త్రిష
తీరిక లేని షెడ్యూల్స్‌తో బిజీగా ఉండే త్రిష సినిమాలను కాస్త పక్కన పెట్టి చిన్న బ్రేక్ తీసుకున్నారు. మాల్దీవుల్లోని సముద్ర తీరాలకు వాలిపోయి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తన ఆనందానికి గుర్తులుగా తీసుకున్న ఫొటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘మాల్దీవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నా. మేకప్ లేకుండానే నా ఫొటోలను షేర్ చేసున్నాను. ఓషన్ బేబీలా ఉండటం నాకు ఇష్టం’’ అని త్రిష అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment