thrisha
-
పదహారేళ్ల తర్వాత...
పదహారేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. -
విజయ్ సినిమాకు ధోనీ ఇమేజ్, ఆ టైటిల్ ఫిక్స్ కానుందా?
సినీ ప్రపంచంలో స్టార్ కథానాయకుల చిత్రాలు ప్రారంభం కాక ముందు నుంచే ప్రచారం హోరెత్తిపోతున్న విషయం తెలిసిందే! కోలీవుడ్ హీరో విజయ్ కొత్త చిత్రం గురించి ఇలానే రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈయన లియో చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లియో చిత్రం దీపావళికి థియేటర్లో విడుదల కానుంది. (ఇదీ చదవండి: నయనతార గ్లామర్ రహస్యం.. ఆ రెండింటినీ అస్సలు మిస్ చేయని హీరోయిన్) దీంతో విజయ్ తన 68వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి పలు దర్శకులు క్యూలో ఉండగా అనూహ్యంగా వెంకట్ ప్రభు పేరు ముందుకు రావడం విశేషం. ఇందులో త్రిష మరోసారి విజయ్‌తో జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో నటించే నటీనటులు సాంకేతిక వర్గం ఎంపికపై దృష్టి పెట్టినట్లు సమాచారం అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటుడు ఎస్ జే.సూర్యను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది తండ్రి కొడుకుల మధ్య తలెత్తే అభిప్రాయ బేధాల నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి క్రికెట్ క్రీడకు సంబంధించిన పేరును నిర్ణయించాలని భావిస్తున్నట్లు, ఆ విధంగా దీనికి సీఎస్కే అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! రానా నాయుడు ఏ ప్లేస్‌లో ఉందంటే?) దీంతో సినిమాపై క్రికెటర్ ధోనీ మార్క్ ఉండనుంది. ఐపీఎల్లో సీఎస్కే కోసం ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌కు నటుడు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అధికారికంగా వెల్లడించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. సీఎస్కే పేరు బయటకు రావడంతో విజయ్ అభిమానులు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు. -
పగ, ప్రతీకారంతో త్రిష.. ఎందుకంటే ?
Trisha Upcoming Movie The Road With Debutant Director Arun Vaseegaran: ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు హీరోయిన్ త్రిష. అయితే ఆమె పగ, ప్రతీకారాలు ఎందుకు? ఎవరిపై? అనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రోడ్’. వి.అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ‘ది రోడ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 22 సంవత్సరాల క్రితం మధురైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మధురైలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌ను దాదాపు 50 రోజులు మధురై లొకేషన్స్‌లోనే ప్లాన్ చేశారని తెలిసింది. సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మీయా జార్జ్, వివేక్, ఎమ్ఎస్ భాస్కర్, వేలా రామ్మూర్తి ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ‘ది రోడ్’ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చల్ చల్ గుర్రం... చలాకీ గుర్రం
గుర్రం చలాకీదే. గుర్రపు స్వారీ కూడా చలాకీయే. రేసులో చురుకుగా ఉంటే రేసుగుర్రం అవ్వొచు. ఇటీవలే కొందరు కథానాయికలు... గుర్రపు స్వారీ మీద శ్రద్ధ పెట్టారు. ఒకరేమో శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకోవడం కోసం. మరొకరు తన పాత్రను హిట్ చేయడం కోసం. ఆ విశేషాలు. యువరాణి పాత్రకోసం... ఇటీవల తన కొత్త ఫ్రెండ్ బూని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు త్రిష. బూ అంటే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న గుర్రం పేరు. త్వరలో చేయబోయే పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు త్రిష. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో నటించనున్నారు త్రిష. ఈ పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ అని తెలిసింది. మరింత ఫిట్‌గా... లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగిస్తే ప్రణీతా సుభాష్ ఫిట్నెస్ మీద మరింత దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ‘‘మా ట్రైనర్ నేనేదో సినిమాలో పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నానని అనుకున్నారు. కానీ అదేం కాదని చెప్పాను. హార్స్ రైడింగ్ వల్ల నా ఫిట్నెస్ మరింత మెరుగుపరుచుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేర్చుకుంటున్నానని చెప్పాను. నిజంగానే దీని వల్ల నా శరీరం మరింత చురుకుగా ఉంది. ఇదో సరికొత్త అనుభవం’’ అన్నారు ప్రణీత. పదును పెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌కు గుర్రపు స్వారీ వచ్చు. గతంలోనే ఆమె ఈ స్వారీ నేర్చుకున్నారు. అయితే తాజాగా తన ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. లాక్డౌన్లో మళ్లీ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ‘మన భవిష్యత్తు మన దినచర్యలోనే తెలిసిపోతుంది’ అంటూ ఆ ఫోటోలు షేర్ చేశారామె. -
నయా సవాల్: నేను సైతం అంటున్న త్రిష
ప్రస్తుతం దేశంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి ప్రాణ వాయువును కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. కేవలం అంతటితోనే ఆగకుండా.. స్వయంగా మొక్కలు నాటుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కదలిరావాలంటూ తమ మిత్రులకు, ఇతర రంగాల ప్రముఖులకు సవాలు విసురుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రముఖులను సైతం పర్యవరణ బాట పట్టిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసురుతూ.. వారిచేత మొక్కలు నాటిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణీ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ సవాలును ప్రకాశ్ పలువురు నటులతో పాటు నటీమణులకు విసిరారు. దీనిలో భాగంగానే ఆయన సవాలును స్వీకరించిన దక్షణాది బ్యూటీ త్రిష.. తాను సైతం అంటూ బరిలోకి దిగారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా త్రిష తన ఫాంహౌస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. (కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు) ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు త్రిష. ఇక ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంట్ జాబితాలో కన్నడ నటుడు మోహన్‌లాల్, తమిళ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్ రమ్యకృష్ణ ఉన్నారు. కాగా 2004లో వర్షం మూవీలో హీరోయిన్గా నటించి టాలీవుడ్లో తన ప్రస్తానాన్ని ఆరంభించిన త్రిష.. అనతికాలంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాన్ని దక్కించున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషాల్లోనూ నటిస్తున్నారు. -
యస్.. పోలీస్
రౌడీలను రప్ఫాడించడానికి త్రిష రెడీ అవుతున్నారు. ఎదుటి వ్యక్తి ఎలాంటివాడైనా అన్యాయం చేస్తే లాకప్‌లో లాక్ చేసేస్తారు. ఎందుకంటే ఆమె పోలీసాఫీసర్ కాబట్టి. దాదాపు 17 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన త్రిష ఇప్పటివరకూ పోలీస్ పాత్ర చేయలేదు. ఇప్పుడు ‘కుట్రపయిర్చి’ అనే తమిళ చిత్రంలో ఆ పాత్ర చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ‘పోలీస్‌గా చేయడానికి యస్’ అని కథ వినగానే త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్రిష, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అసలు సిసలైన పోలీసాఫీసర్‌గా ఒదిగిపోవడానికి త్రిష ప్రస్తుతం రియల్ లైఫ్ పోలీస్‌లను గమనిస్తున్నారట. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
రామ్ ఆగడు
‘‘రామ్’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామ్’. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సమయంలోనే మరో కథ రాయడం మొదలుపెట్టారు జీతూ. దీంతో ‘రామ్’ చిత్రం క్యాన్సిల్ అయినందువల్లనే జీతూ కొత్త కథపై పని మొదలుపెట్టారనే టాక్ మొదలైంది. ఈ విషయంపై ఇటీవలే జీతూ స్పందించారు. ‘‘కరోనా వల్ల ‘రామ్’ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. యూకే, ఉజ్బెకిస్తాన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ తగ్గిన తర్వాత తిరిగి ప్రారంభిస్తాం. కరోనా వైరస్‌ను బాగా కట్టడి చేసిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. సో.. కేరళలోనే మొత్తం షూటింగ్ జరిపేలా ప్రస్తుతం ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమాను ప్లాన్ చేయడం వల్ల ‘రామ్’ సినిమా రద్దయిందని కాదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నాం.. అంతే’’ అని పేర్కొన్నారు జీతూ. -
సీక్వెల్‌కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్. -
అందుకే తప్పుకున్నా
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ’పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమలా పాల్ కూడా నటించాల్సి ఉంది. కానీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపారామె. ‘మనకి ఆఫర్ చేసిన అన్ని సినిమాల్లో నటించలేము. ’పొన్నియిన్ సెల్వన్’లోని పాత్రకు నేను సరిపోను అనిపించింది. న్యాయం చేయలేము అనిపించినప్పుడు చేయకపోవడం ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
ఆచార్య నుంచి అవుట్
‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకున్నారు త్రిష. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫెర్సెన్స్ వల్ల ‘ఆచార్య’ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్లు త్రిష సోషల్ మీడియా ద్వారా త్రిష వెల్లడించారు. ‘‘కొన్నిసార్లు మొదట్లో మనకు చెప్పిన విషయాలు, చర్చలు మారిపోతుంటాయి. క్రియేటివ్ డిఫర్సెన్స్ వల్ల నేను చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమాలో నటించడం లేదు. త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో నా తెలుగు అభిమానులను కలుస్తాను’’ అని పేర్కొన్నారు త్రిష. 2016లో ‘నాయికి’ అనే తమిళ, తెలుగు చిత్రం తర్వాత త్రిష అంగీకరించిన చిత్రం ‘ఆచార్య’. ఇప్పుడీ సినిమా నుంచి తప్పుకున్నారామె. ఇదిలా ఉంటే 2006లో వచ్చిన ‘స్టాలిన్’లో చిరంజీవి, త్రిష జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఉగాదికి కొత్తగా...!
కొత్త తెలుగు సంవత్సర ప్రారంభోత్సవం రోజున చిరంజీవి సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు. పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను ఇటీవల తెరకెక్కించారని సమాచారం. అలాగే ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఇదేనంటూ ఓ ఫొటో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా అధికారికంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆచార్య... లుక్ అదుర్స్
ప్రత్యర్థులపై పులిలా పంజా విసురుతున్నారట చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం. చిరంజీవిపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే తాజాగా ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి లుక్ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక్కడున్న ఫొటో చూసిన చిరంజీవి అభిమానులు ‘ఆచార్య.. లుక్ అదిరిందయ్యా!’ అంటున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. -
సగం పారితోషికం ఇచ్చేయాలి
‘‘స్టార్ హీరోలతో తీసే సినిమాల ప్రచార కార్యక్రమాలకు హీరోయిన్లు రాకపోయినా ఫర్వాలేదు. హీరోని బట్టి ప్రమోషన్ వచ్చేస్తుంది. అయితే కథానాయికను నమ్మి లేడీ ఓరియంటెడ్ సినిమా తీసినప్పుడు దానికి కావల్సినంత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఆ హీరోయిన్‌దే’’ అన్నారు తమిళ నిర్మాత టి. శివ. త్రిష నటించిన తమిళ చిత్రం ‘పరమపద విళయాట్టు’కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఆ కార్యక్రమానికి త్రిష హాజరు కాకపోవడంతో టి. శివ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నూతన దర్శకుడు తిరుజ్ఞానం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న టి. శివ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా దర్శకుడు తిరుజ్ఞానం నా స్నేహితుడు. ఎంతో కష్టపడి తీశాడు. నేనింకా సినిమా చూడలేదు. కానీ రషెస్ చూసినవాళ్లందరూ బాగుందన్నారు. హీరోలు లేకుండా తను ఈ సినిమా చేశాడు. అందుకని ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత హీరోయిన్ మీద ఉంది. కానీ రాలేదు. ఒకవేళ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ఆమెకు విలువైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ 28లోపు జరిగే ప్రమోషనల్ కార్యక్రమాలకు తను కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇచ్చేయాలని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నా. ఇది ఇతర స్టార్స్‌కి కూడా కనువిప్పులా ఉంటుంది’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. -
పని పూర్తి
‘రాంగీ’ చిత్రం కోసం ఉబ్జెకిస్తాన్‌కు మళ్లీ వెళ్లారు హీరోయిన్ త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ త్రిష ఉబ్జెకిస్తాన్‌కు వెళ్లింది ‘రాంగీ’ సినిమాలో తన పాత్రలో మిగిలిన చిన్న భాగం చిత్రీకరణ కోసమే. దీంతో ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన పని పూర్తయిందని పేర్కొన్నారు త్రిష. ఎ మ్. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’ (వర్కింగ్ టైటిల్), మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’ చిత్రాలతో పాటు ఎప్పటిలాగే కొన్ని తమిళ ప్రాజెక్ట్స్‌తో ఈ ఏడాది కూడా తీరిక లేకుండా ఉన్నారు త్రిష. -
రాజమండ్రి ప్రయాణం
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తు న్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం ఈ నెల 24న రాజమండ్రి ప్రయాణం కానున్నారని సమాచారం. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. రాజమండ్రిలో ఓ కీలక షెడ్యూల్ ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు, కీలక సన్నివేశాలు ప్లాన్ చేశారని టాక్. ఈ షెడ్యూల్లోనే త్రిష షూటింగ్లో జాయిన్ అవుతారట. ఆల్రెడీ ఒక పాట కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేశారు. 80–90 రోజుల మధ్యలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్‌లో విడుదల చేయాలను కుంటున్నారట. -
యాక్షన్
మాట వినని రౌడీలకు చేత్తో సమాధానం చెబుతున్నారు చిరంజీవి. మరి దెబ్బలు తిన్నాకైనా మాట విన్నారా? ఆ సంగతి సినిమా చూసి తెలుసుకోవాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సుమారు 20 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నగర శివార్లలో ఓ భారీ సెట్‌ను నిర్మించారని తెలిసింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఆ సెట్లో చిత్రీకరిస్తారట. ఆగస్ట్‌లో ఈ సినిమా విడుదల కానుంది. -
వైఫ్ ఆఫ్ రామ్
పదిహేనేళ్లకు పైగా హీరోయిన్ పాత్రలు చేస్తున్న నటి త్రిష ఇప్పటివరకు మలయాళంలో చేసింది మాత్రం ఒక్క సినిమాయే. గతేడాది ‘హే జూడ్’ చిత్రంతో ఆమె మలయాళంలో తొలి అడుగు వేశారు. ఈ సినిమాలో త్రిష నటనకు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. అందుకే మాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామ్’ అనే చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో మోహన్‌లాల్ చేస్తున్న రామ్ పాత్రకు భార్యగా త్రిష కనిపిస్తారు. వచ్చే ఏడాది ఓనమ్ పండగకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ‘పొన్నియిన్ సెల్వన్’, చిరంజీవి –కొరటాల కాంబినేషన్ సినిమాల్లో త్రిష ఒక కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. సో.. వచ్చే ఏడాది త్రిష బిజీ అన్నమాట. -
ఛలో రాజమండ్రి
చిత్రబృందంతో కలసి రాజమండ్రిలో ల్యాండ్ అవడానికి స్కెచ్ గీస్తున్నారు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచాలనుకుంటున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను రాజమండ్రిలో చిత్రీకరించాలనుకుంటున్నారట. అక్కడ లొకేషన్స్ వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
సాంగ్‌తో షురూ
చిరంజీవి సినిమా అంటే పాటలు, అందులో ఆయన వేసే స్టెప్స్ హైలైట్. అయితే ‘సైరా’ సినిమాలో అవి మిస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు చేసే సినిమాలో ఆ కొరతను తీర్చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ హైలైట్ పాయింట్‌తోనే చిరంజీవితో చేయబోయే సినిమాను ప్రారంభిస్తున్నారట దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సామాజిక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో త్రిష హీరోయిన్గా నటించబోతున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణను పాటతో మొదలుపెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేశారని తెలిసింది. డిసెంబర్ మొదటివారంలో సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. -
ప్రయాణానికి సిద్ధం
‘ప్రణాళిక సిద్ధమైంది. నవంబర్ ద్వితీయార్ధం నుంచి బరిలోకి దిగడమే’ అంటున్నారు చిరంజీవి 152వ సినిమా చిత్రబృందం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్, మ ాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్రిష పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ సెకండ్ హాఫ్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అజయ్–అతుల్ ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. -
పవర్ ఫుల్ రాంగీ
‘రాంగీ’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో త్రిష కనిపించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో స్టంట్స్ అన్నీ స్వయంగా త్రిషానే చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం బులెట్ నడపడం కూడా నేర్చుకున్నారట. యం. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ కానుంది. -
ఓషన్ బేబీ
తీరిక లేని షెడ్యూల్స్‌తో బిజీగా ఉండే త్రిష సినిమాలను కాస్త పక్కన పెట్టి చిన్న బ్రేక్ తీసుకున్నారు. మాల్దీవుల్లోని సముద్ర తీరాలకు వాలిపోయి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తన ఆనందానికి గుర్తులుగా తీసుకున్న ఫొటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘మాల్దీవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నా. మేకప్ లేకుండానే నా ఫొటోలను షేర్ చేసున్నాను. ఓషన్ బేబీలా ఉండటం నాకు ఇష్టం’’ అని త్రిష అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. -
సెల్ఫ్ చెక్
టైమ్‌పాస్ కాకపోతే మొబైల్లో దూరిపోయి ఆటలు ఆడటమో, పాటలు వినడమో లేకపోతే సోషల్ మీడియాలో వార్తలు చూడటమో ఏదోటి చేస్తారు. మరికొందరు హాలిడే ప్లాన్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కార్యక్రమం షురూ చేస్తారు. మరి త్రిష ఏం చేస్తారంటే.. ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నప్పుడు తక్కువ టైమ్ దొరకుతుంది. అసలు మా గురించి మేం పట్టించుకోలేనంత బిజీగా ఉంటాం. అందుకే ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. అసలు మనం ఏం చేస్తున్నాం? చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయా? లేదా అని విశ్లేషించుకుంటాను. అలాగే వ్యక్తిగతంగా లైఫ్ ఎలా ఉంది? అని సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. దొరికిన టైమ్‌లోనే నాతో నేను ఎక్కువగా గడుపుతాను. స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఎలానూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉంటారు’’ అని చెప్పుకొచ్చారు త్రిష. -
ఆమె మళ్లీ లవ్‌లో పడిందట..!
సాక్షి, చెన్నై: సినిమా కథానాయికలు రియల్ లైఫ్‌లో లవ్‌లో పడటంలో విశేషం ఏమీ ఉండదు. అయితే అలా అందరి ప్రేమ సక్సెస్ అయిన సందర్భాలు తక్కువే. చాలా మంది ప్రేమలో పరాజయాన్నే చవి చూశారు. విషయానికి వస్తే సంచలన నటి త్రిష గురించి ప్రేమ వదంతులు చాలానే వచ్చాయి. టాలీవుడ్ నటుడితో ప్రేమ కలాపాలు అన్న వార్త దక్షిణాదిలో హల్చల్ చేసింది. అయితే ఆ నటుడు త్రిష తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అంటూ టేకిట్ ఈజీ ధోరణిలో స్పష్టం చేశారు. కాగా నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్మణియన్ను ప్రేమించిన త్రిష ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం అయింది. అందుకు సగం పెళ్లిగా భావించే వివాహ నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆ పెళ్లి నిశ్చితార్ధంతోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా కాలమే అయ్యింది. అప్పటినుంచి నటనపైనే దృష్టి సారిస్తున్న త్రిష ఇటీవల 96, పేట చిత్రాల విజయంతో మరోసారి ప్రైమ్ టైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ కథ చిత్రాల్లోనే నటిస్తోంది. అయితే తాజాగా.. ఈ చెన్నై చిన్నది మరోసారి ప్రేమలో పడినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ అమ్మడు తన అభిమానులతో ట్విటర్లో తరచూ ఇంటరాక్ట్ అవుతుంటుంది. వారి ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తూ వారిని ఖుషీ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఇటీవల అభిమానులతో ట్విటర్లో చాట్ చేసింది. పలువురు అభిమానుల ప్రశ్నలకు జవాబులిచ్చింది. అందులో ఒక అభిమాని మీ రిలేషన్ షిప్ స్టేటస్, మ్యారేజ్ గురించి చెప్పమని కోరాడు. అందుకు త్రిష బదులిస్తూ సింగిల్ బట్ టేకెన్ అని సింపుల్‌గా బదులిచ్చింది. అంతే కాదు డూ ఇట్ వెన్ ఇట్స్ ఏ వాంట్ అండ్ నాట్ ఏ నీడ్ అని కూడా చెప్పింది. దీంతో ఈ సంచలన నటి మరోసారి లవ్‌లో పడిందనే టాక్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అయితే ఆ తాజా లవర్ ఎవరన్నది ఆరా తీసే పనిలో మీడియా పడింది. ప్రస్తుతం త్రిష రాంగీ చిత్ర షూటింగ్లో నటిస్తోంది. -
రాంగీ లుక్
ఫారిన్లో చెన్నై సుందరి త్రిష అరెస్ట్ అయ్యారు. ఆమె ఫ్యాన్స్ అందరూ కంగారు పడాల్సిందేమీ లేదు. ఇది కేవలం ‘రాంగీ’ చిత్రంలోని ఓ సీన్ మాత్రమే. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘రాంగీ’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైలాగ్స్ రాశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి.. పోస్టర్లో త్రిష చేతికి బేడీలు వేసి ఉన్నాయి. దానికి గల కారణం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవలే చెన్నైలో తొలి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన చిత్రబృందం ప్రస్తుతం ఉబ్జెకిస్తాన్లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమాలో త్రిష కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేస్తారట. -
చలో ఉజ్బెకిస్తాన్
సామాన్లు సర్దుకుని ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ త్రిష. ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారనుకుంటే మాత్రం పొరపాటే. ‘రాంగి’ సినిమా కోసం త్రిష ఫ్లైట్ ఎక్కనున్నారు. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘రాంగి’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం విశేషం. ఇటీవల చెన్నైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో ప్లాన్ చేశారు టీమ్. అక్కడ త్రిషపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో త్రిష పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక త్రిష నటించిన ‘పరమపదమ్ విలయాట్టు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే హీరోయిన్ సిమ్రాన్‌తో కలిసి త్రిష ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమంత్ దర్శకుడు. -
అడవిలో ఓ రాత్రి!
పదిహేనేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో కొనసాగుతూనే ఉన్నారు చెన్నై బ్యూటీ త్రిష. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారామె. ఇన్నేళ్లయినా ఇంకా అదే అంకితభావంతో పని చేస్తున్నారామె. అందుకు తాజా ఉదాహరణ... పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి రెండుగంటలు ముందే షూటింగ్ లొకేషన్‌కి వెళ్లిపోయి, రిహార్సల్స్ చేశారట. త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘పరమపదమ్ విళయాట్టు’. త్రిష కెరీర్లో ఇది 60 చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి కె. తిరుజ్ఞానమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ త్రిష పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల కానుంది. నటుడు విజయ్ సేతుపతి విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా జర్నీ గురించి తిరుజ్ఞానమ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో త్రిష డాక్టర్‌గా తల్లి పాత్ర చేశారు. త్రిషకు నటిగా చాలా అనుభవం ఉన్నప్పటికీ సెట్‌కు రెండుగంటలు ముందే వచ్చేవారు. షూట్‌కు ముందే సీన్లను ప్రాక్టీస్ చేసేవారు. ప్రతి సీన్ పర్ఫెక్ట్గా రావాలని కోరుకునేవారు. అడవుల్లో కొన్ని యాక్షన్ సీన్లు తీశాం. కొన్నింటిని డూప్ లేకుండా చేశారామె. సినిమాల పట్ల ఆమెకు ఉన్న అంకితభావం సూపర్’’ అన్నారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇది ఫస్ట్ టైమ్. డాక్టర్ వృత్తి చేస్తున్న ఓ తల్లి అడవిలో ఓ రాత్రి ఎదుర్కొనే భిన్నపరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని పేర్కొన్నారు త్రిష. -
జోడీ లేదు
‘పేట, 96’ సినిమాల విజయాలతో మంచి హుషారు మీద ఉన్న త్రిష వరుసగా సినిమాలు సైన్ చేస్తూ కెరీర్లో జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఆమె నటించనున్న ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ పూజాకార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘రాంగీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘లైకాప్రొడక్షన్స్ నిర్మాణంలో ‘రాంగీ’ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు త్రిష. ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్ ఎమ్. శర్వణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్క్రిప్ట్‌ను అందించారట. స్క్రిప్ట్ పరంగా త్రిష పాత్రకు జోడీ లేదని చెన్నై టాక్. ఈ సినిమా కాకుండా కథానాయిక సిమ్రాన్‌తో కలిసి ఓ సినిమా, తిరుజ్ఞానం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు త్రిష. -
సూపర్ లేడీ
త్రిషను ఇప్పుడు చాలామంది సూపర్ లేడీ అంటున్నారు. ఎందుకంటే ఆమె చేతిలో ఉన్నవన్నీ దాదాపు ‘లేడీ ఓరియంటెడ్’ సినిమాలే. మామూలుగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే అందులో నటించే నాయికకు థియేటర్స్‌కి జనాలను రాబట్టగలిగే సత్తా ఉండాలి. అప్పుడే హీరోయిన్గా తీసుకుంటారు. త్రిష సూపర్ అని ఆమెను లేడీ ఓరియంటెడ్ సినిమాలకు తీసుకుంటున్నారు కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఇటీవలే ‘పరమ పదమ్ విళయాట్టు’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాని పూర్తి చేశారామె. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. సుమం రాధాకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ మరో నాయికగా నటిస్తున్నారు. తాజాగా మరో కథానాయికగా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్రిష. ‘ఎంగేయుమ్ ఎప్పోద్దుమ్’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్ ఎమ్. శర్వణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే హిందీ హిట్ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటిస్తారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు త్రిష నటించిన చతురంగవేటై్ట 2, 1818 రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సైన్ చేస్తూ త్రిష సూపర్ లేడీ అనిపించుకున్నారు. అంతేగా మరి... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు దాటినప్పటికీ ఇన్ని సినిమాలు చేతిలో ఉండటం అంటే సూపరే మరి. -
ఉగాదికి ప్రారంభం
తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తమిళ ‘96’ చిత్రం తెలుగు రీమేక్ ఆరంభం కానుందని తెలిసింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘96’. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సమంత నటిస్తారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది రోజున జరగనున్నట్లు తెలిసింది. ఆ రోజున ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. స్కూల్ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఓ అబ్బాయి, అమ్మాయి ఆ తర్వాత విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత కలిసిన ఈ ఇద్దరి మనోభావాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై ఈ సినిమా కథనం ఉంటుంది. -
డాక్టర్ త్రిష
ఒకరికి మంచి చేయాలని ప్రయత్నించి తాను చిక్కుల్లో పడ్డారు త్రిష. ఆమెను కిడ్నాప్ చేసి ఓ అజ్ఞాత ప్రదేశంలోని ఓ భవంతిలో దాచారు. అక్కడి నుంచి త్రిష ఎలా బయటపడ్డారు? అందుకు ఎలాంటి సాహసాలు చేశారు అనే అంశాలను ‘పరమపదమ్ విలైయాట్టు’ అనే సినిమాలో చూడొచ్చు. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఒరియంటెడ్ సినిమా ఇది. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తారు త్రిష. మరి.. డాక్టర్‌గా ఆమె చేయబోయిన హెల్ప్ ఏంటి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆల్మోస్ట్ టాకీ పార్ట్ పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి తక్కువ పాటలే ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమాలో త్రిష చేసే యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. అలాగే సిమ్రాన్, త్రిష ముఖ్య తారలుగా సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన హిట్ మూవీ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటించబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. రాధామోహన్ దర్శకత్వం వహిస్తారట. -
స్క్రీన్ టెస్ట్
ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు సి) కొంగర జగ్గయ్య డి) యస్వీ రంగారావు 2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) హరనాథ్ డి) శరత్‌బాబు 3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి? ఎ) రైలు బి) కారు సి) విమానం డి) స్కూటర్ 4. 2009 ఎలక్షన్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం) ఎ) కుష్బూ బి) నగ్మా సి) సుహాసిని డి) జయసుధ 5. నటి రోజా వైయస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా? ఎ) నగరి బి) చిత్తూరు సి) పీలేరు డి) తిరుపతి 6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్‌గా గెలుపొందిన నటి? ఎ) హేమమాలిని బి) జయప్రద సి) జయబాధురి డి) రేఖ 7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత? ఎ) కరుణానిధి బి) యం.జీ.ఆర్ సి) స్టాలిన్ డి) నెపోలియన్ 8. నటి రాధిక భర్త శరత్‌కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి? ఎ) హిందూ మక్కళ్ కట్చి బి) కొంగునాడు మున్నేట్ర కళగం సి) తమిళ్ మానిల కాంగ్రెస్ డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి 9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి? ఎ) మురళీమోహన్ బి) ఏవీయస్ సి) అలీ డి) కోట శ్రీనివాసరావు 10. 1995వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) బాలకృష్ణ డి) ఏయన్నార్ 11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) సాయికుమార్ బి) ప్రకాశ్ రాజ్ సి) అయ్యప్ప.పి.శర్మ డి) యశ్ 12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి, మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి? ఎ) శారద బి) కవిత సి) విజయశాంతి డి) విజయనిర్మల 13. ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు? ఎ) 2000 బి) 2001 సి) 2002 డి) 2004 14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా నటుడు? ఎ)ఉపేంద్ర బి) పునీత్ రాజ్‌కుమార్ సి) సుదీప్ డి) శివ రాజ్‌కుమార్ 15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్ర రావు సి) దిలీప్ కుమార్ డి) రాజేష్‌ఖన్నా 16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విశాల్ డి) విజయ్‌కాంత్ 17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు? ఎ) సుమన్ బి) పోసాని కృష్ణమురళీ సి) బాబుమోహన్ డి) విజయ్ చందర్ 18. 1999లో పదమూడవ లోక్‌సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు? ఎ) సి.అశ్వనీదత్ బి) మాగంటి బాబు సి) జి.ఆదిశేషగిరిరావు డి) డి.రామానాయుడు 19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు? ఎ) కృష్ణ బి) మురళీమోహన్ సి) కైకాల సత్యనారాయణ డి) కృష్ణంరాజు 20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్‌లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) హన్సిక డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి) 11) (బి) 12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
అక్కాచెల్లెళ్ల సాహసం
సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్లు. అవునా? అని ఆశ్చర్యపడుతున్నారా! నిజంగా కాదు.. ఓ సినిమాలో ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారు. సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను ముందు సిమ్రాన్‌కు చెప్పాను. నచ్చడంతో ఆమె అంగీకరించారు. ఆ తర్వాత త్రిషకు చెబితే, ఆమె కూడా ఎగై్జట్ అయ్యారు. ఇది అడ్వంచరస్ మూవీ. ముఖ్యంగా నీటిలోపల చేసే స్పెషల్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఇందుకోసం విదేశీ నిపుణులతో సిమ్రాన్, త్రిష ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. ఈ సాహసం చేయడానికి ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారు. మార్చి మొదటివారంలో చిత్రీకరణను మొదలు పెట్టనున్నాం. కొడైకెనాల్, కేరళ, పిచ్చావరమ్ దేశీ లొకేషన్లతో పాటు థాయ్‌ల్యాండ్‌లో కూడా షూటింగ్ చేయాలనుకుంటున్నాం’’ అని సుమంత్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష కలిసి నటించారు. కానీ వీరి కాంబినేషన్లో ఒక్క సీన్ కూడా లేదు. అలాగే 1999లో ప్రశాంత్ హీరోగా వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో త్రిష చాలా చిన్న గెస్ట్ రోల్ చేశారు. తాజా సినిమాలో ఇద్దరూ ముఖ్య తారలు కాబట్టి కాంబినేషన్ సీన్స్ చాలా ఉంటాయి. ఇద్దరూ మంచి ఆర్టిస్టులే. పోటీపోటీగా నటిస్తారని ఊహించవచ్చు. -
వేసవి నుంచి వేగం
2018లో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘96’ ఒకటి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషించనున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ లవ్ స్టోరీని తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. హీరోయిన్గా సమంత యాక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం, పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం, వారిలో ఓ ప్రేమ జంట వాళ్ల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. ఇలా సినిమా కథ సాగుతుంది. వేసవి నుంచి ఈ షూటింగ్లో జాయిన్ అయి జ్ఞాపకాల్లో వేగంగా వెనక్కి వెళ్తారన్నమాట శర్వానంద్. ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు శర్వానంద్. -
20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు
‘‘రజనీకాంత్‌గారికి నేను పెద్ద అభిమానిని. బస్ కండక్టర్ నుంచి ఆల్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారాయన. పైగా మంచి సేవాగుణం ఉంది. అందుకే రజనీకాంత్‌గారే నాకు స్ఫూర్తి. ఈ రోజు స్టేజ్‌పైన ఆయన పక్కన నిలబడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు నేనెంతో కష్టపడ్డాను కూడా’’ అని నిర్మాత వల్లభనేని అశోక్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ– ‘‘ఇందులో 20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు. ‘బాషా, ముత్తు, నరసింహ’ సినిమాల కంటే మరో లెవల్లో ‘పేట’ సినిమా ఉంటుంది. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల మధ్యలో మా సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్లు చాలా తక్కువగా దొరికాయి. కానీ, సినిమా బాగుంది కాబట్టి విడుదల తర్వాత థియేటర్లు పెరుగుతాయనే నమ్మకం ఉంది. ‘పేట’ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది పోటీ పడ్డారు. మా బ్యానర్లో ఈ మధ్య ‘నవాబ్, సర్కార్’ చిత్రాలను మంచి పబ్లిసిటీతో రిలీజ్ చేశాం. ఆ నమ్మకంతోనే సన్ పిక్చర్స్ వారు.. వేరే వారు ఆఫర్ చేసిన ఫ్యాన్సీ రేటుకంటే కోటిన్నర రెండు కోట్లు తగ్గించి నాకు ఇచ్చారు. ఇందుకు వారికి ధన్యవాదాలు. ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. రజనీగారితో పాటు యూనిట్ అంతా వస్తారు. మా నాన్నగారు బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయారు. అప్పటి నుంచి నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇందులో భాగంగా ఇదే వేదికపై కొన్ని అనాథాశ్రమాలకు, ఇతర సేవలు అందిస్తున్న కొందరికి రజనీగారి చేతుల మీదుగా చెక్‌లను అందిస్తాం. ఈ ఏడాది తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేయనున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నా’’ అన్నారు. అశోక్ వల్లభనేని -
తీపి కబురు
అభిమానులకు తీపి కబురు చెప్పారు రజనీకాంత్. తన తాజా చిత్రం ‘పేట్టా’ ట్రైలర్ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ‘పేట’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ఆడియోను ఆల్రెడీ రిలీజ్ చేసిన చిత్రబృందం ఈ నెల 28న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ‘పేట్టా’ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 51 నిమిషాలని కోలీవుడ్ టాక్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత వల్లభనేని అశోక్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. -
సంక్రాంతికి ఫిక్స్
ఇందుమూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియజేయడం ఏమనగా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘పేట’ సంక్రాంతికి విడుదల అవుతోందహో.. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్కార్, నవాబ్’ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మా బ్యానర్లో ‘పేట’ సినిమా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. రజనీ అభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అనిరు«ద్ చక్కటి సంగీతం ఇచ్చారు. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అన్నారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు. -
బ్యాక్ టు బ్యాక్
లడ్డు కావాలా.. మరో లడ్డూ కావాలా ? అంటూ త్రిష ఫ్యాన్స్‌ని ఊరిస్తున్నారు తమిళ నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్. ఎందుకీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అంటే.. త్రిష చేయబోయే తదుపరి రెండు చిత్రాలు ఈ బ్యానరే నిర్మించనుంది కాబట్టి. త్రిష ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతోంది. ఇప్పటికీ సూపర్ హిట్స్ అందుకుంటూ, టాప్ స్టార్స్ సరసన నటిస్తున్నారామె. ఆల్రెడీ ఆమె నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉండగానే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ‘‘తమిళంలో మా మొదటి చిత్రం ‘ గొరిల్లా’ విడుదల కాకముందే మరో రెండు సినిమాలు చేస్తున్నాం. త్రిషతో రెండు సినిమాలకు అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని పేర్కొంది నిర్మాణ సంస్థ. ‘‘ఆల్ ఇన్ పిక్చర్స్‌తో రెండు సినిమాలు చేయనుండటం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాల కోసం వేచి చూడండి’’ అని త్రిష పేర్కొన్నారు. -
96 కాదు 99
ఈ ఏడాది తమిళనాట సూపర్ హిట్ సినిమాల్లో ‘96’ ఒకటి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ మ్యాజికల్ లవ్ స్టోరీ వేరే ఇండస్ట్రీల్లోనూ రీమేక్ అవుతోంది. తెలుగులో ఈ చిత్రం హక్కులను నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ చిత్రం కన్నడంలోనూ రీమేక్ కానుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మలయాళ నటి భావన ఈ చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. గణేశ్, భావన ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ‘99’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
స్వీట్ 16
మగవాళ్లను జీతం, ఆడవాళ్లను వయసు అడగకూడదు అంటారు. ఫర్వాలేదు.. నన్ను అడగండి నేను చెప్పేస్తా అంటున్నారు త్రిష. అవునా.. మీ వయసెంత? అంటే... ‘స్వీట్ 16’ అంటారామె. నిజంగా స్వీట్ సిక్స్‌టీనా? త్రిష అబద్ధం ఆడుతుందనుకోకండి. నిజమే చెబుతున్నారామె. త్రిష చెబుతున్నది తన స్క్రీన్ ఏజ్ గురించి. నటిగా త్రిష వయసు స్వీట్ 16. డిసెంబర్ 13, 2002లో తన మొదటి చిత్రం ‘మౌనం పేసియదే’ విడుదలైంది. కథానాయికగా ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి, అటునుంచి తెలుగుకి వచ్చారామె. అంటే.. నటిగా పదహారేళ్లు పూర్తి చేసుకున్నారు త్రిష. ఈ పదహారేళ్ల కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్‌లో నటించి, విభిన్న పాత్రలు, గెటప్స్‌లో ప్రేక్షకులను అలరించారీ చెన్నై పొన్ను. ‘‘పొద్దున్నుంచి మెసేజ్‌లు, వీడియోలు పంపుతున్నారు నా ఫ్యాన్స్. ఇలాంటి సందర్భాలను నాకంటే మీరే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇలాంటి అభిమానం దొరికినందుకు సంతోషంగా ఉంది. స్వీటెస్ట్ 16 ఇయర్స్ అనిపిస్తోంది. ఈ జర్నీ అనుకున్నదానికంటే చాలా బాగా సాగింది’’ అని ఫ్యాన్స్‌ను, సినీ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు త్రిష. ఇంత లాంగ్ కెరీర్ సాగినా ఇప్పటికీ సూపర్‌స్టార్స్‌తో జోడీ కడుతూ ముందుకు దూసుకుపోతున్నారు త్రిష. ప్రస్తుతం తన హ్యాండ్‌బ్యాగ్‌లో ‘పేట్టా, గర్జనై, సతురంగ వేటై్ట, 1818, పరమపదమ్ విలయాట్టు’ చిత్రాలు ఉన్నాయి. -
మరో రజనీ రారు
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతున్నారు త్రిష. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు. మంచి అవార్డులనూ సొంతం చేసుకున్నారు. నటన పట్ల ఎంతో తపన, ఇష్టం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే కానీ ఈ ఫీట్స్ సాధ్యం కావు. కానీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఉన్న క్వాలిటీస్లో తనకు పది శాతం ఉన్నా ఇంకా బెటర్‌గా ఉండేదాన్నని అంటున్నారు త్రిష. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రంలో నటించారు త్రిష. ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. అక్కడ త్రిష మాట్లాడుతూ– ‘‘కోలీవుడ్‌లో మరో రజనీకాంత్ రారు. ఆయనలో ఉన్న క్యాలిటీస్లో కనీసం పది శాతం నాలో ఉన్నా నేనూ ఇంకా బెటర్ పర్సన్ అయి ఉండేదాన్ని. ‘ఏదైనా పనికి ఒకసారి నువ్వు కమిట్ అయితే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే తిరిగి వెళ్లాలి’ అని రజనీకాంత్‌గారు షూటింగ్ టైమ్‌లో చెప్పిన విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది’’ అని పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘పేట్టా’లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి నటించారు త్రిష. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘పేట్టా’ సినిమా టీజర్ ఈ రోజు ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. -
చూడరా కాళీ ఆట
‘పాక్కదాన పోర ఇంద కాళీయోడ ఆట్టత్త...’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు రజనీకాంత్. అంటే ‘చూడబోతున్నావు కదా ఈ కాళీ ఆట..’ అని అర్థం. రజనీ లేటెస్ట్ చిత్రం ‘పేట్టా’లో టైటిల్ సాంగ్ ఇలానే స్టార్ట్ అవుతుంది. ‘మరణ మాస్...’ అనే పదాలతో సాగే ఈ మాస్ సాంగ్ విని రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సంగీత దర్శకుడు అనిరు«ద్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రజనీకాంత్‌కు ఎస్పీబీ పాడిన పాట ఇది. ఈ పాటలో సూపర్‌స్టార్ సూపర్ ఎనర్జీతో స్టెప్పులేశారని చిత్రబృందం పేర్కొంది. కాగా, ఈ పాటలో కొన్ని లైన్స్‌ని మాత్రమే ఎస్పీబీ పాడారని కొందరు బాధపడుతున్నారు. రజనీ వీరాభిమానులైతే సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఎస్పీబీ స్పందిస్తూ– ‘‘చాలాకాలం తర్వాత రజనీకాంత్‌కి పాట పాడినందుకు ఆనందంగా ఉంది. ఈ పాటలో నా భాగం కొంత మాత్రమే. అయినా నాకేం ఇబ్బంది లేదు. ‘పేట్టా’ టీమ్ నా వాయిస్ కావాలనుకున్నారు. పాట పాడించటానికి నన్ను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. త్రిషా, సిమ్రాన్ కథానాయికలు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో రజనీ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. -
ఇట్స్ హాలీడే టైమ్
జీవితాన్ని ఆస్వాదించడం ఓ కళ. ఆ కళ కొందరికి తెలియదు. త్రిషకు మాత్రం బాగా తెలుసు. అలుపూ సొలుపూ లేకుండా షూటింగ్స్ చేసేయడం, డైరీలో కాస్త ఖాళీ దొరికితే హాలీడే ప్లాన్ చేసుకోవడం.. ఫుల్లుగా ఎంజాయ్ చేయడం. ఇది త్రిష మంత్ర. ప్రతి సంవత్సరం లాంగ్ ట్రిప్, షార్ట్ ట్రిప్.. ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. వీలు కుదిరితే రెండు ట్రిప్స్ వెళతారు. ముఖ్యంగా ఇయర్ ఎండింగ్లో ఎక్కువగా వెళుతుంటారు. ఇప్పుడు త్రిష హాలీడే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడికెళ్లారో తెలుసా? అమెరికాలోని కోస్టా రికాలో వాలిపోయారు. డిసెంబర్లో అక్కడి వాతావరణం చాలా బాగుంటుందట. పచ్చని ప్రదేశాలు, డైట్ పట్టించుకోకుండా లాగించేసేలా రుచికరంగా వడ్డించే రెస్టారెంట్లు... ఇలా రిలాక్స్ అవ్వడానికి బోల్డంత స్కోప్ ఉన్న ప్లేస్ కూడా. అందుకే త్రిష ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఇదిగో ఇక్కడ ఫొటోలో త్రిష ఎంత కూల్‌గా కనిపిస్తున్నారో చూశారా! కోస్టా రికాలో దిగిన ఫొటో ఇది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. త్రిష నటించిన తమిళ చిత్రం ‘96’ ఇటీవల విడుదలై, సూపర్ డూపర్ హిట్టయింది. ఆ ఆనందంలో ఉన్న త్రిషకు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘పేట్టా’లో నటించే అవకాశం దక్కింది. దాంతో డబుల్ హ్యాపీ. ఇంకా తమిళంలో మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. కెరీర్ ఆరంభించి పదిహేనేళ్లయినప్పటికీ త్రిష కెరీర్ స్టడీగా ఉండటం విశేషం. -
బాషా తర్వాత పేట్టా!
సంక్రాంతి పండక్కి వెండితెరపై రజనీకాంత్ సందడి చేయడం కన్ఫార్మ్ అయిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘పేట్టా’. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాష్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సిని మాను సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అవును... తలైవర్ (నాయకుడు) రజనీకాంత్ సంక్రాంతికి వస్తున్నారు’’ అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ‘‘రజనీకాంత్‌సార్ సరసన నటిస్తానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సిమ్రాన్. డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్, నటులు బాబీ సింహా, సనత్‌రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా జనవరి 10న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, ట్రెండ్ సెట్ చేసిన ‘బాషా’ తర్వాత సంక్రాంతికి విడుదలవుతున్న ఆయన సినిమా ‘పేట్టా’ కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
దేవుడిలాంటి మంచి మనసు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పేట్టా’. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో త్రిష కూడా జాయిన్ అయ్యారు. తొలిసారి రజనీతో నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో రజనీ, త్రిష కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లారు. ఆ టైమ్‌లో కెమెరా క్లిక్‌మనిపించిన ఓ పిక్‌ను షేర్ చేశారు త్రిష. ‘‘దేవుడి లాంటి మంచి మనసు ఉన్న రజనీకాంత్‌గారితో కలిసి కాశీ విశ్వనాథ దేవాలయానికి రావడం ఆనందంగా ఉంది’’ అనే కామెంట్ కూడా పెట్టారు త్రిష. ఇక ‘పేట్టా’ సినిమా విషయానికొస్తే... ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్‌సేతుపతి, డైరెక్టర్ మహేంద్రన్, డైరెక్టర్ శశి, సిమ్రాన్, మేఘా ఆకాష్, బాబీసింహా, సనత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ రెండు డిఫరెంట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుందని టాక్. -
స్క్రీన్ టెస్ట్
1. ‘తల్లా? పెళ్లామా?’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) బీఏ సుబ్బారావు బి) యన్టీ రామారావు సి) ఆదుర్తి సుబ్బారావు డి) కె.కామేశ్వరరావు 2. ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ చిత్రంలో హీరోయిన్గా నటించింది ఎవరు? ఎ) ఆర్తీ అగర్వాల్ బి) అన్షు సి) శ్రీదేవి డి) శ్రియ 3. ‘నాలుగు స్తంభాలాట’ చిత్రానికి ప్రముఖ దర్శకులు జంధ్యాల వద్ద దర్శకత్వ శాఖలో శిష్యుడిగా చేసిన ప్రముఖ దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కోడి రామకృష్ణ బి) ఈవీవీ సత్యనారాయణ సి) రేలంగి నరసింహారావు డి) యస్వీ కృష్ణారెడ్డి 4. ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో కథానాయిక ఎవరు? (క్లూ: ఈ చిత్రంలో హీరోగా రామ్ నటిస్తున్నారు) ఎ) సాయి పల్లవి బి) నివేథా థామస్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) క్యాథరిన్ 5. శింభు హీరోగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘మన్మథ’. ఈ చిత్రంలో ఆయన సరసన ఓ హీరోయి¯Œ గా సింధుతులాని నటించారు. మరో కథానాయిక ఎవరో తెలుసా? ఎ) జ్యోతిక బి) నయనతార సి) త్రిష డి) హన్సిక 6. ‘బలహీనత లేని బలవంతుణ్ణి భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు..’ డైలాగ్ రాసింది హను రాఘవపూడి. ఆ డైలాగ్ చెప్పిన హీరోఎవరు? ఎ) శర్వానంద్ బి) నితిన్ సి) నాని డి) అర్జున్ 7. ఈ వారం ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ పరంగా 40 లక్షలకు చేరుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రుతీహాసన్ బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) సమంత డి) పూజా హెగ్డే 8. ‘మిణుగురులు’తో మంచి చిత్రాన్ని అందించారని పలు ప్రశంసలను దక్కించుకున్నారు ఆ చిత్రదర్శకుడు అయోధ్య కుమార్. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిస్సెస్’ అనే సినిమా రూపొందింది. ఈ చిత్రంలో హీరోయిన్ హె బ్బా పటేల్. హీరోఎవరో తెలుసా? ఎ) నవీన్‌చంద్ర బి) రాజ్ తరుణ్ సి) అరుణ్ అదిత్ డి) రాహుల్ రవీంద్ర 9. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘తిరుడా తిరుడి’ (తెలుగులో ‘దొంగ దొంగ’) మూవీకి కథను అందించిందెవరో తెలుసా? ఎ) జేడీ చక్రవర్తి బి) ఇ. నివాస్ సి) శేఖర్ కపూర్ డి) రామ్ గోపాల్‌వర్మ 10. పదేళ్ల క్రితం నటుడు నానా పటేకర్ తనను వేధించాడంటూ వార్తల్లోకెక్కిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కంగనా రనౌత్ బి) మల్లికా శెరావత్ సి) తనుశ్రీ దత్తా డి) రాధికా ఆప్టే 11. మలయాళ సినిమా ‘మన్యం పులి’లో నటించి, మెప్పించిన హీరో ఎవరో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) సురేశ్ గోపి డి) జయరాం 12. ‘అమ్మోరు’ చిత్రం అనగానే నటి సౌందర్య గుర్తుకు వస్తారు. ఆ చిత్రంలో అమ్మవారి పాత్రను పోషించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) వాణీ విశ్వనాథ్ బి) సుకన్య సి) రమ్యకృష్ణ డి) ప్రేమ 13 అక్టోబర్ 10న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, కమెడియన్ అలీల పుట్టినరోజు. అదే రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రముఖ దర్శకుడెవరో తెలుసా? ఎ) శ్రీను వైట్ల బి) యస్.యస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) పూరీ జగన్నాథ్ 14. ‘మనీ’ చిత్రంలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ పాత్రలో జీవించిన ప్రముఖ నటుడెవరు? ఎ) బ్రహ్మానందం బి) జయప్రకాశ్ రెడ్డి సి) తనికెళ్ల భరణి డి) శుభలేఖ సుధాకర్ 15 కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘విశ్వదర్శనం’. ఆ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) ఇంద్రగంటి మోహన కృష్ణ బి) జనార్థన మహర్షి సి) దశరథ్ డి) అవసరాల శ్రీనివాస్ 16. జగపతిబాబు హీరోగా నటించిన ఓ చిత్రానికి ఆరు నంది అవార్డులు వచ్చాయి. ఆ సినిమా పేరేంటి? ఎ) ఆహా బి) గాయం సి) ఆహ్వానం డి) శుభాకాంక్షలు 17 ‘‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో...’ ఈ పాట ‘క్రిమినల్’ చిత్రంలోనిది. ఈ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా? ఎ) ^è క్రవర్తి బి) యం. యం. శ్రీలేఖ సి) ఏఆర్ రెహమాన్ డి) యం.యం. కీరవాణి 18. ‘ఖలేజా’ చిత్రంలోని ‘సదాశివ సన్యాసి తాపసీ కైలాసవాసి...’ పాట రచయితెవరో తెలుసా? ఎ) సిరిÐð న్నెల బి) చంద్రబోస్ సి) సుద్ధాల అశోక్‌తేజ డి) రామజోగయ్య శాస్త్రి 19. ఈ ఫొటోలోని నటుడెవరు? ఎ) ఆమిర్ ఖాన్ బి) హృతిక్ రోషన్ సి) సల్మాన్ ఖాన్ డి) షారుక్ ఖాన్ 20. యన్టీఆర్, చిరంజీవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) జ్వాలా బి) చట్టానికి కళ్లులేవు సి) తిరుగులేని మనిషి డి) ఎదురులేని మనిషి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) బి 4) సి 5) ఎ 6) బి ్చ7) డి 8) సి 9) డి 10) సి 11) బి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) బి 17) డి 18) డి 19) ఎ 20) సి నిర్వహణ: శివ మల్లాల -
మార్కెట్లో మస్తీ
రజనీకాంత్ తన స్టైల్లో పాటలకు స్టెప్పులు వేస్తే థియేటర్స్‌లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవాల్సిందే. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా కోసం కూడా ఇలాంటి స్టెప్స్ వారణాసిలో వేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రీసెంట్గా ఫైట్ సీన్స్‌ను కంప్లీట్ చేసిన చిత్రబృందం తాజాగా రజనీకాంత్‌పై మార్కెట్ సెట్లో ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది రజనీకాంత్ పరిచయ గీతం అని టాక్. ఈ పాటలో రజనీతో పాటు విజయ్ సేతుపతి కూడా ఉన్నారట. ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్స్‌లో రజనీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు షూటింగ్ స్పాట్లో ఫొటోలు లీక్ అవ్వడంతో చిత్రబృందం టెన్షన్ అవుతోంది. ‘ఈ ఫొటోలను షేర్ చేయొద్దు అని కోరుకుంటున్నాను. కొన్ని చానల్స్ ఈ షూటింగ్ వీడియోలు చూపించడం బాధాకర ం. కొన్ని రోజుల తర్వాత సినిమాని పైరసీ చేసేసి చానల్స్‌లో వేసేస్తారేమో’’ అని చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడు. -
అదిరింది తలైవా
రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెకండ్ లుక్‌ను గురువారం రిలీజ్ చేసి రజనీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు టీమ్. ఫస్ట్ లుక్‌లో రజనీకాంత్ ఫుల్ మాస్‌గా కనిపిస్తే, సెకండ్ లుక్‌లో క్లాస్‌గా కనిపించారు. ఈ లుక్స్‌ని బట్టి సినిమాలోని రజనీకాంత్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయని అర్థం అవుతుంది. అలాగే సెకండ్ లుక్ 1980 కాలంనాటిదిగా ఉంది. అంటే ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ వారణాసిలో జరుగుతోందని సమాచారం. రజనీ, విజయ్‌సేతుపతి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. నవాజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, డైరెక్టర్ శశి, మేఘా ఆకాశ్, సనత్ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇక ఆ బాధ అక్కర్లేదు
‘‘రజనీకాంత్‌గారితో కలిసి నేనెప్పుడు పని చేస్తాననే ప్రశ్న నన్ను ఎంతకాలం నుంచో బాధపెడుతోంది. ఇక బాధపడక్కర్లేదు. ‘పేట్టా’ సినిమాలో ఆయనతో కలిసి సిల్వర్ స్క్రీన్ పంచుకునే అవకాశం నాకు దక్కింది. సోమవారం నుంచి వారణాసిలో జరిగే తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటాను’’ అన్నారు త్రిష. ఎందుకు ఇంతలా ఆమె భావోద్వేగానికి గురయ్యారంటే... త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు రజనీకాంత్‌తో త్రిష కలిసి నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు ఆనందపడుతున్నారామె. అన్నట్లు.. ఈ చిత్రంలో సిమ్రాన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అసలు సిమ్రాన్, త్రిష కాంబినేషన్ సన్నివేశాలు లేవట. దీన్నిబట్టి ఈ చిత్రం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఓ కథానాయిక ఉంటారని ఊహించవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
తొంభయ్యారు.. తెలుగుకి తయారు
సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సహజం. కానీ తమిళంలో ఇంకా రిలీజ్ కాని ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ప్రేమ కథాచిత్రం ‘96’. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఇందులో ఫొటోగ్రాఫర్ పాత్రలో విజయ్‌సేతుపతి, టీచర్ పాత్రలో త్రిష కనిపిస్తారట. ఆల్రెడీ ఈ సినిమాను చూసి, రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు ‘దిల్’ రాజు. దీంతో తెలుగు రీమేక్‌లో ఎవరు నటిస్తారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాని, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. ‘‘తమిళంలో అక్టోబర్ 4న విడుదల కాబోతున్న ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం. నటీనటులను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేమికులు ఎవరో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు. -
నవ్వు చెబుతోంది
అభిమాన తారలతో ఫొటోలో బందీ అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. అయితే కథానాయిక మేఘా ఆకాశ్ కల నిజమైంది. ఆమెకు ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఫొటో దిగారు. ‘‘నా కల నిజమైంది. కొన్ని సార్లు నక్షత్రాలను అందుకునే అవకాశం వస్తుంది. నా ఆనందాన్ని నా నవ్వు చెబుతోంది’’ అంటూ ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేశారు మేఘా ఆకాశ్. ఈ సంగతి ఇలా ఉంచితే... కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో మేఘా ఆకాశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోతో ఆ విషయం కన్ఫార్మ్ అయ్యిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట. -
స్క్రీన్ టెస్ట్
1. ‘భలే భలే మగాడివోయ్ బంగారు నా సామిరోయ్...’ ఈ సూపర్ హిట్ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) జయసుధ బి) సరిత సి) మాధవి డి) జయచిత్ర 2. అఖిల్ నటిస్తున్న మూడో చిత్రానికి దర్శకుడెవరు? ఎ) విక్రమ్.కె. కుమార్ బి) వెంకీ కుడుముల సి) శ్రీకాంత్ అడ్డాల డి) వెంకీ అట్లూరి 3.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న మరో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘అల్లరి’ నరేశ్ బి) నవీన్ చంద్ర సి) ఆర్యన్ రాజేశ్ డి) రాహుల్ రవీంద్రన్ 4. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేసిన దర్శకుడెవరు? ఎ) రవిబాబు బి) శేఖర్ కమ్ముల సి) నాగ్ అశ్విన్ డి) తరుణ్ భాస్కర్ 5 నాగార్జున, నాని నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్‌కి ఇది ఎన్నో చిత్రం ? ఎ) 42 బి) 52 సి) 48 డి) 54 6. ఇటీవల విడుదలై విజయం సాధించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) పవన్ కుమార్ సి) రవికాంత్ పేరేపు డి) వెంకటేశ్ మహా 7. ‘బిగ్ బాస్’ సీజన్ 1’లో మంచి పేరు సంపాదించుకున్నారు హరితేజ. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఏ సినిమాలో ఆమె కామెడీ పాత్రలో నటించారో తెలుసా? ఎ) అఆ బి) సన్నాఫ్ సత్యమూర్తి సి) జులాయి డి) అత్తారింటికి దారేది 8. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది...’ ఈ పాటలో నటించిన ప్రముఖ నటి ఎవరు? ఎ) భూమికా చావ్లా బి) సిమ్రాన్ సి) లయ డి) రమ్యకృష్ణ 9. తెలుగులో విశాల్ హీరోగా విడుదలైన మొదటి డబ్బింగ్ సినిమా పేరేంటో తెలుసా? ఎ) పందెం కోడి బి) ప్రేమ చదరంగం సి) భరణి డి) భయ్యా 1.0 ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘బిల్లా’. ఆ చిత్రంలో అనుష్క ఓ హీరోయిన్గా నటించారు. అనుష్కతో పాటు మరో బ్యూటీ కూడా హీరోయిన్గా నటించారు. ఆవిడ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) త్రిష సి) ప్రియమణి డి) నమిత 11. ‘అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు...’ రజనీకాంత్ చెప్పే ఈ డైలాగ్ ఏ సినిమాలోదో కనుక్కోండి? ఎ) అరుణాచలం బి) భాషా సి) నర సింహా డి) కథానాయకుడు 12 .దర్శకుడు గౌతమ్ మీనన్ పరిచయం చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్. ఎవరామె? ఎ) సమంత బి) తమన్నా సి) నయనతార డి) శ్రియ 13. ‘సెకండ్ షో’ ఆ హీరోకి మొదటి మలయాళ సినిమా. ఈ మలయాళ నటుడు తెలుగు వారికీ సుపరిచితుడు. ఎవరతను? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) దుల్కర్ సల్మాన్ డి) సురేశ్ గోపి 14. ‘మల్లెçపువ్వు’ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలుసా? ఇది 2008లో విడుదలైన ‘మల్లెపువ్వు’. ఎ) ఇళయరాజా బి) కోటి సి) చక్రవర్తి డి) అనూప్ రూబెన్స్ 15. ఇటీవల స్వర్గస్తురాలైన దర్శకురాలు జయ ఎన్ని చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారో తెలుసా? ఎ) 4 బి) 3 సి) 5 డి) 6 16. ‘చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది. నీ వైపే మళ్లింది మనసు’.. పాట ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా లోనిది. ఆ పాట పాడిన గాయని ఎవరు? ఎ) చిన్మయ్ బి) శ్రేయా గోషల్ సి) సుచిత్ర డి) చిత్ర 17. తమిళ సినిమా ‘పేటై్ట’లో నటిస్తున్న హీరో ఎవరో కనుక్కోండి? (చిన్న క్లూ: ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు) ఎ) కమల్‌హాసన్ బి) శరత్ కుమార్ సి) రజనీకాంత్ డి) విజయ్ 18. సెప్టెంబర్ 20న ఈ ప్రముఖ నటుని పుట్టినరోజు. ఎవరా నటుడు? ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కృష్ణ డి) కృష్ణంరాజు 19. ఈ ఫొటోలోని బుడతడు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో. ఎవరై ఉంటారబ్బా? ఎ) అల్లు అర్జున్ బి) ఎన్టీఆర్ సి) రామ్ చరణ్ డి) మహేశ్ బాబు 20. కింది ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనుక్కోండి? ఎ) చలం బి) పధ్మనాభం సి) నగేశ్ డి) రాజనాల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) బి 2) డి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) ఎ 8) ఎ 9) బి 10) డి 11) సి 12) ఎ 13) సి 14) ఎ 15) డి 16) బి 17) సి 18) బి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
డాల్ఫినైనా కాకపోతిని
త్రిషాకు చేపలంటే ఇష్టం. గుండెల నిండా ప్రేమను నింపుకున్నారు. అంతెందుకు ‘నీమో ఫిష్’ ట్యాటూని వేసుకున్నారు. త్రిష లో నెక్ డ్రెస్ వేసుకున్నప్పుడు పరీక్షగా చూస్తే మీకే అర్థం అవుతుంది ఆ ట్యాటూ ఎక్కడ ఉందో. ఇప్పుడీ చేప గోల ఏంటీ? అంటే.. వరుసగా షూటింగ్స్ బిజీ నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న హాలీడే బ్రేక్ తీసుకున్నారు త్రిష. దాంట్లో భాగంగా దుబాయ్ వెళ్లారామె. అక్కడ ఎంచక్కా డాల్ఫిన్స్‌తో ఆడుకునే వీలు కుదిరింది. అంతే.. డాల్ఫిన్స్‌ను ముద్దాడుతూ, హగ్గాడుతూ కాలక్షేపం చేశారామె. అంతేనా.. తన అభిమానుల కోసం ఆ ఫొటోలను ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటూ షేర్ చేశారు. ఫొటోలను చూసి డాల్ఫిన్ అయినా కాకపోతిని అని కుర్రకారు అనుకునే అవకాశం ఉంది. -
ఫుల్ ప్రొటక్షన్
పాతికమంది పోలీసులు, దాదాపు నలభై మంది బౌన్సర్స్ రజనీకాంత్‌కు ప్రొటక్షన్‌గా ఉన్నారు. ఇది సినిమాలోని సీన్ కాదండీ బాబు. రియల్ సీన్. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిన్నది కాదు. దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. ఈ షెడ్యూల్లోనే ప్రధాన తారాగణంతో పాటు సుమారు 500 మంది బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. లక్నోలోనే కాకుండా వారణాసి, సోన్‌బాద్రా ఏరియాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ అవుతున్నాయని సెట్లోకి సెల్ ఫోన్స్‌ను నిషేధించారట టీమ్. సూపర్ స్టార్‌కి ఫుల్ ప్రొటక్షన్ ఏర్పాటు చేశారట.. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుందని కోలీవుడ్ టాక్. -
పేట్టలో వేట
గంటల వ్యవధిలో ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. అటు ‘2.0’ టీజర్, ఇటు తాజా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాకు ‘పేట్ట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా మోషన్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మాళవికా మోహనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. ‘పేట్ట’లో రజనీకాంత్ విలన్స్‌ని ఎలా వేటాడతారు? అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచి... ‘2.0’ విషయానికి వస్తే... శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలుగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
కొత్త లుక్ దేనికోసం?
సిల్వర్ స్క్రీన్‌పై మెరిసే తారలు ఏదైనా కొత్త స్టైల్లోకి మారితే హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు వార్తల్లో నిలిచారు త్రిష. కారణం జుట్టుని కురచగా కత్తిరించుకోవడమే. ఉన్నట్లుండి త్రిషకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అనే చర్చ జరుగుతోంది. పైగా చేతిలో సినిమాలు లేకపోతే ఏదో సరదా కోసం చేశారనుకోవచ్చు. ఇటీవల కమిట్ అయిన రజనీకాంత్ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. రజనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ఆరంభమై కొన్ని రోజులైంది. ఇంకా హీరోయిన్ త్రిష ఎంటర్ అవ్వలేదు. త్వరలో ఎంటర్ కానున్నారు. ఈ సమయంలో హెయిర్ కట్ చేయించుకున్నారంటే రజనీ సినిమా కోసమే అని, ఇందులో త్రిష కొత్త లుక్‌లో కనిపిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహలు నిజం అవ్వొచ్చు.. అవ్వకపోనూ వచ్చు. కొన్నాళ్లు ఆగితే అసలు కథేంటో తెలుస్తుంది. అన్నట్లు ఇప్పటివరకూ త్రిషను ఏ సినిమాలోనూ ఇలా చూడలేదు. సో.. సరికొత్త త్రిషను చూడబోతున్నామన్న మాట. -
ప్రొఫెసర్‌కి కోపం వస్తే...
కామ్‌గా క్లాస్‌లు చెప్పేవాడు అనుకొని తక్కువ అంచనా వేశారు ప్రొఫెసర్ రజనీకాంత్‌ని. కానీ అతని ఫ్లాష్‌బ్యాక్ తెలియక తన్నులు తిన్నారు రౌడీ గ్యాంగ్. ఇదంతా రజనీకాంత్ లేటెస్ట్ సినిమా షూటింగ్ విశేషాలే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ ఫైట్ సీన్‌ను కొరియోగ్రఫీ చేశారు. ఇందులో రజనీకాంత్ ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని, ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్లో డాన్‌లా కనిపిస్తారని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, మేఘా ఆకాశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
కలలా ఉంది!
కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. సూపర్ స్టార్‌తో యాక్ట్ చేసే హీరోయిన్ ఎవరో కన్ఫార్మ్ అయింది. రజనీకాంత్ నెక్ట్స్ సినిమాలో ఆయన సరసన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటూ? కొన్ని రోజులుగా గందరగోళం ఏర్పడింది. తలైవర్‌తో డ్యాన్స్ చేసేది త్రిష అని కొంతమంది అంటే.. కాదు మాళవికా మోహనన్ అని కొందరు వాదించారు. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశారు సన్ నెటవర్క్ సంస్థ ప్రతినిధులు. రజనీకాంత్ సరసన నటించనున్న హీరోయిన్ త్రిష అని అఫీషియల్‌గా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సిమ్రాన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి జోడీగా నటించబోతున్నది త్రిష అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు సన్ నెటవర్క్ ప్రతినిధులు. ‘‘కొన్ని సార్లు నిద్రలేచినా కూడా ఇంకా కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ వార్త నాకు అలాంటిదే’’ అని త్రిష ఆనందాన్ని పంచుకున్నారు. అన్నట్లు.. కొన్ని రోజుల క్రితం రజనీతో త్రిష జోడీ కుదిరింది అని ‘సాక్షి’ ప్రచురించిన సంగతి గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. -
సింహం సింగిల్‌గా...
ఐదు వందల మంది స్టూడెంట్స్‌తో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. అక్కడికొచ్చిన రజనీ కాంత్ మైక్ అందుకుని స్టూడెంట్స్‌ని ఉద్దేశిస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు. విద్యార్థులంతా రజనీ స్పీచ్‌కి ఇంప్రెస్ అయిపోయి ఈలల కొట్టసాగారు. ఏంటీ రజనీకాంత్ రాజకీయ సభ గురించి ప్రస్తావిస్తున్నాం అనుకుంటున్నారా? కాదు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసం షూట్ చేసిన ఓ సన్నివేశాన్ని వివరిస్తున్నాం. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ నెట్వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా త్రిష, మాళవికా మోహనన్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. అందులో భాగంగానే సుమారు 500 మంది స్టూడెంట్స్‌కి ఉపన్యాసం ఇస్తున్నటువంటి ఓ సన్నివేశాన్ని షూట్ చేశారట దర్శకుడు కార్తీక్. స్టేజ్ మీద సింహంలా సింగిల్‌గా డైలాగ్స్ పలికే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. మరి సినిమా మొత్తం ప్రొఫెసర్‌గానే రజనీకాంత్ కనిపిస్తారా అంటే? కాదు.. ఫ్లాష్‌బ్యాక్‌లో డాన్‌గా కనిపిస్తారట. విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
జోడీ కుదిరేనా?
అనుకున్నామని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని. ఇప్పుడీ సామెత రజనీకాంత్ తాజా చిత్రానికి సూట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకంటే... రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయాయి. 164 సినిమాలు చేశారాయన. అలాగే కెరీర్లో చెన్నై సుందరి త్రిష కూడా హాఫ్ సెంచరీ మైలురాయిని దాటారు. సినిమా ఫీల్డ్‌లో లీడ్ యాక్ట్రస్‌గా పదిహేను సంవత్సరాలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు రజనీకాంత్‌కు జోడీగా త్రిష నటించలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందంటున్నారు కోలీవుడ్ వాసులు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా నటించబోతున్నారని తాజా సమాచారం. దాదాపు 19ఏళ్ల క్రితం వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తే, అందులో త్రిష ఓ స్మాల్ రోల్ చేశారు. ఆ తర్వాత మళ్లీ త్రిష, సిమ్రాన్ స్క్రీన్ షేర్ చేసుకోలేదట. ఇప్పుడు ఈ సినిమాకి కుదురుతుందేమో. రీసెంట్గా డెహ్రాడూన్‌లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ చెన్నై, మధురైలో స్టార్ట్ కానుందని టాక్. విజయ్ సేతు పతి, బాబీ సింహా, సనత్ రెడ్డి, మేఘా ఆకాశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. -
ఫస్ట్ టైమ్ డబుల్ యాక్షన్ చేశాను
‘‘మోహిని’ కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అది చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని హీరోయిన్ త్రిష అన్నారు. త్రిష ముఖ్య పాత్రలో దర్శకుడు మాదేష్ రూపొందించిన హారర్ చిత్రం ‘మోహిని’. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ రావు పల్లెల, కరణం మధులత ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ– రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ నేను డ్యూయల్ రోల్ చేశాను. వైష్ణవి, మోహినీ పాత్రల్లో కనిపిస్తాను. రెండు పాత్రలకు పోలికే ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు మాదేష్ మాట్లాడుతూ – ‘‘హారర్ బేస్ట్ మూవీ అయినప్పటికీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.. అందుకే యు సర్టిఫికెట్ ఇస్తున్నాం అని సెన్సార్ వాళ్లు అన్నారు. 80 శాతం లండన్‌లో షూట్ చేశాం. త్రిషకు థ్యాంక్స్. చాలా స్టంట్స్, యాక్షన్ చేశారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రిషగారికి థ్యాంక్స్. త్రిషగారు బ్యాక్ విత్ బ్లాక్బాస్టర్. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.బి.గురుదేవ్, సంగీతం: వివేక్ మెర్విన్. -
మోహిని వచ్చేస్తోంది
దాదాపు రెండేళ్లు పూర్తి కావొచ్చింది తెలుగు తెరపై చెన్నై సుందరి త్రిష కనిపించి. 2016లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘నాయకి’లో నటించారామె. ఇప్పుడు మళ్లీ ‘మోహిని’ సినిమాతో తెలుగు తెరపై కనిపించనున్నారు. త్రిష ప్రధాన పాత్రలో ఆర్. మాదేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోహిని’. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేయనుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస రావు పల్లెల, కరణం మధులత నిర్మాతలు. గుంటూరు కాశిబాబు, డీవీ మూర్తి సహ–నిర్మాతలు. జాకీ, యోగి బాబు, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘మోహిని’ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు చిత్రబృందం. -
మాటల్లేవ్!
ఒక్క డైలాగ్ కూడా లేదు.. దాదాపు 82 సెకన్ల టీజర్లో. కానీ ప్రేమ, మౌనం, ఆశ్చర్యం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్ కనిపించాయి. అవును... మాట్లాడుకోవడానికి భాష కావాలి కానీ ప్రేమించుకోవడానికి ఎందుకు? త్రిష, విజయ్ సేతుపతి జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘96’. ఈ సినిమాతో కెమెరామెన్ ప్రేమ్‌కుమార్ దర్శకునిగా మారారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌సేతుపతి ఫొటోగ్రాఫర్‌గా, త్రిష టీచర్ పాత్రలో నటించారట. లేటెస్ట్గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సింగిల్ డైలాగ్ కూడా లేకపోవడం విశేషం. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ లవ్‌సాంగ్ వినిపిస్తోంది. టీజర్లో విజయ్ సేతుపతి డిఫరెంట్ డ్రెస్సెస్‌లో కనిపిస్తే త్రిష మాత్రం ఓన్లీ సింగిల్ డ్రెస్‌లోనే కనిపిస్తారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సామికి జోడీ కుదిరింది
2003లో వచ్చిన ‘సామి’లో విక్రమ్, త్రిష భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ‘సామి’ సీక్వెల్ ‘సామి స్క్వేర్’లో కూడా త్రిష యాక్ట్ చేస్తారని భావించారందరూ. త్రిష కూడా ముందు ఈ సినిమా కమిట్ అయ్యారు. ఆ తర్వాత క్రియేటీవ్ డిఫరెన్సెస్‌తో ‘సామి స్క్వేర్’ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారు. తాజాగా త్రిష ప్లేస్‌లోకి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా వచ్చారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీలో జాయిన్ అవ్వడం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో ఫుల్ కమర్షియల్ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేస్తుందని భావిస్తున్నాను. విక్రమ్సార్ పక్కన, హరి సార్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. సినిమా ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమాలో మహేశ్‌బాబు కబడ్డీ ఆటగాడిగా కనిపించారు. ఏ చిత్రంలోనో గుర్తుందా? ఎ) అతడు బి) ఒక్కడు సి) ఖలేజా డి) నిజం 2. ‘నాయకి’ ద్విభాషా చిత్రంలో నటిగా, దెయ్యంగా రెండు పాత్రల్లో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) సిమ్రాన్ సి) చార్మీ డి) జ్యోతిక 3. ‘‘చిరు చిరు చిరు చినుకై కురిశావే, మరుక్షణమున మరుగైపోయావే’’... అనే పాట ‘ఆవారా’ చిత్రంలోనిది. హీరోగా కార్తీ నటించారు. హీరోయిన్? ఎ) తమన్నా బి) శ్రియ సరన్ సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి 4. ఇలియానా 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో హీరో రవితేజ సరసన నటించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ 2018లో ఆమె ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎవరి సరసన హీరోయిన్గా నటిస్తున్నారో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) అల్లు అర్జున్ సి) ప్రభాస్ డి) రవితేజ 5. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో హీరోగా నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 20 6. మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) విజయ్‌కాంత్ డి) శరత్‌కుమార్ 7. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన ప్రఖ్యాత రచయితెవరో తెలుసా? ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) చంద్రబోస్ డి) రామజోగయ్య శాస్త్రి 8. నిర్మాత కె.యస్ రామారావు తన సొంత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్‌లో చిరంజీవితో ఎన్ని సినిమాలు నిర్మించారో తెలుసా? ఎ) 8 బి) 9 సి) 10 డి) 5 9. ‘ఇంద్ర’ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ. కానీ ఆ చిత్రంలోని ఓ సూపర్‌హిట్ సాంగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో.. చెలికాడు చంపేస్తున్నాడే’ అనే పాటకు సంగీత దర్శకుడు మాత్రం మణిశర్మ కాదు. మరి ఆ పాటకు సంగీత దర్శకుడెవ్వరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఆర్పీ పట్నాయక్ సి) ఇళయరాజా డి) యం.యం. కీరవాణి 10. ఓ పక్క యన్టీఆర్‌తో, మరో పక్క మహేశ్ బాబు సరసన సినిమా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) శ్రుతీహాసన్ డి) కాజల్ అగర్వాల్ 11. ‘మల్లెల తీరంలో’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? ఎ) శ్రీదివ్య బి) అంజలి సి) మాధవీలత డి) మధుశాలిని 12. పవన్‌కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం రీమేక్‌ను కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన తెలుగు దర్శకుడెవరో తెలుసా? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) దశరథ్ డి) పూరి జగన్నాథ్ 13. దర్శకుడు యస్.యస్. రాజమౌళి ట్వీటర్ ఐడీ ఏంటో? ఎ) మీ రాజమౌళి బి) యస్‌యస్ రాజమౌళి సి) యువర్స్ రాజమౌళి డి) రాజమౌళి సేస్ 14. చిరంజీవి అల్లుడు హీరోగా పరిచయమవుతన్న చిత్రానికి కెమెరామెన్ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) ఛోటా కె.నాయుడు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రత్నవేలు డి) మది 15. జూలై 3న పుట్టిన ప్రముఖ నటుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) కాంతారావు బి) యస్వీ రంగారావు సి) రామారావు డి) నాగేశ్వరరావు 16. ‘మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు’ అనే డైలాగ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం లోనిది. ఈ డైలాగ్‌ను ఏ ఆర్టిస్ట్ చెబుతారో తెలుసా? ఎ) ప్రకాశ్‌రాజ్ బి) సుహాసిని సి) వెంకటేశ్ డి) ఆర్తీ అగర్వాల్ 17. ‘నేనే నానీనే నీ నానీని నేనే..’ అనే పాట రచయితెవరో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) శివశక్తి దత్తా సి) రాజమౌళి డి) కల్యాణ్ రమణ కోడూరి 18. ‘అలా మొదలైంది’తో తన సినిమా దర్శక ప్రస్థానాన్ని ప్రారంభించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె ప్రస్తుతం ఏ హీరోతో సినిమా చేయనున్నారో తెలుసా? ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగశౌర్య డి) అల్లు శిరీష్ 19 ఈ క్రింది ఫొటోలోని బాలనటుడు ఓ పెద్ద హీరో. గుర్తుపట్టారా? ఎ) కమల్‌హాసన్ బి) మహేశ్‌బాబు సి) నాగార్జున డి) ఎన్టీఆర్ 20. ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో చెప్పుకోండి? ఎ) శ్రీ కృష్ణావతారం బి) శ్రీ కృష్ణ లీలలు సి) మాయాబజార్ డి) శ్రీ కృష్ణ సత్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) ఎ 6) ఎ 7) డి 8) డి 9) బి 10) బి 11) ఎ 12) డి 13) బి 14) బి 15) బి 16) బి 17) ఎ 18) బి 19) ఎ 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో...
లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించడం చెన్నై సుందరి త్రిషకు కొత్తేమీ కాదు. తమిళంలో ‘నాయకి’, ‘1818’ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించారు. కానీ టాలీవుడ్ దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఇది న్యూ జానర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో రూపొంది, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ‘శతమానం భవతి’, ప్రజెంట్ నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలు హీరో ఓరియంటెడ్. ఇప్పుడు సతీష్, త్రిష గురించిన ప్రస్తావన ఎందుకంటే.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో త్రిష ముఖ్య తారగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తెరకెక్కనుందన్న వార్తలు ఇండస్ట్రీలో ప్రచారం అవుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే. -
స్క్రీన్ టెస్ట్
1. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసి, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించారు. ఎవరామె? ఎ) తమన్నా బి) క్యాథరిన్ సి) ఇలియానా డి) లావణ్య త్రిపాఠి 2. భారతీయ చలనచిత్ర రంగం గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన దర్శకుడవ్వక ముందు ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఆడియోగ్రఫీ బి) ఎడిటింగ్ సి) కెమెరా డిపార్ట్మెంట్ డి) ఆర్ట్ డిపార్ట్మెంట్ 3. ‘షేక్ మోజెస్ మూర్తి’ పేరు భలే తమాషాగా ఉంది కదూ. 1972లో విడుదలైన ‘మల్లె పందిరి’ సినిమాలో ఈ పేరుతో ఉన్న క్యారెక్టర్‌ను పోషించిన గాయకుడెవరో తెలుసా? ఎ) ఎస్పీ బాలు బి) రామకృష్ణ సి) ఘంటసాల డి) ఇళయరాజా 4. కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ నటుని సరసన నటిస్తున్నారు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాని డి) సందీప్ కిషన్ 5. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో హీరో ‘అల్లరి నరేశ్’ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్ ఏ హీరోతో కలిసి నటిస్తున్నారో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) వెంకటేశ్ 6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసిన ‘అల్లుడు శీను’ చిత్రదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) బోయపాటి శ్రీను డి) శ్రీవాసు 7. 1998లో మోహన్‌బాబు నటించిన ‘రాయుడు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటì ఎవరో తెలుసా? 2001లోనే ఆమె చనిపోయారు? ఎ) దివ్యభారతి బి) ప్రత్యూష సి) సౌందర్య డి) భార్గవి 8. ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ శరన్ బి) త్రిష సి) సోనాలి బింద్రే డి) రవీనా టాండన్ 9. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... అనే పాటతో Ðð లుగులోకి వచ్చిన హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) హంసా నందిని బి) ర మ్యశ్రీ సి) అభినయశ్రీ డి) ముమైత్ ఖాన్ 10. ‘గులాబి’ చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఆ చిత్రనిర్మాత ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) కృష్ణవంశీ బి) జేడీ చక్రవర్తి సి) రామ్‌గోపాల్ వర్మ డి) సురేశ్ బాబు 11. శ్రీదేవి చెల్లెలిగా హీరోయిన్ మహేశ్వరి అందరికీ పరిచయమే. ఆమెను సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) భారతీరాజా బి) కోడి రామకృష్ణ సి) బాలచందర్ డి) కె. రాఘవేంద్రరావు 12. రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ చిత్రంలో ఆయన సరసన నటించిన బాలీవుడ్ భామ ఎవరో కనుక్కోండి? ఎ) ఐశ్వర్యారాయ్ బి) సోనాక్షి సిన్హా సి) దీపికా పదుకోన్ డి) అమీ జాక్సన్ 13. ‘‘క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాక ముందు చచ్చిపోవటమే’’... అనే డైలాగ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనిది. రచయితెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) వక్కంతం వంశీ సి) అబ్బూరి రవి డి) కోన వెంకట్ 14 ‘దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల భేరే చూడు’ అనే పాటను పాడిందెవరో తెలుసా? ఎ) అనుదీప్ బి) హేమచంద్ర సి) హిప్ హాప్ తమిళ డి) పెంచల్ దాస్ 15. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, అక్కినేని మనవరాలు సుప్రియ ఇద్దరికీ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ చిత్ర దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ఈదర వీర వెంకట సత్యనారాయణ సి) ఎ. కోదండ రామిరెడ్డి డి) యస్.జె. సూర్య 16. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అనే పాటను హమ్ చేసింది సింగర్ కాదు. ఆమె ఓ నటి. ఎవరామె? ఎ) కలర్స్ స్వాతి బి) రాశీ ఖన్నా సి) తమన్నా భాటియా డి) అనుపమా పరమేశ్వరన్ 17. తెలుగు అగ్ర హీరోల్లో ఓ హీరో ఇప్పుడు సౌదీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. నెలకుపైగా అక్కడే షూటింగ్లో ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్ డి) వరుణ్‌తేజ్ 18. ‘జంబలకడి పంబ’ అనే సినిమా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి సినిమాలో హీరో నరేశ్, ఇప్పుడు అదే పేరుతో తయారైన ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) ‘షకలక’ శంకర్ సి) ధన్‌రాజ్ డి) శ్రీనివాసరెడ్డి 19. ఈ కింది ఫొటోలోని బాలీవుడ్ హీరో ఎవరో చెప్పండి? ఎ) సల్మాన్‌ఖాన్ బి) షారుక్ ఖాన్ సి) ఆమిర్ ఖాన్ డి) సైఫ్అలీ ఖాన్ 20. ఈ ఫొటోలో మేకప్ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుహాసిని డి) జయప్రద మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (బి) 5) (సి) 6) (ఎ) 7) (బి) 8) (సి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (సి) 13) (బి) 14) (డి) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (డి) 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
నాతో నేను!
రోజూ మనల్ని ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఇష్టం ఉంటే మనం కూడా మాటలు కలుపుతాం. కానీ మాట్లాడిన అందరూ మనకు మిత్రులైపోరు. ఒకవేళ మిత్రులైనా అందరితో అన్నీ పంచుకోలేం. అందుకే రోజులో ఒకసారైనా మనల్ని మనం పలకరించుకుని, ఆత్మపరిశీలన చేసుకుంటూ లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. ఇదే విషయాన్ని చెబుతున్నారు కథానాయిక త్రిష. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘నాతో నేను ఎక్కవ టైమ్ గడపడమే నా స్ట్రైస్ బస్టర్. అవసరమైతే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటాను. నాకు గ్రేట్ ఫ్యామిలీ ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు. వారితో కూడా టైమ్ స్పెండ్ చేస్తా. కానీ నాకు నేను తోడుగా ఉండటం మాత్రం మరిచిపోను’’ అంటున్నారు త్రిష. ఇక సినిమాల విషయానికొస్తే... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు కంప్లీట్ అవుతున్నప్పటికీ ఆమె జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రజెంట్ అరడజను తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు త్రిష. ఆమె నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరో మూడు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. -
స్క్రీన్ టెస్ట్
► ప్రభాస్ నటించిన ఓ సినిమాకు ‘వారధి’ అని పేరు పెట్టారు. తర్వాత వేరే కారణాలవల్ల సినిమాకు పేరు మార్చారు. ఏ సినిమాకు ఇలా జరిగిందో తెలుసా? ఎ) మిర్చి బి) మిస్టర్ పర్ఫెక్ట్ సి) మున్నా డి) డార్లింగ్ ► తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ తన తమ్ముడిని హీరోగా చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ హీరోయిన్ ఎవర బ్బా? ఎ) తమన్నా బి) రకుల్ ప్రీత్ సింగ్ సి) హన్సిక డి) లావణ్యా త్రిపాఠి ► నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేశావె’ చిత్రానికి సంగీతదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) యస్.యస్. తమన్ బి) హారీస్ జయరాజ్ సి) అనూప్ రూబెన్స్ డి) ఏ.ఆర్. రెహమా¯Œ ► దర్శకుడు రాజమౌళిని ఓ హీరో జక్కన్న అని పిలుస్తారు. ఎవరా హీరో? ఎ) యన్టీఆర్ బి) ప్రభాస్ సి) రామ్‌చరణ్ డి) రవితేజ ► ‘బాషా’ దర్శకుడు సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో ‘అస్త్రం’ అనే సినిమాలో నటించారు హీరోయిన్ ‘అనుష్క’. ఆ సినిమా హీరో ఎవరో గుర్తుందా? ఎ) సుమంత్ బి) రానా సి) విష్ణు డి) గోపీచంద్ ► ‘కలలా నా జీవితంలోకి వచ్చావ్, కల కంటున్నపుడు వెళ్లిపోయావ్, మళ్లీ ఇన్నాళ్లకి మెరిశావు... కలో నిజమో అర్థం కావట్లేదు’ అనే డైలాగ్ హీరో వరుణ్ తేజ్ ఏ హీరోయి¯Œ తో చెప్పాడో తెలుసా? ఎ) పూజా హెగ్డే బి) రాశీ ఖన్నా సి) హెబ్బా పటేల్ డి) ప్రగ్యా జైస్వాల్ ► ‘జానకి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి ’ అనే సూపర్‌హిట్ పాట రచయిత ఎవరు? ఎ) వనమాలి బి) అనంత శ్రీరామ్ సి) భాస్కరభట్ల డి) చంద్రబోస్ ► త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ హీరో ఫస్ట్ టైమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌కి వెళ్లిన ఆ సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్‌చరణ్ డి) చిరంజీవి ► ‘హాంకాంగ్’లో పుట్టిన ఈ ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కుటుంబం లండన్‌లో సెటిల్ అయ్యింది. ఆమె తెలుగు సినిమాలో కూడా నటించిన హీరోయినే.ఎవరయ్యుంటారామె? ఎ) అమీషా పటేల్ బి) అయేషా టకియా సి) కంగనా రనౌత్ డి) కత్రినా కైఫ్ ► ‘ఇన్స్టాగ్రామ్’లో 71 లక్షలమంది ఫాలోయర్లను సొంతం చేసుకున్నహీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కాజల్ అగర్వాల్ బి) శ్రుతీహాసన్ సి) ఇలియానా డి) సమంత ► నటుడు ప్రకాశ్‌రాజ్ ఏ దర్శకుని ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారో తెలుసుకుందామా? ఎ) దాసరి బి) భారతీరాజా సి) బాలు మహేంద్ర డి) బాలచందర్ ► 1998లో ఈ హీరోయిన్ ‘మిస్ సూరత్’. ఆ తర్వాత తెలుగు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఎవరా హీరోయిన్? ఎ) నమిత బి) మీనా సి) త్రిష డి) సిమ్రాన్ ► ‘నేను నా జీవితం’ అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కాంతారావు బి) కృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరావు డి) శోభన్‌బాబు ► ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్విమ్ మీట్ ఈత పోటీల్లో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించిన వేదాంత్ ఏ హీరో కుమారుడో తెలుసా? ఎ) విజయ్ బి) మాధవన్ సి) విక్రమ్ డి) అజిత్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. అందులో జెమినీ గణేశన్ పాత్రలో నటించింది ఎవరు? ఎ) విజయ్ దేవరకొండ బి) మోహన్బాబుసి) నాని డి) దుల్కర్ సల్మాన్ ► మణిపాల్ యూనివర్శిటీలో జర్నలిజం చదువుకుని, తర్వాత హీరోయిన్గా సింగర్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) నివేథా థామస్ బి) నిత్యామీనన్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ ► ‘శంకర్‌దాదా’ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన యువ హీరో ఎవరో గుర్తుందా? ఎ) శర్వానంద్ బి) సందీప్ కిషన్ సి) శ్రీనివాస్ అవసరాల డి) ప్రిన్స్ ► ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో శ్రీదేవి ముఖ్య తారగా నటించారు. శ్రీదేవి మేనకోడలి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? శేఖర్ కమ్ముల ‘లీడర్’ చిత్రంలో ఒక హీరోయిన్గా ఆమె నటించారు? ఎ) రిచా గంగోపాధ్యాయ బి) దీక్షాసేథ్∙ సి) ప్రియా ఆనంద్ డి) కమలినీ ముఖర్జీ ► సుమన్, భానుప్రియ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) సితార బి) అన్వేషణ సి) ఆలాపన డి) ప్రేమించు పెళ్లాడు ► ఈ ఫొటోలోని ప్రముఖ హాస్యనటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రీలక్ష్మీ బి) రమాప్రభ సి) గీతాంజలి డి) తెలంగాణ శకుంతల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) ఎ5) సి 6) బి 7) సి 8) బి 9) డి 10) ఎ 11) డి 12) ఎ 13) సి 14) బి 15) డి 16) బి17) ఎ 18) సి 19) ఎ20) బి నిర్వహణ: శివ మల్లాల -
లక్కీ గర్ల్ ఎవరు?
బీటౌన్ బ్యూటీనా..! చెన్నై పొన్నా! అచ్చ తెలుగు అమ్మాయా! సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించబోయేది ఎవరు? అనే చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా స్క్రిప్ట్ వర్క్ గురించి రజనీకాంత్‌ను కలిశారట సుబ్బరాజ్. ఈ సినిమాలో కథానాయికప్లేస్ కోసం రేస్ మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, చెన్నై సుందరి త్రిష, తెలుగు అమ్మాయి అంజలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ‘కొచ్చడయాన్’ సినిమాలో రజనీకాంత్ సరసన దీపికా పదుకోన్ నటించారు. త్రిష, అంజలి ఇంతవరకు ఆయన సరసన నటించలేదు. కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిర ‘ఇరైవి’ చిత్రంలో హీరోయిన్గా నటించారు అంజలి. మరి.. ఈ ముగ్గురి ముద్దుగుమ్మల్లో రజనీతో జోడీ కట్టేదెవరు? అనేది చూడాలి. లేక కొత్తగా ఎవరైనా వచ్చి ఈ చాన్స్‌ను కొట్టేస్తారా? అన్న డౌట్స్‌కు ఫుల్స్టాప్ పడాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్. -
త్రిష దరఖాస్తు చేశారట!
తమిళసినిమా: చెన్నై చిన్నది త్రిష దరఖాస్తు పరిశీలనకు వస్తుందా? ఈ బ్యూటీ చిరకాల ఆశ నెరవేరుతుందా? ఇలాంటి ప్రశ్నలపై కోలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడో 19 ఏళ్ల కిందట జోడి చిత్రంలో సహ నటిగా తమిళ తెరకు పరిచయమైన నటి త్రిష. 2002లో మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయకిగా మెరిశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ బహుభాషా నటిగా పేరుగాంచారు. కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, విక్రమ్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్ ఇలా పలు భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టారు. అయితే ఒక్క రజనీకాంత్‌తో మాత్రం నటించే అవకాశం ఇప్పటికీ రాలేదు. చాలా సార్లు త్రిష పలు వేదికలపై రజనీకాంత్‌తో ఒక్క సన్నివేశంలోనైనా నటించాలన్నది తన చిరకాల కోరిక అని బహిరంగంగానే వెల్లడించారు. ప్రస్తుతం రజనీ నటనకు స్వస్తి చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన నటించిన కాలా, 2.ఓ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. తాజాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రమే చివరిదనే ప్రచారం జరగుతోంది. ఇందులో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలన్న లిస్ట్‌లో నటి త్రిష పేరు కూడా ఉందట. దీంతో త్రిష ఆశలు చిగురిస్తున్నాయి. అయితే దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ త్రిష చిరకాల ఆశను నెరవేర్చగలరా? అన్నదే ప్రశార్థకంగా మారింది. త్రిష మాత్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. ఇప్పుటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌లో దరఖాస్తు పెట్టుకున్నారట. అది పరిశీలనలోకి వస్తుందా? అన్నదే ఆసక్తిగా మారింది. త్రిష ప్రస్తుతం మోహిని, గర్జన, 1818, చతురంగవేట్టై, పరమపథం విళైయాట్టు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారన్నది గమనార్హం. -
నాతో పెట్టుకుంటే పంచ్‌పడుద్ది
తమిళసినిమా: చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో. నాతో పెట్టుకుంటే పంచ్‌పడుద్ది అంటున్నట్టుంది నటి త్రిష వాలకం చూస్తుంటే. ఏంటీ అసందర్భ ప్రేలాపన అని అనుకుంటున్నారా? చెన్నై చంద్రం త్రిష నటిగా దశాబ్దం కాలాన్ని అవలీలగా దాటేసింది. ఈ చిన్నది ప్రేమలో ఫెయిల్ అయ్యి ఉండవచ్చుగానీ, నటిగా సక్సెస్‌లోనే ఉంది. జయాపజయాలకు అతీతంగా నటిగా తన గ్రోత్‌ను నానాటికీ పెంచుకుంటూ పోతోంది. గ్లామర్ హీరోయిన్ స్టేజ్‌ను దాటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల స్థాయికి చేరుకుంది. అలా నటించిన నాయకి చిత్రం ఫ్లాప్ అయినా, ఆ తరహా అవకాశాలు మాత్రం త్రిషను వరిస్తూనే ఉన్నాయి. అరవిందస్వామికి జంటగా నటించిన చదురంగవేట్టై– 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విజయ్‌సేతుపతితో నటిస్తున్న 96 చిత్రం నిర్మాణంలో ఉంది. ఇక 1818 చిత్రంతో పాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు మోహిని, గర్జన చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈ స్థాయికి రావడానికి తన నిరంతర శ్రమ, పాత్రలపై అంకిత భావం లాంటివి కారణంగా భావించాలి. 3 పదుల వయసు మీద పడినా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చేసే కృషిలోమాత్రం మార్చు లేదన్నది తాజాగా తను విడుదల చేసిన ఒక వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఆ వీడియోలో త్రిష తన శిక్షకుడితో బాక్సింగ్ క్రీడలో తర్ఫీదు పొందుతున్న దృశ్యాలు అందర్నీ అచ్చరువు చెందేలా చేస్తున్నాయి. అందులో త్రిష శిక్షణ పొందుతున్నట్లు కనిపించడం లేదు. గెలుపు కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేలా చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో, నాతో పెట్టుకుంటే మడతైపోద్ది అన్నట్లు ఉంది. ఈ అందాల తార తన కొత్త చిత్రం కోసం కిక్ బాక్సింగ్‌లో తీవ్రంగా శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఈ చిన్నది బాక్సింగ్ చేస్తున్న వీడియో దృశ్యాలిప్పుడు సోషల్ మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.వీటిని ఆమె అభిమానులు యమాగా ఎంజాయ్ చేస్తున్నారు. త్రిషానా మజాకా! -
మిస్ డిటెక్టివ్
చేతిలో సెల్‌ఫోన్, బ్యాగ్‌లో కాస్మొటిక్స్ మాత్రమే కాదు... కత్తి, పిస్టల్‌లను కూడా బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నారు త్రిష. ఎందుకంటే.. ప్రైవేటు డిటెక్టివ్ కదా. ఆ మాత్రం సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిందేగా. త్రిష చేయబోయే సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? టార్గెట్ ఎవరు? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. కొత్త దర్శకుడు వెర్నిక్యు దర్శకత్వంలో రూపొందనున్న ఉమన్సెంట్రిక్ ఫిల్మ్ ‘కుట్రపయర్చి’ (నేరము శిక్షణ అని అర్థం)లో లీడ్ రోల్ చేస్తున్నారు త్రిష. ‘‘స్టోరీ చెప్పినప్పుడు త్రిష చాలా ఎగై్జట్ అయ్యారు. ఆమె క్యారెక్టర్లో మల్టీషేడ్స్ ఉంటాయి. సరదాగా ఉండే తన పాత్ర సడన్‌గా స్ట్రాంగ్ అండ్ డేర్ డెసిషన్స్ తీసుకుంటుంది’’ అన్నారు వెర్నిక్యూ. అంతేకాదు ఈ సినిమాలో షార్ట్ హెయిర్‌తో డిఫరెంట్‌గా కనిపించనున్నారట త్రిష. దేశంలో ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ రజనీ పండిట్‌ని ఆదర్శంగా తీసుకుని త్రిష క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట చిత్రబృందం. గతేడాది ఒక్క సినిమాలోనూ కనిపించని త్రిష ఈ ఏడాది మినిమమ్ అరడజను సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. -
త్రిష ఉన్నారు సామీ
... అంటున్నారు డైరెక్టర్ హరి. ఇంతకీ త్రిష ఎక్కడ ఉన్నారు? ఉన్న సంగతిని హరి ఎందుకు కన్ఫార్మ్ చేస్తున్నారనే విషయానికి వస్తే.. విక్రమ్, త్రిష జంటగా 2003లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘సామీ’కి సీక్వెల్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులోనూ కథానాయికగా త్రిషను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ తర్వాత మరో కథానాయికగా కీర్తీ సురేష్‌ని తీసుకోవడం, తన పాత్ర నిడివి తక్కువగా ఉందని త్రిష ఫీలై సినిమా నుంచి తప్పుకోవడం జరిగిందనే వార్తలు వచ్చాయి. ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నా’’ అని సోషల్ మీడియా ద్వారా త్రిష స్వయంగా చెప్పారు కూడా. అయితే.. ‘‘ఈ సినిమాలో త్రిష ఉన్నారు’’ అని తాజాగా ఓ ప్రెస్మీట్లో హరి స్పష్టం చేశారు. మరి.. కీర్తీ సురేష్ లేరా? అంటే ఆమె కూడా ఉన్నారు. ముందు కాదన్న త్రిష తర్వాత ఒప్పుకున్నారంటే.. హరి ఆమెను కన్విన్స్ చేసి ఉంటారనేగా అర్థం. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
బొం బొం బాటుగుందిరా డైరీ
ఈ హీరోయిన్లు ఈ ఏడాది మేకప్ తీసేట్టు లేరు. సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా.... డైరీ బిజీ. ఫుల్‌గా సినిమాలు... నిల్‌గా డేట్స్. నయా తార: ఎంతమంది కొత్త నాయికలు వచ్చినా.. నయనతార ‘నయా తార’లానే ఉన్నారు. గతేడాది డోరా, ఆరమ్, వేలైక్కారన్ ఇలా.. మూడు తమిళ సినిమాలు చేశారు. ఇందులో ‘డోరా’ తెలుగులో విడుదలైంది. మరి... ఈ ఏడాది స్కోర్ ఎంత అంటే? గతేడాది కన్నా ఎక్కువ. నయనతార ఖాతాలో మూడు తమిళ సినిమాలు (ఇమైక్క నొడిగళ్, కొలైయుదిర్ కాలమ్, కోలమావు కోకిల) ఉన్నాయి. ఇక తెలుగులో సంక్రాంతికి వస్తున్న ‘జై సింహా’లో నయనతారే కథానాయిక. ‘సైరా’కి సై అన్న విషయం తెలిసిందే. ‘కర్తవ్వం’ అనే టైటిల్‌తో ‘ఆరమ్’ని తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాల సంగతి ఇలా ఉంచితే.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార లవ్‌లో ఉన్నారని చెన్నై ఇండస్ట్రీ కోడై కూస్తోంది. పెళ్లి ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి. సౌత్‌లో ఆ గౌరవం త్రిషదే: చెన్నై చందమామ త్రిష గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరవలేదు. అలాగని అవకాశాలు తగ్గిపోయాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఏకంగా ఆరు సినిమాలు (మెహిని, గర్జనై, చతురంగ వెటై్ట 2, 1818, 96, హే జ్యూడ్) ఆమె చేతిలో ఉన్నాయి. మరో మూడు సినిమాలకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో... 2018లో లెక్క ఎక్కువ. సినిమాలవైజ్గా గతేడాది వెనక్కి తగ్గారేమో కానీ,, అరుదైన గౌరవం దక్కించుకున్నారు త్రిష. యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) సెలబ్రిటీ అడ్వకేట్ స్టేటస్‌ను పొందారామె. సౌత్‌లో ఈ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ హీరోయిన్ త్రిషనే అట. వెరీ వెరీ స్పెషల్: గతేడాది సమంతకు వెరీ వెరీ స్పెషల్. మరి... నచ్చిన కుర్రాడి (నాగచైతన్య)తో మూడు ముళ్లు వేయించుకోవడం అంటే స్పెషల్ కాక ఏంటి? పెళ్లి తర్వాత సినిమాల పరంగా స్పీడ్ తగ్గిస్తారేమో? అన్నది కొందరి ఊహ. కానీ, సమంతకు ఆ ఆలోచన లేదు. గతేడాది ‘రాజుగారి గది 2’, తమిళంలో ‘మెర్సెల్’లో నటించారు. ఈ ఏడాది విషయానికొస్తే... ‘రంగస్థలం , మహానటి’ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘ఇరంబుదురై, ఇంకా టైటిల్ డిసైడ్ కాని ఓ సినిమా, ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో నటిస్తున్నారు. సో.. లెక్క పెరిగిందే కానీ, తగ్గలేదు. ఫిదా చేసింది: బాన్స్వాడ భానుమతి అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. కథానాయిక సాయిపల్లవి గురించి చెబుతున్నామని గ్రహించే ఉంటారు. గతేడాది ‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారామె. తమిళంలో చేసిన ‘కరు’ తెలుగులో ఈ ఏడాది ‘కణం’ పేరుతో రిలీజ్ కానుంది. తమిళంలో మరో రెండు సినిమాలు చేయనున్నారు. ఇక తెలుగులో నెక్ట్స్ శర్వానంద్‌తో జోడీ కట్టారు సాయిపల్లవి. పక్కా స్కెచ్: గత ఏడాది ‘బాహుబలి–2’లో అవంతికగా, ‘జైలవకుశ’లో స్పెషల్ సాంగ్, తమిళ చిత్రం ‘ఏఏఏ’లో నాయికగా కనిపించారు తమన్నా. అందుకే ఈ ఏడాది పక్కా స్కెచ్ వేసుకున్నారామె. తెలుగులో మూడు సినిమాలు (సందీప్‌కిషన్ సరసన ఓ మూవీ, కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా, ‘క్వీన్’ తెలుగు రీమేక్) లైన్లో పెట్టారామె. అంతేకాదు ఈ జనవరిలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్కెచ్’ రిలీజ్ కానుంది. అంతేకాదండోయ్ ‘కామోషీ’ సినిమాతో మరోసారి హిందీ ఇండస్ట్రీలో లక్‌ను చెక్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. లెక్క బాగుంది కదూ. బొమ్మాళీ... తగ్గొద్దు : ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరో పక్క సోలోగా కత్తి తిప్పారు ఈ ‘అరుంధతి’. 2017లో అనుష్క మూడు చిత్రాల్లో కనిపించారు. ‘సింగమ్ 3’, ‘ఓం నమో వెంకటేశాయ’లో మెరిశారు. ఆ తర్వాత ‘బాహుబలి ది కన్‌క్లూజన్’లో దేవసేనగా అభిమానులను అలరించారు అనుష్క. ఈ ఏడాది జనవరిలో ‘భాగమతి’గా కనిపించనున్నారు. జవనరి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి శివ దర్శకత్వంలో అజిత్ చేయబోతున్న ‘విశ్వాసం’ సినిమాలో హీరోయిన్గా ఈ భామ పేరును పరిశీలిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. సిక్సర్ : తమిళంలో ‘భైరవ’, ‘పాంబు సాటై్ట’, తెలుగులో ‘నేను లోకల్’.. ఇలా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు కీర్తీ సురేశ్. వచ్చే ఏడాది ఏకంగా సిక్సర్ కొట్టనున్నారు కీర్తి. ‘గ్యాంగ్’, ‘అజ్ఞాతవాసి’తో సంక్రాంతి పండగకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మళ్లీ మార్చిలో ‘మహానటి’గా రానున్నారు. ఆ తర్వాత ‘సామీ స్క్వేర్’లో, 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్లో, విజయ్ సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్గా కనిపిస్తారు కీర్తీ సురేశ్. ఆ విధంగా 2018లో అరడజను సినిమాల్లో సందడి చేయనున్నారు. లెక్క అదిరిందబ్బా. అదే దూకుడు: ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లవుతున్నా.. కాజల్ దూకుడు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే చిన్న హీరోల పక్కన నటిస్తున్నారు. 2017లో ‘ఖైదీ నంబర్ 150’లో, ‘నేనే రాజు నేనే మంత్రి’, తమిళంలో విజయ్‌తో ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది‘), అజిత్‌తో ‘వివేగం’ (తెలుగులో ‘వివేకం’)’ సినిమాల్లో కనిపించారు కాజల్. ఆ ఉత్సాహంతో 2018లోను నాలుగు సినిమాల్లో కనిపించనున్నారామె. కల్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’, ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, నాని నిర్మిస్తున్న ‘అ’ చిత్రాల్లో సందడి చేయనున్నారు. రాశి బాగుంది: రాశీ ఖన్నా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు. ‘జై లవ కుశ’, ‘ఆక్సిజన్’ చిత్రాల్లో మెరిశారు. ‘విలన్’ సినిమా ద్వారా మలయాళ తెరకు పరిచయమయ్యారు. ఈ ఏడాది రాశీ ఖన్నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు తమిళ సినిమాలు రెండు తెలుగు సినిమాలు. ‘టచ్ చేసి చూడు’, ‘తొలిప్రేమ’. ‘సైతాన్ కా బచ్చా, ఇమైక్క నొడిగల్, అడంగమారు’... ఇలా ఐదు సినిమాలతో ఈ ఏడాది రాశీ ఖన్నా డైరీ బిజీ. లెక్క తేలలేదు: అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది ‘విన్నర్, స్పైడర్, జయ జానకి నాయక, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకీ’ సినిమాల్లో కనిపించారు రకుల్. ఈ ఏడాది మాత్రం కేవలం ఒక్కటే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అది కూడా బాలీవుడ్ ‘అయ్యారీ’. ప్రస్తుతానికి కొన్ని రోజులు రకుల్ డైరీ ఖాళీ. అధికారికంగా ప్రకటించలేదు కానీ, రవితేజ–కల్యాణ్ కృష్ణ సినిమా, హరీష్ శంకర్–‘దిల్’ రాజు కాంబినేషన్ మూవీ (దాగుడు మూతలు), బోయపాటి–రామ్‌చరణ్ సినిమాలకు రకుల్ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంకా లెక్క తేలలేదు. 2017 ఏం చేశారు? 2018 ఏం చేయబోతున్నారు? గతేడాది స్ట్రైట్‌గా నాలుగు సినిమాల్లో కనిపించారు హీరోయిన్ మెహరీన్ (మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్). తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘కేరాఫ్ సూర్య’లో నటించారామె. ఈ ఏడాది ఇప్పటివరకు గోపీచంద్ 25వ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే తెలుగులో ఒక సినిమా చేసిందో లేదో అప్పుడే కోలీవుడ్ నుంచి కాలింగ్ రావడం, ఆమె రెండు తమిళ సినిమాలకు (జీవాతో ఓ సినిమా, జీవీ ప్రకాశ్‌కుమార్‌తో ‘100% లవ్’ రీమేక్) సైన్ చేశారు. కెరీర్లో దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోయిన్ శ్రియ. 2017లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ సినిమాల్లో ఆమె హీరోయిన్గా కనిపించారు. తమిళ సినిమా ‘ఏఏఏ’లో నటించారు. ఇక ఈ ఏడాది తమిళంలో ఆమె నటించిన ‘నరగాసురన్’ (తెలుగులో నరకాసురుడు) థియేటర్స్‌కు రానుంది. హిందీలో ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘ధడ్కా’ రిలీజ్‌కి సిద్ధమైంది. ‘గాయత్రి, ‘వీరభోగ వసంతరాయలు’లో కీలక పాత్రలు చేస్తున్నారామె. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత జోరు పెంచారు తాప్సీ. 2017లో మూడు హిందీ సినిమాల్లో (రన్నింగ్ షాదీ, నామ్ షబానా, జుడ్వా 2) నటించారు. ‘ఘాజీ’లో చిన్న పాత్ర చేసి, తెలుగు తెరపై మెరిసిన తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేశారు. ఈ ఏడాది కూడా అదే స్పీడ్‌లో నాలుగు హిందీ సినిమాలను లైన్లో పెట్టారు. మరో తెలుగు సినిమా కోసం డిస్కస్ చేస్తున్నారు. గతేడాది ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, తుప్పరివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) సినిమాలతో థియేటర్స్‌లో సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. అందులో ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా, ‘నా పేరు సూర్య’ వేసవి బరిలో ఉంది. నాగచైతన్యతో చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ‘లై’ ఫేమ్ మేఘా ఆకాశ్ తొలి హీరో నితిన్‌తో మరో సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతో అలరించిన లావణ్య త్రిపాఠి ప్రజెంట్ సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ గతేడాది ‘శతమానం భవతి, జోమొంటే సువిషంగల్, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల్లో కనిపించారు. ఈ సంవత్సరం నాని ‘కృష్ణార్జున యుద్ధం’, సాయిధరమ్‌తో ఓ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. 2017లో తెలుగులో నక్షత్రం, బాలకృష్ణుడు, తమిళంలో మా నగరం, సరవనన్ ఇరుక్క భయమేన్, నెంజమ్ మరప్పదిల్లయ్, జెమిని గణేశన్ సురళీ రాజనుమ్... ఇలా ఆరు సినిమాల్లో కనిపించారు రెజీనా. ఈ సంవత్సరం తమిళంలో పార్టీ, చంద్రమౌళి, తెలుగులో అ! రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘పెళ్ళి చూపులు’తో ఫేమస్ అయిన రీతూ వర్మ ఈ ఏడాది తమిళంలో విక్రమ్ సరసన ‘ధృవనక్షత్రం’, దుల్కర్ సల్మాన్‌తో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ సినిమాల్లో కనిపించనున్నారు. వీళ్లు కాకుండా మరికొంత మంది భామలు ఈ సంవత్సరంలో తెలుగు తెరపై తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు బాలీవుడ్ భామల సినిమాలు ఈ ఏడాది తెలుగులో రిలీజ్ కానున్నాయి. వారి హిందీ సినిమాల విషయం పక్కనపెడితే.. ఆ లిస్ట్‌లో శ్రద్ధాకపూర్ (‘సాహో’) అదితిరావ్ హైదరి (సుధీర్‌బాబు సినిమా), కియారా అద్వాని (మహేశ్ 24), కంగనా రనౌత్ (మణికర్ణిక), సన్నీ లియోన్ (వీరమహాదేవి) ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎంతమందినైనా ఆహ్వానిస్తుంది. సో.. ఈ ఏడాది ఇంకా నయా తారలు చాలామంది వస్తారని ఊహించవచ్చు. -
స్క్రీన్ టెస్ట్
► ఈ నలుగురు కథానాయికల్లో ఈ ఏడాది తెలుగులో ఎక్కువ సినిమాలుచేసిన భామ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) తమన్నా భాటియా సి) త్రిష డి) సమంత ► 2017 సంక్రాంతికి రిలీజైన సినిమా ‘ఖైదీ నంబర్–150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమా రిలీజు అయ్యిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి? ఎ) ఐదు సంవత్సరాలు బి) ఏడు సంవత్సరాలు సి) ఆరు సంవత్సరాలు డి) తొమ్మిది సంవత్సరాలు ► ఈ సంవత్సరం మంచు విష్ణు, గోపీచంద్‌ల సరసన నటించిన బ్యూటీ ఎవరో కనిపెట్టండి? ఎ) రాశిఖన్నా బి) హన్సిక సి) క్యాథరిన్ డి) ప్రగ్యాజైస్వాల్ ► ‘ఆకతాయి’ సినిమాలోని ‘అనగా అనగా నిన్నే కలగన్నా’ అనే పాటను పాడింది గాయకుడు కాదు... రైటర్. ఆయనెవరు? ఎ) చంద్రబోస్ బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి ► ఈ సంవత్సరం బాక్సాఫీస్ పరంగా చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిన సినిమా? ఎ) మెంటల్ మదిలో బి) మళ్లీరావా సి) ద్వారకా డి) అర్జున్ రెడ్డి ► 2017లో తన మొదటి సినిమాలోనే లిప్ లాక్‌లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఎవరో కనుక్కోండి? ఎ) కళ్యాణి ప్రియదర్శన్ బి) శాలిని పాండే సి) సాయిపల్లవి డి) మేఘాఆకాష్ ► ఈ ఏడాది ఈ హీరో సినిమా రిలీజ్ అవ్వలేదు. ఎవరై ఉంటారో గమనించారా? ఎ) రామ్‌చరణ్ బి) యన్టీఆర్ సి) మహేశ్‌బాబు డి) అల్లుఅర్జున్ ► ‘‘తిక్కుంటే లెక్కుండాలి, ఈ పిల్లకు ఓన్లీ తిక్క నో లెక్క’’అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎ) సాయిధరమ్ తేజ్ బి) వరుణ్‌తేజ్ సి) అల్లుశిరీష్ డి) నాగశౌర్య ► ఈ సంవత్సరంతో హ్యాట్రిక్ సాధించిన దర్శకుడెవరు? ఎ) విరించివర్మ బి) అనిల్ రావిపూడి సి) సతీష్ వేగేశ్న డి) బీవియస్.రవి ► 2017లో రిలీజైన సినిమాకు 2016వ సంవత్సరానికి నేషనల్ అవార్డు లభించింది. ఈ సినిమా పేరేంటి? ఎ) ఖైదీ నంబరు 150 బి) గౌతమిపుత్ర శాతకర్ణిసి) బాహుబలి డి) శతమానం భవతి ► బి.గోపాల్ దర్శకత్వంలో రిలీజైన ‘ఆరడుగుల బుల్లెట్’చిత్రంలో నటించిన హీరోయిన్ ఎవరు? ఈ టాప్ హీరోయిన్‌కి తెలుగులో ఈ సంవత్సరం ఇదొక్కటే రిలీజు? ఎ) అనుష్క బి) నయనతార సి) శృతిహాసన్ డి) అమలాపాల్ ► ‘ఘాజీ’ చిత్రం ద్వారా 2017వ సంవత్సరంలో పరిచయమైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) సంకల్ప్‌రెడ్డి బి) వివేక్ ఆత్రేయ సి) గౌతమ్ డి) వెంకీ అట్లూరి ► ‘అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలో నటించింది లక్ష్మీరాయ్. కానీ ఈ పాటకు మొదట వేరే హీరోయిన్ను అనుకున్నారు. ఆ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) తాప్సీ బి) క్యాథరిన్ థెరిసా సి) కాజల్ అగర్వాల్ డి) కంగనా రనౌత్ ► ఈ సంవత్సరం జరిగిన ‘బాలల చలన చిత్రోత్సవంలో’ స్క్రీనింగ్ జరిగిన ‘అప్పూ’ చిత్రం ద్వారా తెలుగు తెరపై మెరిసిన బాల నటుడు ఎవరు? ఎ) నాగాన్వేష్ బి) సాయి శ్రీవంత్ సి) అనిరుథ్ డి) అన్వేష్ ► బడిలో గుడిలో’ అంటూ అల్లు అర్జున్‌తో స్టెప్పులేసిన భామ ఎవరు? ఎ) నివేధా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) పూజా హెగ్డే డి) కీర్తీ సురేశ్ ► 2017వ సంవత్సరానికి ఎనిమిది తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యస్.యస్. తమన్ సి) అనూప్ రూబెన్స్ డి) దేవిశ్రీ ప్రసాద్ ► ఈయన డాక్టర్ చదువుకున్నాడు. కానీ నటుడవ్వలేదు. 2017వ సంవత్సరంలో సంచలన దర్శకుడయ్యాడు. ఆయన పేరేంటి? ఎ) సందీప్‌రెడ్డి బి) రామ్‌గణపతి సి) రవికాంత్ పేరేపు డి) అర్జున్‌రెడ్డి ► ఈ సంవత్సరం 25 సినిమాలను కంప్లీట్ చేసుకున్న నటుడెవరో కనుక్కోండి? ఎ) అల్లరి నరేశ్ బి) శర్వానంద్ సి) రామ్ డి) నాని ► ప్రపంచవ్యాప్తంగా ఈ ఇయర్ సందడి చేసిన ‘బాహుబలి–2’ చిత్రానికి కెమెరామేన్ ఎవరో తెలుసా? ఎ) చోటా కె.నాయుడు బి) రత్నవేలు సి) కె.కె. సెంథిల్‌కుమార్ డి) ఆయాంకా బోస్ ► 2017 సంవత్సరంలో తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన ప్రముఖ హీరో ఎవరు? ఎ) అల్లు అర్జున్ బి) నాని సి) ఎన్టీఆర్ డి) గోపీచంద్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1. ఎ, 2. డి, 3. బి, 4. సి, 5. సి 6. బి, 7. ఎ, 8. బి, 9. బి, 10. డి 11. బి, 12. ఎ, 13. బి, 14. బి 15. సి, 16. డి, 17. ఎ 18. బి, 19. సి, 20. బి -
త్రిష ఒడిలో జూనియర్!
ఆల్మోస్ట్ 15 డేస్ ఉంది. క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అవ్వడానికి. కానీ తమిళ పొన్ను (అమ్మాయి) త్రిష ఇంట్లో ఇప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అవ్వడం ఏంటీ? ఆల్రెడీ గిఫ్ట్స్ కూడా వచ్చేస్తుంటేనూ! ఈ సెలబ్రేషన్స్‌ను త్రిషతో పాటు జోయా, జోరో అండ్ కడు జూనియర్ అనే ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు. వారికి, త్రిషకు సంబంధం ఏంటీ అని తెగ థింక్ చేయకండి. ఓసారి ఇన్సెట్లో ఉన్న ఫొటో చూశారా? చూడగానే ఆ ముగ్గురూ ఎవరో అర్థమైంది కదూ! త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ పేర్లే జోయా, జోరో అండ్ కడు జూనియర్. త్రిష ఒడిలో కూర్చున్నది కడు జూనియరే. ‘‘క్రిస్మస్ సెలబ్రేషన్స్ సార్టయ్యాయి. మై లవ్స్ జోయా, జోరో, కడు జూనియర్’’ అంటూ త్రిష ట్విట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. -
అంతా మీ ఇష్టమేనా?
అంతా నటీనటుల ఇష్టమేనా? కథ నచ్చిందనో... పారితోషకం నచ్చిందనో... మరొకటో... ఏవేవో కారణాల వల్ల సినిమా ఒప్పుకుని, తర్వాత ‘తూచ్! నేనీ సినిమా చేయడం లేదు’ అనడం నటీనటుల ఇష్టమేనా?!! కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతల పరిస్థితేంటి? తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇప్పుడీ ప్రశ్నలే వేస్తోంది. అటువంటి నటీనటులపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెబుతోంది. చెప్పడమే కాదు... చేతల్లో చూపిస్తోంది! త్రిష, వడివేలు, శింబుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఇంతకీ, ఈ ముగ్గురూ ఏం చేశారంటే.... మీతో సెట్ కాదులే సామి! విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిష హీరోయిన్. ఇప్పుడు ఆ సిన్మాకి సీక్వెల్‌గా దర్శకుడు హరి ‘సామి స్క్వేర్’ తీస్తు న్నారు. విక్రమ్ హీరో. త్రిష, కీర్తీ సురేశ్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే... కొన్ని రోజులు షూటింగ్ చేశాక ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని త్రిష సినిమాకి ‘గుడ్‌బై’ చెప్పేశారు. దాంతో చిత్రనిర్మాణ సంస్థ తమీన్స్ ఫిలిమ్స్ నిర్మాతల మండలికి కంప్లయింట్ చేసింది. త్రిష తప్పుకోవడంతో మాకెంతో నష్టం ఏర్పడిందని కంప్లయింట్లో పేర్కొన్నారు. పులికేసి... ప్రాబ్లమ్ ఏంటి? హాస్యనటుడు వడివేలు హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో దర్శకుడు శంకర్ ‘ఇమ్సై అరసన్ 23వ పులికేసి’ నిర్మించారు. తమిళంలో మంచి హిట్! తెలుగులో ‘హింసించే 23వ రాజు–పులికేసి’ పేరుతో విడుదల చేస్తే.. ఇక్కడా బాగానే ఆడింది. దానికి సీక్వెల్‌గా సేమ్ టీమ్ ‘ఇమ్సై అరసన్ 24వ పులికేసి’ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. త్రిషలా వడివేలుకి కూడా టీమ్‌తో ఏవో క్రియేటివ్ ప్రాబ్లమ్స్ రావడంతో షూట్‌కి రావడం మానేశారు. అప్పుడు చేద్దాం... ఇప్పుడు చేద్దామంటూ డేట్స్ ఇవ్వకుండా అలస్యం చేస్తున్నారట! మరోపక్క ఐదు కోట్ల రూపాయలతో సెట్ వేసిన యూనిట్ ఆయన కోసం వెయిట్ చేస్తోంది. చివరకు, చిరాకు వచ్చి నిర్మాతల మండలికి శంకర్ కంప్లయింట్ చేశారు. శింబు వల్ల 18 కోట్లు హాంఫట్!? త్రిష, వడివేలు ఇష్యూలతో కంపేర్ చేస్తే శింబుది డిఫరెంట్! ఈ యంగ్ హీరో ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’. మొన్న జూన్‌లో విడుదలైన ఈ సిన్మా ఫ్లాప్. అయితే విడుదలకు ముందు సినిమాను రెండు పార్టులుగా తీయనున్నట్టు వార్తలొచ్చాయి. అసలు మేటర్ ఏంటంటే... నిర్మాత సింగిల్ పార్టుగానే తీయాలనుకున్నారట! శింబు రెండు పార్టులు తీయాలని వాదించాడట! నిర్మాత కాదనే సరికి ఇప్పటివరకు నేను నటించిన సన్నివేశాలతోనే సినిమా విడుదల చేసుకోమని వదిలేశాడట! కట్ చేస్తే... శింబు షూటింగ్ చేసింది 29 రోజులే. దర్శకుడు ఏవో సర్దుబాట్లు చేసి సినిమా రెడీ చేశారు. ఫ్లాప్ కావడంతో నిర్మాతకు 18 కోట్లు నష్టం వచ్చిందట! శింబు ప్రవర్తన వల్లనే 18 కోట్లు హాంఫట్ అయ్యాయని చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలికి కంప్లయింట్ చేశారు. దాంతో నిర్మాతల మండలి ముగ్గురికీ నోటీసులు పంపించింది. వీళ్ల వివరణతో సంతృపి చెందకపోతే... ఒక్కొక్కరిపై రెండేళ్లు బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ!! -
నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు!
ఈజీ అనాలి కదా.. వీజీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? కొంచెం ఎటకారంగా.. అదేనండీ వెటకారంగా చెప్పాలంటే వీజీ అంటారు కదా. ఒక విషయం గురించి త్రిష ఇలా వ్యంగ్య ధోరణిలోనే మాట్లాడారు. అదేంటంటే... ఫేస్బుక్, ట్విట్టర్లో ఏదైనా కామెంట్ పెట్టి, దానికి తగ్గట్టు సెలబ్రిటీల ఫొటోలు పెడుతుంటారు కదా. ఆ ఫొటోలో స్టార్ ఎక్స్ప్రెషన్ ఆ కామెంట్‌కి తగ్గట్టుగా ఉంటుంది. త్రిష ఫొటోలు ఇలాంటివి చాలానే వైరల్ అయ్యాయి. ‘‘కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని ఫొటోలు, కామెంట్స్ మాత్రం బాగుండవు. అలాంటివి చూసి, బాధపడతారా? అని నన్నడిగితే.. ‘అస్సలు బాధపడను’ అని చెబుతా. నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు’’ అన్నారు త్రిష. స్టార్ అయ్యాక ఇలాంటివి కామన్ కాబట్టి, అలవాటై త్రిష లైట్ తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. నటి కాకముందు కూడా ఇలానే ఉండేవారట. ఆ విషయం గురించి త్రిష చెబుతూ – ‘‘నా గురించి ఎవరైనా చేయకూడని కామెంట్ చేస్తే పట్టించుకునేదాన్ని కాదు. బాధపడేదాన్ని కాదు. ఒకవేళ తట్టుకోలేనంత బాధ అనిపిస్తే.. అప్పుడు మా అమ్మకి, ఫ్రెండ్స్‌కి చెబుతాను. అంతా విని, వాళ్లు ఒక్కసారిగా నవ్వేస్తారు. అప్పుడా బాధ జోక్ అయిపోతుంది’’ అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం త్రిష చేస్తోన్న వాటిలో మలయాళ చిత్రం ‘హే జ్యూడ్’ ఒకటి. ఈ చెన్నై చందమామ ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. -
స్క్రీన్ టెస్ట్
► ఈ టాలీవుడ్ హీరో ‘ఈక్వెస్ట్రియన్ క్రీడ’ లో మంచి ప్రతిభావంతుడు. అతను ఈక్వెస్ట్రియన్ పోలో టీమ్ యజమాని కూడా! ఎ) తరుణ్ బి) ప్రభాస్ సి) రామ్‌చరణ్ డి) రవితేజ ► కాలభైరవ అనే టాలీవుడ్ సింగర్ ఏ సంగీత దర్శకుని కుమారుడు? ఎ) యం.యం.కీరవాణి బి) మణిశర్మ సి) మాధవపెద్ది సురేష్ డి) ఇళయరాజా ► ‘డైవోర్స్ ఇన్విటేషన్’ అనే హాలీవుడ్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించినది ఈ కుటుంబ కథా చిత్రాల దర్శకుడు. ఆయనెవరు? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) యస్వీ కృష్ణారెడ్డి సి) కోడి రామకృష్ణ డి) ఈవీవీ సత్యనారాయణ ► నాగచైతన్య తెలుగులో చేసిన ‘ఏ మాయ చేశావె’ తమిళంలో ‘విన్నైత్తాండి వరువాయా’గా తెరకెక్కింది. అందులో హీరో ఎవరు? ఎ) మాధవన్ బి) శింబు సి) విజయ్ సేతుపతి డి) జై ► నటి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఆమెకు ‘వాణిశ్రీ’ అని పేరు పెట్టిన తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) ఎస్వీ రంగారావు బి) కొంగర జగ్గయ్య సి) మిక్కిలినేని డి) కాంతారావు ► హీరో కాక ముందు ‘రేడియో జాకీ’గా ఏ తెలుగు హీరో పని చేశాడో తెలుసా? ఎ) నాని బి) శర్వానంద్ సి) నందు డి) నవీన్ చంద్ర ► ‘ప్రేమనగర్’ సినిమాలో బాల నటునిగా కనిపించిన ఇప్పటి హీరో ఎవరో తెలుసా? ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) సుమంత్ డి) బాలకృష్ణ ► కన్నడ బ్యూటీ సంజన తన మొదటి తెలుగు సినిమాలో ఏ హీరోయిన్‌కి చెల్లెలిగా నటించింది? ఎ) శ్రియ బి) తాప్సీ సి) త్రిష డి) అయేషా టకియా ► ప్రభాస్ నటించిన ఓ సినిమాకు పోసాని కృష్ణమురళి స్టోరీ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్ అందించారు. ఆ సినిమా పేరేంటి? ఎ) రాఘవేంద్ర బి) ఈశ్వర్ సి) అడవిరాముడు డి) వర్షం ► రజనీకాంత్ నటించిన బాషా, నరసింహా, పెదరాయుడు.. ఈ మూడు సినిమాలకు ఒకే నటుడు డబ్బింగ్ చెప్పారు. ఆయనెవరో తెలుసా? ఎ) రవిశంకర్ బి) సాయికుమార్ సి) శివాజీ డి) అయ్యప్ప పి.శర్మ ► ‘అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ’ హిందీ సినిమా తరుణ్ నటించిన ఓ తెలుగు సినిమాకి రీమేక్? అది ఏ సినిమా? ఎ) నువ్వేకావాలి బి) నువ్వే నువ్వే సి) సోగ్గాడు డి) నీ మనసు నాకు తెలుసు ► కాజల్ అగర్వాల్ నటించిన మొదటి సౌతిండియన్ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) అజిత్ బి) విజయ్ సి) ధనుష్ డి) అర్జున్ సర్జా ► ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను..’ అనే పాటలో నటించిన నటుడెవరో గుర్తున్నాడా? ఎ) పద్మనాభం బి) రాజబాబు సి) రమణారెడ్డి డి) రేలంగి ► ‘అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చే శావేమయ్యా..’ అనే పాట ‘అదృష్టవంతులు’ సినిమాలోనిది. ఆ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సి. నారాయణరెడ్డి బి) ఆచార్య ఆత్రేయసి) జూ. సముద్రాల డి) దాశరథి ► రచయితగా బాగా పేరు రాకముందు ‘సాయిచంద్ర’ అనే పేరుతో పాటలు రాసిన ఇప్పటి ప్రముఖ రచయిత ఎవరో తెలుసా? ఎ) సిరివెన్నెల బి) చంద్రబోస్ సి) శివశక్తి దత్తా డి) రామజోగయ్య శాస్త్రి ► ‘అరెరె వాన జడివాన...’ అనే పాట ‘ఆవారా’ అనే డబ్బింగ్ సినిమాలోనిది. ఈ వాన పాటలో హీరో కార్తీ పక్కన తడిసి ముద్దయిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) ప్రియమణి డి) ప్రణీత ► హీరోయిన్ సమంత ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) మీ సమంతా బి) సమంతా సి) సమంతాప్రభు 2 డి) యువర్స్ సమంత ► ‘గుండమ్మ కథ’ చిత్రంలో నటి జమున ఏ నటునితో జత కట్టారో తెలుసా? ఎ) యస్వీఆర్ బి) ఏయన్నార్ సి) హరనాథ్ డి) యన్టీఆర్ ► ఈ ఫొటోలో ఉన్నది నటుడు కైకాల సత్యనారాయణ మొదటి సినిమా స్టిల్. ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) రాజమకుటం బి) సిపాయి కూతురు సి) స్వర్ణ గౌరి డి) శ్రీ కృష్ణార్జున యుద్ధం ► ఈ ఫొటోలో ఉన్న నటి ఎవరో చెప్పుకోండి? ఎ) స్నేహ బి)సంగీత సి) శ్రుతీహాసన్ డి) జెనీలియా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) బి 4) బి 5) ఎ 6) ఎ 7) ఎ 8) సి 9) ఎ 10) బి 11) సి 12) డి 13) బి 14) ఎ 15) డి 16) ఎ 17) సి 18) బి 19) బి 20) డి