీరప్రాంతంలోని ఇబిసా ప్రాంతానికి వెళ్లారు. అంతే కాదండోయ్.. నాగార్జున, ఆయన సతీమణి అమల కూడా ఈ సరదా ట్రిప్‌లో జాయిన్ అయ్యారు. ఈ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. వీటిపై నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా సమంత వస్త్రధారణను విమర్శిస్తున్నారు. ఇలాంటి దుస్తుల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్? అంటూ విమర్శించారు. ఈ విమర్శలకు సమంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ మేసేజ్ ఉంచారు. ‘‘నా పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో చెబుతున్న వారందరికీ అంటూ... ఓ అసభ్యకరమైన సింబల్‌ని పోస్ట్ చేసి, ధన్యవాదాలు’’ అంటూ ముగించారు. అంటే.. పరోక్షంగా సమంత నా జీవితం.. నా ఇష్టం అనేలా చెబుతున్నట్లు ఉంది కదూ. ఇప్పుడు వీటిపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి రోజు దగ్గర పడుతున్న (అక్టోబర్ 6) సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత చేయబోతున్న చిత్రం ఆ రోజు ప్రారంభం అవుతుందట. దీనికి ‘మజిలీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇక నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే -
మలేసియాలో మస్త్ మజా
బిజీ షెడ్యూల్స్ మధ్య కాస్త తీరిక సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు మహేశ్‌బాబు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఆయన మలేసియాలో హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన సతీమణి నమ్రత. ఇక సినిమాల విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ కానుంది. వచ్చే నెల మొదటి వారంలో అక్కడ చిత్రీకరణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈలోపు ఈ హాలిడేను ప్లాన్ చేసుకున్నట్లున్నారు. -
డాల్ఫినైనా కాకపోతిని
త్రిషాకు చేపలంటే ఇష్టం. గుండెల నిండా ప్రేమను నింపుకున్నారు. అంతెందుకు ‘నీమో ఫిష్’ ట్యాటూని వేసుకున్నారు. త్రిష లో నెక్ డ్రెస్ వేసుకున్నప్పుడు పరీక్షగా చూస్తే మీకే అర్థం అవుతుంది ఆ ట్యాటూ ఎక్కడ ఉందో. ఇప్పుడీ చేప గోల ఏంటీ? అంటే.. వరుసగా షూటింగ్స్ బిజీ నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న హాలీడే బ్రేక్ తీసుకున్నారు త్రిష. దాంట్లో భాగంగా దుబాయ్ వెళ్లారామె. అక్కడ ఎంచక్కా డాల్ఫిన్స్‌తో ఆడుకునే వీలు కుదిరింది. అంతే.. డాల్ఫిన్స్‌ను ముద్దాడుతూ, హగ్గాడుతూ కాలక్షేపం చేశారామె. అంతేనా.. తన అభిమానుల కోసం ఆ ఫొటోలను ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటూ షేర్ చేశారు. ఫొటోలను చూసి డాల్ఫిన్ అయినా కాకపోతిని అని కుర్రకారు అనుకునే అవకాశం ఉంది. -
ఆ దరికొస్తావా.. ఈ దరికొస్తావా?
బిర్లా మందిర్కిరా కలిసి గుడికెళ్దాం. ప్యారడైస్కి వస్తే హైదరాబాదీ బిర్యానీ తిందాం. గోల్కొండలో షికారు కొడదాం అంటూ ఇన్విటేషన్ల మీద ఇన్విటేషన్లు వస్తున్నాయి హీరోయిన్ కియారా అద్వానీకి. సడెన్‌గా ఎందుకీ ఆహ్వానాలు? అసలు ఎవరినుంచి వస్తున్నాయి? అంటే.. నెటిజన్ల నుంచి. ‘భరత్ అనే నేను’తో ఆకట్టుకున్న కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సోమవారం కియారాకు షూటింగ్ లేదట. సో.. హైదరాబాద్‌ని సందర్శించదలిచారు. ఈ బాలీవుడ్ భామకి ఏయే ప్లేస్‌లు తిరగాలో తెలియక ట్వీటర్లో నెటిజన్లను సలహా అడిగారు. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్‌బండ్.. అంటూ కొందరు చక్కగా సలహాలు ఇచ్చినప్పటికీ కొందరు ఆకతాయిలు మాత్రం చార్మినార్ దగ్గరకు రండి చాయ్ తాగిస్తా, కోటిలో షాపింగ్‌కి తీసుకెళ్తాను అంటూ కొంటెగా రిప్లైలు ఇచ్చారు. హీరోయిన్ అంటే ఎంత ప్రేమో.. ఆ దరికొస్తావా? ఈ దరికొస్తావా అని ఇన్వైట్ చేశారు. కానీ కియారా ఈ ఆహ్వానాలు స్వీకరించకుండా ఒంటరిగానే చార్మినార్ వెళ్లి షాపింగ్ చేస్తూ తన హాలిడేను ఎంజాయ్ చేశారు. -
జాలీ మూడ్.. హాలిడే మోడ్
మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ జాలీ మూడ్‌లో ఉన్నారు. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఫ్యామిలీతో కలిసి ఓ వారం రోజులు హాలిడే ట్రిప్ వెళ్లారు మహేశ్ బాబు. సినిమా రిలీజ్ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ కోసం ఆ టూర్. ఇప్పుడు సినిమా సక్సెస్ ఇచ్చిన జాలీ మూడ్‌తో హాలిడే మోడ్‌లోకి వెళ్లారు మహేశ్. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో మరో టూర్‌ని ప్లాన్ చేశారు. ‘‘ప్యారిస్ వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ హాలిడేస్’’ అని కొన్ని ఫొటోలను షేర్ చేశారు నమ్రత. అక్కణ్ణుంచి తిరిగి రాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్లో మహేశ్ పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకోసం కెమెరామెన్ మోహనన్‌తో కలిసి న్యూయార్క్ వెళ్లారు వంశీ. ‘‘కెమెరామెన్ కేయు మోహనన్‌తో కలిసి న్యూయార్క్‌లో మహేశ్‌బాబు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాం. మోహనన్ దగ్గర పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా నేర్చుకోవాలి’’ అన్నారు వంశీ. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
సెంట్రల్ పార్క్... ఓ తీయని జ్ఞాపకం
ప్రేమికులకు ఫస్ట్ కలిసిన ప్లేస్, ఫస్ట్ ప్రపోజ్ చేసిన డేట్, ఫస్ట్ డిన్నర్, ఫస్ట్, ఫస్ట్.... ఇలా ఫస్ట్‌లన్నీ ప్రత్యేకమే. ఎప్పుడైనా తాము ఫస్ట్ కలుసుకున్న ప్లేస్‌కి వెళ్లినా, ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న చోటుకి వెళ్లినా కచ్చితంగా ‘నోస్టాల్జియా’ ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు క్రేజీ కపుల్ నాగచైతన్య, సమంత. రియల్ లైఫ్‌లో సమంతకు చైతన్య ఎప్పుడు ప్రపోజ్ చేశారో తెలీదు కానీ రీల్ లైఫ్‌లో మాత్రం ఎనిమిదేళ్ల క్రితం గౌతమ్ వాసుదేవ్‌మీనన్ రూపొందించిన‘ఏ మాయ చేశావె’ సినిమాలో చేశారు. ఆ సన్నివేశంలో‘ఐ లవ్ యూ జెస్సీ. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే.. ఇక్కడే..’ అని సమంతతో చెబుతారు నాగచైతన్య. అలా రీల్ లైఫ్‌లో చేసిన ప్రపోజల్ రియలై చైతు–సామ్ జోడీ అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత హాలిడేలో భాగంగా న్యూయార్క్ సందర్శించారు. అక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర తాము ఫస్ట్ టైమ్ (రీల్లో) ప్రపోజ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాన్ని ఓ మెమరీగా బంధించుకోవటానికి ఓ సెల్ఫీ కూడా క్లిక్ చేసుకున్నారు. ఆ ఫొటోను సమంత షేర్ చేస్తూ ‘‘సాధారణంగా సెల్ఫీలంటే అంతగా నచ్చదు. కానీ ఈసారి మాత్రం దిగాల్సిందే. సెంట్రల్ పార్క్.. ఇదంతా మొదలైంది ఇక్కడే. ఎనిమిదేళ్లు అయిపోయింది. థ్యాంక్స్ చెప్పుకోవటానికి వచ్చినట్టుంది. ప్రేమ ఏదో ఓ మార్గాన్ని వెతుకుతుంది. జరగాలని రాసి పెట్టుంటే కచ్చితంగా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు సమంత. -
పోలీసులను పరుగులు పెట్టించారు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో విహారయాత్రకు వచ్చిన నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువతులు ముంబైతో పాటు సిటీ పోలీసుల్నీ పరుగులు పెట్టించారు. వారం రోజుల క్రితం ముంబైలో అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ఏకంగా యూఏఈ కాన్సులేట్ రంగంలోకి దిగింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన ముంబై పోలీసులు ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంలో హైదరాబాద్ లింకు సంపాదించారు. సోమవారం సిటీకి వచ్చిన ముంబై పోలీసు టీమ్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారుల సాయంతో నలుగురి ఆచూకీ కనిపెట్టగలిగారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ముంబై పోలీసులు కాన్సులేట్ ముందు హాజరుపరచడానికి నలుగురినీ తీసుకుని వెళ్ళారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న మిష్రీగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు కొన్నేళ్ళ క్రితం దుబాయ్‌కు వలసవెళ్ళారు. అక్కడే దుబాయ్ షేక్ల్ని వివాహం చేసుకుని స్థిరపడ్డారు. వీరికి జన్మించిన ఇద్దరు యువతులకు యూఏఈ పౌరసత్వం వచ్చింది. ప్రస్తుతం దాదాపు 18 ఏళ్ళ వయస్సులో ఉన్న వీరిద్దరితో పాటు వీరి స్నేహితులైన మరో ఇద్దరూ విహారయాత్ర కోసం భారత్‌కు బయలుదేరారు. గత మంగళవారం ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆపై వీరు తల్లిదండ్రులతో టచ్‌లో లేకుండా పోయారు. రెండు రోజుల పాటు ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆచూకీ లేకపోవడంతో తీవ్రంగా ఆందోళనకు లోనయ్యారు. విషయాన్ని యూఏఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు ముంబైలో ఉన్న యూఏఈ కాన్సులేట్‌ను అప్రమత్తం చేశారు. దుబాయ్ నుంచి సమాచారం అందడంతో రంగంలో దిగిన కాన్సులేట్ అధికారులు నలుగురు యువతుల ఆచూకీ కనిపెట్టాల్సిందిగా కోరుతూ ముంబై పోలీసు కమిషనర్ దత్త పద్సాల్గికర్‌కు అధికారిక పత్రం అందించారు. మరోపక్క యూఏఈ కాన్సులేట్ నుంచి సమాచారం అందుకున్న విదేశీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖల అధికారులూ ముంబై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ముంబై పోలీసు కమిషనర్ వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. మూడు రోజుల పాటు అక్కడి అనేక ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. అయితే ప్రత్యేక బృందం శనివారం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని కలిసి ఈ యువతుల విషయం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే వారు ఇమ్మిగ్రేషన్ చెక్‌లో భాగంగా తాము నలుగురం హైదరాబాద్‌లోని హుస్సేనిఆలంలో ఉంటున్న ఇరువురి బంధువుల వద్దకు వెళ్తున్నట్లు నమోదు చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న ముంబై పోలీసులు సీసీఎస్ పోలీసుల సహాయం కోరారు. సోమవారం ఉదయం సీసీఎస్ స్పెషల్ టీమ్స్ సాయంతో పాతబస్తీకి వెళ్ళిన ముంబై పోలీసులు అక్కడి హుస్సేని ఆలంలో ఉన్న యువతుల బంధువుల ఇల్లు గుర్తించారు. యూఏఈకి చెందిన నలుగురూ అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అదృశ్యంపై ముంబై పోలీసులు నలుగురు యువతుల్నీ ప్రశ్నించారు. తాము అదృశ్యం కాలేదని, యూఏఈలో తీసుకున్న తన సెల్‌ఫోన్ సిమ్‌కార్డులకు ఇంటర్నేషనల్ రోమింగ్ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్త సిమ్‌కార్డులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దానికి కొంత సమయం పట్టడంతోనే తల్లిదండ్రుల్ని సంప్రదించలేకపోయామని వివరించారు. ఈ నలుగురినీ ముంబై తీసుకువెళ్ళిన పోలీసులు అక్కడి కాన్సులేట్ అధికారులు ముందు హాజరుపరచనున్నారు. -
వేశ్యాగృహంలో రూమ్ బుక్ చేశాడు..!
లాస్ ఏంజెలిస్: ఇటీవల పారిస్ టూర్‌కు వెళ్లినప్పుడు బాయ్‌ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేస్తాడనుకున్నా అలా జరగలేదంటోంది మోడల్, హాలీవుడ్ నటి కెల్లీ బ్రూక్. అయితే తాను ఊహించింది జరగకపోవడంతో పాటు షాక్ తిన్నానని చెప్పింది కెల్లీ. అసలు విషయం ఏంటంటే.. మోడల్ కెల్లీ బ్రూక్, జెరేమీ పార్శి గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పారిస్‌కు హాలిడే ట్రిప్ అంటూ చక్కర్లు కొట్టారు. 'ఇటీవల పారిస్‌కు వెళ్దామని జెరేమీ ప్లాన్ చేశాడు. అక్కడ తనకు లవ్ ప్రపోజ్ చేస్తాడని భావించాను. కానీ నాకు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాడు జెరేమీ. రొమాంటిక్ ప్రదేశమైన పారిస్‌లో ప్రపోజ్ చేయకపోగా, అక్కడ మాకోసం బుక్ చేసిన హోటల్ గతంలో వ్యభిచార గృహమని తెలియగానే ఇలాంటి చోట ఉన్నామా అని షాక్‌కు గురయ్యాను. ప్రపోజ్ చేయకపోతేనేం, జంటగా షాపింగ్ చేశాం. జెరేమీ పేరెంట్స్‌ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ' తనకు పారిస్‌లో ఎదురైన అనుభవాలను కెల్లీ బ్రూక్ చెప్పుకొచ్చింది. -
హాలిడే తప్పదు మామా
‘‘నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’’... ‘బాహుబలి–2’లో కట్టప్పతో అమరేంద్ర బాహుబలి ఈ డైలాగ్ చెబుతాడు. కట్టప్ప ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమరేంద్ర బాహుబలి అంటే ప్రభాస్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని మార్చి చెప్పమని ప్రభాస్‌ని అడిగితే.. ‘‘నాలుగేళ్లు నాన్‌స్టాప్‌గా పని చేసిన తర్వాత హాలిడే తీసుకోక తప్పదు మామా...’’ అంటారు. అవును మరి. ‘బాహుబలి’ రెండు భాగాల కోసం ప్రభాస్ మామూలుగా కష్టపడలేదు. నాలుగేళ్లు పూర్తిగా ఈ సినిమాకు డెడికేట్ అయిన ప్రభాస్ కొంచెం రిలాక్స్ కావాలనుకుంటున్నారు. ‘బాహుబలి–2’ రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఇక, నెక్ట్స్ మూవీ షూట్లో బిజీ అయ్యేలోపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనుకున్నారు. అందుకే ప్రభాస్ యూఎస్ చెక్కేశారు. హాలిడే ఎన్ని రోజులు డార్లింగ్? అని అభిమానుల మనసులో ప్రశ్న మెదలకుండా మానదు. ఒక నెల యూస్‌లో ఉండి, డార్లింగ్ ప్రభాస్ ఇండియా వచ్చేస్తారు. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లో చేస్తోన్న సినిమాతో బిజీ అయిపోతారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి’ తపస్సులో ఐదేళ్లకు పైనే ఇన్వాల్వ్ అయిన రాజమౌళి కుటుంబం కూడా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కుటుంబం లండన్ వెళ్లింది. -
హ్యాపీగా..జాలీగా..
హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు త్రిష. సూట్‌కేస్‌లో బట్టలు సర్దుకున్నారు. మేకప్ కిట్ కూడా పెట్టుకున్నారు. వాటితో పాటు గొడుగు కూడా తీసుకెళ్లారు. ఇదేంటి అనుకుంటున్నారా? త్రిష వెళ్లింది న్యూయార్క్‌కి. అక్కడ రెయినీ సీజన్ అట. అందుకే ముందు చూపుతో గొడుగు కూడా ప్యాక్ చేసుకున్నారు. నిజానికి హాలిడేస్ తీసుకునేంత ఖాళీ త్రిషకు లేదు. ఆమె డైరీ ఫుల్. త్రిష చేతిలో ప్రస్తుతం తొమ్మిది సినిమాలున్నాయి. మూడు సినిమాలు పూర్తి కాగా, ఇంకో ఆరు సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్స్ మధ్య చిన్న గ్యాప్ దొరికిందట. అంతే.. తల్లి ఉమాకృష్ణన్‌తో కలసి న్యూయార్క్ చెక్కేశారు. ‘హలీడేస్ను హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను’ అంటున్నారామె. కాలు బయటపెట్టేటప్పుడు వర్షం రాకపోయినా హ్యాండ్ బ్యాగ్‌తో పాటు గొడుగు కూడా చేత్తో పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి.. మేడమ్‌కి ముందు జాగ్రత్త ఎక్కువ అంటే ఒప్పుకుంటారు కదూ. -
ఉద్యోగుల కోసం యజమాని ఏం చేశాడంటే..
చైనాలో కొంతమంది వ్యాపారవేత్తలు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరినీ సెలవులకు విదేశాలకు తీసుకెళ్తుంటారు. అలాంటివి చూసి స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. గుజరాత్‌లోని ఓ వజ్రాల వ్యాపారి తన దగ్గర పనిచేసే మొత్తం 300 మందిని, వాళ్ల కుటుంబ సభ్యులందరితో కలిపి ఉత్తరాఖండ్‌లో 10 రోజుల పర్యటనకు తీసుకెళ్లాడు. ఉద్యోగులు, వాళ్ల భార్యాపిల్లలు అంతా కలిపి ఏకంగా 1200 మంది అయ్యారు. ముంబై మహానగరంతో పాటు తన సొంత ఊరైన సూరత్‌లో శ్రీ రామకృష్ణా ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేసే గోవింద్ ఢోలకియా ఈ పని మొదలుపెట్టాడు. మొత్తం సిబ్బంది అందరికీ 15 రోజుల సెలవు ప్రకటించి, రూ. 90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేశాడు. ప్రతియేటా తమ బాస్ ఇలాగే తమను టూర్లకు తీసుకెళ్తారని ఉద్యోగులలో ఒకరు తెలిపారు. తామంతా ఆయనను సార్ అని కాకుండా, 'కాకాజీ' అని ఆప్యాయంగా పిలుచుకుంటామన్నారు. తమతో పాటు ఆయన, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ యాత్రకు వచ్చారు. సైట్‌సీయింగ్‌తో పాటు ఈ పది రోజుల్లో తాము సామాజిక సేవ కూడా చేస్తామని మరో ఉద్యోగి చెప్పారు. గురువారం నాడు తాము రిషికేశ్ సమీపంలోపని స్వర్గాశ్రమాన్ని స్థానిక పంచాయతీ సభ్యుల సాయంతో శుభ్రం చేశామన్నారు. అయితే.. ఢోలకియా మాత్రం తాను చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం కావాలని ఏమాత్రం కోరుకోవడం లేదు. అందుకే ఆయనను కలవాలని మీడియా ప్రతినిధులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. -
గో.. గో..గోవా
సెలవులొస్తే.. గో గో..గోవా అంటుంటారు. చిన్నా పెద్దా అందరు కలిసి గోవాకి చేక్కేస్తుంటారు. అందమైన సముద్రం.. తెల్లని ఇసుక బీచ్‌లు.. ఆహ్లాదకరమైన వాతావరణం గోవా సొంతం. మనదేశం నుంచే కాకుండా, విదేశాల నుంచి సైతం పర్యాటకులు గోవా బీచ్‌లలో సేదతీరేందుకు వస్తుంటారు. ఇటీవల గోవాలో బ్రిక్స్ సమావేశం జరిగింది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ఆఫ్రికా) ప్రతినిధులు ఒక్కచోట చేరి పలు విషయాలపై చర్చించారు. దీంతో ఇప్పటికే పర్యాటక స్థలంగా పేరొందిన గోవా పేరు రాజకీయ, ఆర్థిక, ఇతర విషయాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఈ నేపథ్యంలో గోవా అందాలపై స్పెషల్ ఫోకస్.. బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గోవా వెళ్లిన వారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ చర్చి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.1605లో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రై స్తవులు వస్తుంటారు. యునెస్కో దీన్నీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతోపాటు ఇక్కడి వైస్రాయ్ ఆర్చి, ఆసియాలో అతిపెద్ద చర్చిల్లో ఒకటైన సెయింట్ కేథరీన్ చూడదగ్గవి. కేథడ్రల్, అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ చర్చి, శాంత దుర్గ టెంపుల్, సలీమ్ అలీ బర్డ్ శాంక్చురీ, గోవా స్టేట్ మ్యూజియం, ఫట్రోడ స్టేడియంలు చూడాల్సినవి. భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలెన్నో కనిపిస్తాయక్కడ. పనాజీలోని ఫాంటెన్హౌస్ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తించారు. గోవా జీవనానికి, నిర్మాణాలకు ప్రతిబింబం ఇది. కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఈ శైలిలోనే కనిపిస్తాయి. రైలు ప్రయాణమే థ్రిల్లింగ్! గోవా రైలు ప్రయాణం భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ప్రయాణంలో పడమటి కనుముల ప్రకృతి అందాలతోపాటు, లోతైన లోయలు, సుందర జలపాతాలు మనకు దర్శనమిస్తాయి. ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, చీకటి గుహల మీదగా ఈ ప్రయాణం సాగుతుంది. మధ్యమధ్యలో సొరంగ మార్గాల ద్వారా రైలు వెళుతున్నప్పుడు కొన్ని క్షణాలవరకూ అది మిట్టమధ్యాహ్నమో మధ్యరాత్రో అర్థంకాదు. అంతచీకటి కమ్ముకుంది. అందాల దూధ్‌సాగర్.. రెళ్లో గోవాకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో ఒకటోట రెండు ఎత్తయిన కొండలు కనిపిస్తాయి. ఆ రెండు కొండల శిఖరాల మధ్య నుంచి దూధ్ సాగర్ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం కన్నుల పండువల ఉంటుంది. తెల్లని నురగలతో పై నుంచి కిందకి జాలువారే ఆ జలపాతాన్ని చూస్తుంటే ఆకాశగంగ భువికి చేరుతున్నట్లుగా ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దుల మధ్య పరవళ్లుతొక్కే పాల జలపాతాన్ని తప్పక చూడాల్సిందే. ఈ జలపాతం వర్షాకాలంలో రెట్టింపు అందంగా కనిపిస్తుంది. ఇది దేశంలోనే ఐదవ అతిపెద్ద జలపాతం. పసందైన విందు! గోవాలో పురాతన ఇళ్లు ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలుగా మారారుు. కళాప్రేమికులకు ఇండియన్ పెయింటింగ్స్, యాంటిక్స్ పండగ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఎంపోరియాలు, ప్రైవేట్ షాప్‌లు ఉంటాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలప్పుడు గోవా కళకళలాడుతుంటుంది. క్రిస్మ్‌స వేడుకలు, గోవా కార్నివాల్, వినాయక చవితి, గ్రేప్ ఫెస్టివల్, హోలీలను ఎంతో ఆర్భాటంగా జరుపుతారు. మసాలాలు, మూలికలకు గోవా ఫేమస్. స్పా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే బోలెడు మసాజ్ సెంటర్లు ఉన్నాయి. చేపలు, మసాలా దినుసులు... అబ్బో ఒకటేంటి ఒక పక్క షాపింగ్ ప్రియుల మనసుదోచి మరో పక్క భోజనప్రియులకు రుచికరమైన విందును అందిస్తుంది గోవా. సన్ బర్న్ ఫెస్టివల్.. గోవాలోని వగాటర్లో ఈ సన్‌బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. గోవా ప్రత్యేక వంటకాలను ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కూడా చేయవచ్చు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యటకులు ఈ ఫెస్టివల్‌కు తరలివస్తారు. భలే బీచ్‌లు..! పాలోలెమ్, బాగా, కాలన్ ఘాట్, అంజునా, కాండోలిమ్, మజోర్డా, మిరామర్, సింక్వేరియమ్, వగాటర్, వర్కా, కోల్వా బీచ్‌లు తప్పక చూడాలి. ఒక్కో బీచ్దీ ఒక్కో ప్రత్యేకత. కొబ్బరిచెట్లు కొలువుదీరింది ఒకటయితే నల్లరాళ్లతో నిండినబీచ్ మరొకటి. అడుగడుగునా రంగురంగుల చేపలతో పెద్ద అక్వేరియంను తలపించే బీచ్ ఒకటయితే ఆరు బయట వాలు కుర్చీల్లో బీర్లు తాగుతూ కూర్చునేది మరొకటి. ఓల్డ్‌గోవాలో ఎక్కువగా అరబ్బులు, పర్షియన్లు, యూదులు, మలబార్ వాసుల పడవలు కనిపిస్తాయి. మహవీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.. గోవా రాజధాని పనాజీకి 60 కి.మీ. దూరంలో భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. గోవాలోనే అతిపెద్దది ఇది. పశ్చిమకనుమల పాదభాగంలో సుమారు 240 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏనుగులు, పులులు, లేళ్లు, జింకలు, పెద్దపెద్ద ఉడుతలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సఫారీలకు జీపులు కూడా దొరుకుతాయి. ఈ అడవిలో ఉండేందుకు అతిథిగృహాలున్నాయి. ఎన్నెన్నో.. మనదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గోవా వైశాల్యం తక్కువ..కానీ చూసి ఆస్వాదించాల్సిన ప్రాంతాలు ఎక్కువ. సీ, సాండ్, సర్ఫ్, సన్ కలిసి ఆహ్వానం పలికేచోటు ఇది! నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవాలో ప్రసిద్ధి చెందిన బీచ్‌లు, చర్చిలు, దేవాలయాలు, ఇంకా మరెన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్‌గోవాలో ఆహారపు అలవాట్ల నుంచి భవన నిర్మాణాల వరకు పోర్చుగీసు సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. అందమైన బీచ్‌లు, పురాతన కట్టడాలు, అందమైన జలపాతాలతో పర్యాటకుల స్వర్గధామంగా విలసిల్లుతోంది. -
అప్పు చేసి టూరుకెళతారా..?
⇒ అధిక వడ్డీ రేట్లకు రుణాలు వద్దు ⇒ విదేశాల్లో క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి ⇒ ప్లానింగ్‌ను బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి విహార యాత్ర.. టూర్.. హాలిడే ట్రిప్.. వంటి పదాలు మనకు కొత్తేమీ కాదు. ఇవి మనకు సుపరిచితమే. రోజూవారి కార్యకలాపాలకు కొద్ది విరామం ఇచ్చి కొత్తదనం కోసం ఆహ్లాదంగా గడపడానికి టూర్లకు వెళ్తాం. దేశీ విహారానికైతే 3-4 నెలలు, అదే విదేశీ విహారమైతే 6-8 నెలల ప్లానింగ్ అవసరం. నిజానికి అక్కడికి వెళ్లాలి... ఇక్కడకు వెళ్లాలి.. అని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యపడదు. దీనికి అనేక కారణాలు అడ్డొస్తాయి. వాటిల్లో ప్రధానమైనది డబ్బు. ప్రతి ఒక్కరూ ప్లానింగ్ చేస్తారు. కానీ వీటి కన్నా ముఖ్యమైనదిడబ్బు. టూర్‌ను బాగా ప్లాన్ చేయడమే కాదు. దాని కోసం కొంత మొత్తాన్ని కూడా పొదుపు చేస్తూ రావాలి. అది ఎందుకో చూద్దాం... రుణం వద్దు.. క్రెడిట్ కార్డుకు దూరం బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు 13-30% మధ్యలో చార్జ్ చేస్తాయి. 15 రోజుల విహారయాత్ర కోసం తొందరపడి రుణం తీసుకుని వెళితే.. తర్వాత కొన్ని నెలలపాటు ఈఎంఐ భారం మోయాలి. ఇది అవసరమేమో ఆలోచించండి. హాలిడే ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించడం కూడా తెలివైన పని కాదు. మీరు రివార్డు పాయింట్లను, క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. కానీ 18-45% వడ్డీనీ చెల్లిస్తున్నారనే విషయాన్ని మరువొద్దు. విదేశాల్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరుపుతున్నారంటే.. కరెన్సీ మార్పుకు అదనపు భారం మోయల్సిందే. ఇది ఒక లావాదేవీకి 1-3 శాతంగా ఉండొచ్చు. ప్రత్యేక మూలధనం ఏర్పాటు చేసుకోండి విహారయాత్రలు, టూర్లువంటి తదితర వాటికి ప్రత్యేకంగా మూలధనాన్ని సమకూర్చుకోండి. కొత్త ప్రదేశాలకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ఖర్చు పెట్టకండి. కొద్దిగా నియంత్రణ పాటించండి. మీరు టూర్ ప్రణాళికలు ముందే వేయండి. అప్పుడే టికెట్స్, కరెన్సీ మార్పు వం టి అంశాల్లో గందరగోళం ఉండదు. హోటళ్లను, ట్రావెల్ టికెట్స్‌ను అప్పటికప్పుడు అనుకొని బుక్ చేసుకోవడానికీ.. ముందే రిజర్వు చేసుకోవడానికి అయ్యే ఖర్చుల్లో చాలా వ్యత్యాసం 13-15% ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు అవసరం టూర్ వెళ్లడానికి ముందే ప్లాన్ చేసుకుంటే.. దానికనువుగా ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించొచ్చు. ఉదాహరణ కు ఈక్విటీ పెట్టుబడులనే తీసుకోండి. ఇవి దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. ప్రతి నెలా కొంచెం తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే మూడేళ్ల తర్వాత విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే ఏడాదిలోపు టూర్‌కు వెళ్లాలనుకుంటే.. డెట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి తక్కువ రాబడిని అందిస్తాయి. అంటే ప్రతినెలా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ రావడం ముఖ్యమని గుర్తుంచుకోండి. టూరిజం సంస్థల ప్రత్యేక పథకాలు... పర్యాటక కంపెనీలు విహారయాత్రలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులతో కలిసి పలు రకాల పథకాలను ఆవిష్కరిస్తున్నాయి. థామస్‌కుక్ హాలిడేస్ కోసం పొదుపు చేసుకోవడానికి వీలుగా ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లతో జతకట్టి ‘హాలిడే సేవిం గ్స్ అకౌంట్’లను ప్రారంభించింది. ఇక ఎస్ఓటీసీ ఇండియా కూడా కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి ‘హాలిడే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ను ఆవిష్కరించింది. ఈ పథకాల ప్రకారం.. మీకు వెళ్లాల్సిన ప్రదేశం కోసం ఏడాదిపాటు (12 నెలలు) కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇక 13వ నెల మొత్తాన్ని లేదా బ్యాంక్ వడ్డీని ట్రావెల్ కంపెనీ మీకు అదనంగా చెల్లిస్తుంది. ఈ మొత్తంతో మీరు టూర్‌కు వెళ్లి రావొచ్చు. ఉదాహరణకు మీరు దుబాయ్‌లో 4 రోజులు గడపాలనుకున్నారు. మీరు నెలకు రూ.3,600 పొదుపు చేయాలి. బ్యాంకు మీ పొదుపునకు 7.9% వడ్డీ ఇస్తే, మీకు ఏడాది చివరిలో మెచ్యురిటీ మొత్తంగా రూ.45,083తోపాటు 13వ ఇన్స్టాల్మెంట్ (రూ.3,600) అదనంగా వస్తుంది. ఆయా సంస్థల పథకాలకనుగుణంగా మీకు వచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. -
పులితో ఆట...ఆ తర్వాత ఈత...
‘రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో.. చూస్కో. పులితో ఫొటో దిగాలనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే.. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’.. అని ‘యమదొంగ’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఏదో సినిమా కాబట్టి ఫొటో దిగొచ్చని అన్నారు కానీ, నిజమైన పులితో ఎవరైనా ఆ పని చేయాలనుకుంటారా? ఒకవేళ అవి ఏమీ చేయవని తెలిసినా ఫొటో దిగే సాహసం చేయరు. కానీ, సుష్మితా సేన్ ఇక్కడ. వెరీ బోల్డ్. ఈ అందాల సుందరికి ఎప్పట్నుంచో పులిని దగ్గరగా చూడాలని కోరిక. వీలైతే పులిని ప్రేమగా నిమరాలని, ఫొటో దిగాలని కూడా అనుకున్నారు. తన చిరకాల కోరికను ఇటీవల సుష్మిత తీర్చేసుకున్నారు. దత్త పుత్రికలు పదహారేళ్ల రీనీ, ఆరేళ్ల అలీషాలు ఎక్కడైనా హాలిడే ట్రిప్ వెళదామని కన్నతల్లిలా చూసుకుంటున్న పెంపుడు తల్లి సుష్మితాని అడిగారట. అంతే.. థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లారు. అక్కడ పుకెట్ జూకి ఈ తల్లీకూతుళ్లు వెళ్లారు. పులి దగ్గరకు వెళ్లి దాన్ని ప్రేమగా నిమిరి, ఫొటో దిగారు సుష్మిత. రీనీ కూడా ఆ సాహసం చేసింది. అలీషా మాత్రం ముందు భయపడిందట. కానీ, ఆ తర్వాత నాలుగు నెలల పులి పిల్ల దగ్గర కూర్చుని, ప్రేమగా నిమిరింది. పులితో తాము దిగిన ఫొటోలను సుస్మిత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ‘‘నాకు మూగజీవాలంటే ప్రేమతో పాటు గౌరవం. పెట్ యానిమల్స్‌ని పెంచుకుంటుంటాను. ఇప్పుడు పులిని దగ్గరగా చూడటం, ఫొటోలు దిగడం చాలా హ్యాపీగా అనిపించింది. నా కూతుళ్లు కూడా చాలా ఆనందపడ్డారు’’ అని సుష్మిత పేర్కొన్నారు. -
హాలిడే ట్రిప్‌కు వెళ్తే.. లైంగిక వేధింపులు!
లండన్: హాలిడేస్‌ను సంతోషంగా గడుపుదామని కరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కు వెళ్లిన ఓ బ్రిటిష్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. 48 గంటల వ్యవధిలో ఆమె రెండు సార్లు లైంగిక వేధింపులకు గురికావడంతో బెదిరిపోయి హోటల్ రూంలో తలుపులేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్ ప్రాంతానికి చెందిన గెమ్మ ఖాన్(25) ఇటీవల తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఇటీవల డొమినికన్ రిపబ్లిక్కు వెళ్లింది. అక్కడ ఓ ఖరీదైన హోటల్లో బస, ఇతర ఏర్పాట్లకు గాను వారు ఓ ట్రావెల్ సంస్థకు భారీగానే డబ్బు చెల్లించుకున్నారు. అయితే అక్కడకు వెళ్లిన తరువాతే గెమ్మ ఖాన్‌కు అనుకోని ఘటనలు ఎదురయ్యాయి. అక్కడి ఫైవ్ స్టార్ హోటల్లో.. స్విమ్మింగ్ చేసి రూంకు తిరిగి వెళ్తున్న సమయంలో ఎదురుపడిన ఇద్దరు వ్యక్తులు జెమ్మా బికినీ విప్పడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా హడలిపోయిన ఆమె వారిని విడిపించుకొని తన గదికి పరిగెత్తింది. తరువాత ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు సైతం అక్కడ ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో 'నాకు ఇక ఈ టూర్ వద్దు బాబోయ్' అంటూ స్వదేశానికి తిరుగుముఖం పట్టింది. టూర్‌కు వెళ్లిన సందర్భంగా ఎదురైన అనుభవాలను ఆమె మీడియాతో వెల్లడించింది. ఈ రెండు ఘటనలపై అక్కడ ఉన్నవారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గెమ్మ ఖాన్ వాపోయింది. -
ఎందుకు కట్టాలి?
ఇతని పేరు మాట్ బోటెన్. ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్ నివాసి. గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి ఐస్‌ల్యాండ్‌కు హాలీడే ట్రిప్‌నకు బయలుదేరాడు. గాత్విక్ ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్‌కు వెళ్లగా... మీ లగేజీ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉంది... 45 పౌండ్లు (దాదాపు 4,250 రూపాయలు) కట్టాలని అక్కడి సిబ్బంది చెప్పారు. దీన్ని తప్పించుకోవడానికి మనోడికి వెంటనే ఓ ఐడియా తట్టింది. బ్యాగును ఓపెన్ చేసి... అందులో ఉన్న దుస్తులన్నింటినీ ఇలా ధరించేశాడు. ఒకదానిపై మరొకటి వేసుకున్నాడు. చివరికి అదనంగా ఓ షూ జత ఉంటే దాన్నిలా ప్యాంటు రెండు జేబుల్లోకి దోపుకున్నాడు. తోటి ప్రయాణికులు నవ్వుకుంటున్నా... చెక్ ఇన్ సిబ్బంది నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండగా... దర్జాగా వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ఒక్క పైసా అదనంగా కట్టకుండానే. పైగా ఈ ఫొటో తీసి ‘నేను వెళుతోంది ఐస్‌ల్యాండ్‌కు కదా... అందుకే ఇలా’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. -
ఇంగ్లండ్‌లో... జాలీగా!
ఐదేళ్లుగా బిజీ బిజీగా సినిమాలు చేసిన శ్రుతీహాసన్‌కి వెకేషన్ తీసుకునే ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు కూడా బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్‌లో ఏర్పడిన వెసులుబాటు వల్ల శ్రుతికి కొంత గ్యాప్ దొరికింది. దాంతో ఆమె ఈ సెలవులను ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరానికి అక్కడే ఆహ్వానం పలుకుతున్నారు. విశేషం ఏంటంటే.. చిన్నప్పుడు శ్రుతీహాసన్ ఇంగ్లండ్‌కు వెళ్ళారు. ఆ తర్వాత షూటింగ్స్ కోసం వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇంగ్లండ్‌నే హాలీడే ట్రిప్‌కి ప్లాన్ చేశారు. చిన్నప్పుడు వెళ్లినప్పుడే ఇంగ్లాండ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడి ఉంటుంది. -
సెలవులో మిల్కీ బేబి హన్సిక
-
తాప్సీ, హన్సికలకు సెలవులు
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపూ తెలియకపోయినా... నూతనోత్సాహం కోసం పనికి కొన్ని రోజులు విరామం ఇవ్వాలనిపిస్తుంది. ఇటీవల తాప్సీ, హన్సికలకు అలానే అనిపించింది. అంతే.. ఓ సారి తమ డైరీ తిరగేశారు. కొన్ని రోజులు షూటింగ్‌కి విరామం ఇచ్చే పరిస్థితి కనిపించడంతో విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. విడివిడిగా నిర్ణయం తీసుకుని ఈ ఇద్దరూ విదేశాలు చెక్కేశారు. హన్సిక వెళ్లి ఇప్పటికి ఐదారు రోజులైంది. ముందు ఆమ్స్టర్ డామ్, అటునుంచీ బార్సిలోనా వెళ్లారామె. ఈ హాలిడే ట్రిప్ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నారో ఏమో... ఇక్కణ్ణుంచి వెళ్లేటప్పుడు జుత్తుకి పింక్ రంగు వేయించుకున్నారు. విదేశాల్లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఆ ఫొటోలను ట్విట్టర్లో కూడా పొందుపరుస్తున్నారు హన్సిక. ఇక, తాప్సీ విషయానికొస్తే.. ఈ బ్యూటీ విదేశాలు వెళ్లి మూడు, నాలుగు రోజులవుతోంది. ఇక్కణ్ణుంచి వెళ్లే ముందు.. ‘‘ఇటీవల కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నాను. ఆ మీటింగ్స్‌లో బోల్డన్ని ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. వాటిని త్వరలో మీతో పంచుకుంటా’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దాన్నిబట్టి, ఏదైనా భారీ చిత్రంలో తాప్సీ నటించనున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అసలు విషయం తాప్సీ చెబితే ఆ ఊహాలకు తెరపడుతుంది. ప్రస్తుతం ఆమె ఏథెన్స్లో ఉన్నారు. సెలవులు ముగిసే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారామె. మొత్తం మీద తాప్సీ, హన్సిక సెలవులను పూర్తిగా ఆస్వాదించి, ఓ నూతనోత్సాహంతో వస్తారని ఊహించవచ్చు.