సీ టూ హెచ్ నుంచి థియేటర్లకు..
సీ టూ హెచ్ నుంచి థియేటర్లకు..
Published Fri, Apr 1 2016 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
సీటూహెచ్‌ల్లో చూసిన సినిమా ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శనలకు సిద్ధమవుతోంది. ఇది నిజంగా సరికొత్త విధానమే. దర్శకుడు చేరన్ తమిళ చిత్ర పరిశ్రమలో చేసిన నవ్య ప్రయోగం చిత్రం విడుదలకు ముందే దాన్ని డీవీడీల ద్వారా ఇంటింటికీ వినియోగం చేసి ప్రేక్షకుల ముంగిట సినిమాను తీసుకెళ్లారు. సీటూహెచ్(ఇంటికే సినిమా)పేరుతో సంస్థను ప్రారంభించి తాను స్వీయ దర్శకత్వంలో తన డ్రీమ్ థియేటర్ పతాకంపై చేరన్ నిర్మించిన చిత్రం జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ముందుగా థియేటర్లలో విడుదల చేయకుండా డీవీడీల రూపంలో తమిళనాడులో ఇంటింటా వినియోగం చేశారు.
ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ ఇలాంటి ప్రయోగాన్నే తన విశ్వరూపం చిత్రానికి చేయాలని భావించారు.అయితే అందుకు థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే చేరన్ తన చిత్రాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించకుండా నేరుగా డీవీడీల రూపంలో సీటూహెచ్ ద్వారా ఇంటింటా వినియోగం చేశారు. ఈ ప్రయోగంలో తాను సక్సెస్ అయ్యానంటున్న ఆయన ఇప్పుడ అదే చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ శర్వానంద్ కథానాయకుడిగా నిత్యామీనన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సంతానం, ప్రకాష్‌రాజ్, జయప్రకాశ్, మనోబాలా ముఖ్య పాత్రలు పోషించారు.
జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని చేరన్ తమిళం, తెలగు భాషలతో రూపొందించారు. ముందు డీవీడీల ద్వారా విడుదల చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు చేరన్ బదులిస్తూ జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని డీవీడీల ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వ చ్చిందన్నారు. ఇదే విషయం గురించి థ/యేటర్ల యాజమాన్యంతో చర్చించగా వారు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతించడంతో పాటు సహకరించారన్నారు. మంచి చిత్రాన్ని అందురూ చూడాలన్న ఉద్దేశంతో జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement