మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అందులో మీరు ఏ టైపింగ్ కీ బోర్డ్ వినియోగిస్తున్నా..వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే? ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల స్విప్ట్‌కీబోర్డ్‌లో బింగ్ చాట్‌బాట్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ కీబోర్డ్ వినియోగం యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా, మీరు ఎవరికైనా పంపాలనుకున్న టెక్ట్స్‌ను రీరైట్ చేయడం కానీ, లేదంటే టెక్ట్స్‌తో పాటు ఇతర సమాచారం కావాలంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ సందర్భంగా స్విఫ్ట్‌కీకి బింగ్ చాట్ ఏఐని ఇంటిగ్రేట్ చేయడంపై మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పెడ్రామ్ రెజాయ్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల కోసం మైక్రోసాఫ్ట్ కీబోర్డ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. యూజర్లు పదాలు, ఎమోజీలతో సహా టైప్ చేసే విధానానికి అనుగుణంగా ఉండే కీబోర్డ్‌లను అభివృద్ది చేశామన్నారు. దీంతో పాటు అక్షరదోషాలుంటే హైలెట్ చేయడం లేదంటే అక్షరదోషాలను సరిద్దిడం వంటి పీచర్లు ఈ కీబోర్డ్‌లో ఉన్నాయని అన్నారు.
కావాలంటే మీరూ ఆ కీబోర్డ్ పనితీరు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే స్విఫ్ట్ కీబోర్డ్‌ను మీ ఫోన్‌లలో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం!
Comments
Please login to add a commentAdd a comment