స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది.
స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు.
అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది.
ఈ ప్రొటెక్టర్‌లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్‌లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్‌లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment