శాన్‌ఫ్రాన్సిస్కో: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ రాబోయే సంవత్సారాల్లో ఫోల్డబుల్ డివైస్‌లను లాంచ్ చేయనుంది. ఐఫోన్‌లతో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ టెక్ దిగ్గజం 2020నాటికి మడిచే ఐ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. తాజా మీడియా నివేదికల ప్రకారం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు తయారీకు సంబంధించి సరఫరాదారులతో ఆపిల్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఐఫోన్ తయారీదారు తన ఆసియా భాగస్వాములతో ఒక ఐప్యాడ్ టాబ్లెట్ లాగా ఉపయోగించగలిగే మడవగల ఐఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ డివైస్‌లలో ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ప్యానళ్లను వాడనున్నట్టు, 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకుడు వంశీ మోహన్ పేర్కొన్నారు.
కాగా 2017, నవంబర్‌లోనే అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ కార్యాలయంలో పేటెంట్ దరఖాస్తును కూడా ఫైల్ చేసింది ఆపిల్. మరోవైపు ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు శాంసంగ్, లెనోవో సైతం ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు, ఈ మేరకు ప్రయోగాలు కూడా నిర్వహించినట్టుగా పలు అంచనాలు ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో భారీగా నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment