కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లే వెబ్‌క్యామ్‌లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్‌నే గూగుల్ (Google) తీసుకొస్తోంది.
ఆన్‌లైన్ మీటింగ్‌లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లకు ఉపయోగించే వెబ్‌క్యామ్‌లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది.
ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా..
గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్‌కెమెరా ఫీచర్‌ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు.
ఇలా పని చేస్తుంది..
ఆండ్రాయిడ్ ఫోన్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్‌క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్‌క్యామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్‌లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్‌స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్‌లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment