అదిరిపోయే ఫీచర్లతో.. భారత్‌లో రెడ్‌మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే? | Redmi A3 Smartphone Launched In India; Check Here Price, Specs And More - Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫీచర్లతో.. భారత్‌లో రెడ్‌మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?

Published Wed, Feb 14 2024 8:33 PM | Last Updated on Wed, Feb 14 2024 9:11 PM

Redmi A3 Launched In India - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రెడ్‌మీ సిరీస్‌లో రెడ్‌మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్‌మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్‌ ఆప్షన్లు, మూడు స్టోరేజ్‌ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్‌ ధర రూ.7,299గా ఉంది. రెడ్‌ మీ ప్రీమియం ఫోన్‌లలో కనిపించే హాలో డిజైన్‌ ఈ బడ్జెట్‌ ఫోన్‌లలో కనిపిస్తుంది.  

రెడ్‌మీ ఏ3 ధర 
ఫిబ్రవరి 23 నుండి రిటైల్‌ అవుట్‌లెట్‌లలో లభ్యమయ్యే రెడ్‌మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 7,299 ఉండగా..  4జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మీ ఏ3 స్పెసిఫికేషన్స్  
రెడ్‌మీ ఏ3 1650*720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.  ఆక్టా కోర్ మీడియాటెక్‌ హీలియా జీ36 చిప్‌సెట్‌తో 6జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్‌, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్‌తో పనిచేస్తుంది. 

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, కనెక్టివిటీ పరంగా రెడ్‌మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్‌ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement