
ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ మోడల్స్.. పాత ఐఫోన్లు అన్నింటి కంటే కూడా కాస్త పెద్దవే. రెండు చేతులను వాడుకపోతే, ఈ ఐఫోన్లలో టైప్ చేయడం చాలా కష్టం. కానీ ఒక్క చేతిని మాత్రమే వాడుతూ టైప్ చేసుకునేలా ఆపిల్ సరికొత్త కీబోర్డును తీసుకొచ్చింది. అయితే ఈ కీబోర్డు కోసం ఆపిల్ తాజాగా లాంచ్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో వన్-హ్యాండ్ కీబోర్డును యాక్టివేట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఇది యాక్సస్ అయిన తర్వాత కీబోర్డును స్క్రీన్‌పై ఎడమ లేదా కుడి వైపుకు మార్చుకోవచ్చని పేర్కొంది.
ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేయాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందేనట. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడం కోసం తొలుత యూజర్లు ఐఓఎస్11 సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో యాక్టివేట్ చేసుకున్న కీబోర్డుతో ఎడమ చేతిలో పట్టుకుని ఫోన్‌ను వాడుతుంటే, ఎడమ వైపు... కుడిచేతిలో పట్టుకుని వాడితే కుడి వైపుకు కీబోర్డును మార్చుకోవచ్చు. మామూలుగా మధ్యలో ఉంచుకుని కూడా కీబోర్డును వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment