కేటీఆర్కు త్రిష థ్యాంక్స్ | thrisha thanks to ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్కు త్రిష థ్యాంక్స్

Published Fri, Nov 20 2015 7:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

కేటీఆర్కు త్రిష థ్యాంక్స్

కేటీఆర్కు త్రిష థ్యాంక్స్

హైదరాబాద్: కమల్ హాసన్ నటించిన 'చీకటి రాజ్యం' చిత్రానికి తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ మంచి కితాబు ఇచ్చారు. ఈ చిత్రంలో లెజెండ్ నటుడు కమల్ హాసన్, హీరోయిన్ త్రిష నటన చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు.

నిన్న సాయంత్రం వరకు వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార బాధ్యతలతో కాస్తంత సమయం లేకుండా గడిపిన ఆయన శుక్రవారం విడులైన కమల్ 'చీకటి రాజ్యం' చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర నటులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు హీరోయిన్ త్రిష వెంటనే స్పందించింది. తన నటనను అభిమానించినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement