హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో కంపెనీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ రంగంలో ఫోల్డబుల్ మోడల్ సరికొత్త ఆవిష్కరణగా కొనసాగుతోంది. ఫోల్డబుల్ మోడల్ తేవడం ద్వారా శామ్‌సంగ్, గూగుల్, మోటరోలా, షావొమీ, టెక్నో, వివో, వన్‌ప్లస్, ఒప్పో, హువావే, హానర్ సరసన చేరేందుకు ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
అన్నీ అనుకూలిస్తే ఒకట్రెండేళ్లలో ఐఫోన్ ఫోల్డబుల్ రంగ ప్రవేశం చేయనుంది. వీ68 కోడ్ పేరుతో ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. డిజైన్ విషయంలో కంపెనీ ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవైపు 2025 సంవత్సరానికిగాను తక్కువ మందం కలిగిన ఐఫోన్ అభివృద్ధి చేస్తున్నటు మార్కెట్ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment