Keyboard
-
పిలిచి మరీ ఉద్యోగం ఇస్తానంటే ఇలా చేస్తారా?.. రిక్రూటర్‌కు చిర్రెత్తి..
నేను పిలిచి జాబిస్తానంటే ఇలా చేస్తారా? అంటూ ఓ ఉద్యోగిపై అప్పుడే ఇంటర్వ్యూ చేసిన రిక్రూటర్ (recruiter) అసహనానికి గురయ్యాడు.ఆ తర్వాత ఏం చేశాడంటే?లండన్‌కు చెందిన ఓ రిక్రూటర్ లింక్డిన్ (LinkedIn)లో ఓ పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్‌లో తన పగిలిపోయిన కీబోర్డును షేర్ చేస్తూ..చివరి క్షణంలో అభ్యర్థి జాబ్ ఆఫర్‌ను తిరస్కరించాడు. దీంతో కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే ఈ కీబోర్డును పగులగొట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? లింక్డిన్ పోస్ట్ ప్రకారం..రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ ఏతాన్ మూనీ (Ethan Mooney) ఇటీవల ఓ అభ్యర్థికి రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమైంది. కన్ఫామ్ అయితే జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిక్రూటర్.. అభ్యర్థికి రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసేందుకు ఉదయం 9:30 గంటలకు షెడ్యూల్ సిద్ధం చేశారు.సమయం 9:30 దాటింది. కానీ అభ్యర్థి ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు. అరంగంటైంది. రిక్రూటర్లో అసహనం ఎక్కువైంది. సరిగ్గా ఆ సమయంలో సదరు రిక్రూటర్‌కు ఓ మెసేజ్ వచ్చింది. సారీ సార్.. ‘నేను మీకు కంపెనీ ఇంటర్వ్యూకి రావడం లేదు. నాకు వేరే సంస్థలో ఉద్యోగం వచ్చింది. మీ జాబ్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నాను థ్యాంక్యూ’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో రిక్రూటర్‌కు చిర్రెత్తి పక్కనే ఉన్న కంప్యూటర్ కీబోర్డును పగుల గొట్టాడు. నిజం చెప్పాలంటే, ఆ సమయంలో నాకు ఈ కీబోర్డు కనిపించలేదు. రిక్రూటర్లు.. ఉద్యోగార్థుల గురించి పట్టించుకోరు అని ఎవరైనా అంటారు? అని కామెంట్ చేస్తూ పగిలిన కీబోర్డు ఫొటోల్ని షేర్ చేశారు. ఈ ఘటన నెట్టింట్లో చర్చకు దారి తీసింది. కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో అభ్యర్థి రాకపోతే హైరింగ్ ప్రాసెస్‌లో తలెత్తే ఇబ్బందుల్ని ప్రశ్నిస్తుంటే మరికొందరు..రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ ఏతాన్ మూనీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. -
కస్టమర్లకు భారీ పరిహారం చెల్లిస్తున్న యాపిల్..
-
Lok sabha elections 2024: ‘రీడ్ ద లెటర్ బిట్వీన్’
ఇదేదో పజిల్లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కీబోర్డును మీదున్న అక్షరాలతో ఈ ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నాయి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు. అదెలా అంటే.. నేను.. ‘‘వికసిత్ భారత్ కోసం ఎవరు ఓటు వేయనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కీబోర్డులోని యూ అండ్ ఓ మధ్య ఉన్న లెటర్‌ను బిగ్గరగా చదవండి’’ అని భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ రెండు లెటర్స్ మధ్యనున్న అక్షరం ‘ఐ’. ఆ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ ‘ఐ’ అంటారు. సో... వారంతా తాము బీజేపీకి ఓటు వేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసినట్టేనని బీజేపీ భావిస్తోంది. మేము..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ ట్రెండ్‌నే అనుసరిస్తోంది. ‘‘నియంత నరేంద్ర మోదీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? కీబోర్డులో క్యూ, ఆర్ మధ్య ఉన్న లెటర్స్‌ను చదవండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇక్కడ క్యూ, ఆర్ మధ్య ఉన్నది డబ్ల్యూ, ఈ.. రెండక్షరాలను కలిపితే ‘మేము’ అనే అర్థం వస్తుంది. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని సందేశాన్నిచ్చేలా ఆప్ వైరల్ చేస్తోంది. పోలీసులు సైతం.. ఈ రెండు పార్టీలిలా ఉంటే.. సురక్షితమైన డ్రైవింగ్ గురించి అవగాహన కలి్పంచేందుకు ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ‘‘డ్రైవింగ్ చేస్తూ మీరు కీ బోర్డును చూస్తే.. క్యూ అండ్ ఆర్ మధ్యలో లెటర్స్ (డబ్ల్యూ, ఈ) చలాన్‌తో మిమ్మల్ని కలుస్తాయి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. అంటే మీరు కీబోర్డు చూస్తే వి (మేము) చలాన్ వేస్తామని అర్థమన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేస్తోంది!
సోషల్ మీడియాలో క్రియేటివిటీ తారాస్థాయికి చేరుకుంటోంది. గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ.. అది ఏ కోణంలో ఉన్నాసరే నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ను కుదిపేస్తున్న ఓ లేటెస్ట్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం.లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డు..look between on your keyboard సోషల్ మీడియాను ప్రస్తుతం ఊపేస్తున్న ట్రెండ్. కొత్తదేం కాకపోయినా.. ప్రస్తుతం దీనిని తెగ వాడేస్తున్నారంతా. వివిధ నగరాల పోలీసులు, ఐపీఎల్ జట్లు, ఫుడ్ యాప్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఈ ట్రెండ్‌లో భాగం అయ్యాయి. మరోవైపు.. ఎన్నికల వేళ రాజకీయపార్టీలు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నాయి. Wanna know what their favourite key is? 👀Look between 5 & 7 on your keyboard 😋 pic.twitter.com/GRbD9aLOAr— SunRisers Hyderabad (@SunRisers) April 23, 2024 Who’s whistling today? 🥳Check your keyboard between Q and R!⌨️#CSKvLSG #WhistlePodu 🦁💛@msdhoni pic.twitter.com/GFqamYkcZk— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024 Curious to know who will support CM YS Jagan in doubling the growth of Andhra Pradesh?Just read the letters between Q and R on your keyboard!— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 Applicant: "I want to break the record for the longest time without sleep!!"Us: Look between T and U on your keyboard— Guinness World Records (@GWR) April 23, 2024 సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అర్థమైతే సరే సరి. కొందరైతే ఈ పోస్టులకు అర్థమేంటో తెలుసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. మరి లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డు ట్రెండ్ గురించి తెలియని వాళ్ల కోసం.. ఈ ట్రెండ్ అసలు ఎక్కడ మొదలైందంటే.. ఇంగ్లీష్ ఆల్పాబెట్స్ కీ బోర్డు బేస్ చేసుకుని పుట్టిందే ఈ ట్రెండ్. 2021లో 4Chan అనే వెబ్సైట్ ఈ ట్రెండ్‌ను ఆరంభించింది. కాన్(K-ON) అనే యానిమేటెడ్ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి ఈ ట్రెండ్‌ను ఉపయోగించారు. లుక్ బిట్వీన్ T అండ్ O అంటూ ‘YUI’(యూఈ) అనే పాత్రను పరిచయం చేశారు. అయితే ఆ తర్వాత ఈ ట్రెండ్ అంతగా ప్రాచుర్యంలో లేకుండా పోయింది. ఇప్పుడు భారతీయుల దెబ్బకు మళ్లీ తెర మీదకు వచ్చేసింది.ఈ ట్రెండ్‌లో.. ఉదాహరణకు.. లుక్ బిట్వీన్ H అండ్ L ఆన్ యువర్ కీ బోర్డు అన్నారనుకోండి. మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్ ‘JK’ ఉంటాయి. షార్ట్ కట్లో దానికి జస్ట్ కిడ్డింగ్ అనే అర్థం ఉంది.ఇక.. ఇంటర్వ్యూయర్ చూపు ఎప్పుడూ X అండ్ B మధ్య ఉంటుందని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ రెండు లెటర్స్ మధ్య కీబోర్డులో ఉండేది CV(కరికులమ్ విటే-రెజ్యూమ్). ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు సరదా సరదా పోస్టులు పెడుతున్నారు. దీంతో మీమ్స్ స్థాయికి దాకా చేరుకుంది. look between Y and P on your keypad. pic.twitter.com/v9klSewlKS— Xavier Uncle (@xavierunclelite) April 23, 2024 Opening Twitter app and watching people here talk like look in keyboard betweenH and LY and OQ and RX and VZ and CE and YF and HI and P pic.twitter.com/kPtJKOybhb— Nabeel Shah (@nabeel_AMU) April 23, 2024 -
ఐఫోన్ల కోసం ఓ కీబోర్డ్.. అదెలా పనిచేస్తుందంటే?
స్మార్ట్‌ఫోన్‌లోని టచ్‌స్క్రీన్ కీబోర్డు మీద టైప్‌చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్‌ఫోన్‌కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్ కంపెనీ క్లిక్స్ టెక్నాలజీ రూపొందించింది. తొలిప్రయత్నంగా ఐఫోన్–15 మోడల్‌కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్‌రైటర్, డెస్క్‌టాప్, లాప్టాప్ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో సులువుగా టైప్ చేయడానికి వీలవుతుంది. ఈ ఏడాది లాస్ వేగస్‌లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. -
Love Proposal: ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్
ప్రేమ అనేది మధురానుభూతి. ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానో, బహుమతుల ద్వారానో, సర్‌ప్రైజ్‌లతోనే వెరైటీగా లవ్ ఎక్ప్రెస్ చేస్తుంటారు. ఇంకొందరు అబ్బాయిలైతే సినిమా హీరోల్లా తమ ప్రేయసికి ప్రపోజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం డిఫరెంట్‌గా ప్రపోజ్ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. దీంతో వీరి ప్రేమకథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు బోలెడన్ని లవ్ ప్రపోజల్స్ గురించి విన్నాం,చూశాం. కానీ ఓ యువకుడు ఇంకాస్త వెరైటీగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేయసి కోసం ప్రత్యేకంగా ఓ కీబోర్బ్నే డిజైన్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ‘బీ మై గర్ల్ ఫ్రెండ్ సెయాంగ్?’ ( Be my girlfriend Seyang ) అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు.ఈ వినూత్న ప్రపోజల్‌కి ఆ యువతి ఫిదా అవ్వడమే కాక, ఆనందంతో ఎగిరి గంతేసింది. 'నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను' అంటూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరి ప్రేమ కహానీ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. i’ll never shut up about this, he proposed me to be his girlfriend with a keyboard. https://t.co/G8GDpsD62z pic.twitter.com/iPbCZ1zEdA — 에이미 (@amymaymacc) April 29, 2023 -
మీ ఫోన్లో ఈ కీబోర్డ్‌ను ఇన్ స్టాల్ చేసుకున్నారా?, చాట్‌జీపీటీతో పాటు!
మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అందులో మీరు ఏ టైపింగ్ కీ బోర్డ్ వినియోగిస్తున్నా..వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే? ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల స్విప్ట్కీబోర్డ్లో బింగ్ చాట్‌బాట్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కీబోర్డ్ వినియోగం యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా, మీరు ఎవరికైనా పంపాలనుకున్న టెక్ట్స్‌ను రీరైట్ చేయడం కానీ, లేదంటే టెక్ట్స్‌తో పాటు ఇతర సమాచారం కావాలంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా స్విఫ్ట్కీకి బింగ్ చాట్ ఏఐని ఇంటిగ్రేట్ చేయడంపై మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పెడ్రామ్ రెజాయ్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ కీబోర్డ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. యూజర్లు పదాలు, ఎమోజీలతో సహా టైప్ చేసే విధానానికి అనుగుణంగా ఉండే కీబోర్డ్లను అభివృద్ది చేశామన్నారు. దీంతో పాటు అక్షరదోషాలుంటే హైలెట్ చేయడం లేదంటే అక్షరదోషాలను సరిద్దిడం వంటి పీచర్లు ఈ కీబోర్డ్‌లో ఉన్నాయని అన్నారు. కావాలంటే మీరూ ఆ కీబోర్డ్ పనితీరు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే స్విఫ్ట్ కీబోర్డ్‌ను మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం! -
‘సరిగమప’ స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరికరాలను థాయ్‌లాండ్ నుంచి తక్కువ ధరకు సరఫరా చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.3.2 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. చాదర్‌ఘాట్‌కు చెందిన రాఘవేంద్ర చారి ‘కీ బోర్డు’ ఖరీదు చేసేందుకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దృష్టి నెప్టాల్ఇన్స్ట్రూమెంట్స్.కామ్ అనే సైట్‌పై పడటంతో అందులో వెతికారు. ఆ తర్వాత ఆ సైట్ నుంచి చస్ అమానీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన తమ కంపెనీ తక్కువ ధరకు ‘కీ బోర్డు’ విక్రయిస్తుందంటూ ఎర వేశాడు. ఆశపడిన రాఘవేంద్ర కొంత మొత్తం వారు సూచించిన ఖాతాలో వేశారు. కొన్ని రోజులు వేచి చూసినా తన వాద్య పరికరం రాకపోవడంతో వెబ్సైట్లో ఉన్న కంపెనీ ఫోన్ నెంబర్‌కు కాల్ చేశాడు. అవతలి వైపు నుంచి జార్జ్‌గా చెప్పుకున్న వ్యక్తి మాట్లాడుతూ తాము చస్ అమానీని ఆరు నెలల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించామని, మా సైట్ వల్ల నష్టపోయిన మీకు తక్కువ ధరకు కీబోర్డ్ అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడంతో రాఘవేంద్ర దాదాపు రూ.6 లక్షల విలువైన రెండింటిని బుక్ చేశారు. అడ్వాన్స్ చెల్లించాలంటూ జార్జ్ చెప్పడంతో కొంత డిపాజిట్ చేశారు. మిగిలిన సొమ్ము కీబోర్డ్స్ డెలివరీ అయిన తర్వాత ఇవ్వాలంటూ చెప్పాడు. బాధితుడికి ఓ బుకింగ్ ఐడీని సైతం ఇచ్చిన నేరగాళ్లు దీన్ని వినియోగించి తమ వెబ్సైట్ ద్వారా కీబోర్డ్ ఎక్కడి వరకు వచ్చాయో ట్రాక్ చేసుకోవచ్చని నమ్మించారు. ఓ దశలో ఢిల్లీ వరకు సరుకు వచ్చినట్లు ట్రాక్ అయింది. ఆపై ఢిల్లీలో కస్టమ్స్ క్లియెరెన్స్ లేకపోవడంతో డెలివరీ ఆగిందంటూ జార్జ్ ఫోన్ చేసి చెప్పి మరికొంత డిపాజిట్ చేయమన్నాడు. ఆపై నాగ్‌పూర్‌లో కస్టమ్స్ క్లియరెన్స్ అని చెప్పి మరికొంత మొత్తమ్మీద రూ.3.2 లక్షలు స్వాహా చేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. -
కీబోర్డును మడిచి జేబులో పెట్టుకోవచ్చు!
సియోల్: దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సరికొత్త కీబోర్డును తయారు చేశారు. మడతపెట్టి జేబులో పెట్టుకునే విధంగా తయారైన ఈ కీబోర్డును ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు అనుసంధానం చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తతం మార్కెట్ పలు రకాల కీబోర్డులు ఉన్నాయి. వాటిలో చాపలా చుట్టి వెంట తీసుకెళ్లగలిగేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు సౌత్ కొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కీబోర్డును ఎలాగైనా మడతపెట్టవచ్చు. ఈ కీబోర్డు కోసం శాస్త్రవేత్తలు మొదట ఓ సెన్సర్ షీట్‌ను తయారు చేశారు. అనంతరం దానిపై సిలికాన్ రబ్బర్‌తో చేసిన మరో షీట్‌ను అమర్చారు. ఈ రెండిటి మధ్య కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్‌ను అనుసంధానించారు. రబ్బర్ షీట్ పైభాగంలో కీబోర్డ్‌లోని బటన్స్‌ను సూచించేలా గడులు గీశారు. దీంతో ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని సూచిస్తుంది. మనం టైప్ చేసినప్పుడు వేళ్ల ద్వారా కలిగే ఒత్తిడి రబ్బర్షీట్ ద్వారా నానోట్యూబ్స్పై పడి అడుగున ఉన్న సెన్సర్ షీట్‌కు తగులుతుంది. అప్పుడు సెన్సార్లు ఏ అక్షరాన్ని టైప్ చేశామో గుర్తించి కంప్యూటర్‌కు పంపుతుంది. ఈ కీబోర్డ్ మిగతా కీబోర్డుల్లాగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక కీబోర్డును తయారు చేయడానికి కేవలం ఒక డాలర్ మాత్రమే ఖర్చవుతుందన్నారు. -
ఆపిల్ సరికొత్త వన్-హ్యాండ్ కీబోర్డు
-
వన్-హ్యాండ్ కీబోర్డు, యాక్టివేట్ ఎలా?
ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ మోడల్స్.. పాత ఐఫోన్లు అన్నింటి కంటే కూడా కాస్త పెద్దవే. రెండు చేతులను వాడుకపోతే, ఈ ఐఫోన్లలో టైప్ చేయడం చాలా కష్టం. కానీ ఒక్క చేతిని మాత్రమే వాడుతూ టైప్ చేసుకునేలా ఆపిల్ సరికొత్త కీబోర్డును తీసుకొచ్చింది. అయితే ఈ కీబోర్డు కోసం ఆపిల్ తాజాగా లాంచ్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో వన్-హ్యాండ్ కీబోర్డును యాక్టివేట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఇది యాక్సస్ అయిన తర్వాత కీబోర్డును స్క్రీన్‌పై ఎడమ లేదా కుడి వైపుకు మార్చుకోవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేయాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందేనట. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడం కోసం తొలుత యూజర్లు ఐఓఎస్11 సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్తో యాక్టివేట్ చేసుకున్న కీబోర్డుతో ఎడమ చేతిలో పట్టుకుని ఫోన్‌ను వాడుతుంటే, ఎడమ వైపు... కుడిచేతిలో పట్టుకుని వాడితే కుడి వైపుకు కీబోర్డును మార్చుకోవచ్చు. మామూలుగా మధ్యలో ఉంచుకుని కూడా కీబోర్డును వాడుకోవచ్చు. -
భారతీయులకు గర్వకారణం ఈ చిన్నారి
-
టచ్ చేయకుండా టైప్ చేయచ్చు
-
షేక్ స్సియర్ తరహా పదాలను వాడేయండి ఇలా..
లండన్: విలియమ్ షేక్ స్సియర్ కీ బోర్డు పేరుతో స్విఫ్ట్ కీ అనే టెక్నాలజీ సంస్థ రచయిత 400వ వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద ఆండ్రాయిడ్, ఐ ఓఎస్‌ల యాప్‌లను విడుదల చేసింది. షేక్ స్సియర్ మాదిరి పదాల వాడుకకోసం ప్రత్యేకంగా ఈ యాప్‌ను తయారు చేశామని వివరించింది. సంస్థకు చెందిన టెక్నిషన్లు షేక్ స్సియర్ రచనలన్నీ పూర్తిగా చదివిన తర్వాత యాప్‌ను తయారు చేసామని తెలిపింది. వినియోగదారులు పియర్ రచనల తరహా పదాలను ఇష్టం వచ్చినపుడు వాడుకునేలా యాప్‌ను డిజైన్ చేసింది కంపెనీ. యాప్‌లో ఉండే ప్రిడిక్టివ్ టెక్నాలజీ ఫేక్ టెక్ట్స్‌ను తయారుచేసుకుంనేదుకు సహాయపడుతుంది. స్విఫ్ట్ కీ సహ భాగస్వామి సారా రౌలీ మాట్లాడుతూ.. షేక్ స్సియర్ తన కొత్త భాషా పాటవంతో పాఠకులను అలరించారు. ఇప్పుడు ప్రజలందరూ ఆ భాషను తమ మొబైళ్లలో అందుకోవచ్చు. 'షేక్ స్పీక్' పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. -
సెన్సర్ కీబోర్డు
గాడ్జెట్ ఏదైనా మెయిల్ టైప్ చేయాలంటే కీబోర్డు తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే మౌస్ ఉండక తప్పదు. ఊహూ.. అక్కరలేదంటోంది జెస్ట్. కీబోర్డు ఉందనుకుని గాల్లో టైప్ చేసినా వాటిని కంప్యూటర్ తెరపై అక్షరాలుగా మార్చేస్తుందీ హైటెక్ గాడ్జెట్. ఫొటోలో చూపినట్లు నాలుగు వేళ్లకు తగిలించుకునే రింగ్‌లు, అరచేతిపై అమర్చుకునే పట్టీలతో కూడిన జెస్ట్‌లో యాక్సెలరోమీటర్లు, గైరోస్కోపులు, మాగ్నెటోమీటర్లు బోలెడు ఉంటాయి. ఇవన్నీ మన వేలి కదలికలను బట్టి అక్షరాలను అంచనావేసి స్క్రీన్‌పై చూపుతాయి. స్మార్ట్ఫోన్లలో మాదిరిగా ప్రిడిక్టివ్ టెక్ట్స్టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. తదనుగుణంగా మనం టైప్ చేసుకుంటూ కావాల్సిన పదాలను సెలెక్ట్ చేసుకుంటే సరి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హ్యాకథాన్‌లో రాత్రికిరాత్రి ఈ గాడ్జెట్ ప్రొటోటైప్‌ను తయారు చేసిన మైక్ ఫ్రిస్టర్ బృందం ఆ తరువాత అపోటాక్ట్ ల్యాబ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి జెస్ట్‌ను మరింత అభివృద్ధి చేసింది. వాణిజ్యస్థాయి తయారీకి నిధులు కావాలంటూ కిక్‌స్టార్టర్‌లో ప్రచారం చేపట్టడంతో దీని గురించి ప్రపంచానికి తెలిసింది. జెస్ట్ ఎక్స్‌బాక్స్ కైనిక్ట్ లేదా లీప్ మోషన్ మాదిరిగా పూర్తిగా వేలి కదలికలపై మాత్రమే ఆధారపడదని, మౌస్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసినట్లు... లేదా కీబోర్డ్ షార్ట్కట్ల తీరులో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు నిర్దిష్టమైన పని జరిగేట్టు కూడా పనిచేస్తుందని ఫ్రిస్టర్ అంటున్నారు. బ్లూటూత్ ఉన్న ఏ పరికరంతోనైనా జెస్ట్ పనిచేస్తుందని చెప్పారు. కిక్‌స్టార్టర్ ద్వారా అనుకున్నన్ని నిధులు సమకూరితే వచ్చే ఏడాదికల్లా జెస్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. -
కోపమొస్తే.. కీబోర్డుపైనే..
ఆఫీసులో బాస్ తిట్టాడు.. కోపమొచ్చింది.. చాలా మంది దాన్ని కీబోర్డుపై ప్రదర్శిస్తారు.. కొందరు అదేమైనా అయితే.. మళ్లీ మనకే బాధ అని కోపాన్ని దిగమింగేస్తారు. అలాంటోళ్ల కోసమే జర్మనీకి చెందిన బ్లెస్ అనే సంస్థ ఈ వర్కవుట్ కంప్యూటర్ను తెచ్చింది. ఇందులో వివిధ కీల స్థానంలో పంచ్బ్యాగులుంటా యి. కోపమొస్తే.. వాటిని ఎడాపెడా బాదేయడమే.. కోపం తీర్చుకోవడంతోపాటు అదే సమయంలో మీ పని కూడా చేసుకోవచ్చు. పంచ్బ్యాగుల్లో ఉండే సెన్సర్లు మీరే కీ ఉన్న పంచ్బ్యాగును కొడితే.. అది స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యేలా చేస్తాయి. అంటే.. డియర్ సార్ అని కొట్టాలంటే.. దానికి సంబంధించిన అక్షరాలు ఉన్న పంచ్బ్యాగులపై కొడితే.. అది స్క్రీన్‌పై ప్రింట్ అవుతుంది. ఇది ఒక్క కోపాన్ని తీర్చుకోవడానికే కాదు.. ఈ బిజీబిజీ జీవితంలో వర్కవుట్ చేయడం సాధ్యం కాని వారికి చక్కని కసరత్తునూ అందిస్తుంది. ఇటు వర్కవుట్ చేసుకోవచ్చు.. అటు ఆఫీసు పనీ పూర్తయిపోతుంది. -
గ్రామర్ చెకింగ్ కోసం...
ఇంగ్లిష్ రాయడంలో ఎన్నో అక్షరదోషాలు, వ్యాకరణ సంబంధమైన తప్పులు దొర్లుతూంటాయి. ఈ తప్పులేవీ లేకుండా చూసుకోవాలనుకుంటే జింజర్ పేజ్ అండ్ గ్రామర్ కీబోర్డు అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం వ్యాకరణం, అక్షరదోషాలు మాత్రమే కాకుండా ఈ అప్లికేషన్ సమానార్థకాలు, కొన్ని పదాలకు సంబంధించిన నిర్వచనాలు కూడా అందిస్తుంది. టెక్ట్స్‌ను మాటల్లో వినిపించేందుకూ పనికొస్తుంది. వాక్యాలను ఎలా అర్థవంతంగా తిరగరాయాలో కూడా సూచిస్తుంది. కామా, సెమీకోలన్ వంటి గుర్తులను ఎక్కడ ఉంచాలో కూడా పొందుపరిచారు. ఇంగ్లీషు భాషలోని సమాచారాన్ని దాదాపు 40 భాషల్లోకి తర్జుమా చేసేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఈమెయిల్, నోట్ వంటివాటిని చక్కటి ఇంగ్లీషులో పంపేందుకు, సోషల్‌మీడియాలో పంచుకునేందుకు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టండి మరి...! మెయిళ్లన్నీ ఒక్కదాంట్లో... మనలో చాలామందికి ఒకటికంటే ఎక్కువ ఈమెయిళ్లు ఉండటం సహజం. ప్రతిదాన్ని వేర్వేరుగా ఓపెన్ చేసుకుని మెయిళ్లు చదవడం బోర్ కొట్టిస్తూంటే స్మార్ట్‌ఫోన్‌లో మెయిల్వైజ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అన్నింటిని ఒకదగ్గరే చూసుకోవచ్చు. మెయిళ్లు పంపుకోవచ్చు కూడా. అంతేకాకుండా ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలోని అనవసరమైన క్యారెక్టర్లన్నింటినీ తొలగించి క్లీన్‌గా ఒక సంభాషణ క్రమంలో అమర్చడం కూడా ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ఇది పూర్తిగా క్లయింట్ సైడ్ అప్లికేషన్ కావడం వల్ల సమాచారం ఎక్కడో సెర్వర్లలో కాకుండా మీ ఫోన్లోనే స్టోర్ అవుతుంది. ఫలితంగా మన సమాచారం లీక్ అవుతుందని లేదా దుర్వినియోగం అవుతుందన్న బెంగ ఉండదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకోవడమూ సులువే. కాకపోతే యాక్టివేట్ చేసిన తొలి 24 గంటల్లో కొంచెం నెమ్మదిగా పనిచేస్తుందని, ఆ తరువాత వేగం పుంజుకుంటుందని డెవలపర్స్ అంటున్నారు. -
చేతి సైగల్ని పసిగట్టే కంప్యూటర్ కీబోర్డ్!
వాషింగ్టన్: కంపూటర్లు మన జీవితంలో భాగమైన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు గమనించాం. అంతేకాకుండా కంప్యూటర్ కీబోర్డుల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే తాజాగా ఓ కొత్త రకం కీబోర్డులను మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ గ్రూప్ రూపొందించింది. యూజర్ చేతుల ద్వారా చేసే సైగల్ని పసిగట్టి.. దానికి అనుగుణంగా ప్రవర్తించడమే నూతనంగా రూపొందించిన కీబోర్డు ప్రత్యేకత. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లో ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్స్ ను ఎంబెడ్ చేసి కీబోర్డుకు ప్రత్యేకతను చేకూర్చారు. కీ క్యాప్ ద్వారా ప్రతి సెన్సార్ లింక్ ట్రాక్ చేసి యూజర్ చేతి సైగల్ని పసిగడుతుందని మైక్రో సాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేతి కదలికలకు అనుగుణంగా స్పందిస్తుందని గిజ్ మ్యాగ్ తెలిపింది. పైకి, కిందకి, కుడి, ఎడమలకు కదిలే విధంగా... ఏదైనా చిత్రాన్ని జూమ్ చేయడం లాంటి కదలికలను పసిగడుతుందని తెలిపారు.