భారత్‌లో నెంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ స్థాయికి చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి షావోమి చేరుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో టాప్ స్లాట్‌లోకి షావోమి కూడా చేరుకున్నట్టు రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఏడాది మూడో క్వార్టర్‌లో 9.2 మిలియన్ స్మార్ట్‌ఫోన్ల రవాణాతో షావోమి మార్కెట్ షేరు 23.5 శాతంగా నమోదైంది. దేశంలో అత్యంత వేగవంతంగా దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండులల్లో షావోమి కూడా ఉందని, ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో కంపెనీ వృద్ధి రేటు కనీసం 300 శాతం(ఏడాది ఏడాదికి)గా ఉన్నట్టు ఐడీసీ తన క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్, క్యూ3 2017లో మంగళవారం పేర్కొంది. శాంసంగ్ సీక్వెన్షియల్‌గా(క్వార్టర్ క్వార్టర్‌కు) 39 శాతం వృద్ధిని నమోదుచేయగా.. ఏడాది ఏడాదికి 23 శాతం వృద్ధిని నమోదుచేసింది. శాంసంగ్ మార్కెట్ వాల్యులో 60 శాతం దాన్ని కీమోడల్స్ గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 నెక్ట్స్, గెలాక్సీ జే7 మ్యాక్స్‌లున్నాయి.
షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి నోట్4 నిలిచింది. ఈ క్వార్టర్‌లో నాలుగు మిలియన్ల రెడ్‌మి నోట్4 యూనిట్లను షావోమి రవాణా చేసింది. వచ్చే క్వార్టర్‌లలో శాంసంగ్, షావోమి రెండు తమ ఛానల్స్‌ను మరింత బలోపేతం చేసుకుంటాయని, తీవ్రమైన పోటీకర స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లీడర్‌షిప్ కోసం ఈ రెండు కంపెనీలు పోటీ పడనున్నాయని ఐడీసీ ఇండియా సీనియర్ అనాలిస్ట్ ఉపాసన జోషి చెప్పారు. షావోమికి వెబ్‌సైట్ ద్వారా నమోదవుతున్న విక్రయాలు అధికంగా ఉన్నాయి. మొత్తంగా ఆన్‌లైన్ ఛానల్ ద్వారా వచ్చే షేరు 32 శాతం నుంచి 37 శాతం పెరిగింది. భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన మూడేళ్లలోనే ఎక్కడా చూడనంత వృద్ధిని చూశామని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, షావోమి వైస్‌ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. అతి తక్కువ సమయంలో అన్ని రంగాల్లోనూ మార్కెట్ లీడర్‌గా నిలిచిన తొలి బ్రాండు తమదేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment