100 కోట్లకు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు..
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్ల హవా జోరుగా ఉంది. ఈ ఏడాది వంద కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. చౌక ఆండ్రాయిడ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండడం, మొబైల్ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లనందించడం వంటి అంశాల కారణంగా స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు వంద కోట్లకు పెరగవచ్చని పేర్కొంది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం..,
- ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌కు 21.62 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయమవగా, ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 23.79 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి.
- ఇక ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 25.84 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయమయ్యాయి. ఒక్క క్వార్టర్‌లో ఈ స్థాయి అమ్మకాలు జరగడం రికార్డ్. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే 39 శాతం వృద్ధి నమోదైంది.
- మొబైల్ కంపెనీలు అధునాతన ఫీచర్లతో మరిన్ని స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుండటంతో ఈ ఏడాది చివరి క్వార్టర్‌లోనూ రికార్డుల మోత మోగనుంది.
-
గత ఏడాది క్యూ3లో 44.27 కోట్లుగా ఉన్న మొత్తం మొబైల్స్ అమ్మకాలు(స్మార్ట్‌ఫోన్‌లతో సహా)ఈ ఏడాది క్యూ3లో 6% వృద్ధి చెంది 46.79 కోట్లకు చేరాయి. ఇవి ఒక క్వార్టర్‌కు సంబంధించి రికార్డ్ అమ్మకాలు.