ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది.
ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్‌ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్‌లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్‌లలో అలాగే ఉంటుంది.
ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి?
ఆటో ఆర్కైవ్ అనేది యాప్‌ను పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్‌ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్‌లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది.
అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్‌లు కూడా ఫోన్‌లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్‌ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్‌లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే.
ఎలా పనిచేస్తుంది?
ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్‌ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్‌లను గుర్తించి ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది.
గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్‌ని ఉపయోగించి రూపొందించిన యాప్‌లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్‌ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్.
Comments
Please login to add a commentAdd a comment