IDC
-
సాగర్ ఆయకట్టు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ స్పిల్‌వేకి పడిన గుంతలను పూడ్చివేసి ప్రాజెక్టును పటిష్టపరిచి.. దాని కింద ఆయకట్టు పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. డ్యామ్ మరమ్మతులపై ఐఐటీ రూర్కీ నిపుణులతో అధ్యయనం జరిపించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగర్ కెనాల్ నెట్‌వర్క్‌కు సైతం మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. చిన్న లిఫ్టులతోనే అధిక ప్రయోజనం రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలోని 334 చిన్న ఎత్తిపోతల పథకాలు కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొన్ని లిఫ్టులు పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపా రు. పూర్తి సామర్థ్యంతో సాగునీటి సరఫరా చేసేలా ఈ లిఫ్టులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. చిన్న ఎత్తిపోతల పథకాలే రైతులకు ప్రయోజనం చేకూర్చుతాయని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను సత్వరం పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లు అందించాలని ఆదేశించారు. రూ.664.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరందించాలని ఆదేశించారు. లోలెవల్ కాల్వకు మహర్దశ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగమైన హైలెవల్, లోలెవల్ కాల్వల మధ్య 15 కి.మీల లింక్ కాల్వ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మేడవార్మ్, పోతునూరు, సంగారం, పెద్దవూర, తుంగతుర్తి చెరువులను అనుసంధానం చేస్తూ లింక్ కాల్వను నిర్మిస్తామని చెప్పారు. రూ.62.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న లింక్ కాల్వ నిర్మాణానికి 65.02 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటికే 43.31 ఎకరాల సేకరణ పూర్తయ్యిందని, తక్షణమే టెండర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో 0–63 కి.మీల లోలెవల్ కాల్వ లైనింగ్ పనులను చేపడుతామని తెలిపారు. అదనంగా లోలెవల్ కాల్వకు సంబంధించిన డీ–1 నుంచి డీ–27 వరకు డిస్ట్రిబ్యూటరీలకు 60 మి.మీల మందంతో కాంక్రీట్ లైనింగ్ వేసి కాల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 90.43 కి.మీల పొడవైన ఈ డిస్ట్రిబ్యూటరీల లైనింగ్‌కు రూ.42.26 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఫ్లడ్ ఫ్లో కాల్వగా పేరొందిన లోలెవల్ కెనాల్ 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోనే 50 వేల ఎకరాలకు నీరందిస్తోందని తెలిపారు. 19 చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 30 వేల ఎకరాలను స్థిరీకరిస్తుందని వివరించారు. అనుమలవారిగూడెం వద్ద శశిలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి అనుమతిచ్చారు. సాగర్ పరిధిలోని 39 ఐడీసీ లిఫ్టులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. సమీక్షలో నల్లగొండ ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. -
ప్రధానితో చర్చించిన అంశాలను పంచుకున్న బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 25 ఏళ్ల తర్వాత ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం సమావేశమయ్యారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల అభివృద్ధి వంటి అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం గురించి మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీని ఆయన విదేశాల్లో చాలాసార్తు కలిశారని తెలిపారు. మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ అవసరాల గురించి మాట్లాడామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించామని బిల్ గేట్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో చెప్పారు. గేట్స్ పోస్టుకు మోదీ స్పందించారు. నిజంగా అదో అద్భుత సమావేశమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గతిని మార్చే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. It is always inspiring to meet with @narendramodi and there was a lot to discuss. We talked about AI for public good; DPI; women-led development; innovation in agriculture, health, and climate adaptation; and how we can take lessons from India to the world. @PMOIndia pic.twitter.com/Y3REO67gxP — Bill Gates (@BillGates) February 29, 2024 ఇదీ చదవండి: ఇకపై యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ ఇటీవల సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. -
ఐడీసీ మార్కెట్‌స్కేప్‌లో సిగ్నిటీకి చోటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే సిగి్నటీ టెక్నాలజీస్‌కు ఐడీసీ మార్కెట్‌స్కేప్ అధ్యయనంలో దిగ్గజ సంస్థగా గుర్తింపు లభించింది. వెండార్ల సేవలను మదింపు చేసే ఈ నివేదికలో.. కస్టమర్లు సిగి్నటీకి అత్యధిక రేటింగ్ ఇచ్చారు. వినూత్న సరీ్వసులను అందించడంలోనూ, తమ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ సేవల ప్రమాణాలు, వ్యాపా రాలపై వాటి సానుకూల ప్రభావాల గురించి అర్థమయ్యేలా వివరించడంలోనూ సంస్థ సమర్ధమంతంగా పనిచేస్తోందని కస్టమర్లు అభిప్రాయపడ్డారు. కస్టమర్లు తమ వెండార్ల నుంచి నాణ్యత, నైపుణ్యాలు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని ఆశించడంతో పాటు వారు తమ వ్యాపార వృద్ధికి ఎలా దోహదపడగలరనేది ఆలోచిస్తారని, తదనుగుణంగా వ్యవహరించే సంస్థలే అధిక వృద్ధి సాధించగలవని ఐడీసీ రీసెర్చ్ రీసెర్చ్ వీపీ ముకేశ్ దయలానీ తెలిపారు. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి, వారి వ్యాపారాలకు ఉపయోగపడే సేవలందించడంలో తమ సామరŠాధ్యలకు ఐడీసీ మార్కెట్‌స్కేప్ గుర్తింపు నిదర్శనమని సిగి్నటీ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ చక్కిలం తెలిపారు. -
Microsoft: త్వరలో మైక్రోసాఫ్ట్ ఐడీసీ సంచలన ప్రాజెక్ట్‌లు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్ కేక్ కట్‌చేసి మాట్లాడారు. ‘భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్ ఫార్మాట్లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్బంది అనే కోపైలట్ టూల్ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: తెలంగాణను దాటేసిన ఏపీ..! మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్బందీ, అజూర్ స్పెషలైజ్డ్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వేరబుల్స్ (మన శరీరానికి నేరుగా కాంటాక్ట్‌తో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్) మార్కెట్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 1.12 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ అమ్ముడయ్యాయి. ఇందులో ఇయర్‌వేర్ 92 లక్షలు, రిస్ట్ బ్యాండ్స్ 3.72 లక్షలు, స్మార్ట్‌వాచెస్ 16 లక్షల యూనిట్లు ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 118.2 శాతం వృద్ధి. దేశీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఇయర్‌వేర్, వాచెస్ విక్రయం కారణంగా ఈ వృద్ధి సాధ్యపడిందని ఐడీసీ వెల్లడించింది. ‘2021 జనవరి–మార్చితో పోలిస్తే సెకండ్ వేవ్ మూలంగా జూన్ త్రైమాసికంలో విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మార్కెట్ ఈ ఏడాది త్వరితగతిన రికవరీ అయింది. పండుగల సీజన్లో డిమాండ్ విపరీతంగా ఉండనుంది. కంపెనీలు ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021 జూలై–డిసెంబరు కాలంలో 35 శాతం అధికంగా అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిస్ట్‌వేర్ విభాగంలో వాచెస్ వాటా ఏకంగా 81.2 శాతం ఉంది. ఈ విభాగం మరింత పుంజుకోనుంది. రిస్ట్‌వేర్ విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ఇయర్‌వేర్ రెండింతలైంది. యూనిట్ల పరంగా ఈ విభాగానిదే పైచేయి’ అని ఐడీసీ వివరించింది. -
బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన రెడ్మీ 6ఏ
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మొబైల్ అమ్మకాల్లో మరోసారి తన పత్యేకతను చాటుకుంది. మార్కెట్లో షావోమి ఉత్పత్తులకు ఉన్న ఆదరణ గురించి అందరికే తెలిసిందే. రెడ్మీ 6ఏ విడుదలైన రోజు నుంచి అత్యుత్తమ విక్రయాలు జరుపుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌గా ఉందని ఐడీసీ వెల్లడించినట్టు షావోమి సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐడీసీ మంత్లీ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్, నవంబర్ 2018 గానూ ఈ వివరాలను వెల్లడించదని తెలిపింది. 2018 సెప్టెంబర్‌లో విడుదలైన రెడ్మీ 6ఏ తొలుత ప్లాష్ సేల్‌లో వినియోగదారులోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అన్ని ప్లాట్‌ఫారంలపై రెడ్మీ 6ఏ విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని ఎంఐ వినియోగదారులతో పంచుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించింది. దీనిపై షావోమి సెల్స్ హెడ్ రఘు రెడ్డి స్పందిస్తూ.. ‘రెడ్మీ 6ఏ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. దీనికి కారణమైన ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు. 2014లో తమ సంస్థ విక్రయాలు ప్రారంభించినప్పటి నుంచి.. ఈ ప్రగతి గొప్ప అనుభూతినిచ్చింది. ఎంఐ అభిమానులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామ’నితెలిపారు. -
శాంసంగ్ స్థాయికి చేరిన షావోమి
భారత్‌లో నెంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ స్థాయికి చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి షావోమి చేరుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో టాప్ స్లాట్‌లోకి షావోమి కూడా చేరుకున్నట్టు రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఏడాది మూడో క్వార్టర్లో 9.2 మిలియన్ స్మార్ట్ఫోన్ల రవాణాతో షావోమి మార్కెట్ షేరు 23.5 శాతంగా నమోదైంది. దేశంలో అత్యంత వేగవంతంగా దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండులల్లో షావోమి కూడా ఉందని, ఈ ఏడాది మూడో క్వార్టర్లో కంపెనీ వృద్ధి రేటు కనీసం 300 శాతం(ఏడాది ఏడాదికి)గా ఉన్నట్టు ఐడీసీ తన క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్, క్యూ3 2017లో మంగళవారం పేర్కొంది. శాంసంగ్ సీక్వెన్షియల్‌గా(క్వార్టర్ క్వార్టర్‌కు) 39 శాతం వృద్ధిని నమోదుచేయగా.. ఏడాది ఏడాదికి 23 శాతం వృద్ధిని నమోదుచేసింది. శాంసంగ్ మార్కెట్ వాల్యులో 60 శాతం దాన్ని కీమోడల్స్ గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 నెక్ట్స్, గెలాక్సీ జే7 మ్యాక్స్లున్నాయి. షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్మి నోట్4 నిలిచింది. ఈ క్వార్టర్లో నాలుగు మిలియన్ల రెడ్మి నోట్4 యూనిట్లను షావోమి రవాణా చేసింది. వచ్చే క్వార్టర్లలో శాంసంగ్, షావోమి రెండు తమ ఛానల్స్‌ను మరింత బలోపేతం చేసుకుంటాయని, తీవ్రమైన పోటీకర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడర్షిప్ కోసం ఈ రెండు కంపెనీలు పోటీ పడనున్నాయని ఐడీసీ ఇండియా సీనియర్ అనాలిస్ట్ ఉపాసన జోషి చెప్పారు. షావోమికి వెబ్సైట్ ద్వారా నమోదవుతున్న విక్రయాలు అధికంగా ఉన్నాయి. మొత్తంగా ఆన్లైన్ ఛానల్ ద్వారా వచ్చే షేరు 32 శాతం నుంచి 37 శాతం పెరిగింది. భారత మార్కెట్లోకి ప్రవేశించిన మూడేళ్లలోనే ఎక్కడా చూడనంత వృద్ధిని చూశామని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, షావోమి వైస్‌ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. అతి తక్కువ సమయంలో అన్ని రంగాల్లోనూ మార్కెట్ లీడర్‌గా నిలిచిన తొలి బ్రాండు తమదేనన్నారు. -
వచ్చే ఖరీఫ్‌కు 2 లక్షల ఎకరాలకు నీరు
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాల పునరుజ్జీవం ద్వారా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి 2లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 25వేల ఎకరాలకు నీరిస్తామని స్పష్టం చేశారు. గతంలో కోట్లు వెచ్చించినా ఎత్తిపోతల పథకాల ద్వారా ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు పారలేదని, ప్రస్తుతం ఐడీసీ చైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డిని నియమించిన ఏడాదిలో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు పారిందన్నారు. గురువారం ఇక్కడి ఐడీసీ కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రులు ఈటల, తుమ్మల నాగేశ్వరరావు, ఈఎన్సీ మురళీధర్, ఐడీసీ ఎండీ సురేశ్‌కుమార్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, అతి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ సుముఖంగా ఉందన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, కోటి ఎకరాల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నమని, అందుకు అనుగుణంగా ఐడీసీ పనిచేయాలని సూచించారు. ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత యాసంగిలో మొత్తంగా 1.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. -
ఉత్తిపోతలేనా?
► రాష్ట్రంలో చిన్న ఎత్తిపోతల పథకాల పరిస్థితి దారుణం ► 582 పథకాల్లో పనిచేస్తున్నవి 178 మాత్రమే సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్ (ఐడీసీ) ద్వారా చేపట్టిన ఎత్తిపోతల పథకాలు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన నిర్వహణ లేక, మరమ్మతుల సమస్యతో వృథాగా పడి ఉంటున్నాయి. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద సమకూర్చిన నిధులతో సన్న, చిన్నకారు రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఈ చిన్నస్థాయి ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం, నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరణకు చొరవ చూపకపోవడం, ఆధునీకరించడంలో విఫలమవడం వంటి కారణాలతో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. పనిచేస్తున్నవి మూడో వంతే.. రాష్ట్రంలో ప్రస్తుతం 582 ఎత్తిపోతల పథకాలు ఉండగా.. వాటిలో 178 మాత్రమే పూర్తిగా పనిచేస్తుండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఈ మొత్తం 582 ఎత్తిపోతల పథకాల కింద సుమారు 3.86 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. కానీ 1.23 లక్షల ఎకరాల (32 శాతం)కు మాత్రమే అందుతున్నాయి. పట్టించుకునే వారెవరు? ఈ చిన్న స్థాయి ఎత్తిపోతల పథకాల నిర్వహణను సాగునీటి రైతు సంఘాలే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల ఈ సంఘాలు ఆర్థికంగా, సాంకేతికంగా సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నాయి. రైతులకు అధికారుల సహకారం లోపించడంతో పథకాలన్నీ చతికిలపడ్డాయి. ఇక ఈ ఎత్తిపోతల పథకాల కింద పూర్తిగా ఆరుతడి పంటలే వేయాల్సి ఉన్నా.. తగిన చైతన్యం లేకపోవడంతో రైతులు వరి సాగు చేపడుతున్నారు. దానివల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. మోటార్లు రిపేర్లకు వచ్చినా, పథకం నిర్వహణలో సాంకేతిక సమస్యలు వచ్చినా పట్టించుకునేవారు లేరు. దీంతో మొత్తం పథకాల్లో 222 పూర్తిగా వినియోగంలో లేకుండా పోయాయి. కేటాయింపులు ఎక్కువ.. ఖర్చు తక్కువ పనిచేయని పథకాలను పునరుద్ధరించడం, పాక్షికంగా పనిచేస్తున్న వాటికి మరమ్మతులు, కొత్తగా మరిన్ని ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వం ఏటా ఐడీసీకి భారీగానే నిధులు కేటాయిస్తోంది. కానీ నిధుల ఖర్చు మాత్రం ఉండడం లేదు. గతేడాది రూ.274 కోట్లు కేటాయించగా.. రూ.177.98 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో అనుకున్న మేర ఆయకట్టు సాధ్యం కాలేదు. తాజాగా ఈ ఏడాది రూ.294 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో 154 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి 85,653 ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 57 పథకాల పనులు మొదలయ్యాయి. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరిస్తాం ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఐడీసీ పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నిర్ణీత ఆయకట్టులో 30 శాతానికి కూడా నీరందించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి జిల్లాలో పర్యటించి.. ఎక్కడ మరమ్మతులు అవసరం, ఎక్కడ పునరుద్ధరణ అవసరమనేది పరిశీలించాం. ఈ ఖరీఫ్‌లోనే 1.49 లక్షల ఎకరాలకు నీరందేలా చూస్తాం. మున్ముందు పూర్తి ఆయకట్టుకు నీరిస్తాం. 150, 200 హెచ్‌పీ మోటార్ల వద్ద పంపు ఆపరేటర్లు లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని, పైపులు పగిలిపోతున్నాయని గుర్తించాం. అక్కడ ఐటీఐ, డిప్లొమా చేసిన వారిని పంపు ఆపరేటర్లుగా నియమించుకోవాలని నిర్ణయించాం..’’ – ఈద శంకర్‌రెడ్డి, సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాసిరకం పనులతో వృథా.. జయశంకర్ జిల్లా వాజేడు మండలం పూసూరు, మైసారం, మండపాక, బొమ్మనపల్లి గ్రామాల పరిధిలో 706 ఎకరాలకు నీరందించేందుకు పూసూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 1992లో పూసూరు వద్ద గోదావరి ఒడ్డున రూ.25 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టి 1993లో పూర్తిచేశారు. 100 హెచ్‌పీ సామర్థ్యమున్న మూడు మోటార్లు, పైప్‌లైన్, విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ అమర్చారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకం పనులతో 1996లో పైపులైన్ పగిలిపోయింది. 1998లో పథకానికి మరమ్మతులు చేసినా.. బిల్లులు చెల్లించలేదంటూ ట్రాన్స్‌కో విద్యుత్ సరఫరా నిలిపేసింది. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ రూ.12లక్షల మేర విద్యుత్ బిల్లులను మాఫీ చేశారు. దీంతో ఈ పథకం తిరిగి ఏడాది పనిచేసింది. కానీ 2005 చివరలో పైపులైన్లు పగలడం, మోటార్లు మొరాయించడం వంటి సమస్యలతో పథకం మూలనపడింది. అంతా లీకేజీలమయం.. 15 వేల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో 2009లో మక్తల్ నియోజకవర్గ పరిధిలో చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం, దానికి అనుబంధంగా నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రూ.50 కోట్ల నాబార్డు నిధులతో పనులు ప్రారంభించారు. టెండర్లలో పనులు దక్కించుకున్న కోరమాండల్, డీఆర్సీఎల్ కంపెనీలు నాసిరకంగా పైపులైన్‌ను నిర్మించాయి. దాంతో కొద్దిరోజులకే 400కుపైగా లీకేజీలు ఏర్పడ్డాయి. వాటిని సరిచేయాలని రైతులు సర్కారుకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చంద్రఘడ్ ప్రధాన పథకం నుంచి చంద్రఘడ్, ధర్మాపురం, నందిమళ్ల, మస్తీపురం, నందిమళ్ల క్రాస్‌రోడ్డు, కిష్టంపల్లి, ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల, చింతరెడ్డిపల్లి గ్రామాల్లోని 5వేల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం కాగా... లీకేజీలతో ఒక్క పంటకూ నీరందలేదు. నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి పథకాల్లోనూ ఎకరాకు నీరందించలేకపోయారు. -
ఆపిల్‌కు బ్యాడ్ న్యూస్
కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లతో మార్కెట్లను ఏలాలనుకుంటున్న ఆపిల్‌కు షాకింగ్ న్యూస్ వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో స్మార్ట్‌వాచ్‌ల సరుకు రవాణా 51.6 శాతం పడిపోయాయి. వీటిలో ఎక్కువగా ఆపిల్, లెనోవా స్మార్ట్‌వాచ్‌ల షిప్‌మెంట్లే క్షీణించినట్టు తాజా రిపోర్టులు వెల్లడించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల మూడో త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌వాచ్‌ల షిప్మెంట్లు 2.7 మిలియన్ యూనిట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 5.6 మిలియన్ యూనిట్లగా స్మార్ట్‌వాచ్ షిప్మెంట్లు రికార్డైన సంగతి తెలిసిందే. సోమవారం ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఈ రిపోర్టు విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ వర్తకంలో మార్కెట్ షేర్లో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ల షిప్మెంట్ దాదాపు 71.6 శాతం కిందకు దిగజారినట్టు ఈ రిపోర్టు పేర్కొంది. అయితే ఆపిల్ వాచ్‌ల్లో కొత్త వెర్షన్ , అప్‌కమింగ్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం వినియోగదారులు వేచిచూస్తున్నారని, అందుకే కంపెనీ షిప్మెంట్లు పడిపోయినట్టు ఐడీసీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆపిల్ వాచ్‌ల కొత్త లుక్‌ను ఆ కంపెనీ విడుదల చేసినప్పటికీ, సెప్టెంబర్ చివరిలో విడుదలైన రెండో తరం వాచ్‌ల ఆవిష్కరణకూ ఈ న్యూ లుక్ మార్కెట్లోకి అందుబాటులోకి రాకపోవడాన్ని విశ్లేషకులు ఈ క్షీణతకు కారణంగా పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ వేర్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలను గూగుల్ ఆపివేయడం కూడా ఈ తగ్గుదలకు ఓ కారణమే అంటున్నారు. స్మార్ట్‌వాచ్‌ల సరుకు రవాణాలో ఆపిల్ క్షీణించినప్పటికీ, మార్కెట్ షేర్లో ఇప్పటికే ఈ కంపెనీ ముందంజలోనే ఉంది. 1.1 మిలియన్ యూనిట్లు విక్రయంతో 41 శాతం మార్కెట్ షేరును సొంతంచేసుకుంది. అయితే స్మార్ట్‌వాచ్ విక్రయాల గణాంకాలను ఆపిల్ విడుదలచేయలేదు. 6లక్షల విక్రయాలతో గ్రామిన్ రెండో బ్రాండుగా, 14.4 శాతం మార్కెట్ షేరుతో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. -
చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్స్‌కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో (టైర్-2,3) స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో టైర్-1 పట్టణాల్లో అమ్మకాలు తగ్గాయని ఐడీసీ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్-1 పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్స్ విక్రయాల వాటా 26.4%గా నమోదయ్యింది. ఈ వాటా అంతకు ముందటి త్రైమాసికంలో 29.9 %గా ఉంది. -
టాప్ 5 నుంచి లెనోవా, షియామి ఔట్
వాషింగ్టన్ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో చైనా హవా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిస్థితి కొంచెం భిన్నంగా మారినా తన బలాన్ని మాత్రం నిరూపించుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్-5లో నిలిచిన ఫోన్లలో మూడు స్థానాలను మళ్లీ చైనావే కైవసం చేసుకుంది. అయితే అంతకముందు టాప్-5లో ఉన్న లెనోవా, షియోమిలు మాత్రం తమ స్థానాలను కోల్పొయాయి. కొత్తగా స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి ప్రవేశించిన ఒప్పో, వివోలు వాటి స్థానాలను దక్కించుకున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా చైనావే కావడం విశేషం. ఐడీసీ నిర్వహించిన సర్వేలో 2016 మొదటి త్రైమాసికంలో శ్యామ్ సంగ్ మొదటిస్థానంలో నిలవగా, యాపిల్ రెండో స్థానంలో, హ్యువాయ్ మూడో స్థానంలో నిలిచాయి. 4.5 శాతంతో శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను ఏలుతుండగా, 15.3శాతం మార్కెట్ షేరును మాత్రమే యాపిల్ కలిగిఉందని సర్వే వెల్లడించింది. హ్యువాయ్ అమ్మకాలు 58 శాతం పెరిగి, 8.2 శాతం మార్కెట్ షేరును కల్గిఉందని సర్వే గుర్తించింది. కొత్తగా వచ్చిన ఒప్పో, వివో కంపెనీ స్మార్ట్ ఫోన్ లు చైనీస్ మార్కెట్ తోపాటు బయట మార్కెట్లోకి ఎక్కువగా విస్తరిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఇలా వాటి షేరును పెంచుకోవడం వల్లనే లెనోవా,షియోమిలకు గట్టి పోటీని ఇచ్చి, వెనక్కి నెట్టేశాయని సర్వే తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమే ఉందని, 334.9మిలియన్ సరుకు రవాణా జరుగుతుందని ఐడీసీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. -
సగం అమ్మకాలు 4జీ ఫోన్లవే
అక్టోబర్ అమ్మకాలపై ఐడీసీ వెల్లడి న్యూఢిల్లీ: 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా ఉన్నాయి. అక్టోబర్‌లో మొత్తం 93 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడవగా, వీటిల్లో సగానికి పైగా 4జీ ఆధారిత మొబైల్ ఫోన్లేనని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఐడీసీ వివరాల ప్రకారం.., * ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం కోటికి పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. * భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా ఆన్లైన్లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 12% పెరి గాయి. దీంతో సెప్టెంబర్‌లో 34 శాతంగా ఉన్న మొబైల్ ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ అమ్మకాలు అక్టోబర్‌లో 41%కి పెరిగాయి. * 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు అక్టోబర్‌లో 26% పెరిగాయి. పలు కంపెనీలు 3జీ స్మార్ట్ఫోన్ల స్థానంలో 4జీ స్మార్ట్ఫోన్లను తెస్తుండటం దీనికి ప్రధాన కారణం. నవంబర్‌లో కూడా ఇదే స్థాయి అమ్మకాలు జరగవచ్చు. * శామ్సంగ్, లెనొవొ కంపెనీల అమ్మకాలు బాగా పెరిగాయి. -
జనవరి నుంచి కొత్త ప్రాజెక్టుల పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించేలా అధికారులు సిద్ధం కావాలని మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ, భూసేకరణ, సహాయ పునరావాసం వంటి వాటినన్నింటినీ పూర్తిచేసి జనవరిలో పనులు ప్రారంభించాలని సూచించారు. గురువారం సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) కార్యాలయంలో ప్రాజెక్టుల వారీగా అధికారులతో మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రాణహితలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణంపై స్పష్టత రావడంతో అక్కడ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి కోసం ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు భూసేకరణ సర్వేలో రెవెన్యూశాఖ సహకరించడం లేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. వెంటనే రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషికి హరీశ్‌రావు సూచించారు. ఫిబ్రవరి రెండో వారానికి పాలమూరు టెండర్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటే మారిన ప్రణాళికకు అనుగుణంగా డిండి ఎత్తిపోతల సర్వే, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్ అంచనాలకు అనుగుణంగా డీపీఆర్ సైతం త్వరగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దుమ్ముగూడెంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఫీచర్ ఫోన్లదే హవా!
విదేశాలనుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారత్‌లో బాగా తగ్గుతున్నాయి. దేశీయంగా మొబైల్ కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను విక్రయించడమే ఇందుకు కారణంగా కనపడుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో త్వరిత గతిన విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇండియాలో మాత్రం తగ్గుతోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మూడంకెల వృద్ధిని సాధించిన ఇండియా, రెండో త్రైమాసికంలో మాత్రం 84 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోకోటి 84 లక్షల ఫోన్లు భారత్‌కు దిగుమతి అయ్యాయని ఐడిసి అనే రీసర్చ్ సంస్ధ తెలిపింది. అదే జనవరి-మార్చి త్రైమాసికంలో మాత్రం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 186 శాతం పెరిగి కోటి 76 లక్షలుగా నమోదయ్యాయి. ఇందులో కొరియాకు చెందిన శాంసంగ్ 29 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. 18 శాతంతో మైక్రోమాక్స్, ఎనిమిది శాతంతో కార్బన్, ఆరు శాతంతో లవా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ల మార్కెట్ ఇప్పటికీ 71 శాతం ఉన్నందు వల్ల దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధికి అవకాశాలు హెచ్చుగా ఉన్నట్టు ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ దిగుమతులుపై చైనా నుంచి వచ్చే హ్యాండ్సెట్స్ భారీగా దెబ్బేస్తున్నాయి. అదీకాక మోజిల్లా లాంటి కంపెనీలు దిగువ స్థాయి మార్కెట్ టార్గెట్‌గా హ్యాండ్సెట్లు విడుదల చేయనుండడం వల్ల రానున్న రోజుల్లో దేశీయ కంపెనీల స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరగనున్నాయి. మొత్తం మీద దేశీయ స్మార్ట్ ఫోన్ దెబ్బకు విదేశీ బ్రాండ్స్ కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ** -
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ హవా
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాల వృద్ధి జోరు బలహీనంగా ఉందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వేగంగా వృద్ధిచెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వృద్ధి గత ఏడాది మొదటి మూడు నెలల్లో మూడంకెల్లో ఉండగా, ఈ ఏడాది 84 శాతంగానే ఉందని ఐడీసీ తాజా నివేదిక వెల్లడించింది. మరిన్ని వివరాలు... గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి కోటికి పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే కాలానికి 1.84 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 29 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(18 శాతం), కార్బన్ (8 శాతం), లావా(6 శాతం) ఉన్నాయి. ఈ వృద్ధిరేట్లను పరిగణనలోకి తీసుకుంటే, ఈ కంపెనీల స్థానాలు మారే అవకాశం ఉంది. మరిన్ని చౌక ధరల స్మార్ట్ఫోన్లను అందించాల్సిన అవసరం శామ్సంగ్కు ఉంది. అంతేకాకుండా అమ్మకాల వృద్ధి జోరును కొనసాగించాలంటే హై ఎండ్ కేటగిరిలో యాపిల్ వంటి బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌ను అందించాల్సి కూడా ఉంది. మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఫీచర్ ఫోన్ల విక్రయాల వాటా 71 శాతంగా ఉంది. ఫీచర్ ఫోన్లు కొనుగోళ్లు చేసినవాళ్లు ఆ తర్వాత స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో స్మార్ట్ఫోన్ల మార్కెట్ వృద్ధి జోరుగా ఉండొచ్చు. రానున్న పండుగల సీజన్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారీగా పెరగవచ్చు. చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రానుండడం, ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ కానుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్ఫోన్లు భారీగా అమ్ముడవుతున్నాయి. పలు చైనా కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుండడం, మోజిల్లా సంస్థ అందుబాటు ధరల కేటగిరి స్మార్ట్ఫోన్ల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు ఢోకా లేదు. -
చౌక స్మార్ట్ఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. భారీ సంఖ్యలో భారతీయులు ఫీచర్ల ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే దీనికి కారణమని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఈ ఏడాది భారత్‌లో 8 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ము డవుతాయి. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని విశేషాలు..., పలు కంపెనీలు చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లనందిస్తున్నాయి. దీంతో ఫీచర్ ఫోన్లకు, స్మార్ట్ఫోన్లకు మధ్య ధర వ్యత్యాసాలు తగ్గుతుండటంతో పలువురు స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రానున్న ఐదేళ్లలో 40 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఈ కాలానికి ఈ విక్రయాలు 186 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. చైనాలో ఈ వృద్ధి 31 శాతంగానే ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి మొత్తం మొబైల్ ఫోన్ల విక్రయాలు 1 శాతం పెరగ్గా, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 10 శాతం క్షీణించాయి. గత ఏడాది చివరి మూడు నెలల కాలం అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్ల విక్రయాలు 18 శాతం తగ్గాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాలు మాత్రం 61.4 లక్షల నుంచి 17 శాతం వృద్ధితో 1.75 కోట్లకు పెరిగాయి. వినియోగదారులు స్మార్ట్ఫోన్లకు ప్రాధాన్యత ఇస్తుండడం, ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతున్నాయి. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విస్తరణ 10 శాతంలోపే ఉంది. తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు లభ్యమవుతుండడం, అమ్మకాల పెంపుపై పెద్ద పెద్ద కంపెనీలు దృష్టి సారించడం వంటి కారణాల వల్ల స్మార్ట్ఫోన్ల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 200 డాలర్లలోపు స్మార్ట్ఫోన్ల విక్రయాలు 78 శాతంగా ఉన్నాయి. ఇక స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్దే హవా. అందుబాటు ధరల్లో విండోస్ ఓఎస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుండటంతో విండోస్ ఓఎస్ వాటా కూడా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో శామ్సంగ్ 35 శాతం మార్కెట్ వాటా సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(15%), కార్బన్(10%), లావా(6%), నోకియా (4శాతం)లు ఉన్నాయి. -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు @ 100 కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ అమ్మకాలు గతేడాదిలో వంద కోట్లకు పైగా చేరాయి. భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరల్లో లభించే స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఐడీసీ వెల్లడించింది. ఐడీసీ తెలిపిన వివరాల ప్రకారం..., ఒక ఏడాది కాలంలో వంద కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడవడం ఇదే మొదటిసారి. గతేడాది మొత్తం 100.42 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 2012 అమ్మకాల(72.53 కోట్ల)తో పోల్చితే 38 శాతం వృద్ధి నమోదైంది. కాగా 2011లో 49.44 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. కేవలం రెండేళ్లలో ఈ విక్రయాలు రెట్టింపయ్యాయి. గతేడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 28.44 కోట్లు స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 2012 ఇదే క్వార్టర్‌కు అమ్ముడైన స్మార్ట్ఫోన్లు(22.9 కోట్లు)తో పోల్చితే 24 శాతం వృద్ధి నమోదైంది. 2012లో 42 శాతంగా ఉన్న మొత్తం ఫోన్ల విక్రయాల్లో స్మార్ట్ఫోన్ల వాటా 2013లో 55 శాతానికి పెరిగింది. పెద్ద స్క్రీన్ ఉండడం, తక్కువ ధరల్లో లభ్యం కావడం... ఈ రెండు అంశాలు స్మార్ట్ఫోన్ల విక్రయాల జోరుకు ప్రధాన కారణాలు. భారత్, చైనా దేశాల్లో 150 డాలర్లు(రూ.9,000)లోపు స్మార్ట్ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్, హువాయ్, లెనొవొ, ఎల్జీ కంపెనీలున్నాయి. మొత్తం 31.39 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించి 31 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్(15.34 కోట్ల ఫోన్లు, 15 శాతం మార్కెట్ వాటా), హువాయ్(4.88 కోట్లు-5 శాతం మార్కెట్ వాటా)లు నిలిచాయి. -
100 కోట్లకు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు..
న్యూయార్క్: స్మార్ట్ఫోన్ల హవా జోరుగా ఉంది. ఈ ఏడాది వంద కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. చౌక ఆండ్రాయిడ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండడం, మొబైల్ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో ఖరీదైన స్మార్ట్ఫోన్లనందించడం వంటి అంశాల కారణంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలు వంద కోట్లకు పెరగవచ్చని పేర్కొంది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.., ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌కు 21.62 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమవగా, ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 23.79 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 25.84 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. ఒక్క క్వార్టర్లో ఈ స్థాయి అమ్మకాలు జరగడం రికార్డ్. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే 39 శాతం వృద్ధి నమోదైంది. మొబైల్ కంపెనీలు అధునాతన ఫీచర్లతో మరిన్ని స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుండటంతో ఈ ఏడాది చివరి క్వార్టర్లోనూ రికార్డుల మోత మోగనుంది. గత ఏడాది క్యూ3లో 44.27 కోట్లుగా ఉన్న మొత్తం మొబైల్స్ అమ్మకాలు(స్మార్ట్ఫోన్లతో సహా)ఈ ఏడాది క్యూ3లో 6% వృద్ధి చెంది 46.79 కోట్లకు చేరాయి. ఇవి ఒక క్వార్టర్‌కు సంబంధించి రికార్డ్ అమ్మకాలు.