
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మొబైల్ అమ్మకాల్లో మరోసారి తన పత్యేకతను చాటుకుంది. మార్కెట్‌లో షావోమి ఉత్పత్తులకు ఉన్న ఆదరణ గురించి అందరికే తెలిసిందే. రెడ్‌మీ 6ఏ విడుదలైన రోజు నుంచి అత్యుత్తమ విక్రయాలు జరుపుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌గా ఉందని ఐడీసీ వెల్లడించినట్టు షావోమి సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐడీసీ మంత్లీ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్, నవంబర్ 2018 గానూ ఈ వివరాలను వెల్లడించదని తెలిపింది. 2018 సెప్టెంబర్‌లో విడుదలైన రెడ్‌మీ 6ఏ తొలుత ప్లాష్ సేల్‌లో వినియోగదారులోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అన్ని ప్లాట్‌ఫారంలపై రెడ్‌మీ 6ఏ విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని ఎంఐ వినియోగదారులతో పంచుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించింది.
దీనిపై షావోమి సెల్స్ హెడ్ రఘు రెడ్డి స్పందిస్తూ.. ‘రెడ్‌మీ 6ఏ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. దీనికి కారణమైన ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు. 2014లో తమ సంస్థ విక్రయాలు ప్రారంభించినప్పటి నుంచి.. ఈ ప్రగతి గొప్ప అనుభూతినిచ్చింది. ఎంఐ అభిమానులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామ’నితెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment