సగం అమ్మకాలు 4జీ ఫోన్లవే
అక్టోబర్ అమ్మకాలపై ఐడీసీ వెల్లడి
న్యూఢిల్లీ: 4జీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు జోరుగా ఉన్నాయి. అక్టోబర్‌లో మొత్తం 93 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవగా, వీటిల్లో సగానికి పైగా 4జీ ఆధారిత మొబైల్ ఫోన్లేనని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఐడీసీ వివరాల ప్రకారం..,
* ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం కోటికి పైగా స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి.
* భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 12% పెరి గాయి. దీంతో సెప్టెంబర్‌లో 34 శాతంగా ఉన్న మొబైల్ ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్ అమ్మకాలు అక్టోబర్‌లో 41%కి పెరిగాయి.
* 4జీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు అక్టోబర్‌లో 26% పెరిగాయి. పలు కంపెనీలు 3జీ స్మార్ట్‌ఫోన్ల స్థానంలో 4జీ స్మార్ట్‌ఫోన్లను తెస్తుండటం దీనికి ప్రధాన కారణం. నవంబర్‌లో కూడా ఇదే స్థాయి అమ్మకాలు జరగవచ్చు.
* శామ్‌సంగ్, లెనొవొ కంపెనీల అమ్మకాలు బాగా పెరిగాయి.