best seller
-
కమలా హ్యారిస్ ఖాళీ బుక్... బెస్ట్ సెల్లర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్’ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ‘ది అచీవ్మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. వాల్‌మార్ట్ బుక్‌స్టోర్‌లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశారు. తర్వాత జాక్ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్’గా పేరు పొందిన అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం. ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో -
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్‌ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారిలోనూ సూపర్ లగ్జరీ కార్లకు ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలీ లంబోర్గినీ భారత్‌లో అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. 2021లో 69 కార్లను విక్రయించింది. 2020తో పోలిస్తే ఇది 86 శాతం అధికం. భారత్‌లో లంబోర్గినీ కార్ల ధర రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2019లో దేశంలో 52 లంబోర్గినీ కార్లు రోడ్డెక్కాయి. 52 మార్కెట్లలో 173 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 8,405 యూనిట్లను విక్రయించింది. సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో ఇదే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ది. తొలి స్థానంలో ఉన్న యూఎస్‌లో 2,472 యూనిట్లు అమ్ముడయ్యాయి. చైనా, జర్మనీ, యూకే, ఇటలీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
నెలకో నవల రాస్తారు ఈవిడ
సుందరి వెంకటరామన్ తన 53వ ఏట ఇంగ్లిష్‌లో కాలక్షేప నవలలు రాయడం మొదలుపెట్టారు. తనే స్వయంగా వాటిని పబ్లిష్ చేయడం మొదలెట్టారు. నెలకు ఒక నవల రాయడం ఆమె ప్రత్యేకత. ఇప్పటికి 50 నవలలు పబ్లిష్ అయ్యాయి. వాటిలో కొన్ని బెస్ట్ సెల్లెర్స్‌గా నిలిచాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. ‘వచ్చే సంవత్సరం నాకు అరవై నిండుతాయి. ఈలోపు అరవై నవలలు పూర్తి చేయాలనుకుంటున్నాను’ అంటున్నారు. ముంబైలో ఉండే ఈమెతో ఒక పది నిమిషాలు మాట్లాడటం కష్టమే. ఎందుకంటే నవల రాస్తుంటారు కదా బిజీగా. మనకు తెలుగులో యద్దనపూడి సులోచనారాణి, యండమూరి, మల్లాది లాంటి పాపులర్ రచయిత లు తెలుసు. కాని సుందరి వెంకటరామన్ వారిని మించినట్టుగా ఉన్నారు. వారి కంటే భిన్నమైన నేపథ్యం ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే ఈమె మిగిలిన వారిలా చిన్న వయసు నుంచి రచనలు చేయడం మొదలు పెట్టలేదు. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత 2001లో నవలలు రాద్దామని ప్రయత్నించారు. కాని ఆ రచనలను పబ్లిషర్లు రిజెక్ట్ చేశారు. దాంతో ఊరికే ఉండిపోయి తిరిగి 2014లో తన 53వ ఏట నుంచి తనే తన నవలలు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అంటే సగటున నెలకు ఒక నవల రాసినట్టు. ఇలాంటి రికార్డు ఉన్న భారతీయ రచయిత్రులు చాలా అరుదు. ఉద్యోగపు విసుగు నుంచి సుందరి వెంకటరామన్ది చెన్నై. చిన్నప్పటి నుంచి బాలల కథలు చదివి ఆ లోకంలో విహరించేవారామె. టీనేజ్‌లో ఉండగా ఇంగ్లిష్‌లో కాలక్షేపంగా, రొమాంటిక్ సాహిత్యంగా ఉధృతంగా వచ్చిన మిల్స్ అండ్ బూన్స్ నవలలను విపరీతంగా చదివేవారు. ఏది చదివినా ముగింపు వాక్యం ‘ఆ తర్వాత వారు కలకాలం సుఖ సంతోషాలతో వర్థిల్లారు’ అని ఉన్న పుస్తకాలే చదివేవారు. ‘సుఖాంతమే అవ్వాలి పుస్తకాలు’ అంటారామె. ఆ తర్వాత పెళ్లి, పిల్లల పెంపకం, ముంబైలో స్థిరపడటంలో పడి నలభై ఏళ్లు వచ్చేశాయి. ఆమె అంతవరకూ చేస్తున్న స్కూల్ అడ్మిన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏదో అనిశ్చితి ఉండేది మనసులో ఆ సమయంలో. ఒకరోజు ఈవెనింగ్ వాక్ నుంచి ఇంటికొచ్చి కొన్ని కాగితాలు తీసుకొని రాయడం మొదలుపెట్టారు. అంతవరకూ చదివి చదివి ఉన్న పుస్తకాల ఫలితంగా ఏదో ఒక కథ ఆమె మనసులో గూడు కట్టుకొని అది ఒక్కసారిగా బయట కు వచ్చినట్టుగా వచ్చేసింది. ఆమె రాస్తూ వెళ్లారు. మొత్తం 92 వేల పదాల నవల రాశారు. దాని పేరు ‘ది మల్హోత్రా బ్రైడ్’. ఎంతో ఆశతో దానిని తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరకు వెళ్లారు. కాని ఆ పబ్లిషర్ దానిని చదివి పెదవి విరిచాడు. దానికి కారణం అందులో రొమాన్స్, స్త్రీ పురుష సంబంధాలు ఉండటం ‘ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చదవరు’ అని అతను అన్నాడు. సుందరి నిరాశగా ఇంటికి చేరుకున్నారు. భర్త ఆమెతో ‘నిరాశ పడకు. రాస్తూ ఉండు’ అని ప్రోత్సహించాడు. అ³్పుడు ఆమె తిరిగి ‘ముంబై మిర్రర్’ పత్రికలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఐదేళ్లు ఆ పత్రికకు సంబంధించిన వెబ్సైట్ల కోసం పని చేశారు. మళ్లీ విసుగు వచ్చింది. 53 ఏళ్లు వచ్చేశాయి... ఇంకా నేను రైటర్‌గా లోకానికి తెలియలేదు అనుకుని మళ్లీ ఉద్యోగం మానేశారు. ఇప్పుడు నిజంగానే తన రైటింగ్ కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నారామె. సెల్ఫ్ పబ్లిషర్‌గా ఆ సమయంలో ఆమెకు అప్పటికే సెల్ఫ్ పబ్లిషింగ్కు అవకాశం కల్పిస్తూ పాఠకాదరణ పొందిన అమేజాన్ ‘కిండిల్’ ఈ–రీడర్ ఒక ఆశాకిరణంలా అనిపించింది. తను రాసిన నవలలను ఈ–బుక్స్‌గా పబ్లిష్ చేయాలనుకున్నారామె. 2014 లో తన తొలి ఈ నవలగా ‘ది మల్హోత్రా బ్రైడ్’ను విడుదల చేశారు. ఆ తర్వాత ఒక్కో నవలా జత చేస్తూ వెళ్లారు. సంవత్సరం తిరిగే సరికే ఇటు ఈ–బుక్స్‌తోపాటు పేపర్‌బ్యాక్స్ ప్రచురించడానికి పబ్లిషర్లు ముందుకు రాసాగారు. ‘ది మెడ్రాస్ ఎఫైర్’ అనే నవల ఆమె తొలి ప్రచురణ నవలగా వచ్చింది. ఇప్పుడు ఆమె నవలలు ఈ బుక్స్‌గా దొరుకుతున్నాయి. కోరిన పాఠకులకు పేపర్బ్యాక్స్గా కూడా దొరుకుతున్నాయి. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే కాలక్షేప నవలల్లో టాప్ 100లో సుందరి వెంకటరామన్ నవలలకూ స్థానం. యు.కె, కెనెడా, ఆస్ట్రేలియాల్లో కూడా ఆమె నవలలు బెస్ట్‌సెల్లర్స్‌గా నిలవడం విశేషం. రొమాన్సే వస్తువు ‘రొమాన్స్’ అనే మాటకు ‘ప్రేమకు సంబంధించిన ఉత్సుకత’ అనే డిక్షనరీ అర్థం చెబుతారు సుందరి వెంకటరామన్. ‘ఎరోటిజమ్’ అనే మాటలో ‘లైంగిక వాంఛ’ అర్థాన్ని చూపుతారు. స్త్రీ, పురుషుల సంబంధాల్లో రొమాన్స్ ఉంటుంది... ఎరోటిజమూ ఉంటాయి... ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.. నా నవలల్లో అదే ప్రధాన వస్తువు అంటారామె. ‘భారతదేశంలో రొమాంటిక్ సబ్జెక్ట్స్‌ను ఇష్టపడేవారు ముందు నుంచి ఉన్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాలు అంత హిట్ కావడానికి కారణం మనవాళ్ల అలాంటి కంటెంట్‌ను ఇష్టపడటమే’ అంటారామె. ఆమె నవలల పేర్లు కూడా డెబ్బైల నాటి పల్ప్ ఫిక్షన్‌ను పోలినట్టు ఉంటాయి. ‘ది సీక్రెట్ హజ్బెండ్’, ‘ది కాసనోవాస్ వైఫ్’, ‘రోజ్ గార్డెన్’... ఇలా. వాటికి విస్తృతంగా పాఠకులున్నారు. ‘ప్రతిదానికీ పాఠకులుంటారు’ అంటారామె. ‘నా నవలలు చదివితే ఆ ఆకర్షణల వల్ల వచ్చే సమస్య ల నుంచి కూడా బయటపడొచ్చు’ అంటారు. రచనలు రెండు రకాలు. సమాజ హితాన్ని కోరేవి. సమాజానికి కాలక్షేపం అందించేవి. ఏది ఆసక్తి ఉంటే అందులో రాణించవచ్చు. స్వయంగా పబ్లిష్ చేసి గుర్తింపు పొందవచ్చు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచవచ్చు. ఏ వయసులో అయినా కొత్త ప్రయాణం మొదలెట్టొచ్చు అనడానికి సుందరి వెంకటరామన్ ఒక ఉదాహరణ. అతి వేగంగా రాసే రచయిత్రి సుందరి వెంకటరామన్ అతి వేగంగా రాస్తారు. ఒక్కో నవల సగటున 35 రోజుల్లో పూర్తి చేస్తారు. భూమి ఆకాశాల మధ్య ఏ వస్తువునైనా తీసుకొని కథ అల్లగలరామె. 2016లో పన్నెండు నెలలకు పన్నెండు నవలలు పబ్లిష్ చేశారామె ఈబుక్స్‌గా. కవర్ డిజైన్ ప్రూఫ్ తనే చూస్తారు. మార్కెటింగ్ తనే చేస్తారు. ప్రచారం కూడా. – సాక్షి ఫ్యామిలీ -
బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన రెడ్మీ 6ఏ
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మొబైల్ అమ్మకాల్లో మరోసారి తన పత్యేకతను చాటుకుంది. మార్కెట్లో షావోమి ఉత్పత్తులకు ఉన్న ఆదరణ గురించి అందరికే తెలిసిందే. రెడ్మీ 6ఏ విడుదలైన రోజు నుంచి అత్యుత్తమ విక్రయాలు జరుపుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌గా ఉందని ఐడీసీ వెల్లడించినట్టు షావోమి సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐడీసీ మంత్లీ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్, నవంబర్ 2018 గానూ ఈ వివరాలను వెల్లడించదని తెలిపింది. 2018 సెప్టెంబర్‌లో విడుదలైన రెడ్మీ 6ఏ తొలుత ప్లాష్ సేల్‌లో వినియోగదారులోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అన్ని ప్లాట్‌ఫారంలపై రెడ్మీ 6ఏ విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని ఎంఐ వినియోగదారులతో పంచుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించింది. దీనిపై షావోమి సెల్స్ హెడ్ రఘు రెడ్డి స్పందిస్తూ.. ‘రెడ్మీ 6ఏ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. దీనికి కారణమైన ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు. 2014లో తమ సంస్థ విక్రయాలు ప్రారంభించినప్పటి నుంచి.. ఈ ప్రగతి గొప్ప అనుభూతినిచ్చింది. ఎంఐ అభిమానులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామ’నితెలిపారు. -
టొమాటో బుట్టలో యాపిల్ పళ్లుండవు
తాము తప్పు చేస్తున్నామేమో అన్న సంశయం తమ పెళ్ళి రోజునే జాన్, ఐరీన్లకు కలుగుతుంది. పెళ్ళి ముందటి రాత్రి, ఇంటి నుంచి పారిపోయేందుకు తనకు సహాయం చేయమని ఐరీన్ తన ఆప్తమిత్రురాలైన వాలెరీని అడుగుతుంది. జాన్ ధైర్యం కోల్పోయి బార్లో కూర్చున్నప్పుడు, అతని స్నేహితుడు జాన్‌ను ఊరడించేందుకు, ‘ముందు ఐరీన్‌ను ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నావో గుర్తుకి తెచ్చుకో’ అంటాడు. సమాధానం తట్టని జాన్, ‘ఆమె మేక్ అప్ వేసుకోదు గనుక’ అన్న కుంటిసాకు చెప్తాడు. ఇన్ని అభ్యంతరాలతోనూ పెళ్ళి జరిగిపోతుంది. సేడీ పుడుతుంది. దంపతులు ఆలస్యం చేయకుండా విడాకులు పుచ్చేసుకుంటారు. జాన్, తన స్వస్థలం అయిన మినిసోటాకి వెళ్ళిపోతాడు. ఐరీన్ కాలిఫోర్నియాలో ఉంటుంది. సేడీకి 18 ఏళ్ళు వచ్చిన తరువాత, చాలా మట్టుకు తల్లితో గడుపుతూ, సంవత్సరంలో నాలుగు సార్లు తండ్రి వద్దకి వెళ్తుంది, ‘వన్స్ అపాన్ అ టైమ్, దేర్ వస్ యు’ నవల్లో. జాన్‌కు ‘సులభంగా సౌకర్యంగా ఉండే నిలకడైన సంబంధం, నాటకీయత లేని క్షణాలు’ ఇష్టం. ‘ఇతరులకి ఇచ్చేటందుకు నీ వద్ద ఎంతో ప్రేముంది. అయితే, నువ్వెప్పుడూ టొమాటో బుట్టలో ‘యాపిల్ పళ్ళెక్కడ?’ అంటూ వెతుక్కుంటావు’ అంటూ ఐరీన్ మీద వాలెరీ విసుక్కుంటుంది. ఐరీన్ ఆన్లైన్లో బోయ్‌ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ, తన గురించి లేకి వివరాలు ఇస్తుంటుంది. ‘‘మనుష్యులు మూర్ఖులు. వారు రూపొందించబడిన విధానంలోనే ఒక అల్గోరిథమ్ ఉంది. ‘ప్రేమించు, ప్రేమించబడు’ అన్న సూత్రం పాటిస్తే సంతోషంగా ఉంటాం. ఇది సరళమైనదే కానీ అర్థం చేసుకోవడమే కష్టం’ అని వయస్సుకి మించిన పరిణితి చెందిన సేడీ, తల్లిదండ్రులకి చెప్తుంది. అప్పటికల్లా, రచయిత్రి ఎలిజెబెత్ బెర్గ్– మాజీ దంపతుల నేపథ్యాలనూ, సంతోషం లోపించిన వారి బాల్యాలనూ పరిచయం చేస్తారు. విడాకుల తరువాత, ఇతర సంబంధాలు కల్పించుకునే వారి విఫల ప్రయత్నాలు కూడా పాఠకులకి తెలుస్తాయి. వారాంతంలో బోయ్ఫ్రెండైన రోన్‌ను కలుసుకోవాలనుకున్న సేడీ, తన స్నేహితులతో వెళ్తున్నానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్తుంది. కేవలం కూతుర్ని మాత్రమే ప్రేమించగల ఐరీన్, జాన్ పంతం పట్టడంతో, ‘సరే’నంటుంది. రోన్ గురించి ఇద్దరికీ తెలియదు. సేడీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి, ఐరీన్ మాజీ భర్తకు తెలియజేస్తుంది. తను మొదలుపెట్టబోతున్న కొత్త సంబంధాన్ని వదిలేసి, అతను వచ్చేస్తాడు. ఇద్దరూ కలుసుకున్న క్షణమే, వారి మధ్య ఉన్న పూర్వపు అపనమ్మకం, కోపం తలెత్తుతాయి. ఒకరినొకరు దెప్పుకోడానికి– గతంలో జరిగిన సంఘటనలనూ, సంభాషణలనూ వాదనలోకి తెచ్చి, పోట్లాడుకుంటారు. సేడీ, రోన్ కోసం ఎదురు చూస్తుండగా, ఆమెని ఒక ఆగంతకుడు అపహరించి, వొక గుడిసెలో ఉంచుతాడు. రెండ్రోజుల తరువాత, రోన్ సహాయంతో పోలీసులు సేడీని కాపాడినప్పుడు, ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా, రోన్‌ను పిలుస్తుంది. పెళ్ళి చేసుకున్న తరువాతే ఇంటికి వెళ్దామని నిశ్చయించుకుంటారు ఇద్దరూ. మొదట, కూతురు బతికే ఉందని ఊరట చెందిన ఐరీన్ తన తెలివైన కూతురు, ‘పెళ్ళి చేసుకునే మూర్ఖపు పని ఎందుకు చేస్తోందో!’ అని కోపం తెచ్చుకుంటుంది. ఆమె తిరిగి జాన్‌తో ఏకమవుతుందేమో అని ఆశించిన పాఠకులను నిరాశపరుస్తూ, వొంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది. ముగ్గురి పాత్రలపైనా కేంద్రీకరించిన నవల హాస్యంగా ఉండి, ప్రేమకుండే శక్తి గురించి చెబుతుంది. తెగిన సంబంధాల మధ్య పిల్లల్ని పెంచడంలో కలిగే ఇబ్బందులను రచయిత్రి వాస్తవిక కోణంలో చూపుతారు. నవలని రాండమ్ హౌస్, 2011లో ప్రచురించింది. - కృష్ణ వేణి -
బెస్ట్ సెల్లర్లకు పుట్టినిల్లు అమెరికా
బెస్ట్ సెల్లర్లకు పుట్టినిల్లు అమెరికా. పారిశ్రామిక విప్లవం తర్వాత ఫ్యాక్టరీ వుత్పత్తులను అతితక్కువ(షెల్ఫ్ టైమ్)లో అత్యధికంగా అమ్ముకోవడం ఒక కీలక వ్యాపార వ్యూహంగా మారింది. తొలిదశలో, ఇంగ్లండ్‌లో పెన్నీ నావెల్స్, అమెరికాలో సీసైడ్ రొమాన్సులు పుస్తక వ్యాపారంలో కీలక పాత్ర పోషించాయి. ఈ బెస్ట్ సెల్లింగ్, బ్లాక్ బస్టర్ నవలలకు పాపులర్ నవలలని ముద్దుపేరు. డికెన్స్, మార్క్ ట్వేన్ లాంటి వాళ్ల రచనలు బహుశా ప్రాచుర్యం పొందినవే. కానీ అవి బెస్ట్ సెల్లర్లు కావు. అవి వందేళ్లలో అమ్ముడుపోయినన్ని ప్రతులు ఈ పుస్తకాలు కొద్ది వారాల్లోనో, నెలల్లోనో అమ్ముడుపోయి, కొత్త బెస్ట్సెల్లర్లకు పుస్తకాల షాపుల్లో స్థానం కల్పిస్తాయి. ఒక పుస్తకం బెస్ట్ కావడంలో రచనాసామర్థ్యం కన్నా మార్కెటింగ్ వ్యూహం, పబ్లిసిటీ ఎక్కువ ముఖ్యం. బెస్ట్ సెల్లర్ ఒక వ్యాపార వస్తువు. ఒక కమాడిటీ. సక్సెస్ఫుల్ కమర్షియల్ నావెలిస్ట్ ఆర్థర్ హేలీ (1920-2004) గురించి ఆయన భార్య షీలా యిలా చెప్పింది: ‘‘ఆర్థర్‌కు పుస్తకవ్యాపారం గురించి బాగా తెలుసు. ఏ కథావస్తువు ఎప్పుడు రాస్తే బాగా అమ్ముడుపోతుందో మొదట అధ్యయనం చేస్తాడు. కొన్నిసార్లు సర్వే చేస్తాడు. మొదట పబ్లిషర్లతో సమావేశమై కథావస్తువు నిర్ణయిస్తాడు. సినాప్సిస్ తర్వాత మళ్లీ పబ్లిషర్లు, మార్కెటింగ్ మేనేజర్లతో మీటింగులు. వాళ్ల సలహాలు, సూచనల మేరకు మార్పులు చేస్తాడు’’. (ఆర్థర్ హేలీ రచనలు ‘రన్‌వే జీరో-ఎయిట్’, ‘హోటల్’, ‘ఎయిర్పోర్ట్’. ఆయన పుస్తకాలు సుమారు 17 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి.) ముక్తవరం పార్థసారథి, 9177618708