సాక్షి, న్యూఢిల్లీ : ఐఫోన్ మేకర్ ఆపిల్ మరో కీలక దిశగా అడుగులు వేస్తోంది. తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు చురుకుగా పనిచేస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అద్భుతమైన పెరఫామెన్స్, ఆకట్టుకునే ఫీచర్లు, విలాసవంతమైన స్మార్ట్‌ఫోన్లతో యూజర్లను ఆకర్షించిన ఆపిల్ ఇకపై ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ ద్వారా మరింత ఎట్రాక్ట్ చేసేందుకు రడీ అవుతోంది.
2022 సెప్టెంబరులో ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేయాలని చూస్తోందని తైవాన్ మీడియా సంస్థ మనీ.యూడీఎన్.కామ్ నివేదించింది. ప్రస్తుతం ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ స్క్రీన్ బేరింగ్లను పరీక్షిస్తోంది. ఇందుకోసం నిప్పాన్ నిప్పాన్ మెటీరియల్ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. నిక్కో మెయిన్ సరఫరాదారుగా ఉండనుంది. హాన్ హై ఈస్మార్ట్‌ఫోన్‌నుఅసెంబుల్ చేయనుంది అలాగే ఓఎల్‌ఈడీ లేదా మైక్రోలెడ్ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని అంచనా. డిస్‌ప్లే ప్యానెల్‌ను శాంసంగ్‌నుంచి స్వీకరించనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త డిజైన్‌కోసం పేటెంట్ పొందిన ఆపిల్, రెండు డిస్‌ప్లేల మధ్య మడతపెట్టేందుకు వీలైనంత స్పేస్ ఉండేలా జాగ్రత్తలుతీసుకుంటోంది. ఇప్పటికే లక్ష ఫోన్లను పరిశీలించిందట. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి గతంలో కూడా పలు నివేదికలు వెలువడ్డాయి. ప్రధానంగా తన ప్రత్యేకతను చాటుకునేలా అన్ని అడ్డంకులను తొలగించుకుని ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయాలని భావిస్తోంది. కాగా గత ఏడాది శాంసంగ్ తొలి కమర్షియల్ ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ను ఆవిష్కరించింది. ఇందులోని లోపాలను, సమస్యలను సమీక్షించుకున్న అనంతరం గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment