Jayaprakash
-
దళితులపై కారంచేడు తరహా దాడులకు టీడీపీ కుట్ర
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ మెజార్టీ సాధించిన తర్వాత దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీల సంక్షేమం జరిగిందని, అందువల్లనే ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలన్నీ వైఎస్సార్సీపీకే మద్దతుగా నిలిచాయని చెప్పారు. పోలింగ్ జరుగుతున్న రోజే ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు పలు జిల్లాల్లో దళితులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలతో మేలు చేశారని, అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు ఆయనకు అండగా ఉన్నారని తెలిపారు. అది సహించలేని టీడీపీ.. దళితులపై దాడులు చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల కిందటి కారంచేడు వంటి ఘటనలు పునరావృతం చేయడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని జయప్రకాష్ కెనడీ ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత దళితులపై దాడులు జరగకుండా ఎలక్షన్ కమిషన్, డీజీపీ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మేదర సురేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలింగ్ రోజున దళితులపై దాడులకు తెగబడుతున్నా ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహించిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత దళితులపై దాడులు జరిగితే దానికి ఎలక్షన్ కమిషన్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో విజయవాడ మాలమహానాడు నగర అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!
అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని, పదవీ విరమణ తర్వాత తగుదునమ్మా అంటూ టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఊరూరా తిరుగుతున్నారు. హింసలేని ఎన్నికలు, స్వేచ్ఛ అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు. కాపాడే అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.ఇటీవల కాలంలో ‘సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ’ (సీఎఫ్‌డీ) పేరుతో ఏపీ ఎన్నికల మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు సమా వేశాలతో హడావిడి చేస్తున్నారు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన లక్ష్యం స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని కల్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడం అని ప్రకటించారు. ఇదే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న కాలంలో, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయనీ, అలాగే నామినేషన్లు వేయనివ్వడం లేదనీ, దౌర్జన్యాలు నెరిగాయనీ పెద్ద ఎత్తున విపక్షాలు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా తొలగించడంతో ఆయనకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటివి గుర్తు కొస్తున్నాయి. ఈయన అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారనే విష యాన్ని మరిచిపోతే ఎలా? సీఈసీ విడుదల చేసిన వివరాల ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 79.74 శాతం ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట పార్లమెంటరీ నియోజక వర్గంలో అత్యధికంగా 85.53 శాతం పోలయ్యాయి. అలాగే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 74.64 శాతం ఓట్లు పోలయ్యాయి. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 85.16 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే, రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్లకే ఇక్కడి ప్రజల్లో కలిగిన చైతన్యం కారణంగా 2019 ఎన్నికల్లో చంద్ర బాబును ఇంటికి పంపడం కోసం, మరో ఐదు శాతం మంది కొత్తగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్నమాట. ఇక్కడి గణాంకాలు ఇలా ఉన్నప్పుడు, ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మళ్ళీ ఓటు–హక్కు అంటూ, వీరి కసరత్తు ఎందుకు? ఈ ఐఏఎస్ అధికారులతో పీవీ రమేష్ అనే మరొక ఐఏఎస్ కలిశారు. వీరు కలిగించే చైతన్యం అంతా బెజ వాడ కేంద్రంగానే సాగడం గమనార్హం. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో నిమ్మగడ్డ బృందం నిర్వహిస్తున్న సభల్లో గెస్ట్ పాత్రల్లో పాల్గొంటున్నవారి విషయమై పౌరులు బాధపడుతున్నారు. రిటైర్ అయ్యాక కూడా ౖవై సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పబోయి క్షతగాత్రు లైన ఈ ముగ్గురు అధికారులు తమకంటూ ఇక్కడ ఒక విలువ లేక, ‘మీడియా అటెన్షన్’ కోసం, మాజీ భారత ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కేబినెట్ సెక్రటరీ కె. పద్మనాభయ్యలను తమ పక్కన పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ మాజీ అధికారులను క్షతగాత్రులు అనవలసివచ్చిందో తెలియాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేడర్‌లో ఏదో ఒక ప్రధాన శాఖలో కాకుండా, చంద్రబాబు కోసం తన సర్వీస్ చివరి రోజు వరకూ రాజ్ భవన్లో గవర్నర్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు ముందు 4 నెలల పాటు రాష్ట్రపతిపాలన ఉండడం మనకు తెలిసిందే. అప్పట్లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆఫీస్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని కీలక నిర్ణయాలకు కేంద్రం అయింది. ఇలా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదటి నుంచి నిమ్మగడ్డకు కొత్తకాదు. అందుకే 2016లో రిటైర్ అయిన మరుసటి రోజు ఇతణ్ణి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్ట్‌లో చంద్రబాబు నియమించారు. అదే నెలలో ఆయన కుమార్తె నిమ్మగడ్డ లావణ్యను ఏపీ ‘ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్’లో సీనియర్ కన్సల్టెంట్‌గా నెలకు రూ 1.50 లక్షల జీతంతో నియమించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఉపాధి కోల్పోయి, పౌర వేదిక ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థి తరహాలో ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే, మళ్ళీ ‘ఫ్యామిలీ ప్యాకేజి’ ప్రయోజ నాలు పొందడం ఆయన లక్ష్యం. అందుకోసం ‘ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది? వీరు కేబినెట్ హోదాలో ఉంటూ రాజకీయాలు ఎలా మాట్లాడతారు?’ అంటూ రమేష్ టీడీపీ తరఫున విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటికంటే ఎక్కువమంది సలహా దారులు, ‘కన్సల్టెంట్లు’ ఉన్న విషయం తెలియనిది కాదు. ‘స్కిల్ స్కామ్’లో అరెస్టయిన ‘ఏ 1’ గంటా సుబ్బా రావు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్న ‘ఏ 2’ ఐఏఎస్ లక్ష్మీనారాయణలు ఇద్దరూ ఇదే తరహాలో బయట నుంచి ప్రభుత్వం ‘కన్సల్టెంట్స్’గా నియమించిన వారేకదా! ప్రభుత్వంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడ్డం నేరమా? లేక నమ్మకంగా ప్రభుత్వంలో ఉంటూ, దొంగ దారుల్లో నిధులు బయటకు పంపడం నేరమా? ఈ రెండింటిలో ఏది ప్రజాస్వామ్యానికి చేటు? అని రాష్ట్ర ప్రజలు ఈ నిమ్మగడ్డ బృందాన్ని నిలదీయొద్దూ? ‘రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లా డుతున్న నిమ్మగడ్డ, బెజవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీటులో కూర్చుని, తన తప్పుడు చర్యలకు తగిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి క్రింది ఉద్యోగులతో‘కంప్యూటర్ హార్డ్ డిస్క్’లు ధ్వంసం చేయించడం ఏ స్ఫూర్తి అవుతుందో చెప్పగలరా? అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించడమే ఓ ప్రహసనం! ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ ఉండడంతో, భారత ఎన్నికల కమిషనర్ వెంటనే అయన్ని తొలగించి, క్రీడలు యువజన సర్వీసులు సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్ పోస్టులో నియమించింది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం పరిపాలనా శైలి వేగాన్ని అందుకోలేని స్థితిలో ఉన్న ఎల్వీ స్థానంలో మరొకరిని సీఎస్ పోస్టులో నియమించారు. అదీ ఎల్వీ ఆక్రోశానికి కారణం. దాంతో, నిమ్మగడ్డ వెనుక తిరుగుతూ జగన్ ప్రభుత్వం మీద ముసుగు దాడికి దిగారు. ఇందులో ముఖ్యుల ఎంపిక ఎవరిదోగానీ, ఆసక్తి కరంగా ఉంది. అంబేడ్కరిస్టుల కుటుంబం నుంచి మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కొంచెం ఆలస్యంగా ఇందులోకి దిగారు. ‘స్కిల్ స్కామ్’ జరిగినప్పుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈయన కేస్ సమయంలో ‘మీడియా’ ముందు వివాదాస్పదంగా మాట్లాడి వార్తల్లో వ్యక్తి అయ్యారు. సర్వీసులో ఎక్కువకాలం పలుదేశాల్లో ‘వరల్డ్ బ్యాంక్’లో పనిచేశానని చెప్పుకునే రమేష్, ప్రస్తుతం‘ఇండియన్ బిజినెస్ స్కూల్’లో ‘ఫ్యాకల్టీ’గా పనిచేస్తూ, మధ్యలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బెజవాడ వస్తున్నారు. అయితే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం గురించి ఈయన ఒక్క మాటా మాట్లాడరు! వీరంతా ‘పొలిటికల్ జేఏసీ’గా ఏర్పడి, దానికి ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ అని పేరుపెట్టి ఏపీలో తటస్థ ఓటరును ప్రభావితం చేయాలనే రహస్య ‘ఎజెండా’తో పనిచేస్తున్నారు. వీరికి ‘మీడియా’ కవరేజి కోసం ‘బాబు మీడియా ఎటూ ఉండనే ఉంది. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... ప్రజలు అంతా గమనిస్తున్నారు. తగిన సమ యంలో తగినవిధంగా స్పందిస్తారు. - వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
మా కులానికి బాబు కరోనాలా మారాడు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు స్వశక్తి హీనుడని, పరాన్నజీవి రకమని.. సొంత బలంతో ఎప్పుడూ ముందడుగు వేయలేదని, ఇకపైనా వేయలేడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ వ్యాఖ్యానించారు. కుట్రలు, కుతంత్రాలు, అవినీతే ప్రధాన బలాలని.. వ్యవస్థల విధ్వంసం, మాయోపాయాలే ఆయన ఆయుధాలన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్మోహన్రెడ్డిలా ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఒక్క మంచి పథకాన్ని అమలుచేయలేకపోయాడని “సాక్షి’తో అన్నారు. తమ కులానికి కరోనాలా మారాడని తమ పెద్దలు మథనపడుతున్నారని అడుసుమిల్లి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బాబు పాపం పండింది వైఎస్సార్‌ను మించి జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. కరోనా సమయంలో జగన్ ప్రభుత్వ సేవలు, పరిపాలనా విధానాలు యావత్ దేశంతోపాటు నోబెల్ బహుమతి గ్రహీతల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ.. అమరావతి రాజధాని పేరిట ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేముంది? అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన బాబు పాపం పండి రాజమండ్రి జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. ఒంటరిగా పోటీచేయలేని స్థాయికి టీడీపీని దిగజార్చాడు. ఇక మా కులానికి కరోనా వైరస్‌లా దాపురించిన అతని నుంచి ఎలా కాపాడుకోవాలనే ఆలోచనల్లో మా పెద్దలున్నారు. బాబు జైలుకు వెళ్లింది కేవలం ఆయన చేసిన అవినీతి, అక్రమాలవల్లే. దానికోసం సామాజికవర్గం మొత్తం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలా? వీటివల్ల గ్రామాల్లో మా వర్గం ఒంటరిదవుతోంది. బాబు తన నిర్దోíÙత్వాన్ని నిరూపించుకోవాలేగానీ కృత్రిమ ఉద్యమాలు చేయించకూడదు. -
జనసేన నేత గుండాయిజం భూకబ్జాలు, దాదాగిరి..
-
వారికి శిక్ష తప్పదు..!
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని జాతీయ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐలో జరిగిన అవినీతిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరతామని చెప్పారు. ఈఎస్ఐ అవినీతికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అచ్చెన్నాయుడు ప్రధాని పేరును వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈఎస్ఐలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కంపెనీలే ఏపీలో కూడా అవినీతికి పాల్పడ్డాయని చెప్పారు. అవినీతి పాల్పడిన వారికి శిక్ష తప్పదని జయప్రకాష్ స్పష్టం చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
నల్ల పులి
నేను అతి పేదవాడిని. మా నాన్న బతికినన్నాళ్ళు కులాసాగా కాలం గడిపి నా జీవనోపాధికేమీ ఏర్పాటు చేయకుండా కాలం చేశాడు. ఎవరార్డ్ కింగ్ మా నాన్న మేనల్లుడు. అతనొక్కడే మా దగ్గరి బంధువు. మా నాన్న అన్నగారైన సదరన్టన్ బ్రహ్మచారి. పెద్ద ఎస్టేటుకు యజమాని. నాకు బొత్తిగా ఆదాయం లేదు. ఖర్చులెక్కువైపోయాయి. రోజురోజుకూ జీవితం దుర్భరం కాసాగింది. అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వాళ్ళు పీక్కుతినసాగారు. ఎవరార్డ్ కింగ్ నా తండ్రికి స్వయానా మేనల్లుడు. నా పెదతల్లి సోదరుడు. అతడు ఇంతకుముందు బ్రెజిల్లో సాహసోపేత జీవితాన్ని గడిపి ప్రస్తుతం స్థిరనివాసమేర్పరుచుకోదలచి ఇంగ్లాండుకొచ్చాడు. సఫోక్ లో, క్లిప్టన్ దగ్గర గ్రేల్యాండ్స్ అనే పెద్ద ఎస్టేట్ కొన్నాడు. నా గురించి ఈషణ్మాత్రం పట్టించుకోని అతని నుండి గ్రేల్యాండ్స్ రమ్మని నాకు ఆహ్వానమందింది. నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే బయలుదేరి అక్కడికి రైల్లో చేరుకున్నాను. నేనొక బండిని బాడుగకు మాట్లాడుకున్నాను. బండి చోదకుడు మిస్టర్ ఎవరార్డ్ కింగ్ దాతృత్వం గురించి చాలా గొప్పగా పొగిడాడు. దానగుణసంపత్తిలో అతనికి సాటిరాగల వాడెవ్వరూ ఆ ప్రాంతంలో లేరని చాలా మంచిగానే చెప్పాడు. పర్యావరణహితం కోరి ఆ గొప్పవ్యక్తి చాలా రకాల జంతువులను, వివిధజాతుల పక్షులను ఇంగ్లండులో పెంచి ఆయా జాతులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్టు చెప్పాడు. గ్రేల్యాండ్స్ పార్క్ గేటువద్దకొచ్చింది బండి. ఇంటి గడప మెట్ల మీద నిలబడి ఉన్న వ్యక్తే అంకుల్ అని ఊహించాను. ఇంతకుముందెన్నడూ అతన్ని చూసి ఉండలేదు. అంకుల్ కూడా నేనేనని ఊహించాడు. అంకుల్ వయస్సు సుమారు నలభై ఐదేళ్ళుండొచ్చు. పొట్టిగా లావుగా ఉన్నాడు. గుండ్రని ముఖం, నవ్వుతున్న కళ్ళు. ముఖం నిండా ముడతలు. తెల్లని దుస్తులు ధరించాడు. పెదవుల మధ్య సిగార్. తలవెనుక వేళ్ళాడుతున్న పనామా టోపీ. పిల్లర్ల మీద, రాతితో కట్టిన విశాలమైన బంగళా. నన్ను చూడగానే అతనిముఖంలో సంతోషతరంగాలు లేచాయి. ఉత్సాహం పరుగులు తీసింది. అంకుల్ ఎవరార్డ్ భార్యకు నా రాక బొత్తిగా ఇష్టం లేదని నేను తక్షణమే లండన్‌కు తిరిగివెళితే బాగుంటుందనే ఉద్దేశం ఆమె మనసులో దాగుందని ఆమె ముఖకవళికల్నిబట్టి అన్యాపదేశంగా ఆమె చెబుతున్న మాటల్నిబట్టి గ్రహించాను. అయితే నేనక్కడికి వెళ్ళిన నా లక్ష్యం ఏమంటే భరించలేని అప్పులతో సతమతమౌతున్న నేను మిస్టర్ ఎవరార్డ్ కింగ్‌కు విన్నవించి ఎంతో కొంత ఆర్థికసహాయం పొందాలని. కానీ, ఆయన భార్యకు నేనక్కిడికిపోవడం సుతరామూ ఇష్టం లేదు. నన్నక్కడ్నుంచి వెళ్లగొట్టాలనే ఆలోచిస్తుండేది. ఎవరార్డ్ కింగ్ మాత్రం నాకు మద్దతుగా నిలిచాడు. ఆమె దురుసుతనానికి జడిసి లండన్‌కు వెనుదిరిగిపోదలచుకోలేదు. ‘‘మా ఇద్దరిమధ్యకు మూడో మనిషి ఎవరొచ్చినా నా భార్య ఓర్చుకోలేదు. అది ఆమె తత్వం. ఆమె మాటల్ని పట్టించుకోకు. ఈ సిగార్ వెలిగించు. నావెంట రామరి. నా జంతు ప్రదర్శనశాలను చూద్దువుగానీ.’’ అన్నాడు. ఆ మధ్యాహ్నమంతా జంతుప్రదర్శనశాలను చూడ్డంతోనే సరిపోయింది. ఎన్నో జాతులపక్షులు, క్రూరమృగాలను విదేశాలనుంచి తెప్పించాడు మిస్టర్ ఎవరార్డ్. కొన్ని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కొన్ని బోన్లలో మరికొన్ని పంజరాలలో బంధించబడి ఉన్నాయి. చిట్టచివరకు ఒక పొడవైన నాపరాళ్ళ నడవాలోకి తీసుకెళ్ళాడు నన్ను. దానికి చివరలో పక్కలకు జరుపబడేటటువంటి ఒక బరువైన తలుపుంది. దానిపక్కనే ఇనుపచక్రానికీ డ్రమ్ముకూ అనుసంధానించబడి గోడలోనుండి పొడుచుకువచ్చిన ఇనుప హ్యాండిల్ ఉంది. నడవాకు అడ్డంగా లావుపాటి ఇనుపకమ్మీలు నిలువునా అమర్చబడి ఉన్నాయి. ‘‘ఇప్పుడు నీకు నా సేకరణలోకెల్ల అత్యుత్తమమైన ‘బ్లాక్ డైమండ్’ని చూపించబోతున్నాను. చూద్దువు గానీ రా’ అని నవ్వుతూ...లోపలికి చూడు.’’ అన్నాడు. చూశాను. లోపల విశాలమైన గది. రాతిపలకలు పరచబడిన నేల. మధ్యలో సూర్యకాంతి పడుతున్న చోటులో భారీ శరీరంగల నల్లపులి. సూర్యరశ్మిలోని వెచ్చదనాన్ననుభవిస్తూ ముడుచుకొని పడుకొని ఉంది. అచ్చం పిల్లిలాగే. దాని మీదనుండి చూపులు మళ్ళించుకోలేకపోయాను. ‘‘కొంతమంది దీన్ని చీటా అని అంటారు. కానీ అది చీటా కాదు. అది తలనుంచి తోకవరకూ దాదాపు పదుకొండు అడుగుల పొడవుంటుంది. నాలుగేళ్ళక్రితం దీన్ని కొన్నప్పుడు ఇది చిన్న నల్లని మెత్తని బొచ్చు ఉండలాగా ఉండేది. అందులోనుండి రెండు పసుపురంగు కళ్ళు కనబడుతుండేవి. ఇదిచాలా భయంకరమైనది. ఇంతవరకూ నెత్తురు రుచి చూడలేదు. ఒకసారి రుచిచూస్తే మాత్రం మహా క్రూరంగా మారిపోతుంది. ప్రస్తుతం నేను తప్ప దాని ముందర మరెవరూ నిల్చోలేరు. నేనే దానికి తల్లీతండ్రీ, అన్నీను. అది నన్నేమీ చేయదు.’’ అలా మాట్లాడుతూ, మాట్లాడుతూనే అకస్మాత్తుగా బోనులాంటి ఆ గది ఇనుప ఊచల తలుపు పక్కకు జరిపి లోపలికెళ్ళి మళ్ళీ మూసేశాడు. అతని స్వరం విని ఆ మృగం పైకి లేచి, ఆవులించి, దాని గుండ్రని, నల్లని తలను ప్రేమగా అతనికానించింది. అతడు దాన్నిచేత్తో తట్టి ముద్దుచేశాడు. ‘‘టామీ! ఇక వెళ్ళు’’ అని ఆజ్ఞాపించాడు. అది బుద్ధిగా గదిలో ఒకపక్కకెళ్ళి ముడుచుకొని కూర్చుంది. ఎవరార్డ్ కింగ్ బయటికొచ్చి ఇంతకుముందు పేర్కొన్న ఇనుప హ్యాండిల్‌ని తిప్పనారంభించాడు. అప్పుడు ఆ గది తలుపుకున్న లోహపు కడ్డీలు గోడకున్న రంధ్రాల్లోకి చొచ్చుకుపోయాయి. ఆ తలుపును చేత్తోకూడా కమ్మీలను పక్కకు జరిపి తెరవవచ్చు. ‘‘టామీ అటూ ఇటూ నడవడానికని కొంత స్థలం వదిలేశాను. కావాలంటే నువ్వు కూడా ఈ హ్యాండిల్‌ని తిప్పి టామీని బయటకు వదలొచ్చు. నేను చేసినట్లుగానే దాన్ని తిరిగి బోనులోకి పంపించవచ్చు కానీ నువ్వాపని చేయొద్దు.’’ నేను ఇనుపవూచల మధ్యకు చేయిపోనిచ్చి నున్నగా మెరుస్తున్న దాని మెడ పక్కభాగాన్ని నిమరబోయాను. అతను వెంటనే నన్ను వెనక్కి లాగాడు. నాకేసి కోపంగా చూస్తూ, ‘‘ఈ సమయంలో దాని మూడ్ బాగాలేదు. టామీ నాతో ఉన్నట్లుగా అందరితోనూ చనువుగా ఉండదు. జాగ్రత్త.’’ అంతలో నడవా మీద అడుగుల చప్పుడు చేస్తూ బాల్డ్ విన్ అనే బలిష్టమైన వ్యక్తి చేతిలో ఒక ట్రే పట్టుకొచ్చాడు. ఆ ట్రేలో జంతువు తొడమాంసం ఉంది. ఆకలితో ఉన్న నల్లపులి బోనులో అటూ ఇటూ అసహనంగా తిరుగుతూ ఉంది. పసుపురంగు కళ్ళు మెరుస్తున్నాయి. నోటినుండి వేళ్ళాడుతున్న ఎర్రని నాలుక జొళ్ళు కార్చుతూ ఉంది. తెల్లటి కోరపళ్ళు భయం గొల్పుతున్నాయి. ఆ వ్యక్తి మాంసాన్ని ఐరన్ బార్స్ సందులో నుండి లోపలికి తోశాడు. అది మాంసాన్ని నోట కరచుకొని మూలకెళ్ళి కూర్చుని, పంజాల మధ్య ఇరికించుకొని చీల్చి తినసాగింది. అప్పుడప్పుడు ముట్టె పైకెత్తి మా వంక చూస్తూ ఉంది. ఆ దృశ్యం భయంగొల్పుతున్నా మనోహరంగానే ఉంది. ‘‘నేను నల్లపిల్లిని అమితంగా ప్రేమిస్తున్నా డియర్ మార్షల్ కింగ్! జూ వాళ్ళు దీన్ని ఇమ్మని అడుగుతున్నారు. కానీ నాకిష్టమైన దాన్ని నేను వదలుకోలేను. సరే. భోజనానికి వెళ్దాం పద.’’ ఆరు రోజులున్నానక్కడ. ఆ సమయంలో అంకుల్‌కు ఎన్నో టెలిగ్రాములొచ్చేటివి. అవి ఎక్కడ్నుంచి వస్తున్నాయో, ఏ వ్యాపార లావాదేవీల గురించి వస్తున్నాయో నాకు తెలిసేది కాదు. ఆ ఆరురోజుల్లోనూ అంకుల్‌తో మంచిసంబంధాలే ఏర్పరుచుకోగలిగాను. అతడు తాను అమెరికాలో ఉన్నప్పడు చేసిన సాహస కృత్యాలగురించి కథలుకథలుగా చెప్పేవాడు. సమయం చూసుకొని నేను ఎదుర్కొంటున్న ఆర్థికసమస్యల గురించి ప్రస్తావించాను. అంకుల్ శ్రద్ధగా విన్నాడు. ‘‘అన్నట్టు నువ్వు మన బంధువు లార్డ్ సదరన్ టన్ ఆస్తికి వారసుడివట కదా!’’ అడిగాడు సిగార్ పీలుస్తూ. ‘‘అలా అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇంతవరకూ అతను నాకు సహాయం చేసింది లేదు.’’ ‘‘అతని పిసినారితనం గురించి నేనూ విన్నానులే. ఏదేమైనా నీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఔనూ, అతని ఆరోగ్యమెలా ఉందో ఏమైనా కనుక్కున్నావా మార్షల్?’’ ‘‘ఆయన ఆరోగ్యం చాలా అందోళనకరంగానే ఉందని నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను.’’ అన్నాన్నేను. ‘‘సరిగ్గా చెప్పావు. వచ్చే ప్రాణం, పొయ్యే ప్రాణం లాగుంది ఆయన పరిస్థితి. అతని ఆస్తి నీ చేతికెప్పుడు దొరుకుతుందో చెప్పలేము. పాపం! నువ్వెంతటి కష్టాల్లో ఉన్నావు?’’ సానుభూతి చూపించాడు. ‘‘మీకన్ని విషయాలు తెలుసు. అతి త్వరలోనే ఆస్తి నా స్వాధీనంలోకొస్తుందనే నేను నమ్ముతున్నాను. అందుకని...ఆ లోపల ఏమైనా సహాయం చేస్తారేమోనని...’’ ‘‘ఆ విషయంలో నన్నంతగా ప్రాధేయపడాలా? ఈ రాత్రికే అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. నా శక్తి కొలది నిన్ను ఆపదనుండి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తాను.’’ మరుసటి ఉదయం నేను అక్కడినుంచి నిష్క్రమించవలసి ఉంది. చివరిసారిగా అంకుల్‌ను కలసి నా కష్టాలు తీర్చే ఏర్పాటు చేయాలని అడగాలనుకున్నాను. కానీ ఆ రోజు పగలంతా అంకుల్‌కు ఎప్పుడూ రానన్ని టెలిగ్రాములొచ్చాయి. రాత్రి భోజనం ముగించుకొని అంకుల్ స్టడీ రూం కెళ్ళాడు. అలవాటు ప్రకారం అందరూ నిద్రపోయాక గదులకు తాళాలు వేసి ఆఖరుకు బిల్లియర్డ్స్ రూములో నన్ను కలుసుకున్నాడు. డ్రెస్సింగ్ గౌన్ ధరించి ఈజీ చెయిర్లో విశ్రాంతిగా కూర్చుని విస్కీ పుచ్చుకున్నాడు. నా సమస్యల జాబితా ఒక పేపర్ మీద రాసివ్వమన్నాడు. అప్పటికి సమయం రాత్రి ఒంటిగంటైంది. ‘‘పడుకోబోయేముందు నేను నా పెంపుడు పిల్లిని చూడాలి’’ అని చెప్పాడు. నన్నూ రమ్మని పిలిస్తే వెంట వెళ్ళాను. హాలును దాటుకొని నడుచుకుంటూ వెళ్ళాము. రాతి నడవా చీకటిగా ఉంది. ఒక లాంతరు గోడకు తగిలించి ఉంది. మిస్టర్ ఎవరార్డ్ లాంతరును దించి వెలిగించాడు. తలుపు తెరుస్తూ ‘లోపలికి రా!’ నన్ను పిలిచాడు. అంకుల్ ఉన్నాడనే ధైర్యంతో లోపలికి వెళ్ళాను. లోపలున్న మృగం గుర్రుమంది. లాంతరు గుడ్డి వెలుగులో చూశాము. అది ఒక మూలలో పెద్ద నల్లనిముద్దలా ముడుచుకొని పడుకొని ఉంది. లాంతరు పట్టుకొని చూసి– ‘‘టామీ చాలా కోపం మీదున్నట్లుంది. ఇప్పుడు రాత్రి భోజనం పెట్టి దాని కోపం తగ్గించాలి. దయచేసి ఈ లాంతరు పట్టుకో మార్షల్!’’ నేను లాంతరును చేత్తో పట్టుకున్నాను. అతను లోహపుకడ్డీల తలుపు కేసి నడిచాడు. ‘‘మాంసం నిలవ ఉంచే కప్ బోర్డ్ బయట ఉంది. ఇప్పుడే వస్తాను.’’ అని చెబుతూ బయటికెళ్ళాడు. వెంటనే అతని వెనకే లోహపుకడ్డీల తలుపు మూసుకుపోయింది–క్లిక్ మనే చిన్న శబ్దంతో. ఆ శబ్దం స్పష్టంగా వినబడింది. భయంతో నా తనువెల్లా వొణికిపోయింది. వొళ్ళు మంచులా చల్లబడింది. ఒక్క గంతులో తలుపు వద్దకు చేరుకున్నాను. లోపలివైపు నుంచి తలుపుకు హ్యాండిల్ లేదు. తలుపు తెరువుమని ఆక్రందించాను. అది అరణ్యరోదనమైంది. లాంతరు వెలుతుర్లో చూశాను. లోహపు కడ్డీలు మెల్లగా గోడలోని గాడివైపు కదులుతున్నాయి. అప్పటికే చిట్టచివర ఒక అడుగుమేర తెరుచుకొని ఉంది. నేను గట్టిగా అరుస్తూ ఆ చిట్ట చివరి ఊచను చేతులతో నాకున్న బలమంతా ప్రయోగించి అడ్డుకొన్నాను. ఒకట్రెండు నిముషాలు అది కదలకుండా ఆపగలిగాను. బయట అతను చక్రాన్ని శక్తినంతా కూడదీసుకొని తిప్పుతున్నాడు. నా చేతులు, వేళ్ళు నొప్పిపెడుతున్నాయి. గాయాలు కూడా అయ్యాయి. లోహపు కడ్డీల తలుపు పూర్తిగా గోడకు అతుక్కుపోతుందని తెలుసు. నా ప్రాణాలు కాపాడమని వేడుకున్నాను. అతని హృదయం కరగలేదు. తలుపు మూసుకోకుండా నిలువరించే ప్రయత్నంలో విఫలమై విసురుగా వెనక్కి పడిపోయాను. తలుపు మూసుకుపోయింది పెద్ద శబ్దంతో. ఎవరార్డ్ వెళ్ళిపోయాడు. నేనలా పడ్డంతో ఆ మృగం నా వంక తీక్షణంగా చూసింది. అప్పటికే నా చేతిలోని లాంతరు నేలమీద పడి వుంది. అయినా వెలుగుతూనే ఉంది. లాంతరు నా చేతిలో ఉంటే మంచిదని దాన్నందుకోవాలని కొంచెం కదిలాను. అది గుర్రుమంది. నేను నిలబడిపోయాను. నా శరీరంలోని అణువణువూ ప్రాణ భయంతో వొణికిపోతూ ఉంది. ఆ నల్లపులి నాకు పది అడుగులదూరంలో ఉంది. ఆ చీకట్లో దానికళ్ళు వెలుగుతున్న రెండు గుండ్రని దీపాల్లాగున్నాయి. అది కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నట్టుండి మూసుకుంది. బహుశా అది నిద్రపోతూవుండొచ్చు. అది తక్షణం నా మీద దాడి చేస్తుందనుకోవడం లేదు. ఒకటి మాత్రం నిజం. రాత్రంతా నేనూ ఆ మృగం ఆ బోనులో కలిసుండకతప్పదు. ఉచ్చుబిగించి నన్ను ఈ బోనులో రాత్రంతా ఉండేట్టు కుట్రపన్నిన ఆ దుర్మార్గునికన్నా ఈ నల్లపులి ఇంకా క్రూరమైనది. ఉదయం దాకా ఒక రాత్రంతా ఎలా గడపాలి? కిటికీల ఊచలు చాలా దగ్గరదగ్గరగా బిగించబడి ఉన్నాయి. తలదాచుకొనడానికెక్కడా స్థావరం లేదు. ఎంత అరచినా ఎవ్వరికీ వినబడదు. ఈ గుహకు అనుసంధానించబడిన నడవా, ఔట్ హౌస్‌కు కనీసం వంద అడుగుల దూరంలో ఉంటుంది. గుహబయట వీస్తున్న హోరుగాలిలో నా అరుపులు బయటికి వినిపించవు. ఇప్పుడు నా స్వంత బలం, గుండె ధైర్యమే దిక్కు. తరువాత నా దృష్టి లాంతరు మీద పడింది. దాని వత్తి ఊగిసలాడుతూ ఉంది. పదినిమిషాల్లో అది ఆరిపోవడం ఖాయం. తరువాత చీకట్లో నేనేమీ చేయలేను. ఆ లోపల నేను ఏదో ఒకటి చేయాలి. భయాన్నంతా కళ్ళల్లో దాచుకొని ఆ మృత్యుగహ్వరం కేసి చుట్టూ చూశాను. అప్పుడు ఒక చోటు మీద నా చూపులు ఆగాయి. లోహపుకడ్డీల డోర్ పక్కనే గోడవారగా కొంచెం ఎత్తులో ఇనుప ఊచలతో చేసిన షెల్ఫ్ మాదిరి నిర్మాణమొకటి కనబడింది. అది భద్రమైన చోటు కాకపోవచ్చు. కానీ, నేలమీదఉండడం కన్నా అది కొంచెం నయం. కడ్డీకి కడ్డీకీ మధ్య రెండుమూడంగుళాల ఎడం ఉంది. షెల్ఫును కింద బలమైన ఇనుపస్తంభాలు మోస్తున్నాయి. పైకప్పుకూ షెల్ఫుకీ మధ్య అంతరం రెండుమూడడుగులుంటుంది. నేను దానిపైకి చేరుకుంటే? దీపం ఆరిపోకముందే ఆ పని చేయాలి. ఒక్కసారి గుండెలనిండా ఊపిరితీసుకుని క్షణంలో స్ప్రింగులా పైకి ఒకే ఒక ఎగురు ఎగిరాను. షెల్ఫ్ యొక్క ముందుభాగపు ఇనుప కమ్మీ అంచును పట్టుకుని అలాగే శ్వాస బిగబట్టాను. నా ముఖం షెల్ఫ్ ముందువైపుకు వచ్చేలా నా శరీరాన్ని చుట్లు తిప్పాను. నన్ను చూసి వొళ్ళువిరుచుకొని ఆవలిస్తున్న ఆ నల్లపులి కళ్ళల్లోకి చూశాను. అది నా వైపు కోపంగా కాక ఆసక్తిగా చూసింది. దాని నుంచి వెలువడిన దుర్గంధపు వాయువు గుప్పున కొట్టింది. వొళ్ళువిదిలించుకొని అది నా వైపు వచ్చింది. వెనుక కాళ్ళ మీద నిలబడి ఒక పంజాను గోడకానించి తరువాత రెండో కాలును కూడా ఎత్తి నా కిందున్న అడ్డం నిలువు ఇనుపతీగల చట్రాన్ని గోళ్ళతో గోకింది. అప్పుడు నేనింకా సాయంకాలం దుస్తుల్లోనే ఉన్నాను. తెల్లని గోరుతో నా ట్రౌజరు పర్రున చింపేసింది. ఫలితంగా నా మోకాలు గీసుకుపోయింది. నొప్పికి తాళలేక గట్టిగా కేకవేశాను. దాంతో అది కాళ్లను కిందకు దించింది. నేనింకా వెనక్కి జరిగి సర్దుకున్నాను. నేను పడుకున్న చిన్న పడక కింద అది అటూ ఇటూ పచార్లు చేస్తూ అప్పుడప్పుడు నా వైపు చూడసాగింది. దీపం పూర్తిగా ఆరిపోయింది. ఆ నల్లపులితో నల్లని చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాను. అప్పటికి రాత్రి రెండుగంటలైవుంటుందని ఊహించాను. నాలుగ్గంటలకు పూర్తిగా వెలుగొచ్చేస్తుంది. ఆ నల్లని చీకటిలో నల్లపులి సవ్వడి వినరావడం లేదు. అదెక్కడుందో అంచనాకందడం లేదు. నా కజిన్ దుర్మార్గాన్నీ, వంచననూ, కాపట్యాన్నీ, కుట్రనూ తలచుకుంటుంటే రక్తం మరిగిపోతూ ఉంది. అతని నవ్వు ముఖం వెనుక నా పైన ఇంత ద్వేషం దాగిఉందా? మధ్యయుగ కాలంలో ఇంత ఘోరమైన హత్యలు చేయించేవారని విన్నాను. నిద్రపోవడానికి అతని గదికి వెళ్తుండగా చూసిన సాక్షులున్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయమేమంటే...వాళ్ళు చూడకుండా నన్ను పులిబోనులో వదలి తలుపు బిగించి చల్లగా జారుకోవడం. అతను ప్రజలకు చెప్పబోవు కథ అందరినీ నమ్మించేట్టుగా ఉంటుంది. ‘మార్షల్ కింగ్ సిగారు పీల్చడం కోసం బిలియర్డ్స్ గదిలోకి వెళ్ళి ఆసక్తిని అణచుకోలేక అతను చివరిసారిగా పులిని చూడాలని వెళ్ళాడు. ఆ సమయంలో బోను తెరుచుకోవుందని తెలియక లోపలికి వెళ్ళిన అతన్ని పులి చంపేసింది.’ అటువంటి ఘోరహత్య చేసి తేలిగ్గా తప్పించుకోగలడు. ఒకవేళ ఎవరికైనా అనుమానం కలిగినా రుజువులు దొరకడం అసాధ్యం. తెల్లారడానికి మిగిలిన రెండు గంటలు చాలా భారంగా భయంకరంగా గడిచిపోయాయి. నల్లపులి తన వొంటిమీదున్న బొచ్చును నాలుకతో నాకుతున్నట్లుందేమో? ఆ శబ్దం వినిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి దాని రెండు పచ్చని కళ్ళు చీకట్లో నా వైపే చూస్తున్నట్లు అనిపించినా నన్నే లక్ష్యంగా చేసుకున్నట్లనిపించలేదు. కాబట్టి అది నా ఉనికిని అది గుర్తించలేదని నాకు అర్థమవటంతో నా గుండె దడ తగ్గింది. అబ్బ! ఎలాగైతేనేం? తెల్లారిన సూచనగా కిటికిలోంచి సన్నగా వెలుతురు లోపలికి ప్రసరించింది. అప్పుడు నల్లపులిని స్పష్టంగా చూడగలిగాను. ఇంతకుముందుకన్నా దాని కోపం హెచ్చుస్థాయిలో ఉంది. ఉదయపు చల్లదనం దానిలో అసహనం రేగించింది. పైగా ఆకలితో ఉంది. భయంకరంగా గర్జిస్తూ నాకు దూరంగా అటూ ఇటూ వేగంగా పచార్లు చేయసాగింది. దాని మీసాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. తోకను విపరీతంగా ఝాడిస్తూ ఉంది. అలా తిరిగేటప్పుడు అకస్మాత్తుగా అది నా వైపు చూసింది. అంతే. నేను భయంతో బిగుసుకుపోయాను. నా పైప్రాణాలు పైన్నే పోయాయి. అది నన్ను చంపాలని నిశ్చయించుకున్నట్టు నాకర్థమై పోయింది. అది చేసే ఎడతెరిపిలేని గర్జనలు తీవ్రమయ్యాయి. ఆ ఇరుకైన కటాంజనాల మీద ముడుచుకొని పడుకున్నాను. నేను ధరించిన వదులు దుస్తులు చలినుండి నన్ను కాపాడలేకపోతున్నాయి. అక్కడ్నుంచి తప్పించుకోడమెలా? అని ఆలోచిస్తున్నాను. ఒక విషయం మాత్రం స్పష్టమైంది. బోను యొక్క ఇనుప ఊచల తలుపు ముందరిభాగం మొత్తం చక్రాలమీద నడుస్తుంది. దాని చివరి కడ్డీ నేనున్న షెల్ఫుకు తలవైపునే వుంది. నా చేతికందుబాటులో ఉంది. దాన్ని కొంచెం వెనక్కి లాగితే? నాకది సాధ్యమౌతుందా? అసలు కడ్డీ జరిపితే జరుగుతుందా? రాకపోతే? అయినా ఒకసారి ప్రయత్నిస్తే? కదిలే ధైర్యం చేయలేను. అలా కదిలితే వెంటనే నల్లపులి నా మీద దాడి చేస్తుంది. మెల్లమెల్లగా నా చేతిని ముందుకు జరపసాగాను. ఆవలిగోడ అంచును ఆనుకొని ఉన్న చివరి ఇనుపకమ్మీ చేతికి తగిలేవరకూ. అది సులభంగానే వెనక్కి జరగడంతో నేను ఆశ్చర్యపోయాను. ఇంకా వెనక్కి లాగాను. మూడు అంగుళాలమేర ఇవతలికి జరిగింది. ఆ గేట్–చక్రాలమీద నడుస్తుందని ముందుగానే చెప్పాను కదా. ఇంకొకసారి లాగాను. అయితే ఆ క్రూరప్రాణి నా వైపుకు ఊహించని వేగంతో లంఘించింది. నేను భీతిల్లిపోయాను. దాని ఉధృతధాటికి నేను పడుకున్నషెల్ఫు ఊగులాడింది. అగ్నిగోళాల్లా రగిలే దాని కళ్ళు, సమతలంగా ఉన్న పెద్ద తల, దవడలమధ్య వేలాడుతున్న ఎర్రని నాలుక, తెల్లని కత్తుల్లాంటి కోరలు నాకు అతి దగ్గరగా ఉన్నాయి. ఇనుపషెల్ఫ్ ఊడి కిందికి పడిపోతుందేమోనని అనుమానం కలిగింది. అది షెల్ఫ్ అంచుమీద ముందరి కాళ్ళు ఆనించి కొన్ని క్షణాలు నిలబడింది. వెనుకకాళ్ళు రాతి నేలపై పట్టు చిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలోవిఫలమై అంత భారీ శరీరం దబ్బున కిందకు పడిపోయింది. అది ఊరుకోలేదు. శరీరాన్ని వెనక్కి వంచి మళ్ళీ ఎగరడానికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాలవ్యవధిలో నా చావో, ప్రాణాలతో బతికి బయటపడడమో నిర్ణయమౌతుంది. ఈ సారి దాని గురి తప్పదు. ప్రాణాలకు తెగించాలి. అప్పటికప్పుడే పథకం రచించుకున్నాను. వెంటనే నా కోటును తీసేసి చేత్తోపట్టుకున్నాను. నా మీదకు ఎగురబోతున్న ఆ మృగం ముఖం మీదకు పడేట్టు కిందకు విసిరేశాను. అదే క్షణంలో షెల్ఫ్ అంచుమీదనుంచి కిందకు దుమికి గేటు చివరి కమ్మీని పట్టుకొని పిచ్చిపట్టినట్లు లాగాను. గేటు చివరిలో ఏర్పడ్డ సందులోంచి నా శరీరాన్ని దూర్చి బయటికురికాను. కానీ క్షణంలో వెయ్యోవంతు ఆలశ్యమైంది. ఆ వ్యవధిచాలు ఆ క్రూరమృగానికి. కోటు ముఖం మీద పడ్డంతో కొన్ని క్షణాలు గుడ్డిదైపోయిన నల్లపులి దాన్ని పక్కకు విదిలించి కొట్టింది. సందులోంచి దూరి అవతలకు దాటుకుంటూ గేటును మూసేశాను. కానీ నా దేహం పూర్తిగా బయట పడకముందే పులి–పంజాతో నా పిక్కమీద కొట్టింది. ఆ దెబ్బతో కత్తితో చెక్కను చెక్కినట్లు పిక్కకండ ఊడొచ్చింది. విపరీతంగా రక్తం కారిపోయింది. నేను ఏదో విధంగా బయటికొచ్చేశాను. ఇప్పుడు నా క్షతగాత్ర దేహం బయట గేటు ఇనుపకమ్మీల అవతల దుర్గంధపూరితమైన ఎండుగడ్డిలో పడిఉంది. ప్రస్తుతం నాకూ పులికీ మధ్య అడ్డుగా ఇనుప ఊచల గేటు నిలిచిఉంది. వెనుక కాళ్ళమీద నిలబడి ముందు రెండు పంజాలతో ఊచలను వొళ్ళు తెలియని ఉన్మాదంతో విపరీతంగా బాదుతూ ఉంది నల్లపులి. విపరీతంగా గాయపడిన నేను చచ్చానో బతికానో నాకే తెలీదు. బోను లోపలున్న పులి నా కోటును చీలికలు పేలికలకింద మార్చింది. బోనులో చిక్కుకున్న ఎలుకను చూస్తూ చెలరేగిపోతున్న పిల్లిలా ఉంది లోపలున్న పులి. దాని నల్లని ముఖం, ఎర్రటి నాలుక నా కళ్ళముందే మెదులుతూ ఉన్నాయి. తరువాత, రెండుగంటలపాటు నేను తెలివితప్పి పడున్నాను. ఏదో శబ్దం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. నా కజిన్ తలుపు తీసి లోపలికి తొంగి చూశాడు. ఏం జరిగిందో చూసి అవాక్కయ్యాడు. బోనులోపల పులి ముందరికాళ్ళ మీద తలపెట్టుకొని కూర్చొని ఉంది. అంకుల్ నా వైపు పదేపదే చూశాడు. తలుపు మూసి నా వద్దకొచ్చాడు–నేను నిజంగా చచ్చిపోయానా లేదా అని చూడ్డానికి. తరువాత నేనేమీ గమనించే స్థితిలో లేను. నాకు ఉన్నట్టుండి స్పృహ వచ్చి చూసేసరికి అతని వీపు నాకు కనిపిస్తూ ఉంది. ‘‘సెభాష్ టామీ! సెభాష్! చాలా మంచిపనిచేశావు.’’ అంటూ బోను కమ్మీలదగ్గరికి వెళ్ళాడు. అంతే... ‘‘నేను టామీ! నేను నీ మాస్టర్ ని. నన్నే గుర్తుపట్టలేదా? వదులు. నన్నొదులు... ’’ అని భయంకరంగా కేకలు పెట్టాడు. ఆ సమయంలో అంకుల్ చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చాయి. ‘‘ఒకసారి ఆ నల్లపులి రక్తం రుచిచూసిందంటే అది మనకు శత్రువుగా మారిపోతుంది’’ అని. నా రక్తాన్ని అది అప్పటికే రుచిచూసిఉంది. కానీ అతడు ఖరీదు చెల్లించవలసివచ్చింది. ‘‘దూరంగా వెళ్ళిపో రాక్షసీ! బాల్డ్ విన్..బాల్డ్ విన్..’’ అతను పెడుతున్న చావుకేకలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. చివరకు అవి మెల్లగా గాలిలో కలిసిపోయాయి. అతడు చనిపోయాడనుకుంటాను. అతని శరీరం రక్తంలో ముంచితీసినట్టుంది. అతడు ఆ గదంతా పిచ్చిపట్టినట్టు తిరిగి పడిపోయాడు. అదే అతన్ని చివరిసారి చూడడం. కొన్ని క్షణాల తరువాత తెలివితప్పి పడిపోయాను. నేను నా జీవితపు చివరి రోజు దాకా చేతికర్ర సహాయంతోనే బతికాను పులితో గడిపిన ఆ రాత్రి గుర్తుగా. నల్లపులి సంరక్షకుడైన బాల్డ్ విన్, ఇతర పనివాళ్లు చెప్పిన ప్రకారం... యజమాని చావుకేకలు వినబడగానే అందరూ బోను దగ్గరికి పరుగెత్తారు. నేను ఊచల వెనుక పడుండడం చూశారు. చిందరవందరగా విసిరేసినట్టు పడి ఉన్నయజమాని ఛిద్రమైన శరీర భాగాల్ని చూశారు. తాను ఎంతో మక్కువతో పెంచుకొన్న నల్లపులే అతని ప్రాణాల్ని తీసింది. ఇనుప ఊచల గుండా పులిని తుపాకితో కాల్చి చంపేశారు. నన్ను నా పడకగదికి చేర్చి డాక్టర్‌ను, నర్సును పిలిపించి చికిత్స ఇప్పించారు. నేను కొన్నివారాల పాటు చావుబతుకుల మధ్య పోరాడాను. ఒక నెల తరువాత నేను తిరిగి లండన్ చేరుకున్నాను. ఒకరోజు రాత్రి మిస్టర్ ఎవరార్డ్ భార్య నన్ను కలుసుకుంది. ‘‘ఒంట్లో కులాసాగా ఉందా?’’ అని అడిగింది. నేను నెమ్మదిగా తల ఊపాను. ‘‘మొదట్నుంచీ లండన్ తిరిగి వెళ్ళిపొమ్మని నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. నా భర్త పన్నిన కుట్రకు బలికాకుండా నిన్ను కాపాడాలనుకున్నాను. నిన్నెప్పటికీ తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశమేలేదు అతనికి. నన్ను కూడా చంపాలనుకున్నాడు. అతని కబంధహస్తాల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక యమయాతన పడ్డాను. అతని చావు కారణంగా నేను స్వేచ్ఛాగాలులు పీల్చుకోగలిగాను.’’ ఆమె చరచరా వెళ్ళిపోయింది. తరువాత మిగిలి ఉన్న భర్త ఆస్తిని వెంట తీసుకొని స్వదేశానికెళ్ళిపోయింది. చావు నుంచి తప్పించుకున్నా అప్పులబాధ వదల్లేదు. అంతలో వకీలు సమ్మర్స్ వచ్చాడు. మొదట అభినందనలు తెలిపాడు. ‘‘ఇంగ్లాండ్ లో అత్యంత ధనికులలో ఒకరైన లార్డ్ సదరన్ టన్ ఆస్తికి మీరు యజమానైపోయారు. ఈ విషయం మీకు ముందుగా తెలిస్తే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మీ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తుందేమోనని చెప్పలేదు.’’ ఆ వార్త విని నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. తరువాత ఇంకొక ఆలోచన తట్టింది. ఆరు వారాల కిందట! అంటే నేను గాయాలపాలైంది కూడా ఆరునెలలు కిందటే కదా? ఈ రెండు సంఘటనలు ఎలా ఒకేసారి సంభవించాయి? కాకతాళీయమా? ‘‘అలా ఐతే నేను గాయపడిన సమయంలోనే లార్డ్ సదరన్ టన్ చనిపోయి ఉండాలి.’’ ‘‘అవును. అదే రోజే లార్డ్ సదరన్ టన్ చనిపోయాడు.’’ అని చెబుతూ, ‘‘ మీకు తెలుసు కదా మీ తరువాతి వారసుడు మీ కజిన్ ఎవరార్డ్ కింగ్ అని. అతనికి బదులుగా మీరు పులివాత పడి ఉంటే, అతనికే సదరన్ టన్ ఆస్తి దక్కి ఉండేది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం లార్డ్ సదరన్ టన్ సేవకునికి డబ్బిచ్చి సదరన్ టన్ ఆరోగ్య పరిస్థితిని గురించి కొన్ని గంటలకొకసారి టెలిగ్రాముల ద్వారా తెలియజేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ ప్రక్రియ మొదలైంది. ఆ విధమైన సమాచారం తెలుసుకోవడం వెనుక ఉన్న కారణమేమంటే...అంకుల్ ఎవరార్డ్ ప్రథమశ్రేణి వారసుడు కాకపోవటమే.’’ ‘‘మిస్టర్ సమ్మర్స్! నేను చెల్లించాల్సిన బాకీలకు సంబంధించిన పత్రాలు తీసుకురండి. అలాగే కొత్త చెక్ బుక్ కూడా. వాటిని పరిష్కరిద్దాం.’’ అని చెప్పాను. -
స్నేహితున్ని చంపి.. పూలతొట్టెలో పాతి..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రెండేళ్ల మిస్టరీ వీడింది. అనుమానమే పెనుభూతమై స్నేహాన్ని అంతం చేసింది. బంధువని కూడా చూడకుండా ఓ వ్యక్తిని చంపేసింది. మెదక్‌కు చెందిన జయప్రకాశ్(27), విజయ్‌కుమార్(30) సమీపబంధువులు, స్నేహితులు. బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి ఓ అద్దె ఇంట్లో నివసించారు. అపార్థంతో జయప్రకాశ్‌పై కక్షకట్టిన విజయ్ మూడేళ్ల క్రితం అతడిని అంతం చేశాడు. మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. యాదృచ్ఛికంగా జయప్రకాశ్ అస్థిపంజరం బయటపడటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం విజయ్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి... జయప్రకాశ్, విజయ్‌కుమార్ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో విక్రమ్‌సింగ్ అనే వ్యక్తికి చెందిన అపార్ట్మెంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు పొందారు. విజయ్ తన ప్రేయసికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్‌కు చెప్తుండేవాడు. అనేకసార్లు జయప్రకాశ్ ఆమెతో ఫోన్ ద్వారా, నేరుగా మాట్లాడాడు. దీంతో జయప్రకాశ్‌పై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటూ దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించి జయప్రకాశ్‌ను అంతం చేయడానికి పథకం వేశాడు. మరమ్మతుల నేపథ్యంలో వెలుగులోకి... జయప్రకాశ్, విజయ్‌లు నివసించిన తర్వాత ఆ గదిలో మరికొందరు అద్దెకు ఉండి వెళ్లారు. అధ్వానంగా మారడంతో గత ఏడాది అక్టోబర్ 8న ఆ గదికి యజమాని మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగా పూలకుండీల తొట్టెను కూలీలు తొలగిస్తుండగా ఓ అíస్థిపంజరం బయటపడింది. యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి పోలీసులు గత ఏడాది అక్టోబర్ 9న హత్య కేసు నమోదైంది. అస్థిపంజరం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించిన పోలీసులు మెదక్ నుంచి జయప్రకాశ్ కుటుంబీకుల్ని రప్పించి నమూనాలు తీసుకున్నారు. ఒకటేనంటూ నివేదిక రావడంతో... డీఎన్ఏ నమూనాలనూ విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ అస్థిపంజరం జయప్రకాశ్‌దేనంటూ ఇటీవల నిర్ధారించారు. దీంతో ఈ కేసులో విజయ్ను ప్రధాన అనుమానితుడిగా చేర్చిన ఢిల్లీ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి, వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణ నేపథ్యంలో హత్యకు కారణాలను బయటపెట్టాడు. చంపేసిన తర్వాత తానే ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్ సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి పారేశానని, ఆపైనా పదేపదే అతడి సెల్‌ఫోన్‌కు కాల్స్ చేయడం, ఎస్సెమ్మెస్‌లు పెట్టానని చెప్పాడు. వాటికి స్పందించట్లేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. ఫ్యాన్ మోటార్‌తో కొట్టి హత్య... అదను కోసం ఎదురు చూసిన విజయ్ 2016 ఫిబ్రవరి 12న తన పథకాన్ని అమలు చేశాడు. ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్‌తో వాగ్వాదానికి దిగి తమ గదిలో ఉన్న ఫ్యాన్ మోటారు భాగంతో తలపై మోది హత్య చేశాడు. మూడో అంతస్తు బాల్కనీలో ఓ తొట్టె లాంటిది నిర్మించి శవాన్ని అందులో పూడ్చేశాడు. అదేరోజు స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి జయప్రకాశ్ అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమానికీ ఇదే విషయం చెప్పిన విజయ్ కొన్నిరోజులకు ఢిల్లీ వదిలి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
వీణవంక(హుజూరాబాద్): రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బేతిగల్ గ్రామానికి చెందిన దాసరి జయప్రకాశ్ మృతిచెంది ఆరు నెలలు గడిచినా.. ఇంతవరకు చర్యలు చేపట్టలేదని అన్నారు. జయప్రకాశ్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండిలోని ఓ సర్పంచ్ సమస్యలపై నిలదీస్తే రౌడీషీట్ ఓపెన్ చేశారని, సమస్యలను కూడా అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండాపోయిందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించలేదని, కొందరు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా నాయకుడు చెన్నమాదవుని నరసింహారాజు, మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా నాయకులు సాగర్‌రెడ్డి, ఆదిరెడ్డి, దామోదర్ పాల్గొన్నారు. -
వైద్యవృత్తిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి
లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ఘనంగా ఆర్ఎంసీ 54వ స్నాతకోత్సవం కాకినాడ వైద్యం: వైద్యవృత్తిపై ప్రజలకున్న అపనమ్మకాన్ని తొలగించి వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కోరారు. కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల 54వ స్నాతకోత్సవాన్ని ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఆ సమావేశంలో జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ ఒక రోగి జీవితం చివరి అంకంలో ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికెళితే వైద్యఖర్చుల కోసం భారీగా బిల్లు వేస్తే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందన్నారు. ప్రజారోగ్యంపై పాలకులకు సరైన అవగాహన లేక పోవడం వల్ల సమర్థమైన వైద్యులు అందుబాటులో ఉన్నా మంచి ఫలితాలు రావడం లేదన్నారు. ఆంగ్లం మోజులో పడిన వైద్యులు తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా మరచిపోయారని, తెలుగు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళారత్న అవార్డు గ్రహీత, ప్రముఖ అవధాని గరికిపాటి నరసింహారావు అన్నారు. ప్రాచీన వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని వైద్యులను కోరారు. వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిగ్రీ పట్టా అందుకున్న వైద్యులను, వారిని కష్టపడి చదివించిన తల్లిదండ్రులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె.బాబ్జి అభినందించారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిధులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, గరికిపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 2011వ బ్యాచ్‌కి చెందిన 150 మంది వైద్యులకు పట్టాలను ప్రదానం చేశారు. పలువురు వైద్యులు తమ అనుభవాలను అ«ధ్యాపకులు, ముఖ్య అతిథులతో పంచుకున్నారు. ఆర్ఎంసీ అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ లక్ష్మోజీనాయుడు, డాక్టర్ ఎంవీ ఆనంద్, డాక్టర్ ఎస్వీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నైతికత లేకుండా మంత్రి వర్గ విస్తరణ జరిగింది
-
విజయవాడ ఆకాశవాణికి జాతీయ పురస్కారం
విజయవాడ: విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి 2016 సంవత్సరానికిగానూ జాతీయ వార్షిక పోటీల్లో ప్రశంసా పురస్కారం లభించింది. ఆకాశవాణి సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ జయప్రకాష్ దర్శకత్వంలో రూపొందించిన ఆత్మ దీపోభవ డాక్యుమెంటరీకి ప్రత్యేక అంశం విభాగంలో ఈ ప్రశంసా పురస్కారం లభించింది. ప్రస్తుత సామాజిక మాథ్యమం నేపథ్యంలో పుస్తకం మనుగడపై ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి రాజీవ్ బొకనాల, అనిల్ డానీ రచనా సహకారం, సీహెచ్.సుబ్రహ్మణ్యం, పి.విద్యాసాగర్ సాంకేతిక సహకారం అందించారు. -
కామెడీ బాంబ్
-
గాంధీజీ మార్గం ఆచరణీయం
విజయవాడ(చిట్టినగర్): ప్రపంచానికి మహాత్మాగాంధీ చూపిన మార్గం ఆచరణీయమని, ఆయన ఆశయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. మహాత్మా గాంధీజీ జీవితం, గాంధీజీ దీక్షలపై రూపొందించిన పుస్తకాన్ని జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిపై గాంధీజీ పోరాడిన తీరు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మహాత్ముని ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాంధీజీ దీక్షలనుప్రారంభించదలచామని మహాత్మాగాంధీ దేవాలయ ట్రస్టు అధ్యక్షులు, స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘ అధ్యక్షులు రాంపిళ్ల జయప్రకాష్ తెలిపారు. గత ఐదేళ్లగా దీక్షలను వందలాది మంది విద్యార్థులు స్వీకరించారన్నారు. -
తాగి పాఠశాలకు వచ్చి హెడ్మాస్టర్ వీరంగం
పీకలదాకా తాగి పాఠశాలకు వచ్చిన హెడ్మాస్టర్ అందరిపై చిందులువేస్తూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఎంఈవో వచ్చి ప్రశ్నించినా ఆయనపైనా దుర్భాషలాడుతూ నానా హంగామా చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తాగుబోతు ప్రిన్సిపాల్ తమకు వద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల హెడ్మాస్టర్ ఎస్. జయప్రకాష్ సోమవారం ఉదయం తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన హరిప్రసాద్ అనే పేరెంట్ను స్కూల్‌కు ఎందుకొచ్చావని తిట్టాడు. హెడ్మాస్టర్ వాలకం చూసిన అతను గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులందరూ పాఠశాల వద్దకు వచ్చి నిలదీయడంతో వారిపై వీరంగం సృష్టించాడు. సమాచారం అందుకున్న ఎంఈవో కోటేశ్వరరావు హుటాహుటిన పాఠశాలకు వచ్చి హెచ్ఎంను సముదాయించేందుకు ప్రయత్నించినా ఆయనపైనా చిందులు వేశాడు. ఎవరికి చెప్పుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ తిట్ల దండకం అందుకున్నాడు. దాంతో బిత్తరపోయిన ఎంఈవో వెంటనే డీఈవోకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా హెడ్మాస్టర్ విద్యార్థుల పట్లస తల్లిదండ్రులపట్ల అనుచితంగా వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో 69 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తాగుబోతు హెడ్మాస్టర్ తమకు వద్దని, వెంటనే అతణ్ణి మార్చాలని గ్రామస్తులు పట్టుపడుతున్నారు. -
సీ టూ హెచ్ నుంచి థియేటర్లకు..
సీటూహెచ్ల్లో చూసిన సినిమా ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శనలకు సిద్ధమవుతోంది. ఇది నిజంగా సరికొత్త విధానమే. దర్శకుడు చేరన్ తమిళ చిత్ర పరిశ్రమలో చేసిన నవ్య ప్రయోగం చిత్రం విడుదలకు ముందే దాన్ని డీవీడీల ద్వారా ఇంటింటికీ వినియోగం చేసి ప్రేక్షకుల ముంగిట సినిమాను తీసుకెళ్లారు. సీటూహెచ్(ఇంటికే సినిమా)పేరుతో సంస్థను ప్రారంభించి తాను స్వీయ దర్శకత్వంలో తన డ్రీమ్ థియేటర్ పతాకంపై చేరన్ నిర్మించిన చిత్రం జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ముందుగా థియేటర్లలో విడుదల చేయకుండా డీవీడీల రూపంలో తమిళనాడులో ఇంటింటా వినియోగం చేశారు. ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ ఇలాంటి ప్రయోగాన్నే తన విశ్వరూపం చిత్రానికి చేయాలని భావించారు.అయితే అందుకు థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే చేరన్ తన చిత్రాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించకుండా నేరుగా డీవీడీల రూపంలో సీటూహెచ్ ద్వారా ఇంటింటా వినియోగం చేశారు. ఈ ప్రయోగంలో తాను సక్సెస్ అయ్యానంటున్న ఆయన ఇప్పుడ అదే చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ శర్వానంద్ కథానాయకుడిగా నిత్యామీనన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సంతానం, ప్రకాష్‌రాజ్, జయప్రకాశ్, మనోబాలా ముఖ్య పాత్రలు పోషించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని చేరన్ తమిళం, తెలగు భాషలతో రూపొందించారు. ముందు డీవీడీల ద్వారా విడుదల చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు చేరన్ బదులిస్తూ జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని డీవీడీల ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వ చ్చిందన్నారు. ఇదే విషయం గురించి థ/యేటర్ల యాజమాన్యంతో చర్చించగా వారు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతించడంతో పాటు సహకరించారన్నారు. మంచి చిత్రాన్ని అందురూ చూడాలన్న ఉద్దేశంతో జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
జనానికి బీజేపీ పువ్వు, కాంగ్రెస్ టోపీ!
సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను ఆదుకోవడం మాని బీజేపీ జనం చెవిలో పువ్వు (కమలం), కాంగ్రెస్ జనం నెత్తిన మక్మల్ టోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం తాలూకాలోని హంచినాళ క్యాంపులో తెగుళ్ల బారిన పడి నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. సహాయక వ్యవసాయ శాఖ నిర్దేశకులు జయప్రకాష్ నుంచి వివరాలు తెలుసుకుని అనంతరం విలేకరులతోను, ఏర్పాటు చేసిన కార్యక్రమంలోను మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి దిగుబడి 25 శాతం మేరకు తగ్గిపోయిందన్నారు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం సర్వే కూడా చేయలేదన్నారు. వరికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఈ నెల 24నే బెళగావిలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేస్తామన్నారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అంతేకాక అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారని, అయితే ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదన్నారు. రైతులు వరి ధాన్యానికి మద్దతు ధర లేక దిక్కు తోచని స్థితిలో ఉంటే ప్రభుత్వం అన్నభాగ్య పథకం కోసం 13.5 మెట్రిక్ టన్నుల లెవీని సేకరించడం దారుణమన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే బహిరంగ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు చేసి అన్నభాగ్య పథకానికి వినియోగించుకోవాలని సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ బెంగళూరులో సమావేశం జరిపినంత మాత్రాన రాజకీయాలేమీ తలకిందులు కావన్నారు. మూడున్నర లక్షల టికెట్లు అమ్ముడు పోయాయని చెబుతున్నారని, అయితే ఆ కార్యక్రమంలో లక్ష మంది కూడా పాల్గొనలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అహింద విద్యార్థులకు టూర్, షాదీ భాగ్య, క్షీరభాగ్య తదితర పథకాలన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయన్నారు. అహింద విద్యార్థులకు టూర్ పథకంలో తొలుత కేవలం తొమ్మిది వేల మందికి నిధులు విడుదల చేసినట్లు సీఎం చెప్పారు. అనంతరం ఈ పరిమితిని 13,500 మందికి పొడిగించారన్నారు. అంటే ప్రతి జిల్లా నుంచి కేవలం 450 మంది మాత్రమే పర్యటనకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. అంటే మిగతా విద్యార్థులు పర్యటనకు అనర్హులా? అందువల్ల ఈ పథకం అశాస్త్రీయమన్నారు. రైతులు వరి, పత్తి, కందులు, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతు ధర లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శాంతినగర్‌లో శాంతి నెలకొనాలి తాలూకాలోని శాంతినగర్‌లో నెలకొల్పిన నూతన శివలింగం వద్ద కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపోత్సవం, ఇతర ధార్మిక కార్యక్రమాలను మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి శాంతి సమృద్ధి లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండెప్ప కాశంపూర్, ఎమ్మెల్యేలు మానప్ప వజ్జల్, డాక్టర్ శివరాజ్ పాటిల్, జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ, జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మహాంతేష్ పాటిల్ అత్తనూరు, బసవరాజ నాడగౌడ, లింగప్ప సాహుకార్, ఎన్.శివశంకర్, పవన్‌కుమార్, ధర్మనగౌడ, మల్లనగౌడ, సుమిత్ తడకల్, చంద్రు భూపాల నాడగౌడ, దాసరి సత్యనారాయణ, తహశీల్దార్ వెంకనగౌడ ఆర్.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలో ఏం జరిగింది?
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: అది చిత్తూరు నగరంలోని గిరింపేట నగర పాలక ప్రాథమిక పాఠశాల... సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వీపర్ పాఠశాలను శుభ్రం చేయడానికి వచ్చింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు పగిలిన దృశ్యం. రక్తపు మరకలు. దీంతో ఆందోళనకు గురైన ఆమె విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలికి సమాచారాన్ని అందచేసింది. వెనువెంటనే హెచ్ఎం, కార్పొరేషన్ కమిషనర్‌కు చెప్పడంతో ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్పొరేషన్ పాఠశాలలో చీకటి పడితే గుర్తుతెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. భయాందోళనలో స్థానికులు గిరింపేట ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలను పగులగొట్టి గదులన్నింటిలోనూ గాజుపెంకులు పడేశారు. ఈ సంఘటనతో ఇటు విద్యార్థులు, అటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రధానంగా నగర పాలక పాఠశాలల్లో రాత్రి కాపలాదారుని పోస్టుల మంజూరు లేకపోవడం తో పరిస్థితి ఇలా తయారయింది. కొం దరు ఆటో డ్రైవర్లు పాఠశాల ఆవరణలో మద్యం సేవించి, వారిలో వారికి చిన్నపాటి గొడవలు వచ్చి కొట్టుకోవడంతో రక్తం వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల హెచ్ఎంని విచారించిన కమిషనర్ టూటౌన్ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కమిషనర్‌తో పా టు మండల విద్యాశాఖాధికారి జయప్రకాష్ పరిస్థితిని జిల్లా కలెక్టర్‌కు రాత పూ ర్వకంగా నివేదించారు. పాఠశాల ప్రహరీగోడ ఎత్తు పెంచాలని, ప్రవేశద్వారానికి ఇనుపగేటు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. -
జయప్రకాష్ దీక్ష విరమణ
రాజోలు, న్యూస్‌లైన్ : జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ రాజో లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన నిరవధిక దీక్షను శనివారం విరమించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు చింతలపాటి వెంకట్రామరాజు, మట్టా శైలజ, కొండేటి చిట్టిబాబు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగి రాజు సాయిరాజు, సీనియర్ నాయకుడు చిన్నం ప్రవీణ్‌బాబు తదితరులు జయప్రకాష్‌కు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. ఏడు రోజులుగా జయప్రకాష్ ఆమరణ దీక్ష చేస్తున్న విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టినప్పటి నుంచి మత్తి జయప్రకాష్ నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఇలాఉండగా డాక్టర్ సువర్ణరాజు ఆధ్వర్యంలో జయప్రకాష్‌కు వైద్య పరీ క్షలు నిర్వహించి, ప్లూయిడ్స్ ఎక్కించారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తొలుత పాస్టర్లు సందిపూడి ఏలియా, బళ్ల నవరత్నం, సిస్టర్ పితాని సత్యవతి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయప్రకాష్‌ను పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఎన్.వసుంధర, నాయకులు మందపాటి కిరణ్‌కుమార్, అనితా శుభజ్యోతి, బొలిశెట్టి భగవాన్, గుబ్బల నారాయణరావు తదితరులు పరామర్శించారు.