ఐఫోన్‌ల కోసం ఓ కీబోర్డ్‌.. అదెలా పనిచేస్తుందంటే? | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ల కోసం ఓ కీబోర్డ్‌.. అదెలా పనిచేస్తుందంటే?

Published Sun, Jan 21 2024 8:17 AM

Iphone Case Comes With A Blackberry Style Keyboard - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లోని టచ్‌స్క్రీన్‌ కీబోర్డు మీద టైప్‌చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్‌ఫోన్‌కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్‌ కంపెనీ క్లిక్స్‌ టెక్నాలజీ రూపొందించింది.

తొలిప్రయత్నంగా ఐఫోన్‌–15 మోడల్‌కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్‌’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్‌రైటర్, డెస్క్‌టాప్, లాప్‌టాప్‌ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో సులువుగా టైప్‌ చేయడానికి వీలవుతుంది.

ఈ ఏడాది లాస్‌ వేగస్‌లో జరగనున్న సీఈఎస్‌–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్‌ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement