Cheekati Rajyam
-
క్రేజీ ప్రాజెక్ట్ : కమల్, విక్రమ్, నితిన్
ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ సినీ రంగంలోనూ కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే నటనకు గుడ్‌బై చెపుతున్నట్టుగా ప్రకటించిన కమల్ నిర్మాతగా సినీ రంగంలో కొనసాగనున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ బ్యానర్‌పై విక్రమ్ తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు కమల్. రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించనున్నాడట. ఓ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చీకటిరాజ్యం ఫేం రాజేష్ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్ తీసుకున్న చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విక్రమ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్, కమల్ సినిమాపై ఎలా స్పందిస్తాడో చూడాలి. -
నాయకీ... సందడే లేదు
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష, రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన చెన్నై చిన్నది మంచి కమర్షియల్ హిట్ ఇవ్వటంలో మాత్రం ఫెయిలవుతోంది. ఒక్క లయన్ తప్ప రీ ఎంట్రీలో ఈ బ్యూటి నటించిన ఏ సినిమా కూడా భారీ కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయింది. తాజాగా రూట్ మార్చిన ఈ బ్యూటి గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి లేడి ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. చాలా కాలంగా తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న గిరిధర్ నిర్మాణంలో నాయకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం వేగం పెంచలేదు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయినా మీడియాలో నాయకీ సందడి కనిపించటం లేదు. చీకటి రాజ్యం సినిమా తరువాత వెండితెర మీద కనిపించని త్రిష నాయకీ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. కానీ చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో త్రిష గుర్రుగా ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
అక్కడ ఆయనను ముద్దు పెట్టుకోవడం అవసరం!
-మధుశాలిని ‘‘ ‘చీకటి రాజ్యం’లో కమల్‌హాసన్ గారితో ముద్దు సీన్లో నటించా. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్ అనేది రొమాంటిక్ సీన్లో చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అక్కడ కమల్ గారిని ముద్దు పెట్టుకోవడం కథకు అవసరం. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఆ ముద్దు సీన్ కన్విన్సింగ్‌గా అనిసిస్తుంది’’ అని నటి మధుశాలిని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘చీకటి రాజ్యం’లో మధుశాలిని కీలకపాత్ర పోషించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘ కమల్ హాసన్ గారంటే ఇష్టం. ఆయన సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వెంటనే ఓకే చెప్పారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నేను త్వరలో తమిళ, మలయా ళాల్లో సినిమాలు చేయ నున్నా. తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపారు. -
అమ్మానాన్న ఆట!
ఇటీవలే ‘చీకటిరాజ్యం’లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్‌హాసన్ అప్పుడే మరో కొత్త చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు. ‘అమ్మా నాన్న ఆట’పేరుతో ఓ ఫ్యామలీ రొమాంటిక్ డ్రామా చేయను న్నారు. గతంలో కమల్‌తోనే ‘చాణక్యన్’ (తెలుగులో ‘చాణక్య’) సినిమా చేసిన రాజీవ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న చిత్రంలో అమల అతిథి పాత్ర పోషించనున్నారు. మరో పాత్రను ఒకప్పటి కథానాయిక జరీనా వహాబ్ చేయనున్నారు. అమెరికాలో చిత్రీకరణ జరగనుంది. సినిమా చూసి థ్రిల్లయ్యా! - అమల ‘‘ ‘చీకటిరాజ్యం’ చాలా డిఫరెంట్‌గా ఉంది. సినిమా చూసి థ్రిల్ ఫీలయ్యా’’ అని అమల వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ‘చీకటిరాజ్యం’ థ్యాంక్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ-‘‘పదేళ్లకొకసారి మాత్రమే ఇలాంటి సినిమా చేయడం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజేశ్ ఎం సెల్వా, నటి మధుశాలిని, రచయిత అబ్బూరి రవి, ‘మల్టీ డెమైన్షన్’ వాసు తదితరులు మాట్లాడారు. -
కేటీఆర్‌కు త్రిష థ్యాంక్స్
హైదరాబాద్: కమల్ హాసన్ నటించిన 'చీకటి రాజ్యం' చిత్రానికి తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ మంచి కితాబు ఇచ్చారు. ఈ చిత్రంలో లెజెండ్ నటుడు కమల్ హాసన్, హీరోయిన్ త్రిష నటన చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. నిన్న సాయంత్రం వరకు వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార బాధ్యతలతో కాస్తంత సమయం లేకుండా గడిపిన ఆయన శుక్రవారం విడులైన కమల్ 'చీకటి రాజ్యం' చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర నటులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు హీరోయిన్ త్రిష వెంటనే స్పందించింది. తన నటనను అభిమానించినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. After a hectic day, watched slick thriller 'Cheekati Rajyam' with the legend himself, Kamal Haasan. Fabulous job @prakashraaj @trishtrashers — K Taraka Rama Rao (@KTRTRS) November 19, 2015 Thank u KTR sir n Subirami reddy sir for such kind words https://t.co/7fJdLubhX0 — Trisha Krishnan (@trishtrashers) November 20, 2015 -
'చీకటిరాజ్యం' మూవీ రివ్యూ
టైటిల్ : చీకటి రాజ్యం జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, ఆశా శరత్, సంపత్, కిశోర్ దర్శకత్వం : రాజేష్ ఎం సెల్వ నిర్మాత : రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్ నేషనల్ సంగీతం : గిబ్రన్ చాలా కాలం తరువాత కమల్ హాసన్ చేసిన తెలుగు సినిమా చీకటిరాజ్యం. తుంగావనం పేరుతో తమిళ్లోనూ తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్‌లో రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఫిలిం స్లీప్ లెస్ నైట్స్ సినిమాకు ఇండియన్ వర్షన్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. చాలా కాలంగా కమల్ హాసన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేష్ ఎం సెల్వా డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక్క రాత్రిలో జరిగే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌తో పాటు త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్, కిశోర్ లు నటించారు. తమిళ తంబిలను మెప్పించిన తుంగావనం, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ : నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన పోలీస్ ఆఫీసర్ సికె దివాకర్ (కమల్ హాసన్ ), మరో ఆఫీసర్ మణి(యోగి సేతు)తో కలిసి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకుంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో మత్తు పదార్ధాలను పట్టుకున్న ఆనందం, ఆ ఆఫీసర్లకు ఎక్కువ సేపు ఉండదు. ఈ ఇద్దరు ఆఫీసర్లలో ఒకరైన దివాకర్ కొడుకును డ్రగ్ డీలర్ విఠల్ రావ్(ప్రకాష్ రాజ్) కిడ్నాప్ చేస్తాడు. అప్పటికే వేరేవాళ్లకి ఆ డ్రగ్స్ సరఫరా చేస్తానంటూ మాట ఇచ్చిన విఠల్ రావ్ ఆ మొత్తాన్ని పోలీసులు పట్టుకోవటంతో చేసేదేమి లేక దివాకర్ కొడుకు పట్టుకొని, డ్రగ్స్ వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తాడు. దివాకర్ డ్రగ్స్ వెనక్కి ఇచ్చి, తన కొడుకును కాపాడుకోవాలని భావించినా, అప్పటికే అతని మీద నార్కొటిక్స్ బ్యూరో చెందిన మరో ఇద్దరు ఆఫీసర్లు మల్లిక (త్రిష), కిశోర్‌ల నిఘా ఉంటుంది. ఇలా మంచి చెడు ఇద్దరితో ఒకేసారి యుద్దం చేయాల్సి వచ్చిన దివాకర్ తన కొడుకును ఎలా కాపాడుకున్నాడు అన్నదే చీకటిరాజ్యం కథ. నటీనటులు కమల్ గతంలో చేసిన ఆదినారాయణన్, రాఘవన్ తరహా పోలీస్ పాత్రల ఛాయలేవి లేకుండా చాలా కొత్తగా ఈ పాత్రను తీర్చి దిద్దారు. కమల్ తనదైన నటనతో దివాకర్ పాత్రకు జీవం పోశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకును కాపాడుకునే క్రమంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతాడో కళ్లకు కట్టినట్టు చూపించాడు. తొలిసారిగా పోలీస్ పాత్రలో నటించిన త్రిష తన పరిధి మేరకు ఆకట్టుకుంది. నెగెటివ్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఆకట్టుకోగా కిశోర్, సంపత్ లు సెటిల్డ్ పర్ఫామెన్స్ తో తన పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : సినిమాలో ఎక్కువగా భాగం నైట్ క్లబ్ లోనే చిత్రీకరించారు. ముఖ్యంగా సినిమాలో పాటలు లేకపోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. కథా కథనాల్లో స్పీడు బ్రేకర్లలా వచ్చే పాటల నుంచి సినిమాకు మినహాయింపు ఇచ్చి సినిమా వేగం పెంచాడు దర్శకుడు రాజేష్ ఎం సెల్వా. సినిమాలో పాటలు లేకపోయినా ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరింత ఆసక్తి కరంగా మార్చాడు సంగీత దర్శకుడు జిబ్రాన్. తొలి సినిమా అయిన దర్శకుడు రాజేష్ కథనం పై మంచి పట్టు చూపించాడు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం ప్రతీ సీన్ లో పక్కాగా చూపించాడు. ఎక్కువభాగం నైట్ క్లబ్ లో షూటింగ్ చేసిన ఈ సినిమాకు కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం చీకటి రాజ్యం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, హీరోయిన్ గ్లామర్ లాంటి ఎలిమెంట్స్ లేకపోవటంతో బి, సి సెంటర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోవటం కష్టం. ఇక ఈ తరహా కథాంశం తెలుగు తెర మీద కొత్త కావటంతో స్ట్రయిట్ సినిమానే అయిన కమల్ గత సినిమాల మాదిరిగానే డబ్బింగ్ సినిమాలానే అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ కమల్ హాసన్ నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ రియలిస్టిక్ గా అనిపించని డ్రామా ఓవరాల్ గా చీకటిరాజ్యం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మంచి ట్రీట్ -
’చీకటిరాజ్యం, ప్రీమీయర్ షోకు మంత్రి కేటీఆర్
-
లోకనాయకుడి జోడిగా
హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకున్నా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవటంలో మాత్రం ఫెయిలైన స్టార్ హీరోయిన్ తమన్నా. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నా, ఆ సినిమాలతో హిట్స్ మాత్రం సాధించలేకపోయింది ఈ బ్యూటీ. ఇక సినిమాలు రావనుకున్న సమయంలో బాహుబలితో భారీ ఆఫర్ అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ సరసన నటించటం ప్రతీ హీరోయిన్ కు ఓ కల. ఆ కల తమన్నాకు నిజం కాబోతుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్‌తో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని కమల్ తన తదుపరి సినిమా కోసం తమన్నాను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం చీకటిరాజ్యం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న కమల్, సీనియర్ దర్శకుడు మౌళి అందించిన కథతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా చీకటిరాజ్యం దర్శకుడు రాజేష్ సెల్వ డైరెక్షన్లోనే చేయనున్నాడు కమల్. మౌళి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కమల్‌కు జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా ఆడిపాడనుంది. -
చీకటి రాజ్యంలో త్రిష మెరుపులు
-
ఆ అనుభవాలను డైరీలో భద్రంగా దాచుకుంటా
చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న 'చీకటి రాజ్యం' సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న తెలుగు నటి మధుశాలిని ఆనందంలో మునిగి తేలుతోంది. కమల్ హాసన్ అంతటి గొప్పనటుడితో కలిసి నటించడం తనకు చెప్పలేనంత సంతోషంగా ఉందంటూ మురిసిపోతోంది. ఆయనతో కలిసి నటించడం...తన నటనకు మరింత పరిణతి వచ్చిందని చెబుతోంది. తనలోని నటనా కౌశల్యాన్ని బయటకు తేవడానికి ఇదో మంచి అవకాశమని మధుశాలిని తెలిపింది. మొదటిరోజు షూటింగ్లో పాల్గొన్న తాను టెన్షన్‌తో ఉన్న విషయాన్ని కమల్ గమనించి, తనకు చాలా ధైర్యం చెప్పారని మధుశాలిని తెలిపింది. మొదటి రోజు షూటింగ్ అనుభవాన్ని తన డైరీలో రాసుకుంటానంటోంది. ఆ అనుభవాలను చాలా భద్రంగా దాచుకుంటానని, కమల్‌తో కలిసి పనిచేస్తున్న ప్రతిరోజూ కొత్తగా ఉంటోందనీ, ... చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. తమిళంలో 'అవన్ ఇవన్' సినిమా తరువాత, తనకు కమల్ సార్ చిత్రంలో మంచి అవకాశం లభించిందని ఆమె గుర్తు చేసుకుంది. బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి సుదీర్ఘ అనుభవం సాధించినా కమల్ హాసన్‌లో కొంచెం కూడా గర్వం కనిపించలేదని మధుశాలిని పేర్కొంది. ఇప్పటికీ సెట్లో శ్రద్ధగా కూర్చుని, అనుకున్న ఔట్పుట్ వచ్చేదాకా ఆయన కష్టపడతారని చెప్పింది. బాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ అమితాబ్‌తో ....రాంగోపాల్ వర్మ 'డిపార్ట్మెంట్'లో నటించినా, కేవలం సెట్లో మాత్రమే బిగ్ బీ నటన చూసి మురిసిపోవడం తప్ప, తమ మధ్య పెద్దగా సీన్లు లేవని తెలిపింది. అయితే చీకటిరాజ్యం సినిమాలో కమల్ సార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని మురిసిపోతోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా చీకటి రాజ్యం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, త్రిష, సంపత్ రాజ్ నటిస్తున్నారు. 'స్లీప్‌లెస్ నైట్' అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. -
ఆకలి తీర్చేనా చీకటి రాజ్యం
దశావతారాల్లో అన్ని పాత్రలూ, అన్ని కోణాలూ చూసేశానేమో అనేలా చెలరేగిపోయాడు. సినిమాల్లోనే కాదు, బయట కూడా బరువైన పాత్రలే వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్... ‘స్వయంపాకం’ పాత్ర! అదేనండీ, ‘సెల్ఫ్ డెరైక్షన్’ పాత్ర అంటే బహు పసందు. ఇది ఆయన జీవితంలో చాలా న్యాచురల్ పాత్ర. తరువాత ‘స్వయంకృతం’ పాత్ర! అర్థం కాలేదా!? సొంత ప్రొడక్షన్ పాత్ర! ఆయన వేసే అన్ని పాత్రల్లో డేంజరస్ పాత్ర ఇదే! చేతులు కాలుతాయి స్వామీ అని ఎంతమంది మొత్తుకున్నా, ‘ఊఁహుఁ’ చేతులు కాలినా పాత్రకు న్యాయం చేయాల్సిందే! బహుశా, చేతులు కాలితే హస్తరేఖలు మారతాయని భరోసా కాబోలు! ‘ఆకలి రాజ్యం’లో జీవించేశాడు కదా, అందుకేనేమో అన్ని పాత్రల రుచులూ చూడాలనుకుంటాడు. ఇప్పుడు ‘చీకటి రాజ్యం’లో బ్యాడ్ పోలీస్ పాత్రలో కొడుకు కోసం కొకెయిన్ గూండాతో పోరాడే కథ! సినిమా థియేటరే ఒక చీకటి రాజ్యం... అందులో కూర్చుని, వీక్షిస్తున్న ప్రేక్షకుడి ఆకలి తీర్చాలన్నదే కమల్ ఆయాసం కాబోలు... కాదు ఆశయమే! మరి, కమల్ ఆకలి తీర్చేనా, ఈ చీకటి రాజ్యం! రామ్ ఎడిటర్, ఫీచర్స్ బుధవారం సాయంత్రం... వినాయక చవితి పండగకు ఇంకా కొన్ని గంటలే ఉంది... దక్షిణాది సినిమా రాజధాని చెన్నై నగర వీధులన్నీ వినాయక విగ్రహాలు, పండగ కొనుగోళ్ళతో రద్దీగా ఉన్నాయి. అదే సమయంలో ఇద్దరు తమిళ సూపర్స్టార్ల సినిమాలకు సంబంధించి కూడా కోలాహలం చెలరేగింది. పండుగ నాడు షూటింగ్ ప్రారంభమవుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కపాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రెండు రిలీజయ్యాయి. అదే టైమ్‌కి షూటింగ్ పూర్తి చేసుకున్న మరో తమిళ స్టార్ హీరో కమలహాసన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘తూంగావనమ్’ (తెలుగులో ‘చీకటి రాజ్యం’) ఒకటిన్నర నిమిషాల ట్రైలర్ రిలీజైంది. ట్విట్టర్ మొదలు సామాజిక మాధ్యమాల నిండా ఈ ఇద్దరు హీరోల కొత్త సినిమాల లుక్ గురించే చర్చ. పాతికేళ్ళుగా తరచూ ఏదో ఒక శుక్రవారం కొత్త రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ ఇద్దరు స్టార్స్ సినిమాల పుణ్యమా అని సినీ ప్రియులకు ఈసారి కొద్ది గంటల ముందే చవితి పండగ వచ్చేసింది. బడ్జెట్లు, పణంగా ఒడ్డుతున్న మొత్తాలు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘చంద్రముఖి’, ‘ముంబయ్ ఎక్స్‌ప్రెస్’ల తరువాత ఈ హీరోలిద్దరూ ఒకేసారి తమ సినిమాలు రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ, ఇప్పుడు తమిళనాటే కాదు... తెలుగునాట కూడా ఈ ఇద్దరు హీరోల తాజా సినిమాలపై చర్చ జరుగుతోంది. యువ దర్శకుడు రంజిత్ నిర్దేశకత్వంలో ‘కలైపులి’ థాను నిర్మిస్తున్న రజనీకాంత్ కొత్త సినిమా ‘కపాలి’ షూటింగ్ ‘వినాయక చవితి’ నాడు ఉదయం చెన్నైలో నిరాడంబరంగా మొదలైంది. మరోపక్క కమల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడింది. సరైన టైమ్ చూసుకొని, ఈ దసరా, దీపావళి సీజన్లోనే జనం ముందుకు రావాలని తయారవుతోంది. రజనీ కొత్త సినిమా ఒకప్పటి ‘బాషా’ టైప్‌లో వయసు పైబడ్డ మాఫియా డాన్ కథ. మరి, కమల్ ‘చీకటి రాజ్యం’ కథేమిటి? ఫ్రెంచ్ సినిమాకు... ఇండియన్ వెర్షన్ కమలహాసన్ ఇటీవల ఎక్కువగా తమిళంలో నటించి, ఆ సినిమాల అనువాదాల్ని తెలుగులో అందిస్తున్నారు. చాలాకాలం తరువాత ఆయన తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఓ పూర్తిస్థాయి కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వేట్టయాడు... విళయాడు...’ (తెలుగులో ‘రాఘవన్’)లో పోలీసాఫీసర్‌గా కనిపించిన కమల్ ఈ సినిమాలో కూడా పోలీసు పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇందులో కొంత నెగిటివ్ టచ్ ఉన్న పోలీసాఫీసర్ అట. ఫ్రెంచ్ హిట్ మూవీ ‘స్లీప్‌లెస్ నైట్స్’ సినిమాకు ఇది అనుసరణ అని కోడంబాకమ్ కబురు. అయితే, చట్టప్రకారం ఆ సినిమా హక్కులు తీసుకొని, మన దక్షిణ భారత సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తిరగరాసుకున్నారు. సొంత సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసుకొనే కమల్ ‘చీకటి రాజ్యం’లోనూ తన రచనానుభవం వినియోగించారు. ఏమిటీ ‘చీకటి రాజ్యం’? విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ చిత్రకథ ఏమిటంటే... కమల్‌హాసన్ పోలీస్‌శాఖలో ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వింగ్’ ఆఫీసర్. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసే చీకటి ప్రపంచంలోని నేరస్థులను పట్టుకునే పనిలో ఉంటాడట! ఆ క్రమంలో కిడ్నాప్ అయిన తన కుమారుణ్ణి కాపాడుకునేందు ఆ ఆఫీసర్ పడిన శ్రమ ఏమిటన్నది తెరపై చూపారట. నిజానికి, సినిమా అంతా ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథ. ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ‘రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని ఊహాతీతమైన ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఉండవు. ప్రతిదీ రియలిస్టిక్‌గా ఉంటుంది’ అని చిత్ర యూనిట్ కథనం. గురువును డెరైక్ట్ చేస్తున్న శిష్యుడు అంతకన్నా విశేషం ఏమిటంటే, కమలహాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రూపకల్పన బాధ్యతను ఒక కొత్త వాడికి ఇవ్వడం! ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వా గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన విజువల్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్. జీవనోపాధి కోసం కొన్నాళ్ళు డిజైనర్‌గా పనిచేసి, కమల్ ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’కు ఐ.డి. కార్డులు, బోర్డులు, వగైరా వర్క్ చేశారు. కమల్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఖాళీలున్నాయని తెలియగానే, తన అభిమాన హీరో దగ్గరకు పరిగెత్తారు. అలా 2008 నుంచి ఏడేళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజేశ్‌కు ‘చీకటి రాజ్యం’తో కమలే డెరైక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఇందులో త్రిష, ప్రకాశ్‌రాజ్, ‘దళం’ ఫేమ్ కిశోర్ - ఇలా చాలామంది ప్రముఖులే నటిస్తున్నారు. గౌతమి చేతిలో... కమల్ రూపం ఎప్పటికప్పుడు తన లుక్, స్టైల్ మార్చేసి, ఏ సినిమాకు ఆ సినిమాలో విభిన్నంగా కనిపించడం నటుడిగా కమలహాసన్ తీసుకొనే జాగ్రత్త. ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’, తాజా తమిళ చిత్రం ‘పాపనాశమ్’లలో ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపించిన కమల్ ‘చీకటి రాజ్యం’లో ఒంటి మీద లెదర్ జాకెట్, పెరిగిన గడ్డం, చేతిలో తుపాకీతో వెరైటీగా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం కమల్ జీవిత భాగస్వామి - నటి గౌతమి ప్రత్యేకంగా కాస్ట్యూమ్‌లు డిజైన్ చేశారు. ఇవాళ పోస్టర్స్‌లో, తమిళ ట్రైలర్లో ఆయన అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటే ఆ జాగ్రత్తే కారణం. త్రిష కూడా మునుపెన్నడూ లేని విధంగా పూర్తిగా డిఫరెంట్‌గా కనపడతారు. ప్రకాశ్‌రాజ్‌ది మరో ముఖ్యపాత్ర. తెలుగు నటి మధుశాలిని ఒక చిత్రమైన పాత్ర చేస్తున్నారు. కమల్ గాఢంగా ముద్దుపెట్టుకుంటున్నట్లు షూటింగ్ షురూ టైమ్‌లోనే రిలీజైన పోస్టర్లో ఉన్నది మధుశాలినే! ఆ పాత్ర స్వరూప స్వభావాలు ఏంటి? ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారామె! మనవాళ్ళ స్పెషల్ గెస్ట్ అప్పీయరెన్‌స టెక్నికల్‌గానూ ఈ సినిమాను బ్రిలియంట్‌గా నిలిపే ప్రయత్నాలు జరిగాయి. గతంలో వివాదాస్పద కమల్ ‘విశ్వరూపం’ సినిమాకు పనిచేసిన బాలీవుడ్ ఫేమ్ మలయాళీ శానూ వర్గీస్ దీనికీ సినిమాటోగ్రాఫర్. ‘ఉత్తమ విలన్’ మొదలు కమల్‌కు ఆస్థాన మ్యూజిక్ డెరైక్టరైన యువకుడు జిబ్రాన్ ఈ సినిమాకూ మ్యూజిక్ ఇస్తున్నారు. సినిమాలో ఒకే పాట ఉంటుందట. గీత రచయిత రామజోగయ్యశాస్త్రి అది రాశారు. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ రచయిత అబ్బూరి రవి పనిచేశారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో వీరిద్దరూ ప్రత్యేక అతిథి పాత్రల్లో నటించారు. అదీ కమల్ కాంబినేషన్లో. పబ్‌లో జరిగే ఒక సీన్లో వీళ్ళిద్దరూ ఎంటర్టైన్ చేస్తారని సమాచారం. అన్నట్లు ఈ చిత్రంలో కమల్ స్నేహితుడి పాత్రకు తెలుగులో అబ్బూరి రవి డబ్బింగ్ కూడా చెప్పారు. ఇలా చాలా విశేషాలున్నాయీ సినిమాలో. మొత్తం మీద, బాల నటుడిగా మొదలుపెట్టి ఇప్పటికి 50 ఏళ్ళ నటజీవితం పూర్తయినా, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవడం కళాకారుడిగా కమలహాసన్లోని ఆరని జ్వాలకు సంకేతం. అయితే, నిత్యనూతనత్వం కోసం చేసే ఈ అన్వేషణలో నిర్మాతగా, దర్శకుడిగా చాలాసార్లు ఆయనకు చేతులూ కాలాయి. కానీ, ప్రయోగశీలత మాత్రం కమల్ వదులుకోలేదు. ఆ వరుసలోనే ‘ఉత్తమ విలన్’ తరువాత ఈసారి ‘చీకటి రాజ్యం’లోని చీకటి నీడల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో కమల్, వచ్చే ఏడాది మొదట్లో రజనీకాంత్ కనువిందు చేయనున్నారు. కమర్షియల్ పరిధిలో ఒకరు, వాటికి అతీతంగా మరొకరు. ఎవరి రూట్ వారిదే. ఈ ఇద్దరి ఫిల్మ్స్... ఇప్పుడు మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్స్! - రెంటాల జయదేవ ‘చీకటి రాజ్యం’లో ఏం జరిగిందంటే..? * ఒకరోజు త్రిష, ప్రకాశ్‌రాజ్‌లకు ప్రోస్థటిక్ మేకప్ వేయాలి. కానీ, ప్రోస్థటిక్ మేకప్ నిపుణులకు ప్రోగ్రామ్ చెప్పడం మర్చిపోయారు రాజేశ్. చివరలో గుర్తొచ్చి, కమల్ దగ్గరకెళ్లి తన పొరపాటు చెప్పారు. అది విని కమల్ ఫైర్ అవ్వలేదు. నిజానికి, అప్పటికి పదిరోజులుగా కమల్ షూటింగ్లో ఉన్నారు. పదిరోజుల తర్వాత ఆయనకు దక్కిన ఒక్కరోజు విరామం అది. కానీ, కమల్ ఆ రోజు లొకేషన్‌కి వెళ్ళి, ప్రోస్థటిక్ మేకప్ వేశారు. దటీజ్ కమల్! * ‘మన్మథన్ అంబు’ (తెలుగులో ‘మన్మథ బాణం’) తర్వాత మళ్లీ కమల్‌తో త్రిష నటించిన చిత్రం ఇది. ఇందులో తన పాత్రపోషణ ఒక సవాల్ అన్నారు త్రిష. అన్నట్లు తమిళంలో త్రిష స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఈ సినిమా ఆమెకు కెరీర్లో 50వ చిత్రం. * ‘చీకటి రాజ్యం’లో రెస్టారెంట్ కిచెన్‌లో కమల్‌హాసన్, త్రిష మధ్య ఓ ఫైటుంది. ఫ్రెంచ్ స్టంట్‌మెన్ ఆధ్వర్యంలో దాన్ని తీశారు. * ఈ చిత్రాన్ని రూ. 30 కోట్ల నిర్మాణ వ్యయంతో తీశారని టాక్. దానిలో కమల్ పారితోషికం లేదు. తమిళ, తెలుగు భాషల్లో కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్రాన్ని ముగించడం ఓ విశేషం. * ‘తూంగావనం’ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లో యూ ట్యూబ్‌లో పది లక్షల మంది వీక్షించడం ఒక విశేషం. -
17 కోట్ల మందిని మెప్పించాలన్నదే లక్ష్యం
17 కోట్లమంది ప్రేక్షకులను మెప్పించాలన్న లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రం తూంగావనం (తెలుగులో చీకటి రాజ్యం) అన్నారు ఆ చిత్ర కథా నాయకుడు కమలహాసన్. పాపనాశం వంటి ఘన విజయం సాధించిన చిత్రం తరువాత ఈ విశ్వ నాయకుడు నటించిన ద్విభాషా చిత్రం తూంగావనం. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై చంద్రహాసన్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించారు. ముఖ్యపాత్రలో ప్రకాష్‌రాజ్ నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రను బాలనటుడు అమాన్ అబ్దుల్ పోషించారు. కమలహాసన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రాజేష్ సెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిత్రన్ సంగీతాన్ని అందించారు. చిత్రానికి నటి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయడం విశేషం. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ కమలహాసన్ ఈ ద్విభాషా చిత్రంలో పాత్రపరంగాను, గెటప్ పరంగాను విభిన్నంగా కనిపిస్తారన్నారు. పాత్ర కనుగుణంగాను అదే సమయంలో కమలహాసన్‌కు కొత్తగా చూపించడానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా నటి త్రిషను ఈ చిత్రంగా పూర్తిగా మార్చి చూపించినట్లు చెప్పారు. నటుడు ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ఇంతకుముందు తాను కమలహాసన్‌తో కలిసి నటించినా ఈ తూంగావనంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. తెలుగు వెర్షన్‌కు సంభాషణలు రాసిన రచయిత రామ్జ్యోతి శాస్త్రి మాట్లాడుతూ కమలహాసన్ చిత్రానికి రచయితగా పని చేయడం అదృష్టంగా పేర్కొన్నారు. ఆయన ఎన్సైక్లోపీడియా అన్నారు. కమలహాసన్‌తో నటించిన ఈ చిత్రం తన 50వ చిత్రం కావడం తీపి గుర్తుగా నటి త్రిష అన్నారు. చివరిగా కమలహాసన్ మాట్లాడుతూ తూంగావనం సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. కిడ్నాప్‌కు గురైన కొడుకు కోసం పోరాడే తల్లిదండ్రుల ఇతివృత్తమే తూంగావనం అని చెప్పారు. దీన్ని 17 కోట్లు మందిని (తమిళం, తెలుగు) మెప్పించాలన్న లక్ష్యంగా రూపొందించినట్లు తెలిపారు. ఇకపై రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై వరుస చిత్రాలను నిర్మించనున్నట్లు కమల్ వెల్లడించారు. -
'చీకటిరాజ్యం' ట్రైలర్ విడుదల
-
చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల
కమల్‌హాసన్, త్రిష జంటగా నటిస్తున్న చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ విడుదలైంది. 'తూంగవనం' పేరుతో తమిళంలోను, చీకటిరాజ్యంగా తెలుగులోను వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. త్రిషకు ఇది 50వ సినిమా కావడంతో పలువురు సినీ జనాలు కూడా త్రిషను ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు. అందులోనూ త్రిషను ఈ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో చూపించడం, కమల్, త్రిషల మధ్య ఫైటింగ్‌తో కూడిన పోస్టర్ కూడా విడుదల కావడం.. ఇలాంటి విశేషాలు ఉన్న నేపథ్యంలో ట్రైలర్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కమల్‌కు సన్నిహితుడైన రాజేశ్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించాడు. సినిమా ట్రైలర్ లింకును త్రిష ట్వీట్ చేసింది. CheekatiRajyam trailer http://t.co/4iK7NIC6wP — Trisha Krishnan (@trishtrashers) September 16, 2015 -
చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు
'చీకటి రాజ్యం' చుంభనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమల్ తాజా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. లిప్‌లాక్ దృశ్యాలు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. అలాంటి సన్నివేశాలను తప్పుపట్టే స్థాయి దాటిపోయింది. హీరోయిన్లు కూడా లిప్‌లాక్ దృశ్యాల్లో నటిస్తే తప్పేమిటి? అని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. ఇంతకు ముందు చుంభనాల దృశ్యాలకు తాను దూరం అన్న హీరోయిన్లు ఇప్పుడు కథ డిమాండ్ చేయడంతో కాదనలేకపోయానని అయినా ఆ సన్నివేశంలో అసభ్యం లేకుండా దర్శకుడు కళాత్మకంగా చిత్రీకరించారని చెబుతున్న కాలం ఇది. కోలీవుడ్‌లో ఇలాంటి లిప్‌లాక్ దృశ్యాలకు అగ్మార్క్ హీరో కమలహాసన్ అంటారు. ఆయన ప్రతి చిత్రంలోను ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఈ విశ్వనాయకుడి చుంభనాల దృశ్యాలు చాలా ఘాటుగా ఉంటాయని అంటారు. తన తాజా ద్విభాషా చిత్రం తెలుగులో 'చీకటి రాజ్యం' తమిళంలో 'తూంగావనం' సినిమాలో ఇలాంటి చుంభన దృశ్యాల మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమాన్ని ఇటీవల హైదరాబాదులో నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో కమలహాసన్ నటి త్రిషను ఘాటుగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ఉంది. సాధారణంగా కమల్ చిత్రాలు వివాదాలకు నిలయం అనే పేరుంది. ఇటీవల ఆయన నటించిన ప్రతి చిత్రం తీవ్ర వ్యతిరేకతల మధ్య విడుదలైంది. ఈ తాజా చిత్రంలో చుంభనాల దృశ్యం ఎలాంటి వివాదాలకు తావు తీయనున్నాయో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
మాట నిలబెట్టుకుంటున్నా! - కమల్
‘‘ఉత్తమ విలన్ రిలీజ్ టైమ్‌లో చాలా మంది ఎప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చే స్తారని అడిగారు. వెంటనే చేస్తానన్నా. ఏదో అలాగే అంటాడులే అని చాలా మంది అనుకున్నారు. కానీ, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని కమల్‌హాసన్ అన్నారు. తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ, ఆదివారం హైదరాబాద్‌లో ఆయన ఈ మాటలు అన్నారు. త్రిష, ప్రకాశ్‌రాజ్ ముఖ్యతారలుగా రూపొందనున్న ఈ చిత్రం తమిళంలో ‘తూంగా వనమ్’గా తయారవుతోంది. ఏడేళ్ళుగా కమల్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రాజేశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ-‘‘ కమల్ ఓ మహానది. చాలా కాలం తరువాత ఆయన నేరుగా తెలుగులో సినిమా చేయడం, నేనూ నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కమల్‌గారితో వర్క్‌తో చేయడం ఓ కల. ‘మన్మథబాణం’ తరువాత రెండోసారి ఆయనతో పని చేయడం అదృష్టం. ఇదివరకెన్నడూ చేయని పాత్రలో నటిస్తున్నా’’ అని త్రిష అన్నారు. ఈ సినిమా డెరైక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాననీ దర్శకుడు రాజేశ్ అన్నారు. కెమేరామన్ సానూ, ఆర్ట్ డెరైక్టర్ ప్రేమ్ నవాజ్, తమిళ రచయిత శుక, తెలుగు రచయిత అబ్బూరి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల
-
'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల
-
'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల
హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు విడుదలైయ్యాయి. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో 'తూంగా వనం' టైటిట్ ఖరారు చేశారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. జీబ్రాన్ సంగీతం అందించనున్నాడు. కమల్ హాసన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించడం ఇది నాలుగోసారి.