మాట నిలబెట్టుకుంటున్నా! - కమల్ | Kamal Haasan to act in a Telugu movie after 20 years | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకుంటున్నా! - కమల్

Published Sun, May 24 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

మాట నిలబెట్టుకుంటున్నా! - కమల్

మాట నిలబెట్టుకుంటున్నా! - కమల్

 ‘‘ఉత్తమ విలన్ రిలీజ్ టైమ్‌లో చాలా మంది ఎప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చే స్తారని అడిగారు. వెంటనే చేస్తానన్నా. ఏదో అలాగే అంటాడులే అని చాలా మంది అనుకున్నారు. కానీ, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని కమల్‌హాసన్ అన్నారు. తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ, ఆదివారం హైదరాబాద్‌లో ఆయన ఈ మాటలు అన్నారు. త్రిష, ప్రకాశ్‌రాజ్ ముఖ్యతారలుగా రూపొందనున్న ఈ చిత్రం తమిళంలో ‘తూంగా వనమ్’గా తయారవుతోంది.
 
  ఏడేళ్ళుగా కమల్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రాజేశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ-‘‘ కమల్ ఓ మహానది. చాలా కాలం తరువాత ఆయన నేరుగా తెలుగులో సినిమా చేయడం, నేనూ నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కమల్‌గారితో వర్క్‌తో చేయడం ఓ కల. ‘మన్మథబాణం’ తరువాత రెండోసారి ఆయనతో పని చేయడం అదృష్టం. ఇదివరకెన్నడూ చేయని పాత్రలో నటిస్తున్నా’’ అని త్రిష అన్నారు. ఈ సినిమా డెరైక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాననీ దర్శకుడు రాజేశ్ అన్నారు. కెమేరామన్ సానూ, ఆర్ట్ డెరైక్టర్ ప్రేమ్ నవాజ్, తమిళ రచయిత శుక, తెలుగు రచయిత అబ్బూరి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement