prakasraj
-
సినిమా నాన్నలు
‘ఎవ్వరి కోసం ఎవరొస్తారు పొండిరా పొండి... నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి’... బహుశా తెలుగు సినిమాల్లో పిల్లల మీద విరుచుకుపడిన తొలితండ్రి ‘ధర్మదాత’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రూపంలో కనపడతాడు. పిల్లల చేతిలో దెబ్బ తిన్న తండ్రికి అలాంటి ఉక్రోషం రావడం సహజం. దానితో పాటు ప్రేక్షకులు ఐడెంటిఫై అవడం కూడా సహజం. అయితే దాసరి తీసిన ‘తాత మనవడు’ సినిమాలో సత్యనారాయణ తండ్రి అయిన ఎస్.వి.రంగారావు నానా కష్టాలు పడి చివరకు మనవడైన రాజబాబును ఊతకర్రగా చేసుకుంటే తప్ప తన ఆత్మగౌరవం తాను కాపాడుకోలేకపోతాడు. ‘జగదేకవీరుని కథ’లో తన వారసునిగా సింహాసనం అధిష్టించమని మహారాజు పాత్రధారియైన ముక్కామల కొడుకు ఎన్.టి.రామారావుతో అంటే ‘నాకు నలుగురు దేవకన్యలతో వివాహమాడాకే రాజ్యం ఏలాలని ఉంది నాన్నగారూ’ అని జవాబిస్తాడు. దాంతో ఆ కొడుకును రాజ్యబహిష్కారం చేసి ఇతర కొడుకుల చేతిలో కష్టాలు పడతాడా తండ్రి. గమనించవలసిన సంగతి ఏమిటంటే తెలుగు సినిమాల్లో తండ్రులు మంచి పాత్రలు పోషించే నటులే అయ్యారు. నాగయ్య, గుమ్మడి, ఎస్.వి.రంగారావు, మిక్కిలినేని ఎక్కువగా వీరే ఆ పాత్రలు పోషించారు. కొంతకాలానికి నెమ్మదిగా తెలుగు సినిమాల్లో ఒక ఫార్ములా స్థిరపడింది. అదేమిటంటే హీరోయిన్ తప్పనిసరిగా విలన్ కూతురు కావడం. ఈ విలన్ తండ్రుల పాత్రలు వేయడానికి కూడా కొందరు నటులు సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, నాగభూషణం, రాజనాల, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి... కలర్ కాలం వచ్చేనాటికి రావు గోపాలరావు వీరంతా ఈ తరహా తండ్రులుగా స్థిరపడ్డారు. ఇక కమెడియన్ తండ్రులు కొందరు ఉండేవారు. రాజబాబు, పద్మనాభం, గిరిజ, గీతాంజలి ఇలాంటి హాస్యనటులకు తండ్రులుగా రమణారెడ్డి, రేలంగి, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు... వీరంతా ప్రేక్షకులకు నచ్చారు. అయితే ఎనభైలలో మధ్యతరగతి సినిమాల కాలంలో ఇద్దరు తండ్రులు నిశ్శబ్దంగా ఎక్కువ పాత్రలు పోషించి మార్కులు కొట్టేశారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కావడం ఒక విశేషం. ఒకరు జె.వి.సోమయాజులు, రెండోవారు జె.వి.రమణమూర్తి. వీళ్లిద్దరూ ‘సప్తపది’లో తండ్రి కొడుకులుగా కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటారు. జె.వి.రమణమూర్తి ‘ఆకలి రాజ్యం’ సినిమాలోనూ ‘గోరింటాకు’ సినిమాలోనూ కొడుకు ద్వేషానికి లోనవుతాడు. తనను కాదనుకుని వచ్చేసిన కొడుకును ఢిల్లీలో వెతుకుతూ తండ్రిగా జె.వి.రమణమూర్తి ‘ఆకలి రాజ్యం’లో పాడే ‘కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని’ పాట ఎలాంటి తండ్రైనా తండ్రేనని తండ్రికి బిడ్డంటే ప్రేమేనని నిరూపిస్తుంది. ఇక అదే సినిమాలో కూమార్తె శ్రీదేవి డబ్బును, జబ్బు పడి ఉన్న తల్లి కడియాన్ని దొంగిలించుకుపోయే దగుల్బాజీ తండ్రిగా ఒరు విరల్ కృష్ణారావు కనపడతాడు. ఈ సమయంలోనే మురళీమోహన్ నటించిన ‘ఓ తండ్రి తీర్పు’ పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. తనను వంచించిన కొడుకులకు బుద్ధి చెప్తూ తనలాగే అనాథలైన తండ్రులందరినీ చేరదీసి వృద్ధాశ్రమం నడిపే తండ్రి కథ ఇది. ఆ తర్వాత వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’లో తండ్రి అయిన గొల్లపూడి మారుతీరావు ఖర్చులు భరించడానికి వెనుకాడే కొడుకు శరత్‌బాబును ఛీకొట్టి ఇంటి నడి మధ్యలో గీత గీస్తాడు. నీ బతుకు నీది నా బతుకు నాది అంటాడు. కలిసి ఉండి కొట్టుకోవడం కన్నా విడిపోయి ప్రేమగా ఉండటం మేలు అని ప్రతిపాదిస్తుంది ఈ సినిమా. ఈ దశలోనే ఎన్.టి.రామారావు, అక్కినేని తండ్రులుగా పాత్రలు పోషించడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ సినిమాలలో అక్కినేని ‘బహుదూరపు బాటసారి’, ‘జస్టిస్ చక్రవర్తి’ సినిమాలలో శక్తిమంతమైన తండ్రి పాత్రలు పోషించారు. ఆ తర్వాత కొంతకాలం ఒక చీకటి యుగం నడిచింది. హీరోలు కాని హీరోయిన్లు కాని ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తెలియనట్టుగా వాళ్లు మాత్రమే కనిపిస్తూ తల్లిదండ్రుల్ని స్క్రీన్ మీదకు తేకుండా కథను నడిపించారు. అయితే ఆ సమయంలోనే కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బును కొడుకు దొంగిలిస్తే గుండె ఆగి చచ్చిన తండ్రిగా ‘మగమహారాజు’ సినిమాలో ఉదయకుమార్, ఇంటి పరువు కాపాడటానికి కిడ్నీని అమ్మడానికి సిద్ధపడిన తండ్రిగా ‘విజేత’ సినిమాలో జె.వి.సోమయాజులు గుర్తుంటారు. హుందాగా ఉంటూనే కుమార్తెకు స్నేహితుడిగా ధైర్యం చెప్పే తండ్రిగా నటుడు విజయకుమార్ మణిరత్నం ‘గీతాంజలి’లో ఆకట్టుకుంటారు. ఇక తొంభైలు వచ్చాక సినిమా తండ్రులు పిల్లలకు దాదాపుగా శృతి మించిన స్నేహితులుగా మారిపోయారు. పిల్లల చేత తిట్లు తినడం, పిల్లలతో మందు తాగడం, పిల్లలు పంచ్‌లు వేస్తే పడటం... ఇలాంటి పరిణామం సంభవించింది. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, ధర్మవరపు, తనికెళ్ల భరణి, చలపతిరావు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇలాంటి పాత్రలు వేయాల్సి వచ్చింది. ‘ఆనందం’, ‘గులాబి’, ‘చిత్రం’, ‘అల్లరి’, ‘ఇడియట్’... తదితర సినిమాలు ఇలాంటి పాత్రలను చూపించాయి. తండ్రులు, లెక్చరర్లు పూర్తిగా అభాసుపాలైన కాలం ఇది. ఈ కాలంలోనే తమిళ నంచి తెలుగుకు రీమేక్ చేసిన ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలలో చంద్రమోహన్, కోట శ్రీనివాస్‌రావు కొంచెం భిన్నమైన, స్వభావాన్ని ప్రదర్శించగలిగిన తండ్రులుగా కనిపిస్తారు. ఆపై ‘బొమ్మరిల్లు’ సినిమా తెలుగు తండ్రికి ఉన్న మార్కెట్ వాల్యూని నిరూపించింది. ఆ సినిమాలో తండ్రిగా నటించిన ప్రకాష్‌రాజ్ ఈనాటి చాలామంది తండ్రులు ప్రదర్శిస్తున్న పొజెసివ్నెస్ని చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు తండ్రి స్థానాన్ని తిరిగి తండ్రికి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు. హీరో లేని కథ లేనట్టే హీరో తండ్రి పాత్ర లేని కథ కూడా దాదాపు ఉండదు. లోకంలో తండ్రి ఉన్నంత కాలం సినిమా తండ్రి కూడా ఉంటాడు. కథను రసమయం చేస్తూనే ఉంటాడయ. నాన్నకు ప్రేమతో... నాన్నకు ఒక రీలుతో. జె.వి.రమణమూర్తి ‘ఆకలి రాజ్యం’ సినిమాలోనూ ‘గోరింటాకు’ సినిమాలోనూ కొడుకు ద్వేషానికి లోనవుతాడు. తనను కాదనుకుని వచ్చేసిన కొడుకును ఢిల్లీలో వెతుకుతూ తండ్రిగా జె.వి.రమణమూర్తి పాడే ‘కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని’ పాట ఎలాంటి తండ్రైనా తండ్రేనని తండ్రికి బిడ్డంటే ప్రేమేనని నిరూపిస్తుంది. - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
యాక్టర్... నానాపటేకర్ డైరెక్టర్... ప్రకాశ్ రాజ్
ప్రసిద్ధ నటుడు ప్రకాశ్‌రాజ్ దర్శకునిగా బాలీవుడ్లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ ఉత్తమ నటుడు నానాపటేకర్ హీరోగా ‘తడ్కా’ పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ఇంతకు ముందు ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో ‘ఉలవచారు బిర్యానీ’ (తమిళంలో ‘ఉన్ సమయిల్ అరయిల్’) చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. ఇప్పుడు జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ‘తడ్కా’ చిత్రీకరణ మే, జూన్‌ల్లో జరగనుంది. శ్రీయ, తాప్సీ నాయికలుగా నటించనున్నారు. ‘నానూ నన్న కనసు’(కన్నడ), ‘ధోని’ (తెలుగు, తమిళ) చిత్రాలు డెరైక్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్ ప్రస్తుతం తెలుగు, కన్నడాల్లో ‘మనవూరి రామాయణం’ అనే సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. -
వర్మ ఏం చెప్పారంటే..
చిత్రం: ఎటాక్, తారాగణం: మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి, రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, కెమేరా: అంజి, సంగీతం: రవిశంకర్, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడెవరన్నదాన్ని బట్టి సిన్మా ఎలా ఉంటుందో ఒక ఊహ, అంచనా వస్తాయి. అందుకే, ‘ఎటాక్’ సిన్మాపై ఆసక్తి. కథగా - ‘ఎటాక్’ చాలా చిన్న పాయింట్! ఒక కుటుంబం లోని పెద్దపై జరిగిన ఎటాక్‌కు అతని కుమారుడు ప్రతీకారం తీర్చుకోవడం! వివరంగా చెప్పాలంటే... గురురాజ్ (ప్రకాశ్‌రాజ్) ఒకప్పుడు రౌడీలీడర్. కానీ, ఆ తరువాత అవన్నీ వదిలేసి, భవన నిర్మాణ రంగంలో గడుపుతుంటాడు. అతనికి భార్య (మంజుభార్గవి), ముగ్గురు కొడుకులు - కాళీ (జగపతి బాబు), గోపి (వడ్డే నవీన్), రాధాకృష్ణ (మంచు మనోజ్). ఒక స్థలం విషయంలో వచ్చిన తగాదా నేపథ్యంలో గుడి నుంచి వస్తున్న గురురాజ్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేయించారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతీకారానికి దిగిన అతని పెద్దకొడుకూ చనిపోతాడు. ఈ వ్యవహారంలో రౌడీ గ్యాంగ్ (అభిమన్యు సింగ్, పూనవ్ు కౌర్) చురుకుగా పాల్గొంటారు. స్థలం తగాదా ఉన్నవాళ్ళే ఈ హత్యలు చేశారా, మరొకరా అన్నది సస్పెన్స. దాన్ని హీరో ఎలా కనిపెట్టా డనేది పెద్దగా లేకున్నా, ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ. హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’తో బాగా ప్రభా వితమైన వర్మకు ఇలాంటి గ్యాంగ్ వార్లు, పగలు, ప్రతీకారాలు ఇష్టమైన ముడి సరుకులు. వాటినెలా వండి వడ్డించాలన్నది ఆయనకు అనుభవైకవేద్యం. ‘గాయం’ రోజుల నుంచి ‘సర్కార్’ మీదుగా నిన్నటి మోహన్‌బాబు ‘రౌడీ’ దాకా ఆ ఫార్ములా వీలైనంత వాడారు. చాలాసార్లు సక్సెసూ సాధించారు. ఈసారి ఫ్లైకామ్ లాంటి ఆధునిక కెమేరా జ్ఞానం, ‘రక్తచరిత్ర’ నుంచి అందుకున్న చిత్రమైన నేపథ్య సంగీతం, పాటలతో తెరకెక్కించారు. మంచితనానికీ, చెడ్డతనానికీ మధ్య తేడా వివరిస్తూ, ‘దానవీరశూర కర్ణ’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి సిన్మాల సీన్లతో, పాటతో ‘ఎటాక్’ మొదలవుతుంది. ఆరంభంలోనే వచ్చే ప్రకాశ్‌రాజ్ హత్య ఘట్టం చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ‘నాన్న గారు ఏం చెప్పారంటే...’ అంటూ పదే పదే ఫ్లాష్‌బ్యాక్ సీన్సకి వెళుతూ కథ సాగుతుంది. క్రమంగా 107 నిమిషాల నిడివిలో ‘నేరాలు- ఘోరాలు’ ఎపిసోడ్ చూసిన భావన కలుగు తుంది. ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, వడ్డే నవీన్ లాంటి సీజన్డ ఆర్టిస్టులున్నారు. వారిని మరింత ఉపయోగించుకొనే సీన్స ఇంకా ఉండాలనిపిస్తుంది. మనోజ్ చేసినపాత్ర సెకండాఫ్‌లో విజృంభిస్తుంది. వెరసి, ఇది వర్మ మార్క ‘ఎటాక్’. -
సీ టూ హెచ్ నుంచి థియేటర్లకు..
సీటూహెచ్ల్లో చూసిన సినిమా ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శనలకు సిద్ధమవుతోంది. ఇది నిజంగా సరికొత్త విధానమే. దర్శకుడు చేరన్ తమిళ చిత్ర పరిశ్రమలో చేసిన నవ్య ప్రయోగం చిత్రం విడుదలకు ముందే దాన్ని డీవీడీల ద్వారా ఇంటింటికీ వినియోగం చేసి ప్రేక్షకుల ముంగిట సినిమాను తీసుకెళ్లారు. సీటూహెచ్(ఇంటికే సినిమా)పేరుతో సంస్థను ప్రారంభించి తాను స్వీయ దర్శకత్వంలో తన డ్రీమ్ థియేటర్ పతాకంపై చేరన్ నిర్మించిన చిత్రం జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ముందుగా థియేటర్లలో విడుదల చేయకుండా డీవీడీల రూపంలో తమిళనాడులో ఇంటింటా వినియోగం చేశారు. ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ ఇలాంటి ప్రయోగాన్నే తన విశ్వరూపం చిత్రానికి చేయాలని భావించారు.అయితే అందుకు థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే చేరన్ తన చిత్రాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించకుండా నేరుగా డీవీడీల రూపంలో సీటూహెచ్ ద్వారా ఇంటింటా వినియోగం చేశారు. ఈ ప్రయోగంలో తాను సక్సెస్ అయ్యానంటున్న ఆయన ఇప్పుడ అదే చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ శర్వానంద్ కథానాయకుడిగా నిత్యామీనన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సంతానం, ప్రకాష్‌రాజ్, జయప్రకాశ్, మనోబాలా ముఖ్య పాత్రలు పోషించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని చేరన్ తమిళం, తెలగు భాషలతో రూపొందించారు. ముందు డీవీడీల ద్వారా విడుదల చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు చేరన్ బదులిస్తూ జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని డీవీడీల ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వ చ్చిందన్నారు. ఇదే విషయం గురించి థ/యేటర్ల యాజమాన్యంతో చర్చించగా వారు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతించడంతో పాటు సహకరించారన్నారు. మంచి చిత్రాన్ని అందురూ చూడాలన్న ఉద్దేశంతో జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘ఊపిరి’, తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాశ్‌రాజ్, జయసుధ, గ్యాబ్రియెల్లా డెమెట్రియాడిస్, స్వర్గీయ కల్పన, అతిథి పాత్రల్లో అనూష్క, శ్రీయ, అడివి శేష్, మాటలు: అబ్బూరి రవి, పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కెమేరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: మధు, సంగీతం: గోపీ సుందర్, నిర్మాతలు: పరవ్ు వి.పొట్లూరి, కెవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి ఏ కళారూపమైనా మారాలంటే కళాభిమానుల ఆలోచన, అభిరుచి మారాలి. కానీ అభిరుచిని మార్చాలంటే, మళ్ళీ కొత్త అభిరుచిని కల్పించేం దుకు తగ్గ కళారూపమే రావాలి. ఉపరితలంలో స్వతంత్రంగా అనిపించినా, పరస్పర ఆధారిత మైన రెండు అభిన్నమైన విషయాలివి. దర్శక, నిర్మాతలు తీసేవే చూడాలా? జనానికి చూపించా ల్సినవి వాళ్ళు తీయాలా? అనే కోణంలో ఈ చర్చ మన తెలుగు సినిమాకూ వర్తిస్తుంది. మరి, ఇవాళ తెలుగు సినిమాలో ఎలాంటి కథలు కావాలి? ఎలాంటి సినిమాలు రావాలి? రొడ్డకొట్టుడు రొటీన్ సినిమాల నుంచి బయటపడాలంటే దర్శక - నిర్మాతలైనా, ప్రేక్షకులైనా ఎవరేం చేయాలి? ఆలోచించాల్సిన ఈ అర్థవంతమైన చర్చకు దోహదంగా ఇటీవల కొన్ని కొత్త పంథా చిత్రాలు వస్తున్నాయి. వాటికి తాజా చేర్పు - ‘ఊపిరి’. విక్రమ్ ఆదిత్య (నాగార్జున) పెద్ద కోటీశ్వ రుడు. కార్ల రేసింగ్, పారా గ్లైడింగ్ లాంటి ఎడ్వెం చర్లతో జీవితంలో వేగాన్ని ఇష్టపడే సాహసికుడు. అలాంటివాడు అయిదేళ్ళ క్రితం ఓ అనూహ్య ప్రమాదంతో వెన్నెముక దెబ్బతిని, పేరాప్లెజిక్గా మారిపోతాడు. మెడ కింద నుంచి ఏ భాగమూ పనిచేయని పరిస్థితుల్లో మిగిలిపోతాడు. అతని బాగోగులు చూసుకొనేందుకు తాజాగా ఒక కేర్ టేకర్ కోసం చూస్తుంటారు. సరిగ్గా అదే టైవ్‌ులో జైలులో నుంచి పెరోల్ మీద విడుదలవుతాడు చిల్లర దొంగతనాలు చేసే శీను (కార్తీ). చిరుద్యోగి అయిన అమ్మ (జయసుధ), ప్రేమలో పడ్డ చెల్లెలు, పనికిమాలిన రౌడీలతో తిరిగే తమ్ముడు - అతని మధ్యతరగతి కుటుంబసభ్యులు. జైలు నుంచి వచ్చిన అతణ్ణి, అమ్మ ఛీపొమ్మంటుంది. సత్ప్రవర్తనతో ఉంటే నాలుగునెలల్లో శిక్ష రద్దు చేయించుకోవచ్చని ఈ కోటీశ్వరుడి దగ్గర ఉద్యోగానికొస్తాడు. కదలలేని కోటీశ్వ రుడికి పి.ఎ. అయిన కీర్తి (తమన్నా)ను తొలిచూపులోనే ఇష్టపడతాడు. డబ్బు అన్ని సమస్యలకూ పరిష్కారమను కున్న శీనుకు క్రమంగా మానవ బంధాల రుచి తెలుస్తుంది. శీను ఉత్సాహంతో కోటీశ్వరుడిలో కొత్త దశ మొదలవు తుంది. కానీ, కుర్చీకే పరిమితమైన ఆ కోటీశ్వరుడి జీవితంలోనూ ప్యారిస్‌కు ముడిపడి ఒక రహస్యం ఉంటుంది. అలాగే, తరచూ వచ్చే పర్సనల్ లెట ర్సతో మరో అనుబంధం ఉంటుంది. ఆ రహస్యా లేమిటి?జీవితం పట్ల నిరుత్సాహం పేరుకున్న ఆ కోటీశ్వరుడిలో మార్పు వచ్చిందా? మరి, ఇంటికి దూరమైన హీరో చివరకు అమ్మతో అనుబంధం పంచుకున్నాడా? లాంటివన్నీ మిగతా సినిమా. ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’గా దర్శక, నిర్మాతలు పేర్కొన్న ఈ చిత్రం ‘బతకడానికి డబ్బక్కర్లేదు... ఒక తోడుంటే చాలు’ అని చెబుతుంది. ‘మున్నా’, ‘బృందావనం’, ‘ఎవడు’తో పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లికి ఇది కొత్త అనుభవం. ఫ్రెంచ్ సినిమా ‘ఇన్‌టచబుల్స్’ను అధికారికంగా రైట్స్ కొని మరీ చేసిన ఈ రీమేక్‌లో టైటిల్స్ దగ్గర నుంచి చాలావరకు అనుకరించారు. నేటివిటికి తగ్గట్లు మార్పుచేర్పులూ చేశారు. ఇప్పటి దాకా హీరో పాత్రలకే పరిమితమైన నాగ్ వయసుకీ, కాలానికీ తగ్గట్లు విలక్షణ క్యారె క్టర్ల వైపు మొగ్గుతున్నారనడానికి మరో ఉదాహ రణ కోటీశ్వరుడి పాత్ర. ఆయనది సరైన నిర్ణయ మని సిన్మా చూశాక ఒప్పుకుంటారు. అయితే, ఇదీ ఒక రకంగా నాగార్జున నవ మన్మథుడి ఇమేజ్‌కు తగ్గట్లుగానే ఉంది. ఆయన పాత్రకు సినిమాలో ఒకటికి మూడు ప్రేమలుంటాయి. ఒకటి - క్లైమాక్స్‌లో శుభం కార్డుకు ఉపయోగపడే లెటర్స్ ప్రేమ. మరొకటి - అతని జీవితంలో ఎదురైన విషాదభరిత ప్రమాదానికి ముందు నడిచిన జీవితప్రేమ. వేరొకటి - మధ్యలో కార్తీతో పందెం వేసి, నడిపిన డేటింగ్ ప్రేమ. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో సహాయ కుడిగా మొదలై, తమిళంలో హీరోగా పేరు తెచ్చు కున్న కార్తీ తన తొలి నేరు తెలుగు సినిమాలోనే ఫుల్ మార్కులు కొట్టేశారు. శీను పాత్రలో ఆయన నటించకుండా, సహజంగా ప్రవర్తించారు. నాగ్‌కు సెక్రటరీగా తమన్నా చేసిన పాత్రలో అభినయం కన్నా అందం ఉంది. కథలో సెంటిమెంట్ టచ్ - కార్తీ కుటుంబ కథ. తల్లి పాత్రధారిణి జయ సుధల చుట్టూ నడుస్తుంది. కార్తీ ఫోన్ సీన్, అలాగే బైక్ మీద కార్తీ తనను కూర్చోబెట్టుకొని తీసుకువెళుతున్న ప్పుడు తలపెకైత్తి నాగ్ ఆకాశం వైపు చూసే ఘట్టం లాంటివి గుండెను తడి చేస్తాయి. నాగ్ భావప్రకటన బాగుంది. అయితే, ఒక ఆవారాను తన కేర్‌టేకర్‌గా కోటీశ్వరుడు పెట్టుకోవడం, అంత కోటీశ్వరుడి పక్కన నర్సయినా లేకపోవడం లాంటివి ఇలాంటి కథల్లోనే చూస్తాం. వాటికి కన్విన్స్ అవడమా, కాక పోవడమా అన్నది ప్రేక్షకుల ఇష్టం. కానీ, ‘ఈ రోజుకి, ఈ నిమిషానికి ఇలాంటివాడే నాకు కరెక్ట్’ అనే డైలాగ్‌తో ఆ పాయింట్‌ను ఒప్పిస్తారు. ఇక, సెకండాఫ్‌తో పోలిస్తే, ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్ మెంట్ పాలెక్కువ. కథను ముగించాల్సిన సెకం డాఫ్‌లో అది ఆశించడం అత్యాశే. ద్వితీయార్ధంలో ప్యారిస్‌లోని అందమైన ప్రదేశాల్ని చూపెట్టే ఎపి సోడ్ ఫీలింగ్‌తో పాటు నిడివిపరంగానూ అంత దూరం ప్రయాణించినట్లనిపిస్తుంది. అదీ మంద గమనంతో! పెయింటింగ్, సితార్ వాదన లాంటి కళలపై జోక్‌లు నవ్వు తెప్పిస్తాయి. కానీ, అవి సబ్‌కాన్షస్‌గా మన కళల గురించి మన ఆలోచనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అలాగే, ఒవర్ స్పీడింగ్ను ఫ్యాంటసైజ్ చేసి చూపడం కూడా! థీవ్‌ు మ్యూజిక్, రీరికార్డింగ్ బాగున్న ఈ చిత్రంలో గోపీ సుందర్ సంగీతంలో ‘ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్’, ‘నువ్వేమిచ్చావో నీకైనా తెలుసునా’, ‘పోదాం ఎగిరెగిరి పోదాం’ లాంటి పాటలు, సీతారామశాస్త్రి చొప్పించిన జీవనసారం భేష్. కొండంత భావాన్ని కొద్ది మాటల్లో చెప్పడా నికి అబ్బూరి రవి ప్రయత్నం అక్కడక్కడ మెరు స్తుంది. ‘దేవుడు ఎవరినీ సంతోషంగా ఉండని వ్వడు... బ్యాడ్‌బాయ్’ (నాగ్‌తో కార్తీ) లాంటివి ఉదాహరణ. కెమేరావర్క్, పుష్కల నిర్మాణ విలువలతో ఈ సిన్మా కాస్ట్లీలుక్ కనువిందే. సెకం డాఫ్ పట్టుగా అల్లుకొంటే, చర్విత చర్వణాలు తగ్గితే ఇంకా బాగుండేది. ఏమైనా, ఊపిరి అంటే ప్రాణంతో ఉండడం కాదు. జీవితాన్ని ఆనం దంగా గడపడమని ఈ సిన్మా చెబుతుంది. తర్వాతేం జరుగుతుందో ఊహించగలిగినా, కొన్నిచోట్ల అసహజమనిపించినా, ఆద్యంతం ఫీల్‌గుడ్ అవుతుంది. అందుకే, ఊపిరి సలపని మసాలా సిన్మాల మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ, కాస్తంత గాలి కోరుకుంటున్న వారికి ఈ సిన్మా రిలీఫ్! కొత్త తరహా చిత్రాలకు మళ్ళీ ఊపిరి!! కాళ్ళూ చేతులూ చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైన పాత్రను ఇమేజ్ ఉన్న ఒక పెద్ద హీరో పోషించడం తెలుగు సినిమాలో ఊహించగలమా? పక్కా తమిళ నటుడు తెలు గులో పూర్తిస్థాయి హీరో పాత్రతో తెరంగేట్రం చేసి, తన గొంతుతోనే తెలుగు డైలాగులు చెప్పు కోవడం విని, చూసి ఎన్నాళ్ళయింది? తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్న ఉత్తరాది అమ్మాయి కథానాయిక పాత్రధారణతో పాటు కష్టపడి గాత్రధారణ కూడా చేసి ఇంకెన్ని రోజులైంది? ఇటీవల ఎన్నడూ చూడని ఇలాంటి విచిత్రాలు అన్నీ జరిగిన సినిమా - ‘ఊపిరి’. - రెంటాల జయదేవ -
పెద్దగా ఆలోచించాలి!
మన ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉంటే.. అభివృద్ధి కూడా అదే స్థాయిలోనే ఉంటుందని చాలామంది అంటుంటారు. అమలా పాల్ కూడా అదే అంటున్నారు. అందుకే ‘థింక్ బిగ్ స్టూడియోస్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు. ‘నాన్న’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన అమలాపాల్ ఏడాది క్రితం తమిళ దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తమాభిరుచి గల చిత్రాలను అందించాలనే సంకల్పంతో ఈ భార్యాభర్తలు ఇప్పుడు నిర్మాతలుగా మారారు. తొలి ప్రయత్నంగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, శ్రీయారెడ్డి కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. దీనికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నామనీ, అంతర్జాతీయ ప్రేక్షకులకు నచ్చే చిత్రం తీయాలనే పెద్ద ఆశయంతో ఈ సినిమా మొదలుపెట్టామనీ అమలాపాల్ విజయ్ తెలిపారు. -
మాట నిలబెట్టుకుంటున్నా! - కమల్
‘‘ఉత్తమ విలన్ రిలీజ్ టైమ్‌లో చాలా మంది ఎప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చే స్తారని అడిగారు. వెంటనే చేస్తానన్నా. ఏదో అలాగే అంటాడులే అని చాలా మంది అనుకున్నారు. కానీ, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని కమల్‌హాసన్ అన్నారు. తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ, ఆదివారం హైదరాబాద్‌లో ఆయన ఈ మాటలు అన్నారు. త్రిష, ప్రకాశ్‌రాజ్ ముఖ్యతారలుగా రూపొందనున్న ఈ చిత్రం తమిళంలో ‘తూంగా వనమ్’గా తయారవుతోంది. ఏడేళ్ళుగా కమల్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రాజేశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ-‘‘ కమల్ ఓ మహానది. చాలా కాలం తరువాత ఆయన నేరుగా తెలుగులో సినిమా చేయడం, నేనూ నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కమల్‌గారితో వర్క్‌తో చేయడం ఓ కల. ‘మన్మథబాణం’ తరువాత రెండోసారి ఆయనతో పని చేయడం అదృష్టం. ఇదివరకెన్నడూ చేయని పాత్రలో నటిస్తున్నా’’ అని త్రిష అన్నారు. ఈ సినిమా డెరైక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాననీ దర్శకుడు రాజేశ్ అన్నారు. కెమేరామన్ సానూ, ఆర్ట్ డెరైక్టర్ ప్రేమ్ నవాజ్, తమిళ రచయిత శుక, తెలుగు రచయిత అబ్బూరి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
s\o. బ్రహ్మమూర్తి ... ఆస్తే విలువ
కొత్త అవతార్ సన్నాఫ్ సత్యమూర్తిలో ప్రకాష్‌రాజ్‌కి బదులు బ్రహ్మానందం ఉంటే! అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేసరికి మేనేజర్ తిడుతూ బయటికి వెళుతున్నాడు. తండ్రి బ్రహ్మానందాన్ని చూసి,అర్జున్ - ‘‘ఎందుకు నాన్నా వాడు బీప్ సౌండ్‌తో తిడుతున్నాడు’’. బ్రహ్మా - ‘‘అడిగినప్పుడు డబ్బులివ్వకపోతే వాడేంటి నువ్వు కూడా తిడతావు.’’‘‘ఇవ్వచ్చు కదా.’’ ‘‘వాడి భార్య ఆస్పత్రిలో ఉందని ఇప్పటికి ఆరుసార్లు చెప్పాడు. ఒకే భార్య ఎన్నిసార్లు ఆస్పత్రిలో ఉంటుంది?’’ ‘‘అంటే ఇప్పటికి ఆరుసార్లు డబ్బులిచ్చావా?’’ ‘‘ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈ బ్రహ్మమూర్తి దేన్నీ నమ్మడు. బ్రహ్మను కూడా నమ్మడు. నీకు నాన్నా పులి కథ తెలుసా? ఏదో కొడుకు కదాని రెండుసార్లు నమ్మాడు. మూడోసారి నమ్మకపోవడం వల్ల బతికిపోయాడు. నమ్ముంటే కొడుకుతో పాటు తండ్రిని కూడా పులి తినేసేది. కథ కంచికి... పులి అడవికి.’’ ‘‘ఏంటి నాన్నా, కథ కొత్తగా చెపుతున్నావ్?’’ ‘‘బాగున్నప్పుడు కథలు చెప్పి, బాగా లేనప్పుడు నాటకాలు ఆడేవాడు కాదురా ఈ బ్రహ్మమూర్తి. ఏ కథైనా మొదట విన్నప్పుడు కొత్తగా ఉంటుంది. తరువాత రోతగా మారుతుంది. నేనో అమ్మాయిని చూశాను. అమ్మాయి ఆస్తి నాకు నచ్చింది. నీకు అమ్మాయి నచ్చకపోయినా పెళ్లి చేసుకో. ప్రపంచంలో సగం మంది నచ్చకుండానే పెళ్లి చేసుకుంటారు. మిగిలిన సగం మందికి పెళ్లయింతరువాత ఒకరికొకరు నచ్చరు. పెళ్లికి ముందు నచ్చి, పెళ్లికి తరువాత నచ్చితే వాళ్ల క్యారెక్టర్లో ఏదో మచ్చ ఉందని అర్థం. ఒక్క విషయం గుర్తుంచుకో. ఈ లోకంలో వస్తువులకే తప్ప మనుషులకు విలువలుండవు. ఆస్తికి విలువుంటుంది కానీ, విలువల వల్ల ఆస్తి రాదు, చిప్ప మాత్రం వస్తుంది.’’ ‘‘బ్రహమూర్తి కొడుకుగా నాకే విలువా లేదా?’’ ‘‘నాకు మూడొందల కోట్లు ఆస్తి ఉంది కాబట్టే నీకు విలువ. మూడొందల కోట్లు అప్పులున్నాయని తెలిస్తే నీకూ నాకూ శిలువ. ఒకవేళ నేను పోయినా ఎవరికీ రూపాయి అప్పు తీర్చద్దు.’’ ‘‘తీర్చకపోతే ఎలా నాన్నా?’’ ‘‘వొరే పిచ్చినాన్నా, ఈ దేశానికి లక్షల కోట్లు అప్పుంది. మన రాష్ట్రానికి అప్పుంది. చివరికి చెత్త ఊడ్చే మునిసిపాలిటీలు కూడా వరల్డ్ బ్యాంక్‌లో అప్పులు తీసుకుంటున్నాయి. అప్పు చేయడం దేశభక్తితో సమానం. మేరీ దేశ్ కీ ధర్తీ అని పాట పాడుతూ అప్పుజెయ్యి. అప్పుచేసేవాడు అప్‌కి వెళతాడు. తీర్చేవాడు డౌన్‌కి పోతాడు.’’ ‘‘గ్రేట్ వాల్యూస్ నాన్నా నీవి?’’ ‘‘గ్రేట్ కాదు, రేట్ వాల్యూస్. చూడు మనం ఎంతటి లంకానగరం నిర్మించినా, లంకిణిని కాపలా పెట్టినా, ఏదో ఒకనాడు తోక తిప్పుకుంటూ ఆంజనేయుడు వస్తాడు. వాడి తోకకి నిప్పు పెట్టడం నేర్చుకో. అర్థం కాలేదా ఆంజనేయుడంటే ఆదాయపు పన్నువాడు.’’ ‘‘సన్ ఆఫ్ బ్రహ్మమూర్తంటే గర్వంగా ఉంది నాన్నా.’’ ‘‘నువ్వు సన్వి కాదు, గన్ ఆఫ్ బ్రహ్మమూర్తి. రివాల్వర్‌లో ఇమిడిపోయే ఫిరంగి గుండువి.’’ - జి.ఆర్ -
ఆయన దాహం తీరనిది!
ప్రపంచమొక పద్మవ్యూహం... కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీశ్రీ. ఇలాంటి కవితా పంక్తులెన్నో కంఠతా వచ్చిన సాహితీప్రియుడైన నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మాత్రం నటన ఒక తీరని దాహం. అందుకే, కావచ్చు... వెండితెరపై దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా విస్తరించిన ఈ జాతీయ స్థాయి నటుడు విలక్షణంగా రంగస్థలంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కన్నడసీమకు చెందిన ఆయన మరో సీనియర్ నటుడు - సాహిత్యకాడు ఇప్పురుడు గిరీష్ కర్నాడ్ రాసిన కొత్త కన్నడ నాటకంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నాటకం పేరు - ‘మంత్రపుష్పం’. ‘‘భక్తి, శృంగారం - రెండూ మిళితమైన కథాంశంతో ఈ నాటకం నడుస్తుంది. అందులో నాది కీలకమైన పూజారి పాత్ర’’ అని ప్రకాశ్‌రాజ్ ‘సాక్షి’కి వివరించారు. నిత్యం చేస్తున్న వాణిజ్య తరహా పాత్రలు, చిత్రాల నుంచి ఇది కొంత విశ్రాంతినిస్తుందని ఆయన భావిస్తున్నారు. ‘‘అన్ని భాషల్లోనూ సాహిత్యంలో, రంగస్థలంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగితే, ఇటు సాహిత్యానికీ, అటు సమాజానికీ కూడా మరింత మేలు జరుగుతుంది’’ అని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయపడ్డారు. మరి, అలాంటి తీరని దాహంతో ముందుకొచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారా? -
నటనలో వారే నాకు స్ఫూర్తి
ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్లే ఆదర్శం నటనలో ఉన్నత స్థానమే లక్ష్యం ఆసక్తితోనే సినీ రంగంలోకి.. స్వగ్రామం వచ్చిన బుల్లితెర నటుడు కూన వేణుగోపాల్ ఎచ్చెర్ల: సినీ నటదిగ్గజాలు ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ వంటి నటులే స్ఫూర్తిగా... నటనలో ఉన్నతస్థానాని కి చేరటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రముఖ బుల్లితెర, సినీ నటుడు కూన వేణుగోపాల్ చెప్పారు. శ్రీకాకుళం పట్టణం లో జరుగుతున్న దివంగత మెట్ట అప్పారావు రాష్ట్రస్థాయి నాటికల పోటీలకు హాజరయ్యేందుకు శనివారం ఆయన స్వగ్రామమైన ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత.. తన మేనమామ మెట్ట అప్పారావునాయుడు స్ఫూర్తితోనే నటనవైపు అడుగులు వేసినట్లు చెప్పారు. బీ ఫార్మసీ, పీజీ మాస్ కమ్యూనికేషన్స్ చదివినా ఉద్యోగం కంటే నటనపై ఆసక్తితో ప్రయత్నించినట్లు చెప్పారు. ఇష్టం ఉన్న వృత్తిలో పనిచేస్తే జీవితం సంతోషంగా ఉంటుందని, అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు. తాను ఇంతవరకు బంగారు కోడిపెట్ట, జైశ్రీరాం, వెయ్యి అబద్ధాలు, సరదాగా అమ్మాయిలతో.. వంటి సినిమాల్లో నటిం చానని చెప్పారు. అయితే సినీ రంగం కంటే బుల్లితెర సీరియ ల్స్ తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందన్నారు. ఈ టీవీలో ప్రసారమవుతున్న అలామొదలైంది, జీటీవీలో ప్రసారమవుతున్న గంగతో రాంబాబు, అన్వేషిత వంటి సీరియల్స్ మంచి పేరు తెచ్చాయన్నారు. 2009లో ఎఫ్ఎం రేడియోలో యాంకర్‌గా పనిచేసి అనంతరం మా మ్యూజిక్‌లో సమ్‌థింగ్ స్పెషల్ కార్యక్రమంలో యాంకరింగ్‌తో నట జీవితం ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం మా టీవీలో ప్రసారమైన పలు ఇంట ర్వ్యూలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, సమంత, తమన్నా తదితరుల ఇంటర్వ్యూ లు ప్రేక్షకుల్లో తనకు మంచి గుర్తింపు తెచ్చాయన్నారు. నటన లో నానాపటేకర్, ప్రకాష్‌రాజ్ వంటి నటులే స్ఫూర్తిగా ముం దుకుసాగుతున్నట్లు చెప్పారు. అన్ని రకాల పాత్రలు నటిస్తేనే మంచి గుర్తింపు నిస్తాయన్నారు. ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా టీవీ, సినిమా రెండు రంగాల్లోనూ అన్ని రకాల పాత్రలూ చేస్తున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రంగస్థల నటులు మెట్ట పోలినాయుడు, మెట్ట వెంకటపతిరాజు ఉన్నారు. -
ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్!
సీన్ నం.1 ఎనిమిది నెలల క్రితం... హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నం. 31లో ఓ పాత బిల్డింగ్‌ను కూలగొడుతున్నారు. మొత్తం కూల్చేసి పునాదులు తీయడానికే చాలా రోజులు పట్టింది. కట్ చేస్తే... సీన్ నం.2 2014 జూలై 31... ఇప్పుడా ప్లేస్‌లో "cave'వెలిసింది. ‘కేవ్’ అంటే గుహ. మామూలుగా గుహలుండేది కొండల్లో. మరి నగరం మధ్యలో ఈ ‘కేవ్’ ఏంటి? ఆ ‘కేవ్’కి "restricted'అంటూ గేట్ ఏంటి? ‘సాక్షి’కి మాత్రమే "unrestricted'ఎంట్రీ దొరకడమేంటి? ఎన్నెన్నో నిర్మాణ విశేషాలున్న ఈ ‘కేవ్’ గురించి ఓనర్ పూరీ జగన్నాథ్‌నే అడిగేస్తే పోలా..! మీ ఆఫీస్ అదిరింది... మీ టేస్ట్ కనబడుతోంది... పూరీజగన్నాథ్: థ్యాంక్యూ... ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్, చార్మి, రానా వచ్చారు. వాళ్లకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ అయితే అప్పటికప్పుడు బోస్ కంపెనీ వాళ్ళ సింగిల్ టవర్ కాన్సెప్ట్ స్పీకర్ తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటి ఆఫీస్‌లో ఇలాంటివే ఉండాలని చెప్పారు. రామూ గారు మా ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి ‘‘మీ ఆఫీస్ ఇంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది కదా. మీరు రెగ్యులర్ జీన్స్, షర్ట్స్‌లో రావద్దు. బెర్ముడాలు, టీ షర్ట్స్ వేసుకు రండి’’ అని చెప్పారు. ఆఫీస్ చూడడం కోసం రోజూ చాలామంది వస్తున్నారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఆఫీస్ లేదని అందరూ అంటున్నారు. సినిమాకి ఫస్ట్‌లుక్ ఇచ్చినట్లుగా, ఈ ఆఫీస్ ఫస్ట్‌లుక్ మీడియాలో ఫస్ట్ మీకే ఇస్తున్నా... అందుకే మిమ్మల్ని ఆహ్వానించా... అసలు ఇంత భారీ స్థాయిలో, అత్యాధునికంగా ఆఫీసు కట్టాలని ఎందుకనిపించింది? పూరీజగన్నాథ్: నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే మా కాలనీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పర్సనల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం లాంటివి అక్కడే చేసేవాణ్ణి. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలీదు. ఒకసారి అనుమానమొచ్చి అడిగితే, ఏదో చెప్పి కవర్ చేశా. నాకంటూ పర్సనల్‌గా ఓ స్పేస్ ఉండాలనేది మొదట్నుంచీ నా కోరిక. మామూలుగా అందరికీ హాలీడే అంటే పనిచేయని రోజు. నాకు మాత్రం పనిచేస్తేనే హాలీడే. సో, మనం పనిచేసే ఏరియా హాలీడే మూడ్‌లో ఎగ్జైటింగ్‌గా ఉండాలి. అందుకే ఈ ఆఫీస్. అయినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటాను. అదొక రీజన్. సినిమా ఎంత స్పీడ్‌గా తీస్తారో ఆఫీస్ కూడా అంత స్పీడ్‌గా కట్టించేసినట్టున్నారు? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) అవును. కేవలం 8 నెలల్లో ఈ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంత ఫాస్ట్‌గా ఏ బిల్డింగూ రెడీ అయి ఉండదు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్పగా ఆఫీస్ కట్టుకోవడం ఎలా అనిపిస్తోంది? పూరీజగన్నాథ్: నా టైమ్ బావుందంతే! మధ్యలో మీ టైమ్ బాగోలేనట్టుంది? పూరీజగన్నాథ్: నేను నమ్మే కాన్సెప్ట్ ఎప్పుడూ ఒక్కటే... ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’. మంచి అయినా, చెడు అయినా ఏదీ శాశ్వతం కాదు. అంత పర్మినెంట్ కానప్పుడు ఇంత డబ్బు ఖర్చుపెట్టి, ఆఫీసు కట్టడం అవసరమా? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) మీరు ఇది బిల్డింగ్ అనుకుంటున్నారా..? కేవ్ అండీ బాబూ. ఇంతకు ముందు మీ పాత ఆఫీస్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉండేది కదా. దాన్నెందుకు తీసేశారు? పూరీజగన్నాథ్: అవును... అప్పట్లో ఆ ఆఫీస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అయితే దాన్ని టెంపరరీగానే కట్టా. ఒక దశలో అప్పుల పాలై ఆ ఆఫీసు అమ్మేశా. ‘బిజినెస్‌మేన్’ సినిమా తర్వాత పుంజుకుని ఈ ఆఫీసు కొని, ఇక్కడున్న పాత బిల్డింగ్ పడగొట్టి నా డ్రీమ్ ఆఫీస్ కట్టుకున్నా. ఇందులోనే నా రెసిడెన్స్ కూడా. మీ ఆఫీస్ ఎంత బాగుందో, మీ హోమ్ థియేటర్ అంతకన్నా బాగుంది... పూరీజగన్నాథ్: నేనెక్కువ గడిపేది హోమ్ థియేటర్లోనే. యాపిల్ ఐ ట్యూన్స్ ద్వారా ఏ సినిమా కావాల్సి వస్తే, ఆ సినిమా ఇక్కడ చూడొచ్చు. అంతా శాటిలైట్ టెక్నాలజీ. మన అరచేతిలో వరల్డ్ సినిమా మొత్తం ఉన్నట్టే. ఒక్క సినిమాలు అనేకాదు, పాటలు, డాక్యుమెంటరీలు, టీవీ షోలు... ఇలా అన్నీ చూడొచ్చు. జస్ట్ ఐ ప్యాడ్ ద్వారానే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ ఆపరేట్ చేయొచ్చు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆపరేటింగ్ కూడా ఐ ప్యాడ్ ద్వారా చేసుకోవచ్చు. సినిమాలు చూడనప్పుడు దీన్ని డ్రాయింగ్ రూమ్‌లా కూడా వాడుకోవచ్చు. కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లాడుకోవచ్చు. ఒకసారి పైకి చూడండి. పైన సీలింగ్‌కి వాడిన వాల్‌పేపర్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. లండన్‌లో ఫేమస్ ప్లే అయిన ‘ఫ్యాంటమ్ ఆఫ్ ది ఓపెరా’ వాల్ పోస్టర్ అది. ఆ నాటకం గొప్పతనం ఏంటంటే - గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా ప్రదర్శిస్తూనే ఉన్నా, ఇప్పటికీ అది హౌస్‌ఫుల్లే. ఇక్కడ వాడిన ఆడియో సిస్టమ్స్ కూడా చాలా అత్యాధునికం. హైదరాబాద్‌లో ఈ తరహా సిస్టమ్ ఇదే మొట్టమొదటిదట. ఈ ఆఫీస్ డిజైనింగ్ ఆలోచన అంతా మీదేనా? పూరీజగన్నాథ్: జయకిరణ్ అని హైదరాబాద్‌లో ఫేమస్ ఆర్కిటెక్ట్. నా స్నేహితుల ఇళ్లల్లో ఆయన వర్క్ చూసి, ఈ ప్రాజెక్ట్ అప్పగించా. ఆయనతో గంటలు గంటలు కూర్చొని నా పిచ్చి అంతా చెప్పా. దానికి తగ్గట్టే ఆయన డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతా చాలా కొత్తగా ఉంది! పూరీజగన్నాథ్: నాకు రెగ్యులర్ ఫ్లోరింగ్ నచ్చదు. ఇలా పాలిపోయినట్టుగా, రస్టిక్‌గా ఉంటేనే ఇష్టం. క్యాలిఫోర్నియా స్లేట్ని కొన్ని గోడలకు వాడాం. స్పెయిన్ నుంచి ఆర్డర్ చేసిన ఉడెన్ ఫ్లోర్లా అనిపించే టైల్స్ మరికొన్ని చోట్ల వాడాం. అంతా రెడీ అయ్యాక ఫ్లోర్స్‌ను క్లీన్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఆ టైమ్‌లో ఒకామె నాతో అన్న మాటలు విని నాకు నవ్వొచ్చింది. ‘‘ఏం సార్... ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఫ్లోరింగ్ మాత్రం సెకండ్ హ్యాండ్ కొన్నారేం’’ అందామె. ఆ డిజైనింగ్ అలా ఉంటుందని ఆమెకు తెలియదు కదా. ఇంతకూ మీ హోమ్ స్టూడియోకు ‘కేవ్’ అనే పేరు ఎందుకు పెట్టినట్టు? పూరీజగన్నాథ్: ప్రపంచం ఓ అడవి లాంటిది. అందులో నేనో జంతువును. నేను ఉండడానికి ఓ కేవ్ దొరికిందంతే. సరే... దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది? పూరీజగన్నాథ్: ఇప్పుడు అవసరమా! ముందు మంచి కాఫీ తాగండి. మా ఆఫీస్‌లో కాఫీ బార్ కూడా ఉంది. కేపర్చినో, ఎక్స్‌ప్రెసో... ఇలా ఏది కావాల్సి వస్తే అది తాగొచ్చు. - పులగం చిన్నారాయణ The Man Behind.... ఆర్కిటెక్ట్‌గా నా కెరీర్ 1998లో మొదలైంది. ఇప్పటివరకూ ఉన్న నా క్లయింట్స్ అందరిలోకెల్లా పూరీగారు డిఫరెంట్. ఫలానాది వాడుతున్నామంటే ‘ఓకే’ అనేసేవారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. పూరీ గారితో వర్క్ చేయడం వెరీ ఫన్. నా ఐడియాలను బాగా గౌరవించేవారు. ఆయన బిహేవియర్ ప్యాట్రన్‌ను దృష్టిలో పెట్టుకునే, ఈ ఆఫీస్ డిజైన్ చేశాం. ఆయనకు ప్రకృతి ఇష్టం కాబట్టి, చుట్టూ చెట్లు, మొక్కలు, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చాం. ఆయనకు బ్లాక్ అంటే ఇష్టం. ఆందుకే ఈ ఆఫీస్‌లో ఎక్కువ అంశాలు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఆయన చాలా ఇన్ఫార్మల్గా ఉంటారు. అందుకే ఆఫీస్‌ను కూడా ఇన్ఫార్మల్గా డిజైన్ చేశాం. 18,000 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ కట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్‌కు ఉంచేశాం. ఫస్ట్ ఫ్లోర్ సినిమా ఆఫీస్. సెకండ్ ఫ్లోర్లో జగన్‌గారి పర్సనల్ రూమ్, లైబ్రరీ, ఫొటోసెషన్ రూమ్‌తో పాటు రెసిడెన్స్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్రంట్ ఎలివేషన్‌ను ఐరన్ గ్రిల్స్‌తో లైన్స్‌లా పెట్టడానికి కారణం కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుందనే. దానికి తోడు ఈయన తీసే సినిమాల వల్ల ఆఫీసు మీద అప్పుడప్పుడు రాళ్లు పడుతుంటాయి కదా... (నవ్వేస్తూ). ఇది యాక్చ్యువల్‌గా గ్లాస్ హౌస్. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. పగలు లైట్లు వాడనవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, లైటింగ్ ఎక్కువ అవుతోందని స్టిక్కరింగ్ చేయాల్సి వచ్చింది. టై మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏసీని కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేసుకోవచ్చు. - జయకిరణ్, ఆర్కిటెక్ట్ ఆఫీస్ ముందు 11 అడుగుల యూరోపియన్ స్టాచ్యూ... యూరోపియన్ స్టాచ్యూను రెప్లికా చేసి ఆఫీస్ ముందు పెడుతున్నాం. సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందా స్టాచ్యూ. అలాగే అమెరికా నుంచి 10 అడుగుల రెక్కలున్న పెద్ద ఫ్యాన్లు తెప్పిస్తున్నాం. ఆ కంపెనీ వాళ్లకు మన స్పెసిఫికేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ఓకే చేస్తారు. ఆఫీస్‌లో సోఫాలన్నీ దాదాపుగా టచ్ ఆపరేటెడ్. ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంది. అంతా ఇంటర్నెట్ ఆపరేటెడ్. ఫారిన్ నుంచి కూడా ఇంటర్‌కామ్‌లో మాట్లాడొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడేం జరుగుతోందో... ఐ ప్యాడ్ ద్వారా ప్రపంచం ఏ మూలన ఉన్నా చూడొచ్చు. ఫారిన్ వెళ్లినప్పుడు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కొనాలి. ఫొటోలు: శివ మల్లాల