
గాంధీజీ మార్గం ఆచరణీయం
విజయవాడ(చిట్టినగర్): ప్రపంచానికి మహాత్మాగాంధీ చూపిన మార్గం ఆచరణీయమని, ఆయన ఆశయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. మహాత్మా గాంధీజీ జీవితం, గాంధీజీ దీక్షలపై రూపొందించిన పుస్తకాన్ని జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిపై గాంధీజీ పోరాడిన తీరు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మహాత్ముని ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాంధీజీ దీక్షలనుప్రారంభించదలచామని మహాత్మాగాంధీ దేవాలయ ట్రస్టు అధ్యక్షులు, స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘ అధ్యక్షులు రాంపిళ్ల జయప్రకాష్ తెలిపారు. గత ఐదేళ్లగా దీక్షలను వందలాది మంది విద్యార్థులు స్వీకరించారన్నారు.