
ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ సినీ రంగంలోనూ కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే నటనకు గుడ్‌బై చెపుతున్నట్టుగా ప్రకటించిన కమల్ నిర్మాతగా సినీ రంగంలో కొనసాగనున్నారు. రాజ్ కమల్ ఇంటర్‌నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ బ్యానర్‌పై విక్రమ్ తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు కమల్.
రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించనున్నాడట. ఓ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చీకటిరాజ్యం ఫేం రాజేష్ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్ తీసుకున్న చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విక్రమ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం షూటింగ్‌లో బిజీగా ఉన్న నితిన్, కమల్ సినిమాపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment