న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో అక్టోబర్ 7న జరిగిన ఇంటర్వ్యూను మోసపూరితంగా ఎడిటింగ్ చేశారని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ఒకే ప్రశ్నకు రెండు వేర్వేరు సమాధానాలు ప్రసారం చేశారంటూ సీబీఎస్ నెట్‌వర్క్‌పై వ్యాఖ్యలు చేశారు.
When will CBS release their Transcript of the fraudulent Interview with Comrade Kamala Harris? They changed her answer in order to make Kamala look intelligent, rather than “dumb as a rock.” This may be the Biggest Scandal in Broadcast History! CBS MUST GET THE TRANSCRIPT OUT NOW…
— Donald J. Trump (@realDonaldTrump) October 21, 2024
అయితే.. ట్రంప్ ఆరోపణలను ఇప్పటికే సీబీఎస్ నెట్‌వర్క్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంది. ‘ఫేస్ ది నేషన్’ న్యూస్ ప్రోగ్రాం కంటే ‘60 మినిట్స్’ ప్రోగ్రాంలో ప్రసారమైన కమలా హారిస్ ఇంటర్వ్యూ అధిక భాగం ఉందని స్పష్టం చేసింది. ప్రసారమైన రెండు ప్రోగ్రాముల్లో ఒకే ప్రశ్నకు స్పందించినా.. కమల సమాధానంలోని వివిధ భాగాలను హైలైట్ చేశాయని తెలిపింది.
‘‘మేము ఏదైనా ఇంటర్వ్యూని ఎడిట్ చేసినప్పుడు. ఒక రాజకీయవేత్త, అథ్లెట్ లేదా సినిమా స్టార్ అయినా మేము స్పష్టంగా ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపింది. అయినా విమర్శలు ఆగటం లేదు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలు విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పూర్తి ఇంటర్వ్యూపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరోపైపు.. సీబీఎస్ నెట్‌వర్క్‌పై దావా వేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment