కమలా హ్యారిస్‌ ఖాళీ బుక్‌... బెస్ట్‌ సెల్లర్‌ | Book on Kamala Harris has clinched Amazon bestseller status | Sakshi
Sakshi News home page

కమలా హ్యారిస్‌ ఖాళీ బుక్‌... బెస్ట్‌ సెల్లర్‌

Oct 8 2024 3:47 AM | Updated on Oct 8 2024 10:49 AM

Book on Kamala Harris has clinched Amazon bestseller status

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్‌’ బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ‘ది అచీవ్‌మెంట్స్‌ ఆఫ్‌ కమలా హ్యారిస్‌’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. 

వాల్‌మార్ట్‌ బుక్‌స్టోర్‌లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్‌ టాక్‌’లో పోస్ట్‌ చేశారు. తర్వాత జాక్‌ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్‌ చేశారు. కమలా హ్యారిస్‌ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్‌’గా పేరు పొందిన అమెరికన్‌ రాజకీయ విశ్లేషకుడు అలన్‌ లిచ్‌మన్‌ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం.  

ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!

నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్‌ వీడియో

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement